హైదరాబాద్: ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రీడాకారులు అత్యున్నత క్రీడా వేదిక ఒలింపిక్ గేమ్స్కు ఎంపికవుతారు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలని ఎన్నో కలలు కనడం సహజమే. ఒలింపిక్స్కు వెళ్లే క్రీడాకారుల ఊహా లోకాన్ని తెలియజేసే పాటే ‘ సోనే కీ మోహర్ చాహే దిల్ కీ జమాన్’.. రియో ఒలింపిక్స్ పోస్టర్‌ను చూసి స్పూర్తితో ఓ ఐటీ ఉద్యోగి పాట రాయగా అదే స్పూర్తితో మరో ఐటీ ఉద్యోగిని పాట పాడింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ హల్‌చల్ చేస్తోంది. మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్‌లోని కాగ్నిజెంట్ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా, కంపెనీ కల్చరల్ మెంబర్‌గా ఉన్న వసంతి ఉక్కెమ్ ఈ పాటను పాడారు.
అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అవిరల్ మాతూర్ ఓ రోజు మార్నింగ్ వాక్ చేస్తుండగా రియో ఒలింపిక్స్ పోస్టర్ కనబడింది. పోస్టర్‌ను చూసి రియో ఒలింపిక్స్ పై పాట రాశారు. ఆ పాటను పాడాలని అదే కంపెనీలో కల్చరల్ సభ్యురాలుగా ఉన్న వసంతిని అడగగా ఆమె ఒప్పుకుంది. క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ పొందిన వసంతి పాట పాడగా అన్ లిమిట్ స్టూడియోలు మ్యూజిక్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఇమాన్యుల్ రాబర్ట్ ఈ పాటకు సంగీతాన్ని సమాకూర్చారు. ఇప్పటికే యూట్యాబ్, ఫేస్ బుక్‌లలో అప్ లోడ్ చేశారు. తమ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుందని వసంతి తెలిపారు.
రియో ఒలింపిక్స్‌పై ఐటీ ఉద్యోగిని సాంగ్
Published Fri, Aug 5 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
Advertisement
Advertisement