female pilot
-
జల రథ సారథులు
మన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ఉంది. కొచ్చిలో కొత్తగా మెట్రో ఫెర్రీ మొదలైంది. కొచ్చిలో ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ‘మెట్రో వాటర్ ఫెర్రీ’ వ్యవస్థను దక్షిణాసియాలోనే మొదటిసారిగా మొదలెట్టింది. 100 మంది పాసింజర్లను మోసుకెళ్లే ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళా పైలట్లు సెలెక్ట్ అయ్యారు. దేశంలోనే వీరు ప్రథములు. జల రవాణాలో ఇది మహిళా శకం.మొన్నటి సాయంత్రం కొచ్చిలోని హైకోర్టు నుంచి ఫోర్ట్ కొచ్చికి ఫెర్రీ బయలు దేరింది. బ్యాక్‌వాటర్స్‌లో రాత్రి పార్టీలకు కొన్ని హౌస్ బోట్లు బయలుదేరాయి. బెస్త పడవలు వెనుకకు మరలుతున్నాయి. వాటి మధ్య హుందాగా మృదువుగా కదిలింది నీలి రంగు ఫెర్రి. తండ్రి చేయి పట్టుకుని ఫెర్రీ ఎక్కిన ఒక పదేళ్ల అమ్మాయి ఫెర్రీ పైలెట్‌కు సహాయంగా నిలబడి ఉన్న మహిళా పైలెట్‌ను చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత తండ్రితో అంది ‘నాన్నా... నేను కూడా ఇలా అవుతా’. తండ్రి చిరునవ్వు నవ్వి ఆ మహిళా పైలెట్‌తో ‘ఇలా మా అమ్మాయి కావాలంటే ఏం చదవాలమ్మా’ అని అడిగాడు. ఆ ప్రశ్న ప్రస్తుతం కొచ్చిలో ఫెర్రీలలో ప్రయాణిస్తున్న చాలామంది తల్లిదండ్రులతో. అంతగా స్ఫూర్తినిస్తున్నారు కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా పైలట్లు.అరుణిమ, లక్ష్మి, స్నేహఈ ముగ్గురు యువ సారథులు ‘కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్’లో ట్రెయినీలుగా నియమితులయ్యారు. ఫెర్రీలలో అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న వీరు సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి పైలట్లుగా విధులు నిర్వర్తిస్తారు. జనరల్ పర్పస్ రేటింగ్ (జిపిఆర్) కన్వర్షన్ కోర్సు పూర్తి చేసిన వారికే ఈ ఉద్యోగం దొరుకుతుంది. కేరళలో ఈ కోర్సు లభ్యమవుతోంది. కొల్ల్లంకు చెందిన అరుణిమ, తిరువనంతపురంకు చెందిన లక్ష్మి, అలెప్పికి చెందిన స్నేహ వివిధ ఇంజినీరింగ్ డిప్లమాలు చేశాక ఫెర్రీ పైలెట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపారు. అయితే జేపీఎస్ కోర్సు పూర్తి చేశాకనే వారికి ట్రెయినీలుగా అవకాశం వస్తుంది. ఆ కోర్సును కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ట్రెయినీ పైలట్లు నియమితులయ్యారు.75 ఫెర్రీలు 33 వేల పాసింజర్లుకొచ్చి చుట్టూ లంక గ్రామాలు ఉన్నాయి. కొచ్చిలో కూడా ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడానికి మైట్రో రైలు ఉన్నా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. దీంతో ఫ్రభుత్వం దాదాపు లక్షా పదమూడు వేల కోట్ల ఖర్చుతో వాటర్ మెట్రో సర్వీసును మొదలెట్టింది. ఇందులో భాగంగా 75 హైబ్రీడ్ ఫెర్రీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకపోకల కోసం 38 జెట్టీలు నిర్మించారు, 15 రూట్లు ఖరారు చేశారు. దీంతో 33 వేల మంది పాసింజర్లకు మేలు జరుగుతుంది. టికెట్ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది. 100 మంది పాసింజర్లున్న ఫెర్రీ గరిష్టంగా 23 కిలోమీటర్లు గంటలో ప్రయాణిస్తుంది.పురుష ప్రపంచంలో మహిళా సారథులుకేరళలో టూరిజం కోసం ఉపయోగించే హౌస్బోట్లు, ఇతర ఫెర్రీలలోగాని పురుషులే డ్రైవర్లుగా ఉంటారు. మెట్రో ఫెర్రీలలో కూడా పురుష పైలట్లే ఉన్నారు. కాని స్త్రీలు ఈ ఉపాధిలో తప్పక ఉండాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ‘మేము విధులు నిర్వర్తిస్తుంటే అందరూ మా యూనిఫామ్‌లు చూసి మెచ్చుకోలుగా మాట్లాడుతున్నారు’ అంటుంది అరుణిమ. ‘ఉద్యోగంలోకి బెరుగ్గా అడుగుపెట్టాను. కాని మెట్రో ఉద్యోగులు నా బెరుకును కొద్ది రోజుల్లోనే పోగొట్టారు. మేము కలిసి పని చేసే ఒక వాతావరణం ఇక్కడ ఉంది’ అంది లక్ష్మి. ‘ఫెర్రీ పైలట్ అంటే ఫెర్రీని నడపడమే కాదు... క్రౌడ్‌ను కూడా మేనేజ్ చేయాలి. ఫెర్రీ కదులుతుంటే కొంతమంది అంచుల్లో నిలబడతారు. వారిని హెచ్చరించాలి’ అంటుంది స్నేహ. ‘మొదటిసారి మేము ఫెర్రీ లోపలికి వచ్చి చూస్తే ఇదో షిప్పేమో అనిపించేంత ఆధునికంగా ఉంది. అన్ని సాంకేతిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. సీటింగ్ ఏరియా అంతా ఏసి ఉంటుంది’ అని తెలిపింది అరుణిమ.విమానాలు, మెట్రో రైళ్లు, మైట్రో ఫెర్రీలు.... దూసుకుపోతున్న మహిళలకు అభినందనలు. -
Aafrin Hirani: ఆదిలాబాద్ అమ్మాయికి రెక్కలొచ్చాయి
అవును. ఇండిగో రంగు రెక్కలు. ఆకాశంలో దూసుకువెళ్లే రెక్కలు. ఆ రెక్కలు ఇకపై ఎందరినో గమ్యానికి చేర్చనున్నాయి. ఆదిలాబాద్ నుంచి మొదటి మహిళా పైలెట్ అయిన స్వాతి రావు స్ఫూర్తితో అదే అదిలాబాద్ జిల్లా నుంచి రెండో పైలెట్ అయ్యింది ఆఫ్రిన్ హిరానీ. ఇంద్రవెల్లిలో డిపార్ట్మెంటల్ స్టోర్ నడిపే ఆమె తండ్రి ఆఫ్రిన్‌కు ఆపాయింట్మెంట్ లెటర్ రావడంతోటే తన దగ్గర పని చేసే 15 మంది గిరిజన ఉద్యోగులను విమానం ఎక్కించి తిరుపతి తీసుకెళ్లడం విశేషం. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను విమానంలో తీసుకెళ్తున్న ఆఫ్రీన్ తండ్రి ఆఫ్రిన్ హిరానీకి కొంత దారి ముందే పడింది.ఆ దారి వేసింది అదే జిల్లా నుంచి మొదటిసారి కమర్షియల్ పైలెట్ అయిన స్వాతి రావు. 2005లో స్వాతి రావు కమర్షియల్ పైలెట్ అవ్వాలని అనుకున్నప్పుడు వెనుకబడిన జిల్లా కావడం వల్ల ఆమెకు ఏ సమాచారం దొరకలేదు. ఇంటర్నెట్ లేదు. కోర్సు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. తండ్రికి కూడా పెద్దగా వివరాలు తెలియలేదు. కాని అదే సమయంలో ఆమె తమ్ముడు బిట్స్ పిలానిలో చేరడంతో అక్కడి నుంచే వివరాలు తెలుసుకుని అక్కకు చెప్పాడు. దాంతో స్వాతి రావు మొదట హైదరాబాద్‌లో చదివి ఆ తర్వాత ఫిలిప్పైన్స్ వెళ్లి ‘కమర్షియల్ పైలెట్ లైసెన్స్’ (సి.పి.ఎల్) చేసింది. ఇండియా తిరిగొచ్చి పైలెట్ అయ్యింది. ‘నేను పైలెట్ అవ్వాలనుకున్నప్పుడు ఆమె నుంచే స్ఫూర్తి పొందాను’ అంది ఆఫ్రిన్ హిరానీ. ‘మా జిల్లా నుంచి ఆమె పైలెట్ అయినప్పుడు నేనెందుకు కాకూడదు అని గట్టిగా అనుకున్నాను’ అంటుంది ఆఫ్రిన్. 28 ఏళ్ల ఆఫ్రిన్ ఇప్పుడు ఇండిగో పైలెట్. మనం ఏ చెన్నైకో, ఢిల్లీకో ఇండిగోలో వెళుతున్నప్పుడు మనం ఎక్కిన ఫ్లయిట్‌ను ఆఫ్రిన్ నడపవచ్చు. ‘నేను మీ పైలెట్ ఆఫ్రిన్‌ని’ అని మైక్రోఫోన్లో మనకు గొంతు వినిపించవచ్చు. ఆదిలాబాద్ జిల్లా నుంచే మరో అమ్మాయి పైలెట్ కావడం అంటే చిన్న విషయం కాదు. చిల్లర అంగడి నుంచి నింగికి ఆఫ్రిన్ తండ్రి అజిజ్ హిరానీకి ఇంద్రవెల్లిలో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది. అతను స్కూల్ చదువు మాత్రమే చదువుకున్నాడు. భార్య నవీన హిరాని గృహిణి. వారి కుమార్తె ఆఫ్రిన్ పైలెట్ కావాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు మద్దతు పలికారు. ‘నా కూతురికి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇవ్వాలనుకున్నాను’ అంటాడు అజిజ్. అతను ఇంద్రవెల్లిలోని గిరిజనేతర పిల్లలతో పాటు గిరిజన పిల్లలకు కూడా సమాన చదువు అందాలని ‘ఇంద్రవెల్లి పబ్లిక్ స్కూల్’ పేరుతో ఒక స్కూల్ కూడా నడుపుతున్నాడు. ఆఫ్రిన్ తన ప్రాథమిక విద్యను అక్కడే చదివింది. హైదరాబాద్‌లో ఇంటర్ చేసి మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో రెండళ్ల ఫ్లయింగ్ కోర్సు చేసింది. 2020 సంవత్సరం నాటికి పూర్తి యోగ్యతతో ఆమె ఇండియా తిరిగి వచ్చింది. అయితే కోవిడ్ వల్ల ఆమె అపాయింట్మెంట్ ఆలస్యమైంది. ఇటీవలే ఇండిగోలో జాయిన్ అయ్యింది. ‘ఎప్పుడెప్పుడు నా దేశంలో విమానం ఎగరేద్దామా అన్న నా కోరిక ఇన్నాళ్లకు తీరింది’ అంటుంది ఆఫ్రిన్. మత సామరస్యం ఆఫ్రిన్‌కు పైలెట్‌గా అపాయింట్మెంట్ రాగానే ఆమె తల్లిదండ్రులతో పాటు స్టోర్‌లో పని చేసే సిబ్బంది కూడా ఆనందించారు. వారంతా చుట్టుపక్కల పల్లెలకు చెందినవారు. చిరు సంపాదనాపరులు. ఆఫ్రిన్ తండ్రి వారి కోసమని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెంట ఉండి మరీ అందరినీ మొదటిసారి హైదరాబాద్ నుంచి విమానంలో తిరుమల యాత్రకు తీసుకెళ్లాడు. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కినందుకు వారు ఆనందించారు. ఆఫ్రిన్ అంతటి విమానాన్ని నడపబోతుందా అని ఆశ్చర్యపోయారు. ఏమో... రేపు ఈ సిబ్బంది పిల్లల నుంచి మరో స్వాతి, మరో ఆఫ్రిన్ రావచ్చు. ఆడపిల్లలను స్కూల్ మాన్పించడం, చిన్న వయసులో వివాహం చేయడం వంటివి మానుకుని వారికి తగిన సపోర్ట్ ఇస్తే ఆకాశమే హద్దు. -
Indian Women Pilots: ఆకాశమే ఆమె హద్దు..
మహిళల భాగస్వామ్యానికి సంబంధించి మిగిలిన రంగాల పరిస్థితి ఎలా ఉన్నా.. విమానయాన రంగంలోని పైలట్ల విషయంలో మాత్రం ప్రపంచంలో భారతే నంబర్ వన్ అట. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వుమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్ విడుదల చేసిన గణాంకాల(2021) ప్రకారం.. దేశంలోని వివిధ ఎయిర్‌లైన్స్ పైలట్లలో 12.4 శాతం మహిళలే. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో వారి ప్రాతినిధ్యం లేదు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 5.8 శాతం మాత్రమే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలైతే.. ప్రపంచ సగటు కన్నా కిందనే ఉండటం గమనార్హం. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో మహిళా పైలట్ల భర్తీ గణనీయంగా పెరిగిందని బ్లూంబర్గ్ మీడియా తెలిపింది. -
ఎదురొడ్డి గెలిచింది.. అఫ్గాన్ టాప్‌గన్ నీలోఫర్
అది కాబుల్ 1990... రహ్మానీని ప్రసవించేందుకు ఆమె తల్లి ప్రసవ వేదన పడుతోంది. అదే సమయంలో వారి పక్కింటిపై బాంబు దాడి జరిగింది. దీంతో ఆమె ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుపడకపోవడంతో నీలోఫర్ రహ్మానీ ఇంట్లోనే పుట్టింది. ఆ తరువాత కొన్నిరోజులకు రహ్మానీ కుటుంబం పాకిస్తాన్‌కు వలస వెళ్లింది. అక్కడ పెరిగిన రహ్మానీకి.. తన తండ్రి తమ మాతృదేశం అఫ్గాన్ అని, 70 దశకంలో దేశంలో చోటుచేసుకున్న అనేక విషయాల గురించి చెబుతుండేవారు. ‘‘అప్పట్లో మహిళలకు చాలా స్వేచ్ఛ ఉండేది. వీధుల్లో ఎటువంటి భయం లేకుండా తిరిగేవారు. అఫ్గాన్ ఆకాశంలో రష్యన్ జెట్లు ఎగురుతుండేవి. వాటిని చూస్తూ పెరిగిన నేను ఎలాగైనా పైలట్ కావాలనుకునేవాడిని. కానీ అప్పట్లో పైలట్ అవ్వడానికి డబ్బులు లేకపోవడంతో సివిల్ ఇంజినీర్ అయ్యాను. నేను పైలట్ కాకపోయినప్పటికి నా పిల్లల్ని పైలట్‌గా తీర్చిదిద్దాలనుకున్నాను’’ అని చెప్పారు నాన్న. ఆ విషయం రహ్మానీ మనసులో బలంగా నాటుకుపోయింది. నా మాతృదేశం కాదు... రహ్మానీ కుటుంబం పాకిస్తాన్ నుంచి తిరిగి కాబుల్‌కు 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ సమయంలో తన తండ్రి చెప్పిన అప్పటి విషయాలు ఏవీ అఫ్గాన్‌లో కనిపించలేదు. మహిళలు ఎవరూ రోడ్డు మీద తిరగడంలేదు. ఒకరోజు తన చెల్లికి ఆరోగ్యం బాగోక పోవడంతో రహ్మానీ తల్లి, చెల్లెల్ని తీసుకుని హడావుడిగా ఆసుపత్రికి వెళ్లింది. ఈ కంగారులో ఆమె తన కాళ్లకు సాక్సులు వేసుకోవడం మర్చిపోయింది. దీంతో తాలిబన్ పోలీసు అధికారి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఆమె రక్తం కారుతున్న కాళ్లతో ఇంటికి వచ్చింది. అది చూసి చలించిపోయిన రహ్మానీ ఇది నా మాతృదేశం కాదనుకుంది. తొలి మహిళా పైలట్‌గా.. రహ్మానీకి తొమిదేళ్లప్పుడు అమెరికా దళాలు అఫ్గాన్‌లో మోహరించాయి. దీంతో తరచూ జెట్ ఫ్లైట్లు తిరిగే శబ్దాలు వినపడేవి. వాటిని విని విమానం నడపాలన్న కోరిక కలిగింది. పద్దెనిమిదేళ్ల వయసులో రహ్మానీ కాబుల్‌లోని ఆఫీసర్ ట్రైనింగ్ స్కూల్లో పైలట్ కోర్సుకు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు చేసినప్పటికీ అఫ్గాన్ ఎయిర్‌ఫోర్స్ డాక్టర్లు పలుమార్లు ఫిజికల్లీ అన్‌ఫిట్‌గా పరిగణించి తిరస్కరించారు. అనేక ప్రయత్నాల తరువాత ఆఫీసర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు ఒప్పుకోవడంతో.. పైలట్ ట్రైనింగ్‌లో చేరింది. పట్టుదలతో కష్టపడి శిక్షణ తీసుకుని 2013లో పైలట్ అయ్యింది. అఫ్గాన్ తొలి మహిళా పైలట్‌గా వార్తల్లో నిలిచి ఒక్కసారి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది.. పైలట్ అయిన ఆనందం ఎక్కువకాలం నిల్వలేదు. రహ్మానీ గురించి బయటప్రపంచానికి తెలిసినప్పటినుంచే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు రావడం మొదలయ్యాయి. బెదిరింపులకు భయపడి నెలకు మూడు ఇళ్లు మారుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించేవారు. అయినప్పటికీ వాళ్లకు ఫోన్‌కాల్ బెదిరింపులు, ‘మీరు ఎక్కడ నివసిస్తున్నారో మాకు తెలుసు’ అని తాలిబన్ స్టాంపు ఉన్న ఉత్తరాలు వచ్చేవి. అయినా ధైర్యంగా పైలట్ బాధ్యతలు నిర్వహిస్తోన్న రహ్మానీని 2015లో మిచెల్ ఒబామా ‘ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డుతో సత్కరించింది. ఇదే ఏడాది అమెరికాలో ఏడాది పాటు మిలటరీ పైలట్ శిక్షణ తీసుకుని సి–130 సర్టిఫికెట్‌ను పొందింది. దీని ద్వారా వివిధ రకాల మిలటరీ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడిపే వీలుకలిగింది. అయితే ఈ సర్టిఫికెట్ తీసుకున్నరోజే రహ్మానీ తండ్రి ఫోన్ చేసి ఇక ఇక్కడ మేము జీవించలేమని చెప్పారు. రహ్మానీకి ఉద్యోగం వదులుకోవడం ఇష్టంలేక అమెరికాలో ఆశ్రయం కల్పించమని యూఎస్‌ను ఆశ్రయించింది. జన్మ ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల అమెరికా చాలారోజులపాటు అనుమతి ఇవ్వలేదు. చివరికి ప్రముఖ వ్యక్తిగా గుర్తించి దాదాపు ఏడాది తరువాత ఆశ్రయం ఇవ్వడంతో 2018 నుంచి అమెరికాలోని టంపాలో రహ్మానీ నివసిస్తోంది. ఇప్పటికీ తన కుటుంబ సభ్యులను ఎవరైనా అమెరికాకు తీసుకు రాకపోతారా అని ఎదురుచూస్తోంది. -
అ‘పూర్వ’గౌరవం..అంతరిక్షానికి అతిథి
బండ్ల శిరీష అంతరిక్షంలోకి పయనమవగానే ఆ వెనకే మేరీ అనే మహిళ ఈ నెల 20 న స్పేస్ లోకి వెళుతున్నారు. జెఫ్ బెజోస్ కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ మేరీని గౌరవ అతిథిగా తమ తొలి వ్యోమనౌక లోకి ఎక్కిస్తోంది. 82 ఏళ్ల మేరీ అమెరికన్ పైలట్. ఆమె కెరీర్లో ఎన్నో ‘ఫస్ట్’ లు ఉన్నాయి. ఈ వయసులోనూ ఆమె భూమి మీద నడవడం కంటే ఆకాశంలో విహరించడమే ఎక్కువ! ఫ్లయిట్‌ని ఎలా నడపాలో ప్రైవేటు శిక్షణా సంస్థల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతుంటారు. తాజా స్పేస్ ట్రావెల్‌తో ఆమె అంతరిక్షంలోకి వెళ్లిన అతి పెద్ద వయస్కురాలిగా (స్త్రీ పురుషులిద్దరిలో) రికార్డును సాధించినట్లవుతుంది. నేడు – జెఫ్ బెజోస్‌తో మేరీ ఫంక్ ఇరవై రెండేళ్ల వయసులో 1961లో ‘మెర్క్యురీ 13’ అనే ప్రైవేటు స్పేస్ ప్రాజెక్టుకోసం నాసా ఎంపిక చేసిన వ్యోమగామిగా శిక్షణను పూర్తి చేసుకున్నారు మేరీ వాలీ ఫంక్. కానీ ఇంతవరకు ఆమెకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశమే రాలేదు. బహుశా తనొక రికార్డును సృష్టించడం కోసమే ఆ విశ్వాంతరాళం ఆమెను ఇన్నేళ్లపాటు వేచి ఉండేలా చేసిందేమో! తన 82 వ యేట ఈ నెల ఇరవైన ఆమె ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్, ప్రస్తుతం ఈ భూమండలం మీదే అత్యంత సంపన్నుడు అయిన జెఫ్ బెజోస్ కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ గౌరవ అతిథిగా అంతరిక్షానికి రెక్కలు కట్టుకుంటున్నారు! ఆనాడు ‘మెర్క్యురీ 13’ పేరిట వ్యోమయానానికి శిక్షణ పొందిన పదమూడు మంది మహిళ ల్లో మేరీ ఒకరు. అయితే శిక్షణ పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు పక్కన పడిపోయింది. ఆ గ్రూపులో ఒక్కరు కూడా అంతరిక్షంలోకి వెళ్లలేకపోవడమే కాదు.. ఒక బృందంగా కూడా ఏనాడూ వారు కలుసుకోలేదు. అప్పటి మెర్క్యురీ 13 ని గుర్తు చేస్తూ జెఫ్ బెజాస్.. ‘‘మళ్లీ ఇప్పుడు మేరీ వాలీ ఫంక్కి ఆ అవకాశం వచ్చింది. మా గౌరవ అతిథిగా మేము ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళుతున్నాం’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. మేరీ ఫంక్ ఆమెరికన్ విమానయానానికి గుడ్‌విల్ అంబాసిడర్. అక్కడి నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులో తొలి మహిళా ఎయిర్ సేఫ్టీ ఇన్వెస్టిగేటర్. తొలి మహిళా ఫ్లయిట్ ఇన్స్ట్రక్టర్ కూడా. అలాగే అమెరికా ‘ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ’ తొలి మహిళా ఇన్స్పెక్టర్. మేరీ ఫంక్ పైలట్‌గా ఇంతవరకు 19,600 గంటలు విమానాలను నడిపించారు. ఈ నెల అంతరిక్షంలోకి బయల్దేరుతున్న ‘బ్లూ ఆరిజన్’ వ్యోమ నౌక ‘న్యూ షెప్పర్డ్ క్యాప్సూల్’ లో మేరీ ఫంక్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చినట్లయితే 72 ఏళ్ల వయసులో వ్యోమయానం చేసిన దివంగత వ్యోమగామి జాన్ గ్లెన్ రికార్డును ఆమె బ్రేక్ చేసినట్లు అవుతుంది. న్యూ షెప్పర లో మేరీతో పాటు జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు కూడా ఉంటారు. -
నేవీకి కళొచ్చింది
ఈరోజు నేవీ డే. భారత నౌకాదళ దినోత్సవం. ఈ సందర్భంగా సబ్ లెఫ్ట్‌నెంట్ శివాంగి గురించి చెప్పుకోవాలి. నిన్నంతా చెప్పుకున్నాం కదా.. శివాంగి శిక్షణ ముగించుకుని సోమవారం కొచ్చిలో పైలట్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారని, దాంతో భారత నౌకాదళంలో తొలి మహిళా పైలెట్‌గా గుర్తింపు పొందారని! అది నిజమే, ఇప్పుడేమిటంటే.. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఒక ఆసక్తికరమైన సంగతిని వెల్లడించారు. తన పదవయేటే శివాంగి ఆకాశంలో ఎగరాలని అనుకున్నారట. అయితే ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసో, కళ్లకు మాత్రమే అందుతూ గగన విహారం చేస్తుంటే విమానాలను చూసో కాదు! శివాంగి స్వస్థలం బిహార్ లోని ముజఫర్‌పూర్. ఆమె చిన్నతనంలో అక్కడికి తరచు రాజకీయ నాయకులు హెలికాప్టర్లో వచ్చి ఆ చుట్టుపక్కల బహిరంగ సభల కోసం కిందికి దిగేవారు. తండ్రితో పాటు ఆ సభలకు వెళ్లినప్పుడు పెద్దవాళ్లంతా నాయకుల ప్రసంగాలపై ధ్యాస పెడితే, శివాంగి మాత్రం నాయకులు ఎగిరొచ్చిన హెలికాప్టర్‌ను చూస్తూ కలలు కనేవారట. ఆమె ఆశల కలలకు ఆమె తండ్రి రెక్కలు తొడిగారు. ఆ విధంగా శివాంగి స్వప్నమూ సాకారమయింది, తొలిసారి ఒక మహిళ పైలట్‌గా చేరడంతో భారత నౌకాదళానికి గౌరవమూ చేకూరింది. ఏమైనా ఈసారి నేవీడే శివాంగి వల్ల స్పెషల్ అయింది! -
అడవి నుంచి ఆకాశానికి..అనుప్రియ రికార్డ్
భువనేశ్వర్ : గిరిజన గూడాల్లో పుట్టిన ఓ అడవి బిడ్డ ఆకాశానికెగిరింది. చదవుకోడానికి కనీస సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతంలో పుట్టి.. ఏకంగా ఫైలెట్‌గా ఎదిగి ప్రశంసలు అందుకుంటోంది. ఒడిశాలోని మావోయిస్టు ప్రాభల్య ప్రాంతమైన మల్కాన్‌గిరి గిరిజన ప్రాంతానికి చెందిన అనుప్రియా లక్రా(23).. తొలి మహిళా ఫైలెట్‌గా సువర్ణావకాన్ని దక్కించుకున్నారు. కమర్షియల్ విమానాన్ని నడిపే ఆదివాసీ మహిళా పైలట్‌గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించారు. ఈ విధంగా నియమితులైన తొలి గిరిజన యువతి అనుప్రియానే కావడం విశేషం. చిన్నతనం నుంచి పైలట్ కావాలని కలలు కన్న అనుప్రియ...2012లో ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పైలట్ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమయింది. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వరన్‌లోని పైలట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఏడేళ్ల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో కో-పైలట్‌గా ఉద్యోగం సాధించింది. త్వరలోనే కమర్షియల్ ఫ్లైట్స్ ను నడపనుంది. మూలన విసిరేసినట్లు ఉండే గ్రామం నుంచి వచ్చి కమర్షియల్ ఫ్లైట్ నడిపే తొలి ఆదివాసీ మహిళ పైలెట్ ఘనతను సాధించిన అనుప్రియ ఎందరో మహిళలకు ఆదర్శం అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అనుప్రియకు అభినందనలు తెలియజేశారు. ‘అనుప్రియ లక్రా గురించి తెలిసి చాలా ఆనందపడ్డాను. నిబద్ధత, పట్టుదలతో ఆమె అరుదైన విజయాన్ని సాధించారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు’ అంటూ పట్నాయక్ ప్రశంసించారు. అనుప్రియ తండ్రి మరినియాస్ లక్రా.. ఒడిశా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. -
‘ఆమె’కు అందని అంతరిక్షం!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే ప్రాజెక్టు గగన్‌యాన్‌లో ‘ఆమె’కు చోటు దక్కే అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా పంపే వ్యోమగాముల బృందంలో మహిళ ఉంటారని ఇస్రో చైర్మన్ శివన్ గతంలో చెప్పారు. అయితే తాజాగా భద్రతా దళాల నుంచి ఓ పైలట్‌ను పంపాలని ఇస్రో భావిస్తోందని సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే భద్రతా దళాల్లో మహిళా పైలట్ ఎవరూ లేకపోవడంతో ‘ఆమె’కు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశాలు దాదాపు లేవు. ఇప్పటివరకు చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టుల్లో పైలట్లను మాత్రమే పంపించారు. దీంతో తామూ మొట్టమొదటి ప్రాజెక్టులో పైలట్లనే పంపించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి మహిళా వ్యోమగామికి అవకాశం లేకపోయినప్పటికీ భవిష్యత్‌లో చేపట్టే మానవ సహిత యాత్రల్లో మహిళా పౌరురాలికి అవకాశం దక్కుతుందన్నారు. వచ్చే నెల కల్లా గగన్‌యాన్‌లో వెళ్లే బృందాన్ని ఖరారు చేస్తామని, ఇప్పటికే వడబోత మొదలైందన్నారు. 2022లో తొలి గగన్‌యాన్ యాత్ర చేపట్టనున్నారు. -
మహిళా పైలట్‌కు ప్రియాంక ప్రశంస
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్లో ఓ పైలట్ ఫొటోను పోస్టు చేసి పొగడ్తల వర్షం కురిపించారు. అదేంటి పైలట్ ఫొటోను పోస్టు చేసి అంతలా పొగడాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆమె పోస్టు చేసిన ఆ పైలట్ ఓ మహిళ కావడమే దీనికి కారణం. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫతేపూర్ సిక్రీకి ప్రియాంక హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే ఆ హెలికాప్టర్‌ను నడుపుతున్నది ఓ మహిళా పైలట్ కావడంతో ఆనందపడిన ఆమె.. మహిళా పైలట్‌తో సెల్ఫీ దిగారు. తర్వాత ఆ ఫొటో ట్వీట్చూస్తూ ‘ఓ మహిళ నడుపుతున్న హెలికాప్టర్లో ప్రయాణించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. మహిళలను ప్రియాంక పొగడటం ఇదేం మొదటిసారి కాదు. ఆమె తొలి రాజకీయ ప్రసంగంలో సోదరసోదరీమణులకు బదులుగా.. సోదరీసోదరులకు అంటూ వ్యాఖ్యానించారు. -
దివిలో ‘దివ్య’ పథం
గన్నవరం: ప్రపంచంలోనే అతి పిన్న వయసులోనే బోయింగ్ 777 విమానం నడిపిన తొలి మహిళా కమాండర్‌గా గుర్తింపు పొందిన యానీ దివ్య శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ముంబై విమాన సర్వీస్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. దివ్య తండ్రి పఠాన్‌కోట్‌లో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగిగా పనిచేశారు. ఆమె అక్కడే జన్మించారు. తండ్రి పదవీ విరమణ అనంతరం ఆమె కుటుంబం స్వస్థలమైన విజయవాడకు వచ్చి స్థిరపడింది. విజయవాడలోనే పాఠశాల విద్య పూర్తి చేసిన దివ్య 17 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీలో చేరి పైలట్ శిక్షణ పూర్తిచేసుకుంది. 19 ఏళ్లకే ఎయిరిండియాలో కెరీర్ ప్రారంభించింది. తర్వాత స్పెయిన్, లండన్‌లో బోయింగ్ 737 విమాన పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేసుకుని 21 ఏళ్ల వయస్సులో అతిపెద్ద విమానం బోయింగ్ 777 నడపడం ప్రారంభించింది. అతి చిన్న వయసులో బోయింగ్ నడిపిన తొలి మహిళగా దివ్య ప్రపంచాన్ని ఆకర్షించారు. ఎయిరిండియాలో ఆమెకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్నప్పటికి టికెట్ కొనుగోలు చేసి ముంబైకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. -
కరాటే సయీదా, పైలట్ స్వాతికి సాయం
సాక్షి, హైదరాబాద్: కరాటే క్రీడాకారిణి, మహిళా పైలట్‌కు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి అవసరమయ్యే శిక్షణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయీదా ఫలక్ జూలైలో జరిగిన చెన్నై ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లో జరిగే 13వ సీనియర్ ఏషియన్ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో మన దేశం తరఫున పాల్గొననుంది. సోమవారం సెక్రటేరియట్లో సీఎంను సయీదా కలిసింది. కరాటేలో రాణిస్తున్నందుకు సయిదాను అభినందించిన కేసీఆర్.. ఆమె శిక్షణకు అవసరమయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన గంటా స్వాతిరావు 2006లో పైలట్‌గా ఎంపికైంది. రాష్ట్రం నుంచి మొదటి పైలట్ అయిన స్వాతిరావు ఫిలిప్పైన్స్‌లో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తోంది. ఎయిర్‌బస్ పైలట్‌గా మారేందుకు తదుపరి శిక్షణ తీసుకోవాల్సి ఉంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో స్వాతి సీఎంను కలిసింది. పైలట్ శిక్షణకు కావాల్సిన ఖర్చును భరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.