విమానయాన రంగంలోకి మరో కంపెనీ | VRL Logistics' Promoters Plan Regional Airline, Shares Crash 20 percent | Sakshi
Sakshi News home page

విమానయాన రంగంలోకి మరో కంపెనీ

Published Tue, May 24 2016 2:28 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

విమానయాన రంగంలోకి మరో కంపెనీ

విమానయాన రంగంలోకి మరో కంపెనీ

ముంబై: విమాన యాన రంగానికి  ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరో కంపెనీ దేశీయ విమానయాన రంగంలోకి అడుగు పెట్టనుంది.  వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ కంపెనీ  సోమవారం  ఈ విషయాన్ని ప్రకటించింది. సంస్థ చైర్మన్ విజయ్ శంకేశ్వర్, ఎండీ ఆనంద్ శంకేశ్వర్‌లు.. బోర్డు డెరైక్టర్లకు రాసిన ఒక లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము రీజినల్ ఎయిర్‌లైన్ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదిస్తున్నా మని తెలియజేశారు. 1400 కోట్ల  రూపాయలతో చాలా చిన్న  మొత్తంలో పెట్టుబడులు పెట్టునున్నట్టు  వెల్లడించిన ప్రమోటర్లు.... పెట్టుబడిదారులు, విశ్లేషకుల సలహాలకు భిన్నంగా తాము   ముందుకుపోమని   స్పష్టం చేశారు.  కాగా గత  ఏడాది  ఏప్రిల్ లో ఐపీవో కి వచ్చిన  వీఆర్ ఎల్  భారీ లాభాలను ఆర్జించింది.

పరిశ్రమ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నామని, అలాగే అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. కొత్త ఎయిర్‌లైన్ ఏర్పాటు తమ అభిమతమని చెప్పారు. ప్రభుత్వ ఆమోదం, నియంత్రణ సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. వీఆర్‌ఎల్‌లో తమకున్న వాటాలో కొంత భాగాన్ని తగ్గించుకుంటామని  చెప్పారు. దీంతో  మంగళవారం నాటి మార్కెట్లో  ఈ కంపెనీ షేరు  భారీగా కుప్పకూలింది.  చివరికి ఎన్ఎస్ఈ  20 శాతం నష్టాలతో  315 దగ్గర లోయర్ సర్క్యూట్ అయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement