మహిళల భాగస్వామ్యానికి సంబంధించి మిగిలిన రంగాల పరిస్థితి ఎలా ఉన్నా.. విమానయాన రంగంలోని పైలట్ల విషయంలో మాత్రం ప్రపంచంలో భారతే నంబర్ వన్ అట. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వుమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్ విడుదల చేసిన గణాంకాల(2021) ప్రకారం.. దేశంలోని వివిధ ఎయిర్‌లైన్స్ పైలట్లలో 12.4 శాతం మహిళలే. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో వారి ప్రాతినిధ్యం లేదు.
ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 5.8 శాతం మాత్రమే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలైతే.. ప్రపంచ సగటు కన్నా కిందనే ఉండటం గమనార్హం. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో మహిళా పైలట్ల భర్తీ గణనీయంగా పెరిగిందని బ్లూంబర్గ్ మీడియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment