one rupee
-
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. -
ఒక్క రూపాయి 20 లక్షల మంది రైతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని గతంలో నిర్ణయించి ఇటీవల అందులో సరిగ్గా రూ. 99,999 వరకు తీసుకున్న రైతుల రుణమాఫీ సొమ్మును మాఫీ చేసింది. అలాగే రూ. 99,999 నుంచి రూ. లక్ష వరకు శ్లాబ్ అంటే కేవలం ఒక రూపాయి తేడా ఉన్న రైతు రుణాలను త్వరలో మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ఒక్క తేడాలోనే రైతుల సంఖ్య, రుణమాఫీ సొమ్ము భారీగా ఉండటం గమనార్హం. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా అందులో ఇప్పటివరకు 16.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించింది. ఇంకా రూ. 99,999 నుంచి రూ. లక్ష మధ్య అంటే ఒక్క రూపాయి తేడాలోనే ఏకంగా 20.02 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఇంకా రుణమాఫీ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరూ రూ. 99,999 లెక్కకు రుణాలు తీసుకోరు. రౌండ్ ఫిగర్ తీసుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 99,999 వరకు శ్లాబ్‌గా గుర్తించి ప్రస్తుతం రుణాలను మాఫీ చేసింది. రూ. లక్ష నుంచి రూ. 4–5 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులూ చాలా మంది ఉండగా వారికి రూ. లక్ష వరకు మాత్రమే రుణమాఫీ జరగనుంది. రూ. లక్ష అంతకుమించి రుణాలు తీసుకున్న రైతులే ఎక్కువ మంది ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు..
History Of The Indian Rupee: భారతదేశానికి స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. అయితే 1947 నుంచి ఇండియన్ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఎలా ఉండేది? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ. 3.30గా ఉండేది. అయితే ఈ విలువ క్రమంగా ప్రతి సంవత్సరం పడిపోతూ వచ్చింది. ఇప్పుడు అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 82.73 రూపాయలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మన కరెన్సీ విలువ ఎంతగా తగ్గిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. కాగా 1949 నుంచి 1966 వరకు USD-INR ఎక్సేంజ్ రేటు రూ. 4.76 వద్ద కొనసాగింది. ఆ తరువాత క్రమంగా పడిపోతూ వచ్చింది. 1947 నుంచి 2023 వరకు ఇండియన్ రూపాయి హిస్టరీ.. సంవత్సరం - ఎక్సేంజ్ రేట్(USD/INR) 1947 3.30 1949 4.76 1966 7.50 1975 8.39 1980 7.86 1985 12.38 1990 17.01 1995 32.427 2000 43.50 2005 (జనవరి) 43.47 2006 (జనవరి) 45.19 2007 (జనవరి) 39.42 2008 (అక్టోబర్) 48.88 2009 (అక్టోబర్) 46.37 2010 (జనవరి) 46.21 2011 (ఏప్రిల్) 44.17 2011 (సెప్టెంబర్) 48.24 2011 (నవంబర్) 55.39 2012 (జూన్) 57.15 2013 (మే) 54.73 2013 (సెప్టెంబర్) 62.92 2014 (మే) 59.44 2014 (సెప్టెంబర్) 60.95 2015 (ఏప్రిల్) 62.30 2015 (మే) 64.22 2015 (సెప్టెంబర్) 65.87 2015(నవంబర్) 66.79 2016(జనవరి) 68.01 2016(జనవరి) 67.63 2016(ఫిబ్రవరి) 68.82 2016 (ఏప్రిల్) 66.56 2016 (సెప్టెంబర్) 67.02 2016 (నవంబర్) 67.63 2017 (మార్చి) 65.04 2017 (ఏప్రిల్) 64.27 2017 (మే) 64.05 2017 (ఆగస్టు) 64.13 2017 (అక్టోబర్) 64.94 2018 (మే) 64.80 2018 (అక్టోబర్) 74.00 2019 (అక్టోబర్) 70.85 2020 (జనవరి) 70.96 2020 (డిసెంబర్) 73.78 2021 (జనవరి) 73.78 2021 (డిసెంబర్) 73.78 2022 (జనవరి) 75.50 2022 (డిసెంబర్) 81.32 2023 (జనవరి) 82.81 2023 (జూన్) 83.94 నిజానికి 1950 లలో ఒక రూపాయికి 16 అణాలు, 64 పైసలుగా విభజించారు. ఆ తరువాత 1 రూపాయికి 100 పైసలుగా ఫిక్స్ చేశారు. కాలక్రమంలో రూపాయి మాదిరిగానే అమెరికన్ డాలర్ కూడా ద్రవ్యోల్భణ ప్రభావానికి గురైంది. కొన్ని నివేదికల ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో రూపాయి & డాలర్ రెండూ సమానమే అని నమ్మేవాళ్ళు. దీనిపైనా అనేక వాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో మెట్రిక్ సిస్టం వంటివి లేదు కాబట్టి అన్ని కరెన్సీలు ఒక విలువను కలిగి ఉండేవని భావించేవారు. అధికారిక రికార్డుల ప్రకారం ఇది ఎప్పటికి సమానం కాదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా.. 1947కి ముందు భారతదేశం బ్రిటిష్ పాలిత రాష్ట్రంగా ఉండేది, కాబట్టి పౌండ్ విలువ ఎక్కువగా ఉన్నందున INR విలువ ఎక్కువగా ఉండేది. ఇక్కడ 1947లో 1 పౌండ్ 13.37 రూపాయలకు సమానమని నమ్మేవారు. 1944లో బ్రిటన్ వుడ్స్ ఒప్పందాన్ని ఆమోదించినప్పటి నుంచి చరిత్ర ప్రధానంగా ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందం ప్రపంచంలోని ప్రతి కరెన్సీ విలువను నిర్ణయించింది. -
రూపాయికే బస్సు ప్రయాణం.. దేశమంతా తిరగొచ్చు..
సాక్షి, సిటీబ్యూరో: బస్సు ప్రయాణీకులకు బంపరాఫర్. ఇంటర్–సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సేవలందించే న్యూగో సంస్థ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 15న తమ రవాణా మార్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం రూపాయితోనే ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ.. పర్యావరణ స్థిరత్వంతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఈవీ సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. పంద్రాగస్టు రోజున ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందడానికి బుకింగ్స్ మొదలయ్యాయని, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తమ రవాణా సేవలు కొనసాగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇండోర్– భోపాల్, ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ– ఆగ్రా, ఢిల్లీ–జైపూర్, ఆగ్రా–జైపూర్, బెంగళూరు–తిరుపతి, చెన్నై–తిరుపతి, చెన్నై–పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగుతున్నాయని, దేశమంతా ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. బుకింగ్స్ కోసం న్యూగో వెబ్సైట్ https:// nuego. in/ booking, సంస్థ అధికారిక మొబైల్ అప్లికేషన్లలోనూ బుకింగ్ చేసుకోవచ్చని దేవేంద్ర చావ్లా తెలిపారు. ఇది కూడా చదవండి: ఒకే నెలలో ఇన్ని పరీక్షలా? -
ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాడిని: విజయ్ సేతుపతి
‘‘షారుక్ ఖాన్ కోసమే ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్నాను. నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా కూడా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల (జూన్ 2) విడుదలైంది. ప్రస్తుతం ఆయన షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ‘జవాన్’ లో విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ–‘‘షారుక్ అంటే నాకు అభిమానం. ఆయన కోసమే ‘జవాన్’లో విలన్‌గా చేస్తున్నా. నాకు పారితోషికం ఇవ్వకున్నా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అంటూ షారుక్ ఖాన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న విడుదలకానుంది. కాగా త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ (2019) లో విజయ్ సేతుపతి నటనపై షారుక్ ఖాన్ గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. -
Viral: కట్నంగా రూపాయి చాలు.. 11 లక్షలు, బంగారు ఆభరణాలు వెనక్కి
ముజఫర్‌నగర్: కట్నంగా ముట్టజెప్పిన రూ.11 లక్షలు, బంగారు ఆభరణాలను వద్దంటూ వెనక్కిచ్చి ఆదర్శంగా నిలిచాడో యువకుడు. కేవలం రూ.1 కట్నం తీసుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్ చౌహాన్‌కు లఖాన్ గ్రామం ఓ మాజీ జవాను కూతురుతో శుక్రవారం పెళ్లయింది. వరకట్నం కింద వధువు తల్లిదండ్రులు రూ.11 లక్షల కట్నం, ఆభరణాలు ఇవ్వగా కట్నం అక్కర్లేదంటూ తిరిగిచ్చేశాడు. ‘‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా’నంటూ వారినుంచి కేవలం ఒక్క రూపాయి తీసుకున్నాడు. దాంతో ఆహూ తులు సౌరభ్‌పై అక్షింతలతోపాటు ప్రశంస జల్లులు కూడా కురిపించారు. సమాజంలో మంచి మార్పు కోసం ముందడుగు వేశాడంటూ మెచ్చుకున్నారు. -
రూపాయి తెచ్చిన పంచాయితీ !
నల్గొండ (కోదాడరూరల్) : వాటర్ ప్యాకెట్ రేటుపై మద్యం దుకాణ నిర్వాహకుడికి మందుబాబులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అనంతగిరి మండలం గోల్తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగేందుకు పట్టణంలోని ప్రమీలటవర్ సమీపంలోని ఓ వైన్స్ వద్దకు వచ్చారు. మద్యంతో పాటు వాటర్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు. అయితే వైన్స్ నిర్వాహకుడు వాటర్ ప్యాకెట్‌కు రూ.3 తీసుకున్నాడు. దీంతో వారు వాటర్ ప్యాకెట్ రేటు రూ.2 కదా రూ.3 ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ నెలకొంది. మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి వైన్స్ కౌంటర్లో ఉన్న వ్యక్తిని బయటకు లాగి గొడవకు దిగాడు. కౌంటర్ బల్లాపై ఉన్న మద్యం సీసాలను పగలకొట్టాడు. దీంతో కౌంటర్‌నుంచి బయటకు వచ్చిన వైన్స్ నిర్వాహకుడు కోపంతో బీరుసీసా తెచ్చి తలపైకొట్టడంతో అతని తల పగిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. -
ఒక్క రూపాయి డాక్టర్ సుషోవన్ ఇకలేరు
కోల్‌కతా: ఒక్క రూపాయి డాక్టర్‌గా పేరు గడించిన బెంగాల్ వైద్యుడు సుషోవన్ బంధోపాధ్యాయ(84) మంగళవారం కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ అనారోగ్య సమస్యలతో ఆయన రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. ఫీజుగా ఒక్క రూపాయి మాత్రమే తీసుకునే ఈ వైద్యుడిని అంతా ఏక్ టాకర్ డాక్టర్(ఒక్క రూపాయి డాక్టర్)అని బెంగాల్లో పిలుచుకునేవారు. ఒక పర్యాయం ఎమ్మెల్యే కూడా అయిన ఈయన వైద్య వృత్తిలో 60 ఏళ్లపాటు సేవలందించారు. 2020లో ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అదే ఏడాది ఆయన్ను అత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటుదక్కింది. సుషోవన్ మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. -
బంపర్ ఆఫర్: రూపాయికే లీటర్ పెట్రోల్
సాక్షి, ముంబై: వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, గురువారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోలాపూర్‌లోని ఓ పెట్రోల్ బంక్ ఓనర్.. రూపాయికే లీటర్ పెట్రోల్ అని 500 మందికి పెట్రోల్ఇచ్చారు. దీంతో ఆఫర్ విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్ వద్ద క్యూ కట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారులకు కట్టడి చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. सोलापुरात डॉ. बाबासाहेब आंबेडकर जयंती निमित्त फक्त 1 रुपयात 1 लीटर पेट्रोल यावर तुमची प्रतिक्रिया कमेंट्स करून सांगा#maharashtratoday #solapur #AmbedkarJayanti #AmbedkarJayanti2022 pic.twitter.com/Bhhg4VxsP3 — Maharashtra Today (@mtnews_official) April 14, 2022 ఈ సందర్భంగా బంక్ యజమాని మాట్లాడుతూ.. భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. కాగా, 500 మందికే పెట్రోల్ ఇవ్వడంతో మిగిలిన వారంతా ఉసురూమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..?
హోటల్లో దోసె తినాలంటే రూ.20 నుంచి రూ.50లోపు వెచ్చించాలి. అయితే ఓ వృద్ధురాలు రూపాయికే దోసె విక్రయిస్తూ సామాన్యుల కడుపు నింపుతోంది. ఎర్రకారం, బొంబాయి చట్నీతో దోసె తింటుంటే ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు అంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా రూపాయికే దోసె విక్రయిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు. తనకు కూలి గిట్టుబాటు అయితే చాలు పెద్దగా లాభాపేక్ష ఏమీ లేదని చెబుతోంది. తాడిపత్రి టౌన్(అనంతపురం జిల్లా): తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధికి చెందిన వెంకట్రామిరెడ్డి, సావిత్రమ్మ దంపతులు. వీరికి చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మీదేవి, సరళ సంతానం. 40 ఏళ్ల కిందట వెంకట్రామిరెడ్డి టీ బంకు పెట్టుకుని జీవనం సాగించేవాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని వెంకట్రామిరెడ్డి భార్య సావిత్రమ్మ ఇంటి వద్ద బంకు ఏర్పాటు చేసుకుని దోసెలు వేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో దోసె ధర పావలా. అలా దోసెలు వేసి అమ్మగా వచ్చిన సంపాదనను కుటుంబానికి, పిల్లల చదువులకు ఖర్చు చేసింది. వీధిలోని వారు, చుట్టుపక్కల పేదలు, విద్యార్థులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ దోసెలు తినేవారు. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. 15 ఏళ్ల తరువాత బియ్యం, వంట నూనె ధరలు పెరగడంతో దోసె ధరను 50 పైసలకు పెంచి వ్యాపారం కొనసాగించింది. తరువాత కొన్నాళ్లకు భర్త అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం మొత్తం సావిత్రమ్మపైనే పడింది. తన సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో దోసె ధరను రూపాయికి పెంచింది. ఎర్రకారం, బొంబాయి చట్నీ కాంబినేషన్లో దోసె ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సావిత్రమ్మ వయసు 70 సంవత్సరాలు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి సంతోషంగా జీవనం గడుపుతోంది. పేదలు, సామాన్యులకు అతి తక్కువ ధరలో దోసె విక్రయిస్తూ కడుపు నింపుతున్నానన్న ఆనందం చాలని అంటోంది. చాలా రుచిగా ఉంటాయి నేను ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి సావిత్రమ్మ అవ్వ దగ్గర దోసెలు తింటున్నాను. నూనె, బియ్యం ధరలు పెరిగినప్పటికీ పేదలకు అందుబాటులో రుచిరకంగా ఆతీ్మయంగా దోసెలు అమ్ముతోంది. కాలనీలో దోసెల అవ్వ అంటే తెలియని వాళ్లు ఉండరు. – జబ్బార్ బాషా, కాల్వగడ్డ, తాడిపత్రి -
అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..
పెద్దాపురం: ఈ రోజుల్లో రూపాయి పెట్టి ఏం కొనుక్కోవచ్చో ఠక్కుమని చెప్పండి.. కాస్త ఆలోచించారు కదూ.. రూపాయి పెడితే ఓ చిన్న చాక్లెట్టో, ఓ బిస్కెట్టో కొనుకోవచ్చు అని అనుకుంటున్నారా? నిజమే.. కానీ ఆ హోటల్లో రూపాయికి 3 చట్నీలతో ఇడ్లీ వస్తుంది. ఏంటి రూపాయికి ఇడ్లీయా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. రాజమహేంద్రవరం–కాకినాడ ఏడీబీ రోడ్డులో కొత్తూరు జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళితే ఆర్బీ కొత్తూరు గ్రామం వస్తుంది. పెద్దాపురం మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ (రాంబాబు), రాణి దంపతులు ఇంటి బయట పూరి గుడిసెలో 16 ఏళ్లుగా హోటల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక్క రూపాయికే 3 చట్నీలతో ఇడ్లీ అమ్ముతున్నారు. ఇక్కడ మైసూరు బజ్జీ కూడా ఒక్క రూపాయే. ఊళ్లోని ఇతర హోటళ్లు అన్నింట్లో తొలుత రూపాయికే ఇడ్లీ ఇచ్చేవారు. క్రమేపీ సరుకుల ధరలు పెరగడంతో మిగిలిన హోటళ్లలో ఇడ్లీ ధరలను పెంచేశారు. రాంబాబు మాత్రం ఇప్పటికీ రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు. రాంబాబు హోటల్లో రుచికే కాదు శుచికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రత పాటిస్తూ టిఫిన్ అందిస్తారు. దీనికి నాణ్యత కూడా తోడవడంతో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి ఇక్కడ క్యూలో నిలుచుని మరీ టిఫిన్ చేస్తుంటారు. ఇంట్లోనే హోటల్ నిర్వహిస్తుండటంతో అద్దె కట్టే పని లేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తుండటంతో పెద్దగా లాభాలు లేకపోయినా హోటల్‌ను నడిపిస్తున్నామని రాంబాబు చెబుతున్నాడు. రోజుకు సుమారు 500 మంది తన హోటల్‌కు వస్తారని తెలిపాడు. వేడివేడిగా బజ్జీలు వేస్తున్న అత్త రత్నావతి నాకు సంతృప్తిగా ఉంది రూపాయి అనే పదానికున్న ప్రత్యేకత వేరు. రూపాయికే వైద్యం అంటారు. రూపాయికే కిలో బియ్యం అంటారు. ఇవన్నీ జనం నోట్లో విపరీతంగా నానుతాయి. అందుకే నేను కూడా నష్టం రానంతవరకూ రూపాయికే ఇడ్లీ అమ్మాలనుకుంటున్నాను. చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. ధర పెంచాలన్నారు. కానీ నాకు నచ్చలేదు. 16 ఏళ్ల కిందట అర్ధ రూపాయితో ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టా. నా భార్య రాణి, అత్త రత్నావతి సహకారంతో ఇప్పటికీ అదే రేటుతో వ్యాపారం కొనసాగిస్తున్నాను. నష్టం లేకుండా ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నా. తక్కువ ధర కావడంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఇది నాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది. – చిన్ని రాంబాబు, హోటల్ వ్యాపారి, ఆర్బీ కొత్తూరు, పెద్దాపురం మండలం ఇవీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలింపు ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు -
Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్
సాక్షి బళ్లారి (కర్ణాటక): రూపాయికే రెండు రొట్టెలు, దాల్, లేదా చిత్రాన్నం వివిధ రకాల ఫ్రైడ్ రైస్‌లతో కూడిన భోజనాన్ని అందించేందుకు జైన్ యువక మండలి ముందుకు వచ్చింది. తక్కువ ధరకే భోజనాన్ని శుక్రవారం నుంచి పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. నగరంలోని జైన్ దేవాలయం వద్ద ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. జైన్ యువక మండలి పదాధికారులు భరత్‌జైన్, తదితరులు మాట్లాడుతూ ఓపీడీ ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, ప్రైవేట్, ప్రభుత్వ బస్టాండ్ల వద్దకు ఈ మొబైల్ వాహనం చేరుకొని పేదలకు రూ.1కే భోజనం అందిస్తుందని తెలిపారు. చదవండి: విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్ -
మరో హీరో: ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్
లక్నో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమయంలో అందరూ ఆక్సిజన్ పంపండి అన్ని చాలా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలను విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ అందిస్తున్నాడు. ఆక్సిజన్ సిలిండర్లు రీఫిల్లింగ్ చేయడానికి ఒక్క రూపాయి తీసుకుని ఏకంగా వెయ్యి సిలిండర్లను రీఫిల్ చేశారు. ఆయనే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన మనోజ్ గుప్తా రిమ్జిమ్ ఇస్పాత్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ప్రజలను ఆదుకునేందుకు మనోజ్ ముందుకు వచ్చాడు. ఆ కంపెనీ ఎండీ యోగేశ్ అగర్వాల్‌తో కలిసి ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా రూపాయి తీసుకుని ఆక్సిజన్ సిలిండర్లు నింపి ఇచ్చారు. ‘సాధారణంగా స్టీల్ పరిశ్రమలో ఆక్సిజన్ వినియోగిస్తాం.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులు ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆక్సిజన్ అందించాలని డిసైడ్ అయ్యా’ అని మనోజ్ గుప్తా తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో ఆక్సిజన్ కోసం వస్తున్నారు. వారికి ఉచితంగా ఇవ్వకుండా కేవలం ఒక్క రూపాయికే సిలిండర్ రీఫిల్ చేస్తున్నట్లు చెప్పారు. రూపాయికే ఆక్సిజన్ అందిస్తున్న విషయం తెలుసుకుని మనోజ్ గుప్తా వద్దకు అలీఘర్, నోయిడా, లక్నో, బనారస్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు -
ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా!
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నేరానికిగాను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించింది. న్యాయాన్ని అందించే వ్యవస్థ గౌరవాన్ని ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్లతో తగ్గించారని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ కఠిన శిక్షలేవీ విధించకుండా ఉదారంగా వ్యవహరిస్తున్నామని, నామమాత్రంగా రూపాయి జరిమానా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. సెప్టెంబర్ 15లోగా ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టులో జమచేయాలని, లేని పక్షంలో 3 నెలల జైలు, న్యాయవాద వృత్తి నుంచి మూడేళ్ల నిషేధం అనుభవించాల్సి ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన బెంచ్ సోమవారం తీర్పునిచ్చింది. వాక్స్వాతంత్య్రాన్ని అదుపు చేయడం సరికాకపోయినప్పటికీ ఇతరుల హక్కులను గౌరవించాల్సిన అవసరముందని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రశాంత్ భూషణ్ తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పాలని బెంచ్ పదేపదే కోరిందని, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ఆ ట్వీట్లు క్షణికావేశంలో చేసినవిగా అభిప్రాయపడుతూ క్షమాపణ వ్యక్తం చేయాలని కోరారని బెంచ్ గుర్తు చేసింది. సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోక ముందే ప్రశాంత్ భూషణ్ కోర్టుకు సమర్పించిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారని బెంచ్ గుర్తించింది. సుమారు 82 పేజీలున్న తీర్పును మంగళవారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ అరుణ్ మిశ్రా చదివి వినిపించారు. తీర్పు ఎవరు రాశారన్నది ప్రతిపై లేకపోవడం విశేషం. న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై తనకు అపారమైన గౌరవం ఉందని, తన ట్వీట్లు సుప్రీంకోర్టును అగౌరవపరిచేందుకు కాదని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ‘సుప్రీంకోర్టు నన్ను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా కోరే హక్కును ఉపయోగించుకుంటా. ఈ తీర్పు (జరిమానా)ను అంగీకరిస్తూ ఇంకే శిక్ష విధించినా అనుభవించేందుకు సిద్ధం. ఒక్క రూపాయి జరిమానా చెల్లిస్తా’అని పేర్కొన్నారు. -
పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు
న్యూఢిల్లీ: ‘సూపర్–30’ కోచింగ్‌తో ఫేమస్ అయిన ఆనంద్ కుమార్ పల్లెటూర్లకు చెందిన పేద విద్యార్థుల కోసం ఒక్క రూపాయికే కోచింగ్ అందించే ప్రాజెక్టులో పాలుపంచుకున్నారని ఈ గవర్నెన్స్ బుధవారం తెలిపింది. ప్రజలకు సుపరిచితుడైన ఆనంద్ కుమార్ ఆన్లైన్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్‌కు కోర్సును తయారు చేయనున్నారు. ఇది ఐఐటీ జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఇది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సైన్సు, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలా ఉంటుందని ఆనంద్ చెప్పారు. ఒక్క రూపాయికే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త రకమైన బోధనా పద్ధతులతో విద్యార్థులు నేర్చుకునేలా, సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా ఉంటుందన్నారు. -
రూపాయికే అంత్యక్రియలు
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక్క రూపాయికే అంత్యక్రియలు–ఆఖిరిసఫర్ కార్యక్రమం శనివారం నుంచి అమల్లోకి రానుంది. నగరంలో నివసించే నిరుపేదలకు వరంగా మారే ఈ పథకాన్ని నగర మేయర్ రవీందర్‌సింగ్ రూపొందించారు. మున్సిపాలిటీ అంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా నిరుపేదలకు ఇబ్బందికరంగా మారిన అంతిమ సంస్కారాలను చేయాలనే తలంపుతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అన్ని కులాలు, మతాల వారికి అంతిమయాత్ర నుంచి మొదలుకొని అంత్యక్రియల వరకు అయ్యే ఖర్చులను నగరపాలక సంస్థనే భరించనుంది. పథకం అమలుకు కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం రూ.48 లక్షలు కేటాయించి టెండర్లు కూడా పిలిచారు. అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక కమిటీ వేసి పర్యవేక్షించనున్నారు. ఒక్క రూపాయి బల్దియాకు చెల్లిస్తే చాలు కార్మికులను వారి ఇంటికి పంపించి పాడె కట్టించడంతోపాటు నలుగురు డప్పు వాయించే వారిని పంపిస్తుంది. మృతుల కుటుంబ సభ్యులు కోరితే ఉచితంగానే బాడీ ఫ్రీజర్‌ను అందిస్తారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు పంపించేం దుకు వాహనాన్ని సమకూరుస్తారు. అంత్యక్రియల సందర్భంగా ఎవరి సంప్రదాయాల ప్రకారం వారికి అవసరమైన సామగ్రిని అందజేస్తారు. శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేసే వారికి కట్టెలు, కిరోసిన్, టైర్లు, ఇతర వసతులు కల్పిస్తారు. మృతదేహాన్ని ఖననం చేసే సంప్రదాయం ఉంటే ఆ ప్రకారంగా ఏర్పాట్లు చేస్తారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అక్కడికక్కడే డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. నిరుపేదలకు అండగా... రెక్కాడితే డొక్కాడని కుటుంబాల్లో ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు గడిచే పరిస్థితి ఉంటుంది. అలాంటి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చులు వారికి తలకుమించిన భారమే. అలాంటి కుటుంబాల్లో చాలా సందర్భాల్లో స్థానికులు చందాలు వేసుకొని అంతిమ సంస్కారాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతిమయాత్ర–ఆఖిరిసఫర్ కార్యక్రమంలో నిరుపేదలకు అండగా మారనుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు అంత్యక్రియలు భారం కాకుండా ఉండేందుకు నగరపాలక సంస్థ తీసుకున్న ఈ పథకంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నిరుపేదలకు అండగా చేపట్టిన పథకం అన్ని ప్రాంతాల్లో విస్తరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సైతం యోచిస్తోంది. సామాజిక దైవకార్యంలా భావించాలి.. – మేయర్, కమిషనర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతిమాయాత్ర–ఆఖిరిసఫర్ కార్యక్రమాన్ని సామాజిక దైవకార్యంగా భావించి, ఈ కార్యక్రమ అమలుకు అధికారులంతా సిద్ధం కావాలని నగర మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కోర్టు ట్యాంకు ఆవరణలో పథకం అమలుపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. పథకానికి నగర మేయర్ రవీందర్‌సింగ్ రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న పథకం అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ.. పథకం అమలుకు రూ.49 లక్షలు కేటాయించామని, ఒక్క అంత్యక్రియ కార్యక్రమానికి సుమారు రూ.6వేలు నగరపాలక సంస్థ ద్వారా ఖర్చు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి డీఈ స్థాయి వ్యక్తిని ప్రత్యేక అధికారిగా నియమించి, స్పెషల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏరియాల వారీగా కమిటీ అధికారులు ఆఖిరి సఫర్ కార్యక్రమం విధుల నిర్వహిస్తారన్నారు. యుద్ధప్రాతిపదికన పథకం అమలుకు నగరపాలక సంస్థ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ భద్రయ్య, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, అదనపు కమిషనర్ రాజేంద్రకుమార్, డీఈలు రామన్, యాదగిరి, మసూద్, ఏఈలు వెంకట్‌కుమార్, చైతన్య, నిఖిత, వాణి, సానిటరీ సూపర్వైజర్ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు. -
సరికొత్త పధకం..రూపాయికే అంత్యక్రియలు
-
శ్రీకాళహస్తిలో ఒక్క రూపాయికే భోజనం పథకం
-
ఒక రూపాయి బంగారమే ముద్దు
ఒక రూపాయి బంగారం కొనుగోళ్లకే భారతీయ కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారట. పెద్దనోట్ల రద్దులాంటి ఇతర ప్రభుత్వ చర్యలు, బాగా పెరిగిన ధరలు నేపథ్యంలో ప్రపంచంలోని రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉన్న ఇండియాలో డిమాండ్ బాగా క్షీణించింది. 2010లో బంగారానికి అధిక డిమాండ్ నమోదయ్యింది. కానీ గతేడాది బంగారం డిమాండ్ దాదాపు 23శాతం మేర పడిపోయింది. దీంతో నగల దుకాణందారులు ఆన్‌లైన్‌ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ను ఎక్కువగా వినియోగించే యువ కొనుగోలుదారులపై దృష్టిపెట్టారు. దీంతో ఆన్లైన్లో ఒక రూపాయి డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు బాగా పుంజు కున్నాయని డిజిటల్ ప్లాట్‌ఫాం సేఫ్ గోల్డ్ ఎండీ గౌరవ్ మాధుర్ వెల్లడించారు. సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో బంగారం దేశ మొత్తంమీ 524 టన్నుల వినియోగంతో పోలిస్తే డిజిటల్ మార్కెట్ కొనుగోళ్లు ఇంకా స్వల్పంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సంస్థలు అనుసరిస్తున్న ట్రెండ్‌తో భవిష్యత్తులో డిజిటల్ గోల్డ్‌కు ఆదరణ మరింత పెరగనుందని అంచనా. గత సంవత్సరం ఈ విధానాన్ని ప్రారంభించిన నాటి నుండి దాదాపు 3 మిలియన్ల మంది ఇప్పటికే ప్రపంచ గోల్డ్ కౌన్సిల్లో పెట్టుబడిదారులుగా నమోదయ్యారు. వచ్చే ఏడాది నాటికి 15 మిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారాన్ని ఒక రూపాయి నుంచి మొదలుకొని ఎంతైనా 'డిజిటల్ గోల్డ్' రూపంలో కొనుగోలు చేసే అవకాశం గత ఏడాదినుంచి అందుబాటులోకి వచ్చింది. ఫోన్‌పే, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ ఫాంల భాగస్వామ్యంతో సేఫ్గోల్డ్, చైనా అలీబాబాకు చెందిన అగ్మెంట్ ఎంటర్ ప్రైజెస్, దేశీయ డిజిటల్ చెల్లింపుల సేవా సంస్థ పేటీఎంలు ఈ డిజిటల్ గోల్డ్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఈకామర్స్ బిజినెస్ ఎలాం పుంజుకుంటుందో అదే మాదిరిగానే బంగారం కొనుగోళ్లలో కూడా త్వరలోనే డిజిటల్ విప్లవం రానుందని భావిస్తున్నామని అగ్మెంట్ డైరెక్టర్ సచిన్ కొఠారి వ్యాఖ్యానించారు. -
‘సినిమా’ వదులుకునే ప్రసక్తే లేదు
సాక్షి, చెన్నై : రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, సినిమాల్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ వ్యాఖ్యానించారు. విశ్వరూపం–2 సాధించే విజయం మేరకు విశ్వరూపం–3 తీయడానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. ఒక్క రూపాయి జీతం తీసుకుని ప్రజా సేవ చేయడం కష్టతరమేనన్నారు. కమల్ నటించి, రూపొందించిన విశ్వరూపం–2 ఆగస్టు పదో తేదీన తెరమీదకు రానుంది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నైలో కమల్ మీడియాతో మాట్లాడారు. విశ్వరూపం–2 కథ ఎప్పుడో సిద్ధం చేసుకున్నా, దశావతారం, మన్మ«థ అంబు వైపు తన పయనం సాగిందన్నారు. దేశం రెండుగా చీలడానికి ప్రధాన కారణం మత రాజకీయాలేనన్న అంశం మేరకు ఈ కథ పుట్టుకొచ్చిందన్నారు. ఇందులో రాజకీయాలకు ఆస్కారం లేదని, అమెరికాకు వత్తాసు పలికే పరిస్థితులు, అంశాలు లేవని స్పష్టంచేశారు. అమెరికా, తీవ్రవాదుల మధ్య ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించే చిత్రంగా విశ్వరూపం–2 ఉంటుందన్నారు. ఈ చిత్రం సాధించే విజయం మేరకు విశ్వరూపం–3 తీయడానికి తాను సిద్ధం అని వ్యాఖ్యానించారు. విశ్వరూపం–1 విడుదల సమయంలో పెద్ద వ్యతిరేకతే బయలుదేరిందని గుర్తుచేస్తూ, ఆ పరిస్థితి ప్రస్తుతం రాదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో తన పార్టీ గురించి, తన పార్టీ జెండాలు, ఇతర అంశాల గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదన్నారు. ఎంజీఆర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కాలంలో సాంకేతిక అభివృద్ధి లేదని, అందుకే ఆయన తన చిత్రాల్లో జెండాను చూపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అనేక మార్గాలు ప్రచారాలకు ఉన్నాయన్నారు. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం కూడా సినిమాల్లో నటించారని గుర్తుచేస్తూ, తానూ రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, సినిమాల్ని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. సినిమాల్లో నటిస్తూనే ఉంటానని పేర్కొంటూ, ఒక్క రూపాయి జీతం తీసుకుని ప్రజా సేవ సాగించడం కష్టతరమేనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
చంద్రన్న‘పెళ్లి’ కానుక.. ఒక్క రూపాయే!
సాధారణంగా ఏదైనా సంక్షేమ పథకానికి ప్రభుత్వం నిధులు విదల్చకపోతే ఎవరైనా ఏమంటారు.పైసా కూడా విదల్చలేదు.ఇదేమి ప్రభుత్వమంటారు. కానీ చంద్రన్న పెళ్లి కానుక విషయంలో మాత్రం ఆ విమర్శ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ప్రతి జంట ఖాతాలో సొమ్ములు జమ చేశారు. కానీ చెప్పినట్టుగా అర్హతను బట్టి కాదు.. అందరికి ఒకేలా.. అదీ ఎంతో తెలుసా..అక్షరాల ఒక్క రూపాయి. నిజంగా నిజం.ఇదేమిటి ఒక్క రూపాయి జమ చేయడం ఏమిటని ప్రశ్నిస్తే అబ్బే అదేం లేదు అకౌంట్ సరిగా ఉందో లేదో చెక్ చేయడానికే వేశాం.. త్వరలోనే మొత్తం ఒకేసారి జమ చేసేస్తాం అంటూ నమ్మబలుకుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక ఆదిలోనే అబాసు పాలవుతోంది. పథకం ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఏ ఒక్క జంటకు పెళ్లి కానుక జమ చేయని పరిస్థితి నెలకొంది. విచిత్రమేమిటంటే విమర్శించడానికి వీల్లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో రూపాయి చొప్పున జమ చేశారు. మిగిలిన సొమ్ముల కోసం ఎప్పుడుపడతాయో తెరపై వేచి చూడండి అని ఊరిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయినా.. చంద్రన్న పెళ్లి కానుక...రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11న అమలులోకి తీసుకొచ్చిన పథకం. ఇందుకోసం ప్రతి మండలానికి డ్వాక్రా సంఘాల నుంచి ముగ్గురు వివాహమిత్రలను నియమించారు. రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తో పాటు 1100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేసిన జంటల వివరాలను అప్లోడ్ చేశారు. వారి ఇళ్లకు వివాహ మిత్రలు వెళ్లి వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపర్చారు. వాటిని ప్రజాసాధికారిత సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చారు. గడిచిన మూడు నెలల్లో పెళ్లి కానుక కోసం 1323 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. బీసీ సామాజిక చెందానికి చెందిన 910, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 159, ఎస్టీలు 58, ముస్లీంలు ఏడుగురు, వికలాంగులు 29, ఇతరులు 12 మంది దరఖాస్తు చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న 29 మంది ఎస్సీ, 13 ఎస్టీ, 106 బీసీ జంటల నుంచి దరఖాస్తులు అందాయి. వీరిలో 1096 మందికి సంబంధించి పరిశీలన పూర్తి చేశారు. వీరిని అర్హులుగా గుర్తించి మంజూరుకు అప్లోడ్ చేశారు. కేటగిరీల వారీగా.. ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతే రూ.50వేలు, బీసీలైతే రూ. 35వేలు, ముస్లింలకు రూ.50 వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏకులానికి చెందిన వారికైనా రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. 20 శాతం పెళ్లి నిశ్చయమైన రోజున..మిగిలిన 80శాతం పెళ్లిరోజున పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ముస్లిం జంటలకు రూ.3.50లక్షలు, ఎస్టీ జంటలకు రూ.29లక్షలు బీసీ జంటలకు 3.19 కోట్లు,ఎస్సీ జంటలకు రూ.63.60లక్షలు, వికలాంగ జంటలకు రూ.29లక్షలు, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.21.75లక్షలు, ఎస్టీలకు రూ.9.75లక్షలు, బీసీలకు రూ.79.50 లక్షలతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన జంటలకు రూ.2.40లక్షలు జమ కావాల్సి ఉంది. ఇలా మొత్తమ్మీద జిల్లాలో గడిచిన మూడు నెలల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు రూ.5.57 కోట్లు జమ చేయాలి. అప్లోడ్ చేసి దాదాపు మూడునెలలు కావస్తున్నా ఏ ఒక్క జంటకు పెళ్లికానుక జమకాలేదు. దరఖాస్తు చేసుకున్న కొత్తజంటలు, వారి కుటుంబ సభ్యులు కార్యాలయాలచుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. మీ అకౌంట్లోకే నేరుగా సొమ్ములు జమవుతాయని చెబుతున్నారు. అర్హుల ఎంపిక విషయంలో వివాహ మిత్రలతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క రూపాయే జమ నిజమే ఒక్క మన జిల్లాకే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెళ్లికానుకకు తొలి విడత సొమ్ములు విడుదల చేయలేదు. టెస్టింగ్ కోసం అందరి ఖాతాలకు ఒక్క రూపాయి చొప్పున జమ చేశారు. త్వరలోనే డబ్బులు రిలీజ్ కాగానే అందరి అకౌంట్‌కు పూర్తి స్థాయిలో కానుక జమ అవుతుంది. కానుక విషయంలో ఎవరికి ఎలాంటి మామూళ్లు ఇవ్వనసరం లేదు. ఎవరైనా డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకొస్తే యాక్షన్ తీసుకుంటాం. –సత్యసాయి శ్రీనివాస్,పీడీ, డీఆర్డీఏ -
ఒక్క రూపాయికే చీర
సాక్షి, బెంగళూరు, బళ్లారి: మామూలుగానైతే ఒక్క రూపాయికి ఏం వస్తుంది? పిప్పరమెంటు, చాక్లెట్టు, లేదా బిస్కెట్లో వస్తుంది. రూపాయికి విలువ లేని ఈ రోజుల్లో ఒక్కరూపాయికే చీర కావాలా?? అయితే బీదర్‌కు వెళ్లాల్సిందే. చీర కావాలంటే ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. అసలు విషయం ఏమిటంటే బీదర్‌కు చెందిన ఒక చీరల దుకాణం యజమాని చంద్రశేఖర్ జేడీఎస్ పార్టీకి వీరాభిమాని. 2018లో జరిగే శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి విజయం సాధించి తీరాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ ఒక్క రూపాయికి చీర స్కీమును ప్రారంభించాడు. ఈ ఆఫర్ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో మహిళలు దుకాణం ముందు క్యూ కట్టారు. తిరుమల వెంకటేశ్వరుడు కలలో చెప్పాడట : దీనిపై షాపు యజమానిని మీడియా ప్రశ్నిస్తే తన అభిమాన నాయకుడు కుమారస్వామి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే 5 లక్షల చీరలను పంచాలని కొద్దిరోజుల క్రితం తిరుమల వేంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పినట్లు చంద్రశేఖర్ తెలిపాడు. ఏడుకొండలవాని ఆదేశాల మేరకే తాను ఒక్క రూపాయికి చీర స్కీమును చేపట్టానన్నాడు. ఈసారి ఆరునూరైన తమ నాయకుడు ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పాడు. -
రూపాయకే నల్లా కనెక్షన్
బంజారాహిల్స్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో సింగాడికుంట నాయుడునగర్‌లో రూపాయికే నల్లా కనెక్షన్‌ను బుధవారం వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవిత పంపిణీ చేశారు. ఇటీవల దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి రూపాయికే నల్లా కనెక్షన్లను పంపిణీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ బస్తీవాసులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరి స్థితిగతులు పరిశీలించిన వాటర్‌వర్క్స్ అధికారులు 30 మందికి లబ్ధి చేకూరే విధంగా కనెక్షన్లను రూపాయికే మంజూరు చేశారు. ఈ పత్రాలను అందజేసిన అనంతరం కవిత మాట్లాడుతూ.. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. -
తమిళనాడు తరహాలో విద్యుత్ రాయితీ ఇవ్వాలి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : తమిళనాడు రాష్ట్రం తరహాలో యూనిట్ ధర ఒక్క రూపాయికే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్‌ను సరఫరా చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఏడీ కామాచార్యులు డిమాండ్ చేశారు. రంగ్రీజుపేటలోని పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్మర, వడ్రంగి, కంచర, శిల్ప, స్వర్ణకార కుటీర పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ యూనిట్ ధర రూ. 1.80కే అందిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఆరు వేల యూనిట్లకు మాత్రమే విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ సదుపాయాన్ని కలగజేశాయని ఆయనన్నారు. అయితే రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో 12 వేల నుంచి 20 వేల కుటీర పరిశ్రమలు ఉన్నాయని, వారందరికీ విద్యుత్ సబ్సిడీ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.కుటీర పరిశ్రమలపై ప్రస్తుతం ఉన్న విధానాలన్నింటిని మార్చి తమిళనాడు తరహాలో యూనిట్ ధర రూ. 1కే విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బంటుమిల్లి బేబీరావు, ముంతా సత్యనారాయణ, గుండేపల్లి అమృతకుమార్, ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్!
జీహెచ్ఎంసీ సహా 73 పురపాలికల్లో అమలుకు సర్కారు నిర్ణయం ► పైపులు, రోడ్డు తవ్వకాల ఖర్చు నగర, పురపాలికలదే ► అనుమతి లేని నల్లాల క్రమబద్ధీకరణా ఒక్క రూపాయికే ► పతిపాదనలను ఆమోదించిన సర్కార్ ► ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ► నల్లా కనెక్షన్ లేని 25 లక్షల ► పేద కుటుంబాలకు లబ్ధి ► ఏడాది కిందే ప్రతిపాదనలు.. ► మంత్రి కేటీఆర్ చొరవతో కదలిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలను ఆకట్టుకునే మరో ప్రతిష్టాత్మక పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేవలం ఒక్క రూపాయికే మంచినీటి నల్లా కనెక్షన్‌ను అందజేయాలని నిర్ణయించింది. అంతేకాదు ఇప్పటికే అనుమతి లేకుండా ఉన్న నల్లా కనెక్షన్లనూ కేవలం ఒక్క రూపాయికే క్రమబద్ధీకరించనుంది. కొత్త నల్లా కనెక్షన్‌కు కావాల్సిన పైపులు, రోడ్డు తవ్వకాల వ్యయాన్ని స్థానిక నగర, పురపాలక సంస్థలే భరిస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 73 పట్టణ, నగర ప్రాంతాల్లో అమలు చేసే ఈ పథకంతో దాదాపు 25 లక్షల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకానికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. ఏడాది కిందే ప్రతిపాదనలు పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీ ఏడాది కిందటే ప్రతిపాదించింది. సీఎం కేసీఆర్ అయితే ఉచితంగానే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని భావించారు. అందుకు మున్సిపల్ చట్టాలు ఒప్పుకోవని నిర్ధారణకు రావడంతో నామమాత్రంగా రూపాయి వసూలు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత ఈ అంశం పక్కన పడిపోయింది. తాజాగా పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు చొరవతో ఈ ప్రతిపాదనలకు మోక్షం లభించింది. రూపాయికే నల్లా కనెక్షన్ ప్రతిపాదనకు ఆయన ఇటీవలే ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ పురపాలక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర 72 నగర, పురపాలక సంస్థల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. హైదరాబాద్ జల మండలి సైతం తన పరిధిలోని నగర, పురపాలికల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ‘ఆసరా’ కుటుంబాలకూ వర్తింపు పురపాలక సంస్థలో కొత్త నల్లా కనెక్షన్ కోసం రూ.1,200 చార్జీగా చెల్లించడంతో పాటు పైపులు, రోడ్డు తవ్వకాల ఖర్చును భరించాల్సి ఉండేది. పేద కుటుంబాలపై భారాన్ని తగ్గించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నల్లా కనెక్షన్ చార్జీలను రూ.200కు తగ్గించింది. పైపులు, రోడ్డు తవ్వకాల ఖర్చులను స్థానిక పురపాలక సంస్థలే భరించాలని ఆదేశించింది. తెల్ల రేషన్‌కార్డు గల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లకు నల్లా కనెక్షన్ల మంజూరును మరింత సరళీకృతం చేస్తోంది. తెల్లరేషన్‌కార్డు లేని పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ అర్హతలను సైతం పరిశీలిస్తోంది. ఆసరా పింఛన్లు అందుకుంటున్న కుటుంబాలకు సైతం వర్తింపజేయాలని యోచిస్తోంది. పేదలకు ప్రయోజనం.. పురపాలికలకు ఆదాయం రాష్ట్రంలోని 67 పాత పురపాలికల్లో 12.98 లక్షల కుటుంబాలుండగా 9.25 లక్షల కుటుంబాలకు, గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు నగర శివార్లలో కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపాలిటీల పరిధిలోని మరో 16 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవు. అంటే మొత్తంగా పట్టణాలు, నగరాల పరిధిలో 25 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్లు లేవు. పబ్లిక్ కుళాయిల వద్ద నీటిని మోసుకెళ్తూ పేద కుటుంబాల్లోని మహిళలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ గృహాలన్నింటికీ నల్లా కనెక్షన్ మంజూరు చేస్తే ఇటు పేద కుటుంబాలతో పాటు అటు పురపాలికలకు సైతం ప్రయోజనం కలుగుతుందని పురపాలక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అనుమతి లేని నల్లా కనెక్షన్లవారు ప్రస్తుతం నీటి బిల్లులేమీ కట్టడం లేదు. క్రమబద్ధీకరిస్తే వారంతా నీటి బిల్లులు చెల్లిస్తారు. దాంతోపాటు కొత్త నల్లా కనెక్షన్ మంజూరు చేస్తే ప్రతి నెలా రూ.40 నుంచి రూ.200 వరకు నీటి బిల్లులు వస్తాయి. నాలుగు నెలల్లోనే రూ.200 రాయితీ తిరిగి రానుంది. తర్వాత మున్సిపాలిటీలకు ప్రతి నెలా నీటి బిల్లుల రూపంలో అదనపు ఆదాయం వస్తుంది. అంతేగాకుండా మురికివాడల్లోని పేద కుటుంబాలకు రక్షిత మంచినీరు అందుతుందని, దీంతో ప్రజలు కలుషిత నీటితో సంక్రమించే రోగాల నుంచి విముక్తి పొందుతారని పురపాలక శాఖ తన ప్రతిపాదనల్లో పేర్కొంది.