అనుకున్నది సాధించిన, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చాలామంది పరితపిస్తుంటారు. ఈ లక్ష్యంగా వెళ్లేవారు కొన్ని సవాళ్ళను ఎదుర్కొని, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు 'క్రిప్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్' కో ఫౌండర్ 'రాహుల్ రాయ్'.
ఐఐటీలో చేరాలని కలలు కన్న లక్షలాది మందిలో రాహుల్ ఒకరు. ఈ ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేయకుండానే ఈయన 2015లో ఐఐటీ బాంబే నుంచి తప్పకున్నారు. ఆ తరువాత ఎకనామిక్స్ చదవడానికి అమెరికా వెళ్లారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, రాయ్ అమెరికాలోనే మోర్గాన్ స్టాన్లీలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ (FX) మాక్రో హెడ్జ్ ఫండ్స్ బృందంలో విశ్లేషకుడిగా జాబ్ చేయడం మొదలుపెట్టారు. ఒక సంవత్సరం అక్కడ ఉద్యోగం చేసిన తరువాత 2020లో బయటకు వచ్చారు.
ఉద్యోగం కాకుండా, తానే ఓ కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో భారతదేశానికి వచ్చారు. 2020 మొదటి లాక్‌డౌన్ సమయంలో క్రిప్టోకరెన్సీ భారతదేశంలో చర్చనీయాంశం అయింది. అప్పటికే డిజిటల్ అసెస్ట్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై ఆసక్తి కలిగిన రాహుల్.. తన స్నేహితులు ఈష్ అగర్వాల్, సనత్ రావ్‌లతో కలిసి 'క్రిప్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్'ను 2021 జనవరిలో ప్రారంభించారు.
రాహుల్ రాయ్ ఆలోచన ఫలించింది. అయితే క్రిప్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్‌ను మే 2021లో బ్లాక్‌టవర్ క్యాపిటల్‌కు రూ.256 కోట్లకు విక్రయించారు. కొత్తగా ప్రారంభమైన కంపెనీ ఇంత డబ్బు సంపాదించడానికి చాలా సమయం పడుతుందని తెలుసు. ఈ కారణంగానే వారు దాన్ని విక్రయించారు.
ఇదీ చదవండి: జీతం ఇవ్వము.. ఉద్యోగంలో చేరండి!.. సీఈఓ పోస్ట్ వైరల్
క్రిప్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్‌ను విక్రయించిన తరువాత.. రాహుల్ రాయ్ బ్లాక్‌టవర్ క్యాపిటల్‌లో మార్కెట్-న్యూట్రల్‌కి కో-హెడ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కంపెనీ బహుళ వ్యూహాత్మక క్రిప్టో హెడ్జ్ ఫండ్, క్రిప్టోఅసెట్‌లు, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో పెట్టుబడి పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment