Anantapur Savitramma Selling Dosa For One Rupee, See Her Life Story In Telugu - Sakshi
Sakshi News home page

Savitramma Dosa History: రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..?

Published Sat, Jan 22 2022 12:29 PM | Last Updated on Sat, Jan 22 2022 2:41 PM

Old Woman Sold Dosa For One Rupee In Anantapur District - Sakshi

రూపాయి దోసెలు తింటున్న స్థానికులు (ఇన్‌సెట్‌) సావిత్రమ్మ

హోటల్‌లో దోసె తినాలంటే రూ.20 నుంచి రూ.50లోపు వెచ్చించాలి. అయితే ఓ వృద్ధురాలు రూపాయికే దోసె విక్రయిస్తూ సామాన్యుల కడుపు నింపుతోంది. ఎర్రకారం,   బొంబాయి చట్నీతో దోసె తింటుంటే ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు అంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా రూపాయికే దోసె విక్రయిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు. తనకు కూలి గిట్టుబాటు అయితే చాలు పెద్దగా లాభాపేక్ష ఏమీ లేదని చెబుతోంది. 

తాడిపత్రి టౌన్‌(అనంతపురం జిల్లా): తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధికి చెందిన వెంకట్రామిరెడ్డి, సావిత్రమ్మ దంపతులు. వీరికి చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మీదేవి, సరళ సంతానం. 40 ఏళ్ల కిందట వెంకట్రామిరెడ్డి టీ బంకు పెట్టుకుని జీవనం సాగించేవాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని వెంకట్రామిరెడ్డి భార్య సావిత్రమ్మ ఇంటి వద్ద బంకు ఏర్పాటు చేసుకుని దోసెలు వేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో దోసె ధర పావలా. అలా దోసెలు వేసి అమ్మగా వచ్చిన సంపాదనను కుటుంబానికి, పిల్లల చదువులకు ఖర్చు చేసింది. వీధిలోని వారు, చుట్టుపక్కల పేదలు, విద్యార్థులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ దోసెలు తినేవారు.

చదవండి: నెట్‌ సెంటర్‌లో వెబ్‌ వాట్సాప్‌ లాగౌట్‌ చేయని మహిళ.. చివరికి..

15 ఏళ్ల తరువాత బియ్యం, వంట నూనె ధరలు పెరగడంతో దోసె ధరను 50 పైసలకు పెంచి వ్యాపారం కొనసాగించింది. తరువాత కొన్నాళ్లకు భర్త అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం మొత్తం సావిత్రమ్మపైనే పడింది. తన సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో దోసె ధరను రూపాయికి పెంచింది. ఎర్రకారం, బొంబాయి చట్నీ కాంబినేషన్‌లో దోసె ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సావిత్రమ్మ వయసు 70 సంవత్సరాలు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి సంతోషంగా జీవనం గడుపుతోంది. పేదలు, సామాన్యులకు అతి తక్కువ ధరలో దోసె విక్రయిస్తూ కడుపు నింపుతున్నానన్న ఆనందం చాలని అంటోంది.

చాలా రుచిగా ఉంటాయి 
నేను ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి సావిత్రమ్మ అవ్వ దగ్గర దోసెలు తింటున్నాను. నూనె, బియ్యం ధరలు పెరిగినప్పటికీ పేదలకు అందుబాటులో రుచిరకంగా ఆతీ్మయంగా దోసెలు అమ్ముతోంది. కాలనీలో దోసెల అవ్వ అంటే తెలియని వాళ్లు ఉండరు.  
– జబ్బార్‌ బాషా, కాల్వగడ్డ, తాడిపత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement