dosa
-
దోస ప్రింటింగ్ మెషీన్ : వైరల్ వీడియో
‘దోసెలందు డెస్క్‌టాప్ దోసెలు వేరయా’ అని ఎవరూ అనలేదు కానీ ఈ మనసు దోచే దోసెను చూస్తే మాత్రం అనక తప్పదు. పట్నాలోని పూల్‌బాగ్ పట్న కాలేజి’కి ముందు ఉన్న చిన్న హోటల్ యజమాని తయారుచేసే ‘దోశ’‘హార్ట్’ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఆ దోసెను ప్రింటింగ్ మెషీన్‌తో తయారు చేయడం! ఈ ‘యంత్ర దోశ’ను చూసి ఆశ్చర్యపడి, అబ్బురపడి‘ఎక్స్’లో ‘22వ శతాబ్దం ఆవిష్కరణ’ కాప్షన్‌తో మోహిని అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇది చూసి ముగ్ధుడై ముచ్చటపడిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ‘ది డెస్క్ టాప్ దోశ’ అనే కాప్షన్స్‌తో ఈ వీడియోను రీపోస్ట్ చేశారు.ఇంతకూ ఆ వీడియోలో ఏముంది?’ అనే విషయానికి వస్తే... సదరు హోటల్ యజమాని మెషిన్లోని ఐరన్ ప్లేట్‌పై రుబ్బిన పిండి పోసిన వెంటనే ఇటు నుంచి ఒక రోలర్ వచ్చి ‘దోశ’ ఆకారాన్ని సెట్ చేస్తుంది. దీనిపై తగిన దినుసులు వేయగానే అటు నుంచి రోలర్ వచ్చి రోల్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలో ‘ఆహా’ అనిపించేలా దోశను అందిస్తుంది.The Desktop Dosa… https://t.co/gw6EHw3QZ7— anand mahindra (@anandmahindra) November 14, 2024 ఇక సోషల్ మీడియావాసుల రెస్పాన్స్ చూస్తే.... ‘భవిష్యత్తులో ఈ దోసె మెషిన్ ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు’ అన్నారు చాలామంది. కొద్దిమంది మాత్రం... ‘చాల్లేండి సంబడం. ఎంతైనా దోసెకు మనిషి స్పర్శ ఉండాల్సిందే. మనిషి చేసిన దానితో ఇలాంటి యంత్ర దోసెలు సరితూగవు’ అని తూలనాడారు. లోకో భిన్న‘రుచిః’!‘ఇంతకీ ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది..’ అనేది చాలామందికి ఆసక్తి కలిగించే విషయం. ఆ రహçస్యం గురించి అడిగితే... ‘అమ్మా.... ఆశ దోశ అప్పడం వడ... నేను చెప్పనుగాక చెప్పను’ అంటాడో లేక ‘ఇది నా ట్రేడ్ సీక్రెట్టేమీ కాదు. అందరూ బేషుగ్గా చేసుకోవచ్చు’ అని చెబుతాడో... వేచి చూడాల్సిందే. -
'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?
ఆహారప్రియులకు దోస అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దోసల్లో ఎన్నో రకాల వెరైటీలు చూసుంటారు. ఇటీవల పాకశాస్త్ర నిపుణులు కూడా తమ నైపుణ్యం అంతా వెలికి తీసి మరీ డిఫరెంట్ రుచులతో ఈ దోసలను అందిస్తున్నారు. అయితే ఇలాంటి దోస గురించి తెలిసే ఛాన్సే లేదు ఎందుకంటే..ఇది కర్ణాటకలోనే ఫేమస్. అంతేగాదు ఈ దోసకు ఎంతో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అదెంటో చూద్దామా..!.ఈ దోసను కూడా మనం తినే సాధారణ దోస మాదిరిగానే తయారు చేస్తారు కాకపోతే అందులో వేసే దినుసుల్లోనే కొంచెం మార్పులు ఉంటాయి. దీన్ని తగినంత అటుకులు, మొంతులు తప్పనిసరిగా జోడించి తయారు చేస్తారు. అయితే మరి ఏంటి 'తుప్పా' అంటే..కర్ణాటకలో 'తుప్పా' అంటే నెయ్యి అందుకని దీన్ని తుప్పా దోస అని పిలుస్తారు. మనం Ghee Dosa దోస ఇమ్మని ఆర్డర్ చేస్తాం కదా అలాంటిదే కాకపోతే కొద్ది తేడా ఉంటుందంతే.చారిత్రక నేపథ్యం..కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం..ఈ తుప్పా దోస కర్ణాటకలోని ఉడిపి పట్టణంలో ఉద్భవించిందని చెబుతుంటారు. చాళుక్య రాజు సోమేశ్వరుడు- III తన మానసోల్లాస పుస్తకంలో తుప్పా దోస వంటకాన్ని దోసక అని పిలుస్తారని రాశారు. క్రీస్తు శకం నుంచి తమిళనాడు ఆహార సంస్కృతిలో ఈ దోస భాగమని ఆ పుస్తకం పేర్కొంది. ఆఖరికి తమిళనాడు సంగం సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉండటం విశేషం. ఎలా చేస్తారంటే..తయారీ విధానం..ఇడ్లీ బియ్యం 2 కప్పులుపోహా(అటుకులు): 1 కప్పుఉరద్ పప్పు: ½ కప్పు ఉప్పు: 2 స్పూన్మెంతులు: ½ స్పూన్ పైన చెప్పిన పదార్థాలన్నీ సుమారు 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మొత్తగా గ్రైండ్ చేసుకుని రాత్రంతా పులియబెట్టాలినివ్వాలి. ఆ తర్వాత దోసలుగా పెనం మీద వేసి.. బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. అంతే తుప్పా దోస రెడీ..!. అయితే దీన్ని నెయ్యితో దోరగా కాలుస్తారు. ఇక 'చమ్మంతి పొడి' అంటే తమిళంలో కొబ్బరి పొడి అని అర్థం. మనం కొబ్బరి చట్నీతో తింటే వాళ్లు దీన్ని కొబ్బరి పొడితో ఇష్టంగా తింటారట.(చదవండి: మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..) -
దోస స్క్రాపర్ పిచ్చ పిచ్చగా వైరలవుతోంది : మీకూ కావాలా?
పెనానికి అంటుకోకుండా, పేపర్‌లాగా దోస వెయ్యాలంటే అంత ఆషామాషీ కాదు. మరికొంత గృహిణులకు చెయ్యితిరిగిన దోస మాస్టర్లకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా పిండి పెనం మీద,రౌండ్‌గా తిప్ప కాసిన్న ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి, కాస్త కాలాక దోస తిరగవెయ్యాలని చూస్తామా.. అప్పుడు ఉంటుంది అసలు కథ. ఒక్క పట్టాన రానే రాదు.. పోనీ.. ఇంకోటి.. సేమ్ సీన్ రిపీట్.. హన్నన్నా.. నీ సంగతి చూస్తా.. అని ఇంకోటి ట్రై చేస్తే.. అదీ విరిగి ముక్కలవుతుంది. View this post on Instagram A post shared by nameisshekhar4 (@nameisshekhar4) చివరికి యూ ట్యూబ్, అదీ ఇదీ వెతికి వెతికి ఉల్లిపాయ కట్ చేసి తవాకి రాసి, నీళ్లు చల్లి తుడిచి, ఇలా నానా కష్టాలు పడ్డాక మొత్తానికి దోస అయ్యిందనిపిస్తాం. ఇపుడిదంతా ఎందుకంటే.. ఈ బాధలేవీ లేకుండా, చక్కగా దోసను మడతబెట్టేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఏకంగా1.3 కోట్ల వ్యూస్ దక్కించుకుంది. వైరల్ వీడియోలో, పెనం మీద వేసిన దోస అలా అలవోకగా తీస్తున్న స్క్రాపర్‌ని మనం చూడొచ్చు. ఈ అద్భుతమైన స్క్రాపర్ నెటిజన్లు మంత్రముగ్ధులైపోతున్నారు.బ్రో మసాలా దోసపై వేయడం ఇంత ఈజీనా.. సగం టైం క లిసొచ్చింది అని ఒకరు, చాలా బాగుంది. చేతులతో పనిలేకుండా పరిశుభ్రంగా ఉందిని మరొకరు వ్యాఖ్యానించారు. "బహుశా గతంలోబుల్డోజర్ డ్రైవర్’’ ఏమో,ఇన్‌స్టాగ్రామర్ “సిమెంట్ రోలర్” అని కొందరు అభిప్రాయ పడగా, వీటన్నింటికీ మించి ఈ మెషీన్ నాకూ కావాలి అని ఎక్కువ అంది కమెంట్ చేశారు. -
ఇవి.. పొరుగింటి దోసెలు!
వారం మెనూలో దోసె ఉండాల్సిందే... దోసె కూడా బోర్ కొట్టేస్తుంటే ఏం చేద్దాం? పక్క రాష్ట్రాల వాళ్ల వంటింట్లోకి తొంగిచూద్దాం. కేరళ వాళ్లు మనదోనెనే కొద్దిగా మార్చి ఆపం చేస్తారు. కన్నడిగులు చిరుతీయటి నీర్‌దోసె వేస్తారు.కన్నడ నీర్ దోసె.. కావలసినవి..బియ్యం – 2 కప్పులు;కొబ్బరి తురుము – కప్పు;ఉప్పు – చిటికెడు;నూనె – టేబుల్ స్పూన్;తయారీ..– బియ్యాన్ని నాలుగైదు గంటల సేపు లేదా రాత్రంతా నానబెట్టాలి.– బియ్యం, కొబ్బరి తురుము, ఉప్పు కలిపి మిక్సీలో మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం గరుకుగా గ్రైండ్ చేయాలి.– పిండిలో తగినంత నీటిని కలిపి గరిటె జారుడుగా ఉండాలి.– పెనం వేడి చేసి దోసె వేసి కొద్దిగా నూనె వేయాలి. రెండువైపులా కాల్చి వేడిగా వడ్డించాలి.గమనిక: కన్నడ నీర్ దోసెకు పిండిని పులియబెట్టాలిన అవసరం లేదు. రాత్రి నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి వెంటనే దోసెలు వేసుకోవచ్చు. దీనికి సాంబార్, ఆవకాయ– పెరుగు కలిపిన రైతా మంచి కాంబినేషన్.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా – చిటికెడు.తయారీ..– బియ్యాన్ని కడిగి మంచినీటిలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.– మిక్సీలో బియ్యం, కొబ్బరి తురుము వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.– బాణలిలో నీటిని ΄ోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.– మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.– ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి.– ఉదయం ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో కలపాలి.– మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి.– ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి పెనం అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.– మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.– అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.– అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.– ఇందులో నూనె వేయాల్సిన పని లేదు.– ఆపం పెనం లేక΄ోతే దోశె పెనం (ఫ్లాట్‌గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు. -
దోశ, ఊతప్పం మిస్సింగ్.. జొమాటోకు రూ. 15వేలు ఫైన్
జొమాటో, స్విగ్గి వంటి డెలివరీ యాప్స్ వచ్చిన తరువాత నచ్చిన ఫుడ్ బుక్ చేసుకుని, ఉన్నచోటుకే తెప్పించుకుని ఆరగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో డెలివరీలలో సమస్యలు తలెత్తుతాయి. దీనికి సంస్థలు బాధ్యత వహిస్తూ.. జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చినప్పటికీ, తాజాగా మరో సంఘటన తెరమీదకు వచ్చింది.చైనాలోని పూనమల్లి నివాసి ఆనంద్ శేఖర్ 2023 ఆగష్టు 21న జొమాటో యాప్ ద్వారా స్థానిక రెస్టారెంట్ 'అక్షయ్ భవన్' నుంచి ఊతప్పం, దోశ కాంబోతో సహా ఇతర ఆహార పదార్థాలను 498 రూపాయలకు ఆర్డర్ చేసుకున్నారు. కానీ అతనికి ఇచ్చిన డెలివరీలో దోశ, ఊతప్పం మిస్ అయ్యాయి. ఇది గమనించి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించడానికి పదేపదే ప్రయత్నించాడు, కానీ సహాయం లభించలేదు.జొమాటో తాను పెట్టిన పూర్తి ఆర్డర్ అందివ్వలేదని.. నష్టపరిహారం కోరుతూ తిరువల్లూరులోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో కేసు వేశారు. దీనికి జొమాటో కూడా బాధ్యత వహిస్తుందని కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు జొమాటోకు రూ. 15000 జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పునిచ్చింది. -
మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!
బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్‌ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.వీట్ వెజిటబుల్ దోసె..కావలసినవి..గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;ఉప్పు – పావు టీ స్పూన్;నీరు – పావు కప్పు;టొమాటో ముక్కలు – పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;క్యారట్ తురుము – పావు కప్పు;పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు;నూనె – 6 టీ స్పూన్లు.తయారీ..– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.చిల్లీ ఇడ్లీ..కావలసినవి..ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు;తరిగిన అల్లం – 2 టీ స్పూన్లు;తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్లు;తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు;చక్కెర– అర టీ స్పూన్;వినెగర్– టీ స్పూన్;సోయాసాస్ – టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 3 టేబుల్ స్పూన్లు.తయారీ..– పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! -
ప్రింటింగ్ దోశ..
కాగితంపై అక్షరాలు ప్రింట్ తీయడం చూశాం.. ఫొటోలు ప్రింట్ తీయడం చూశాం.. ఫ్లెక్సీలు ప్రింట్లు వస్తున్నాయి. ప్రింటర్లలోనూ కలర్, బ్లాక్ అండ్ వైట్, 3డీ, ఇంకా వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దోశను ప్రింట్ తీయడం ఎప్పుడైనా విన్నారా.. కొత్తగా ఉంది కదూ.. నిజమే ఇటీవల కాలంలో మార్కెట్లోకి కొత్తగా దోశ మేకర్ (ప్రింటర్) అందుబాటులోకి వచి్చంది. వంటింట్లో ఇప్పటికే అనేకరకాలైన ఆధునిక వస్తువులు వినియోగిస్తున్నాం. తాజాగా చెన్నైకి చెందిన ఓ సంస్థ దోశ ప్రింటర్‌ను అభివృద్ధి చేసింది. ప్రింటర్‌కు ఒక వైపు ట్రే ఉంటుంది. అందులో పిండి వేస్తే సరిపోతుంది.నిమిషానికి ఒక దోశ వస్తుంది. దోశను ఎంత మందంతో కావాలనుకుంటే ఆ విధంగా మనం మర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్లిప్ ఆటోమేటిక్ దోశ మేకర్‌కు 360 డిగ్రీల ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్ అమర్చి ఉంటుంది. ఈ యంత్రం 1600 వాట్ల విద్యుత్తు శక్తితో పనిచేస్తుంది. అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తుందని తయారీ సంస్థ పేర్కొంటోంది. పరిమాణం చిన్నగా ఉండటంతో వంట గదిలో ఇట్టే ఇమిడిపోతుంది. ఆటోమేటిక్ సేఫ్టీ కట్ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. 3 నిమిషాలు వినియోగించకపోతే దానంతట అదే పవర్ ఆఫ్ అయిపోతుందట. ఒక్కో ప్రింటర్ రూ.13 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. -
ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్
నెట్టింట యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వుతోంది. అందులో విదేశాల్లోని రెస్టారెంట్లో మన దక్షిణభారతదేశ బ్రేక్‌ఫాస్ట్‌ల పేర్లు, ధరలు గురించి షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌లో.. తాను అమెరికాలోని ఓ రెస్టారెంట్ మన దక్షిణ భారతదేశ అల్పహారాలకు ఫ్యాన్సీ పేర్లు పెట్టి మరీ అమ్మేయడం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. వాటి ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం అన్నారు. నిజంగా ఆ పేర్లు వింటే గనుక ఖానే కా మజా ఖతం(ఇలాంటి పేర్లతో తింటే..తినడంలో ఉండే ఆనందం పోతుంది) అని క్యాప్షన్ జోడించి మరీ సదరు రెస్టారెంట్ మెనుని కూడా జత చేసి మరీ పోస్ట్ చేశారు. అందులో మన దక్షిణ భారతదేశపు అల్పాహారాల పేర్లుకు ఆ మెనులో ఉన్న ఫ్యానీ పేర్లు వరుసగా..వడకి "డంక్డ్ డోనట్ డిలైట్", ఇడ్డీకి "డంక్డ్ రైస్ కేక్ డిలైట్", దోసకి "నేక్డ్ క్రేప్" ఫ్యాన్సీ పేర్లు పెట్టి విక్రయించేస్తున్నారు. ఇక వాటి ధరలు చూస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. ప్లేట్ దోసె ధర రూ. 1400/-, ఇడ్లీ సాంబార్ ధర రూ. 1300/-, వడ ధర రూ.1400/-గా మెనులో ధరలు ఉండటం విశేషం. ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. బహుశా వాళ్లు ఈ వంటకాలు తయారు చేయడానికి ఎంతమంది పనివాళ్లను పెట్టుకున్నారో అందుకే కాబోలు చుక్కలు చూపించేలా ఈ ధరలు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. Who knew vada, idli, and dosa could sound so fancy? With these strange names khaane ka mazaa khatam! Agree 😂? pic.twitter.com/Px94gQGUAd— Harsh Goenka (@hvgoenka) July 2, 2024 (చదవండి: 'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం చేసిన ఆ పర్యటనే..) -
'రజనీకాంత్ స్టైల్ దోసలు': చూస్తూనే ఉండిపోతారు..!
టీఫెన్స్లో రారాణిలా ఓ వెలుగు వెలుగుతున్న వంటకం ఏదంటే..'దోసె'. ఇప్పుడూ రకరకాల చెఫ్‌ల పాకశాస్త్ర నైపుణ్యం పుణ్యామా అని వైరేటీ దోసలు వచ్చేశాయి. కస్టమర్లు కూడా వెరైటీ దోసెలు ట్రై చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పుడూ రోడ్డు సైడ్ ఉండే చిన్న చిన్న స్టాల్స్‌లో కూడా విభిన్నమైన దోసెలు కూడా టేస్టీగా ఉండి కస్టమర్ల మనసులను దోచుకుంటున్నాయి. అయితే ఈ స్ట్రీట్ సైడ్ అమ్మే వ్యాపారస్తుల్లో కొందరూ దోసెలు వేసే విధానం చూస్తే తినాలన్న ఆలోచనకంటే..ఆ స్టైలింగ్ స్కిల్ భలే ఆకట్టుకుంటుంది. అలానే సూపర్‌స్టార్ రజనీ రేంజ్ స్టైల్లో దోసెల వేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు ఓ వ్యాపారి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ముంబైలోని దారరలోని వీధి పక్కన ఉండే ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది. ఆ వ్యాపారి ఏకకాలంలో ఓకేసారి నాలుగు దోసలు వేసే విధానం. అవి రెడి అయ్యాక పెనం మీద తీసే స్టైలింగ్ కోలీవుడ్ నటుడు రజనీకాంత్ స్టైల్లో ఎగరేస్తూ యమ ఫాస్ట్‌గా తీస్తుంటాడు. ఆ పక్కనే ఉన్న సహాయకుడు ఆయన విసిరే ప్రతి దోసెను భలే ఒడిసి పట్టుకునే విధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ స్టాలల్లో విక్రేత దోసెలను వేసే విధానం, వాటిని మడత పెట్టి ప్లేట్లోకి విసిరే విధానం అచ్చం రజనీకాంత్ స్టైల్‌ని పోలి ఉంటుంది. ఈ వీడియోకి "ముంబై ప్రసిద్ద రజనీకాంత్ స్టైల్ దాదార్ దోసవాలా ముత్తు దాస్ కార్నర్, ముంబై స్ట్రీల్ ఫుడ్" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఈ దోస వాలా అతడి సహాయకుడు ఇద్దరు క్రికెట్ టీమ్‌లో ఉండాల్సిన వాళ్లు అంటూ వారి నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఉత్తరాదిన సూర్యుడి భగభగలు..మానవ శరీరంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..) View this post on Instagram A post shared by Rekib Alam (@food.india93) -
షుగర్ కంట్రోల్ కావడం లేదా? అద్భుతమైన ప్రొటీన్-రిచ్ బ్రేక్‌ఫాస్ట్
శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి అల్పాహారం. నిద్ర లేచిన తరువాత శరీరానికి చురుకుదనానికి, గ్లూకోజ్‌ను అందిస్తుంది ఇది. ఆధునిక కాలంలో ప్రొటీన్-రిచ్ఆహారంపై శ్రద్ధపెరిగింది. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఉదయమే ఏం తినాలి అనేది పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో ఐకానిక్ సౌత్ ఇండియన్ టిఫిన్ గురించి తెలుసుకుందామా.ముఖ్యంగా దోసెలంటే ఇష్టముండే వారికి, ప్రొటీన్లు, ఫౌబర్ పుష్కలంగా లభించే అడై దోసె. ఇది కూడా దోసె ఫామిలీకి చెందిందే. సాధారణ దోస కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. దీంతో ఇది షుగర్ పేషంట్లకు కూడా మంచింది. బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం కూడా తీసుకోవచ్చు. అదే అడై దోసె. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే సింపుల్ రెసిపీతమిళనాడులో ఎక్కువగా పాపులర్ అయిన అడై దోసె. ఇది రుచికర మైనది మాత్రమే కాదు, పోషకమైనది కూడా. పైగా పులియబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.పప్పులు, బియ్యం కలయికతో, కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చుకోవాలని చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.తయారీ విధానంబియ్యం , పప్పు (మినప పప్పు, ఉరద్ పప్పు, శనగ పప్పు) శుభ్రంగా కడిగిన తరువాత, 4-6 గంటలు నీటిలో నానబెట్టాలి.తరువాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసేటపుడు రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి, జీలకర్ర, సోపు గింజలు, ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, తరిగిన కొత్తిమీర , ఉల్లిపాయ ముక్కలను కలుపుకోవాలి. పిండి మరీ జారుగా, మరీ గట్టిగా గాకుండా కలుపుకోవాలి.పెనంపై రెండు చెంచాల నూనె లేదా నెయ్యి వేసి చక్కగాదోసెలాగా వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే అడైదోసె రడీ. దీనికి జతగా కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ లేదా సాంబార్తోగానీ వేడి వేడిగా అడై దోసను ఆస్వాదించడమే. -
మె...గా దోస వరల్డ్ రికార్డు: మనసు దో‘సు’కుంటోంది!
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస ప్రపంచ రికార్డు కొట్టేసింది. దోస ఏంటి రికార్డు ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ వివరాలు తెలియాలటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..: కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోస లాంగెస్ట్ దోసగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ఎంటీఆర్ ఫుడ్స్‌కు చెందిన చెఫ్‌ల బృందం ఈ మెగా దోసను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసను తయారు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్‌ను తానే బద్దలు కొట్టింది. చెఫ్ రెగి మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్‌ల బృందం దీనికోసం కష్టపడింది. నెలల పాటు ప్లాన్లు వేసుకొని మరీ విజయవంతంగా ఈ రికార్డు సాధించింది. ఈ దోస తయారీ కోసం రెడ్ రైస్ దోస పిండిని ఉపయోగించారట. 2024 మార్చి 15న బెంగుళూరులోని MTR ఫ్యాక్టరీలో ఈ ఘనతను దక్కించుకున్నామని ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది అని చెఫ్ రెగి మాథ్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
మెడి టిప్స్: ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతో.. ఈ సమస్యకు చెక్!
మన జీర్ణవ్యవస్థలోని ఆహారనాళంలో ప్రతి చదరపు మిల్లీమీటరులోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. జీవక్రియలకు తోడ్పడటంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరం. దీనిలో ఏదైనా తేడాలు రావడాన్ని ‘డిస్బయోసిస్’ అంటారు. ఇది మూడు విధాలుగా రావచ్చు. మొదటిది మేలు చేసే బ్యాక్టీరియా బాగా తగ్గిపోవడం, రెండోది హాని చేసే బ్యాక్టీరియా సంఖ్య ప్రమాదకరంగా పెరగడం, జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా వైవిధ్యం దెబ్బతినడం. ఇలా జరిగినప్పుడు డాక్టర్లు ్రపో–బయాటిక్స్ సూచిస్తారు. ఇవి కొంత ఖర్చుతో కూడిన వ్యవహారం. కానీ తాజా పెరుగు, మజ్జిగ, పులవడానికి వీలుగా ఉండే పిండితో చేసే ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతోనే ‘డిస్ బయోసిస్’ తేలిగ్గా పరిష్కారమవుతుంది. అప్పటికీ తగ్గకపోతేనే ‘ప్రో–బయాటిక్స్’ వాడాల్సి వస్తుంది. కాబట్టి ‘డిస్ బయోసిస్’ నివారణ కోసం ముందునుంచే పెరుగు, మజ్జిగ వంటివి వాడటం ఆరోగ్యానికే కాదు.. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
'వరల్డ్ దోస డే'!: దోస రెసిపీని మొదటగా ఎవరు చేశారంటే..?
భారతదేశంలోని పలు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల్లో దోసదే అగ్రస్థానం. దీన్ని దోస లేదా దోసే/ దోసై వంటి పలు రకాల పేర్లతో పిలుస్తారు. దక్షిL భారతదేశ వంటకమైన ఈ దోసని బియ్యం, మినప్పులను నానబెట్టి రుబ్బగా వచ్చిన మిశ్రమంతో తయారు చేస్తారు. ఎలా పాపులర్ అయ్యిందో తెలియదు గానీ. ప్రపంచమంతా ఇష్టంగా తినే వంటకంగా 'దోస' మొదటి స్థానంలో ఉంది. అందువల్లో దీనికంటూ ఓ రోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది మార్చి 3ని ఈ వంటకానికి అంకితమిచ్చారు. అందువల్లే ప్రతి ఏడాది ఈ రోజున 'వరల్డ్ దోస డే' గా జరుపుకుంటున్నారు. ఈ వంటకం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యిన వంటకంగా నిలిచింది. ఒక సర్వే ప్రకారం..ఫుడ్ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోసలను డెలివరీ చేసినట్లు తేలింది. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోసలను బ్రేక్ ఫాస్ట్‌గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దోసకు క్యాపిటల్‌గా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వంటి మహా నగరాలు నిలిచాయి. అక్కడ రోజుకి లక్షల్లో దోస ఆర్డర్లు వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతలా ఫేమస్ అయిన ఈ దోస వంటకం ఎలా వచ్చింది? దాని చరిత్ర ఏంటన్నది తెలుసుకుందామా!. దోస చరిత్ర.. మొదటగా తమిళనాడులో దోసెను మందంగా మెత్తగా చేసేవారు. ఆ తర్వాత క్రిస్పీగా ఉండే దోసెను కర్ణాటకలో తయారు చేయడం మొదలు పెట్టారు. ఉడిపి అనే రెస్టారెంట్ దోసెను ఇలా క్రిస్పీగా అందించేది. స్వాతంత్య్రానంతరం దోసె క్రేజ్ దేశమంతటా వ్యాపించింది. ఆ తర్వాల ఉత్తర భారతీయులు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. ఈ దక్షిణ భారత వంటాకాన్ని ఢిల్లీలో ఓ మద్రాస్ హోటల్ అక్కడి వారికి పరిచయం చేసింది. 1930లలో ఉడిపి హోటల్ మద్రాస్‌కి విస్తరించడంతో అక్కడ నుంచి ఢిల్లీకి ఇలా పాకింది. ఇక ఆహార ప్రియులు దోసెలను ఇష్టంగా ఆస్వాదించడంతో ఇక చెఫ్‌లు తమ పాకనైపుణ్యానికి పదును పెట్టి మరీ రకరకాల దోసెలను తీసుకొచ్చారు. ప్రజలు వాటిని కూడా ఆస్వాదించడం విశేషం. అలా దోసెలు కాస్త..మసాలా దోస, పనీర్ దోస, మైసూర్ మసాలా దోస, చీజ్ దోస, స్కీజ్వాన్ దోస వంటి రకరకాల దోస రెసిపీలు మార్కెట్లోకి వచ్చేశాయి. అలాగే వీటిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ వంటి వివిధ రకాల చట్నీలతో చెఫ్‌లు నోరూరించేలా అందించడంతో మరింతగా ప్రజాదరణ పొందింది. దక్షిణ భారతదేశంలో ఈ వంటకం ఎలా వచ్చిందనేదనేందకు కచ్చితమైన ఆధారాలు లేవు కానీ సాహిత్య గ్రంథాల్లో వాటి ప్రస్తావన మాత్రం వచ్చింది. వాటి ఆధారంగా దోస మూలం ఆ రాష్టలేనని భావిస్తున్నారు చరిత్రకారులు. దక్షిణ భారతదేశంలోకి ఎలా వచ్చిందంటే.. ఒకటవ శతాబ్దానికి చెందిన సంగం సాహిత్యంలో దోస గురించి ఉంది. ఇక క్రీస్తూ శకం వెయ్యేళ్ల క్రితం ప్రాచీన తమిళంలో ఈ దోసలను తయారు చేసినట్లు ఆహార చరిత్రకారుడు కేటీ అచాయపేర్కొన్నాడు. అంతేగాదు కన్నడ సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉన్నట్లు అచాయ వెల్లడించాడు. అందువల్లే ఈ దోస మూలం ఏ రాష్టం అనేది చర్చనీయాంశంగా మిగిలిపోయింది. "ది స్టోరీ ఆఫ్ అవర్ ఫుడ్" అనే పుస్తకంలో కర్ణాటక రాజు సోమేశ్వర III గురించి ఉంది. ఆయన తన ప్రాచీన సాహిత్య రచన మానసోల్లాసలో దోసను 'దోసకా' అని సంబోధించాడు. పైగా ఆ వంటకం ఎలా తయారు చేస్తారో కూడా వివరించాడు. ఇక ప్రసిద్ధ చరిత్రకారుడు పి తంకప్పన్ నాయర్ ప్రకారం ఈ దోస కర్ణాటకలోని ఉడిపి అనే పట్టణంలో ఉద్భవించిందని ఉంది. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుంటే దోస మూలం ఎక్కడ అనేది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఏదీఏమైన నోరూరించే ఈ రెసిపీని అందరూ ఇష్టంగా ఆస్వాదించడం విశేషమైతే చెఫ్‌లు వాటి పాకనైపుణ్యంతో వెరైటీ దోసలు పరిచయం చేయంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయ్యి, బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలో మంచి క్రేజ్‌ని దక్కించుకున్న టాప్ వంటకంగా నిలిచిపోయింది. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్‌లో ఏది ఇష్టపడతారంటే..) -
World Dosa Day: స్విగ్గీలో 29 మిలియన్ దోసెలు ఆర్డర్
సాక్షి, హైదరాబాద్: అల్పాహారంలో దోసెదే అగ్రస్థానం అనేది ప్రపంచ దోస దినోత్సవ నేపథ్యంలో మరోసారి వెల్లడైంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ పార్టనర్ స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడింంది. ఏటా మార్చి 3వ తేదీన దోసె దినోత్సవం సందర్భంగా స్విగ్గీ ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 లోపు ఏకంగా 29 మిలియన్ల దోసెలు డెలివరీ చేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో నిమిషానికి సగటున 122 దోసెలు ఆర్డర్ అయ్యా యి. ఇందులో బెంగళూరు టాప్‌లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్‌కు ఇష్టమైన స్నా క్–టైమ్ డిష్‌గా దోసె మరోసారి స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్‌కు చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో 447 ప్లేట్ల దోసెలు ఆర్డర్ చేసి.. దేశంలోనే ఛాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు పరాఠాలను ఎక్కువ ఇష్టపడే చండీగఢ్ వాసులు సైతం తమ ఇష్టమైన వంటకంగా దోసెను స్వీకరించడం విశేషం. రంజాన్, క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్ సమయాల్లో అత్యధికంగా ఆర్డర్లు నమోదైన రెండో వంటకంగానూ.. నవరాత్రి సీజన్లో టాప్‌గా దోసె నిలిచింది. వీటిల్లో క్లాసిక్ మసాల దోసె అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో ప్లె యిన్, సెట్, ఉల్లిపాయ, బటర్ మసాలా ఉన్నాయి. చాక్లెట్, పావ్ బాజీ నూడుల్స్ పాలక్, షెజ్వాన్ చాప్సూయ్ స్పెషల్, దిల్ ఖుష్ దోసెలను ప్రజలు ఆస్వాదించారు. -
మిగిలిపోయిన అన్నంతో చిటికెలో దోసె వేసుకోండి..
అన్నం దోసె తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు పుల్లని పెరుగు, రవ్వ, గోధుమ పిండి– 1 కప్పు చొప్పున ఉప్పు – రుచికి సరిపడా వంట సోడా›– 1 టీ స్పూన్ నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా మిక్సీలో అన్నం, పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అందులో రవ్వ, గోధుమపిండి, వంట సోడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని దోసెల్లా వేసుకోవాలి. అభిరుచిని బట్టి ఉల్లిపాయముక్కలు, క్యారెట్ తురుము వంటివి వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. -
‘ఎక్స్’లో హాట్‌టాపిక్‌గా దోశ ధర..!
గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్‌లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్‌లో ఆశిశ్ సింగ్ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్‌కు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్ ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆశిష్ ట్వీట్‌పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్’ అని ఒకాయన కామెంట్ చేశాడు. ‘వీధి టిఫిన్ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్‌ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్ పెట్టాడు. Bc gurgaon is crazy, spent 1K on two Dosa and idli after waiting for 30 min. Suggest good and reasonably priced dosa places. pic.twitter.com/HYPPK6C07U — Ashish Singh (@ashzingh) December 4, 2023 ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..! -
ఆటోమేటిక్ దోసె మేకర్.. నిమిషంలో ఆకలి తీరుస్తుంది
దోసె ఇష్టపడని వాళ్లు అరుదు. ఈ చిత్రంలోని మేకర్ ఒకే ఒక్క నిమిషంలో దోసెలేసి ఆకలి తీరుస్తుంది. దీనిలోని 360 డిగ్రీస్ ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్.. దోరగా వేగిన దోసెలను ట్రేలో అందిస్తుంది. అందుకు వీలుగా వెనుకవైపున్న ట్యాంకర్లో దోసెల పిండి వేసి.. పక్కనే ఉండే బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఈ డివైస్.. కంపాక్ట్ అండ్ పోర్టబుల్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్ సేఫ్టీ కట్ ఆఫ్ ఫీచర్‌తో.. దోసెకు దోసెకు మధ్య 3 నిమిషాల గ్యాప్ ఇస్తుంది. ఈ మోడల్ మేకర్స్‌లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? ఈసారి దోసెలు వేసే పనిని ఈ మేకర్‌కి అప్పగించేయండి! -
బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!
Blue Pea Dosa దక్షిణ భారత వంటకాలు అందులోనూ దోస అంటే నోరు ఊరనిది ఎవరికి. పళ్లు లేని వారుకూడా నమల గలిగేలా మెత్తగా దూదపింజ లాంటి దోస మొదలు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే. ఇక దీనికి సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్‌గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. గతంలో బ్లూ రైస్ వీడియోకూడా వార్తల్లో నిలిచింది. ఇపుడు బ్లూ పీ దోస అన్నమాట. జ్యోతీస్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ రీల్లో బ్లూ పీ దోస ఇపుడు నట్టింట వైరల్‌గా మారింది. నీలి రంగు అపరాజిత పూలను ఉడికించిన నీళ్లలో దోస పిండి కలిపి దోస తయారీ అవుతోంది. ముఖ్యంగా చక్కటి నీలి రంగులో నోరూరించే దోస రడీ కావడం విశేషంగా నిలిచింది. ఇప్పటి 10 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ దోస వీడియోపై Instagram యూజర్లు మిశ్రమంగా స్పందించారు. వావ్ చాలా అద్భుతంగా ఉంది.. బ్యూటిఫుల్ కలర్ అని కొంతమంది కమెంట్ చేశారు. అవును.. శంఖు పూలు ఎడిబుల్.. ఈ పూలతో చేసిన టీ చాలా బావుంటుంది అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. మరికొంతమంది మాత్రం అరే ఎందుకురా..అందమైన దోసను ఇలా పాడు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమందయితే విచిత్రమైన దోసలతో పాపులరైన మరోఫుడ్ బ్లాగర్కి ట్యాగ్ చేశారు. రివ్యూ చే బ్రో... ఎక్కడున్నావ్..లాంటి ఫన్నీ కామెంట్లు కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen) -
వెరైటీగా బీరకాయ దోసెలు ట్రై చేయండి! టేస్ట్ అదుర్స్!
బీరకాయ దోసెలకు కావలసినవి: బియ్యం – అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) పెసలు –అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) బీరకాయ – అర కప్పు (తొక్క తీసేసి, చిన్నగా కట్ చేసుకోవాలి) ఉప్పు – తగినంత, జీలకర్ర – 1 టీ స్పూన్ అల్లం ముక్క – చిన్నది పచ్చిమిర్చి – 3 లేదా 4 నీళ్లు – కొద్దిగా\ పెరుగు – 2 టేబుల్ స్పూన్లు నూనె – కావాల్సినంత ఉల్లిపాయ ముక్కలు – సరిపడా తయారీ విధానం: ముందుగా బీరకాయ ముక్కలను మిక్సీ పట్టుకుని, మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసలు, బియ్యం వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని.. మిక్సీ పట్టుకోవాలి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సరిపడేంత ఉప్పు వేసుకుని మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పెరుగు, బీరకాయ పేస్ట్ వేసుకుని మరోసారి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై కొద్ది కొద్దిగా నూనె వేసుకుని, దోసెలు వేసుకోవాలి. తర్వాత అభిరుచిని బట్టి.. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. (చదవండి: వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!) -
ఇడ్లీ హై జపానీ... టేస్ట్ హై హిందుస్థానీ
‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్. ఈ ట్విట్టర్ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్‌లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్‌ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు. ‘దోశ అండ్ ఇడ్లీ అన్బిలీవబుల్ అథెంటిక్. రెస్టారెంట్లో భారతీయుల కంటే జపాన్ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్‌లో తినడానికి చాప్–స్టిక్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్–స్టిక్స్‌ను ఉపయోగించడం లేదు’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కార్తిక్. -
దోసెలు వేసిన రాహుల్
-
కొత్తిమీరతో గ్రీన్ దోశ.. టేస్ట్‌తో పాటు హెల్తీ కూడా
గ్రీన్ దోశ తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; మినప పప్పు – కప్పు: మెంతులు – టీస్పూను; కొత్తిమీర – కప్పు; పుదీనా – కప్పు; కరివేపాకు – అరకప్పు; జీలకర్ర – అరటీస్పూను; వాము – చిటికెడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – నాలుగు; ఉప్పు – టీస్పూను; నూనె –పావు కప్పు. తయారీ విధానమిలా: ∙బియ్యం, మినపపప్పు, మెంతులను శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙నానాక వీటన్నింటినీ గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి ∙సగం మెదిగిన తరువాత అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేయాలి ∙అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ∙చక్కగా మెదిగిన పిండిని గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి ∙కాలిన పెనంపైన పిండిని దోశలా పోసుకుని కొద్దిగా నూనె వేయాలి ∙రెండువైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ దోశ రెడీ. -
ఆసక్తికరం : చంద్రయాన్ - 3 విజయంలో.. మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర?
భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో పంపిన చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా..ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది. ఈ ప్రయోగం విజయ వంతం కావడం పట్ల ప్రపంచ దేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి. ఈ తరుణంలో ఇస్రో చంద్రయాన్ - 3 విజయం వెనుక మసలా దోశ, ఫిల్టర్ కాఫీ ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇది వినడానికి విచిత్రంగా, నమ్మశక్యంగా లేకపోయినా చంద్రయాన్ - 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో సైంటిస్ట్‌ల నుంచి సేకరించిన సమాచారంతో వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సీనియర్ పాత్రికేయురాలు బర్కాదత్. దీంతో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ నివేదికలు నిజమేనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చంద్రయాన్ -3 సక్సెస్‌లో ‘మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర’ పై ఆ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 వంటి అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు ఒపిక, శక్తి కావాలి. అయితే, ‘ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించడం ద్వారా అలసట అనే విషయాన్ని పక్కన పెట్టాం. ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పనిచేశారు. ఎక్కువ సేపు విధులు నిర్వహించేలా సంతోషంగా ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఇస్రో సైంటిస్ట్‌ల పనితీరు అమోఘం ఇస్రో మాజీ డైరెక్టర్ సురేంద్ర పాల్ కేవలం రూ.150 రూపాయల ఖర్చుతో ఒక సాధారణ ఎద్దుల బండిపై కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రవాణా చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని సైంటిస్ట్‌ల కంటే ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎక్కువగా ఉంటుందని ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ చెప్పారు. బాలీవుడ్ సినిమా నిర్మించేందుకు అయ్యే ఖర్చుతో ఏది ఏమైనప్పటికీ, భారత్ చంద్రయాన్ -3పై చేసిన ఖర్చు, సాధించిన విజయాలు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే? ఒక బాలీవుడ్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతో ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అందరి మన్ననలు అందుకుంది. చంద్రయాన్-3 మిషన్‌ను కేవలం రూ. 615 కోట్ల రూపాయలతోనే ఇస్రో చేపట్టింది. అంతరిక్ష రంగంలో అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 విజయంపై ఈ ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’ -
టిఫిన్‌లో ఇడ్లీ, దోశలు తింటున్నారా? అయితే ఆ వ్యాధి బారినపడ్డట్లే!
సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అని అడిగితే ఎవరైనా ఠక్కున ఇడ్లీ, దోశ అని అనేస్తారు. ఇంతకుముందు అయితే పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని అల్పాహారంగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇడ్లీ, దోశలను తెగ లాగించేస్తున్నాం. దీనికి తోడు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, నెయ్యి లాంటివి కాంబినేషన్‌గా తినేస్తున్నాం. దీనివల్ల రుచి సంగతేమో కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోజులు మారాయి, పద్ధతులు మారాయి, ఆహారపు అలవాట్లూ మారాయి. టిఫిన్స్‌లో ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, వడలను తెగ తినేస్తున్నారు. దీనికి తోడు ఒకేసారి పిండి గ్రైండ్ చేసి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మూడు, నాలుగు రోజులు ఆరంగించేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తప్పితే, ఉదయం, రాత్రిళ్లూ టిఫిన్ల మీద తిని బతికేస్తున్నారు చాలామంది. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా, బోండా లాంటి టిఫిన్లను ధీర్ఘకాలంగా తింటే అనేక రోగాలు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఉదాహరణకు వడ తీసుకుంటే.. బియ్యంతో పోలిస్తే మినపప్పులోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. 12 ఏళ్ల పాటు వరుసగా ఇడ్లీ దోశ తినేవారికి మధుమేహ సమస్యలు తొందరగా వచ్చే అవకాశం ఉందట.ఎక్కువగా ఈ టిఫిన్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కీళ్లనొప్పులు తొందరగా అటాక్ చేస్తాయి. ఇడ్లీ, దోశల్లో అన్ని క్యాలరీలా? అన్ని టిఫిన్స్‌తో పోలిస్తే పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో చాలామంది ఎంచుకునేది ఇడ్లీనే. ఇది ఆరోగ్యానికి కాస్త మంచిదే అయినా దాంతో తినే సాంబార్, కారంపొడి వంటివి అసిడిటీని పెంచేస్తాయి. రెండు ఇడ్లీలు తింటే 60 కేలరీలు వస్తాయి. అందుకే ఇడ్లీలను రవ్వతో కాకుండా జొన్నలు, రాగులతో చేసుకుంటే బెటర్. ఇక దోశల్లో వాడే నూనె చాలా ముఖ్యమైనది. చాలామంది టిఫిన్స్ బయట హోటళ్లలో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం, నాణ్యత లేని ఆయిల్‌ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక దోశ తింటే 132 క్యాలరీల శక్తి వస్తుంది. రోజూ దోశ తినే అలవాటు ఉంటే బియ్యానికి బదులుగా ఓట్స్, రాగితో హెల్తీ దోశ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు. బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి ►చద్దన్నం, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటే కొద్దిరోజుల్లోనూ మీ శరీరంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు. ► కొంతమంది రాత్రిళ్లు కూడా టిఫిన్లు తినేస్తుంటారు. వాటిని తగ్గించేసి రాత్రిపూట పండ్లను తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి. ►ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. -ఇక ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫిన్స్ తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు వారానికి ఒకటి లేదా రెండుసార్లకు పరిమితం చేస్తే మంచిది. సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా హెల్తీ అని లాగించేవాళ్లు కాస్త డైట్ ప్రకారం మితంగా తీసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యం తప్పదంటారు న్యూట్రిషియన్లు. -
సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!
మనసు దోచే దోసె గురించి ఎంత చెప్పినా తక్కువే. దోసె ప్రియుల కోసం సరికొత్త ‘ఫుడ్ చాలెంజ్’ ముందుకు వచ్చింది. ‘ఆరడుగుల పొడవు ఉన్న దోసెను ఒక్క సిట్టింగ్‌లో తినగలరా?’ అనే సవాలు విసురుతుంది ఈ ఫుడ్ చాలెంజ్. విజేత పొట్టశ్రమ వృథా పోదు. పదకొండు వేల రూపాయలను నగదు బహుమతిగా ఇస్తారు. పాపులర్ బ్లాగర్స్ వాణి, సావిలు ‘సమ్‌వన్ హు కెన్ ఫినిష్ దిస్?’ ట్యాగ్‌తో పోస్ట్ చేసిన ‘ఫుడ్ చాలెంజ్’ 5.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఢిల్లీలోని పాపులర్ రెస్టారెంట్ ‘దోసె ఫ్యాక్టరీ’లో ఈ ఆరు అడుగుల దోసెను తయారు చేయడంతోపాటు షూట్ చేశారు. మూడు రకాల మసాలాలు, నెయ్యితో తయారు చేసిన ఈ మెగా దోసెకు సాంబార్, చట్నీ, రవ్వ కేసరి కాంబినేషన్లుగా ఉంటాయి. ‘టైమ్ లిమిట్ లేకపోతే ఈజీగా లాగించవచ్చు’ అని కొందరు నెటిజనులు స్పందించారు. (చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!)