
ప్రతీకాత్మక చిత్రం
మండ్య(బెంగళూరు): అనుమానంతో భార్యను కడతేర్చిన ఉదంతం మండ్య జిల్లా నాగమంగల పట్టణంలో జరిగింది. ఇక్కడి టీబీ లేఔట్‌లోని ముళకట్టె రోడ్డులో నివాసం ఉంటున్న పుట్ట స్వామి, గిరిజ దంపతుల కుమార్తె మధుశ్రీ(25)కి నాగమంగళ తాలూకా కరడహళ్లికి చెందిన గంగాధర్ కుమారుడు మంజునాథ్‌తో వివాహమైంది. వీరికి నాలుగు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు.
మంజునాథ్ బెంగళూరులో ఉంటూ 15 రోజులకు ఒక పర్యాయం వచ్చి వెళ్తుండేవాడు. అయితే మధుశ్రీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. మంగళవారం కూడా దంపతులు గొడవ పడ్డారు. ఓ దశలో భార్య కడుపులో కత్తితో దాడి చేసి కుమారుడితో కలిసి ఉడాయించాడు. బుధవారం ఉదయం ఎంతసేపైనా మధుశ్రీ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా హత్యోదంతం వెలుగు చూసింది. నాగమంగల పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment