success formula
-
రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?
భారతదేశంలో జరిగే వివాహాల్లో దాదాపు అందరూ.. చాలా వరకు సాంప్రదాయ వస్త్రాలనే ధరిస్తారు. సంప్రదాయ వస్త్రాలు అంటే.. ముందుగా గుర్తొచ్చే బ్రాండ్లలో ఒకటి 'మన్యవర్'. ఈ బ్రాండ్ కేవలం 10వేల రూపాయలతో మొదలైందని.. బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో మన్యవర్ గురించి, దీని అభివృద్ధికి కారణమైన వ్యక్తి గురించి వివరంగా తెలుసుకుందాం.మన్యవర్ బ్రాండ్ నేడు ప్రపంచ స్థాయికి ఎదగటానికి కారణమైన వ్యక్తి 'రవి మోదీ' (Ravi Modi). ఈయన తండ్రికి కోల్‌కతాలో చిన్న బట్టల దుకాణం ఉండేది. చిన్నప్పటి నుంచే రవి.. తన తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడు. సుమారు తొమ్మిది సంవత్సరాలు బట్టల దుకాణంలోని పనిచేస్తూ.. ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకున్నాడు.రూ.10000 అప్పుతోఅప్పట్లోనే రవి మోదీ కోల్‌కతాలోని సెయింట్ జేవియన్స్ కాలేజీలో బీ.కామ్ పూర్తి చేశాడు. అయితే చాలా రోజులుగా తండ్రి దుకాణంలోని పనిచేస్తూ ఉన్నాడు, ఇంతలోనే తండ్రితో చిన్న విభేదాలు రావడంతో.. తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తల్లి దగ్గర నుంచి రూ.10,000 తీసుకుని తన కొడుకు పేరు మీదుగా 'వేదాంత్ ఫ్యాషన్స్' అనే పేరుతో బట్టల వ్యాపారమే ప్రారంభించాడు.రవి మోదీ ప్రారంభించిన వేదాంత్ ఫ్యాషన్ అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో రెడీమేడ్ వస్త్రాలను.. రవి విక్రయించడం ప్రారంభించాడు. ప్రజలు కూడా ఇతడు విక్రయించే దుస్తులను బాగా ఇష్టపడ్డారు. వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ కింద 'మన్యవర్' కూడా చేరింది.భారతదేశంలోని 248 నగరాల్లోమన్యవర్ నేడు భారతీయ వివాహ మార్కెట్లో ప్రసిద్ధ బ్రాండ్. మనదేశంలో పాపులర్ బ్రాండ్‌గా నిలిచిన మన్యవర్ తొలి అంతర్జాతీయ స్టోర్ 2011లో దుబాయ్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సంస్థ భారతదేశంలోని సుమారు 248 నగరాల్లో విస్తరించి ఉంది. దేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో 662 స్టోర్లు ఈ మన్యవర్ కింద ఉన్నాయి.రూ. 32వేల కోట్ల కంటే ఎక్కువరవి మోదీ భార్య 'శిల్పి' కంపెనీ బోర్డులో ఉండగా, ఆయన కుమారుడు 'వేదాంత్' కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కేవలం 10 వేల రూపాయలతో ప్రారంభమైన కంపెనీ విలువ నేడు రూ. 32వేల కోట్ల కంటే ఎక్కువ.ఇదీ చదవండి: సంపదలో సరికొత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా మస్క్మన్యవర్ విజయం.. రవి మోదీని భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో చేర్చింది. ఏప్రిల్ 2023 నాటికి, అతని నికర విలువ 3 బిలియన్లకు (సుమారు రూ. 26,000 కోట్లు) పెరిగింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. రవి మోదీ భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 64వ స్థానాన్ని.. ప్రపంచవ్యాప్తంగా 1,238వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. -
అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..
ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ 'హర్ష్ గోయెంకా' తన ఎక్స్ ఖాతాలో 'ముఖేష్ అంబానీ' నుంచి మూడు విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించారు. అంబానీతో జరిగిన పరస్పర చర్యల ద్వారా నేర్చుకున్న విషయాలు విజయానికి దోహదపడతాయని పేర్కొన్నారు.మూడు విషయాలుపెద్ద కల - ఏదైనా సాధించాలంటే ముందుగా దాని గురించి కలలు కనండి. దాన్ని సహకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ''లక్ష్యంపై దృష్టి పెడితే అన్ని అడ్డంకులను అధిగమిస్తారు, అడ్డంకులను దృష్టిలో ఉంచుకుంటే, మీరు మీ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు'' అని అంబానీ అన్నారు.శ్రమకు ప్రత్యామ్నాయం లేదు - లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. శ్రమకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. మీరు ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలని కోరుకోవాలి. భారతదేశంలో మాత్రమే గొప్పవాళ్లుగా గుర్తించబడితే సరిపోదు.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాళ్ళుగా ఎదగాలి. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది.సానుకూలంగా ఉండటం ముఖ్యం - జీవితంలో విజయం సాధించాలంటే సానుకూలత చాలా ముఖ్యం. విజయాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసంతో పాటు తనపై నమ్మకం కూడా ఉండాలి. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఓర్పుగా ఆలోచించాలి.ఇదీ చదవండి: పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఆసియాలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వ్యాపార ప్రపంచంలో విజయం సాధించడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 14వ స్థానంలో ఉన్న అంబానీ నికర విలువ 105 బిలియన్ డాలర్లు.I have always learnt so much from my interactions with Mukesh Ambani. Let me share three of his life learnings with you’ll. pic.twitter.com/5p2zR1vWMj— Harsh Goenka (@hvgoenka) October 5, 2024 -
చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..
ఈ రోజు ఏ సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా అందరికీ మొదట గుర్తొచ్చే యాప్ 'బుక్ మై షో' (Book My Show). ఇంతకీ ఈ బుక్ మై షో ఎలా ప్రారంభమైంది. ఎవరు స్థాపించారు, దీని నెట్‌వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.ముంబైలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 'ఆశిష్ హేమ్రజని' (Ashish Hemrajani), మరో ఇద్దరు స్నేహితులతో (పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండే) కలిసి బుక్ మై షో స్థాపించారు. ఆశిష్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం జుహులో పూర్తయింది. ఆ తరువాత మితిబాయి కాలేజీలో గ్రాడ్యుయేట్, సిడెన్‌హామ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత జే.వాల్టర్ థాంప్సన్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించారు.ఆశిష్ హేమ్రజని 1999లో హాలిడే ట్రిప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ ఒక రోజు చెట్టుకింద కూర్చుని రేడియోలో ప్రోగ్రామ్ వింటూ ఉన్నారు. ఆ సమయంలో రబ్బీ గేమ్ టికెట్లకు సంబంధించిన ప్రకటన గురించి విన్నారు. ఆ సమయంలో ఓ ఆలోచన వచ్చింది. ఇలాంటి టికెట్ల వ్యాపారాన్ని సినిమా రంగంలో ప్రవేశపెడితే బాగుంటుందని అనుకున్నారు.సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన తరువాత ఆలోచనకు కార్యరూపం దాల్చడానికి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరువాత సిడెన్హామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థులు.. ఆశిష్ స్నేహితులైన పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండేతో కలిసి 'గో ఫర్ టికెటింగ్' ప్రారభించారు. ఇదే తరువాత ఇండియా టికెట్ పేరుతో వచ్చింది. చివరకు బుక్ మై షోగా స్థిరపడింది.ఆశిష్ బుక్ మై షో ప్రారంభించిన సమయంలో స్మార్ట్‌ఫోన్స్, ఆన్లైన్ చెల్లింపులు పెద్దగా అందుబాటులో లేదు. దీంతో చాలా రోజులు ఇందులో ఒడిదుడుకుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక సందర్భంలో బుక్ మై షో మూసి వేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఆశిష్ వెనుకడుగు వేయలేదు. ఒడిదుడుకులు మనల్ని తిరుగులేని వ్యాపారవేత్తను చేస్తాయి అనే మాటలను గట్టిగా నమ్ముకున్న ఆశిష్ ఎప్పుడూ నిరాశ చెందలేదు.ఇదీ చదవండి: భారత్‌లో రూ.10,000 నోటు.. ఎప్పుడు మొదలైందంటే?2006లో నెట్ బ్యాంకింగ్ ప్రారంభమైంది. అంతే కాకుండా దేశంలో మల్టీప్లెక్స్‌ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ఆశిష్ బుక్ మై షో ఎదగడం ప్రారంభించింది. ఆన్లైన్ చెల్లింపులు ఎప్పుడైతే ఎక్కువయ్యాయి.. క్రమంగా సినిమా టికెట్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో కంపెనీ 2011లో 16 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుతం బుక్ మై షో విలువ ఏకంగా రూ. 7500 కోట్లకు చేరింది. -
పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..
ఒక మనిషి ఎదగాలంటే.. కృషి, పట్టుదల అవసరం. పేదరికం నుంచి వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించాలంటే.. ఒక్కరోజులో జరిగే పనికాదు. కానీ శ్రమిస్తే.. ఇది తప్పకుండా సాధ్యమవుతుందనేది మాత్రం అక్షర సత్యం. దీనికి నిలువెత్తు నిదర్శనమే.. 'రిజ్వాన్ సజన్' (Rizwan Sajan). ఇంతకీ ఈయనెవరు? ఈయన ఎలా కోటీశ్వరుడయ్యాడు? లాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూసేద్దాం..డానుబే సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ 'రిజ్వాన్ సజన్' ముంబైలోని ఒక మురికివాడలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను అనుభవించిన రిజ్వాన్.. ఆఖరికి స్కూల్ ఫీజులు కూడా కట్ట లేకపోయాడు. తండ్రి సంపాదనతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో పుస్తకాలను కొని వీధుల్లో తిరిగి అమ్మేవాడు, ఇంటింటికీ పాల ప్యాకెట్లను వేసేవాడు.. రాఖీలు కొనుగోలు చేసి అమ్మడం వంటివి చేసాడు.చిన్నతనం నుంచే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రిజ్వాన్ 16వ ఏట తన తండ్రి మరణించారు. ఆ తరువాత కుటుంబ బాధ్యత భుజాలపై పడింది. చదువు మానేసి కువైట్‌కు వెళ్లి తన మామ బిల్డింగ్ మెటీరియల్స్ షాపులో ట్రైనీ సేల్స్‌మెన్‌గా పని చేయడం ప్రారంభించాడు. మెల్ల మెల్లగా ఎదుగుతున్నాడు అనుకునేలోపల గల్ఫ్ యుద్ధం మరోసారి తన జీవితాన్ని మార్చేసింది. మళ్ళీ ముంబైకి వచ్చేశాడు. జీవితం మళ్ళీ జీరో దగ్గరకు వచ్చేసింది.జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఆశతో మళ్ళీ సొంతంగా బిజినెస్ చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే 1993లో డానుబే గ్రూప్ స్థాపించారు. ఇదే ఆ తరువాత అతిపెద్ద నిర్మాణ సామగ్రి కంపెనీలలో ఒకటిగా విస్తరించింది. 2019నాటికి ఈ డానుబే గ్రూప్ టర్నోవర్ 1.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీఓ చిన్న సంస్థగా ప్రారంభమైన డానుబే గ్రూప్ తన కార్యకలాపాలను ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు విస్తరించింది. డానుబే గ్రూప్ బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం రిజ్వాన్ నికర విలువ రూ. 20,830 కోట్లు అని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం దుబాయ్‌లోని అత్యంత ధనవతులైన భారతీయులలో ఈయన ఒకరుగా నిలిచారు. -
ఫలించిన ఆలోచన.. 150 రోజుల్లో రూ.268 కోట్లు
అనుకున్నది సాధించిన, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చాలామంది పరితపిస్తుంటారు. ఈ లక్ష్యంగా వెళ్లేవారు కొన్ని సవాళ్ళను ఎదుర్కొని, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు 'క్రిప్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్' కో ఫౌండర్ 'రాహుల్ రాయ్'.ఐఐటీలో చేరాలని కలలు కన్న లక్షలాది మందిలో రాహుల్ ఒకరు. ఈ ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేయకుండానే ఈయన 2015లో ఐఐటీ బాంబే నుంచి తప్పకున్నారు. ఆ తరువాత ఎకనామిక్స్ చదవడానికి అమెరికా వెళ్లారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, రాయ్ అమెరికాలోనే మోర్గాన్ స్టాన్లీలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ (FX) మాక్రో హెడ్జ్ ఫండ్స్ బృందంలో విశ్లేషకుడిగా జాబ్ చేయడం మొదలుపెట్టారు. ఒక సంవత్సరం అక్కడ ఉద్యోగం చేసిన తరువాత 2020లో బయటకు వచ్చారు.ఉద్యోగం కాకుండా, తానే ఓ కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో భారతదేశానికి వచ్చారు. 2020 మొదటి లాక్డౌన్ సమయంలో క్రిప్టోకరెన్సీ భారతదేశంలో చర్చనీయాంశం అయింది. అప్పటికే డిజిటల్ అసెస్ట్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై ఆసక్తి కలిగిన రాహుల్.. తన స్నేహితులు ఈష్ అగర్వాల్, సనత్ రావ్‌లతో కలిసి 'క్రిప్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్'ను 2021 జనవరిలో ప్రారంభించారు.రాహుల్ రాయ్ ఆలోచన ఫలించింది. అయితే క్రిప్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్‌ను మే 2021లో బ్లాక్టవర్ క్యాపిటల్‌కు రూ.256 కోట్లకు విక్రయించారు. కొత్తగా ప్రారంభమైన కంపెనీ ఇంత డబ్బు సంపాదించడానికి చాలా సమయం పడుతుందని తెలుసు. ఈ కారణంగానే వారు దాన్ని విక్రయించారు.ఇదీ చదవండి: జీతం ఇవ్వము.. ఉద్యోగంలో చేరండి!.. సీఈఓ పోస్ట్ వైరల్క్రిప్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్‌ను విక్రయించిన తరువాత.. రాహుల్ రాయ్ బ్లాక్టవర్ క్యాపిటల్‌లో మార్కెట్-న్యూట్రల్‌కి కో-హెడ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కంపెనీ బహుళ వ్యూహాత్మక క్రిప్టో హెడ్జ్ ఫండ్, క్రిప్టోఅసెట్లు, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో పెట్టుబడి పెడుతోంది. -
ఉన్న ఉద్యోగం వదిలి.. రూ.8000 కోట్ల కంపెనీ స్థాపించి..
ధైర్యం, దృఢ సంకల్పం ఉంటే.. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎంతోమంది నిరూపించారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'మొబిక్విక్' (Mobikwik) కో ఫౌండర్ 'ఉపాసన టకు'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె మొబిక్విక్ ఎప్పుడు స్థాపించారు? నెట్‌వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఉపాసన టకు.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత 17 సంవత్సరాలు విదేశాలలో పని చేశారు. సొంతంగా ఏదైనా సంస్థ స్థాపించాలనే ఉద్దేశ్యంతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి వచ్చేసారు.కుటుంబ పరిస్థితి, వ్యాపారంలో వచ్చే ఆటుపోట్ల గురించి తెలిసినప్పటికీ.. ధైర్యంగా నిర్ణయం తీసుకుని, ఆమె భర్త బిపిన్ ప్రీత్ సింగ్‌తో కలిసి మొబైల్ పేమెంట్ / డిజిటల్ వాలెట్ సంస్థ 'మొబిక్విక్'ను 2009లో స్థాపించారు. ఇది అతి తక్కువ కాలంలోనే అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇవ్వగలిగింది.మొబిక్విక్ సీఈఓగా ఉపాసన టకు బాధ్యతలు స్వీకరించి కంపెనీని లాభాల బాటలో పయనించేలా చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ సైన్స్ & ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉపాసన సంస్థను ఉన్నత శిఖరాలకు చేరవేయడానికి కావాల్సిన ప్రయత్నాలను చేశారు.మొబిక్విక్ ప్రారంభించడానికి ముందే ఉపాసన.. పేపాల్, హెచ్ఎస్బీసీ సంస్థల్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేశారు. ఈ అనుభవం మొబిక్విక్ ఎదుగుదలకు ఉపయోగపడింది. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి.. సొంతంగా సంస్థను స్థాపించిన ఉపాసన ఎంతోమంది యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచారు.ఇదీ చదవండి: ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యంఏదైనా పనిని ధైర్యంతో చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని ఉపాసన టకు నిరూపించారు. మొబిక్విక్ అనేది చిన్న స్టార్టప్ నుంచి ఫిన్‌టెక్ పవర్‌హౌస్‌గా మారింది. నేడు ఈ సంస్థ రూ. 8000 కోట్ల ఆదాయంతో ముందుకు దూసుకెళ్తోంది. -
ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యం
ఒక వ్యక్తి సక్సెస్ సాధించాడు అంటే.. దాని వెనుక ఓ యుద్ధమే జరిగి ఉంటుంది. అయితే ఈ మాట అందరికి వర్తించకపోవచ్చు. తాతలు, తండ్రుల ఆస్తులతో కుబేరులైనవారు కొంతమంది ఉంటే.. అప్పులు చేసి, కష్టపడి పైకొచ్చినవారు మరికొందరు ఉన్నారు. ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'థైరోకేర్ టెక్నాలజీస్' ఫౌండర్ 'వేలుమణి' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.1959లో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని అప్పనైకెన్‌పట్టి పుదూర్ గ్రామంలో వేలుమణి జన్మించారు. ఆయన తండ్రికి వ్యవసాయ భూమి కూడా లేదు. దీంతో కుటుంబ పోషణకు గేదెల పెంపకాన్ని ఎంచుకుని, వాటిద్వారా వచ్చిన పాలను అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అయితే పిల్లలకు బట్టలు, చెప్పులు వంటివాటిని కొనుగోలు చేయడానికి కూడా వేలుమణి తండ్రి చాలా కష్టపడ్డాడు.ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వేలుమణి చిన్నప్పటి నుంచే దృఢంగా ఉన్నారు. ప్రాధమిక విద్యను అప్పనాయికెన్‌పట్టి పూదూర్‌లో, ఆ తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1955లో థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో డాక్టర్ డిగ్రీ పొందారు. థైరోకేర్ ప్రారంభించడానికి ముందు, ఈయన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో 15 సంవత్సరాలు పనిచేశారు.వేలుమణి న్యూక్లియర్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఎండీగా కూడా పని చేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆంకాలజీ, రేడియాలజీ వంటి వాటిలో ఉపయోగించే టెక్నాలజీలను గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.వేలుమణి 1996లో తన స్వంత థైరాయిడ్ టెస్టింగ్ లాబొరేటరీ, థైరోకేర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఫ్రాంఛైజీ మోడల్‌ను ప్రవేశపెట్టాడు. అనుకున్న విధంగా ముందుకు సాగుతున్న సమయంలో స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్లో ఏకంగా రూ.1400 కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.థైరోకేర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ నేడు రూ.3300 కోట్లుగా ఉంది. నా మొదటి 24 సంవత్సరాల మనుగడ నా తల్లి పొదుపు వల్ల, నా వ్యాపార విజయం నా భార్య పొదుపు వల్ల సాధ్యమైందని ఓ సందర్భంలో వేలుమణి చెప్పుకున్నారు. బాల్యం నుంచే కష్టాలు చూసి.. జీవితంలో స్థిరపడాలని ఉద్దేశ్యంతో కష్టపడి వేలకోట్ల సంపదను సృష్టించారు. వేలుమణి నాయకత్వంలో థైరోకేర్ భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు 1000 కంటే ఎక్కువ అవుట్లెట్లను కలిగి ఉంది.ఇదీ చదవండి: రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ -
Dipa Khosla: ఇన్ఫ్లూయెన్సర్తో మొదలై.. మల్టీపుల్ బ్రాండ్ డీల్స్ స్థాయికి
గ్లోబల్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది దీప ఖోస్లా. వక్తగా ప్రసిద్ధ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ముచ్చటగా మూడోసారి ఆహ్వానం అందుకొని చరిత్ర సృష్టించింది. ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్ప్రెన్యూర్, ఫిలాంత్రపిస్ట్‌గా గుర్తింపు పొందిన దీప ఖోస్లా గెలుపు మంత్రం... ఆత్మవిశ్వాసం. లా స్టూడెంట్ నుంచి కంటెంట్ క్రియేటర్‌గా, ఆ తరువాత ఎంటర్ ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించింది దీప ఖోస్లా. ఇన్స్టాగ్రామ్ కొత్తగా పరిచయం అవుతున్న కాలం అది. ‘ఇన్ఫ్లూయెన్సర్ అంటే?’ అని ప్రశ్న దగ్గరి నుంచి మొదలైన ఆమె ప్రయాణం మల్టీపుల్ బ్రాండ్ డీల్స్‌తో సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేరింది. ఆమ్స్టర్ డామ్‌లోని సోషల్ మీడియా ఏజెన్సీలో ఇంటర్న్‌షిప్ చేసిన ఫన్ట్ ఇండియన్ డిజిటల్ క్రియేటర్‌గా ప్రత్యేకత సాధించింది. ఆ తరువాత ‘ఇండి వైల్డ్’ (స్కిన్ కేర్ అండ్ బ్యూటీ బ్రాండ్) రూపంలో ఎంటర్ప్రెన్యూర్ గా కూడా అద్భుత విజయం సాధించింది. ఆమె ప్రతి విజయంలో తల్లి సంగీత ఖోస్లా ప్రోత్సాహం ఉంది. ఆమె ఇచ్చిన అపారమైన ధైర్యం ఉంది. ‘ఇండి వైల్డ్’ హెయిర్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. తన తల్లి ఫార్ములా ఆధారంగానే ఈ హెయిర్ ఆయిల్‌ను తయారు చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించడానికి కావాల్సింది? ఆత్మవిశ్వాసం. మరి ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? అనే ప్రశ్నకు దీప చెప్పే జవాబు ఇది.. ‘ధైర్యంగా ప్రశ్నలు అడగడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. వ్యాపారరంగంలోకి అడుగు పెట్టినప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు. అయితే ‘ఓటమి’ అనే భయం నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగేలా, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునేలా చేసింది’ భర్తతో కలిసి ‘పోస్ట్ ఫర్ చేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది దీప. ‘దిల్లీలో పుట్టి పెరిగాను. ఊటీ స్కూల్, యూరప్ యూనివర్శిటీలలో చదువుకున్నాను. ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్ యూనివర్శిటీ సమావేశంలో ప్రసంగించడం నా అదృష్టంగా భావిస్తాను. నేను సాధించిన విజయాలే నన్ను అక్కడివరకు తీసుకువెళ్లాయి. విజయం అంటే కొందరికే పరిమితమైనది కాదు. నాలాగే ఎవరైనా విజయం సాధించవచ్చు’ అంటుంది దీప ఖోస్లా. దీప నిరంతరం స్మరించే మంత్రం... ఆత్మవిశ్వాసం మొటిమలతో ఇబ్బంది పడుతూ నలుగురి లో కలవడానికి ఇష్టపడని స్థితి నుంచి బయటకు తీసుకువచ్చి‘స్టార్ ఇన్ఫ్లుయెన్సర్’ను చేసింది ఆ ఆత్మవిశ్వాసమే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వాక్ చేసిన తొలి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చింది, నలుగురిలో మాట్లాడడానికి భయపడే స్థితి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామన్’లో ప్రసంగించే స్థాయికి తీసుకువెళ్లింది ఆ ఆత్మవిశ్వాసమే. తాజాగా... హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సమావేశంలో దీప ఖోస్లాపై రూపొందించిన స్ఫూర్తిదాయకమైన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. 2022లో ‘డైవర్శిటీ ఇన్ ది బ్యూటీ ఇండస్ట్రీ’ అంశంపై మాట్లాడడానికి హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి దీపకు ఆహ్వానం అందించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సమావేశంలో ప్రసంగించిన ఫస్ట్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా చరిత్ర సృష్టించింది దీప ఖోస్లా. పర్సనల్ ఐకాన్.. దీప ఖోస్లాకు తల్లి సంగీత ఖోస్లా పర్సనల్ ఐకాన్. కొండంత అండ. ‘నా వెనుక మా అమ్మ ఉంది’ అనే ధైర్యం దీపను ముందుకు నడిపించింది. తల్లి సంగీత ఖోస్లా ఫార్ములా ఆధారంగానే తమ బ్యూటీ బ్రాండ్‌కు సంబంధించిన ‘హెయిర్ ఆయిల్’ను తయారు చేశారు. సహజ పద్ధతుల్లో ఆరోగ్యంగా ఉండడం, అందంగా కనిపించడం అనేది సంగీత ఖోస్లా ఫిలాససీ. అమ్మ బ్యూటీ ఫిలాసఫీని అనుసరిస్తూ సహజమైన పద్ధతులలో అందంగా కనిపించే టెక్నిక్స్‌ను ఫాలో అవుతుంటుంది దీప ఖోస్లా. ఇవి చదవండి: Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్ -
Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి. ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్‌బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్‌బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్‌బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి.. కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ప్రోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలిప్రొఫెషనల్ ఫిమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్‌బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మా ప్రాంతం నుంచి ఫుట్‌బాల్‌లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్‌లో ఆడాను. గోల్ కీపర్‌గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మా ్రపాంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు.. నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్‌బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్‌ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. ఇవి చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి! -
రూ.8300 కోట్ల సామ్రాజ్యంగా మారిన ఒక్క ఆలోచన..
ఉన్నత చదువులు చదువుకున్న చాలా మంది ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా.. కొత్త మార్గాలను అన్వేషిస్తూ, వ్యాపార రంగంలోకి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు సునీర, ఆమె సోదరుడు సాల్ రెహ్మెతుల్ల. ఇంతకీ వీరు ఎవరు, వీరు చేస్తున్న వ్యాపారం ఏంటి, సంస్థ విలువ ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఫ్లోరిడాలో నివసిస్తున్న 'సునీర' జన్మస్థలం పాకిస్తాన్. కరాచీలో పుట్టిన ఈమె ఫ్లోరిడా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఫస్ట్ డేటాతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించి తమ్ముడు రెహ్మెతుల్లతో కలిసి 2014లో స్టాక్స్ (Stax) ప్రారంభించింది. స్టాక్స్ అనేది ఇతర ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే విక్రయాల శాతం మాదిరిగా కాకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన చార్జెస్ వసూలు చేసే ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి కోసం ఈమె సుమారు 12 బ్యాంకులను సంప్రదించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. సునీర తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది, వారు ఆమె ఆలోచనపై పని చేయమని ప్రోత్సహించారు. నెలవారీ చందా ప్రాతిపదికన వసూలు చేసే ప్లాట్‌ఫారమ్‌లో వారు కూడా పని చేయడం ప్రారంభించారు. ఆ తరువాత ఆమె ఓర్లాండోకు వెళ్లి తన ఆలోచనను మరింత విస్తరించింది. సునీర, రెహ్మెతుల్ల చేస్తున్న ఈ తరహా బిజినెస్ అభివృద్ధి చెందుతున్న సమయంలో వారి స్టాక్‌ను కొనుగోలు చేయడానికి రూ. 145 కోట్ల డీల్ ఆఫర్ వచ్చింది. దీనిని వారు సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత తోబుట్టువులిద్దరూ తమ ఉద్యోగాలను వదిలిపెట్టి స్టాక్‌లోనే పూర్తిగా పనిచేయడం ప్రారంభించారు. దీంతో వారికి ఆర్ధిక సమస్యలు ఎదురయ్యాయి. ఇదీ చదవండి: సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఇలా అప్డేట్ చేసుకోండి ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వారిరువురు.. కుటుంబం, స్నేహితుల నుంచి 50000 డాలర్లు అప్పుగా తీసుకుని, ఆ డబ్బుని కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఈ సంస్థలో ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, కంపెనీ విలువ.. ఫోర్బ్స్ ప్రకారం రూ.8,308 కోట్లని తెలుస్తోంది. -
ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!
ఒకప్పటి నుంచి మనకు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా.. గూగుల్ మీద ఆధారపడేవాళ్లం. అయితే ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ఈ సమయంలో చాలామంది ప్రతి ప్రశ్నకు 'చాట్‌జీపీటీ' ద్వారా సమాధానం తెలుసుకుంటున్నారు. ఈ కథనంలో 'చాట్‌జీపీటీ' ద్వారా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేవారికి చాట్‌జీపీటీ ఎలా ఉపయోగపడుతుందంటే.. ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం సిద్ధం కావడానికి చాట్‌జీపీటీ చాలా ఉపయోగపడుతుంది. సాధారణ ఇంటర్వ్యూ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం దగ్గర నుంచి మీ విశ్వాసాన్ని పెంచుకోవడం వరకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. 👉 ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేటప్పుడు మీ బలం ఏమిటి? బలహీనత ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చాట్‌జీపీటీ సహాయపడుతుంది. చాట్‌జీపీటీతో మీరు పరస్పరం చర్చించుకుంటూ పోతే నైపుణ్యాలను తప్పకుండా మెరుగుపరుచుకోవచ్చు. 👉 మీరు ఏ కంపెనీ ఇంటర్వ్యూ కోసం సిద్దమవుతున్నారో.. ఆ సంస్థకు సంబంధించిన చాలా విషయాలను కూడా చాట్‌జీపీటీ తెలియజేస్తుంది. కంపెనీ కల్చర్ ఏమిటి? కంపెనీ గోల్స్ గురించి కూడా వివరిస్తుంది. దీని ప్రకారం ఇంటర్వ్యూ చేసేవారి అంచనాలకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వొచ్చు. 👉 ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో ఏలాంటి డ్రెస్ (వస్త్రధారణ) వేసుకోవాలనేది కూడా చాట్‌జీపీటీ చెబుతుంది. ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో డ్రెస్ కోడ్ చాలా ముఖ్యమైన అంశం. 👉 ఇంటర్వ్యూకి సిద్ధమయ్యేవారికి కావలసిన మరో ముఖ్యమైన అంశం 'బాడీ లాంగ్వేజ్'. బాడీ లాంగ్వేజ్ ఇంప్రూ చేసుకోవడంలో కూడా చాట్‌జీపీటీ ఉపయోగపడుతుంది. సరైన బాడీ లాంగ్వేజ్ మెయింటేన్ చేసేవారు ఎదుటివారికి హుందాగా కనిపిస్తారు. 👉 ఇంటర్వ్యూలో ఎప్పుడూ మీ గురించి లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతారని భావించకూడదు. ఎందుకంటే మీ ఆలోచనకు పదునుపెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాట్‌జీపీటీ సాయంతో అలాంటి ప్రశ్నలకు సిద్దమవ్వొచ్చు. 👉 ఆత్మ విశ్వాసం ఆయుధంగా మారితే.. ఏదైనా సాధించవచ్చనే ధైర్యం వస్తుంది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి సిద్ధమయ్యే సమయంలో లేదా ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే మాత్రమే సరిపోదు. 'సెల్ఫ్ కాన్ఫిడెన్స్' (ఆత్మ విశ్వాసం) కూడా చాలా అవసరం. కేవలం ప్రశ్నలకు, బాడీ లాంగ్వేజ్ వంటి వాటికి మాత్రమే కాకుండా.. మీ మీద మీకు విశ్వాసం పెరగటానికి కూడా చాట్‌జీపీటీ ఒక ఆయుధంగా పనికొస్తుంది. మొత్తం మీద వినియోగించుకునే విధానాన్ని బట్టి చాట్‌జీపీటీ మీకు ఆత్మబంధువులా పనికొస్తుంది. ఇదీ చదవండి: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే? చాట్‌జీపీటీ.. చాట్‌జీపీటీ అనేది GPT (జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) ఆర్కిటెక్చర్ ఆధారంగా OpenAI చేత అభివృద్ధి చేసిన పెద్ద లాంగ్వేజ్ మోడల్. మనిషి భాషను అర్థం చేసుకోవడానికి అల్గారిథమ్‌లను ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ప్రశ్నలకు సమాధానమివ్వడం, టాస్క్‌లను పూర్తి చేయడం వంటి విషయాలను అవలీలగా పూర్తి చేస్తుంది. వెబ్సైట్, యాప్స్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా వివిధ ఇంటర్‌ఫేస్‌ల ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారుడు అడిగే ప్రశ్నలకు దాని శిక్షణ, భాషపై అవగాహన ఆధారంగా రెస్పాండ్ అవుతుంది. -
రూ.5 వేలతో మొదలైన రూ.14000 కోట్ల కంపెనీ.. సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
M P Ramachandran Success Story: సక్సెస్.. ఈ పదం వినటానికి లేదా చూడటానికి చాలా చిన్నదిగానే ఉండొచ్చు. కానీ సాధించాలంటే అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది, ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే సంకల్పం ఉంటే తప్పకుండా విజయం సొంతమవుతుందని ఇప్పటికే చాలా మంది నిరూపించారు, ఈ కోవకు చెందిన వారిలో ఒకరు జ్యోతి ల్యాబ్స్ ఫౌండర్ 'మూతేడత్ పంజన్ రామచంద్రన్' (M. P. Ramachandran). ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1983లో కేరళ త్రిస్సూర్‌లో జన్మించిన రామచంద్రన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైలో అకౌంటెంట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసిన తరువాత ఆ కంపెనీ మూసివేశారు. దీంతో ఏమి చేయాలో తోచక ఇంటికి వచేసాడు. లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ ఉజాలా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనతో ఉండే రామచంద్రన్.. అప్పట్లో తెలుపు రంగు దుస్తులకు సరైన లిక్విడ్ అందుబాటులో ఉండేది కాదు, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ 'ఉజాలా'ను తయారు చేసాడు. రామచంద్రన్ ఈ లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, సోదరుడి నుంచి రూ. 5000 తీసుకుని తమకున్న కొంత భూమిలోనే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసాడు. దీనికి తన కూతురు జ్యోతి పేరు పెట్టాడు. ప్రారంభంలో అనుకున్న రీతిలో ఉజాలా అమ్మకాలు ముందుకు సాగలేదు, కానీ పట్టు వదలకుండా కొంతమంది సేల్స్ గర్ల్స్‌ని నియమించి ఆ ఏడాది రూ. 40000 ఆదాయం పొందాడు. ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'కిమ్ శర్మ' కొత్త లగ్జరీ కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు! ఇతర ఉత్పత్తులు & వార్షిక ఆదాయం క్రమంగా తమ ప్రొడక్ట్ మీద నమ్మకం భారీగా పెరిగింది. దీంతో జ్యోతి లేబొరేటరీస్ మరిన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎక్సో, ప్రిల్, మిస్టర్ వైట్, మార్గో, మాక్సో వంటి అనేక ఉత్పతులు పుట్టుకొచ్చాయి. దెబ్బకు విదేశీ కంపెనీలు సైతం మూసుకోవాల్సి వచ్చింది. ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు, ప్రత్యర్థులు జిత్తులను ఎదుర్కొని కంపెనీని దినదినాభివృద్ధి చెందించడంలో రామచంద్రన్ కృషి చేసాడు. కేవలం రూ. 5000తో ప్రారంభమైన జ్యోతి ల్యాబ్స్ వార్షికాదాయం నేడు ఏకంగా రూ. 14,000 కోట్లకు చేరినట్లు సమాచారం. -
నేచురల్ పద్దతిలో కోట్లు సంపాదిస్తున్న మహిళ - 50 ఏళ్ల వయసులో..
Kamaljit Kaur Success Story: జీవితంలో ఎదగాలంటే తెలివి మాత్రమే కాదు చేయాలనే సంకల్పం, చేయగలననే పట్టుదల ఉంటే నిన్ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు.. విజయ శిఖరాలను అధిరోహించి సక్సెస్ సాధించిన మహానుభావులు చెప్పే మాటలివి. విజయం సాధించాలంటే మాటల్లో అనుకున్నంత సులభమైతే కాదు, కానీ ప్రయత్నిస్తే అసాధ్యం కాదు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఐదు పదులు దాటిన 'కమల్జిత్ కౌర్' (Kamaljit Kaur) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె జీవితంలో సాధించిన సక్సెస్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో పంజాబ్ లుథియానాలోని చిన్న గ్రామంలో పుట్టిన కమల్జిత్ చిన్నప్పటి నుంచి స్వచ్ఛమైన పాలు, నెయ్యి, వెన్న తింటూ పెరిగింది. ఎలాంటి కల్తీ లేని పదార్థాలను తీసుకోవడం వల్ల ఈమెకు చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని గతంలో వెల్లడిందింది. కిమ్ముస్ కిచెన్ బాల్యంలో తాను ఆస్వాదించిన స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఎలాంటి రసాయనాలు కలపకుండా సహజంగా అందించాలనే సంకల్పంతో 50 సంవత్సరాల వయసులో కమల్జిత్ కౌర్ కిమ్ముస్ కిచెన్ పేరుతో నెయ్యి విక్రయించడానికి సంకల్పించింది. అనుకున్న విధంగానే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే ఈమె నెయ్యి వాసనలు భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా పాకాయి. దెబ్బతో కిమ్ముస్ కిచెన్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగింది. (ఇదీ చదవండి: ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి!) ఎలాంటి కల్తీ లేకుండా నెయ్యిని తయారు చేయడానికి ఈమె బిలోనా అని పిలువబడే ఒక పద్ధతిని ఉపయోగించింది. ఈ పద్ధతిలో మొదట ఆవు పాలను మరిగించి చల్లబరుస్తుంది, తర్వాత ఒక టీస్పూన్ పెరుగు కలిపి, మరుసటి రోజు అందులో నుంచి వెన్నను తీసి నెయ్యిని తయారు చేస్తుంది. (ఇదీ చదవండి: ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?) సంపాదన క్రమంగా కమల్జీత్ కౌర్ నెయ్యికి బాగా డిమాండ్ బాగా పెరిగింది. ప్రపంచ దేశాల్లోని చాలా మంది ప్రజలు ఇప్పుడు ఇతర దేశాల నుండి కూడా ఆర్డర్ చేస్తున్నారు. రిటైల్ నెయ్యి సీసాలు 220 ml, 500 ml, 1 లీటర్ పరిమాణాల్లో లభిస్తాయి. పరిమాణాన్ని బట్టి ధరలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం కిమ్ముస్ కిచెన్ సంపాదన నెలకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ. వీరి సంపాదనలో 1 శాతం గురుద్వార్‌కు, ఆకలితో ఉన్న వారికి అందిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!
Vijay Sankeshwar Success Story: జీవితంలో విజయం సాధించాలంటే గొప్ప గొప్ప చదువులు చదివితే సరిపోదు.. ఉన్నతమైన ఆలోచనలు ఉన్నప్పుడే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు. కేవలం ఒక ట్రక్కుతో ప్రారంభమైన అతని ప్రయాణం ఈ రోజు కోట్లు గడించే స్థాయికి చేరింది. ఇంతకీ ఈ సక్సెస్ ఎవరు సాధించారు? ఎలా సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకలోనో ధార్వాడకు చెందిన 'విజయ్ సంకేశ్వర్' గురించి ఈ రోజు భారతదేశం మొత్తానికి తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో అతిపెద్ద వాణిజ్య వాహనాలకు యజమానిగా పేరు పొంది VRL లాజిస్టిక్స్ లిమిటెడ్ స్థాపించాడు. 1970లలో కేవలం ఒకే ట్రక్కుతో సొంత లాజిస్టిక్ కంపెనీ ప్రారంభించాలనుకున్నాడు. కానీ వారి కుటుంబం ప్రింటింగ్ ప్రెస్ వ్యాపార నేపద్యానికి చెందినది. (ఫాక్స్‌కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి? ) తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ప్రింటింగ్ ప్రెస్ కాదనుకున్న విజయ్ లాజిస్టిక్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. 1976లో అప్పుగా తీసుకున్న కొంత డబ్బుతో ఒక ట్రక్కు కొనుగోలు చేసాడు. ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించాడు. ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాడు. కానీ పట్టు వదలకుండా విజయం సాధించాలనే తపనతో ముందడుగు వేయడం మాత్రం ఆపలేదు. (ఇదీ చదవండి: రోజుకి 150 దాటుతున్న జిమ్నీ బుకింగ్స్ - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొని 1994లో VRL పేరుతో కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇందులో 150కి పైగా ట్రక్కులు ఉన్నాయి. ఆ తరువాత 1996లో విజయానంద్ ట్రావెల్స్తో బస్సులను కూడా ప్రవేశపెట్టి సంస్థను మరింత విస్తరించాడు. ఇప్పుడు ఈ సంస్థ VRL లాజిస్టిక్స్ లిమిటెడ్‌గా ప్రసిద్ధి చెందింది. (ఇదీ చదవండి: కొత్త కారులో షికారు కొడుతున్న రాఖీభాయ్ యష్ - ధర ఎంతో తెలుసా?) విజయ్ సంకేశ్వర్ కొడుకు ఆనంద్ సంకేశ్వర్తో కలిసి వింగ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, ఎయిర్ చార్టర్ సర్వీస్ వంటి వాటికి కూడా నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ రూ. 6000 కోట్లకంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కలిగిన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ఈయన జీవితాన్ని విజయానంద్ అనే పేరుతో 2022లో కన్నడ చిత్రం కూడా తెరకెక్కింది. -
ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!
Vineeta Singh Success Story: భారతదేశంలో ప్రస్తుతం గొప్ప వ్యాపారవేత్తలుగా పేరుపొందిన వారిలో చాలా మంది ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో 'వినీత సింగ్' (Vineeta Singh) ఒకరు. ఐఐఎమ్, ఐఐటి వంటివి పూర్తి చేసిన ఈమె మంచి ప్యాకేజి వదిలి సొంతంగా బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ చేస్తోంది. ఇంతకీ ఈమె చేసే బిజినెస్ ఏది? నెట్ వర్త్ ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరైన వినీత సింగ్ కోటి రూపాయల జాబ్ ఆఫర్ వదిలిపెట్టి 'షుగర్ కాస్మెటిక్' (Sugar Cosmetics) బిజినెస్ ప్రారంభించింది. వినీత 1987 నుంచి 2001 వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ & ఆర్.కే పురం పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పొందింది. 2004లో మూడు నెలలు పాటు కోల్‌కతాలోని ITC లిమిటెడ్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. 2005లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. లండన్, న్యూయార్క్‌లోని డ్యుయిష్ బ్యాంక్‌లో మూడు నెలల ఇంటర్న్‌షిప్ చేసిన తరువాత స్ట్రాటజిక్ ఈక్విటీ ట్రాన్సాక్షన్స్ యూనిట్, ఎమర్జింగ్ మార్కెట్స్ స్ట్రక్చర్స్ విభాగం ప్రాజెక్ట్‌లపై పనిచేసింది. (ఇదీ చదవండి: ఈ మారుతి కార్లను ఇప్పుడే కోనేయండి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో!) చిన్నప్పుడు ముంబైలో ఒక చిన్న ఇంట్లో నివాసమున్నప్పుడు వర్షాకాలంలో తరచూ వరదలను ఎదుర్కొని ఇబ్బందులు పడినట్లు నివేదికల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు పొవాయ్‌లోని ఓ విలాసవంతమైన ఇంట్లో నివసిస్తోంది. చదువు పూర్తయిన తరువాత మంచి జాబ్ వచ్చినప్పటికీ వదులుకుని షుగర్ కాస్మటిక్స్ అనే సంస్థ స్థాపించింది. ఈమె నికర ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 300 కోట్లకంటే ఎక్కువ అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) షుగర్ కాస్మెటిక్ కంటే ముందు వినీత సింగ్ మరో రెండు వెంచర్లు ప్రారంభించి సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తరువాత దీనిని 2015లో ప్రారంభించి గొప్ప పురోగతిని పొందింది. అప్పట్లో మార్కెట్లో చెప్పుకోదగ్గ సౌందర్య సాధనాల లేకపోవడం ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఈమె రియాలిటీ షో షార్క్ ట్యాంక్ ఇండియాలో జడ్జ్‌గా కూడా పనిచేసింది. చదువుకునే రోజుల్లో ప్రేమించిన కౌశిక్ ముఖర్జీని 2011లో వివాహం చేసుకుంది. ఈయన షుగర్ కాస్మెటిక్స్ సంస్థ కో-ఫౌండర్. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. -
రూ. 1000 కోట్ల సామ్రాజ్యం సృష్టించిన పేదవాడి సక్సెస్ స్టోరీ..!!
ఇది వరకు మనం చాలా సక్సెస్ స్టోరీలను గురించి తెలుసుకున్నాము. ఇందులో కొంత మంది డబ్బున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ కొట్టిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పేదరికం నుంచి వచ్చి రూ. 1000 కోట్లు సామ్రాజ్యం సృష్టించిన 'విజయ్ సుబ్రమణియమ్' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు 'రాయల్ ఓక్' (Royal Oak) ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు, కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకామ్ చేశారు. కుటుంబాన్ని పోషిచే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు. బీకామ్ పూర్తయిన తరువాత సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని వారి బంధులలోనే ఒకరు తనని మోసం చేసారని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ తరువాత కేరళలోని మున్నార్‌కు వెళ్లి అక్కడ క్రెడిట్ కార్డు ఏజెంట్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత 1997లో చెన్నై వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 10 రోజులలో రూ.2800 విలువైన వస్తువులను విక్రయించగలిగాడు. (ఇదీ చదవండి: బిర్యాని అమ్ముతూ రూ. 10 కోట్లు టర్నోవర్.. బెంగళూరు యువతి సక్సెస్ స్టోరీ!) విజయ్ సుబ్రమణియమ్ 2001లో బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్ ప్రారంభించడం ఆయన జీవితానికి పెద్ద మలుపుగా మారింది. ఆ తరువాత బిగ్ బజార్ తమ అవుట్‌లెట్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేయమని కోరింది. ఆ తరువాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. (ఇదీ చదవండి: రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!) విజయ్ సుబ్రమణియమ్ 2004లో మొదటి షాప్ ఓపెన్ చేసాడు. 2005 నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. 2010 నాటికి మరొక షాప్ ఏర్పాటు చేసాడు. ఇదే రాయల్ ఓక్ ప్రారంభానికి నాంది పలికింది. ప్రస్తుతం ఈ సంస్థ కింద 150 స్టోర్లు ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 280 కర్మాగారాల నుంచి తాను ఉత్పత్తులను పొందుతున్నట్లు తెలిపాడు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో మరో 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎదగాలనే సంకల్పం ఉన్న వాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇదో చక్కని నిదర్శనం. -
అనుకున్నదాని కోసం ఐఏఎస్ వదిలేసాడు - ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!
Balagopal Chandrasekhar Success Story: జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఐఏఎస్ ఉద్యోగాలు కొట్టిన వ్యక్తుల గురించి మనం గతంలో తెలుసుకున్నాం.. అయితే తనకు నచ్చిన పని చేయడానికి ఐఏఎస్ ఉద్యోగాన్ని సైతం వదిలేసిన వ్యక్తి 'బాలగోపాల్ చంద్రశేఖర్' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. 1952 అక్టోబర్ 02న కేరళలోని కొల్లంలో జన్మించిన బాలగోపాల్ చెన్నైలోని లయోలా కాలేజీలో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి, కేరళ యూనివర్సిటీలో PhD చదువుతున్న రోజుల్లో తల్లిదండ్రుల కోరిక మేరకు ఐఏఎస్ రాయాలనుకున్నాడు. 1976లో యుపిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 1977 జులైలో ఐఎఎస్‌లో చేరాడు. అయితే ఆరు సంవత్సరాలకే ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి తన సోదరుడు సి పద్మకుమార్‌తో కలిసి పెన్పోల్ బయోమెడికల్ పరికరాల తయారీ కంపెనీ ప్రారంభించాడు. భారతదేశపు అతిపెద్ద బ్లడ్ బ్యాగ్.. ఈ పెన్పోల్ సంస్థ 1987లో కోటి రూపాయలతో బ్లడ్ బ్యాగ్‌ల తయారీని ప్రారంభించింది. భారతదేశంలో బ్లడ్ బ్యాగ్ తయారీలో అగ్రగామిగా ఉన్న చంద్రశేఖర్ 1999లో గ్లోబల్ లీడర్, జపనీస్ కంపెనీ టెరుమోతో జాయింట్ వెంచర్లోకి ప్రవేశించడం ద్వారా తన వెంచర్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఆ తరువాత ఇది భారతదేశపు అతిపెద్ద బ్లడ్ బ్యాగ్ మేకర్ టెరుమో పెన్పోల్గా ఆవిర్భవించింది. చంద్రశేఖర్ 2012లో కంపెనీలోని తన వాటాను జపాన్ భాగస్వామికి విక్రయించారు, 26 సంవత్సరాల సుదీర్ఘమైన, విజయవంతమైన వ్యవస్థాపక వృత్తికి విరామం ప్రకటించి 2021 నుంచి ఫెడరల్ బ్యాంక్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ బోర్డు ఛైర్మన్ పదవులలో ఉన్నారు. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) ఎందరో పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచిన బాలగోపాల్ చంద్రశేఖర్ ఐఏఎస్ ఔత్సాహికులకు కూడా స్ఫూర్తిగా నిలిచాడు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్‌గా తన తల్లిదండ్రుల కలల ఉద్యోగాన్ని సాధించి, తరువాత వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఐఏఎస్ వదులుకున్నాడు. నిజంగా బాలగోపాల్ యువతకు ఎంతో ఆదర్శం.. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ
Vedant Lamba Success Story: మనిషి సక్సెస్ సాధించాలంటే చేసే పని మీద శ్రద్ద, ఎదగాలనే సంకల్పం రెండూ ఉండాలి. సక్సెస్ సాధించడమంటే ఒక రోజులో జరిగే పని కాదు. నీ శ్రమ నిన్ను సక్సెస్ వైపుకు తీసుకెళుతుంది. పాత బూట్లను అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వేదాంత్ లంబా ఈ రోజు ఎంతో మందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ ఇతడి సక్సెస్ సీక్రెట్ ఏంటి? కోట్లు ఎలా సంపాదించాడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే మెయిన్‌స్ట్రీట్ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన 'వేదాంత్ లంబా' తరువాత కాలంలో ఛానెల్‌ని మెయిన్‌స్ట్రీట్ మార్కెట్‌ప్లేస్ అనే పూర్తి స్టార్టప్‌గా అభివృద్ధి చేసాడు. కేవలం రూ. 20వేలతో ప్రారంభమైన అతని వ్యాపారం ఈ రోజు కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తోంది. వేదాంత్ 17 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు పాత బూట్లను విక్రయిస్తూ నెలకు రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. లంబా స్కూల్లో ఉన్నప్పుడు స్నీకర్ల గురించి పెద్దగా తెలియదు. అయితే తన 16వ ఏట యూట్యూబ్ ఛానెల్ ద్వారా అవగాహన తెచ్చుకున్నాడు. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) రూ. 100 కోట్లు లక్ష్యం సంస్థ ప్రారంభించిన మొదటి సంవత్సరమే ఏకంగా రూ. 7 కోట్ల రూపాయలు సంపాదించాడు. స్నీకర్స్ ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయని.. రానున్న రోజుల్లో కంపెనీ మరింత లాభాలను పొందుతుందని చెబుతున్నాడు. త్వరలో సంస్థ 100 కోట్ల టర్నోవర్ సాధిస్తుందని వేదాంత్ లంబా అంటున్నాడు. (ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!) ప్రస్తుతం చిన్నవారికి ఎయిర్ జోర్డాన్ 1, యువతరం నైక్, లూయిస్ విట్టన్ ఎయిర్ ఫోర్స్ 1 వంటివి ఎక్కువగా ఇష్టపడతారని లంబా చెబుతున్నాడు. ఇతని కంపెనీ స్టోర్ న్యూ ఢిల్లీలో 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్నీకర్ రీసేల్ స్టోర్ కావడం గమనార్హం. హైస్కూల్ విద్యకే మంగళం పాడేసి బిజినెస్ స్టార్ట్ చేసిన లంబా కాలేజీ మెట్లు కూడా తొక్కలేదు. అయినప్పటికీ ఇప్పుడు వ్యాపారంలో కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి ఉపాధి కూడా ఇస్తున్నాడు. -
వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ
Mallika Srinivasan Success Story: ప్రపంచం అభివృద్ధి పైపు పరుగులు పెడుతున్న సమయంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ మేము సైతం అంటున్నారు. పని ఏదైనా మనసు పెట్టి చేస్తే తప్పక విజయం సాధిస్తావన్నది లోకోక్తి. అలాంటి కోవకు చెందిన 'ట్రాక్టర్ క్వీన్' గా పిలువబడే 'మల్లిక శ్రీనివాసన్' (Mallika Srinivasa) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న కొంత మంది మహిళల్లో మల్లిక శ్రీనివాసన్ ఒకరు. 1959 నవంబర్ 19న జన్మించిన మల్లికకు చిన్నప్పటి నుంచి బిజినెస్ స్టడీస్‌పై ఉన్న ఆసక్తి కారణంగా మద్రాస్ యూనివర్సిటీలో ఎమ్ఏ పూర్తి చేసి, ఆ తరువాత ఉన్నత చదువులు కోసం విదేశాలకు పయనమైంది. వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. చదువు పూర్తయిన తరువాత 1986లో, చెన్నైని 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా'గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ అనంతరామకృష్ణన్ స్థాపించిన కుటుంబ వ్యాపారంలో మల్లిక జనరల్ మేనేజర్‌గా చేరింది. రోజు రోజుకి TAFE కంపెనీని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి మల్లిక చాలా కృషి చేసింది. అతి తక్కువ కాలంలోనే కంపెనీ మంచి లాభాలను ఆర్జించగలిగింది. TAFE (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్) కంపెనీ ఆదాయం & అమ్మకాల పరిమాణంలో మహీంద్రా ట్రాక్టర్ల తర్వాత భారతదేశపు రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీ. మల్లిక నాయకత్వంలో, టాఫె సంస్థ 2022లో ఫ్రెంచ్ సంస్థ ఫౌరేసియా (Faurecia) ఇండియా వ్యాపారాన్ని రూ. 400 కోట్ల డీల్‌తో, 2018లో IMT వంటి కంపెనీలను కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) మల్లికా శ్రీనివాసన్ గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) చెన్నై, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) హైదరాబాద్, AGCO, టాటా స్టీల్ అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ వంటి పెద్ద సంస్థలలో ఉన్నారు. ఆమె ఇటీవల బిలియన్ డాలర్ల స్టార్టప్ స్విగ్గీ బోర్డులో కూడా అడుగుపెట్టడం గమనార్హం. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల కంటే ఎక్కువ ఆస్తులున్న మహిళ గురించి తెలుసా?) మల్లిక శ్రీనివాసన్ ఒక వైపు కంపెనీ విషయాలను చూసుకుంటూనే.. తిరునెల్వేలిలోని అనేక ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాలకు కూడా మద్దతు ఇస్తున్నారు. అంతే కాకుండా ఆమె ఇందిరా శివశైలం ఎండోమెంట్ ఫండ్ ద్వారా చెన్నై శంకర నేత్రాలయలోని క్యాన్సర్ ఆసుపత్రికి మద్దతు ఇస్తుంది. కర్ణాటక సంగీతం సంగీత సంప్రదాయాన్ని కూడా ప్రోత్సహించడంలో తన వంతు కృషి చేస్తోంది. ట్రాక్టర్ ఇండస్ట్రీ పురుషుల ఆధిపత్యంలోనే ఉంటుందని భావిస్తారు. అలాంటి భావనకు చరమగీతం పాడి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా, భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా తీర్చిదిద్ది 'ట్రాక్టర్ క్వీన్' పేరు పొందింది. మల్లిక శ్రీనివాసన్ మొత్తం ఆస్తుల విలువ రూ. 200 కోట్లకంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈమె భర్త టీవీఎస్ మోటార్స్ సీఎండీ వేణు శ్రీనివాసన్. పారిశ్రామిక రంగంలో ఈమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రధానం చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!
JaggerCane CEO Navnoor Kaur: చదివిన తరువాత ఉద్యోగం వస్తే చాలు అనుకునే రోజులివి, అయితే మంచి శాలరీ వచ్చే ఉద్యోగం వదిలేసి సొంతంగా వ్యాపారం మొదలెట్టి లాభాలను ఆర్జిస్తున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు 'నవ్‌నూర్ కౌర్'. ఇంతకీ ఈమె ఏ ఉద్యోగం చేసింది? ఎందుకు వదిలేసింది? ఇప్పుడేం చేస్తోంది? ఎంత సంపాదిస్తోంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి. నవ్‌నూర్ కౌర్ ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్న ఒక వ్యాపారవేత్త, కానీ వారి కుటుంభంలో అంతకు ముందు ఎవరూ వ్యాపారవేత్తలు కాకపోవడం గమనార్హం. ఆమె తండ్రి ప్రొఫెసర్, తల్లి స్కూల్ ప్రిన్సిపాల్. కావున చదువులో బాగా రాణించింది, తల్లిదండ్రుల మాదిరిగా మంచి ఉద్యోగం చేస్తుందని ఆశించారు. నవ్‌నూర్ లూథియానాలో చదువుకుంది. ఆ తరువాత దేశంలోని అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్లలో ఒకటైన IMT ఘజియాబాద్‌లో MBA పూర్తి చేసి చదువు పూర్తయిన తరువాత తల్లిదండ్రుల మాదిరిగానే గుర్గావ్లోని కోటక్ బ్యాంక్‌లో మంచి ఉద్యోగం సంపాదించింది. ఇందులో మంచి జీతం కూడా వచ్చేది. కానీ ఈమెకు మొదటి నుంచి ఆహారానికి సంబంధించిన వ్యాపారం చేయాలని కోరిక ఉండేది. కొత్త ఆలోచన.. నవ్‌నూర్ కుటుంబ సభ్యుల్లో చాలా మందికి మధుమేహం (షుగర్) ఉండటంతో క్వాలిటీ బెల్లం అమ్మాలనే ఆలోచన వచ్చిందని, ఉద్యోగం చేస్తూనే పాటు టైమ్ మాదిరిగా ఈ వ్యాపారం చేయడం ప్రారంభించిందని ఒక సందర్భంలో తెలిపింది. వ్యాపారం మొదలైన కేవలం రెండు సంవత్సరాల్లో మంచి ఆదాయం రావడం కూడా ప్రారంభమైంది. దీంతో నవ్‌నూర్ ఉద్యోగం వదిలి పూర్తిగా తన వ్యాపారం మీదే ద్రుష్టి పెట్టింది. నిజానికి శుద్ధి చేసిన చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని కనుక్కోవడానికి ఆమె బెల్లంతో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇందులో మరిన్ని ఉత్పత్తులు తయారు చేసింది. మొదట్లో ఆమె డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసింది. ప్రజలు వాటిని రుచి చూసిన తర్వాత పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించిన తర్వాత తన ఉత్పత్తిపై తనకు మరింత నమ్మకం కలిగింది. తన వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో పంజాబ్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నడుపుతున్న తన తండ్రి విద్యార్థి కౌశల్‌ను కలిసి వారిద్దరూ పనిచేయడం ప్రారంభించారు. ఇందులో కౌశల్ మ్యాన్యుఫ్యాక్షరింగ్ కార్యకలాపాలను చూసుకుంటాడు, ఆమె బ్రాండింగ్ ఇతర కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించింది. వ్యాపార విస్తరణ.. నవ్‌నూర్ తన వ్యాపారం కోసం అనేక సవాళ్ళను ఎదుర్కొంది. చాలా మంది దుకాణదారులు మొదట్లో తక్కువ మార్జిన్లు, చిన్న షెల్ఫ్-లైఫ్ కారణంగా ఆమె ఉత్పత్తులను తిరస్కరించారు. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం నిరాశ చెందకుండా ముందడుగు వేసింది. మొత్తానికి అనుకున్న విజయం సాధించగలిగింది. (ఇదీ చదవండి: లక్షతో కంపెనీ ప్రారంభించి, రూ. 50 కోట్ల సంస్థగా.. 27ఏళ్ల యువతి సాహసమిది!) ప్రస్తుతం భారతదేశంలో తన వ్యాపారాన్ని 22 జిల్లాల్లో విస్తరించింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా తన ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం ఈమె 25 మందికి ఉద్యోగం కల్పిస్తోంది. ఇందులో ఎనిమిది మంది మహిళలే కావడం గమనార్హం. (ఇదీ చదవండి: 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ప్రారంభంలో ఉద్యోగం చేస్తూ వ్యాపారం మొదలు పెట్టిన నవ్‌నూర్ కౌర్ రోజంతా ఉద్యోగం చేసి రాత్రి వేళల్లో తన వ్యాపార కార్యకలాపాలను చూసుకునేది. తన జాగర్‌కేన్ సంస్థ గత ఏడాది రూ. 2 కోట్ల టర్నోవర్ సాధించింది. రానున్న మరో ఐదేళ్లలో కంపెనీ టర్నోవర్ రూ. 100 కోట్లు సాధించేలా లక్ష్యంగా పెట్టుకుని దానికోసం ముందడుగు వేస్తోంది. -
లక్షతో కంపెనీ ప్రారంభించి, రూ. 50 కోట్ల సంస్థగా.. 27ఏళ్ల యువతి సాహసమిది!
'చదువుకున్న వెంటనే ఏదో ఒక ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, స్థిరపడాలి' ఇది చదువుకున్న చాలా మంది ఆలోచన. అయితే చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు అద్భుతాలు సృష్టించడానికని కొంత మంది నిరూపిస్తున్నారు. ఆలాంటి వ్యక్తిత్వం ఉన్న వారిలో ఒకరు 'అరుషి అగర్వాల్'. ఇంతకీ అరుషి అగర్వాల్ ఎవరు? ఈ సాధించిన ఆ అద్భుతం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఘజియాబాద్‌లోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి, యువ పారిశ్రామిక వేత్తగా.. కేవలం మూడు సంవత్సరాల్లో రూ. 50 కోట్ల కంపెనీ నిర్మించేలా చేసింది. ఇది నిజంగానే గొప్ప అద్భుతం అనే చెప్పాలి. కేవలం మూడేళ్ళలో ఒక అమ్మాయి అనుకున్నది సాధించి సక్సెస్ సాధించింది. నిజానికి అరుషి అగర్వాల్ స్వస్థలం మొరాదాబాద్. ఈమె జెపి ఇన్స్టిట్యూట్ నుంచి బి-టెక్ అండ్ ఎమ్-టెక్ పూర్తి చేసింది. ఆ తరువాత ఢిల్లీ ఐఐటీలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలోనే రెండు సార్లు కోటి రూపాయల భారీ జీతం ఆఫర్ పొందింది. అయితే ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది. భారీ శాలరీ ప్యాకేజి వద్దనుకుని తానే సొంతంగా కంపెనీ ప్రారంభించాలని TalentDecrypt అనే సంస్థను ప్రారంభించింది. దీని కోసం కోడింగ్ నేర్చుకుంది. అంతే కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ పొందని వారికి సహాయం చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. మొత్తానికి అనుకున్న విధంగానే రూ. లక్ష పెట్టుబడితో కంపెనీ మొదలుపెట్టింది. (ఇదీ చదవండి: టీ షర్ట్ రూ. 2 లక్షలు, మొబైల్ కవర్ రూ. 25వేలు.. అన్ని బ్రాండెడ్ వస్తువులే!) కంపెనీ ప్రారంభించిన కేవలం మూడు సంవత్సరాల్లో ఆమె సాఫ్ట్వేర్ సహాయంతో 10 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. అంతే కాకూండా వారు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, సింగపూర్, యుఎఇ, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్‌లోని 380 కంపెనీలకు సహాయం చేశారు. ఈ సాఫ్ట్వేర్ కింద, ఉద్యోగం పొందాలనుకునే వారు హ్యాకథాన్ (Hackathon) ద్వారా వర్చువల్ స్కిల్ టెస్ట్ చేస్తారు. దీని తరువాత నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలలో హాజరు కావచ్చు. (ఇదీ చదవండి: టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో రానుందా? ఇదిగో సాక్ష్యం..!) ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉద్యోగం పొందటానికి వీలు కల్పిస్తుంది. అరుషి అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరిగా భారత ప్రభుత్వంచే పురస్కారం పొందింది. ఆమె తన తాత 'ఓం ప్రకాష్ గుప్తా'ను తన ఆరాధ్యదైవంగా భావిస్తుంది. ఆమె తండ్రి అజయ్ గుప్తా వ్యాపారవేత్త, ఆమె తల్లి గృహిణి. ప్రస్తుతం ఆమె నోయిడా కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. -
అతని జీవితం ఎందరికో ఆదర్శం - రూ. 3 నుంచి రూ. 800 కోట్లు అధిపతిగా..
'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస' అవుతుంది అనేది లోకోక్తి. ఆ మాటను నిజం చేసాడు రెడ్ కౌ డైరీ ఓనర్ 'నారాయణ్ మజుందార్'. ఇంతకీ అతడు ఏం చేసాడు? ఎలా సక్సెస్ అయ్యాడు.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. 1975లో ఒక పేదరైతు కుమారుడు 17 ఏళ్ల వయసులో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NDRI) బయట పాలు అమ్మి కొంత డబ్బు సంపాదించాడు. అతని చదువు కోసం పలు అమ్మడం పార్ట్‌టైమ్ ఉద్యోగం ప్రారంభించి, ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. బెంగాల్‌లోని నదియా జిల్లాలో జన్మించిన నారాయణ్ మజుందార్ తన గ్రామంలోనే పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత 'ఎన్డిఆర్ఐ'లో చదువుకోడానికి వెళ్ళాడు. అప్పట్లో అతడు తీసుకున్న కోర్సుకి అయ్యే ఖర్చు రూ. 250. ఇది అప్పట్లో ఎక్కువ మొత్తం అనే చెప్పాలి. తన చదువు కోసం ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని ఉదయం 5 నుంచి 7 గంటల వరకు పాలు అమ్మేవాడు. అంతే కాకుండా అతనికి స్కాలర్‌షిప్‌గా రూ.100, అతని తండ్రి నెలకు రూ. 100 అందేవి. (ఇదీ చదవండి: 2023 Skoda Kodiaq: కొత్త రూల్స్‌తో విడుదలైన లేటెస్ట్ కారు - పూర్తి వివరాలు) కాలేజీ విద్య పూర్తయ్యేనాటికి ఆ కుటుంభం వ్యవసాయ భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తరువాత నారాయణ్ కోల్‌కతాలోని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌లో డైరీ కెమిస్ట్‌గా ఉద్యోగం ప్రారభించారు. అప్పుడు అతని నెల జీతం సుమార్చు రూ. 600. తన ఉద్యోగం ఉదయం 4 నుంచి రాత్రియే 11 వరకు ఉండేది. అక్కడ ఉద్యోగం వదిలేసి సిలిగురి (హిమాలయన్ కోఆపరేటివ్)లో చేరాడు. ఆ తరువాత మదర్ డెయిరీలో మేనేజర్‌గా ఉన్న 'డాక్టర్ జగ్జీత్ పుంజార్థ్'ను కలిశారు. ఈ పరిచయం అతని జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. 1981లో మదర్ డెయిరీలో చేరి 1955లో హౌరాలోని ఒక కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేశాడు. (ఇదీ చదవండి: భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ స్కూటర్లు - రోజువారీ ప్రయాణానికి మంచి ఆప్షన్..!) నారాయణ్ మజుందార్ 1999లో రూ.10 లక్షల పెట్టుబడితో చిల్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఏడాది పాల ట్యాంకర్ కొనుగోలు చేసి తన భార్య భాగస్వామ్యంతో ఒక సంస్థను స్థాపించాడు. 2003లో రెడ్ కౌ డైరీని తయారు చేశాడు. ఎప్పటికప్పుడు వ్యాపారంలో ఎదుగుతూనే ఉన్నాడు. 2007లో కోల్‌కతా డెయిరీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని, పాలీ పౌచ్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం వారికి మూడు ఉత్పత్తి కర్మాగారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కంపెనీలో 1000 మంది పనిచేస్తున్నారు. అంతే కాకుండా బెంగాల్‌లోని 12 జిల్లాల్లో సుమారు 3 లక్షల మందికి పైగా రైతులతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. నారాయణ్ మజుందార్ కంపెనీ ఇప్పుడు ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. వీరికి 35 మిల్క్ చిల్లింగ్ ప్లాంట్లతో పాటు 400 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. మొత్తం మీద సైకిల్ మీద పార్ట్‌టైమ్ ఉద్యోగిగా ప్రారంభించి ఈ రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తాతలు, తండ్రులు సంపాదనతోనే బ్రతికేయాలనుకునే వారికి 'నారాయణ్ మజుందార్' గొప్ప ఆదర్శం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ప్యూన్ ఉద్యోగం రాలేదు: ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడిలా!
పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం అనే మాటలు నిజ జీవితంలో అక్షర సత్యాలు. జీవితంలో ఎదగాలనే కసి నీకుంటే తప్పకుండా గొప్ప స్థాయికి చేరుకుంటావు. దీనికి నిలువెత్తు నిదర్శనమే 'దిల్ఖుష్ సింగ్' సక్సెస్ స్టోరీ. సహర్సాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 'దిల్ఖుష్ సింగ్' ఇంటర్ మీడియట్ మాత్రమే చదివి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ రోజు అతని సంవత్సరాదాయం సుమారు రూ. 20 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈ స్థాయికి రావడానికి దిల్ఖుష్ ఎంతో కష్టపడ్డాడు. రిక్షా లాగించేవాడు, బతుకుదెరువు కోసం పాట్నాలో కూరగాయలు కూడా అమ్మేవాడు. ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళితే యాపిల్ లోగోను గుర్తించమని అడిగారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దిల్ఖుష్ సింగ్ రాడ్బెజ్ అనే కంపెనీ ప్రారంభించి బీహార్‌లో క్యాబ్‌లను అందించడం మొదలెట్టాడు. అయితే ఇది ఓలా, ఉబర్ సంస్థలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఓలా, ఉబర్ కంపెనీలు నగర ప్రయాణాలపై మాత్రమే దృష్టి పెడుతుంటే.. ఈ కంపెనీ నగరం నుంచి 50 కిమీ దూరం వెళ్లి కూడా సర్వీస్ చేస్తుంది. (ఇదీ చదవండి: వెబ్సైట్లో మాయమైన క్విడ్, ఇక కావాలన్నా కొనలేరు!) రాడ్బెజ్ కంపెనీ ట్రావెల్ కంపెనీలతో పాటు వ్యక్తిగత క్యాబ్ డ్రైవర్లతో టై-అప్‌లను కలిగి ఉంది. అయితే వారి ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికి ప్రయాణీకులను ఎంపిక చేసుకోమని వారు క్యాబ్ డ్రైవర్లను అడుగుతారు. వారు తిరుగు ప్రయాణాలలో ప్రయాణికులు లేకుండా వస్తారు కాబట్టి, మార్కెట్ ధరల కంటే తక్కువ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా ప్రతి వినియోగదారుడు ఒక్కో ట్రిప్పుకు కనీసం రూ. 1500 ఆదా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తరువాత ఆర్య గో క్యాబ్స్‌గా తన బిజినెస్ ప్రారంభించాడు. టాటా నానో కారుతో కంపెనీని ప్రారభించి, కేవలం ఆరు నెలల్లో కోట్ల రూపాయల సంపాదించగలిగాడు. ఇప్పటికి అతని సంపాదన రూ. 20 కోట్లకి చేరింది. అతని లక్ష్యం రూ. 100 కోట్లకి చేరుకోవడమే అని గతంలో వెల్లడించారు. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) తన కంపెనీలో పనిచేసే డ్రైవర్లకు ఎటువంటి నష్టం జరగకుండా చూడటానికి నష్టపరిహారం వంటివి కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక డ్రైవర్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా నెలకు రూ.55,000 నుంచి రూ. 60,000 వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఐఐటీ గౌహతి నుంచి, ఐఐఎంల నుంచి చాలా మంది తమ ప్లాట్ఫామ్లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నారని దిల్ఖుష్ చెప్పుకొచ్చారు. -
బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర
సక్సెస్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆనందాన్నిస్తుంది కాబట్టి. ఆనందాలు మళ్లీ మళ్లీ కావాలి... కొత్త కొత్త రూపాల్లో రావాలి... ఇదీ సంగీతారాజేశ్ ఆకాంక్ష. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో నిస్వార్థసేవ. ఫ్యాషన్ ఇండస్ట్రీకి కొత్త నడక. బ్యూటీ ఇండస్ట్రీ అధ్యయనం. మహిళలకు మార్కెట్ పాఠాల బోధన. అన్నింటిలో రాణిస్తున్న... ఆమె ‘సక్సెస్ మంత్ర’ ఏమై ఉంటుంది? ఓ ముప్పై– నలభై ఏళ్ల కిందట... ‘ఇది ఇంపోర్టెడ్ శారీ, మా అన్న సింగపూర్ నుంచి తెచ్చాడు’ అని ఒకరు హోదా ఒలకబోసేవారు. ‘నాది కూడా ఇంపోర్టెడే. ఫలానా నగరంలో స్మగుల్డ్ గూడ్స్ దొరుకుతాయి’ అని మరొకరు... మీకు నేనేమీ తీసిపోను అన్నంత ధీమాగా. అప్పట్లో ఇలా నడిచేవి సగటు మహిళల కబుర్లు. వాళ్లలో ఎవరికీ స్మగుల్డ్ గూడ్స్ కొనడం చట్టరీత్యా నేరమనే విషయం తెలియదు కూడా. సింథటిక్ మోజుతోపాటు ఇలాంటి హోదాల ప్రదర్శనలో మన సంప్రదాయ వస్త్రాలు తెరమరుగయ్యాయి, క్రమంగా వస్త్రాల తయారీదారులు కనుమరుగవడం కూడా మొదలైంది. అలాంటి సమయంలో గ్లోబలైజేషన్ రూపంలో వచ్చింది ఓ పెనుమార్పు. మన చేనేతలకు విదేశాల్లో అందుతున్న గౌరవాలను స్వయంగా చూసిన మన మహిళలే మన సంప్రదాయ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. నిర్లిప్తంగా మిగిలిపోయిన చేనేత, హస్తకళాకారుల వైపు చూసింది భారతీయ ఫ్యాషన్ ఇండస్ట్రీ. అలాంటి సమయంలో పెన్ కలంకారీని పునరుద్ధరించడానికి స్వచ్ఛందంగా సేవ చేశారు సంగీతా రాజేశ్. అంతకంటే ముందు ఆమె పిల్లల చదువు వారి మానసిల్లోసానికి, మే«ధావికాసానికి దోహదం చేయాలి తప్ప బడి అంటే భయపడేలాగ ఉండకూడదని స్పెషల్ కిడ్స్ కోసం ప్రత్యేకమైన కరిక్యులమ్ తయారు చేశారు. పిల్లల్లో మేధావికాసానికి మన తాతమ్మల నుంచి ఇంట్లో ఆడుకున్న బోర్డ్‌గేమ్స్ దోహదం చేస్తాయని ఆచరణ లో చూపించారామె. సోషల్ మీడియా లో లక్షలాది ఫాలోవర్లున్న ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ఇప్పుడు తాజాగా ‘మనిషిని సమాజంలో ఆత్మవిశ్వాసం తో ముందుకు నడిపించే సాధనం అందంగా కనిపించడం కూడా’ అని మరో ప్రయోగానికి తెర తీశారు. ♦ స్పెషల్ పాఠాలు ‘‘నేను మధురైలో పుట్టాను, దిండిగల్‌లో పెరిగాను. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలోని అబ్బాయితో పెళ్లయింది. అలా పాతికేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చాను. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని, స్పెషల్ చిల్డ్రన్‌కి స్పీచ్ థెరపీ, వాళ్లకు కాన్సెప్ట్ అర్థమయ్యేటట్లు టీచింగ్ మెటీరియల్, ప్రత్యేకమైన టీచింగ్ మెథడాలజీతో క్లాసులు చెప్పి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పరీక్షలు రాయించి మెయిన్ స్ట్రీమ్‌కి పంపించడం నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. అందులో బిజీగా ఉన్నప్పుడు కలంకారీ మీద ఆసక్తి కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో నిష్ణాతులు చేసే పెన్ కలంకారీ మీద అధ్యయనం చేశాను. వాళ్ల చేతిలో కళ ఉంది, నా దగ్గర సృజన ఉంది. ఆ రెండింటినీ కలుపుతూ కొత్త ప్యాటర్న్స్ తెచ్చాం. వాటి ఖరీదు ఎక్కువే. కానీ ఒక చీర అమ్మగలిగానంటే దానిని తయారు చేసిన కుటుంబం నెలంతా ఆకలి లేకుండా జీవించగలుగుతుంది. పెన్ కలంకారీని ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాను. వీవర్స్‌కి ప్రయోజనం కల్పించడంలో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత చాలామంది ఇదే పంథాను అనుసరించారు. పెన్ కలంకారీ కళాకారుడికి సూచనలు ఇస్తూ... ♦ పంచడానికే జ్ఞానం! నేను ప్రధానంగా టీచర్ని కావడంతో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను నాలో దాచుకోలేను. జ్ఞానం ఉన్నది పలువురికి పంచడానికే అన్నట్లు ఉంటాను. వినడానికి నా ఎదురుగా ఎవరూ లేకపోతే ఫేస్బుక్లో చెబుతాను. అలా తొమ్మిదేళ్ల కిందటే నేను ఎఫ్బీ వేదికగా కాస్ట్యూమ్ ప్రజెంటేషన్ ఇచ్చాను. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. నాకు అప్పటికే ఎనిమిది లక్షల ఫాలోవర్లున్నారు. ఆ టైమ్‌లో నాకు అసలైన చాలెంజ్ నా వ్యాపారాన్ని కొనసాగించడం కాదు, నా ఉద్యోగులకు జీతాలివ్వడం. రెండు వారాలు మినహా మిగతా కోవిడ్ సమయమంతా పని చేశాను. అప్పుడు షోరూమ్‌లు, మాల్స్‌లో జనం కనిపించలేదు, కానీ ఆన్లైన్లో చాలా ఎక్కువగా కొనుగోళ్లు చేశారు. ♦ అదే నా సక్సెస్ సూత్ర నేను కోవిడ్ టైమ్‌లో సూరత్, జైపూర్‌కు వెళ్లి అక్కడి నుంచి లైవ్‌లో డిస్ప్లే చేశాను. గంటల్లోనే కొనుగోళ్లు జరిగాయి. స్టాక్ అక్కడి నుంచే నేరుగా డెలివరీ ఇచ్చేశాను. ఒక రవాణా ఖర్చు, ఒక స్టేట్ జీఎస్టీ తగ్గిపోతే ఎంత ఆదానో ఆలోచించండి. విదేశాలకు వెళ్లాల్సిన స్టాక్ ఆగింది, మార్కెట్ చేసి పెట్టమని అడిగిన వాళ్ల స్టాక్‌ను ఆన్లైన్లో అమ్మేశాను. దాంతో స్టాక్ కొనుగోలుకు డబ్బు పెట్టాల్సిన అవసరం రాలేదు. అటు ఉత్పత్తిదారులు, నేను– నా ఉద్యోగులు, వినియోగదారులు... అందరికీ ప్రయోజనమే. అందుకే విన్ విన్ డీల్ ఎప్పుడూ సక్సెస్ అవుతుందని నమ్ముతాను. గృహిణులు కొంతమంది ఇంట్లోనే చిన్న స్థాయిలో దుస్తులు, ఇతర ఇంటికి అవసరమైన వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. కానీ అదంతా అవ్యవస్థీకృతంగా ఉంది. అలాంటి హోమ్ సెల్లర్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఔత్సాహిక మహిళలకు బోధన తరగతులలో పాఠాలు చెప్తున్నాను. వ్యాపారం కోసం ఓ సొంత ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంట్ నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలలో శిక్షణ, మార్కెట్ మెళకువలతోపాటు డెడ్స్టాక్ను ఎలా డీల్ చేసే సులువు కూడా నేర్పిస్తున్నాను. హోమ్ సెల్లర్స్ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే... స్నేహితులు, బంధువులలో కస్టమర్లను వెతుక్కోవడం. ఆ పొరపాటు వల్ల స్నేహితులు, బంధువులు దూరమవుతారు తప్ప, లాంగ్ టర్మ్ కస్టమర్లను ఏర్పరుచుకోవడం సాధ్యం కాదు. ప్రొఫెషన్నీ, కుటుంబ బంధాలను కలపకూడదు’’ అని తాను నేర్చుకున్న, అనుసరించిన సక్సెస్ సూత్రను వివరించారు సంగీతారాజేశ్. స్పెషల్ చాలెంజ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని బాగా అధ్యయనం చేశాను, కాబట్టే బ్యూటీకి ఉన్న ఆదరణ, మేకోవర్ అవసరాన్ని కూడా తెలుసుకోగలిగాను. ఫ్యాషన్, బ్యూటీ... ఈ రెండూ ఒకదానితో ఒకటి కలగలిసి ఉంటాయి. అందం అనేది మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనం. మరి అలాంటప్పుడు అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో అధునాతన సాధనాలు అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో అందంగా కనిపించడం అనే ఆకాంక్షకు ఎవరైనా ఎందుకు దూరంగా ఉండాలి? నేను వయసులో ఉన్నప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పరుగులు పెట్టాను, రిటైర్మెంట్ లేకుండా ఒకచోట స్థిమితంగా ఉంటూ నిర్వహించుకోవడానికి ఇప్పుడు కొత్త కెరీర్లోకి అడుగుపెట్టాను. ఇందులో కూడా సక్సెస్ అయ్యి, మరో ఐదేళ్లలో కొత్త తరానికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుతాను. నేను కెరీర్ రోల్స్ ఎన్ని మార్చినా స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్లో కొనసాగుతూనే ఉంటాను. – సంగీతారాజేశ్, స్పెషల్ ఎడ్యుకేటర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ఈక్విటీల్లో విజయానికి.. బఫెట్ పంచ సూత్రాలు
2020 నుంచి రెండేళ్లపాటు తారాజువ్వలా సాగిన ఈక్విటీల ర్యాలీ చూసి మార్కెట్లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన యువ ఇన్వెస్టర్లు బోలెడు మంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు వారిని ఇప్పుడు అయోమయానికి గురిచేయవచ్చు. అంతెందుకు సుదీర్ఘకాలం నుంచి మార్కెట్లో ఉన్న వారు సైతం షేర్ల ధరలు పేకమేడల్లా రాలుతున్నప్పుడు స్థిరంగా చూస్తూ ఉండలేరు. నష్టానికైనా అమ్ముకుని బయటపడదామనుకుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లకు సంక్షోభాలు కొత్త కాదు కదా! ఎన్నో స్కాములు, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలను చూసి పడిపోయాయి. అంతే బలంగా పైకి లేచి నిలబడ్డాయి. ఈక్విటీల్లో విజయానికి ముందుగా కావాల్సింది పెట్టుబడి కాదు. విజయ సూత్రాలు. వారెన్ బఫెట్ వంటి విఖ్యాత ఇన్వెస్టర్ల అనుభవాలు, సూత్రాలు లోతుగా పరిశీలిస్తే ఈక్విటీ తత్వం కొంతైనా బోధపడుతుంది. వారెన్ బఫెట్ పెట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్ హాతవే 1970 నుంచి ఏటా వాటాదారులకు వార్షిక నివేదిక పంపిస్తుంటుంది. ఇందులో వాటాదారులను ఉద్దేశించి బఫెట్ రాసే లేఖ ఇన్వెస్టర్లకు ఒక చుక్కానిలా పనిచేస్తుంది. బఫెట్ అనుసరించిన సూత్రాలు కాల పరీక్షకు నిలబడినవి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కరోనా విపత్తు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక ఆంక్షలు, చైనాలో మందగమనం, అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల శరాఘాతం, దీర్ఘకాలం పాటు ఆర్థిక స్తబ్దత, రూపాయి బలహీనత ఇలా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఒకవైపు వృద్ధికి ప్రోత్సాహం కావాలి. మరోవైపు ధరలకు కట్టడి వేయాలి. సెంట్రల్ బ్యాంకులకు ఇదొక సవాలుగా మారిపోయింది. ధరల పెరుగుదలకు సరఫరా వ్యవస్థలో సమస్యలూ తోడయ్యాయి. ఇలా ఒకటికి మించిన ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు గురిచేస్తున్నాయి. స్వల్పకాలంలో కనిపించే ఇలాంటి ప్రకంపనలకు కదిలిపోతే దీర్ఘకాలం పాటు మార్కెట్లో నిలిచి రాణించడం అసాధ్యం. ద్రవ్యోల్బణం ప్రభావం ద్రవ్యోల్బణం ఎగసిపడడం అన్నది తాత్కాలికమేనన్న వాదన గతేడాది నుంచి వినిపిస్తోంది. కానీ, ఇది నిజం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా తక్కువ ద్రవ్యోల్బణం ఉంది. ఫలితంగా దీర్ఘకాలం పాటు సరళతర విధానాలు కొనసాగడం వల్ల ఉండే రిస్క్‌ను ఇన్వెస్టర్లు, విశ్లేషకులు, ఆర్థికవేత్తలు సైతం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కానీ, ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం నడుమ సెంట్రల్ బ్యాంకుల ముందున్న ఏకైక మార్గం ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేయడమే. ఇన్నాళ్లూ తక్కువ వడ్డీ రేట్లు, మిక్కిలి ద్రవ్య లభ్యతతో లాభపడిన మార్కెట్లు.. పరిస్థితులకు తగ్గట్టు మార్పునకూ గురి కావాల్సిందే. వడ్డీ రేట్లు పెరగడం స్టాక్స్‌కు ప్రతికూలమే. ద్రవ్యోల్బణాన్ని బఫెట్ టేప్వార్మ్తో పోల్చారు. టేప్‌వార్మ్‌లు పేగుల లోపలి గోడల్లో ఉండి మనం తీసుకునే ఆహారంలోని శక్తిని గ్రహిస్తుంటాయి. అలాగే, ద్రవ్యోల్బణం కంపెనీల నిధుల శక్తిని హరిస్తుంటుంది. రుణాలను భారంగా మారుస్తుంది. అధిక ద్రవ్యోల్బణం తర్వాత కనిపించేది అధిక వడ్డీ రేట్లే. అందుకుని మార్కెట్లు ఖరీదుగా మారినప్పుడు, వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మిగులు నిధులను బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తానని బఫెట్ తన 1986 లేఖలో పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరిగితే టేప్‌వార్మ్ మాదిరిగా ఏ స్టాక్స్ విలువలు హరించుకుపోతాయన్న విశ్లేషణ చేయాలి. కమోడిటీలు ఇన్‌పుట్‌గా (ముడి సరుకులుగా) వ్యాపారం చేసేవి, అధిక రుణభారంతో నడిచే కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అప్పటి వరకు రుణాల అండతో ఇన్ఫ్రా, పవర్ కంపెనీలు దూకుడు ప్రదర్శించగా.. ఆ తర్వాత కుదేలయ్యాయి. రుణాలు తీర్చలేక ఎన్నో కనుమరుగయ్యాయి. పెన్నీ షేర్లుగా మారిపోయినవీ ఉన్నాయి. వడ్డీ రేట్ల సైకిల్ మారే దశలో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే, నష్టాలతో వచ్చే న్యూఏజ్ కంపెనీలపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపిస్తాయి. భద్రత పాళ్లు ఎంత? 1991, 1993 వార్షిక లేఖల్లో బఫెట్ ‘మార్జిన్ ఆఫ్ సేఫ్టీ’ (భద్రత) గురించి ప్రస్తావించారు. పెట్టుబడి విజయంలో దీని పాత్ర ఎంతో ఉంటుందన్నది ఆయన అనుభవ సారం. స్టాక్స్ విలువను మదింపు వేసే విషయంలో ఊహించిన, ఊహించని రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాలకు దారితీస్తుంది. వచ్చే పదేళ్ల పాటు మార్కెట్లలో సానుకూల పరిస్థితులు ఉంటాయని వినడా నికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవంలో ఇది సాధ్యమేనా? ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, కంపెనీలకు సంబంధించి రిస్క్‌లు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. లాభాల్లేకుండా ఏటా మార్కెట్ వాటా పెంపు కోసం నష్టాలను అధికం చేసుకుంటూ వెళ్లే కంపెనీలకు సంబంధించి భవిష్యత్తు అంచనాలు ఎంతో ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ, ఆర్జించే ఆదాయానికి 3,000 రెట్లు ధర పలుకుతున్న ఆయా కంపెనీల్లో మీరు పెట్టే పెట్టుబడికి భద్రత పాళ్లు ఎంత? ఎన్నో రేట్ల అధిక స్పందన అందుకున్న ఇటీవలి జొమాటో, పేటీఎం, నైకా, పీబీ ఫిన్‌టెక్, కార్‌ట్రేడ్ షేర్లు.. లిస్ట్ అయిన తర్వాత గరిష్టాల నుంచి చూస్తే 40–70 శాతం స్థాయిలో పడిపోయాయి. కానీ, ద్రవ్యోల్బణం ప్రభావం వీటిపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. జొమాటో రూ.76 ధరకు ఐపీవో తీసుకురాగా, ఆ తర్వాత రూ.179 వరకు వెళ్లింది. ఇప్పడు రూ.79 వద్ద ట్రేడవుతోంది. విలువను సరిగ్గా అంచనా కట్టకుండా రూ.150–179 మధ్య పెట్టుబడులు పెట్టిన వారి స్థితి ఏంటి? వారు మార్జిన్ ఆఫ్ సేఫ్టీని పట్టించుకోలేదన్నది స్పష్టం. స్పెక్యులేషన్‌కు దూరం దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలంటే స్పెక్యులేటర్గా ఉండకూడదని బఫెట్ చెబుతారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్ వేర్వేరు. ఈ రెండింటి మధ్య విభజన గీత స్పష్టంగా ఉంచుకోవాల్సిందే. ఫలానా షేరు ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలో, ర్యాలీ చేస్తుండడమే మీ పెట్టుబడి వెనుక కారణం అయి ఉంటే, షేరు ధర కంపెనీ మూలాలను ప్రతిఫలించడం లేదంటే అది స్పెక్యులేషన్ అవుతుంది. అయినా కానీ, లాభాలు రావచ్చు. మన దేశంలో కొన్ని పాపులర్ స్టాక్స్ కొన్నేళ్ల పాటు అసాధారణ వ్యాల్యూషన్లతోనే ట్రేడవుతుంటాయి. కానీ, ఒక్కసారిగా ఆయా కంపెనీల్లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటే ఈ వ్యాల్యూషన్లు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఉదాహరణకు పెయింట్స్ స్టాక్స్ ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలోనే, అంతర్గత విలువకుపైనే ట్రేడవుతుంటాయి. కానీ, చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు వాటి ధరలు దిగొస్తున్నాయి. చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగితే పెయింట్స్ స్టాక్స్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వృద్ధి అవకాశాలూ సన్నగిల్లుతాయి. ఎందుకంటే ఆయా కంపెనీలు ధరలను పెంచితే విక్రయాలపై ప్రభావం పడుతుంది. అం దుకని పెట్టుబడికి స్పెక్యులేషన్ ధోరణి పనికిరాదు. అంతర్గత విలువ కంపెనీకి ఫలానా ధర పెట్టొచ్చా అన్నది ఎలా తెలుస్తుంది? దీనికి అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) చూడడం బఫెట్ అనుసరించే సూత్రాల్లో మరొకటి. బెర్క్‌షైర్ వాటాదారులకు బఫెట్ తరచుగా దీన్ని సూచిస్తుంటారు కూడా. కంపెనీ వ్యాపారం నుంచి తీసుకోతగిన ‘డిస్కౌంటెడ్ క్యాష్ వ్యాల్యూ’ను అంతర్గత విలువగా బఫెట్ చెబుతారు. కానీ పెట్టుబడుల నిపుణులకు సైతం ఇది కొరుకుపడని అంశం. ఇందుకు సంబంధించి ఎవరికి వారు తమదైన లెక్కింపు విధానాలను అనుసరిస్తుంటారు. కంపెనీకి సంబంధించి నికర పుస్తక విలువను అంచనా వేసి, దానికి సమీప భవిష్యత్తులో వచ్చే క్యాష్ ఫ్లో, ప్రస్తుత లాభాలను కలిపితే అంతర్గత విలువ వస్తుంది. ఇవన్నీ కష్టంగా అనిపించిన వారు.. కంపెనీ లాభాలు ఆ కంపెనీ గత చరిత్ర సగటు స్థాయిలోనే ఉన్నాయా? అని చూడాలి. తర్వాత స్టాక్ ధర చారిత్రకంగా (గతంతో పోలిస్తే) సగటు వ్యాల్యూషన్ల స్థాయిలోనే ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా? గమనించాలి. ఒకవేళ స్టాక్ ధర చారిత్రక సగటు వ్యాల్యూషన్లకు ఎగువన ట్రేడ్ అవుతుంటే అంతర్గత విలువకు మించి ట్రేడవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీల లాభాల వృద్ధి కంటే వాటి స్టాక్స్ వ్యాల్యూషన్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో అవి అంతర్గత విలువను దాటిపోయి ట్రేడవుతున్నాయి. 2011 నుంచి 2021 వరకు నిఫ్టీ–50 ఇండెక్స్ 275 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఈ మొత్తంలో 170 శాతం రాబడులు పీఈ రేషియో పెరగడం రూపంలోనే వచ్చాయి. కానీ, ఫండమెంటల్స్ మెరుగుపడడం వల్ల కాదు. అదంతా బబుల్గానే భావించాల్సి ఉంటుంది. పెరుగుదల వెనుక వాస్తవ బలం 100 శాతంగానే భావించాలి. ఇలాంటప్పుడు అంతర్గత విలువకు లభించే స్టాక్స్ తక్కువగానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. సరైన ధర సరైన ధర వచ్చే వరకు వేచి చూడాలి.. ఇన్వెస్టర్లకు 1993 లేఖలో బఫెట్ ఇచ్చిన సూచన ఇది. పెట్టుబడులకు సంబంధించి ఎలా నడుచుకోవాలో తెలియని ఇన్వెస్టర్లను మార్కెట్ క్షమించదని ఆయన చెబుతారు. అత్యుత్తమమైన కంపెనీ అయినా సరే షేరు ధర సహేతుక స్థాయి వద్ద ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్నది బఫెట్ అనుసరించే సూత్రం. ఒక కంపెనీకి సంబంధించి ఆయన అనుసరించే అంశాలను గమనిస్తే.. ఎంపిక చేసుకునే కంపెనీ చేస్తున్న వ్యాపారం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. దీర్ఘకాలం పాటు అనుకూలతలు ఆ కంపెనీకి ఉండాలి. సమర్థులైన, నిజాయతీపరులైన వ్యక్తులు నడిపిస్తుండాలి. ఆకర్షణీయమైన ధర వద్ద ఉండాలి. వీటిల్లో మొదటి మూడు అంశాలకు రైట్ మార్కులు పడే కంపెనీలను ఆయన ఎన్నో సందర్భాల్లో గుర్తిస్తూనే ఉంటారు. కానీ, నాలుగో అంశమైన ఆకర్షణీయమైన ధర వద్ద లేకపోవడంతో బఫెట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మార్కెట్లో ప్రతి పతనం పెట్టుబడికి అవకాశం కావాలనేమీ లేదు. కొన్ని సందర్భాల్లో కంపెనీలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణం కావచ్చు. పెట్టుబడులకు ముందు భిన్నమైన అంశాలను విశ్లేషించుకోవాలని, వేగంగా స్పందించకుండా ఓపిక పట్టాలన్నది బఫెట్ ఫిలాసఫీ. పెట్టే ధర విషయంలో రిస్క్ తీసుకోవడం బఫెట్‌కు నచ్చదు. అవకాశం వచ్చే వరకు ఓపిక పట్టడమే ఆయన అనుసరించే విధానం. చక్కని అవకాశాలన్నవి మళ్లీ మళ్లీ వస్తుంటాయని ఆయన నమ్ముతారు. అందుకనే అందరూ ఎగబడి కొంటున్న వేళ అప్రమత్తంగా వ్యవహరించాలని.. అందరూ విక్రయిస్తున్న వేళ కొనుగోళ్లకు మొగ్గు చూపాలన్నది బఫెట్‌కు ఫలితాలిచ్చిన సూత్రాల్లో ఒకటి. ఎగసిపడే కెరటాన్ని పట్టుకోకుండా.. అది నేలను తాకే వరకు ఆగాలంటారు. 100–150–200 పీఈ వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు అయినా బఫెట్ సూత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.