న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్‌లో ఓ పైలట్ ఫొటోను పోస్టు చేసి పొగడ్తల వర్షం కురిపించారు. అదేంటి పైలట్ ఫొటోను పోస్టు చేసి అంతలా పొగడాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆమె పోస్టు చేసిన ఆ పైలట్ ఓ మహిళ కావడమే దీనికి కారణం. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫతేపూర్ సిక్రీకి ప్రియాంక హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే ఆ హెలికాప్టర్‌ను నడుపుతున్నది ఓ మహిళా పైలట్ కావడంతో ఆనందపడిన ఆమె.. మహిళా పైలట్‌తో సెల్ఫీ దిగారు. తర్వాత ఆ ఫొటో ట్వీట్‌చూస్తూ ‘ఓ మహిళ నడుపుతున్న హెలికాప్టర్‌లో ప్రయాణించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. మహిళలను ప్రియాంక పొగడటం ఇదేం మొదటిసారి కాదు. ఆమె తొలి రాజకీయ ప్రసంగంలో సోదరసోదరీమణులకు బదులుగా.. సోదరీసోదరులకు అంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment