అమ్మో హస్తం
వినుకొండ
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం అస్తవ్యస్తంగా మారింది. గత ఉగాది నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం తొలి నాటి నుంచి విమర్శల పాలవుతోంది.
అమ్మహస్తం పథకంలో భాగంగా ఇస్తున్న తొమ్మిది రకాల వస్తువులను తీసుకునేందుకు కార్డుదారులు నిరాకరిస్తున్నారు. నాణ్యతలేని సరుకులను అంటగడుతున్నారంటూ వీటి కొనుగోలుకు ముందుకురావడం లేదు. ఈ పథకం ద్వారా రూ. 185 లకు అరకిలో పంచదార, పామాయిల్, పావు కిలో కారంపొడి, అర కిలో చింతపండు, కిలో కందిపప్పు, 100 గ్రాముల పసుపు, కిలో ఉప్పు, కిలో గోధుమలు, కిలో గోధుమ పిండి ప్రతి నెలా సరఫరా చేయాలి.
అయితే పథకం ప్రారంభం నుంచి నాసిరకం సరుకులు సరఫరా చేయడం వల్ల కార్డుదారులు తీసుకోవడం మానేశారు. దీంతో కారం నిల్వలు జిల్లాలో సుమారు 26 టన్నుల మేరకు పేరుకుపోగా అధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పంచదార, పామాయిల్ మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు
. కానీ హై టెన్షన్ వినియోగదారులకు అందడం లేదు. ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు ఆ అధికారులు చెబుతున్నా, ఎక్కువ మంది వెబ్‌సైట్ వినియోగించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతేడాది పవర్‌హాలిడే లేని వేళల్లో కరెంటు వాడుకున్నందుకు హెచ్‌టీ వినియోగదారులకు ఆరు రెట్లు పెనాల్టీ విధించారు. ఈ పెనాల్టీపై వినియోగదారులు అప్పట్లో కోర్టుకు వెళ్ళారు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలకు కరెంటు డిమాండ్ ఉంటుంది.
జిల్లాలో స్పిన్నింగ్ 150 సర్వీసులు, 70 జిన్నింగ్ సర్వీసులు ఉన్నాయి. పవర్‌హాలిడే ప్రభావం స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలతో పాటు సిమెంటు, ప్లాస్టిక్ పరిశ్రమలపై ఎక్కువగా పడనుంది. వారానికి మూడు రోజుల పాటు పవర్‌హాలిడేలు అమలు చేయాలని ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో పరిశ్రమల్లో 1,200 కోట్ల విలువ చేసే ఆయా ఉత్పత్తులపై ప్రభావం పడనుందని అంచనా.
రబీలో వ్యవసాయంకోసమేనట..!
పరిశ్రమలకు పవర్‌హాలిడే అమలు రబీలో వ్యవసాయానికి కరెంటు ఇచ్చేందుకేనని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రోజుకు 11 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అవుతోంది. ఇందులో 7 నుంచి 8 మిలియన్ యూనిట్లు హెచ్‌టీల ద్వారానే వాడకం జరుగుతున్నట్లు అంచనా. ఈ వినియోగాన్ని తగ్గించి ఇటు వ్యవసాయానికి ఏడు గంటలు సరఫరా చేసేందుకేనని అధికారులు చెప్పడం గమనార్హం. అయితే వ్యవసాయానికి జిల్లాలో నాలుగు గంటలు కరెంటు సరఫరాయే గగనంగా మారింది. ఈ నాలుగు గంటలు ఎప్పుడిస్తారో.. కూడా తెలియడంలేదు. అర్ధరాత్రి వేళల్లో రైతులు కరెంటు కోసం పొలాల్లోనే కాపలా కాస్తున్నారు. ఈ ఏడాది గతేడాదిలా కాకుండా పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చేస్తామని చెప్పిన డిస్కం అధికారులు పవర్‌హాలిడేలు పెంచే యోచనలో ఉండటంతో పరిశ్రమల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు డిస్కం సరఫరా చేయకున్నా, అటు ఓపెన్ యాక్సెస్ విధానంలో కరెంటు కొనుక్కుందామన్నా, మిక్స్‌డ్ ఫీడర్లకు అవకాశం లేకపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు జనరేటర్లను పెద్ద ఎత్తున బిగించే యోచనలో ఉన్నారు.
స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలకు నెలకు రూ.200 కోట్ల నష్టం
పరిశ్రమలకు పవర్‌హాలిడేలతో రాష్ట్ర వ్యాప్తంగా స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలకు నెలకు రూ.200 కోట్ల నష్టం వాటిల్లనుంది. ఇందులో జిల్లాలోనే రూ.20 కోట్ల నష్టం జరగనుంది. ఈ దఫా పరిశ్రమలకు కోతల్లేకుండా చూస్తామని జనవరిలో సమావేశం పెట్టి మరీ చెప్పడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించలేదు. ఇప్పుడు హఠాత్తుగా పవర్‌హాలిడేలు అమలు చేస్తామని ప్రకటించారు. ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు.
- గోరంట్ల పున్నయ్య చౌదరి, ఏపీ స్పిన్నింగ్ అండ్ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు