ముద్ద దిగేదెలా?
రూపాయికే బియ్యమన్నారు...
రూపు చూసి అవాక్కయ్యారు...
మక్కిపోయి.. మట్టి కలిసి..
నూకలుగా మారిన
ఈ బియ్యాన్ని ఎలా తినాలి?
‘అమ్మ హస్తం’తో..
కందిపప్పు అన్నారు...
అది నిజంగా కందిపప్పేనా?
కాదు.. కాదు అలా అనడమే తప్పు...
పుచ్చిపోయి, పురుగులు పట్టి,
ముద్దగా మారిన
ఈ ‘పప్పు’ను ఎలా తినాలి?
అందమైన ప్యాకెట్‌లో
గోధుమ పిండి ఇచ్చారు.
మేడిపండు చందమని
విప్పి చూస్తే కాని తెలియలేదు..
జల్లెడ పడితే సగం కూడా మిగల్లేదు...
అది కూడా మక్కిన వాసనే..
దాంతో రొట్టెలెలా చేయాలి...
చేసినా ఎలా తినాలి?
కారంపొడికీ ‘సబ్సిడీ’ అన్నారు...
పొట్టు కలిపి కంట్లో కారం కొట్టారు...
అందుకే ఈ రోజులు మాకొద్దు...
ప్రజా పంపిణీ పట్టని ఈ పాలకులూ మాకొద్దు అంటున్నారు ప్రజలు.
- ఎలక్షన్ సెల్