ఏలూరు (టూ టౌన్) : ప్రస్తుతం ఏలూరు నగరపాలక సంస్థ, జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు దెందులూరు మండలంలోని రేషన్ డిపోల్లో మాత్రమే అమల్లో ఉన్న ఈ-పోస్ విధానం జూన్ 1నుంచి అన్నిచోట్లా అమల్లోకి రానుంది. ఇందుకోసం జిల్లాకు మరో 1,514 ఈ-పోస్ మెషిన్లు కేటాయించారు. వారం రోజుల్లో ఇవి జిల్లాకు చేరతాయని డీఎస్‌వో డి.శివశంకర్‌రెడ్డి తెలిపారు. వీటిని జిల్లాలోని అన్ని రేషన్ డిపోల్లో అమర్చి ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తామన్నారు. అనంతరం అన్నిచోట్లా ఈ-పోస్ విధానంలోనే రేషన్ సరుకులు పంపిణీ అవుతాయన్నారు. ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉన్న 616 రేషన్ డిపోల డీలర్లకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. శిక్షణకు హాజరుకాని డీలర్ల వివరాలు ఇవ్వాల్సిందిగా తహసిల్దార్లకు, సివిల్ సప్లైస్ డీటీలకు సూచించామన్నారు.
అన్ని డిపోలకూ ఈ-పోస్
Published Fri, May 22 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement