బరువు తగ్గే క్రమంలో ఒక్కొక్కరి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ వెయిట్ లాస్ జర్నీలో కేవలం స్లిమ్‌గా కనిపించడం కోసం మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్ష కూడ ఉంటుంది. అలాగఎలాగైనా బరువు తగ్గాలనే లక్ష్యంతో పట్టుదలగా, అంకితభావంతో వారు చేసే కృషి చాలా ప్రేరణగా ఉంటుంది. అలా తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతోపాటు, కుమార్తెకు రోల్ మోడల్‌గా ఉండేందుకు ఒక తల్లి చేసిన ప్రయత్నం, ఆమె సాధించిన విజయం తెలుసుకుంటే మీరు ఫిదా అవుతారు.
ఐటీ ప్రొఫెషనల్, ఐదేళ్ల కుమార్తెకు తల్లి శుభశ్రీ రౌతరాయ్ పట్టుబట్టి 20 కిలోలకు పైగా బరువు తగ్గింది. ఆత్మవిశ్వాసం ,శక్తిని తిరిగి పొందింది. అయితే ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏమంటే.. చాలా అమాయకంగా, మామూలుగా కూతురు అన్న మాట తల్లిలో ఆలోచన రగిలించింది. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ, “అమ్మా, నేను పెద్దయ్యాక నువ్వు నా అక్కలా కనిపించాలి కాబట్టి మనం ఒకరి డ్రెస్‌లు వేసుకోవచ్చు.” అని ఆశగా చెప్పింది ఆమె కూతురు. ఈ మాటే ఆమెకు మేల్కొలుపులా పనిచేసింది. తన రూపాన్ని చూసుకుంది.. ఇంత చిన్న వయసులో ఆరోగ్యం కూడా గాడి తప్పినట్టు అర్థం చేసుకుంది. ఇంట్లో వండిన భోజనం, నడక, ఇంటి వ్యాయామాలుతో తన శరీర బరువును తగ్గించుకుంది.
2023, డిసెంబరులో శుభశ్రీ బరువు 94 కిలోలకు పైమాటే. ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటూ కుమార్తెకు రోల్ మోడల్‌గా, తనను తాను ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని భావించింది. ఇందుకోసం ఆరంభంలో జిమ్‌లో తెగ కసరత్తులు చేసింది. క్రాష్ డైట్ ఫాలో అయింది. అయినా ఫలితం లేదు. ఇక లాభం లేదనుకుని వేరే మార్గాన్ని ఎంచుకోవాలని గత ఏడాది జనవరిలో భావించింది. ఇంట్లో వండిన ఆహారం, క్రమం తపక్పకుండా, నిబద్ధతతో 30 నిమిషాల నడక , మరో 15 నిమిషాల ఇంట్లో వ్యాయామాలను ఎంచుకుంది.
ఆమె పాటించిన కీలకమైన పద్దతులు
గతంలో వచ్చిన అనుభవంతో జిమ్ జోలికిపోలేదు
చిన్న మార్పులపై దృష్టి పెట్టింది.
సమతుల్య, ఇంట్లో వండిన భోజనం, తక్కువ తినడం, తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్
ప్రాసెస్ చేసిన ఆహారాలను మానేసింది.
ప్రోటీన్ ,ఫైబర్ అధికంగా ఉండే భోజనాలకు ప్రాధాన్యత
చక్కటి ఆహారం , చాలినంత నీళ్లు
ఇలా 2024 జూలై నాటికి కొద్దిగా బరువు తగ్గింది. ఆ తరువాత ఆమె జిమ్‌లో బలమైన వ్యాయమాలు చేసింది. దీంతో ఫలితాలు నెమ్మదిగా కనిపించినా, మూడు నెలల్లో అద్భుత విజయం సాధించింది. 94 కిలోల నుండి 71 కిలోలకు చేరింది. తన దుస్తులు XXXL నుండి లార్జ్/మీడియం (బ్రాండ్‌ను బట్టి)కి చేరడం ద్వారా తనకల నిజమైందని అంటుంది భావోద్వేగంతో శుభశ్రీ
“ఇది కేవలం అందంగా కనిపించడం కోసం మాత్రమే కాదు. ఆరోగ్య సమస్యలను నివారించడం, కుటుంబానికి ఆదర్శంగా ఉండటం’’ అంటుంది శుభశ్రీ. ఈ ప్రయణంలో తాను కోల్పోయిన ప్రతి కిలో తనకు మరింత ఉత్సాహాన్నిచ్చింది అని చెబుతుంది. నిరాశ పడ కుండా పట్టుదలగా సాగడమే తన ఆయుధమని చెప్పింది. అంతేకాదు ఎత్తుకు తగిన బరువును సాధించాలనే ఆమె లక్ష్యం. ఈ జర్నీలో బరువు తగ్గడంతోపాటు, కండరాలను ఎముకలను బలోపేతం చేసుకోవడం దృష్టి పెట్టింది. తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా తనలాంటి స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో తన కథను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనలాగా ఆత్మవిశ్వాసంతో లక్ష్యాల వైపు తొలి అడుగు వేయాలని, తమ కలలను సాకారం చేసుకోవాలని సూచిస్తోంది. పెళ్లి, పిల్లలు తరువాత బరువు తగ్గడం కష్టం అని ఎంతమాత్రం అనుకోకండి.. కష్టపడితే సాధ్యమే అంటూ తనలాంటి తల్లులకు సలహా ఇస్తోంది.
ఇదీ చదవండి: ట్రంప్ విందులో నీతా స్పెషల్ లుక్.. ఈ చీరకు 1900 గంటలు పట్టిందట!
Comments
Please login to add a commentAdd a comment