![Vro Threatens Woman In Tadipatri](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/ananthapur1.jpg.webp?itok=BmolNxFf)
సాక్షి, అనంతపురం జిల్లా: కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన రామరాజ్యం నాడు. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరికి పంపు అని వీఆర్వో అడిగిన రావణ పాలన నేడు. రేషన్ కార్డు అడిగిన పాపానికి పేద వృద్ధురాలికి వచ్చిన బెదిరింపు ఇది.
‘రేషన్‌కార్డు కావాలంటే నీ కూతురిని నా దగ్గరకు పంపించు’ అన్న ఓ వీఆర్వో కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు తన వేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో అధికారులు ఆ కీచక వీఆర్వోపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది.
తాడిపత్రి మునిసిపల్ అధికారులకూ విన్నవించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అనంతపురం ఆర్డీవో కేశవనాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాడిపత్రి తహసీల్దార్ రజాక్‌వలి శుక్రవారం నాగమునెమ్మను తన కార్యాలయానికి పిలిచి విచారించి.. నివేదికను ఆర్డీవోకు అందించారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/15_28.png)
ఇదీ చదవండి: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం
Comments
Please login to add a commentAdd a comment