Amma hastam
-
అందని ‘అమ్మహస్తం’
భువనగిరి : అమ్మహస్తం పథకం పూర్తిగా వినియోగదారులకు అందకుండాపోయింది. ప్రభుత్వం కొత్త పథకం తేకపోవడంతో ఇంకా ఆ పేరుతోనే కొన్ని రేషన్‌సరుకుల సరఫరా కొనసాగుతోంది. కానీ సరుకుల కుదింపుతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. పండగ సమయంలో సరుకుల కోసం రేషన్ దుకాణాలకు వెళ్లిన వారు ఉత్త చేతులతో తిరిగివస్తున్నారు. ఇక పండగలకు ఇచ్చే అదనపు కోటా గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారు. గత ప్రభుత్వం సామాన్యుడిని అధిక ధరాభారం నుంచి రక్షించడానికి తె ల్లరేషన్కార్డులపై 9 రకాల సరుకులను 185రూపాయలకే అందించాలని అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి మొదటినుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. తాజా పరిస్థితిలో 9 సరుకుల సంగతికి దిక్కులేకుండా పోయింది. కేవలం రెండు రకాల సరుకులతోనే ప్రజలు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. తెలంగాణలో అతి పెద్ద పండగలైన బతుకమ్మ, దసరా పండగలకు ప్రజలు ఎక్కువగా పిండివంటలు చేస్తుంటారు. వీటికి అవసరమైన పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాలలో అందుబాటులో ఉండడం లేదు. ఏడు నెలలుగా పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. ప్రతినెలా జిల్లాకు 900 టన్నుల పామోలిన్ రావాల్సి ఉంది. ఎన్నికల ముందు నుంచి సరఫరా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విషయంలో స్పష్టత లేకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్టు అధికారులు తెలుపుతున్నారు. కందిపప్పుది ఇదే పరిస్థితి. ఐదు నెలలుగా కందిపప్పు రావడం లేదు. కొత్త ప్రభుత్వం రావడం రవాణా టెండర్ల విషయంలో రేటు నిర్ణయం కాకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. పేద ప్రజలకు ప్రధాన అవసరమైన కందిపప్పు, పామోలిన్ రాకపోవడంతో బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో రేషన్‌కార్డుల పరిస్థితి.. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.36 లక్షల కుటుంబాలు ఉండగా, 10.02 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. బోగస్ యూనిట్లు, రేషన్‌కార్డుల తొలగింపు అనంతరం తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిసి 9,03,333 రేషన్‌కార్డులు, వాటిలో 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు 62 వేల పింక్ కార్డులు ఉన్నాయి. తెలుపు రంగుకార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కర మాత్రమే సరఫరా చేస్తున్నారు. మిగతా నిత్యావసర సరుకులు సరఫరా లేకపోవడంతో వాటిని అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొంటున్నారు. -
మొండి‘హస్తం’
అమ్మహస్తం రద్దుకు ప్రభుత్వం నిర్ణయం ఎన్టీఆర్ ప్రజాపంపణీ పేరుతో కొత్త పథకం ఇప్పటికే పచ్చ రంగులో తాత్కాలిక కూపన్లు కిలో రూపాయి బియ్యం ధర పెరిగే అవకాశం విశాఖ రూరల్ : ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పేదవాడి ‘చౌక’ సరుకులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. బడుగు జీవుల బతుకులు భారం కానున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ‘అమ్మహస్తం’ పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతోంది. సరుకుల్లో కోత విధించి ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయించింది. చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న సరుకుల ధరలను పెంచాలని భావిస్తోంది. ప్రధానంగా కిలో రూపాయి బియ్యాన్ని రూ.5కు విక్రయించాలని యోచిస్తోంది. రేషన్దాకాణాల ద్వారా ఏయే సరుకులు ఎంత ధరకు విక్రయించాలన్న విషయంపై త్వరలోనే విధివిధానాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తాత్కాలిక రేషన్కూపన్లు పచ్చరంగుకు మారిపోయాయి. ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పేరుతో ఉన్న వాటిని అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. 5 నెలలుగా పామాయిల్ లేదు జిల్లాలో 12.5 లక్షల తెల్లరే షన్‌కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాల నుంచి వీరు ప్రతీ నెలా ఏ వస్తువు తీసుకోకపోయినా పామాయిల్‌ను మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మార్చి నుంచి దీని పంపిణీ నిలిచిపోయింది. ప్రస్తుతం బహిరంగమార్కెట్లో పామోలిన్ లీటర్ ధర రూ.63లకు పైగా ఉంది. దీనిని రూ.40కే చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మలేషియా నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేయగా కాకి నాడ పోర్టుకు తీసుకువచ్చి అక్కడ పామాయిల్‌ను ప్యాకింగ్ చేసి జిల్లాలకు కేటాయించేవారు. కానీ గత ఐదు నెలలుగా పామాయిల్‌ను కొనుగోలు చేయలేదు. దీంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో లీటర్ పామోలిన్‌ను రూ.63 నుంచి రూ.68కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. చౌక బియ్యం ధర పెంపు! చౌక బియ్యం ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కిలో రూ.2 బియ్యం పథకాన్ని ప్రారంభించారు. తరువాత అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు దీనిని కార్డుదారులకు భారంగా మార్చేశారు. తొలుత రూ.3.25కు, తరువాత రూ.5కు పెంచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ రూ.2కే కిలో బియ్యాన్ని అందించారు. తరువాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కిలో రూపాయికే అందించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బియ్యం కిలో రూ.5కు విక్రయించాలని నిర్ణయించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చౌక వస్తువుల ధరలు పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది. నెలకో వస్తువు మాయం తెల్లకార్డుదారులకు గత ప్రభుత్వం అమ్మహస్తం పథకంలో లీటర్ పామాయిల్, కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, ఉప్పు కిలోచొప్పున, పంచదార 500 గ్రాములు, కారం 250 గ్రాములు, పసుపు 100 గ్రామాలు, చింతపండు అరకిలో కలిపి రూ.185కే అందిస్తామని ప్రకటించింది. వాటిని ఒక్క నెల కూడా సక్రమంగా పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. ఈ సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో కార్డుదారులు ఆసక్తి చూపించ లేదు. ఫలితంగా తొలుత కారం, పసుపు, చింతపండు పంపిణీని నిలిపివేశారు. పురుగులు పట్టిన గోధుమలు, గోధుమ పిండి పంపిణీ చేస్తున్నప్పటికీ ఎవరూ విడిపించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం కందిపప్పు, పంచదార మినహా మిగిలిన అన్ని సరుకుల పంపిణీ నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం వీటిని కూడా ఆపేస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
ఈ నెల నూనె లేనట్టే
ఇంత వరకు దిగుమతి కాని పామోలిన్ తెల్లకార్డుగలవారిపై రూ.3.70 కోట్ల అదనపు భారం నర్సీపట్నం: జూలై నెలకు పామాయిల్ సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ డీలర్లు డీడీలు తీయకపోవడం దీనికి నిదర్శనం. జిల్లాలో ప్రస్తుతం 12,34,104 కార్డులున్నాయి. ఒక్కొక్క కార్డుపై నెలకు లీటరు పామాయిల్ నూనె సరఫరా చేసేవారు. నూనె సరఫరా ఎప్పటినుంచో కొనసాగుతున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అమ్మహస్తం పథకంలోకి చేర్చింది. వాస్తవానికి పౌరసరఫరాల కోటాగా జిల్లాకు 12 లక్షల 34వేల 104 లీటర్ల పామాయిల్‌ను సరఫరా చేయాలి. మలేషియా నుంచి కాకినాడ పోర్టుకు దిగుమతయ్యే పామాయిల్‌ను రాష్ట్రంలోని 18 జిల్లాలకు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం దిగుమతి లేకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. రేషన్ కార్డుపై రూ.40కు లీటరు నూనె సరఫరా చేస్తున్నారు. దీని ధర బయటి మార్కెట్లో రూ.70 వరకు పలుకుతోంది. ప్రస్తుతం కోటాలో పామాయిల్ సరఫరా చేయకపోవడం వల్ల కార్డుదారులు బయట రూ.70కి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారులు సుమారు రూ.3.70 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. -
అమ్మహస్తానికి బ్రేక్..!
నల్లగొండ, న్యూస్‌లైన్ :సాధారణ ఎన్నికలకు ఏడాదిముందు అప్పటి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకానికి బ్రేక్ పడనుందా..! కొంతకాలంగా ఈ పథకం అమలు జరుగుతున్న తీరును గమనిస్తే అవుననే సమాధానమే వస్తోంది. సామాన్య ప్రజలకు 9 రకాల నిత్యావసర వస్తువులను కారుచౌకగా అందజేస్తామని చెప్పిన కొన్నాళ్లకే.. ఈ పథకం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. రూపాయి కిలోబియ్యంతో పాటు మరో 9 రకాల వస్తువులను చౌకధరలకు అందస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభ దశలో మూడు నెలలపాటు సరుకులు పంపిణీ చేశారు. రోజులు గడుస్తున్నాకొద్ది పథకాన్నిఅమలుచేయడంలో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. సరుకుల్లో నాణ్యత లోపించడంతో వినియోగదారులు వాటిని కొనేందుకు ముఖం చాటేసే పరిస్థితికి వచ్చింది. మొత్తం వస్తువుల్లో బియ్యం, పంచదార, పామాయిల్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. గోధుములు, గోధుమపిండి, పసుపు, కారం, చింతపండు వగైరా సరుకుల్లో నాణ్యత లోపించడంతో వినియోగదారులు కొనడమే మానేశారు. పామాయిల్ బంద్... రెండు నెలలుగా పామాయిల్ సరఫరా బంద్‌చేశారు. పామాయిల్ సబ్సిడీ కేంద్రం రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. సబ్సిడీ భారాన్ని సైతం రాష్ట్రమే భరించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఎన్నికల కోడ్ కంటే ముందుగానే పామాయిల్ నిలిపేశారు. జిల్లాలో మొత్తం 9 లక్షల 44 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. బయట మార్కెట్లతో పోలిస్తే పామాయిల్ ధర రేషన్ దుకాణాల్లో కేవలం రూ.40కే లభిస్తుండడంతో డిమాండ్ ఎక్కువ ఏర్పడింది. దీంతో రేషన్‌కార్డులకు సరిపడా పామాయిల్ జిల్లాకు వచ్చేది. ఎప్పుడైతే కేంద్రం సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన నాటినుంచి రాష్ట్రం ప్రభుత్వం పామాయిల్ సరఫరా నిలిపేసింది. ప్రస్తుతం బియ్యం, పంచదారకు మంచి డిమాండ్ ఉంది. బహిరంగ మార్కెట్లో పంచదార ధరతో పోలిస్తే రేషన్ దుకాణాల్లో చౌకగా లభిస్తుండడం అందుకు కారణం. రూపాయి బియ్యాన్ని వినియోగదారులు వాడుతున్నదాని కంటే డీలర్లు ఆ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు ఎక్కువగా తరలిస్తుండడంతో మంచి లాభసాటి వ్యాపారంగా మారింది. నాణ్యతపైనే అనుమానాలు.. చింతపండు నల్లగా ఉండడం, కారంలో ఇటుకపొడి కలుస్తుందని, గోధుమ పిం డిలో పురుగు ఉంటుందన్న కారణాలతో వినియోగదారులు వాటిని కొనడమే మానేశారు. ఒక బ్యాగులో 50 ప్యాకెట్లు ఉప్పు ఉంటే దాంట్లో పది ప్యాకెట్లు పగలిపోవడం, గోధుముల్లో పురుగు వస్తుండడంతో డీలర్లు సైతం వాటిని కొనేందుకు వెనకాడుతున్నారు. నాణ్యత లోపించిన సరుకులను వాపసు తీసుకునేందుకు మండల స్థాయి గోదాముల అధికారులు నిరాకరిస్తున్నందున డీలర్లు ఆ సరుకుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పంచదార, బియ్యం, పామాయిల్ వంటి వాటికే ఎక్కువమంది డీలర్లు డీడీలు చెల్లిస్తున్నారు. పేరుకుపోయిన నిల్వలు... జూన్ కోటాకు సంబంధించి ఓసారి పరిశీలిస్తే..చింతపండు 9,790 ప్యాకెట్లకు డీడీలు కట్టారు. దీనికిగాను జిల్లా మేనేజరుకు సివిల్ సప్లయీస్ 4,689 ప్యాకెట్లు సరఫరా చేసింది. మండలస్థాయి గోదాముల్లో (ఎంఎల్ఎస్ పాయింట్లు) పాతస్టాక్ 70,512 ప్యాకెట్లు నిల్వ ఉన్నాయి. వాస్తవానికి అయితే జిల్లాలో ఉన్న 9 లక్షల రేషన్ కార్డులకుగాను అంతే మోతాదులో చింతపండు సరఫరా చేయాలి. కానీ చింతపండులో నాణ్యత లేనందున గోదాముల్లో నిల్వ ఉన్న సరుకును మినహాయించి అసలు లేదన్నట్టు కాకుండా ఓ మోతాదులో పంపిస్తున్నారు. దీంతోపాటు గోధుమపిండి కూడా 1,82,706 ప్యాకెట్లకు డీడీలు కట్టారు. కానీ 1,13,465 ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేశారు. గోదాముల్లో పాతస్టాక్ 1,18,209 ప్యాకెట్ల నిల్వలు పేరుకుపోయాయి. చౌక దుకాణాల్లో వాటిని కొనే పరిస్థితి లేకపోవడంతో గోదాముల్లోనే పిండి నిల్వ ఉండే పరిస్థితి వచ్చింది. పసుపు, కారం, గోధుములు, ఉప్పు ప్యాకెట్ల నిల్వలు కూడా గోదాముల్లో పేరుకుపోయాయి. వినియోగదారుల వాడకం తగ్గడంతో సివిల్ సప్లయీస్ కూడా సరుకుల సరఫరాను క్రమేపీ తగ్గిస్తూ వస్తోంది. పథకం పూర్తిగా నిలిపివేస్తే వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో నామమాత్రంగా నెలవారీ సరుకుల నిల్వలు పంపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే కొత్త సర్కారులో మాత్రం రూపాయి బియ్యాన్ని మినహాయించి మిగతా సరుకులను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జూన్‌లో అమ్మహస్తం సరుకుల కొనుగోలు తీరు.. (ప్యాకెట్లలో) సరుకు డీలర్లు పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్ల డీడీలు కట్టింది పంపిణీ చేసింది వద్ద నిల్వ ఉన్న సరుకు పామాయిల్ నిల్ నిల్ నిల్ కందిపప్పు 1,22,713 48,246 1,01,798 పంచదార 7,71,932 3,86,773 4,07,629 గోధుమలు 2,24,232 1,01,776 2,20,103 గోధుమపిండి 1,82,706 1,13,465 1,18,209 ఉప్పు 75,825 38,503 1,69,133 పసుపు 4,385 334 1082 చింతపండు 9,790 4,689 70,512 కారం 410 100 44,301 -
ముద్ద దిగేదెలా?
రూపాయికే బియ్యమన్నారు... రూపు చూసి అవాక్కయ్యారు... మక్కిపోయి.. మట్టి కలిసి.. నూకలుగా మారిన ఈ బియ్యాన్ని ఎలా తినాలి? ‘అమ్మ హస్తం’తో.. కందిపప్పు అన్నారు... అది నిజంగా కందిపప్పేనా? కాదు.. కాదు అలా అనడమే తప్పు... పుచ్చిపోయి, పురుగులు పట్టి, ముద్దగా మారిన ఈ ‘పప్పు’ను ఎలా తినాలి? అందమైన ప్యాకెట్లో గోధుమ పిండి ఇచ్చారు. మేడిపండు చందమని విప్పి చూస్తే కాని తెలియలేదు.. జల్లెడ పడితే సగం కూడా మిగల్లేదు... అది కూడా మక్కిన వాసనే.. దాంతో రొట్టెలెలా చేయాలి... చేసినా ఎలా తినాలి? కారంపొడికీ ‘సబ్సిడీ’ అన్నారు... పొట్టు కలిపి కంట్లో కారం కొట్టారు... అందుకే ఈ రోజులు మాకొద్దు... ప్రజా పంపిణీ పట్టని ఈ పాలకులూ మాకొద్దు అంటున్నారు ప్రజలు. - ఎలక్షన్ సెల్ -
చిక్కిన సంచి
అమ్మహస్తం సరుకుల్లో కోత తగ్గుతున్న నిత్యావసరాల కేటాయింపు సకాలంలో సరఫరా కాని వస్తువులు ఇబ్బందులు పడుతున్న కార్డుదారులు సరకుల సంచి చిక్కిపోతోంది. నెలకో వస్తువు మాయమైపోతోంది. నిత్యావసర వస్తువుల కేటాయింపుల్లోనూ కోతపడుతోంది. ప్రస్తుతం సంచిలోని తొమ్మిది సరుకులు ఐదుకు కుదించుకు పోయాయి. మొత్తంగా అమ్మహస్తం పథకం అస్తవ్యస్తంగా మారింది. నిత్యావసర సరకులు ఎప్పుడు వస్తాయో.. చౌక దుకాణాల ద్వారా ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియని దుస్థితి. కొన్ని సరకులు నాణ్యంగా లేకపోవడం.. మరికొన్ని సక్రమంగా ఇవ్వకపోవడంతో కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రేషన్ దుకాణాల ద్వారా తెల్లరేషన్‌కార్డుదారులకు రూ. 185కే 9 నిత్యావసర సరకులు అమ్మహస్తం పథకంలో అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గతే ఏడాది ఏప్రిల్‌లో ఆర్భాటంగా ప్రారంభించింది. ఎన్నికల ప్రచారాస్త్రంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రభుత్వం కనీసం ఏడాది కూడా సక్రమంగా నడపలేక చేతులెత్తేసింది. ప్రారంభం నాటి నుంచి ఒక్క నెల కూడా సరకులను సక్రమంగా స కాలంలో జిల్లాకు కేటాయించలేదు. ప్రతీ నెలా ఏదో ఒక వస్తువు ఆలస్యంగానో లేదా తక్కువగానో కేటాయిస్తూ వచ్చింది. తాజాగా ఆ సరుకుల్లో కూడా కోత పెట్టింది. కారం, పసుపు,ఉప్పు,చింతపండు కేటాయింపులను పూర్తిగా నిలిపివేసింది. నాణ్యత లేక అయిష్టత : అమ్మహస్తం పథకంలో కొన్ని సరకులపై కార్డుదారులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కొన్నింటిని అసలు చౌక దుకాణాల నుంచి విడిపించడం లేదు. ప్రధానంగా ఉప్పు, గోదుమపిండి అధ్వానంగా ఉంటున్నాయి. వీటిపై కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. ఒక్కోసారి కందిపప్పు కూడా బాగుండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా జిల్లాకు నెలా నెలా కేటాయింపులు తగ్గిపోతూ వచ్చాయి. డిమాండ్‌ను బట్టి అధికారులు సరకుల ఇండెంట్‌ను పెడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ నెలా సరకులు మిగిలిపోతూనే ఉన్నాయి. ఈ సరకులు డీలర్లకు కూడా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. రెండు నెలల క్రితం వరకు అవసరం మేరకు మాత్రమే పసుపు, కారం, చింతపండులను కేటాయిస్తూ వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిగా వాటిని ఇవ్వడం మానేసింది. వీటి నిలుపుదలకు సంబంధించి అధికారుల వద్ద కూడా ఎటువంటి సమాచారం లేదు. సకాలంలో సరఫరా కాని సరకులు : మిగిలిన సరకులు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదు. ప్రతీ నెలా పంచదార, కందిపప్పు,పామాయిల్ కేటాయింపుల్లో కోత పడుతూనే ఉంది. అది కూడా ఒకేసారి జిల్లాకు రాకపోవడంతో కార్డుదారులు వాటి కోసం రేషన్‌దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. -
అమ్మో హస్తం
వినుకొండ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం అస్తవ్యస్తంగా మారింది. గత ఉగాది నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం తొలి నాటి నుంచి విమర్శల పాలవుతోంది. అమ్మహస్తం పథకంలో భాగంగా ఇస్తున్న తొమ్మిది రకాల వస్తువులను తీసుకునేందుకు కార్డుదారులు నిరాకరిస్తున్నారు. నాణ్యతలేని సరుకులను అంటగడుతున్నారంటూ వీటి కొనుగోలుకు ముందుకురావడం లేదు. ఈ పథకం ద్వారా రూ. 185 లకు అరకిలో పంచదార, పామాయిల్, పావు కిలో కారంపొడి, అర కిలో చింతపండు, కిలో కందిపప్పు, 100 గ్రాముల పసుపు, కిలో ఉప్పు, కిలో గోధుమలు, కిలో గోధుమ పిండి ప్రతి నెలా సరఫరా చేయాలి. అయితే పథకం ప్రారంభం నుంచి నాసిరకం సరుకులు సరఫరా చేయడం వల్ల కార్డుదారులు తీసుకోవడం మానేశారు. దీంతో కారం నిల్వలు జిల్లాలో సుమారు 26 టన్నుల మేరకు పేరుకుపోగా అధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పంచదార, పామాయిల్ మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు . కానీ హై టెన్షన్ వినియోగదారులకు అందడం లేదు. ఈ సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచుతున్నట్లు ఆ అధికారులు చెబుతున్నా, ఎక్కువ మంది వెబ్సైట్ వినియోగించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతేడాది పవర్‌హాలిడే లేని వేళల్లో కరెంటు వాడుకున్నందుకు హెచ్‌టీ వినియోగదారులకు ఆరు రెట్లు పెనాల్టీ విధించారు. ఈ పెనాల్టీపై వినియోగదారులు అప్పట్లో కోర్టుకు వెళ్ళారు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలకు కరెంటు డిమాండ్ ఉంటుంది. జిల్లాలో స్పిన్నింగ్ 150 సర్వీసులు, 70 జిన్నింగ్ సర్వీసులు ఉన్నాయి. పవర్‌హాలిడే ప్రభావం స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలతో పాటు సిమెంటు, ప్లాస్టిక్ పరిశ్రమలపై ఎక్కువగా పడనుంది. వారానికి మూడు రోజుల పాటు పవర్‌హాలిడేలు అమలు చేయాలని ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో పరిశ్రమల్లో 1,200 కోట్ల విలువ చేసే ఆయా ఉత్పత్తులపై ప్రభావం పడనుందని అంచనా. రబీలో వ్యవసాయంకోసమేనట..! పరిశ్రమలకు పవర్‌హాలిడే అమలు రబీలో వ్యవసాయానికి కరెంటు ఇచ్చేందుకేనని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రోజుకు 11 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అవుతోంది. ఇందులో 7 నుంచి 8 మిలియన్ యూనిట్లు హెచ్టీల ద్వారానే వాడకం జరుగుతున్నట్లు అంచనా. ఈ వినియోగాన్ని తగ్గించి ఇటు వ్యవసాయానికి ఏడు గంటలు సరఫరా చేసేందుకేనని అధికారులు చెప్పడం గమనార్హం. అయితే వ్యవసాయానికి జిల్లాలో నాలుగు గంటలు కరెంటు సరఫరాయే గగనంగా మారింది. ఈ నాలుగు గంటలు ఎప్పుడిస్తారో.. కూడా తెలియడంలేదు. అర్ధరాత్రి వేళల్లో రైతులు కరెంటు కోసం పొలాల్లోనే కాపలా కాస్తున్నారు. ఈ ఏడాది గతేడాదిలా కాకుండా పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చేస్తామని చెప్పిన డిస్కం అధికారులు పవర్‌హాలిడేలు పెంచే యోచనలో ఉండటంతో పరిశ్రమల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు డిస్కం సరఫరా చేయకున్నా, అటు ఓపెన్ యాక్సెస్ విధానంలో కరెంటు కొనుక్కుందామన్నా, మిక్స్డ్ ఫీడర్లకు అవకాశం లేకపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు జనరేటర్లను పెద్ద ఎత్తున బిగించే యోచనలో ఉన్నారు. స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలకు నెలకు రూ.200 కోట్ల నష్టం పరిశ్రమలకు పవర్‌హాలిడేలతో రాష్ట్ర వ్యాప్తంగా స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలకు నెలకు రూ.200 కోట్ల నష్టం వాటిల్లనుంది. ఇందులో జిల్లాలోనే రూ.20 కోట్ల నష్టం జరగనుంది. ఈ దఫా పరిశ్రమలకు కోతల్లేకుండా చూస్తామని జనవరిలో సమావేశం పెట్టి మరీ చెప్పడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించలేదు. ఇప్పుడు హఠాత్తుగా పవర్‌హాలిడేలు అమలు చేస్తామని ప్రకటించారు. ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. - గోరంట్ల పున్నయ్య చౌదరి, ఏపీ స్పిన్నింగ్ అండ్ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు -
‘అమ్మహస్తం’లో తొలగిన బొమ్మలు
రాయవరం, న్యూస్‌లైన్ :నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో పేదలను ఆదుకొంటామంటూ గత ఉగాది నాడు ‘అమ్మహస్తం’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెల్ల రేషన్‌కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, కందిపప్పు, పసుపు, కారం, చింతపండు, ఉప్పు, గోధుమపిండి, మంచినూనె, పంచదారలను రూ.185కే అందజేస్తామని ప్రకటించింది. అయితే ‘పావలా కోడికి ముప్పావలా మషాళా’ అన్నట్టు.. ఈ పథకం కింద అందించే సరుకుల నాణ్యత ఎలా ఉన్నా.. ప్రచారార్భాటం మాత్రం ‘రంగుల బొమ్మ’లతో ఘనంగా చేసుకుంది సర్కారు. నిత్యావర వస్తువుల ప్యాకెట్లపై దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుల రంగుల ఫొటోలను ముద్రించారు. అంతేకాక.. పథకం ప్రారంభమైనప్పుడు అవే బొమ్మలతో కూడిన చేతి సంచులనూ పంపిణీ చేశారు. అయితే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ‘అమ్మహస్తం’ సరుకుల ప్యాకెట్లపై నాయకుల బొమ్మలను తొలగించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే నియమావళి అమల్లోనికి రానున్నందున.. రాబోయే మూడునెలలూ పేదలకు అందించే నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్న ఎన్నికల కమిషన్ సూచన మేరకే బొమ్మలను తొలగించినట్టు సమాచారం. అయితే పథకం అమలుకు ఇబ్బంది కలగరాదన్న ముందు చూపుతోనే నాయకుల బొమ్మలను తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు. -
అమ్మహస్తం.. ఆలోచిస్తాం!
కొవ్వూరు, న్యూస్‌లైన్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన అమ్మహస్తం పథకం అమలులో చతికిలపడింది. తెల్ల రేషన్‌కార్డుదారులకు రేషన్ డిపోల ద్వారా రూ.185కే 9రకాల నిత్యావసర సరుకులను అందిస్తామంటూ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. నాసిరకం సరుకుల్ని పంపిణీ చేయడంతో ఆదిలోనే అభాసుపాలైంది. 9నెలలు గడుస్తున్నా ప్రజాదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో పోయిన పరువును నిలబెట్టుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 9 రకాల సరుకుల్లో ప్రజలకు ఏ సరుకులు అవసరమో, ఏవి అవసరం లేదోననే విషయూన్ని తెలుసుకునేందుకు సర్వేబాట పట్టింది. జిల్లాలోని ప్రతి రేషన్ డిపో పరిధిలో కనీసం 100మంది కార్డుదారుల నుంచి ఈ అంశాలపై అభిప్రాయాలను సేకరించాలని జారయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆదేశాలిచ్చారు. ఇటీవలే రేషన్ డీలర్లతో డివి జన్ల వారీగా ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రత్యేకించి అమ్మహస్తం పథకంపై సమీక్షించారు. కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, గోధుమలు, పంచదార, ఉప్పు, కారం, చింతపండు, పసుపులో ఏ సరుకులు అవసరం లేదు, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏ సరుకులు అవసరమని కార్డుదారులు భావిస్తున్నారనే అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొం దించారు. ఈ వివరాలతో కూడిన ఫారాలను కార్డుదారులకు అందజేసి వారి అభిప్రాయూలను తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన వివరాలను క్రోఢీకరించి జిల్లాలోని రేషన్‌కార్డుదారులు ఏ సరుకులు కావాలంటున్నారు, వేటిని వద్దంటున్నారనే విషయూలను నిర్ధారిస్తారు. సర్వే ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఇటీవల నిర్వహించిన డీలర్ల సమావేశాల్లో వెల్లడించారు. జిల్లాలో సుమారు 2,300 రేషన్ షాపులు ఉండగా, వాటి పరిధిలో 11,22,086 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఐదు సరుకులపై అనాసక్తి అమ్మహస్తం పథకంలో పంపిణీ చేస్తున్న 9 సరుకుల్లో ఐదు సరుకుల్ని తీసుకునేందుకు రేషన్‌కార్డుదారులు విముఖత చూపుతున్నారు. చింతపండు, ఉప్పు, కారం, పసుపు నాణ్యత లేకపోవడం వల్ల వాటిని తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. మరోవైపు గోధుమల వినియోగం ఈ ప్రాంతంలో తక్కువ. ఈ కారణంగా వాటి విక్రయాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ప్రధానంగా చింతపండు అమ్మకాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విక్రయాలను పెంచేందుకు యత్నాలు అమ్మహస్తం సరుకులు కడప, మహబూబ్‌నగర్, విజయనగరం జిల్లాల్లో బాగా అమ్ముడవుతున్నారుు. పశ్చిమగోదావరి సహా మిగిలిన అన్ని జిల్లాల్లో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో అమ్మహస్తం సరుకుల అమ్మకాలను బాగా పెంచాలంటూ అధికారులు డీలర్లపై ఒత్తిడి చేస్తున్నారు. అమ్ముడుకాని సరుకుల్ని సరఫరా చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వే ప్రాతిపదికన అవసరమైన సరుకులను మాత్రమే పంపిణీ చేయూలనే నిర్ణయూనికి జిల్లా అధికారులు వచ్చారు. చింతపండు, పసుపు, కారం, ఉప్పు, గోధుమల స్థానంలో ప్రజలు కోరుతున్న ఉప్మారవ్వ, ఇడ్లీ రవ్వ వంటి వాటిని పంపిణీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపైనా దృష్టి సారించి, ఆ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలనే యోచనలో ఉన్నారు. డీలర్లను ప్రోత్సహించడం ద్వారా అమ్మకాలను పెంచుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మాదిరిగా డీలర్లతో గ్రూపులను ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించే దిశగా జారుుంట్ కలెక్టర్ బాబూరావునాయుడు అడుగులు వేస్తున్నారు. అమ్మహస్తం సరుకుల అమ్మకాలను పెంచాలని, ఏ సరుకైనా అవసరం లేదని ప్రభుత్వానికి నివేదిస్తే ఆ సరుకు నిలిచిపోతుందని, మళ్లీ కావాలంటే కేటాయించే అవకాశాలు ఉండకపోవచ్చని అధికారులు పేర్కొం టున్నారు. ఈ దృష్ట్యా సరుకులు వద్దని చెప్పే సందర్భంలో జాగూరుకతతో వ్యవహరించాలని డీలర్లకు సూచనలు అందాయి. -
పారని ‘పథకం’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అనూహ్య పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో తనదైన ముద్రను కనబర్చలేకపోయారు. మూడేళ్లు పూర్తి చేసుకున్నారనే మాటే తప్పిస్తే.. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రజలకు చేరువ కాలేకపోయింది. కొత్త పథకాలకు రూపకల్పన చేయడంతో పని అయిపోయినట్లుగా భావించడం.. లబ్ధిదారుల్లో అధికార పార్టీ అనుయాయులకే పెద్దపీట వేస్తున్నారనే అపవాదు.. పారదర్శకత లోపించడం ఇతరత్రా కారణాలతో మెరుగైన పాలనను అందించలేకపోయారనేది విశ్లేషకులు అభిప్రాయం. ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి పదిసార్లు జిల్లాలో పర్యటించినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోయారు. అమ్మహస్తం.. బంగారుతల్లి.. రాజీవ్ యువకిరణాలు.. ఇందిర జలప్రభ.. అమృతహస్తం.. రైతులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు.. తదితర పథకాలను సీఎం ఆర్భాటంగా ప్రవేశపెట్టినా ప్రచారానికే పరిమితమయ్యాయి. అమలు అస్తవ్యస్తంగా మారడంతో వినియోగదారులు, లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. 2011 సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు 36 హామీలు గుప్పించారు. ఇందులో ఐదారు మినహా మిగిలినవేవీ పరిష్కారానికి నోచుకున్న దాఖలాల్లేవు. శ్రీశైలం ముంపు బాధితుల్లో కొందరికి ఉద్యోగావకాశాలు కల్పించినా మిగిలిన వారికి ఆరు నెలల్లో ఉద్యోగాలిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా ఇప్పటికీ అతీగతీ లేకపోయింది. కొన్ని హామీలకు పరిష్కారం లభించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇందిరమ్మ బాటలో వివిధ వర్గాల ప్రజలు సీఎంకు పలు సమస్యలపై వినతులు అందజేశారు. దాదాపు 360 దరఖాస్తులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపడంతో చేతులు దులిపేసుకున్నారు. వీటిలో ఒక్క సమస్యా పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధితులు ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక నీటి పారుదల రంగం కూడా అస్తవ్యస్తంగా మారింది. హంద్రీనీవా ప్రాజెక్టును రెండేళ్ల క్రితం ఆడంబరంగా ప్రారంభించినా జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు అందకపోవడం గమనార్హం. హంద్రీనీవా పరిధిలోని చెరువుల్లో నీటిని నింపి ఆయా ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చాలని ప్రజలు కోరుతున్నా చెవికెక్కించుకునే నాథుడే కరువయ్యాడు.