సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.
‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment