బెంగళూరు: కర్ణాటకలో మే 10 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మైసూర్‌లోని ఓ హోటల్‌లో దోసెలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ మేరకు మైసూర్ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు డీకే శివ కుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాలలతో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మైసూర్‌లోని ప్రముఖమై పురాతన రెస్టారెంట్ అయిన హైలారీ హోటల్‌ని సందర్శించారు ఆమె.
అనంతరం అక్కడ హోటల్ యజమానులతో కలసి ఉత్సాహంగా దోసెలు వేశారు. అంతేగాక వారితో కాసేపు ముచ్చటిస్తూ మీ వ్యాపారం నిజాయితీకి, కృషికి, మంచి ఆతిథ్యానికి మారు పేరు అంటూ ప్రశంసించారు. హోటల్ సిబ్బందితో సెల్ఫీ కూడా దిగారు. ఇక్కడ దోసెలు రుచిగా ఉన్నాయని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కూతురిని తీసుకుని అక్కడకు తీసుకువెళ్తానంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, మైసూరులో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. బీజేపీ కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. రాష్ట్రంలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో ప్రతిపక్ష నేతల సమాధులు తవ్వాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఏ నాయకుడి మాటలు విని ఓటు వేయకూడదని, మనస్సాక్షిని అనుసరించి ఓటు వేయాలని సూచించారు. కాగా, 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Perfect dosas are just the beginning; with such skillful hands, there's no limit to the power they can bring to the world. pic.twitter.com/qsgUw6IBeJ
— Congress (@INCIndia) April 26, 2023
(చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన అన్నామలై)
Comments
Please login to add a commentAdd a comment