Ration depots
-
రేషన్ డిపోల వద్ద ప్రభుత్వ ప్రచారార్భాటం
సాక్షి, విశాఖపట్నం: ఏ చిన్న అవకాశం వచ్చినా, చిక్కినా వదలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవాలను సైతం తన ప్రచారానికి వాడేసుకుంటున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఏనాడు వినియోగదారుల హక్కుల రక్షణ ఊసెత్తని టీడీపీ ప్రభుత్వం.. మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల దినోత్సవం రోజున రేషన్ డిపోల్లో కార్డుదారులను సమీకరించి అవగాహన కల్పించాలని తలపోశారు. ఎగ్జిబిషన్లు, వర్క్‌షాపులు, ప్రసార మాద్యమాల ద్వారా వినియోగదారుల సంఘాలు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రచారం చేయాలని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డి.వరప్రసాద్ సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులతో షెడ్యూల్‌కు ఒక రోజు ముందు అమరావతిలో సమావేశం నిర్వహించారు కూడా. కొన్నేళ్లుగా చేతి చమురు వదిలించుకుని వినియోగదారుల హక్కుల రక్షణ కోసం పనిచేస్తున్న వినియోగదారుల సంఘాలను ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు.కొన్ని ఫోరాలకు శాశ్వత భవనాల్లేక అద్దె భవనాల్లోనే కోర్టులు నడుస్తున్నాయి. ఫోరాల అధ్యక్షులు, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు. 2014 నుంచి రాష్ట్ర వినియోగదారుల సమాచార కేంద్రం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఏటా నిర్వహించాల్సిన కార్యక్రమాలను తెలియజేసే ఇయర్ క్యాలెండర్ ఏనాడు రూపొందించిన పాపాన పోలేదు. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా తదితర పథకాలతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసుకునేందుకు గడచిన ఐదేళ్లలో తొలిసారి ఈ ఏడాది అవగాహనా సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 29,990 రేషన్ డిపోల ద్వారా కోటి 42 లక్షల 27వేల 455 కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకుల సరఫరా చేస్తోంది. ఆయా డిపోలన్నింటి వద్ద ఎన్నికల ప్రచారం కోసం ఒక్కో కార్డుదారునికి రూ.200 చొప్పున రూ.59.98లక్షలు మంజూరు చేసింది. పైగా ఈ నిధులను రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి మళ్లించింది. సంక్షేమ నిధిలో రూ.1.35 కోట్లు ఉన్నాయి. కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ విధంగా దొడ్డి దారిన ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం కోసం వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి మళ్లించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వ బాగోతంపై విశాఖకు చెందిన పలువురు డీలర్లు, సామాజిక కార్యకర్తలకు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. దొడ్డిదారిన చంద్రబాబు ప్రచారానికి ఎన్నికల కమిషన్ బ్రేకులు వేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు నిలుపుదల చేయాలని, అవగాహనా సదస్సుల పేరిట ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని నిలిపి వేయాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఐదేళ్లలో ఏనాడయినా పట్టించుకున్నారా?.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం గడచిన ఐదేళ్లలో ఏనాడు ప్రయత్నం చేయలేదు. పైసా ఖర్చు చేయలేదు. వినియోగదారుల ఫోరంలను పట్టించు కోలేదు. కానీ ఇప్పుడు దొడ్డిదారిన తమ పథకాలను ప్రచారం చేసుకునేందుకు సంక్షేమ నిధి నుంచి నిధులు దారిమళ్లించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయమనడం దారుణం. కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇలాంటివి సముచితం కాదు..ఫిర్యాదులు అందగానే ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడం అభినందనీయం. –కాండ్రేగుల వెంకటరమణ, సమాచార హక్కు ఉద్యమ కర్త -
అన్ని డిపోలకూ ఈ-పోస్
ఏలూరు (టూ టౌన్) : ప్రస్తుతం ఏలూరు నగరపాలక సంస్థ, జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు దెందులూరు మండలంలోని రేషన్ డిపోల్లో మాత్రమే అమల్లో ఉన్న ఈ-పోస్ విధానం జూన్ 1నుంచి అన్నిచోట్లా అమల్లోకి రానుంది. ఇందుకోసం జిల్లాకు మరో 1,514 ఈ-పోస్ మెషిన్లు కేటాయించారు. వారం రోజుల్లో ఇవి జిల్లాకు చేరతాయని డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి తెలిపారు. వీటిని జిల్లాలోని అన్ని రేషన్ డిపోల్లో అమర్చి ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తామన్నారు. అనంతరం అన్నిచోట్లా ఈ-పోస్ విధానంలోనే రేషన్ సరుకులు పంపిణీ అవుతాయన్నారు. ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉన్న 616 రేషన్ డిపోల డీలర్లకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. శిక్షణకు హాజరుకాని డీలర్ల వివరాలు ఇవ్వాల్సిందిగా తహసిల్దార్లకు, సివిల్ సప్లైస్ డీటీలకు సూచించామన్నారు. -
ఈ పోస్@: ఏపీ ఆన్లైన్
ఏలూరు (టూ టౌన్) :రేషన్ సరుకులను ఈ-పోస్ విధానంలో పంపిణీ చేస్తున్న సర్కారు స్వల్ప మార్పులు చేసింది. మే నెల నుంచి జిల్లాలోని అన్ని రేషన్ డిపోల్లో ఈ-పోస్ విధానాన్ని అమలు చేయాలనుకున్న అధికారులు ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయి దా వేశారు. గత నెలలో మాదిరిగానే జిల్లాలోని 7 పురపాలక సంఘాలతోపాటు ఏలూరు నగరం, దెందులూరు మండలంలోని 606 రేషన్ డిపోల్లో ఈ-పోస్ విధానంలోనే సరుకులు పంపిణీ చేస్తారు. అయితే, గత నెలలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు ఈనెల నుంచి ఏపీ ఆన్లైన్ సర్వర్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ నెట్ (నిక్నెట్) సర్వర్‌ను వినియోగించారు. ఈ సర్వర్లు మొరాయిం చడం, తరచూ పనిచేయకపోవడం వంటి సమస్యలతో అటు రేషన్ కార్డుదారులు, ఇటు డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దృష్ట్యా ఈ-పోస్ వేయింగ్ మెషిన్లను నిక్నెట్ సర్వర్ నుంచి తప్పించి, ఏపీ ఆన్లైన్ సర్వర్‌తో అనుసంధానించటం ద్వారా ఇబ్బందులను అధిగమించాలనే ఆలోచనకు అధికారులు వచ్చారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరమే మిగిలిన మండలాల్లోని రేషన్ డిపోల్లో ఈ-పోస్ మెషిన్లు ఏర్పాటు చేస్తారు. దీనికి తోడు ఈ-పోస్ వేయింగ్ మెషిన్లు ప్రభుత్వం నుంచి జిల్లాకు రాలేదు. నిక్నెట్ సర్వర్ కంటే ఏపీ ఆన్లైన్ సర్వర్ వేగంగా పని చేస్తుందని, తద్వారా రేషన్ పంపిణీలో తలెత్తిన సమస్యలు తీరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. మే నెలలో ఏపీ ఆన్లైన్ సర్వర్ పనితీరును పరిశీలించి.. వచ్చే నెలలో విడతల వారీగా ఇతర మండలాల్లోనూ ఈ-పోస్ విధానాన్ని ఆమలు చేయాలనే యోచనతో ఉన్నారు. -
పరిశీలనలో ఉచిత రేషన్ బియ్యం : ఈటెల
సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలకు కిలో బియ్యం రూపాయికి ఇవ్వాలా..? రూ. రెండుకు ఇవ్వాలా లేక ఉచితం గానా..? అనే అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం సమీక్షిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి ఇస్తున్న బియ్యం పరిమితిని 20 కేజీల నుంచి 35 కేజీలకు పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఈటెల చెప్పారు. ఈ అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం సమీక్షల అనంతరం నివేదకను రూపొందించి సీఎంకు అందజేస్తామని... సీఎం సూచనల మేరకు మెరుగైన పద్ధతులను అవలంబిస్తామని ఈటెల తెలిపారు. -
రేషన్ డిపోల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
శ్రీకాకుళం రూరల్/సరుబుజ్జిలి, న్యూస్‌లైన్: రేషన్ డిపోల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని డీసీఎంఎస్ పాయింట్(డిపో నంబరు-52), ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లోని పలు డిపోలను తనిఖీ చేశారు. డీసీఎంఎస్ పాయింట్ డిపోలో సుమారు 20 నిమిషాలు పాటు రికార్డులు, స్టాక్‌ను సరిచూశారు. గ్రాండ్ స్టాక్ బ్యాలెన్సును పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతీ రేషన్ డిపోలో కచ్చితంగా ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలను వినియోగించాలని డీలర్లను ఆదేశించారు. మరోసారి తనిఖీకి వచ్చే సమయానికి ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలు లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రాం తాల్లోని డిపోల్లో ప్రభుత్వం నియమించిన డీలర్లు కాకుండా అనాధికార వ్యక్తులు డీలర్‌గా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా ఎక్కడైనా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ డిపోల డీలర్లు స్టాక్, సేల్స్ రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పై నిబంధనలు తక్షణమే అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని డీఎస్వో ఆనందకుమార్‌ను ఆదేశించారు. తరుగు వస్తే సహించేదిలేదు చౌకధరల డీలర్లకు సరఫరా చేసే సరకుల్లో తరుగు వస్తే సహించేదిలేదని జేసీ హెచ్చరించారు. పౌరసరఫరాల గొడౌన్‌తోపాటు, పలు రేషన్ డిపోలపై ఫిర్యాదులు రావడంతో సరుబుజ్జిలి మండలంలోని గొడౌన్‌తోపాటు మర్రిపాడు రేషన్ డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మర్రిపాడు డిపోలో సరకుల వివరాలు, ధరలు, స్టాకుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే మండల పౌరసరఫరాల గొడౌన్లో సరకులు నిల్వచేసే పద్ధతులను, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. డిపోలకు సరఫరా చేసే సరకుల్లో తరుగులు వస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, సరిదిద్దుకోకపోతే చర్యలు తప్పవని గొడౌన్ ఇన్చార్జిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో పౌరసరఫరాల జిల్లా మేనే జర్ లోక్‌మోహన్, తహశీల్డార్లు పాల్గొన్నారు. -
అమ్మహస్తం.. ఆలోచిస్తాం!
కొవ్వూరు, న్యూస్‌లైన్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన అమ్మహస్తం పథకం అమలులో చతికిలపడింది. తెల్ల రేషన్‌కార్డుదారులకు రేషన్ డిపోల ద్వారా రూ.185కే 9రకాల నిత్యావసర సరుకులను అందిస్తామంటూ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. నాసిరకం సరుకుల్ని పంపిణీ చేయడంతో ఆదిలోనే అభాసుపాలైంది. 9నెలలు గడుస్తున్నా ప్రజాదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో పోయిన పరువును నిలబెట్టుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 9 రకాల సరుకుల్లో ప్రజలకు ఏ సరుకులు అవసరమో, ఏవి అవసరం లేదోననే విషయూన్ని తెలుసుకునేందుకు సర్వేబాట పట్టింది. జిల్లాలోని ప్రతి రేషన్ డిపో పరిధిలో కనీసం 100మంది కార్డుదారుల నుంచి ఈ అంశాలపై అభిప్రాయాలను సేకరించాలని జారయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆదేశాలిచ్చారు. ఇటీవలే రేషన్ డీలర్లతో డివి జన్ల వారీగా ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రత్యేకించి అమ్మహస్తం పథకంపై సమీక్షించారు. కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, గోధుమలు, పంచదార, ఉప్పు, కారం, చింతపండు, పసుపులో ఏ సరుకులు అవసరం లేదు, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏ సరుకులు అవసరమని కార్డుదారులు భావిస్తున్నారనే అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొం దించారు. ఈ వివరాలతో కూడిన ఫారాలను కార్డుదారులకు అందజేసి వారి అభిప్రాయూలను తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన వివరాలను క్రోఢీకరించి జిల్లాలోని రేషన్‌కార్డుదారులు ఏ సరుకులు కావాలంటున్నారు, వేటిని వద్దంటున్నారనే విషయూలను నిర్ధారిస్తారు. సర్వే ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఇటీవల నిర్వహించిన డీలర్ల సమావేశాల్లో వెల్లడించారు. జిల్లాలో సుమారు 2,300 రేషన్ షాపులు ఉండగా, వాటి పరిధిలో 11,22,086 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఐదు సరుకులపై అనాసక్తి అమ్మహస్తం పథకంలో పంపిణీ చేస్తున్న 9 సరుకుల్లో ఐదు సరుకుల్ని తీసుకునేందుకు రేషన్‌కార్డుదారులు విముఖత చూపుతున్నారు. చింతపండు, ఉప్పు, కారం, పసుపు నాణ్యత లేకపోవడం వల్ల వాటిని తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. మరోవైపు గోధుమల వినియోగం ఈ ప్రాంతంలో తక్కువ. ఈ కారణంగా వాటి విక్రయాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ప్రధానంగా చింతపండు అమ్మకాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విక్రయాలను పెంచేందుకు యత్నాలు అమ్మహస్తం సరుకులు కడప, మహబూబ్‌నగర్, విజయనగరం జిల్లాల్లో బాగా అమ్ముడవుతున్నారుు. పశ్చిమగోదావరి సహా మిగిలిన అన్ని జిల్లాల్లో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో అమ్మహస్తం సరుకుల అమ్మకాలను బాగా పెంచాలంటూ అధికారులు డీలర్లపై ఒత్తిడి చేస్తున్నారు. అమ్ముడుకాని సరుకుల్ని సరఫరా చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వే ప్రాతిపదికన అవసరమైన సరుకులను మాత్రమే పంపిణీ చేయూలనే నిర్ణయూనికి జిల్లా అధికారులు వచ్చారు. చింతపండు, పసుపు, కారం, ఉప్పు, గోధుమల స్థానంలో ప్రజలు కోరుతున్న ఉప్మారవ్వ, ఇడ్లీ రవ్వ వంటి వాటిని పంపిణీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపైనా దృష్టి సారించి, ఆ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలనే యోచనలో ఉన్నారు. డీలర్లను ప్రోత్సహించడం ద్వారా అమ్మకాలను పెంచుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మాదిరిగా డీలర్లతో గ్రూపులను ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించే దిశగా జారుుంట్ కలెక్టర్ బాబూరావునాయుడు అడుగులు వేస్తున్నారు. అమ్మహస్తం సరుకుల అమ్మకాలను పెంచాలని, ఏ సరుకైనా అవసరం లేదని ప్రభుత్వానికి నివేదిస్తే ఆ సరుకు నిలిచిపోతుందని, మళ్లీ కావాలంటే కేటాయించే అవకాశాలు ఉండకపోవచ్చని అధికారులు పేర్కొం టున్నారు. ఈ దృష్ట్యా సరుకులు వద్దని చెప్పే సందర్భంలో జాగూరుకతతో వ్యవహరించాలని డీలర్లకు సూచనలు అందాయి.