aviation sector
-
సైనిక విమాన తయారీకి ఊపు
మూడేళ్ల క్రితం యూరప్ కంపెనీ ‘ఎయిర్‌బస్’తో 56 సి–295 రవాణా విమానాలను కొనడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 16 స్పెయిన్‌లో తయారవుతాయి, మిగతా 40 ఇండియాలో ‘టాటా’(టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. సైనిక రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం ఉపాధికి కూడా తోడ్పడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద తొలి సి–295 విమానం 2026లో అందుబాటులోకి రానుంది. మొత్తం 40 విమానాలను 2031కల్లా అందించడం ద్వారా టీఏఎస్ఎల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.భారత వైమానిక దళానికి చెందిన పాత అవ్రో విమానాల స్థానంలో 56 సి–295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ లో రూ. 21,935 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. ‘ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లెలో దాని తుది అసెంబ్లింగ్ (విడిభాగాల కూర్పు) కేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉంది. మిగతా 40 విమానాలను భారత్, స్పెయిన్ కుదుర్చుకున్న పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. భారత్‌లో రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్ 30న గుజరాత్‌లోని వడోదరలో టీఏఎస్ఎల్ చివరి దశ విడిభాగాల కూర్పు సదుపాయానికి శంకు స్థాపన చేశారు. అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధురీకి 2023 సెప్టెంబర్ 13న స్పెయిన్‌లోని సెవిల్లెలో తొలి విమానాన్ని అందజేశారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ విమానం 2023 సెప్టెంబర్ 25న హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరింది. ‘రైనోస్’ అని కూడా పిలిచే ఐఏఎఫ్ 11 స్క్వాడ్రన్ ఇప్పటికే ఆరు సి–295 విమానాలను నడుపుతోంది.తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీసి–295 బహుళ ప్రాయోజక సైనిక రవాణా విమానంగా రుజువు చేసుకుంది. 9.5 టన్నుల పేలోడ్, 70 మంది ప్రయాణికులు లేదా 49 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శక్తిని గణనీయంగా పెంచింది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైమానిక దళాలు ఉప యోగిస్తున్నాయి. ఇంకా పలు సామర్థ్యాలు ఎయిర్‌బస్ సి–295 సొంతం. సైనిక రవాణా, ఆకాశమార్గంలో రవాణా, పారాట్రూపింగ్, వైద్య సహాయం కోసం తరలింపు, సముద్రప్రాంత గస్తీ, జలాంత ర్గాములను ఎదుర్కొనే యుద్ధ పరికరాలు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు పహారా, వాటర్ బాంబర్, గాలి పరంగా ముందస్తు హెచ్చరి కలు వంటి విస్తృత శ్రేణి మిషన్ లలో ఇది సమర్థంగా పని చేస్తుంది.స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం. మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసే తొలి సి–295 విమానం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది. చివరి విమానం 2031 ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ దేశంలో విమాన రంగ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్ఎంఈలు విమానాల విడి భాగాలను అందిస్తాయి. ఇప్పటికే 33 ఎంఎస్ఎంఈలను ఎయిర్‌బస్ గుర్తించింది. హైదరాబాద్‌లోని టీఏఎస్ఎల్ ప్రధాన కేంద్రంలో విమా నాల విడిభాగాల తయారీ ప్రారంభమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను ఇప్పటికే విమానంలో అనుసంధానం చేశారు. అయితే, ఒప్పంద చర్చల తుది దశలో ఎక్కువ కాలం జాప్యం కావడంతో వీటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. పెరిగే ఉపాధి కల్పనతాజా ప్రయత్నం వైమానిక రంగంలో ఉపాధి కల్పనను పెంచు తుందని రక్షణ శాఖ చెబుతోంది. దేశంలో ఏరోస్పేస్, రక్షణ రంగంలో 42.5 లక్షలకు పైగా పనిగంటలతో ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు, 3,000కు పైగా పరోక్ష ఉద్యోగాలకు, అదనంగా 3,000 మధ్యతరహా నైపుణ్య ఉపాధి అవకా శాలకు వీలు కలుగుతుంది. ఇతర ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ దారుల (ఓఈఎం) నుంచి ఎయిర్‌బస్ తెప్పించే ఏరో ఇంజిన్, ఏవి యానిక్స్ మినహా అధిక శాతం నిర్మాణ భాగాలు భారత్‌లోనే తయారవుతాయి. ఒక విమానంలో ఉపయోగించే 14,000 విడి భాగాలలో 13,000 భాగాలు దేశంలోని ముడిసరుకుతోనే తయారవుతాయి. అయితే టీఏఎస్ఎల్ సకాలంలో 40 విమానాలను తయారు చేయడమే అసలైన పరీక్ష. ఇప్పటివరకు చాలా కార్యకలాపాలు ఎయిర్‌బస్ ద్వారా జరుగుతున్నాయి. టీఏఎస్ఎల్ కేవలం వాటిని అమలు చేస్తోంది. భారత వైమానిక రంగ సుస్థిర వృద్ధి కోసం స్థానిక ఉత్పత్తి, డీజీ ఏక్యూఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎష్యూరెన్స్) ద్వారా నాణ్యత నియంత్రణ, ‘సెమిలాక్’ ద్వారా భవిష్యత్తు ధ్రువీకరణ, దేశీయ తనిఖీ పరీక్షలు, మూల్యాంకనంపై దృష్టి సారించాలి.రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదగడానికి గత పదేళ్లలో భారత ప్రభుత్వం చేసిన కృషి దోహదపడింది. రూ. 43,726 కోట్ల నుంచి రూ. 1,27,265 కోట్లకు పెరిగిన రక్షణ ఉత్పత్తుల్లో 21 శాతం వాటా ప్రైవేటు రంగానిదే. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమ తులు గత ఏడాది రూ. 21,000 కోట్లకు పైగా పెరిగాయి. కొన్ని విధాన సంస్కరణలతో పాటు మూలధన పరికరాల కొనుగోలు కోసం డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్ – 2020లో స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐడీడీఎం) కేటగిరీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ గణాంకాలను సాధించడానికి దోహదపడింది. కొత్తగా కేటాయించిన రక్షణ బడ్జెట్లో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల ద్వారా కొనుగోళ్లకు కేటాయించారు. జాయింట్ యాక్షన్ (శ్రీజన్) పోర్టల్ ద్వారా స్వయం సమృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, సానుకూల స్వదేశీకరణ జాబితాలు (పీఐఎల్), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడీఈఎక్స్) ఏర్పాటు, 2024 సెప్టెంబర్ నాటికి రూ. 50,083 కోట్ల పెట్టుబడి అంచనాతో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి అనేక ఇతర చర్యలను ప్రభుత్వం తీసుకుంది. 2013 మేలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేసిన తరువాత ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చు కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆరేళ్ళు పట్టింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి, ఒప్పందం తదుపరి చర్చలకు ఇంకా చాలా చేయాల్సి ఉంది.దేశంలో సి –295 సైనిక రవాణా విమానాల ఉమ్మడి తయారీలో ఎయిర్‌బస్ – టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భాగ స్వామ్యం ఇప్పటివరకు సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక రంగానికి ఆశ, ప్రేరణగా నిలుస్తోంది. అయితే సివిల్ సర్టిఫైడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ఎయిర్ క్రాఫ్ట్ వెర్షన్లను టీఏఎస్ఎల్ విస్తరిస్తుందో లేదో చూడాలి. ఈ భాగస్వామ్యం పూర్తి ప్రయోజనాలను పొందడానికి దేశంలో ఉత్పత్తి, భవిష్యత్తు ఎగుమ తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భరత సాధన దిశగా భవిష్యత్ ప్రయాణం క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఎయిర్‌బస్, టీఏ ఎస్ఎల్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా అడుగులు ముందుకు పడ్డాయి. టీఏఎస్ఎల్ నిర్ణీత సమయానికి 40 విమానాలను తయారు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ తరహా భాగస్వామ్యాల విషయంలో ప్రభుత్వ రంగం ఐఏఎఫ్ అంచనాలను అందుకోలేదన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠం. మరి ఈ ఒప్పందం సఫలమైతే దేశంలో ప్రైవేట్ రంగ భాగ స్వామ్యం మరింత ప్రబలమవుతుంది. వాటి సహకారం లేకుండా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కల నెరవేరదు.అనిల్ గోలానిఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్అడిషనల్ డైరెక్టర్ జనరల్ -
సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం?
యూరప్ అవతల తొలిసారిగా విదేశంలో తయారవుతున్న సీ295 రకం విమానం ఇప్పుడు భారత రక్షణ విమానయాన రంగంలో కొత్త చర్చకు తెరలేపింది. విదేశీ విమానాల తయారీ యూనిట్ ఆరంభంతో దేశీయంగా విమానయాన రంగం రూపురేఖలు మారే వీలుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. త్రివిధ దళాల సన్నద్ధతనూ ఈ విమానాలు మెరుగు పరుస్తాయని చెబుతున్నారు.మెరుపు స్థాయిలో మోహరింపు కొత్త విమానాల రాకతో భారత సైన్యం సన్నద్ధత స్థాయి పెరగనుంది. యుద్ధ సామగ్రి ఉపకరణాలతోపాటు సైన్యాన్ని సైతం వేగంగా అనుకున్న చోటికి తరలించవచ్చు. దీంతోపాటు సరకులను తీసుకెళ్లవచ్చు. విపత్తుల వేళ వైద్యసాయం కోసం మెడికల్ పరికరాలు, ఔషధాలనూ తరలించవచ్చు. తీరగస్తీ విధుల్లోనూ వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాలం చెల్లిన సోవియట్ ఆంటోనోవ్ ఏఎన్–32, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఏవిరో748 విమానాల స్థానంలో వీటిని వినియోగంలోకి తెస్తారు. అధునాతన సాంకేతికతలనూ దీనికి జోడించే వెసులుబాటు ఉందని రక్షణరంగ నిపుణులు కునాల్ బిశ్వాస్ చెప్పారు. పర్వతమయ చైనా, భారత్ సరిహద్దు వెంట అత్యవసరంగా సైనికులను దింపేందుకు వీలుగా చిన్నపాటి స్థలంలోనూ దీనిని ల్యాండ్ చేయొచ్చు. టేకాఫ్‌కు తక్కువ పొడవైన రన్‌వే ఉన్నా సరిపోతుంది. గంటలకు 482 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. తొమ్మిది టన్నుల బరువులను మోయగలదు. 71 మంది సాధారణ సైనికులను లేదంటే బరువైన ఆయుధాలున్న సాయుధ పారాట్రూప్ సైనికులు 48 మందిని ఒకేసారి తీసుకెళ్లగలదు. దీంతో వాయుసేన సన్నద్థత మెరుగుపడనుంది. జంట టర్బో ఇంజన్లుండే ఈ విమానం ద్వారా గాల్లోంచే సరకులను కిందకు దింపొచ్చు. ఎల్రక్టానిక్ సిగ్నల్ నిఘా, వేగంగా ఇంధనం నింపుకునే సామర్థ్యం ఇలా పలు ప్రత్యేకతలు దీని సొంతం. భారత రక్షణరంగంలో బహుళార్థ ప్రయోజనకారిగా ఈ విమానం పేరొందనుంది. మేక్ ఇన్ ఇండియాకు ఊతంరక్షణ రంగ ఉపకరణాల విడిభాగాలను దేశీయంగా తయారుచేసి ఈ రంగంలో స్వావలంభన సాధించాలనుకున్న మోదీ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడనుంది. దిగుమతులు భారం తగ్గడంతో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భరత భారత్’ఆశయాలు ఈ ప్రాజెక్ట్‌తో మరింతగా సాకారం కానున్నాయి. అన్ని విడిభాగాలు ఇక్కడే తయారుచేసి అసెంబ్లింగ్ చేసి 2026 సెపె్టంబర్‌కల్లా తొలి విమానాన్ని తయారుచేయనున్నారు. ఒప్పందంలో భాగంగా 56 విమానాలు భారత్‌కు అందాల్సి ఉండగా 16 విమానాలను స్పెయిన్‌లోనే తయారుచేసి పంపిస్తారు. మిగతా 40 విమానాలను వడోదరలోని నూతన కర్మాగారంలో అసెంబ్లింగ్ చేస్తారు. సీ295 విమానానికి సంబంధించిన ముఖ్యమైన విడిభాగాల తయారీ హైదరాబాద్‌లో జరగనుంది. అక్కడి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మెయిన్ కాంపోనెంట్స్ అసెంబ్లీ యూనిట్లో వీటిని చిన్న భాగాలను జతచేస్తారు. తర్వాత పెద్ద భాగాలను వడోదరలో అసెంబ్లింగ్ చేసి పూర్తి విమానాన్ని తయారుచేస్తారు. ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల వృద్ధి ఏరోస్పేస్ మౌలికవసతుల విభాగంలో శిక్షణ, నిర్వాహణ వ్యవస్థలూ విస్తరించనున్నాయి. ఈ విమానాలను నడిపేందుకు, రిపేర్, మెయింటెనెన్స్ వంటి పనులకు వాయుసేనలో అదనపు సిబ్బంది అవసరమవుతారు. దీంతో అదనపు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వాడుతున్న విమానాలకు నిర్వహణ, విడిభాగాల తయారీ, సరఫరా గొలుసు వంటి ఇతరత్రా విభాగాలూ విస్తరించనున్నాయి. ఈ మొత్తం వ్యవస్థల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో స్టిక్ హోల్డింగ్ విభాగం, ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శిక్షణాకేంద్రాన్ని కొత్తగా నెలకొల్పనున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఎయిర్‌బస్, బోయింగ్, ఏటీఆర్సహా ప్రభుత్వరంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు తోడుగా టాటా వారి సంస్థలూ ఈ రంగంలో మరింతగా విస్తరించనున్నాయి. ఎగుమతులకూ ప్రోత్సాహం దేశీయ అవసరాలకు తీరాక అదనపు ఉత్పత్తుల ఎగుమతికీ ఈ ప్రాజెక్ట్ బాటలు వేయనుంది. సైనిక, సరకు రవాణా విమానాల తయారీకి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ అనుకున్నదానికంటే బాగా విజయవంతమైతే భవిష్యత్తులో పౌరవిమానాల తయారీ చేపట్టే వీలుంది. అప్పుడిక వేల కోట్లు ఖర్చు పెట్టి విదేశీ విమానాలను కొనుగోలుచేసే బదులు దేశీయంగానే పౌరవిమానాలను తయారుచేయొచ్చు. తయారీ ఖర్చు సైతం గణనీయంగా తగ్గనుంది. భారతీయ ఏవియేషన్ రంగంలో ఆత్మనిర్భరతకు హామీ ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ మరిన్ని కొత్త ప్రాజెక్టుల రాకపై ఆశలు పెంచుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరగనున్న ఉపాధి అవకాశాలుఇన్నాళ్లూ హైదరాబాద్, బెల్గామ్, బెంగళూరులకే అధికంగా పరిమితమైన ఏరోస్పేస్ పరిశ్రమ కొత్త ప్రాజెక్ట్ కారణంగా వడోదరలో విస్తరించనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇది ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. ఒక్కో విమానం తయారీకి 10 లక్షల పని గంటల సమయం పట్టనుంది. అంటే ఆమేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి వేలాది మందికి పని దొరుకుతుంది. -
రక్షణ రంగంలో కొత్త అధ్యాయం
వడోడర: భారత ప్రైవేట్ రక్షణ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత్‌లోనే తొలి ప్రైవేట్ సైనిక, సరకు రవాణా విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు గుజరాత్‌లోని వడోదర పట్టణంలోని టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వేదికైంది. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి భారత ప్రధాని మోదీ సోమవారం ఈ ప్లాంట్‌లో సీ295 రకం సైనిక రవాణా విమాన తయారీని ప్రారంభించారు. అక్కడి విడిభాగాల ఎగ్జిబిషన్‌ను ఇరునేతలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంచేయడమే కాకుండా మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. కొత్త ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచి్చన ఎయిర్‌బస్, టాటా బృందాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్‌లో విదేశీ సరకు రవాణా విమానం తయారీ కలను సాకారం చేసిన వ్యాపార జగజ్జేత రతన్ టాటాకు ఘన నివాళులు’’ అని అన్నారు. కొత్త పని సంస్కృతికి నిదర్శనం ‘‘ నూతన భారత దేశ కొత్తతరహా పని సంస్కృతికి సీ295 ఫ్యాక్టరీ ప్రతిబింబింగా నిలవనుంది. 2022 అక్టోబర్‌లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటినుంచి ఉత్పత్తిదాకా భారత వేగవంతమైన ఉత్పాదకతకు నిదర్శనం ఈ కర్మాగారం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత స్పానిష్ రచయిత ఆంటోనియో మకాడో కవితలోని ‘మనం లక్ష్యం సాధించేందుకు ముందుకెళ్తుంటే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది’ అనే వాక్యాన్ని మోదీ గుర్తుచేశారు. ‘‘కొత్తగా మొదలైన టాటా–ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశీయంగా 18,000 విమాన విడిభాగాల తయారీని ఈ ఫ్యాక్టరీ సుసాధ్యం చేయనుంది. భవిష్యత్తులో భారత పౌరవిమానయాన రంగానికి అవసరమైన విమానాల తయారీకి ఈ ఫ్యాక్టరీ బాటలువేస్తోంది’’ అని మోదీ అన్నారు.స్పెయిన్‌లో యోగా, ఇండియాలో ఫుట్‌బాల్ ‘‘ఇరుదేశాల ప్రజల మధ్య బంధమే దేశాల మధ్య బంధాన్ని బలీయం చేస్తోంది. యోగా స్పెయిన్‌లో తెగ పాపులర్. ఇక స్పానిష్ ఫుట్‌బాల్‌ను భారతీయులూ బాగా ఇష్టపడతారు. ఆదివారం రియల్ మాడ్రిడ్‌తో మ్యాచ్ లో బార్సిలోనా బృందం సాధించిన ఘనవిజయం గురించి భారత్‌లోనూ తెగ చర్చ జరుగుతోంది. ఆహారం, సినిమా లు, ఫుట్‌బాల్.. ఇలా ప్రజల మధ్య బంధం దేశాల మధ్య పటిష్ట బంధానికి కారణం. 2026 ఏడాదిని ‘ఇండియా–స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం, ఏఐ’గా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం సంతోషకరం’’ అని మోదీ అన్నారు.బంధం బలీయం: స్పెయిన్ అధ్యక్షుడు ‘‘1960లలోనే ప్రఖ్యాత స్పెయిన్ క్లాసిక్, జాజ్ సంగీత కళాకారుడు పాకో డిలూసియా, భారతీయ సంగీత దిగ్గజం పండిత్ రవిశంకర్ రెండు దేశాల సంగీత ప్రియులను ఒక్కటి చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, స్నేహబంధాలకు ఈ ఫ్యాక్టరీ గుర్తుగా నిలుస్తుంది’ అని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అన్నారు.40 విమానాల తయారీ ఇక్కడే ఎయిర్‌బస్ సీ295 రకం మధ్యశ్రేణి రవాణా విమానాన్ని తొలుత స్పెయిన్‌కు చెందిన సీఏఎస్ఏ ఏరోస్పేస్ సంస్థ డిజైన్చేసి తయారుచేసేది. ప్రస్తుతం ఇది యూరప్ బహుళజాతి ఎయిర్‌బస్ సంస్థలో భాగంగా ఉంది. యుద్ధంలో బాంబులతోపాటు అవసరమైన సందర్భాల్లో వైద్య పరికరాలు, విపత్తుల వేళ బాధితుల తరలింపునకు, తీరప్రాంతాల్లో గస్తీ, నిఘా కోసం సైతం పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎయిర్‌బస్ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తంగా సీ295 రకం 56 విమానాలను సైన్యానికి అప్పగించనున్నారు. వీటిలో 16 విమానాలను స్పెయిన్‌లోని సవీలేలో తయారుచేసి ఎయిర్‌బస్ నేరుగా నాలుగేళ్లలోపు భారత్‌కు పంపనుంది. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వారి ఆధ్వర్యంలో వడోదరలోని తయారీయూనిట్లో తయారుచేస్తారు. -
ఏపీ నుంచే నేరుగా విదేశాలకు..
సాక్షి, న్యూఢిల్లీ: ఇకపై విదేశాలకు వెళ్లేవారు హైదరాబాద్‌తో సంబంధం లేకుండా ఏపీ నుంచే నేరుగా వెళ్లేలా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన అవసరమన్నారు. రాష్ట్ర విమానయాన రంగంపై ఢిల్లీలోని ఏపీ భవన్లో ‘ఆంధ్రప్రదేశ్–విమానయానం ద్వారా కనెక్టివిటీ’ అనే అంశంపై లవ్ అగర్వాల్ అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ సెక్రటరీ యువరాజ్, ఏపీ భవన్ అడిషినల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలు ఎయిర్ పోర్టుల డైరెక్టర్లు, వివిధ ప్రైవేటు విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈసందర్భంగా లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఏపీలోని వివిధ పట్టణాల మధ్య విమాన సర్వీసులను పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవాణా సదుపాయాల్ని కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమానయాన సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ‘ఈజ్ ఆఫ్ ట్రావెల్’ ద్వారానే సాధ్యం విమానయానం ద్వారా ఈశాన్య భారతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తున్నప్పుడు.. ఆ సౌకర్యాలు ఏపీకి ఎందుకు కల్పించలేకపోతున్నారని ఎయిర్‌పోర్టు డైరెక్టర్లను అగర్వాల్ ప్రశ్నించారు. ‘ఈజ్ ఆఫ్ ట్రావెల్’ ద్వారానే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణాల మధ్య, రాష్ట్ర పట్టణాలకు దేశంలోని ఇతర పట్టణాలతో కనెక్టివిటీని పెంచేందుకు తోడ్పాటు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా విశాఖ నుండి రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు, సమీప నగరాలైన భువనేశ్వర్, కలకత్తాలకు సర్వీసులు అవసరమన్నారు. వీటితో పాటు థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాలకు విమాన సర్వీసులను నడపాల్సిన అవసరం ఉందని వివరించారు. సుమారు రెండు కోట్ల మంది తమ విమాన ప్రయాణం కోసం విశాఖపట్నం విమానాశ్రయంపై ఆదారపడుతున్నారని చెప్పారు. మరోపక్క తిరుమలకు ప్రతిరోజూ వచ్చే లక్ష మంది భక్తులకు విమాన సర్వీసును అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. 3 కారిడార్లు గల ఏకైక రాష్ట్రం ఏపీనే దేశంలో మూడు పారిశ్రామిక కారిడార్లు గల ఏకైక రాష్ట్రం ఏపీనే అని వాణిజ్య శాఖ సెక్రటరీ ఎన్.యువరాజ్ తెలిపారు. దేశంలో రెండవ పొడవైన సముద్ర తీర ప్రాంతం గల ఏపీకి విస్తృత అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా నుండి ప్రజలు అధిక సంఖ్యలో వారణాసికి వెళుతుంటారని, వారి సౌకర్యార్థం వారణాసికి విమాన సర్వీసులను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. -
భారత కాంప్లియన్స్ రేటింగ్‌కు కోత
న్యూఢిల్లీ: విమానాల లీజుకు సంబంధించి అంతర్జాతీయ చట్టం నింధనల అమలులో భారత్ రేటింగ్‌కు ‘ది ఏవియేషన్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ)’ కోత పెట్టింది. భారత్‌కు నెగెటివ్ అవుట్‌లుక్ ఇచి్చంది. సీటీసీ కాంప్లియెన్స్ ఇండెక్స్‌లో భారత్ స్కోరును 3.5 నుంచి 2కు తగ్గించింది. సంక్షోభంలో పడిన గోఫస్ట్ ఎయిర్‌లైన్ నుంచి లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకునే విషయంలో న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏడబ్ల్యూజీ అనేది లాభాపేక్ష రహిత చట్టబద్ధ సంస్థ. ఇందులో విమానాల తయారీదారులు, లీజింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సభ్యులుగా ఉన్నాయి. కేప్‌టౌన్ కన్వెన్షన్ కింద విమానయాన సంస్థలకు లీజుకు ఇచి్చన విమానాలను అద్దెదారులు వెనక్కి తీసుకోవచ్చు. కానీ, గోఫస్ట్ విషయంలో లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దివాల పరిష్కార ప్రక్రియ కిందకు వెళ్లడంతో మారటోరియం అమలవుతోంది. లీజుదారులకు సీటీసీ పరిష్కారాలు అందుబాటులో లేవని లేదా లీజుకు ఇచి్చన ఎయిర్‌క్రాఫ్ట్‌లను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉన్నట్టు ఏడబ్ల్యూజీ పేర్కొంది. ‘‘గోఫస్ట్ దివాలా పరిష్కార చర్యలు ఆరంభించి 130 రోజులు అవుతోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ అమలు చేయాల్సిన గడువు కంటే ఇది రెట్టింపు’’అని ఏడబ్ల్యూజీ తన ప్రకటనలో పేర్కొంది. భారత్ సీటీసీపై సంతకం చేసినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం. -
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు అప్..
వ్యవసాయానికి డిమాండ్ పెరగడం, వేసవి ప్రారంభంతో వాహన ఎయిర్ కండిషనింగ్ అవసరం వంటి అంశాలతో భారత్‌లో మేనెల పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పెరిగాయని తాజా గణాంకాలు తెలిపాయి. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం– డీజిల్‌కు డిమాండ్ ( మొత్తం డిమాండ్‌లో ఐదింట రెండు వంతుల వాటా) గత ఏడాది మేతో పోలిస్తే మేలో 9.3 శాతం పెరిగి 7.46 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఏప్రిల్‌లో డిమాండ్ పెరుగుదల 6.7 శాతం. ► నెలవారీగా చూస్తే డీజిల్ డిమాండ్ ఏప్రిల్‌లో 7.16 మిలియన్ టన్నులుకాగా, మేలో 4.2 శాతం పెరుగుదలతో 7.46 మిలియన్ టన్నులకు చేరింది. ► ఇక పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా 10.4 శాతం పురోగతితో 3.08 మిలియన్ టన్నులకు చేరింది. నెలవారీగా చూస్తే డిమాండ్ 16.5 శాతం పెరిగింది. ► పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చి ద్వితీయార్థం నుంచి పెట్రోలు, డీజిల్ విక్రయాలు పెరిగాయి. మార్చి ప్రథమార్థంలో వార్షిక ప్రాతిపదికన పెట్రోల్ విక్రయాలు 1.4 శాతం, డీజిల్ 10.2 శాతం తగ్గాయి. ► ఉష్ణోగ్రత పెరుగుదలతో ఎయిర్ కండిషనింగ్ అవసరాలు పెరగడమూ మేలో వినియోగం పెరగడానికి ఒక కారణం. ► రబీ పంటలు– ఎక్కువగా గోధుమలు, బార్లీ, ఆవాలు, నువ్వులు, పెసల పంటకాలం అక్టోబర్–డిసెంబర్ మధ్య ప్రారంభమవుతుంది. నూర్పిడికాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. హార్వెస్టింగ్, ట్రాక్టర్ల అవసరాలు డీజిల్ డిమాండ్ పెరుగుదలకు దారితీస్తుంది. ► కోవిడ్ సంక్షోభంలో ఉన్న 2021మే నెలతో పోల్చితే పెట్రోల్ వినియోగం తాజా సమీక్షా నెల్లో 72 శాతం పెరిగింది. మహమ్మారి ముందు 2019 మే నెలతో పోల్చితే 23.7 శాతం ఎగసింది. ► మే 2021తో పోల్చితే డీజిల్ వినియోగం 52.5 శాతం, మే 2019తో పోల్చితే 6.8 శాతం ఎగశాయి. పరిశ్రమ మాట.. ప్రభుత్వ, ప్రైవేట్ మూలధన వ్యయం పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది. సేవల రంగం పటిష్టంగా ఉండగా తయారీ రంగం కూడా పుంజుకుంది. దేశంలో చమురు డిమాండ్‌కు బలమైన పారిశ్రామిక కార్యకలాపాలు మద్దతునిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో డిమాండ్ పుంజుకోవడం ఇంధన డిమాండ్‌కు మద్దతు నిస్తోంది. నీటిపారుదల విభాగంలో పైపుల వినియోగం ఇంధన డిమాండ్‌కు కారణంగా ఉన్న మరో కీలక అంశం. జెట్ ఫ్యూయల్‌కు డిమాండ్ ఏవియేషన్ రంగం నిరంతర సేవల పునఃప్రారంభంతో విమానాశ్రయాలలో భారత్ మొత్తం ప్రయాణీకుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో జెట్ ఫ్యూయెల్ డిమాండ్ మే నెల్లో 2022 ఇదే నెల్లో పోల్చితే 8.7 శాతం పెరిగి 6,09,800 టన్నులకు ఎగసింది. 2021 మేతో పోల్చితే 137 శాతం పెరిగింది. అయితే కోవిడ్ ముందస్తు విషయానికి వస్తే, 2019 మేనెలతో పోల్చితే 5.3% తక్కువగానే నమోదయ్యింది. అలాగే ఏప్రిల్ 2023తో (6,13,900 టన్నులు) పోల్చినా డిమాండ్ 0.7% తక్కువగానే ఉంది. వంట గ్యాస్ అమ్మకాలూ అప్ మరోవైపు వంట గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు వార్షికంగా మేలో 10% పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరింది. ఎల్పీజీ వినియోగం 2021 మేతో పోల్చితే 13%, కోవిడ్ ముందస్తు కాలం 2019 మేతో పోల్చితే 19.6 % ఎగసింది. నెలవారీ డిమాండ్ చూసి నా (2023 ఏప్రిల్) మేనెల్లో ఎల్పీజీ డిమాండ్ 11.3 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో డిమాండ్ 2.19 మిలియన్ టన్నులు. -
చైనా స్వదేశీ విమానం సక్సెస్
బీజింగ్: చైనా మొట్టమొదటి సారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల విమానం సీ919 ఆదివారం విజయవంతంగా ప్రయాణించింది. విమానయాన రంగం మార్కెట్లోకి డ్రాగన్ దేశం అధికారికంగా ప్రవేశించింది. పశ్చిమదేశాలకు చెందిన బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలతో పోటీ పడేలా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాన్ని తయారు చేసింది. తొలిసారిగా షాంఘై నుంచి బీజింగ్‌కు వెళ్లిన ఈ విమానం రెండున్నర గంటల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. -
కలసిరాని విమానయాన రంగం .. ఏడాదికో ఎయిర్‌లైన్స్ కనుమరుగు
న్యూఢిల్లీ/ముంబై: దేశ విమానయాన రంగం ఎయిర్‌లైన్స్ సంస్థలకు కలసిరావడం లేదు. దీనికి నిదర్శనంగా గడిచిన మూడు దశాబ్దాల కాలంలో 27 సంస్థలు కనుమరుగయ్యాయి. 1994లో మొదటిసారి దేశంలో ప్రైవేటు విమానయాన సంస్థలు (ఎయిర్‌లైన్స్ కంపెనీలు) కార్యకలాపాల నిర్వహణకు అనుమతించారు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 1996లో తొలి వికెట్ పడింది. ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ 1996 నవంబర్‌లో కార్యకలాపాలను (ఆరంభించిన రెండేళ్లకు) మూసివేసింది. అదే ఏడాది మోడిలుఫ్త్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఇలా మొత్తం మీద 27 సంస్థలు (సగటున ఏడాదికొకటి) వ్యాపార కార్యకలాపాలను మూసివేయడం, దివాలా తీయడం లేదా ఇతర సంస్థల్లో విలీనం కావడం, కొనుగోళ్లతో కనుమరుగు కావడం చోటు చేసుకుంది. కరోనా రాక ముందు 2019లోనూ జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దివాలా పరిష్కారంలో భాగంగా ఓ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకున్నప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. అదే ఏడాది జెట్‌లైట్ (సహారా ఎయిర్‌లైన్స్) కూడా మూతపడింది. జూమ్ ఎయిర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించే జెక్సస్ ఎయిర్ సర్విసెస్, డెక్కన్ చార్టర్డ్ ప్రైవేటు లిమిటెడ్, ఎయిర్ ఒడిశా ఏవియేషన్ 2020లో మూసివేయగా, 2022లో హెరిటేజ్ ఏవియేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 17 ఏళ్లకు గో ఫస్ట్ 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొన్ని నెలల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా పాక్షిక సర్విసులకే పరిమితమయ్యాయి. దీని కారణంగా ఎయిర్‌లైన్స్ సంస్థలకు నష్టాలు పెరిగాయి. ఆ తర్వాత డిమాండ్ అనూహ్యంగా పుంజుకున్నప్పటికీ, గో ఫస్ట్ సంస్థకు చెందిన సగం విమానాలు ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్లలో సమస్యలతో పార్కింగ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో సగం సర్విసులనే నడుపుతూ చివరికి కార్యకలాపాలు మొదలు పెట్టిన 17 ఏళ్ల తర్వాత గో ఫస్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. జెట్ ఎయిర్వేస్ తర్వాత దివాలా పరిష్కారం కోసం ఎన్సీఎల్టీకి ముందుకు వెళ్లిన రెండో సంస్థ ఇది. 2012లో కింగ్‌ఫిషర్ ప్రముఖ సంస్థగా పేరొంది, పెద్ద ఎత్తున విమానయాన కార్యకలాపాలు నిర్వహించిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 50 విమానాలతో వందలాది సర్విసులు నిర్వహిస్తూ, ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ సంస్థ 2012లో మూతపడడంతో బ్యాంకులకు రూ.9,000 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది. డిమాండ్‌కు తక్కువేమీ లేదు ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంటే, మరోవైపు ఒక్కో ఎయిర్‌లైన్ సంస్థ మూతపడుతుండడం సంక్లిష్టతలకు అద్దం పడుతోంది. కానీ, ఎయిర్‌లైన్స్ సేవలకు ఏటేటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2023 మొదటి మూడు నెలల్లో దేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు 3.75 కోట్ల మంది ప్రయాణికులను చేరవేశాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 52% అధికం. గుత్తాధిపత్యానికి బాటలు.. ప్రభుత్వరంగంలోని ఎయిర్ ఇండియాను టాటాలు గతేడాది జనవరిలో కొనుగోలు చేయడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వరం్యలో అలయన్స్ ఎయిర్ ఒక్కటే ఉంది. దీని సేవలు నామమాత్రమే. ఇక ప్రధానంగా సేవలు అందించే సంస్థలుగా ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ఏయిరేíÙయా, ఆకాశ ఎయిర్ ఉన్నాయి. ఇందులో ఆకాశ ఎయిర్ రాకేశ్ జున్‌జున్‌వాలా ఆరంభించినది. ఇది చాలా తక్కువ సర్విసులకే పరిమితమైంది. ఎయిర్ ఏషియా, విస్తారా టాటాల జాయింట్ వెంచర్లు, వీటిని ఎయిర్ ఇండియాలో విలీనం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదే జరిగితే అప్పుడు ప్రధానంగా సేవలు అందించేవి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ అని చెప్పుకోవచ్చు. స్పైస్‌జెట్ కూడా తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. భారీ నష్టాలతో, రుణ భారంతో నడుస్తోంది. ఒకవేళ ఇది కూడా మూతపడితే అప్పుడు ఎయిర్ ఇండియా, ఇండిగోతో దేశ ఎయిర్‌లైన్స్ మార్కెట్ మోనోపలీగా మారిపోతుందన్న ఆందోళన వినిపిస్తోంది. అంతేకాదు, సేవలపైనా దీని ప్రభావం పడుతుందని అంటున్నారు. -
1.16 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 నవంబర్‌లో 1.16 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య 11.06 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. 2022 అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది విహంగ వీక్షణం చేశారు. కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న తరువాత.. దేశంలోని పౌర విమానయాన రంగం రికవరీ బాటలో ఉంది. ఇటీవలి కాలంలో దేశీయంగా సగటున ప్రతిరోజు 4 లక్షల పైచిలుకు మంది విమాన ప్రయాణం చేస్తున్నారు. నవంబరులో నమోదైన మొత్తం ప్రయాణికుల్లో 55.7 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో నిలిచింది. విస్తారా 9.3 శాతం వాటాతో 10.87 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఎయిర్ ఇండియా 9.1 శాతం, ఏయిర్‌ఏషియా ఇండియా 7.6, గో ఫస్ట్, స్పైస్‌జెట్ చెరి 7.5 శాతం వాటాను దక్కించుకున్నాయి. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ఏషియా సంయుక్తంగా 26 శాతం వాటాతో 30.35 లక్షల మందికి విమాన సేవలు అందించాయి. 92 శాతం అధిక ఆక్యుపెన్సీతో స్పైస్‌జెట్ ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో రాకపోకల విషయంలో సగటున 92 శాతం ఇండిగో విమానాలు నిర్ధేశిత సమయానికి సేవలు అందించాయి. -
ఏవియేషన్‌కు రూ. 1,500 కోట్ల రుణ పరిమితి
న్యూఢిల్లీ: కోవిడ్ ధాటికి కుదేలైన రంగాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశించిన ఈసీఎల్‌జీఎస్‌కి (అత్యవస రుణ సదుపాయ హామీ పథకం) కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు చేసింది. వైమానిక రంగ సంస్థలకు గరిష్ట రుణ పరిమితిని రూ. 400 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచింది. సముచిత వడ్డీ రేటుతో తనఖా లేని రుణాలు పొందడం ద్వారా విమానయాన సంస్థలు నిధుల కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020 మే నెలలో కేంద్రం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులను బట్టి సవరిస్తూ, పొడిగిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది మార్చితో ముగియాల్సి ఉండగా 2023 మార్చి వరకూ పొడిగించింది. ఈ స్కీము కింద 2022 ఆగస్టు 5 నాటికి ఈ స్కీము కింద రూ. 3.67 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
Indian Women Pilots: ఆకాశమే ఆమె హద్దు..
మహిళల భాగస్వామ్యానికి సంబంధించి మిగిలిన రంగాల పరిస్థితి ఎలా ఉన్నా.. విమానయాన రంగంలోని పైలట్ల విషయంలో మాత్రం ప్రపంచంలో భారతే నంబర్ వన్ అట. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వుమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్ విడుదల చేసిన గణాంకాల(2021) ప్రకారం.. దేశంలోని వివిధ ఎయిర్‌లైన్స్ పైలట్లలో 12.4 శాతం మహిళలే. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో వారి ప్రాతినిధ్యం లేదు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 5.8 శాతం మాత్రమే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలైతే.. ప్రపంచ సగటు కన్నా కిందనే ఉండటం గమనార్హం. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో మహిళా పైలట్ల భర్తీ గణనీయంగా పెరిగిందని బ్లూంబర్గ్ మీడియా తెలిపింది. -
హైదరాబాద్‌కు ‘ఎగిరొచ్చిన’ ప్రపంచంలోనే నంబర్ 1 సంస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైమానిక రంగానికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. భారత్‌లో తన తొలి ఎంఆర్ఓ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిన శాఫ్రాన్ నిర్ణయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు స్వాగతించారు. మన దేశంలో ఒక విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనన్నారు. శాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. శాఫ్రాన్ అతిపెద్ద నిర్వహణ కేంద్రం హైదరాబాద్‌లోనే రాబోతుందన్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన శాఫ్రాన్ ఏర్పాటుచేస్తున్న ఈ కేంద్రంతో సుమారు వెయ్యి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. భారత్‌తోపాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్–1ఏ, లీప్–1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్‌లోనే చేస్తారన్నారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. శాఫ్రాన్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైందని కేటీఆర్ చెప్పారు. చదవండి👉🏻సర్కార్‌పై ‘వార్’టీఐ! దరఖాస్తుల ద్వారా యుద్ధానికి రాష్ట్ర బీజేపీ సిద్ధం ప్రపంచంలోనే నంబర్ 1 ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ అంతర్జాతీయంగా హైటెక్నాలజీ గ్రూప్. ఇది వైమానిక, రక్షణ, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తుంది. వైమానిక రంగానికి సంబంధించి ప్రొపల్షన్, ఎక్విప్మెంట్, ఇంటీరియర్స్ తయారీల్లో అగ్రశ్రేణి సంస్థ. గగనతల రవాణాకు సంబంధించి సురక్షితమైన, సౌకర్యవంతమైన సహకారాన్ని ప్రపంచానికి అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 2021 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం ఈ సంస్థ పరిధిలో 76,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 15.3 బిలియన్ యూరోల విక్రయాలతో ప్రపంచంలో అగ్రస్థానాన ఉంది. జీఈ సంస్థతో కలిసి వాణిజ్య జెట్ ఇంజన్లకు సంబంధించి ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్న శాఫ్రాన్.. హెలికాప్టర్ టర్బైన్ ఇంజన్లు, లాండింగ్ గేర్ల తయారీల్లో కూడా అగ్రశ్రేణి సంస్థగా ఉంది. నేడు రెండు ప్రాజెక్టుల ప్రారంభం ఇటీవల హైదరాబాద్‌లో శాఫ్రాన్ సంస్థ రెండు మెగా ఏరోస్పేస్ ప్రాజెక్టులను స్థాపించింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ. ఇది విమాన ఇంజన్లకు వైర్ హార్నెస్‌లను ఉత్పత్తి చేస్తుంది. రెండోది శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఫ్యాక్టరీ. ఇది కీలకమైన లీప్ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్ భాగాలను తయారు చేయనుంది. ఈ రెండు ఫ్యాక్టరీలను గురువారం మంత్రి కేటీఆర్.. శాఫ్రాన్ గ్రూప్ సీఈవో ఒలివీర్ ఆండ్రీస్, శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సీఈవో జీన్‌పాల్ అలరీలతో కలిసి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎంఆర్ఓకు ఇవి అదనం. ప్రపంచస్థాయి ఏరోస్పేస్ సంస్థల నుంచి మెగా పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో అత్యంత శక్తిమంతమైన ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్ స్థిరపడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి👉🏻విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ -
విమాన చార్జీలను 15% పెంచాలి
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు గణనీయంగా పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు చార్జీలను కనీసం 10–15 శాతం పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతేడాది జూన్ నుంచి చూస్తే ఏటీఎఫ్ ధరలు ఏకంగా 120 శాతం పైగా ఎగిశాయని సింగ్ పేర్కొన్నారు. ‘ఇంత భారీ పెంపును తట్టుకునే పరిస్థితి లేదు. మన దగ్గర ఏటీఎఫ్‌పై పన్నులు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వరం పన్నులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి‘ అని ఆయన తెలిపారు. ఇంధన ధరల భారాన్ని ప్రయాణికులకు బదలాయించకుండా గత కొద్ది నెలలుగా తామే భరిస్తూనే ఉన్నామని సింగ్ చెప్పారు. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో 50 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణ వ్యవధిని బట్టి దేశీయంగా విమాన చార్జీలపై కేంద్రం కనిష్ట, గరిష్ట పరిమితులు అమలు చేస్తోంది. ఉదాహరణకు 40 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలపై కనిష్టంగా రూ. 2,900 (జీఎస్టీ కాకుండా) కన్నా తక్కువ, గరిష్టంగా రూ. 8,800 (జీఎస్టీ కాకుండా)కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు. కోవిడ్ ఆంక్షలతో దెబ్బతిన్న విమానయాన సంస్థలు నష్టపోకుండా కనిష్ట చార్జీలపై, ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా గరిష్ట చార్జీలపై కేంద్రం పరిమితులు విధించింది. ఏటీఎఫ్ రేటు 16 % పెంపు అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు 16 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు రిటైలింగ్ దిగ్గజాలు గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 19,757 (16.26 శాతం) పెరిగి రూ. 1,41,232.87కి చేరింది. తాజా పెంపుతో లీటరు ఏటీఎఫ్ ధర రూ.141.2కి చేరినట్లయింది. ఈ ఏడాది వరుసగా పది సార్లు రేట్లు పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న స్వల్పంగా 1.3 శాతం (కిలో లీటరుకు రూ. 1,564 చొప్పున) తగ్గించాయి. కానీ అంతలోనే మళ్లీ పెంచడంతో ప్రస్తుతం ముంబైలో ఏటీఎఫ్ రేటు రూ. 1,40,093కి, కోల్‌కతాలో రూ. 1,46,322కి, చెన్నైలో రూ. 1,46,216కి చేరింది. స్థానిక పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజూ, ఏటీఎఫ్ రేట్లను ప్రతి 15 రోజులకోసారి ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఏటీఎఫ్ రేట్లు 11 సార్లు పెరిగాయి. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రెట్టింపయ్యాయి. జనవరి 1న ఏటీఎఫ్ రేటు రూ. 74,022.41గా ఉండగా 91 శాతం (రూ. 67,210.46) మేర పెరిగింది. -
విమాన ప్రయాణికులకు షాక్! ఛార్జీల పెంపు షురూ..
పెరిగిన ధరలతో సామాన్యులు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లకు ఇప్పుడీ కాక మరింత బాగా తాకనుంది. బడ్జెట్ ధరల్లో విమాన సర్వీసులు అందించే స్పైస్‌జెట్ సంస్థ ఛార్జీలు పెంచుతామంటూ ప్రకటించింది. ఇటీవల కాలంలో విమానాల్లో ఉపయోగించే జెట్ ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్క జూన్‌లోనే ఇంధన ధరలు 120 శాతం వరకు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ రోజురోజుకి క్షీణిస్తుంది. దీంతో ఏవియేషన్ సెక్టార్లో లాభాల సంగతి అటుంచి వస్తున్న నష్టాలను అదుపు చేయడం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. చివరకు ధరల పెంపు ఒక్కటే మార్గంగా ఏవియేషన్ సర్వీస్ ప్రొవైడర్లు డిసైడ్ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ సంస్థ మనుగడ కొనసాగించాలంటే ఛార్జీలు పెంచడం మినహా మరో మార్గం లేదని స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. వివిధ మార్గాల్లో 10 నుంచి 15 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. ధరలు పెంచినా నష్టాల నుంచి తప్పించుకోవడం కష్టమని.. పన్నులు తగ్గించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కూడా ఆయన కోరారు. కోవిడ్ తర్వాత ప్రయాణాలు తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. ఈ తరుణంలో ధరల పెంపుకు విమానయాన సంస్థలు విముఖంగా ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఛార్జీలు పెంచకపోతే మనుగడ కష్టమనే భావనలోకి స్పైస్‌జెట్‌తో పాటు ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం ఉన్నాయి. ఈ ఛార్జీలు పెంపు స్పైస్‌జెట్‌తో మొదలైందని.. రాబోయే రోజుల్లో ఇతర సంస్థల నుంచి ధరల పెంపు ప్రకటనలు వెలువడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఎన్ని కోట్లయినా సరే.. తగ్గేదేలే!సూపర్ రిచ్ ఇక్కడ! -
ఏవియేషన్ సెక్టార్‌కి భారీ షాక్ ! విమాన రంగం ఇప్పట్లో కోలుకునేనా ?
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అయ్యింది ఏవియేషన్ సెక్టార్ పరిస్థితి. కరోనా ఎఫెక్ట్‌తో గత రెండేళ్లుగా నష్టాలతో కునారిళ్లుతున్న విమానయాన రంగం, ఈ బడ్జెట్లో తమకేమైనా ఉద్దీపనలు లభిస్తాయనే ఆశతోంది. కానీ ఏవియేషన్ సెక్టార్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది కేంద్రం. అనూహ్యంగా ఏవియేషన్ ఫ్యూయల్ ధర 8.5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభించినా తర్వాత విమనా ప్రయాణాలపై ఆంక్షలు వచ్చాయి. మరోవైపు ప్రజలు సైతం ప్రయాణాలు మానుకున్నారు. దీంతో ఏవియేషన్ సెక్టార్లో డిమాండ్ తగ్గిపోయింది. దాదాపు అన్ని సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయి. ఈ సమయంలో విమానాల్లో ఉపయోగించే వైట్ పెట్రోలు ధరలను 8.5 శాతం పెంచడం విమానయాన సంస్థలను ఇరకాటంలో పెట్టింది. ఇప్పటికే డిమాండ్ తగ్గిపోయిన తరుణంలో టిక్కెట్ల రేట్లను పెంచాలా ? లేక పెరిగిన ఛార్జీలను భరించాలా ? అనేది ఆ సంస్థలకు కష్టంగా మారనుంది. గతేడాది మే నుంచి కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోయింది. కేవలం నాలుగు నెలల కాలంలోనే అంతర్జాతీయ చమురు ధరల వంకతో లీటరు పెట్రోలు, డీజిల్‌లపై సగటున రూ.25 వంతున పెంచింది. దీంతో కేంద్రంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కంటి తుడుపు చర్యగా 2021 నవంబరులో లీటరు పెట్రోలు, డీజిల్‌లపై రూ.5 ధర తగ్గించింది. తాజాగా రష్యా, ఉక్రెయిన్ వివాదం తెర మీదికి వచ్చాక.. మరోసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీనికి తగ్గట్టుగా సాధారణ ఫ్యూయల్ ధరలు పెంచే అవకాశం లేకపోవడంతో వైట్ పెట్రోల్ ధరలు పెంచింది. -
7 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి కోరలు చాచినా కానీ, మరోవైపు దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 2021 డిసెంబర్లో 6.7 శాతం పెరిగింది. మొత్తం 1.12 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం చేసినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. మొత్తం మీద 2021లో దేశీయ విమాన సర్వీసుల్లో 8.38 కోట్ల మంది ప్రయాణించారు. 2020లో 6.3 కోట్ల మందితో పోలిస్తే 33 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి విమానయాన రంగంపై ఎక్కువ ప్రభావం చూపించడం తెలిసిందే. ఇండిగో వాటా 55 శాతం ► ఇండిగో విమానాల్లో 2021 డిసెంబర్లో 61.41 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో 54.8 శాతం ఇండిగోను ఎంచుకున్నారు. ► గోఫస్ట్ (గతంలో గోఎయిర్) విమానాల్లో 11.93 లక్షల మంది ప్రయాణించారు. ► స్పైస్‌జెట్ విమాన సర్వీసులను 11.51 లక్షల మంది వినియోగించుకున్నారు. సాధారణంగా రెండో స్థానంలో ఉండే స్పైస్‌జెట్ మూడో స్థానానికి పడిపోయింది. ► ఎయిర్ ఇండియా విమానాల్లో 9.89 లక్షల మంది, విస్తారా విమాన సర్వీసుల్లో 8.61 లక్షల మంది, ఎయిరేషియా విమానాల్లో 7.01 లక్షల మంది, అలియన్స్ ఎయిర్ సర్వీసుల్లో 1.25 లక్షల మంది చొప్పున ప్రయాణించారు. ► ఆక్యుపెన్సీ రేషియో లేదా లోడ్ ఫ్యాక్టర్ (సీట్ల భర్తీ)లో స్పైస్‌జెట్ మెరుగ్గా 86 శాతాన్ని డిసెంబర్లో నమోదు చేసింది. ఆ తర్వాత ఇండిగో 80.2%, విస్తారా 78.1%, గోఫస్ట్ 79%, ఎయిర్ ఇండియా 78.2 శాతం, ఎయిరేషియా 74.2% చొప్పున ఆక్యుపెన్సీ రేషియోను సాధించాయి. ► బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల నుంచి సకాలంలో సర్వీసులు నడిపించడంలో ఇండిగో 83.5 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ► గోఫస్ట్ 83 శాతం, విస్తారా 81.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
స్టార్టప్‌లకు కేంద్రబిందువుగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: స్టార్టప్‌లకు.. ముఖ్యంగా రక్షణ, వైమానిక రంగ సంస్థలకు హైదరాబాద్ కేంద్రబిందువు అవుతోందని హైదరాబాద్‌లోని అమెరికన్ దౌత్య కార్యాలయ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ అన్నారు. 2008 నాటికి భారత్, అమెరికా మధ్య రక్షణ రంగ వ్యాపారం దాదాపు శూన్యం కాగా ఇప్పుడు వందల కోట్ల డాలర్లకు చేరిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైన ‘డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వర్క్‌షాప్’లో ఆయన మాట్లాడుతూ.. రక్షణ, వైమానిక రంగాల్లోని స్టార్టప్ కంపెనీలు తమ ఆలోచనలను వస్తు, సేవల రూపంలోకి తీసుకొచ్చేలా తోడ్పాటునందించేందుకు అమెరికన్ కాన్సులేట్ ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసిందన్నారు. వర్క్‌షాప్‌లో సుమారు 25 స్టార్టప్‌లు పాల్గొంటున్నాయని.. వీటన్నింటినీ 35 ఏళ్ల లోపు వయసు వారు ప్రారంభించారని చెప్పారు. ఇందులో అత్యధికం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోనివేనని, ఇందులోనూ మహిళల నేతృత్వంలో నడుస్తున్నవి ఎక్కువుండటం గర్వకారణమని కొనియాడారు. డిసెంబరు 9న మొదలైన ఈ వర్క్‌షాప్ 11న ముగియనుంది. రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగ సంస్థలూ ఇప్పుడు స్టార్టప్‌లతో కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. డీఆర్డీవో, కేంద్ర రక్షణ శాఖలు వేర్వేరుగా స్టార్టప్‌ల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుండటం దీనికి నిదర్శనమన్నారు. మహిళా స్టార్టప్‌లలో కొన్ని.. ఆర్మ్స్ 4 ఏఐ భౌతిక శాస్త్రవేత్త జాగృతి దబాస్ ఈ స్టార్టప్‌కు సహ వ్యవస్థాపకురాలు. హైదరాబాద్‌లోని వీ హబ్ కేంద్రంగా పనిచేస్తోందీ కంపెనీ. ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి భూమ్మీద ఏ వస్తువు ఎక్కడుందో క్షణాల్లో చెప్పే టెక్నాలజీని సిద్ధం చేసింది. వాహనాల కదలికలు.. ఆయా ప్రాంతాల్లో సమయంతో పాటు వచ్చే మార్పులు, పంటలు, భూ పర్యవేక్షణ, ప్రకృతి విపత్తులకు లోనైన ప్రాంతాల పరిశీలనలో పని చేస్తోంది. మోర్ఫెడో టెక్నాలజీస్ దేశీయంగా తయారైన తేజస్ యుద్ధ విమానం కీలక విడి భాగం తయారీకి ఎంపికైన స్టార్టప్ ఇది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో అసోసియేట్ డిజైన్ ఇంజినీర్ మిలన్ భట్నాగర్. తేజస్‌లో దాదాపు 358 లైన్ రిప్లేస్మెంట్ యూనిట్లు (ఎల్‌ఆర్‌యూ) ఉండగా వీటిల్లో 47 శాతం యూనిట్లు భారత్‌లో తయారు కావట్లేదు. ఈ లోటును పూరించడంలో భాగంగానే టోటల్ ఎయిర్ టెంపరేచర్ ప్రోబ్ ఎల్ఆర్యూను తయారు చేసే అవకాశం మోర్ఫెడోకు దక్కింది. పీఎస్–1925 మేకిన్ ఇండియాలో భాగంగా వ్యవసాయం, వైమానిక రంగాల్లో డ్రోన్లను తయారు చేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరు షెఫాలీ వినోద్ రామ్టెకే. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటికే 2 వేల మంది రైతులకు సేవలందిస్తున్నారు. హెక్టారు భూమిలోని పంటకు మందులు కొట్టేందుకు రూ.2 వేలకే డ్రోన్లు సమకూరుస్తున్నారు. రక్షణ, ఈ–కామర్స్, ఆరోగ్య, రవాణా రంగలకూ ఉపయోగపడేలా డ్రోన్లు తయారు చేసే పనిలో ఉన్నారు. ఫ్లై అట్ మ్యాట్ ఇన్నోవేషన్స్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ డ్రోన్ల తయారీ రంగంలో ఉంది. ఎంఎస్ ఉత్తర దీనికి టెక్నికల్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. జీఐఎస్ సర్వే, సొంతంగా మ్యాపులు సిద్ధం చేసే డ్రోన్లతో పాటు వరద వంటి ప్రకృతి విపత్తుల్లో సహాయంగా ఉండే యూఏవీలనూ తయారు చేస్తోందీ కంపెనీ. -
ఆకాశ వీధిలో ఝున్‌ఝున్‌వాలా
న్యూఢిల్లీ: దేశీ ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తాజాగా విమానయాన రంగంపై దృష్టి సారించారు. ఆకాశ ఎయిర్ పేరిట విమానయాన సంస్థను ప్రారంభిస్తున్నారు. పౌర విమానయాన శాఖ నుంచి దీనికి 15 రోజుల్లో అనుమతులు రావచ్చని ఝున్‌ఝున్‌వాలా వెల్లడించారు. కొత్త ఎయిర్‌లైన్ కోసం నాలుగేళ్లలో దాదాపు 70 విమానాలను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు ఝున్‌ఝున్‌వాలా వివరించారు. 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్‌క్రాఫ్ట్‌లను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశ ఎయిర్‌లో ఝున్‌ఝున్‌వాలా సుమారు 35 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. ఆయనకు ఇందులో 40 శాతం వాటాలు ఉండనున్నాయి. అత్యంత చౌక చార్జీల విమానయాన సంస్థగా ఉండబోయే ఆకాశ ఎయిర్ టీమ్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థకి చెందిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారు. కరోనా వైరస్ కట్టడిపరమైన చర్యల కారణంగా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమానయాన సంస్థలు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఝున్‌ఝున్‌వాలా ఈ రంగంలోకి ప్రవేశించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012లో మూతబడగా, జెట్ ఎయిర్వేస్ 2019లో దివాలా తీసింది. కొత్త యజమానుల సారథ్యంలో ప్రస్తుతం మళ్లీ ఎగిరే ప్రయత్నాల్లో ఉంది. థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉండటంతో దేశీ విమానయాన సంస్థల రికవరీకి మరింత సమయం పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్త విమానాల డెలివరీని కూడా వాయిదా వేసుకునేందుకు విమానయాన సంస్థ విస్తార.. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్‌లతో చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన రంగంలోకి ఝున్‌ఝున్‌వాలా ఆరంగేట్రం చర్చనీయాంశంగా మారింది. అయితే, ‘దేశీ విమానయాన రంగంలో డిమాండ్ విషయంలో నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను‘ అని ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఫోర్బ్స్ మేగజీన్ తాజా గణాంకాల ప్రకారం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సంపద విలువ సుమారు 4.6 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. -
సెకండ్ వేవ్‌తో విమానయానానికి కష్టాలు
ముంబై: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 80-85 శాతానికే పరిమితం కానుంది. గతంలో ఇది 130-135 శాతం పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. గతేడాది మే 25 తర్వాత విమాన సర్వీసులను పరిమిత స్థాయిలో పునరుద్ధరించాక.. దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి గతేడాది స్థాయిలో 64 శాతానికి చేరింది. కానీ మార్చి ఆఖరు, ఏప్రిల్ నుంచి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, వైరస్ కట్టడికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్తగా ఆంక్షలు విధిస్తుండటం తదితర అంశాలతో మళ్లీ విమాన ప్రయాణాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలవారీగా చూసినప్పుడు ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా 0.7 శాతం మేర క్షీణించింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ప్యాసింజర్ ట్రాఫిక్ 1.4 శాతం పెరిగింది. నెలవారీగా ఏప్రిల్‌లో 28 శాతం డౌన్.. ఇక్రా నివేదిక ప్రకారం 2021 మార్చిలో సగటున రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య 2.49 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో ఇది 28 శాతం క్షీణించి 1.79 లక్షలకు తగ్గిపోయింది. ఇక మే 1 - మే 16 మధ్య కాలంలో మరింతగా 56 శాతం క్షీణించింది. విమాన ప్రయాణాలు చేయాలంటే భయాలు నెలకొనడంతో పాటు గడిచిన రెండు నెలలుగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తుండటం కూడా ఇందుకు కారణమని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ రేటింగ్స్) శుభం జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగవచ్చని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 80-85 శాతానికి పరిమితం కావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లుగా డిసెంబర్ నాటికి సింహభాగం జనాభాకు (18 ఏళ్లు పైబడినవారు) టీకాలు వేసే ప్రక్రియ పూర్తయితే .. థర్డ్ వేవ్ ప్రభావం కొంత తగ్గే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు జైన్ చెప్పారు. 2023 నాటికి కోవిడ్ పూర్వ స్థాయికి.. తాజా పరిస్థితులను బట్టి చూస్తే 2023 ఆర్థిక సంవత్సరం నాటికి గానీ దేశీయంగా విమానయానం కోవిడ్–19 పూర్వ స్థాయికి కోలుకోలేదని ఇక్రా తెలిపింది. అదే విదేశాలకు విమాన ప్రయాణాల విభాగానికైతే 2024 ఆర్థిక సంవత్సరం దాకా పట్టేస్తుందని వివరించింది. ప్యాసింజర్ ట్రాఫిక్ తగ్గుదల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థల నిర్వహణ ఆదాయాలు 12 శాతం క్షీణించి రూ. 12,800 కోట్లకు, నిర్వహణ లాభాలు 40 శాతం క్షీణించి రూ. 2,560 కోట్లకు పరిమితం కావచ్చని పేర్కొంది. వందే భారత్ మిషన్ (వీబీఎం) కింద భారత్‌తో ద్వైపాక్షిక విమాన రవాణా ఒప్పందాలు కుదుర్చుకున్న పలు దేశాలు (అమెరికా, బ్రిటన్ మొదలైనవి).. ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదల కారణంగా తాత్కాలికంగా భారత్ నుంచి ఫ్లయిట్స్‌ను రద్దు చేశాయని తెలిపింది. భారీ స్థాయిలో వేక్సినేషన్, లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేత, బిజినెస్ ట్రావెల్, పర్యాటక సంబంధ ప్రయాణాలు మొదలైనవి పుంజుకోవడంపైనే సమీప భవిష్యత్తులో ఏవియేషన్ రంగం కోలుకోవడం ఆధారపడి ఉంటుందని ఇక్రా వివరించింది. ప్రైవేట్ విమానాలకు భలే గిరాకీ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశీ సంపన్నులు తమ విమాన ప్రయాణాలకు.. కమర్షియల్ ఎయిర్‌లైన్స్ కన్నా ప్రైవేట్ విమానాలను బుక్ చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రైవేట్ జెట్ ఆపరేటర్లు నడిపే ఫ్లయిట్ సరీ్వసులు గణనీయంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం .. జనరల్ ఏవియేషన్ ఫ్లయిట్ సేవలు గతేడాది మార్చిలో 37.7 శాతం క్షీణించగా .. తాజాగా మార్చిలో ఏకంగా 71.8 శాతం వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు, కమర్షియల్ విమానయాన సంస్థలు తిరిగి కోవిడ్-19 పూర్వ స్థాయికి తమ కార్యకలాపాలను పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం రికవరీ మొదలైనట్లు కనిపించినా.. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో మళ్లీ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ప్రైవేట్ జెట్లను బుక్ చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది విదేశాలకు, దేశీయంగా ఇతర ప్రాంతాలకు తొలిసారిగా ప్రయాణిస్తున్న వారు ఉంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య గతంతో పోలిస్తే సుమారు 25 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రయాణించాల్సిన వారు కూడా ప్రైవేట్ విమానాలను బుక్ చేసుకుంటున్నట్లు వివరించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక టెర్మినల్.. ప్రైవేట్ విమానాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి ఫ్లైట్స్ కోసం ఢిల్లీ అంతర్జాతీయ విమాశ్రయంలో గతేడాది సెప్టెంబర్‌లో ప్రత్యేకంగా జనరల్ ఏవియేషన్ టెర్మినల్(జీఏటీ)ని ప్రారంభించారు. గణాంకాల ప్రకారం .. ఈ టెర్మినల్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తొలినాళ్లలో రోజుకు 96 మంది దాకా ఉండగా.. మార్చి నాటికి సుమారు 25 శాతం వృద్ధి చెంది 120కి పైగా పెరిగింది. దేశీయంగా తొలి జీఏటీ అయిన ఈ టెర్మినల్‌ను బర్డ్ గ్రూప్, ఎగ్జిక్యూజెట్ ఏవియేషన్ గ్రూప్ కలిసి దాదాపు రూ.150 కోట్లతో నిర్మించాయి. గంటకు 50 మంది ప్రయాణికులు, రోజుకు 150 జెట్స్ నిర్వహణ సామర్థ్యంతో దీన్ని రూపొందించాయి. చదవండి: పన్నెండు రూపాయలతో రూ.2 లక్షల ప్రమాద బీమా -
విమానానికి సెగ
ముంబై: కరోనా వైరస్ కల్లోలానికి దేశీయ విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితం కానున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఎయిర్ ట్రాఫిక్ 8–9 కోట్ల ప్రయాణికులకే పరిమితం కానున్నదని విమానయాన కన్సల్టింగ్ సంస్థ, కాపా ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో 14 కోట్ల మంది విమానాల ద్వారా ప్రయాణించారని అంచనా. విమాన ప్రయాణికుల సంఖ్య భారీగానే తగ్గడమే కాకుండా భారత విమానయాన సంస్థలకు రెండేళ్లలో అందాల్సిన 200కు పైగా విమానాలు మరో రెండేళ్ల జాప్యం తర్వాతే అందుతాయని పేర్కొంది. ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే... ► కరోనా వైరస్ కల్లోలంతో పర్యాటకంపై ఆంక్షలు, ఆర్థిక మందగమనం... ఈ రెండు అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారత విమానయానంపై ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. ► సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం(జూలై–సెప్టెంబర్)లో విమానయాన రంగంలో డిమాండ్ బలహీనంగా ఉంటుంది. ఈసారి ఇంకా బలహీనంగా ఉండొచ్చు. ► ఏతావాతా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో అవసరానికి మించి విమానాలు అందుబాటులో ఉంటాయి. ► ఇక ఈ ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసిక కాలాల నుంచి సాధారణ స్థాయికి రావచ్చు. ► ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కూడా భారీగానే తగ్గనున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల మంది విదేశాలకు విమానాల ద్వారా ప్రయాణించారని అంచనాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 3.5–4 కోట్లకే పరిమితం కానున్నది. -
దివాలా అంచున ఎయిర్‌లైన్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బకు విమానయాన రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఫ్లయిట్ సర్వీసులు నిల్చిపోయి.. అటు టికెట్ల క్యాన్సిలేషన్లతో ఎయిర్‌లైన్స్ నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో పలు విమానయాన సంస్థలు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం తగు సహాయక చర్యలు ప్రకటించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురికి ఫిక్కీ ఏవియేషన్ కమిటీ చైర్మన్ ఆనంద్ స్టాన్లీ లేఖ రాశారు. దేశీ ఎయిర్‌లైన్స్ ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలు రుణదాతలు జప్తు చేసుకోకుండా 90 రోజుల వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు విధించే వడ్డీలు,పెనాల్టీలు, ఇతర చార్జీల నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘గడిచిన కొద్ది రోజులుగా విమాన సేవలు నిల్చిపోవడంతో ఏవియేషన్ పరిశ్రమ దగ్గరున్న నిధుల నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో ఇదీ ఒకటి’ అన్నారు. -
‘జెట్’ కూలిపోయిందా.. కూల్చేశారా?
సాక్షి, బిజినెస్ డెస్క్: విమానయాన రంగంలో 25 ఏళ్లకు పైగా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జెట్ ఎయిర్వేస్ ఉన్నట్టుండి కుప్పకూలడం వెనుక ఏం జరిగి ఉంటుంది...? ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్నా చితకా ఎయిర్‌లైన్ కంపెనీలు సర్వీసులను చక్కగా నడిపిస్తుంటే, దశాబ్దాల చరిత్ర ఉన్న జెట్ ఎందుకలా రెక్కలు తెగిన విహంగంలా కూలిపోయింది...? కేవలం చమురు ధరల పెరుగుదల, రుణాల భారమే ఈ సంస్థను ముంచేసిందా? లేక కావాలనే ముంచేశారా? సంస్థ ప్రమోటర్ నరేష్‌గోయల్ నిధులను పక్కదారి పట్టించారా? భారీగా రుణాలిచ్చిన బ్యాంకులు జెట్‌ఎయిర్‌వేస్ స్టీరింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాతే ఎందుకు ఉన్న ఫళంగా జెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి? ప్రీ ప్లాన్ ప్రకారం తీసుకొచ్చిన సంక్షోభమా ఇది? విశ్లేషకులు, విమానయాన పరిశ్రమ వర్గాలు, ఆఖరికి జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానాలు ఎవరిస్తారు..? స్వామి సంచలన ట్వీట్ ‘‘ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ఇద్దరు మంత్రులు జెట్ ఎయిర్వేస్ను స్పైస్‌జెట్‌కు విక్రయించేందుకు మానిప్యులేట్ చేస్తున్నారు. తెరవెనుక అసలు యజమానులు ఎవరన్నది తర్వాత వెల్లడిస్తాను. ప్రభుత్వం ముందున్న ఆప్షన్ జెట్ ఎయిర్వేస్ను ఎయిర్ ఇండియాతో విలీనం చేయడమే. ఎందుకంటే రెండు వైపులా ఎయిర్‌స్పేస్ విషయంలో ప్రభుత్వానిదే జోక్యం ఉంటుంది’’ అని బీజేపీ ప్రముఖ నేత సుబ్రమణ్యస్వామి గత నెల 21న చేసిన ట్వీట్. అంటే స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ తెరవెనుక ఎవరో ఈ కథ అంతా నడిపిస్తున్నట్టు స్వామి మాటల్లో వ్యక్తమైన సందేహంలా కనిపిస్తోంది. తిరిగి స్వామి బయటపెట్టే వరకూ అసలు కథ ఎవరికీ తెలియదేమో! నిధుల మళ్లింపుపై ఫిర్యాదు ఐసీఐసీఐ బ్యాంకు–వీడియోకాన్ రుణ బంధం వెనుక బ్యాంకు మాజీ చీఫ్ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌కు ప్రయోజన లబ్ధి కలిగిందంటూ ఓ ఫిర్యాదుతో సంచలన దర్యాప్తునకు కారణమైన ప్రజా వేగు అరవింద్ గుప్తా గుర్తుండే ఉంటుంది. ఆ వ్యక్తే జెట్ ఎయిర్వేస్లో నిధుల మళ్లింపుపై దర్యాప్తు సంస్థల తలుపు తట్టారు. జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్లు కంపెనీ పుస్తకాల నుంచి రూ.5,125 కోట్లను దారి మళ్లించినట్టు ఆయన ఆరోపణ. ఈ నిధుల మళ్లింపును కంపెనీ ఆడిటింగ్ కంపెనీ నిరోధించలేకపోయిందంటూ 2018 ఆగస్ట్‌లో అరవింద్ గుప్తా ఫిర్యాదు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఫలితాలను జెట్ ఎయిర్వేస్ సకాలంలో వెల్లడించలేదు. వాయిదా వేసింది. అదే సమయంలో అరవింద్ గుప్తా ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం జెట్‌ఎయిర్‌వేస్ ఖాతాల తనిఖీ చేపట్టింది. కంపెనీల చట్టం నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు, నిధుల మళ్లింపు ప్రయత్నాలను గుర్తించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నివేదికను ఆర్వోసీ కార్పొరేట్ శాఖకు ఈ నెల 8నే సమర్పించింది. ఆర్వోసీ గుర్తించిన అంశాల పట్ల కార్పొరేట్ శాఖ సంతృప్తి చెంది, నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరం అని భావిస్తే తీవ్ర మోసాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు ఆదేశించే అవకాశాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్‌కు చెందిన కంపెనీలతో జెట్ ఎయిర్వేస్, జెట్‌లైట్ లావాదేవీలు నిర్వహించాయని అరవింద్ గుప్తా ఆరోపణలు. ఈ ఆరోపణల్లోని నిజానిజాలు త్వరలో నిగ్గు తేలాల్సి ఉంది. జెట్ ఆగిపోవడం ఓ స్కామ్: ఆనంద్‌శర్మ జెట్‌ఎయిర్‌వేస్ కూలిపోవడాన్ని స్కామ్‌గా కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు. ‘‘ఇదో పెద్ద స్కామ్‌గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఈ సమయంలో దీన్ని ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. కేంద్రం కాపాడుతున్న ఇతర వ్యాపారాలతో పోలిస్తే జెట్ రుణ భారం తక్కువేనన్నారు. ఎయిర్‌లైన్స్‌కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. బ్యాంకుల ఆధ్వర్యంలో మూత 1992లో ఏర్పాటై 1995లో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా కార్యకలాపాలు ఆరంభించిన జెట్ ఎయిర్వేస్... 2019 ఏప్రిల్ 17న తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీనికంటే ముందు నిధుల సమీకరణకు కంపెనీ దాదాపు తీవ్రంగానే ప్రయత్నించింది. 3 నెలలుగా 20,000 మంది ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేదు. బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. చివరకు కార్యకలాపాలను నిలిపివేయడంతో 20వేల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. నరేష్ గోయల్ నిర్వహణలో జెట్ మొత్తం రూ.13,000 కోట్ల మేర నష్టాలను మూటగట్టుకున్నట్టు తెలుస్తోంది. 120 విమానాలతో నిత్యం 600 విమాన సర్వీసులను నడిపిన ఘన చరిత జెట్ ఎయిర్‌వేస్‌ది. చివరికి కార్యకలాపాలు నిలిపివేసే నాటికి సంస్థ వద్దనున్న విమానాలు కేవలం 7. లీజుకిచ్చిన సంస్థలు తమ విమానాలను స్వాధీనం చేసుకున్నాయి. జెట్ ఎయిర్వేస్ స్లాట్లను తాత్కాలికంగా ప్రభుత్వం ఇతర సంస్థలకు కేటాయించేసి చేతులు దులుపుకుందే గానీ సంస్థను కాపాడే యత్నాలు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన సంస్థలకు లీడ్‌బ్యాంకర్ ఎస్బీఐ. రుణాలిచ్చిన సంస్థలు తమ రుణాలను జెట్‌లో వాటాలుగా మార్చుకుని మెజారిటీ వాటాదారులుగా అవతరించాయి. ప్రమోటర్ నరేష్ గోయల్‌ను చైర్మన్ పదవి నుంచి తప్పుకునేలా చేశాయి కూడా. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు తక్షణం రూ.1,500 కోట్లు అవసరం కాగా, వాటిని బ్యాంకులు సమకూరుస్తాయన్న ఆశ చిగురించింది. నిజానికి బ్యాంకులు రూ.1,500 కోట్ల నిధుల సాయానికీ తొలుత ఆసక్తి తెలిపినప్పటికీ... వాటాదారులుగా మారాక ఎందుకో వెనుకడుగు వేశాయి. ఏప్రిల్ 15 నాటి సమావేశంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోలేదు. డిపాజిట్ దారులు, తమ చట్టబద్ధమైన ప్రయోజనాల కోణంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్ణయం తీసుకున్నట్టు నాడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సెలవిచ్చారు. అయితే, జెట్ నిర్వహణను నియంత్రణలోకి తీసుకున్న బ్యాంకులు, రూ.1,500 కోట్ల ఇచ్చేందుకు ముందుకు రాకుండా, తర్వాత రెండు రోజులకు ఏప్రిల్ 17న సంస్థ మూసివేతకు కారణమయ్యాయి. రోజువారీ కార్యకలాపాలు జరిగేలా చూసి, జెట్‌ను విక్రయానికి పెడితే ఇన్వెస్టర్లు త్వరగా ముందుకు వచ్చేవారేమో. కానీ, విమానాలన్నీ కిందకు దించేసి, రుణదాతలు విక్రయానికి మొగ్గు చూపడం సందేహాలకు తావిచ్చినట్టయింది. షేరు ధర సయ్యాట జెట్‌ఎయిర్‌వేస్ 2018–19 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఫలితాలను వాయిదా వేయడం ఈ సంక్షోభానికి ఆరంభంగా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కంపెనీ షేరు ధర తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతూ వచ్చింది. 2018 జనవరి 5న జెట్ ఎయిర్వేస్ షేరు రూ.870 స్థాయిలో ఉంది. 2018 అక్టోబర్ 1 నాటికి రూ.172 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత టాటాలు జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వచ్చిన వార్తలతో ఈ షేరు ధర ఈ స్థాయి నుంచి నెల రోజుల్లోనే రూ.323 వరకు పెరిగింది. తిరిగి అక్కడి నుంచి తాజాగా రూ.129 స్థాయికి పడిపోయింది. షేరు ఏడాది గరిష్ట, కనిష్ట ధరలు రూ.489, రూ.121. మళ్లీ టేకాఫ్ అవుతుందా...? బ్యాంకులు జెట్ఎయిర్వేస్కు బిడ్లు పిలిచాయి. నాలుగు సంస్థలు బిడ్లు వేశాయి కూడా. వీటిల్లో ఎతిహాద్ కూడా ఉంది. జెట్‌ను తాము టేకోవర్ చేస్తాం, రుణాలన్నీ తీర్చేస్తామంటూ పైలెట్లు, ఇంజినీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్‌డబ్ల్యూఐపీ, జేఏఎమ్‌ఈవీఏలు ఎస్బీఐని లేఖ ద్వారా కోరాయి. అయినా వారికి అవకాశం ఇవ్వలేదు. తమ నియంత్రణలోకి తీసుకుని రూపాయి కూడా విదిల్చలేదు. కానీ, నిలువునా అమ్మేసి తమ బకాయిలను రాబట్టుకునే పనిపై దృష్టి పెట్టాయి ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు. చివరికి ఏ సంస్థకు జెట్‌ను అప్పగిస్తాయో, అందులో ఎవరి ప్రయోజనం నెరవేరుతుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే, సుబ్రమణ్యస్వామి ఆరోపణలు, ఇటు జెట్ ఉద్యోగుల ఆరోపణలు, ప్రజావేగు ఫిర్యాదులోని నిజా నిజాలే నిగ్గుతేలాల్సి ఉంది. కింగ్‌ఫిషర్–జెట్... అప్పులే ముంచాయ్ విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్వేస్ పరిణామాలకు పోలిక కనిపిస్తుంది. ఈ రెండూ భారీగా అప్పులు తీసుకుని హారతి కర్పూరంగా మార్చి, తిరిగి చెల్లించలేక చేతులెత్తేసినవే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ షేరు 2008లో రూ.90కు పైగా పలికింది. చివరికి కార్యకలాపాలు మూసేసే నాటికి పడిపోతూ వచ్చి రూపాయి వరకు దిగొచ్చింది. చివరికి డీలిస్ట్ అయింది. నాడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన సంస్థలు ఇప్పుడు దాని ప్రమోటర్ విజయ్‌మాల్యాను వెంటాడుతూ, వేటాడుతున్నాయి. కానీ, కింగ్‌ఫిషర్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ, జెట్ ఎయిర్వేస్లో మాత్రం వాటాదారులుగా మారి ఆ సంస్థను మరెవరికో కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి జెట్ ఎయిర్వేస్ షేరు ఇంత జరిగినా రూ.120 స్థాయిలకు పైనే ఉందంటే జెట్ ఎదో ఒక గట్టి సంస్థ చేతుల్లోకి వెళ్లి, తిరిగి ఎగురుతుందన్న ఆశ ఇన్వెస్టర్లలో ఉండి ఉండొచ్చన్న విశ్లేషణ అనలిస్టుల నుంచి వినిపిస్తోంది. జెట్‌ఎయిర్‌వేస్ విషయంలో బ్యాంకుల తీరును విజయ్‌మాల్యా సైతం ఇటీవల తప్పుబట్టారు. . ఎతిహాద్ కుట్ర...? అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ ఉదంతంలో భారీ కుట్ర చోటుచేసుకుందన్న ఆరోపణ కేవలం సుబ్రమణ్యస్వామి, కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ నుంచే కాదు.. జెట్ ఎయిర్వేస్ పైలట్ల నుంచి కూడా రావడం ఆశ్చర్యకరం. కంపెనీ షేరు ధరను స్టాక్ మార్కెట్లో కుప్పకూల్చడం ద్వారా ఎతిహాద్ జెట్‌లో మరో 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలనుకుందని, కంపెనీలో ప్రధాన వాటాదారు అయిన ఎతిహాద్ ఎయిర్వేస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కలిసి ఈ కుట్రకు తెరతీశాయని... దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని జెట్‌ఎయిర్‌వేస్ పైలట్లు కోరారు. జెట్ ఎయిర్వేస్లో యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు 24 శాతం వాటా ఉంది. జెట్ ప్రమోటర్ నరేశ్ గోయల్ తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ.1,500 కోట్ల తాజా నిధులను అందించేందుకు సిద్ధపడినా.. ఎస్బీఐ ముందుకు రాలేదని, ఎతిహాద్ కూడా ఈ కష్టకాలంలో కావాలనే సహాయ నిరాకరణకు పాల్పడిందని పైలట్లు పేర్కొన్నారు. జెట్ పతనం వెనుక ఎతిహాద్ పాత్రను దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని ప్రధానిని అభ్యర్థించారు. కానీ, ప్రభుత్వం మాత్రం దర్యాప్తునకు ఆదేశించలేదు. జెట్‌కు అందరూ రాంరాం! నిన్న సీఎఫ్ఓ.. నేడు సీఈఓ ఔట్ జెట్ ఎయిర్వేస్కు కీలక పదవుల్లోని వారు ఆకస్మికంగా రాజీనామాలు ప్రకటిస్తున్నారు. నిధుల కొరతతో సంస్థ కార్యకలాపాలు మూతబడిన నెల రోజులకు సీఈవో వినయ్ దూబే, కంపెనీ సెక్రటరీ కుల్దీప్ శర్మ జెట్ ఎయిర్వేస్కు గుడ్‌బై చెప్పేశారు. భారతీయ అమెరికన్ అయిన దూబే 21 నెలల పాటు జెట్ ఎయిర్వేస్లో పనిచేశారు. జెట్ ఎయిర్వేస్ డిప్యూటీ సీఈవో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవుల నుంచి అమిత్ అగర్వాల్ తప్పుకున్న మరుసటి రోజే దూబే నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. వ్యక్తిగత కారణాల వల్ల దూబే కంపెనీ సీఈవో పదవికి రాజీనామా చేసినట్టు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. జెట్‌కు పూర్వం డెల్టా ఎయిర్‌లైన్స్, సబ్రే ఐఎన్‌సీ, అమెరికన్ ఎయిర్‌లైన్స్ తదితర విమానయాన సంస్థల్లో దూబే పనిచేశారు. అలాగే, డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో పదవులకు అమిత్ అగర్వాల్ రాజీనామా చేశారని, ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చినట్టు జెట్ ఎయిర్వేస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. మరోవైపు చీఫ్‌పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా సైతం రాజీనామా చేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను విక్రయించే పనిలో ఉన్న సమయంలో ఉన్నత పదవుల నుంచి వీరు తప్పుకోవడం గమనార్హం. గత నెలలో కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పతి, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నసీమ్ జైది, హోల్‌టైమ్ డైరెక్టర్ గౌరంగ్ శెట్టి కూడా రాజీనామా చేయడం తెలిసిందే. -
వంద కోట్లకు విమాన ప్రయాణికులు!
న్యూఢిల్లీ: దేశీ విమానయాన రంగం గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. వచ్చే 15–20 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందని, వంద కోట్లకు చేరగలదని పౌర విమానయాన శాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం కొత్తగా మరిన్ని విమానాశ్రయాల నిర్మాణం, సిబ్బందికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడం మొదలైన వాటిపై కసరత్తు చేస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా బుధవారం ఏఐఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. కేవలం విమానాలే కాకుండా హెలికాప్టర్లు, సీ ప్లేన్లు, ప్యాసింజర్ డ్రోన్స్ మొదలైన వాటిలో ప్రయాణించే వారంతా కూడా ఈ వంద కోట్ల ప్రయాణికుల్లో ఉంటారని పేర్కొన్నారు. 2013లో పది కోట్లుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య 2017లో ఇరవై కోట్లకు చేరినట్లు సిన్హా వివరించారు. 130 కోట్ల దేశ జనాభాలో ప్రస్తుతం కేవలం అయిదు శాతం మంది మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నారని ఆయన తెలిపారు. రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం.. భారీ లక్ష్య సాధనకు సంబంధించిన అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని సిన్హా వివరించారు. 100 కోట్ల విమాన ప్రయాణికుల లక్ష్యాన్ని సాధించేందుకు రూ. 4 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం ఏవియేషన్ రంగంలో ప్రత్యక్షంగా రెండు లక్షల మంది, పరోక్షంగా 12 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని.. వచ్చే కొన్నేళ్లలో ఇది 60 లక్షలకు చేరగలదన్నారు. అలాగే ఏవియేషన్ రంగం ఆదాయాలు రూ.2 లక్షల కోట్ల నుంచి 15–20 ఏళ్లలో రూ.8–10 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. భారీగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్ డ్రోన్స్ విభాగం.. రాబోయే రోజుల్లో ఏకంగా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని పేర్కొన్నారు. ఈ విభాగంలో ఆధిపత్యం దిశగా ప్రమాణాలు, నిబంధనల రూపకల్పన, టెక్నాలజీ మొదలైన వాటిపై కేంద్రం దృష్టి సారిస్తోందని సిన్హా వివరించారు. మేకిన్ ఇండియా విమానాలు.. విమానాలు, డ్రోన్ల తయారీని కూడా మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగం చేయాలని కేంద్రం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. మరికొన్నేళ్లలో భారత్‌కు 1,300 విమానాలు అవసరమవుతాయని ఆయన వివరించారు. ‘ఈ 1,300 విమానాలను విదేశాల నుంచి తెచ్చుకోవాలనుకోవడం లేదు. వీటిని భారత్‌లోనే తయారు చేస్తాం‘ అని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో రక్షణ శాఖ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని పని చేయనున్నట్లు ఆయన వివరించారు. -
కొత్త విమానాశ్రయాలు వస్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన రంగంలో కొద్ది రోజుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. సామాన్యుడికి విమానయోగం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ కింద మరిన్ని చిన్న నగరాల్లో విహంగాలు ఎగురనున్నాయి. కొత్తగా 56 ఎయిర్‌పోర్టులు, 31 హెలిపోర్టులు 18 నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటి అభివృద్ధికి రూ.4,500 కోట్లు వెచ్చిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పధి వెల్లడించారు. విమానాశ్రయాల అభివృద్ధిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ‘పెద్ద విమానాశ్రయాలు బిజీ అవడంతో ఆపరేటర్లకు స్లాట్స్ కేటాయించడం క్లిష్టమైంది. దీంతో తప్పని పరిస్థితుల్లో విమానయాన సంస్థలు చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లతో రంగంలోకి దిగుతున్నాయి. మొత్తంగా మూడు, నాల్గవ తరగతి నగరాలకూ సేవలు విస్తరించాయి’ అని వివరించారు. బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏవోఏ) బుధవారమిక్కడ నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మరో రూ.20,500 కోట్లతో: విమానాశ్రయాల అభివృద్ధికై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చే అయిదేళ్లకుగాను రూ.20,500 కోట్లు వెచ్చించనుంది. ఈ మొత్తంతో 20 విమానాశ్రయాలు కొత్తగా అందుబాటులోకి వస్తాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.కె.చౌకియాల్ వెల్లడించారు. ‘విజయవాడలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం చేపడతాం. ఈ నగరంలో రన్‌వే పనులు నడుస్తున్నాయి. తిరుపతి, కడపలో రన్‌వే పనులు చేపట్టాల్సి ఉంది. ఇవేగాక పలు విమానాశ్రయాల స్థాయి పెంచడం, టెర్మినళ్ల విస్తరణ, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలకు ఖర్చు చేస్తాం’ అని తెలిపారు. కేంద్రం సమకూర్చే నిధులతోపాటు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విమాన ఆపరేటర్లకు ఆర్థిక సాయం చేస్తోందని గుర్తు చేశారు. 11 ఎయిర్‌స్ట్రిప్‌లకు యూపీ ప్రభుత్వం అదనంగా సాయం చేసిందన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ప్రోత్సహిస్తే ఆపరేటర్లు ముందుకు వస్తారని అన్నారు. ఉడాన్ స్కీమ్ కింద ఆపరేటర్లు సర్వీసులు అందించేందుకు ఆసక్తి కనబరిస్తేనే ఎయిర్‌స్ట్రిప్‌ల అభివృద్ధి చేపడతామని వెల్లడించారు. -
నలుగురు కలిసి విమానం కొనండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సూపర్ ప్రీమియం కార్ల కోసం రూ.5 కోట్లకుపైగా వెచ్చించే కస్టమర్లు మన దగ్గర ఎక్కువే. ఇదే ధరకు నాలుగు సీట్ల చిన్న విమానమొస్తుంది. దాన్ని కొనండి. అద్దెకు తిప్పి మీకు ఆదాయాన్ని తెచ్చిపెడతాం. పూర్తి నిర్వహణ బాధ్యత మాదే’’ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు ‘గెట్ సెట్ గో’ వ్యవస్థాపకురాలు కనికా టేక్రివాల్. తమ సంస్థ ద్వారా క్యాబ్ మాదిరి ప్రైవేట్ విమాన సేవలందిస్తున్న కనికా... నలుగురు స్నేహితులు కలిసైనా ఓ బుల్లి జెట్‌ను కొనుక్కోవచ్చన్నారు. మున్ముందు భారత ప్రైవేటు విమానయాన రంగంలో అనూహ్య వృద్ధి ఉండబోతోందని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిశ్రమ తీరుతెన్నులు, కంపెనీ ప్రణాళికలు ఆమె మాటల్లోనే.. బ్యాంకు నుంచి రుణం.. విమానం కొనుగోలుకు ముందుకొచ్చిన వ్యక్తులకు ఇతరత్రా అంశాలతో పాటు బ్యాంకు రుణాల్లోనూ సహకరిస్తాం. నాలుగు సీట్ల విమానానికి కనీసం రూ.5 కోట్లు అవుతుంది. ప్రైవేట్ జెట్ సేవలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. మూడేళ్లలో డిమాండ్ రెండింతలకు చేరనుంది. ప్రపంచవ్యాప్తంగా 400 పైగా విమానాశ్రయాలకు సర్వీసులందిస్తున్నాం. భారత్‌లో 190 విమానాశ్రయాల్లో అడుగు పెట్టాం. జెట్ సెట్ గో ద్వారా బుకింగ్‌కు 100 విమానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 20 కంపెనీలు, వ్యక్తులకు చెందిన 32 విమానాల్ని మేం నిర్వహిస్తున్నాం. పైలట్లతో సహా కంపెనీ సిబ్బంది 160 మంది ఉన్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేశాం. విమానం ఎగిరే ముందు ప్రతిసారి 29 రకాల భద్రతా పరీక్షలు నిర్వహిస్తాం. సొంత విమానాలు.. డిసెంబరులో మా సొంత విమానం అడుగు పెట్టబోతోంది. 8 సీట్ల ఈ విమానానికి రూ.75 కోట్లు వెచ్చిస్తున్నాం. రెండేళ్లలో 8–10 విమానాలను సొంతంగా సమకూర్చుకోవాలన్నది మా ధ్యేయం. ఇందుకోసం ఈ ఏడాదే రూ.190–250 కోట్లు సమీకరిస్తున్నాం. విదేశీ ఇన్వెస్టర్ ఒకరు ఆసక్తి కనబరిచారు. ఇటీవలే ఇండో పసిఫిక్ ఏవియేషన్‌ను సుమారు రూ.65 కోట్లకు కొనుగోలు చేశాం. ఈ కంపెనీ వద్ద రెండు ఫ్లయిట్స్ ఉన్నాయి. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో మా సంస్థకు ఎనిమిది ఆఫీసులున్నాయి. కంపెనీలో క్రికెటర్ యువరాజ్ సింగ్, వ్యాపారవేత్త పునీత్ దాల్మియా పెట్టుబడి పెట్టారు. హైదరాబాద్ నుంచే షటిల్.. జెట్ సెట్ గో ద్వారా పూర్తి విమానాన్ని బుక్ చేసుకోవాలి. జెట్ స్టీల్స్ కింద విడివిడిగా టికెట్లు కొనుక్కోవచ్చు. జెట్ షటిల్ పేరు తో నూతన సర్వీసులను 4 నెలల్లో ప్రారంభిస్తున్నాం. మొదట హైదరాబాద్ నుంచి మొదలు పెడతాం. వైజాగ్, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాలు, సందర్శనీయ స్థలాలకు షటిల్ సర్వీసులుంటాయి. ఒక్కో టికెట్ రూ.15–30 వేల మధ్య ఉంటుంది. నాలుగో స్థానంలో భాగ్యనగరి.. ప్రైవేట్ జెట్స్‌లో ప్రయాణం చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. భాగ్యనగరి నుంచి ప్రతిరోజు అయిదు సర్వీసులు నడుపుతున్నాం. ఏడాదిన్నరలో ఈ నగరం తొలి స్థానం కైవసం చేసుకోవడం ఖాయం. అంతలా ఇక్కడ డిమాండ్ ఉంది. వచ్చే రెండేళ్లు మా ఫోకస్ కూడా ఇక్కడే ఉండబోతోంది. మొత్తంగా జెట్ సెట్ గో నెలకు 600లకుపైగా బుకింగ్స్ నమోదు చేస్తోంది. ఇంధన వ్యయం పెరిగిన కారణంగా ఏప్రిల్ నుంచి ప్రైవేట్ జెట్స్ టికెట్ల ధర 4–12 శాతం పెరిగే ఛాన్స్ ఉంది.