
భువనేశ్వర్: భార్య తలను నరికి చేతిలో పట్టుకొని 12 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఒక పైశాచిక భర్త. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఢెంకనాల్ జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రశేఖరపూర్ గ్రామానికి చెందిన నక్కొఫొడి మాఝి అక్రమ సంబంధం అనుమానంతో తన భార్య సుచల మాఝిని పైశాచికంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకొని పోలీసులకు లొంగిపోవడానికి కాలి నడకన బయల్దేరాడు.
జొంఖిరా గ్రామం ప్రధాన రహదారిపై నిందితుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడిని విచారించగా తన భార్యకు అక్రమ సంబంధం ఉండడంతో పలుమార్లు హెచ్చరించినట్లు తెలియజేశాడు. కానీ ఆమె పట్టించుకోకపోవడంతో శుక్రవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో కత్తితో పీకకోసి చంపేసినట్లు చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ.. నా భర్తపై చర్యలు తీసుకోండి
Comments
Please login to add a commentAdd a comment