అధ్యాపకురాలి దారుణహత్య.. కళ్లలో కారం కొట్టి, కింద పడేసి | Woman Lecturer Stabbed To Death Madanapalle | Sakshi
Sakshi News home page

అధ్యాపకురాలి దారుణహత్య.. కళ్లలో కారం కొట్టి, కింద పడేసి

Aug 4 2023 1:41 PM | Updated on Aug 4 2023 3:22 PM

Woman Lecturer Stabbed To Death Madanapalle - Sakshi

మదనపల్లె: ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురికావడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బండమీదకమ్మపల్లె వైఎస్సార్‌ కాలనీకి చెందిన రుక్సానా (35) ఎంఏ (ఇంగ్లిష్‌), బీఈడీ పూర్తిచేసి ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంగ్లిష్‌ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. తను డిగ్రీ చదువుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతడితో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం పాప పదో తరగతి చదువుతున్నది.

ఈ క్రమంలో ఏపీఎస్పీడీసీఎల్‌లో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎస్‌కే ఖదీర్‌ అహ్మద్‌తో 2017 ఆగస్టులో మరో వివాహం జరిగింది. కొంతకాలం అనంతరం తన తల్లి వెన్నెముక నొప్పి కిత్స నిమిత్తం రుక్సానా కూడా బెంగళూరుకు వెళ్లింది. ఈ క్రమంలో భర్త ఖదీర్‌అహ్మద్‌ పట్టణంలోని అవంతి థియేటర్‌ వద్ద ఉంటున్న ఆయిషాను గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలతో ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఈలోపు రుక్సానాకు మరో ఆడపిల్ల జన్మిం­ంది. పిల్లలు పుట్టని కారణంగా భర్త ఖదీర్‌అహ్మద్‌ తనకు దూరమవు­తాడనే భయంతో ఆయిషా పోలీస్‌స్టేషన్‌లో తనను మోసం చేసి పెళ్లిచేసుకున్నా­డంటూ ఖదీర్‌ అహ్మద్‌తో పాటు రుక్సానాపై టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది.

ఈ నేపథ్యంలో అయిషా తమ్ముళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ రుక్సానా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ ఇద్దరు యువకులు కళాశాల పనివేళలు ముగిశాక స్కటీపై ఇంటికి వెళు­తున్న రుక్సానా కళ్లలో కారం కొట్టి కిందపడేలా చేశారు. మంటతో కళ్లు నులుము­కుంటున్న ఆమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి, ఛాతిపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. డీఎస్పీ కేశప్ప ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఆయిషా తమ్ముళ్లు తమ కుమార్తె రుక్సానాను దారుణంగా చంపేశా­రని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఖదీర్‌అహ్మద్‌ మాట్లాడు­తూ.. ఆయిషా తమ్ముళ్లపై రౌడీషీటర్‌ కేసులు నమోదై ఉన్నాయని, వారు తాము చెప్పినట్లు వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని బెదిరింనట్లు చెప్పాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. తమకు ప్రాణహాని తలపెడతారేమోనని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు జిల్లా ఆస్పత్రికి చేరుకుని రుక్సానా మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement