VRL logistics
-
అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!
Vijay Sankeshwar Success Story: జీవితంలో విజయం సాధించాలంటే గొప్ప గొప్ప చదువులు చదివితే సరిపోదు.. ఉన్నతమైన ఆలోచనలు ఉన్నప్పుడే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు. కేవలం ఒక ట్రక్కుతో ప్రారంభమైన అతని ప్రయాణం ఈ రోజు కోట్లు గడించే స్థాయికి చేరింది. ఇంతకీ ఈ సక్సెస్ ఎవరు సాధించారు? ఎలా సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకలోనో ధార్వాడకు చెందిన 'విజయ్ సంకేశ్వర్' గురించి ఈ రోజు భారతదేశం మొత్తానికి తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో అతిపెద్ద వాణిజ్య వాహనాలకు యజమానిగా పేరు పొంది VRL లాజిస్టిక్స్ లిమిటెడ్ స్థాపించాడు. 1970లలో కేవలం ఒకే ట్రక్కుతో సొంత లాజిస్టిక్ కంపెనీ ప్రారంభించాలనుకున్నాడు. కానీ వారి కుటుంబం ప్రింటింగ్ ప్రెస్ వ్యాపార నేపద్యానికి చెందినది. (ఫాక్స్‌కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి? ) తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ప్రింటింగ్ ప్రెస్ కాదనుకున్న విజయ్ లాజిస్టిక్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. 1976లో అప్పుగా తీసుకున్న కొంత డబ్బుతో ఒక ట్రక్కు కొనుగోలు చేసాడు. ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించాడు. ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాడు. కానీ పట్టు వదలకుండా విజయం సాధించాలనే తపనతో ముందడుగు వేయడం మాత్రం ఆపలేదు. (ఇదీ చదవండి: రోజుకి 150 దాటుతున్న జిమ్నీ బుకింగ్స్ - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొని 1994లో VRL పేరుతో కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇందులో 150కి పైగా ట్రక్కులు ఉన్నాయి. ఆ తరువాత 1996లో విజయానంద్ ట్రావెల్స్తో బస్సులను కూడా ప్రవేశపెట్టి సంస్థను మరింత విస్తరించాడు. ఇప్పుడు ఈ సంస్థ VRL లాజిస్టిక్స్ లిమిటెడ్‌గా ప్రసిద్ధి చెందింది. (ఇదీ చదవండి: కొత్త కారులో షికారు కొడుతున్న రాఖీభాయ్ యష్ - ధర ఎంతో తెలుసా?) విజయ్ సంకేశ్వర్ కొడుకు ఆనంద్ సంకేశ్వర్తో కలిసి వింగ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, ఎయిర్ చార్టర్ సర్వీస్ వంటి వాటికి కూడా నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ రూ. 6000 కోట్లకంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కలిగిన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ఈయన జీవితాన్ని విజయానంద్ అనే పేరుతో 2022లో కన్నడ చిత్రం కూడా తెరకెక్కింది. -
వీఆర్ఎల్ వ్యవస్థాపకుడు విజయ్ శంకేశ్వర్ బయోపిక్‌గా ‘ ‘విజయానంద్’
దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్ కంపెనీల్లో ఒకటైన వీఆర్ఎల్ వ్యవస్థాపకుడు విజయ్ శంకేశ్వర్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘విజయానంద్’. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటించిన ఈ చిత్రానికి రిషికా శర్మ దర్శకత్వం వహించారు. ఆనంద్ శంకేశ్వర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీని డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘తన తండ్రిపై ఆధారపడకుండా విజయ్ శంకేశ్వర్ సొంత తెలివితేటలతో లారీల వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు? ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ ఓ పెద్ద లాజిస్టిక్ కంపెనీకి అధినేత ఎలా అయ్యారు? అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కీర్తన్. -
భారీ డీల్‌ను కైవసం చేసుకున్న టాటా మోటార్స్..!
కొద్ది రోజుల క్రితం కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కమర్షియల్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ నుంచి టాటా మోటార్స్ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది. 1300 కమర్షియల్ వాహనాల ఆర్డర్..! భారత్‌లో లాజిస్టిక్ సేవల్లో పేరుగాంచిన వీఆర్ఎల్ లాజిస్టిక్ కమర్షియల్ వెహికల్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకుగాను టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్‌ను ఇచ్చింది. సుమారు 1,300 వాణిజ్య వాహనాలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆర్డర్లో టాటా మోటార్స్ మీడియం & హెవీ కమర్షియల్ వెహికల్, ఇంటర్మీడియట్ & లైట్ కమర్షియల్ వెహికల్ శ్రేణికి చెందిన వాహనాలు ఉన్నాయి. వీటితో దేశ వ్యాప్తంగా లాజిస్టిక్స్ కార్యకలాపాలను చేసేందుకు సరిపోతాయని వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ అభిప్రాయపడింది. ఈ భారీ డీల్ సందర్భంగా టాటా మోటార్స్ సేల్స్ & మార్కెటింగ్ వీపీ రాజేష్ కౌల్ మాట్లాడుతూ...వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ నుంచి 1300 వాహనాల ప్రతిష్టాత్మకమైన ఆర్డర్‌ను పొందడం మాకు చాలా ఆనందంగా ఉందని, మా వాహనాలు వారి కార్యకలాపాలకు గొప్ప విలువను తెస్తాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. నెక్స్ట్ జెన్ సొల్యూషన్స్‌తో..! వాణిజ్య వాహనాల శ్రేణిలో ఫ్లీట్ ఎడ్జ్ అని పిలిచే టాటా మోటార్స్ నెక్స్ట్-జెన్ డిజిటల్ సొల్యూషన్ టాటా మోటార్స్ పరిచయం చేసింది. ఇది స్టాండర్డ్ ఫిట్మెంట్తో రానుంది. పలు ఫీచర్స్‌తో, యాజమాన్యం ఖర్చు తగ్గించేందుకు ఫ్లీట్ మేనేజ్మెంట్ ఉపయోగపడనుంది. అంతేకాకుండా ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఫుల్ ఫ్లెడ్జ్ సర్వీసెస్, రిపేర్ టైమ్ హామీ, బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, ఇన్సూరెన్స్ , యాక్సిడెంటల్ రిపేర్ టైమ్, ఎక్సెటెండెడ్ వారంటీతో పాటుగా ఇతర యాన్ ఆన్ సేవలతో అందిస్తోంది. చదవండి: కాచుకోండి.. వచ్చేస్తోంది టాటా గ్రూప్స్ యాప్..! -
విమానయాన రంగంలోకి మరో కంపెనీ
ముంబై: విమాన యాన రంగానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరో కంపెనీ దేశీయ విమానయాన రంగంలోకి అడుగు పెట్టనుంది. వీఆర్ఎల్ లాజిస్టిక్స్ కంపెనీ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. సంస్థ చైర్మన్ విజయ్ శంకేశ్వర్, ఎండీ ఆనంద్ శంకేశ్వర్‌లు.. బోర్డు డెరైక్టర్లకు రాసిన ఒక లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము రీజినల్ ఎయిర్‌లైన్ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదిస్తున్నా మని తెలియజేశారు. 1400 కోట్ల రూపాయలతో చాలా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టునున్నట్టు వెల్లడించిన ప్రమోటర్లు.... పెట్టుబడిదారులు, విశ్లేషకుల సలహాలకు భిన్నంగా తాము ముందుకుపోమని స్పష్టం చేశారు. కాగా గత ఏడాది ఏప్రిల్ లో ఐపీవో కి వచ్చిన వీఆర్ ఎల్ భారీ లాభాలను ఆర్జించింది. పరిశ్రమ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నామని, అలాగే అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. కొత్త ఎయిర్‌లైన్ ఏర్పాటు తమ అభిమతమని చెప్పారు. ప్రభుత్వ ఆమోదం, నియంత్రణ సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. వీఆర్‌ఎల్‌లో తమకున్న వాటాలో కొంత భాగాన్ని తగ్గించుకుంటామని చెప్పారు. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ కంపెనీ షేరు భారీగా కుప్పకూలింది. చివరికి ఎన్ఎస్ఈ 20 శాతం నష్టాలతో 315 దగ్గర లోయర్ సర్క్యూట్ అయింది. -
విమానయాన రంగంలోకి వీఆర్ఎల్ లాజిస్టిక్స్!
న్యూఢిల్లీ: ‘వీఆర్ఎల్ లాజిస్టిక్స్’ తాజాగా విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. కంపెనీ చైర్మన్ విజయ్ శంకేశ్వర్, ఎండీ ఆనంద్ శంకేశ్వర్‌లు బోర్డు డెరైక్టర్లకు రాసిన ఒక లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తాము రీజినల్ ఎయిర్‌లైన్ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదిస్తున్నామని తెలియజేశారు. పరిశ్రమ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నామని, అలాగే అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. కొత్త ఎయిర్‌లైన్ ఏర్పాటు తమ అభిమతమని, దీని ప్రారంభమనేది.. ప్రభుత్వ ఆమోదం, నియంత్రణ సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కొత్త వెంచర్ ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం కావాల్సివస్తే.. వీఆర్‌ఎల్‌లో తమకున్న వాటాలో కొంత భాగాన్ని తగ్గించుకుంటామని పేర్కొన్నారు. -
వీఆర్ఎల్ లాజిస్టిక్స్ మెరుపులు
43 శాతం వృద్ధితో రూ.294 వద్ద ముగింపు ముంబై: రవాణా, లాజిస్టిక్స్ కంపెనీ వీఆర్ఎల్ లాజిస్టిక్స స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపలు మెరిపించింది. ఇష్యూ ధర (రూ.205) కంటే అధికంగా రూ. 288 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. 281-309 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు43% లాభంతో రూ.293 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో కూడా 43% లాభంతో రూ. 294 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 71 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 2 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,676 కోట్లుగా ఉంది.