విమానయాన రంగంలోకి వీఆర్ఎల్ లాజిస్టిక్స్! | VRL Logistics promoters plan to start regional airline | Sakshi
Sakshi News home page

విమానయాన రంగంలోకి వీఆర్ఎల్ లాజిస్టిక్స్!

Published Tue, May 24 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

విమానయాన రంగంలోకి వీఆర్ఎల్ లాజిస్టిక్స్!

విమానయాన రంగంలోకి వీఆర్ఎల్ లాజిస్టిక్స్!

న్యూఢిల్లీ: ‘వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్’ తాజాగా విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. కంపెనీ చైర్మన్ విజయ్ శంకేశ్వర్, ఎండీ ఆనంద్ శంకేశ్వర్‌లు బోర్డు డెరైక్టర్లకు రాసిన ఒక లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు.  ప్రస్తుతం తాము రీజినల్ ఎయిర్‌లైన్ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదిస్తున్నామని తెలియజేశారు. పరిశ్రమ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నామని, అలాగే అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. కొత్త ఎయిర్‌లైన్ ఏర్పాటు తమ అభిమతమని, దీని ప్రారంభమనేది.. ప్రభుత్వ ఆమోదం, నియంత్రణ సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కొత్త వెంచర్ ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం కావాల్సివస్తే.. వీఆర్‌ఎల్‌లో తమకున్న వాటాలో కొంత భాగాన్ని తగ్గించుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement