అమ్మహస్తం.. ఆలోచిస్తాం!
Published Sun, Dec 22 2013 4:17 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
కొవ్వూరు, న్యూస్‌లైన్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన అమ్మహస్తం పథకం అమలులో చతికిలపడింది. తెల్ల రేషన్‌కార్డుదారులకు రేషన్ డిపోల ద్వారా రూ.185కే 9రకాల నిత్యావసర సరుకులను అందిస్తామంటూ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. నాసిరకం సరుకుల్ని పంపిణీ చేయడంతో ఆదిలోనే అభాసుపాలైంది. 9నెలలు గడుస్తున్నా ప్రజాదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో పోయిన పరువును నిలబెట్టుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 9 రకాల సరుకుల్లో ప్రజలకు ఏ సరుకులు అవసరమో, ఏవి అవసరం లేదోననే విషయూన్ని తెలుసుకునేందుకు సర్వేబాట పట్టింది. జిల్లాలోని ప్రతి రేషన్ డిపో పరిధిలో కనీసం 100మంది కార్డుదారుల నుంచి ఈ అంశాలపై అభిప్రాయాలను సేకరించాలని జారయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆదేశాలిచ్చారు. ఇటీవలే రేషన్ డీలర్లతో డివి జన్ల వారీగా ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రత్యేకించి అమ్మహస్తం పథకంపై సమీక్షించారు.
కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, గోధుమలు, పంచదార, ఉప్పు, కారం, చింతపండు, పసుపులో ఏ సరుకులు అవసరం లేదు, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏ సరుకులు అవసరమని కార్డుదారులు భావిస్తున్నారనే అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొం దించారు. ఈ వివరాలతో కూడిన ఫారాలను కార్డుదారులకు అందజేసి వారి అభిప్రాయూలను తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన వివరాలను క్రోఢీకరించి జిల్లాలోని రేషన్‌కార్డుదారులు ఏ సరుకులు కావాలంటున్నారు, వేటిని వద్దంటున్నారనే విషయూలను నిర్ధారిస్తారు. సర్వే ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఇటీవల నిర్వహించిన డీలర్ల సమావేశాల్లో వెల్లడించారు. జిల్లాలో సుమారు 2,300 రేషన్ షాపులు ఉండగా, వాటి పరిధిలో 11,22,086 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి.
ఐదు సరుకులపై అనాసక్తి
అమ్మహస్తం పథకంలో పంపిణీ చేస్తున్న 9 సరుకుల్లో ఐదు సరుకుల్ని తీసుకునేందుకు రేషన్‌కార్డుదారులు విముఖత చూపుతున్నారు. చింతపండు, ఉప్పు, కారం, పసుపు నాణ్యత లేకపోవడం వల్ల వాటిని తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. మరోవైపు గోధుమల వినియోగం ఈ ప్రాంతంలో తక్కువ. ఈ కారణంగా వాటి విక్రయాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ప్రధానంగా చింతపండు అమ్మకాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
విక్రయాలను పెంచేందుకు యత్నాలు
అమ్మహస్తం సరుకులు కడప, మహబూబ్‌నగర్, విజయనగరం జిల్లాల్లో బాగా అమ్ముడవుతున్నారుు. పశ్చిమగోదావరి సహా మిగిలిన అన్ని జిల్లాల్లో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో అమ్మహస్తం సరుకుల అమ్మకాలను బాగా పెంచాలంటూ అధికారులు డీలర్లపై ఒత్తిడి చేస్తున్నారు. అమ్ముడుకాని సరుకుల్ని సరఫరా చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వే ప్రాతిపదికన అవసరమైన సరుకులను మాత్రమే పంపిణీ చేయూలనే నిర్ణయూనికి జిల్లా అధికారులు వచ్చారు. చింతపండు, పసుపు, కారం, ఉప్పు, గోధుమల స్థానంలో ప్రజలు కోరుతున్న ఉప్మారవ్వ, ఇడ్లీ రవ్వ వంటి వాటిని పంపిణీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపైనా దృష్టి సారించి, ఆ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలనే యోచనలో ఉన్నారు.
డీలర్లను ప్రోత్సహించడం ద్వారా అమ్మకాలను పెంచుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మాదిరిగా డీలర్లతో గ్రూపులను ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించే దిశగా జారుుంట్ కలెక్టర్ బాబూరావునాయుడు అడుగులు వేస్తున్నారు. అమ్మహస్తం సరుకుల అమ్మకాలను పెంచాలని, ఏ సరుకైనా అవసరం లేదని ప్రభుత్వానికి నివేదిస్తే ఆ సరుకు నిలిచిపోతుందని, మళ్లీ కావాలంటే కేటాయించే అవకాశాలు ఉండకపోవచ్చని అధికారులు పేర్కొం టున్నారు. ఈ దృష్ట్యా సరుకులు వద్దని చెప్పే సందర్భంలో జాగూరుకతతో వ్యవహరించాలని డీలర్లకు సూచనలు అందాయి.
Advertisement