Vijay Sankeshwar Success Story: జీవితంలో విజయం సాధించాలంటే గొప్ప గొప్ప చదువులు చదివితే సరిపోదు.. ఉన్నతమైన ఆలోచనలు ఉన్నప్పుడే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు. కేవలం ఒక ట్రక్కుతో ప్రారంభమైన అతని ప్రయాణం ఈ రోజు కోట్లు గడించే స్థాయికి చేరింది. ఇంతకీ ఈ సక్సెస్ ఎవరు సాధించారు? ఎలా సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కర్ణాటకలోనో ధార్వాడకు చెందిన 'విజయ్ సంకేశ్వర్' గురించి ఈ రోజు భారతదేశం మొత్తానికి తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో అతిపెద్ద వాణిజ్య వాహనాలకు యజమానిగా పేరు పొంది VRL లాజిస్టిక్స్ లిమిటెడ్ స్థాపించాడు. 1970లలో కేవలం ఒకే ట్రక్కుతో సొంత లాజిస్టిక్ కంపెనీ ప్రారంభించాలనుకున్నాడు. కానీ వారి కుటుంబం ప్రింటింగ్ ప్రెస్ వ్యాపార నేపద్యానికి చెందినది. (ఫాక్స్‌కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్‌ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి? )
తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ప్రింటింగ్ ప్రెస్ కాదనుకున్న విజయ్ లాజిస్టిక్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. 1976లో అప్పుగా తీసుకున్న కొంత డబ్బుతో ఒక ట్రక్కు కొనుగోలు చేసాడు. ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించాడు. ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాడు. కానీ పట్టు వదలకుండా విజయం సాధించాలనే తపనతో ముందడుగు వేయడం మాత్రం ఆపలేదు.
(ఇదీ చదవండి: రోజుకి 150 దాటుతున్న జిమ్నీ బుకింగ్స్ - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?)
ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొని 1994లో VRL పేరుతో కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇందులో 150కి పైగా ట్రక్కులు ఉన్నాయి. ఆ తరువాత 1996లో విజయానంద్ ట్రావెల్స్‌తో బస్సులను కూడా ప్రవేశపెట్టి సంస్థను మరింత విస్తరించాడు. ఇప్పుడు ఈ సంస్థ VRL లాజిస్టిక్స్ లిమిటెడ్‌గా ప్రసిద్ధి చెందింది.
(ఇదీ చదవండి: కొత్త కారులో షికారు కొడుతున్న రాఖీభాయ్ యష్ - ధర ఎంతో తెలుసా?)
విజయ్ సంకేశ్వర్ కొడుకు ఆనంద్ సంకేశ్వర్‌తో కలిసి వింగ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, ఎయిర్ చార్టర్ సర్వీస్ వంటి వాటికి కూడా నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ రూ. 6000 కోట్లకంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కలిగిన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ఈయన జీవితాన్ని విజయానంద్ అనే పేరుతో 2022లో కన్నడ చిత్రం కూడా తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment