Wheat flour
-
పండుగ వేళ పాకిస్తాన్లో దయనీయ పరిస్థితులు.. వీడియో వైరల్
దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. తినడానికి తిండి లేక పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక, ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ సహా 11 మంది మృత్యువాతపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఆర్థిక సంక్షోభం కారణంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో పాకిస్తాన్ ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. సామాన్యులు తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేసేందుకు వస్తున్న ఓ ట్రక్కుపైకి జనాలు ఎగబడ్డారు. రన్నింగ్‌లో ఉన్న ట్రక్కుపైకి ఎక్కి బస్తాల కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. Another video of a truck carrying floor/atta being looted in Pakistan. Reportedly one woman dead & few injured in sahiwal park during stampede for atta. Sad But the Propaganda of World Happiness Index, Hunger Index, self-styled fact checkers and anti-india haters, busted again. pic.twitter.com/HR46xrMHw5 — Megh Updates 🚨™ (@MeghUpdates) March 29, 2023 దీంతో, అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని సహివాల్, బహవాల్పూర్, ముజఫర్‌గఢ్, ఒఖారా ప్రాంతాలపోటు, ఫైసలాబాద్, జెహానియాన్, ముల్తాన్ జిల్లాల్లో తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 50 ఏండ్ల రికార్డు స్థాయికి చేరింది. దీంతో నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. అయితే పవిత్ర రంజాన్ మాసం కావడంతో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ధరాభారం నుంచి కొద్దిగానైనా ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేస్తున్నది. దీంతో, ఇలా తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. This video from #TerroristNationPakistan is for all the people who actually “believe” in the ‘indexes”, according to whom Pakistan is better ranked than Bharat. Shame on presstitute media, who keeps propagating those rankings. People r dying just a bag of wheat flour. pic.twitter.com/YH29j3uCc0 — Tathvam-asi (@ssaratht) March 29, 2023 -
ఏపీ సర్కార్ మరో ముందడుగు..
సాక్షి, విశాఖపట్నం: పేదల కడుపు నింపే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసర ఫరాల శాఖ బుధవారం నుంచి గోధుమ పిండి కూడా అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖ పట్టణంలో ప్రారంభించారు. నగరంలోని లబ్దిదారులకు గోధుమ పిండి ప్యాకెట్ లను పంపిణీ చేశారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధర 16 రూపాయలుగా నిర్ణయించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.40గా ఉంది. విశాఖపట్నం అర్బన్ ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధారలో రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! -
పాకిస్తాన్లో ఆహార సంక్షోభం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఆహార సంక్షోభం సైతం మొదలయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా గోధుమ పిండి కొరత వేధిస్తోంది. రాయితీపై ప్రభుత్వం అందించే గోధుమ పిండి కోసం జనం ఎగబడుతున్నారు. ఖైబర్ పఖ్తూంక్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాట, తోపులాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పిండి కోసం తరలివచి్చన జనంతో మార్కెట్లు నిండిపోయాయి. మార్కెట్లలో రాయితీ గోధుమ పిండి కోసం జనం గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సి వస్తోంది. నిత్యం వేలాది మంది వస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. కిలో గోధుమ పిండి రూ.160 పాకిస్తాన్ ప్రధాన ఆహారమైన గోధుమలు, గోధుమ పిండి ధర విపరీతంగా పెరిగిపోయింది. కరాచీలో కిలో పిండి ధర రూ.160కు చేరింది. ఇస్లామాబాద్, పెషావర్‌లో 10 కిలోల గోధుమ పిండి బ్యాగ్‌ను రూ.1,500కు విక్రయిస్తున్నారు. 15 కిలోల బ్యాగ్ ధర రూ.2,050 పలుకుతోంది. గత రెండు వారాల వ్యవధిలోనే ధర రూ.300 పెరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారడం ఖాయమన్న సంకేతాలను బలూచిస్తాన్ ఆహార మంత్రి జమారక్ అచాక్జాయ్ ఇచ్చారు. గోధుమ నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యానని చెప్పారు. ఆహార శాఖ, పిండి మిల్లుల నడుమ సమన్వయ లోపమే కొరతకు కారణమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు పాకిస్తాన్‌ను ద్రవ్యోల్బణం హడలెత్తిస్తోంది. గత ఏడాది సంభవించిన భీకర వరదల వల్ల కష్టాలు మరింత పెరిగాయి. కేవలం గోధుమలే కాదు ఉల్లిపాయలు, తృణధాన్యాలు, బియ్యం ధరలు సైతం పైకి ఎగబాకుతున్నాయి. కిలో ఉల్లిపాయల ధర 2022 జనవరి 6న రూ.36.7 కాగా, 2023 జనవరి 5 నాటికి ఏకంగా రూ.220.4కు చేరింది. అంటే ఏడాది వ్యవధిలోనే 501 శాతం పెరిగింది. అలాగే డీజిల్ ధర 61 శాతం, పెట్రోల్ ధర 48 శాతం పెరిగింది. బియ్యం, తృణధాన్యాలు, గోధుమల ధర 50 శాతం ఎగబాకింది. 2021 డిసెంబర్లో పాక్ ద్రవ్యోల్బణం 12.3 శాతం కాగా, 2022 డిసెంబర్లో 24.5 శాతం నమోదయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం ఒక ఏడాదిలోనే 11.7 శాతం నుంచి 32.7 శాతానికి చేరింది. పాకిస్తాన్లో విదేశీ మారక నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. 2021 డిసెంబర్లో 23.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2022 డిసెంబర్లో కేవలం 11.4 బిలియన్ డాలర్లు ఉన్నాయి. రష్యా గోధుమల దిగుమతి రష్యా నుంచి గోధుమలు పాకిస్తాన్‌కు చేరుకోవడం కొంత ఊరట కలిగిస్తోంది. రెండు ఓడల్లో వేలాది టన్నుల గోధుమలు తాజాగా కరాచీ రేవుకు చేరుకున్నాయి. అదనంగా 4,50,000 టన్నులు రష్యా నుంచి గ్వాదర్ పోర్టు ద్వారా త్వరలో రానున్నాయని పాక్ అధికారులు వెల్లడించారు. గోధుమల కొరతను అధిగమించడానికి వివిధ దేశాల నుంచి 75 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం సరుకు ఈ ఏడాది మార్చి 30 నాటికి పాకిస్తాన్‌కు చేరుకుంటుందని అంచనా. -
Chocolate: కోకో పౌడర్, గోధుమ పిండి.. చాకొలెట్లు ఇంట్లోనే ఇలా ఈజీగా..
కాలం కరిగిపోతుంది. చాక్లెట్లు కూడా... నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చాక్లెట్లనగానే మనకు బయటినుంచి కొనుక్కుని రావడం మాత్రమే తెలుసు. కానీ కాస్త సమయం కరిగిస్తే ... ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాక్లెట్లతో పాటే తీపి జ్ఞాపకాలను కూడా చప్పరించేయొచ్చు. అదెలాగో చూడండి మరి! మిల్క్ చాక్లెట్ కావలసినవి: ►కోకో పౌడర్ – 2 కప్పులు ►చక్కెర – అర కప్పు ►గోధుమ పిండి– పావు టీ స్పూన్ ►బటర్ – ముప్పావు కప్పు (ఉప్పు లేనిది) ►పాలు – ముప్పావు కప్పు ►నీరు – కప్పు. తయారీ: ►కోకో, బటర్‌ను ప్రాసెసర్‌లో మెత్తని పేస్టు చేయాలి. ►ఇప్పుడు పెనం వేడి చేసి పావు కప్పు నీరు పోసి వేసి చేసి అందులో కోకో, బటర్ మిశ్రమం పేస్ట్ ఉన్న పాత్రను ఉంచాలి. ►కోకో మిక్స్ బాగా కరిగిన తర్వాత ఆ పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కలుపుతూ వేడి చేయాలి. ►మరిగే స్థాయికి వచ్చిన తర్వాత దించేసి మిశ్రమాన్ని విస్కర్‌తో బాగా చిలకాలి. ►ఇప్పుడు పాలను మరిగించి పిండి, చక్కెర వేసి కరిగే వరకు కలపాలి. ►ఇందులో కోకో మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ►ఇప్పుడు మిశ్రమాన్ని చాకొలెట్ మౌల్డ్ ట్రేలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్ మ్యాగ్జిమమ్లో ఉంచాలి. ►మిశ్రమం గట్టిపడిన తర్వాత బయటకు తీసి మౌల్డ్ నుంచి వేరు చేయాలి. ►వెంటనే వేరుపడకపోతే ట్రేని గోరువెచ్చని నీటి మీద తేలేటట్లు నాలుగైదు సెకన్ల పాటు ఉంచితే చాక్లెట్లు ట్రే నుంచి విడివడుతాయి. వైట్ చాక్లెట్ కావలసినవి: ►కోకో బటర్– కప్పు ►చక్కెర పొడి– 3 టేబుల్ స్పూన్లు ►పాల పొడి– 3 టేబుల్ స్పూన్లు ►వెనిల్లా ఎసెన్స్– మూడు చుక్కలు. తయారీ: ►ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో కోకో బటర్ ఉన్న పాత్రను పెట్టి కలుపుతూ కరిగించాలి. ►దించిన తర్వాత అందులో చక్కెర పొడి, పాల పొడి, వెనిలా ఎసెన్స్ వేసి ఉండలు లేకుండా సమంగా కలిగే వరకు కలపాలి. ►ఈ మిశ్రమాన్ని చాక్లెట్ మౌల్డ్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ►మిశ్రమం గట్టి పడడానికి మ్యాగ్జిమమ్ డిగ్రీల్లో అర గంట నుంచి ముప్పావు గంట పడుతుంది. ►ఇంకా త్వరగా కావాలంటే ఫ్రీజర్‌లో పెడితే 20 నిమిషాల్లో చాక్లెట్ తయారవుతుంది. -
Recipe: బెల్లం, గోధుమ రవ్వతో ఓట్స్ జిలేబి తయారీ ఇలా!
వెరైటీగా ఓట్స్‌తో ఇలా జిలేబి ట్రై చేయండి! కావలసినవి: ►ఓట్స్ – 1 కప్పు ►గోధుమ రవ్వ – అర కప్పు ►నీళ్లు – సరిపడా ►బెల్లం కోరు – 2 కప్పులు ►ఉప్పు – చిటికెడు ►ఫుడ్ కలర్ – కొద్దిగా (జిలేబీ కలర్) ►నూనె లేదా నెయ్యి – 1 కప్పు తయారీ: ►ముందుగా ఓట్స్, గోధుమ రవ్వలను మిక్సీ బౌల్లో వేసుకుని.. ఒక కప్పు నీళ్లు పోసుకుని.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►20 నిమిషాల తర్వాత ఆ మిశ్రమంలో ఉప్పు, కొద్దిగా ఫుడ్‌కలర్ వేసుకోవాలి. ►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని కోన్ లాంటి ఖాళీ టొమాటో సాస్ టిన్‌లో నింపి పెట్టుకోవాలి. ►ఈ లోపు స్టవ్ మీద కళాయిలో బెల్లం కోరు, ఒక కప్పు నీళ్లు పోసుకుని.. లేత పాకం వచ్చే వరకూ మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►మరో స్టవ్ ఆన్ చేసుకుని.. మరో కళాయిలో నెయ్యి లేదా నూనెలో ఓట్స్ మిశ్రమాన్ని జిలేబీల్లా వేస్తూ దోరగా వేయించుకోవాలి. ►వెంటనే వాటిని బెల్లం పాకంలో వేసి దేవుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Oats Walnut Cutlets: ఓట్స్– వాల్నట్స్ కట్లెట్ తయారీ ఇలా.. ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ! -
Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి
శీతాకాలం పగలు తక్కువ.. రాత్రి ఎక్కువ. రాత్రి వేళల్లో చలి ఎక్కువ. భోజనం బరువుగా ఉండకూడదు. అలాగని తక్కువ తింటే పోషకాలందవు. కొద్దిగా తిన్నా సరే... అది సమతులంగా ఉండాలి. ఆహారాన్ని దేహం వెచ్చగా ఒంటబట్టించుకోవాలి. అందుకే... ఇది ట్రై చేసి చూడండి. పాంజిరి కావలసినవి: ►సన్నగా తరిగిన బాదం – కప్పు ►యాలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు ►దోస గింజలు – పావు కప్పు ►తర్బూజ గింజలు – పావు కప్పు ►పిస్తా పప్పు – పావు కప్పు (తరగాలి) ►వాము – అర టీ స్పూన్ ►ఎండు కొబ్బరి తురుము – కప్పు ►అల్లం తరుగు లేదా శొంఠి పొడి– 2 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు– కప్పు (చిన్న పలుకులు) ►తామరగింజలు – కప్పు ►వాల్నట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – 3 టేబుల్ స్పూన్లు ►నెయ్యి– 3 టేబుల్ స్పూన్లు. ప్రధానమైన పదార్థాలు: ►సూజీ రవ్వ – కప్పు ►నెయ్యి – ఒకటిన్నర కప్పు ►గోధుమ పిండి – రెండున్నర కప్పులు ►బెల్లం పొడి – ఒకటిన్నర కప్పు. తయారీ: ►మందంగా ఉన్న బాణలిలో నెయ్యి వేడి చేసి తామర గింజలు (మఖానియా) వేయించాలి. ►వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాణలిలో జీడిపప్పు, వాల్నట్, బాదం, తర్బూజ, దోసగింజలు, పిస్తా, కొబ్బరి తురుము, కిస్మిస్ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►ఇందులో అల్లం తరుగు లేదా శొంఠి, వాము, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు ప్రధాన దినుసులను వేయించాలి. ►మరొక బాణలిలో నెయ్యి వేడి చేసి గోధుమ పిండి వేసి సన్నమంట మీద వేయించాలి. ►గోధుమ పిండి వేగి మంచి వాసన వస్తున్న సమయంలో సూజీ రవ్వ వేసి కలుపుతూ వేయించాలి. ►రవ్వ కూడా దోరగా వేగిన తర్వాత బెల్లం పొడి వేసి కలపాలి. ►ఇందులో ముందుగా వేయించి సిద్ధంగా ఉంచిన గింజల మిశ్రమాన్ని వేసి కలిపితే పాంజిరి రెడీ. ►దీనిని కప్పులో వేసుకుని పొడిగా స్పూన్‌తో తినవచ్చు. పాలిచ్చే తల్లులకు ప్రయోజనకరం ►పిల్లలు కింద పోసుకోకుండా మొత్తం తినాలంటే మరికొంత నెయ్యి వేసుకుని లడ్డు చేయాలి. ►ఇది ఉత్తరభారతదేశంలో బాలింతకు తప్పనిసరిగా పెట్టే స్వీట్. ►పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం. చదవండి: Kismis Doughnuts: మైదాపిండి, పంచదార.. కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా! Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా -
Beauty: గోధుమ పిండితో ట్యాన్‌కు చెక్! వెల్లుల్లి పేస్టు మొటిమలపై రాస్తున్నారా?
ట్యాన్ తొలగి ముఖం మెరిసిపోవాలన్నా.. మొటిమలు తగ్గించుకోవాలన్నా ఈ చిట్కాలు ట్రై చేయొచ్చు. పార్లర్‌కు వెళ్లే అవసరం లేకుండా మెరిసే మోము సొంతం చేసుకోవచ్చు. ట్యాన్ పోగొట్టే ఆటా ప్యాక్ ►గోధుమపిండితో రుచికరమైన రోటీలేగాక ఎండవల్ల ముఖంపై ఏర్పడిన ట్యాన్‌ను కూడా తగ్గించవచ్చు. ►దీనికోసం రెండు స్పూన్ల గోధుమపిండి, స్పూను తేనె, స్పూను పెరుగు, స్పూను రోజ్ వాటర్, స్పూను ఓట్స్, అరస్పూను కొబ్బరి నూనె తీసుకోవాలి. ►వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ►తరువాత ఈ పేస్టును ముఖానికి రాసి ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ►ఈ ‘ఆటా ఫేస్‌ప్యాక్’ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగడమేగాక, ట్యాన్ తగ్గుముఖం పట్టి ముఖచర్మం కాంతిమంతమవుతుంది. వెల్లుల్లితో.. ►ముఖం మీది మొటిమలను ఇంటి చిట్కాతో సులభంగా వదిలించుకోవచ్చు. ►నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టుతీసి మెత్తగా పేస్టులా నూరుకోవాలి. ►ఈ పేస్టును ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి. ►పేస్టు ఆరుతుంది అనుకున్నప్పుడు దానిపై బ్యాండేజ్ వేయాలి. ►ఈ బ్యాండేజ్‌ను రాత్రంతా ఉంచుకుని ఉదయం తీసేయాలి. ►ఇలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి. నోట్: చర్మ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రై చేస్తే బెటర్. చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే.. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే Health Tips: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి.. -
‘సింగపూర్‌లో చపాతీల కోసం భారతీయుల కటకట!’
సింగపూర్ పంజాబీలకు చపాతీ కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఈ ఏడాది మే నెల నుంచి భారత్ గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. ముఖ్యంగా సింగపూర్ వంటి దేశాల్లో నార్త్ ఇండియా నుంచి ఎగుమతయ్యే గోధుమల రవాణా తగ్గిపోయింది. దీంతో ఆ గోధుమలతో తయారు చేసిన చపాతీలు లభ్యం కాకపోవడంతో వాటిని అమితంగా ఇష్టపడే పంజాబీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మూడు రెట్లు ఎక్కువే ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం కారణంగా విదేశాల్లో గోధుమల కొరత తీవ్రంగా ఏర్పడింది. అవసరానికి అనుగుణంగా గోధుమలు లేకపోవడం, వాటిని ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో ఉన్న భారత్ ఎగుమతుల్ని నిలిపివేయడంతో సింగపూర్‌లో భారతీయులకు చపాతీల కొరత ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఆ చపాతీ పిండి కొనుగోలు చేయాలంటే భారత్‌తో పోలిస్తే మూడింతలు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిపోతున్న ధరల భారాన్ని వినియోగదారులపై మోపడం కష్టంగా ఉందని సింగపూర్‌లో ఐదు రెస్టారెంట్ అవుట్ లెట్స్ నిర్వహిస్తున్న శకుంతలా రెస్టారెంట్ ప్రతినిధులు చెబుతున్నారు. కష్టంగా ఉంది సింగపూర్‌లో కేజీ గోధుమ పిండిని 2డాలర్లు చెల్లించే కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అదే కేజీ గోధుమ పిండి ధర 8డాలర్లకు చేరింది. గోధుమ పిండిని అధిక మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయడం కష్టంగా మారిందని పంజాబీ, బెంగాల్ వంటలకు ప్రసిద్ధి చెందిన మస్టర్డ్ సింగపూర్ రెస్టారెంట్ యజమాని రాధిక అబ్బి తెలిపారు. -
Recipe: ముల్లంగి తురుము, రాగి పిండి, గోధుమ పిండితో ముల్లంగి నాచిన్ రోటీ!
నోటికి రుచిగా ఉండే ఆహారం కాకుండా పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. క్యాలరీలు కూడా అవసరమే. అయితే అవసరమైన దానికన్నా ఎక్కువైతే బరువు పెరుగుతారు. అందువల్ల క్యాల్షియం సమృద్ధిగా, క్యాలరీలు తక్కువగా ఉండే వంటకాలు ఎలా వండుకోవచ్చో చూద్దాం... ముల్లంగి నాచిన్ రోటీ కావలసినవి: ►ముల్లంగి తురుము – అరకప్పు ►ముల్లంగి ఆకుల తురుము – అరకప్పు ►రాగి పిండి – అరకప్పు ►గోధుమ పిండి – అరకప్పు ►నువ్వులు – రెండు టీస్పూన్లు ►వేయించిన జీలకర్ర – అరటీస్పూను ►పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను ఉప్పు – రుచికి తగినంత ►నూనె – రోటీ వేయించడానికి సరిపడా. తయారీ: ►నూనె తప్పించి మిగతా వాటన్నింటిని ఒక గిన్నెలో వేసి చపాతీ పిండిలా కలిపేసి పదినిమిషాలపాటు నానబెట్టుకోవాలి ►నానిన పిండిని ఉండలు చేసుకుని రోటీల్లా వత్తుకోవాలి ►బాగా వేడెక్కిన పెనం మీద పావు టీస్పూను నూనె వేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ►లైట్ బ్రౌన్ కలర్లోకి కాలిన తరువాత వెంటనే సర్వ్ చేసుకోవాలి. ►ఇవి వేడిమీదే బావుంటాయి. చల్లారితే గట్టిబడతాయి. బొప్పాయి యాపిల్ స్మూతీ కావలసినవి: ►బొప్పాయి ముక్కలు – రెండు కప్పులు ►గ్రీన్ యాపిల్ ముక్కలు – ఒకటిన్నర కప్పులు ►గింజలు తీసిన ఆరెంజ్ తొనలు – పావు కప్పు ►పెరుగు – కప్పు ►ఐస్ క్యూబ్స్ – ఒకటిన్నర కప్పులు ►వెనీలా ఎసెన్స్ – అరటీస్పూను. తయారీ: ►పదార్థాలన్నింటిని మిక్సీజార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ►మిశ్రమాన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ►లేదంటే రిఫ్రిజిరేటర్లో పెట్టి చల్లగా ఉన్నప్పుడు సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Sesame Crusted Chicken: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్! Beetroot Rice Balls Recipe: బీట్రూట్ రైస్ బాల్స్ ఇలా తయారు చేసుకోండి! -
Recipe: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా!
గోధుమ పిండి.. మైదా పిండితో చిలగడదుంపల పూరీ తయారీ విధానం మీకోసం! చిలగడదుంపల పూరీ తయారీకి కావలసినవి: ►చిలగడదుంపలు – 2 (కుకర్‌లో మెత్తగా ఉడికించుకుని, పైతొక్క తొలగించి, గుజ్జులా చేసుకోవాలి.) ►గోధుమ పిండి –2 కప్పులు ►గోరువెచ్చని నీళ్లు – సరిపడా ►మైదాపిండి – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు ►కారం – 1 టీ స్పూన్ ►పసుపు – చిటికెడు ►గరం మసాలా – 1 టీ స్పూన్ ►ఉప్పు – తగినంత ►నూనె – సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ►అందులో చిలగడదుంప గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ►సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ►20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. ►ర్వాత కళాయిలో నూనె కాగించి దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mutton Keema Cheese Samosa: మటన్ కీమా- చీజ్ సమోసా తయారీ ఇలా! Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్ తయారీ ఇలా! -
Recipes: గోధుమ పిండి, మినప్పప్పుతో బబ్రు, ఎర్ర కందిపప్పుతో తుక్దియా బాత్ ఇలా!
మంచుతో కప్పబడిన ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు, పచ్చని అడవులు స్వచ్ఛమైన గాలితో.. హిమాచల్ సోయగాలు రారమ్మని పిలుస్తుంటాయి. అక్కడి ప్రకృతి అందాలు ఎంత అబ్బురపరుస్తాయో ... íహిమాచల్ వాసుల సంప్రదాయ వంటలు విభిన్న రుచితో తినేకొద్ది తినాలనిపిస్తాయి. వాటిలో కొన్ని వంటలు ఇవి... గోధుమ పిండి, మినప్పప్పుతో బబ్రు కావలసినవి: ►గోధుమ పిండి – రెండు కప్పులు ►మినపప్పు – కప్పు ►ఆయిల్ – డీప్‌ఫ్రైకి సరిపడా ►ఉప్పు – రుచికి సరిపడా తయారీ.. ►మినపప్పుని శుభ్రంగా కడిగి రాత్రంతా నాన బెట్టుకోవాలి. ►నానిన పప్పుని ఉదయాన్నే నీళ్లు వంపేసి బరకగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. ►గోధుమపిండిలో పావు టీస్పూను ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి పూరీ పిండిలా కలుపుకోవాలి. ►పిండిముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ►ఈ ఉండలను చిన్న పూరీలా వత్తి మధ్యలో టీస్పూను మినపప్పు మిశ్రమం వేసి మూసేయాలి. ►ఇలా అన్నీ ఉండలు చేసిన తరువాత, లోపలి మిశ్రమం బయటకు రాకుండా చిన్నచిన్న పూరీలుగా వత్తుకోవాలి ►ఆయిల్ వేడెక్కిన తరువాత పూరీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారెంతవరకు కాలనిస్తే బబ్రు రెడీ. ► చనా మద్రా లేదా, బూందీరైతాలతో బబ్రూలు చాలా బావుంటాయి. ఎర్ర కందిపప్పుతో తుక్దియా బాత్ కావలసినవి: ►బియ్యం – కప్పు ►ఎర్రకందిపప్పు – అరకప్పు ►ఉల్లిపాయ – ఒకటి ►బంగాళ దుంప – రెండు ►చిక్కటి పెరుగు – అరకప్పు ►బిర్యానీ ఆకు – ఒకటి ►యాలుక్కాయ – ఒకటి ►నల్లయాలుక్కాయ – ఒకటి ►దాల్చిన చెక్క – అరంగుళం ముక్క ►నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా మసాలా పేస్టు: టొమాటో – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి, అల్లం – అంగుళం ముక్క, వెలుల్లి రెబ్బలు – ఐదు, కొత్తిమీర – చిన్నకట్ట, పచ్చిమిర్చి – రెండు, యాలుక్కాయ – ఒకటి, నల్లయాలుక్కాయ – ఒకటి, దాల్చిన చెక్క – అరఅంగుళం ముక్క, జాపత్రి – రెండు, అనాసపువ్వులు – రెండు, దగడపువ్వులు – రెండు, నాగకేసరపువ్వులు – రెండు, గసగసాలు – అరటీస్పూను, లవంగాలు – రెండు, కారం – అరటీస్పూను. తయారీ.. ►ముందుగా మసాలా పేస్టుకోసం తీసుకున్న పదార్థాలన్నీ బ్లెండర్లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. ►బంగాళ దుంపలను తొక్కతీసి, అంగుళం పరిమాణంలో ముక్కలుగా తరగాలి ►బంగాల దుంపల ముక్కలను మసాలా మిశ్రమంలో వేసి కలిపి, రాత్రంతా రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి ►ఎర్రకందిపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లుపోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి ►బియ్యాన్ని కూడా కడిగి రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ►ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ∙కుకర్ గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. ►నెయ్యి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, నల్ల, సాధారణ యాలుక్కాయలు, దాల్చిన చెక్క వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి ►ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ►ఉల్లిపాయలు చక్కగా వేగినాక రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి వేగనివ్వాలి ►ఈ మిశ్రమం వేగిన తరువాత పెరుగు వేసి నెయ్యి పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యం, ఎర్రకందిపప్పులను నీళ్లు వంపేసి వేయాలి ►∙దీనిలో మూడు కప్పుల వేడినీళ్లుపోసి కలపాలి. ►కుకర్ మూతపెట్టి పెద్ద మంటమీద రెండు విజిల్స్ రానిస్తే తుక్దియా బాత్ రెడీ. చదవండి: Prawns Salad Sandwich In Telugu: ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ ఇలా తయారు చేసుకోండి! Ulava Garelu Recipe In Telugu: ఉలవ గారెలు తిన్నారా? -
Recipes: సువాసన భరిత బటర్ టీ.. టింగ్మో, ఖమీరి రోటీ ఇంట్లోనే ఇలా ఈజీగా!
Recipes In Telugu: రారమ్మని పిలిచే లద్దాఖ్ ప్రకృతి అందాలు.. నీలంరంగు ఆకాశం, మంచు దుప్పట్లు కప్పారా అన్నట్లున్న పర్వతాలతో ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. టిబెట్ సంస్కృతీ సంప్రదాయ మూలాలున్న లద్దాఖ్ వాసుల వంటకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు టిబెట్, ఇండియన్ రుచుల కలబోతతో ఎంతో రుచికరంగా ఉంటాయి. లద్దాఖ్ వెళ్లి అక్కడి వంటకాల రుచి చూడాలంటే కాస్త కష్టమే కాబట్టి, అక్కడిదాకా వెళ్లకుండానే లద్దాఖ్ పాపులర్ వంటకాలను ఎలా వండుకోవచ్చో చూద్దాం... ఖమీరి రోటీ కావలసినవి: ►గోధుమపిండి – రెండుంబావు కప్పులు ►నల్ల జీలకర్ర(కలోంజి) – టీస్పూను ►పాలు – కప్పు, పంచదార పొడి – అరటేబుల్ స్పూను ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ►పొడి ఈస్ట్ – ఒకటిన్నర టీస్పూన్లు ►పుచ్చకాయ విత్తనాలు – టీస్పూను ►నువ్వులు – టీస్పూను, కొత్తిమీర – గుప్పెడు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ.. ►ముందుగా గోరువెచ్చని నీటిలో ఈస్ట్వేసి నానబెట్టాలి. ►ఒక పెద్దగిన్నెలో గోధుమపిండి, పంచదార వేసి కలపాలి. ►ఈ పిండిలోనే పాలు, ఈస్ట్వేసిన నీళ్లు వేసి మెత్తటి ముద్దలా కలపాలి. ►ఈ పిండి ముద్దపై తడివస్త్రాన్ని కప్పి ఇరవై నిమిషాలు పక్కనపెట్టాలి. ►ఇరవై నిమిషాల తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఉండ మధ్యలో చిన్న రంధ్రం చేసి పుచ్చకాయ, నువ్వులు, నల్లజీలకర్ర వేసి మూసేయాలి ►ఇప్పుడు ఉండలను రెండు అంగుళాల మందంలో చిన్నసైజు రోటీల్లా వత్తుకోవాలి. ►ఈ రోటీలను బేకరీ ట్రేలో లేదా పెనం మీద ఆయిల్ రాసి దానిపై రోటీని ఉంచాలి. ►ఈ పెనాన్ని సన్నని మంటమీద బోర్లించి రోటీని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఉడికించాలి. ►వేడివేడి రోటీలను కొత్తిమీరతో గార్నిష్‌చేసి, పైన కొద్దిగా నెయ్యి చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి. టింగ్మో కావలసినవి: ► గోధుమపిండి – పావు కేజీ ►ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరగాలి) ►వెల్లుల్లి తరుగు – టీస్పూను ►బేకింగ్ పౌడర్ – రెండు టీస్పూన్లు ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – రెండు(సన్నగా తరగాలి), నీళ్లు – రెండు కప్పులు, కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు. తయారీ.. ►గోధుమపిండిని ఒక గిన్నెలో వేసి టేబుల్ స్పూను ఆయిల్, బేకింగ్ పౌడర్ వేసి తగినంత నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాలి. ►పిండి ముద్దను చిన్న చిన్న రోల్స్ చేయాలి. ►ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుని చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని రోల్స్‌లో నింపి పువ్వులా వత్తుకోవాలి. ►ఈ పువ్వులను ఆవిరి మీద ఇరవై నిమిషాలు ఉడికిస్తే టింగ్మో రెడీ. సుజా (బటర్ టీ) కావలసినవి: ►ఎండు టీ ఆకులు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►పాలు – ముప్పావు కప్పు ►బటర్ – రెండు టేబుల్ స్పూన్లు ►నీళ్లు – రెండున్నర కప్పులు ►ఉప్పు – అరటేబుల్ స్పూను. తయారీ.. ►గిన్నెలో నీళ్లు, టీపొడి వేసి మరిగించాలి ►టీపొడి బాగా మరిగి డికాషన్ సువాసన వస్తున్నప్పుడు వేరే పాత్రలోకి వడగట్టాలి ►ఇప్పుడు వడగట్టిన డికాషన్‌లో పాలు, బటర్, ఉప్పువేసి హ్యాండ్ బ్లెండర్తో ఐదునిమిషాలపాటు చిలకాలి ►చక్కగా చిలికిన తరువాత మరోసారి వేడి చేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి 👇 Nadru Yakhni: చపాతీ, అన్నంలోకి తామర పువ్వు కాడతో రుచికరమైన వంటకం! ఇలా Mango Vada: పచ్చిమామిడి తురుముతో మ్యాంగో వడ.. -
సాక్షి కార్టూన్: 01-06-2022
ఇంకా చాలా వస్తువుల ధరలు తగ్గాలి సార్! మీ ఆస్తులు కూడా అమ్మాలేమో సార్! -
24 గంటల్లో గోధుమ పిండి ధర తగ్గించకుంటే దుస్తులు అమ్మేస్తా!
Pakistani Prime Minister Shehbaz Sharif given an ultimatum: వచ్చే 24 గంటల్లో 10 కిలోల గోధుమ పిండి బస్తా ధరను తగ్గించకుంటే తన బట్టలను అమ్మేస్తానని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖైబర్ ఫక్తున్ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్‌కి తన నిర్ణయాన్ని తెలిపారు. థకారా స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని షరీఫ్ ప్రసంగిస్తూ...నా దుస్తులు విక్రయించి అయిన ప్రజలకు తక్కువ ధరలో గోధుమ పిండి అందిస్తానని చెప్పారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశానికి నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని కానుకగా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. దాదాపు ఐదు మిలయన్ల ఇళ్లు, 10 మిలయన్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోవడమే కాకుండా దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారంటూ ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. తాను దేశ శ్రేయస్సు కోసం ప్రాణాలర్పించడమే కాకుండా అభివృద్ధి పథంలో ఉంచుతానని షరీఫ్ బహిరంగంగా ప్రకటించారు. బలూచిస్తాన్ ఎన్నికల గురించి మాట్లాడుతూ..ప్రజలకు తనపై విశ్వాసం ఉందని తనకు అనుకూలంగా ఓట్లు వేయడానికి పోలింగ్‌బూత్‌లకు తరలి వచ్చారని షరీఫ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలకు గల నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ని ప్రజలు గద్ది దించుతారని గ్రహించే ఇంధన ధరలు తగ్గించారంటూ విమర్శించారు. అంతేకాదు షరీఫ్ తన సోదరుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. ఆ సభలో పీఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ కూడా ప్రసంగించడమే కాకుండా తన తండ్రి నవాజ్ షరీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. (చదవండి: షాకింగ్ వీడియో: మోనాలిసా పెయింటింగ్ ధ్వంసానికి యత్నం! మారు వేషంలో వచ్చి మరీ..) -
Recipe: ఘుమఘుమలాడే ఎగ్ చపాతీ తయారీ ఇలా!
రొటీన్‌గా కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ చపాతి సులువుగా ఇంట్లోనే చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎగ్ చపాతి తయారీకి కావలసినవి: ►గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు (ఓ అరగంట ముందు గోరువెచ్చటి నీళ్లు, ఉప్పు వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి) ►గుడ్లు – 4 లేదా 5 ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►ఉప్పు –తగినంత ►పసుపు – చిటికెడు ►కారం – 1 టీ స్పూన్ ►చిక్కటిపాలు – 1 టేబుల్ స్పూన్ ఎగ్ చపాతి తయారీ విధానం: ►ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, పాలు పోసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ►తర్వాత చపాతీలు చేసి పెట్టుకోవాలి. ►అనంతరం రెండు స్టవ్‌లు ఆన్ చేసుకుని, రెండింటిపైన రెండు పెనాలు పెట్టుకుని, ఒకవైపు చపాతీ కాలుస్తూ.. మరోవైపు ఆమ్లెట్ వేసుకోవాలి. ►ఇరువైపులా దోరగా కాలిన చపాతిని ఒకవైపు కాలని ఆమ్లెట్‌పై వేసుకుని రెండు అతుక్కున్నాక అటు, ఇటు తిప్పి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి! చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ ఇలా! -
Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్ దోసెలు!
చిన్నా, పెద్దా ఇష్టంగా తినే అల్పాహారం దోసెలు.. రొటీన్‌గా కాకుండా ఈసారి ఇలా గ్రీన్ దోసెలు చేసుకుని తినండి. వైరైటీకి వెరైటీ.. రుచికి రుచి. గ్రీన్ దోసెలు చేయడానికి కావలసినవి: ►కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గుజ్జు – పావు కప్పు ►గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు ►మినపపప్పు – ముప్పావు కప్పు (4 గంటల పాటు నానబెట్టుకోవాలి) ►మెంతులు – అర టీ స్పూన్ (4 గంటల పాటు నానబెట్టుకోవాలి) ►ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని ►నూనె – సరిపడా గ్రీన్ దోసెలు- తయారీ: ►ముందుగా మినపప్పును, మెంతుల్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ► ఒక గిన్నెలోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. ►అందులో గోధుమ పిండి, తగినంత ఉప్పు, తగినన్నీ నీళ్లు పోసుకుని.. ఉండలు కట్టకుండా దోసెల పిండిలా బాగా కలుపుకోవాలి. ►తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పెనం వేడి చేసుకుని.. కొద్దిగా నూనె వేసుకుని దోసెలు వేసుకోవాలి. ►అభిరుచిని బట్టి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వంటివి దోసె మీద వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ►వేడివేడిగా ఉన్నప్పుడే నచ్చిన చట్నీతో లేదా సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి. చదవండి👉🏾Sorakaya Juice: సొరకాయ జ్యూస్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే! చదవండి👉🏾Chicken Keema Pakoda: రుచికరమైన చికెన్ కీమా పకోడా ఇలా ఇంట్లోనే ఈజీగా! -
వెజిటేరియన్ హలీమ్.. ఎలా చేయాలో తెలుసా?
కావలసినవి: వేయించిన ఉల్లిపాయ తరుగు – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, పాలు – కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, గులాబీ రేకులు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ – అరకప్పు, ఓట్స్ – పావు కప్పు, బాదం – ఆరు, పచ్చిశనగపప్పు – టీస్పూను, ఎర్ర కందిపప్పు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పెసరపప్పు – టీస్పూను, నువ్వులు – టీస్పూను, జీలకర్ర – అర టీస్పూను, లవంగాలు – టీస్పూను, మిరియాలు – టీస్పూను, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, యాలకులు – ఎనిమిది, షాజీరా – టేబుల్ స్పూను, తోకమిరియాలు – టీస్పూను, పెరుగు – అరకప్పు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, పుదీనా తరుగు – టేబుల్ స్పూను, సన్నగా తరిగిన జీడిపప్పు – 20 గ్రా., పిస్తా పలుకులు – 20 గ్రా., బాదం పలుకులు – 20 గ్రా., మీల్మేకర్ – 100 గ్రా., నిమ్మరసం – టీస్పూను. తయారీ: ► ముందుగా మీల్‌మేకర్‌ను ఇరవై నిమిషాలపాటు నీటిలో నానబెట్టాలి. నానాక బరకగా రుబ్బుకోవాలి. ► మిక్సీజార్‌లో.. తోక మిరియాలు, షాహజీరా, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, పప్పులన్నీ, ఆరు బాదం పప్పులు, ఓట్స్, గోధుమ రవ్వ, నువ్వులు అన్నీ కలిపి పొడిచేయాలి. ► స్టవ్ మీద కుకర్ గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడిపప్పు, పిస్తా, బాదం పలుకులు, పచ్చిమిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి. ►ఇవివేగాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బరకగా గ్రైండ్ చేసిన మీల్ మేకర్ మిశ్రమాన్ని కలపాలి. ►ఇప్పుడు పెరుగు, పాలు, గులాబి రేకులు, కొత్తిమీర, పుదీనా తరుగు, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి కలిపి, పొడిచేసుకున్న మసాలా మిశ్రమం వేసి కలిపి, మూడు విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటమీద ఉడికించాలి. ►ఉడికిన మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని, నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు చూసి చూసి వేసుకుంటే వేడివేడి వెజ్ హలీమ్ రెడీ. -
పిండిలో నోట్ల కట్టలు: తాను పంచలేదంటున్న హీరో
వారం, పది రోజుల నుంచి బాలీవుడ్లో ఓ వార్త బీభత్సంగా చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం రయ్‌మంటూ వచ్చిన ఓ ట్రక్కు వీధిలోకి వచ్చి ఆగుతుంది. అందులోని కొంతమంది వ్యక్తులు పేదలకు పిండి ప్యాకెట్లు పంచుతారు. పిండి అవసరం లేదనుకునే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. నిజమైన పేదవాళ్లు వరుసలో నిలబడి దాన్ని అందుకుంటారు. అయితే ఆ ప్యాకెట్లు అందుకున్న వాళ్లకు అందులో రూ.15 వేలు కనిపిస్తాయి. ఇలా గుట్టుగా సాయం చేసింది అమీర్ ఖానే అని చాలామంది అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన అమీర్.. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. (పేదలకు పంచిన పిండిలో రూ.పదిహేను వేలు) "నేను గోధుమ పిండి సంచుల్లో డబ్బు పెట్టలేదు. ఇది అసత్య ప్రచారమై ఉండొచ్చు.. లేదంటే తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని రాబిన్ హుడ్(ధనవంతులను దోచి పేదవారికి సహాయం చేసే వీరుడి పాత్ర) పని అయి ఉండాలి" అని ట్వీట్ చేశాడు. తాను చేయని పనికి క్రెడిట్ తీసుకోనందుకు అభిమానులు తమ హీరోను ఆకాశానికెత్తుతున్నారు. స్వచ్ఛమైన మనసంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. మరోవైపు ఆ రాబిన్ హుడ్ మీరే అయి ఉండొచ్చేమో అని ఎటుతిరిగీ మళ్లీ అమీర్ ఖాన్‌కే గురి పెడుతున్నారు. మిగతా నెటిజన్లు మాత్రం ఆ రాబిన్ హుడ్ ఎవరై ఉంటారా? అని ఆలోచనలో పడిపోయారు. కాగా అమీర్, తన భార్య కిరణ్ రావుతో కలిసి ఆదివారం నాడు "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నాడు. ఇందులో పాటలు పాడి అభిమానులను అలరింపజేసిన అనంతరం కరోనా పోరాటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా అభిమానులను కోరాడు. (నాలుగేళ్లు సినిమాలకు దూరం: ఆమిర్) -
పిండి ప్యాకెట్లలో నోట్ల కట్టలు, స్టార్ హీరో పనేనా!
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఈ క్రమంలో రెక్కాడితే గానీ డొక్కాడని పేదల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. లాక్డౌన్ పొడిగింపుతో ఆకలి కేకలు మిన్నంటాయి. గుప్పెడు మెతుకులు దొరక్క మంచినీళ్లు తాగుతూ క్షణమొక యుగంలా బతుకు వెల్లదీస్తున్నారు. అయితే కష్ట సమయంలో ఆదుకునేవాడే అసలైన హీరో అంటూ ఎంతోమంది బాలీవుడ్ హీరోలు ముందుకొచ్చి సాయం చేశారు. తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ పేదలకు లాక్డౌన్ కష్టాలు దరిచేరకుండా వినూత్నం సాయం చేశాడంటూ ఓ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో పేదలకు సాయం చేసేందుకు ఓ ట్రక్కు వీధిలో వచ్చి ఆగుతుంది. అందులో ఉన్నవాళ్లు కిలో గోధుమ పిండి ప్యాకెట్లను పేదలకు అందించారు. అయితే కొందరు మాత్రం ఉత్తి పిండికేనా ఇదంతా.. అని వెనుదిరిగిపోయారు. కానీ కనీసం అది కూడా లేని నిరుపేదలు ముందుకొచ్చి ఆ ప్యాకెట్లను ఆదుర్దాగా అందుకున్నారు. ఎంతో సంతోషంతో వాటిని తీసుకుని ఇంటికి వెళ్లి చూడగా అందులో పదిహేను వేల రూపాయలు కనిపించాయట. ఇక ఈ ట్రక్కును పంపించింది అమీర్ ఖానే అంటున్నారు అతని అభిమానులు. సదరు హీరో మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. (బంగ్లాలో చిక్కుకున్న అమీర్ ఖాన్ తనయుడు) -
డబ్బాల్లో పెట్టండి
రిజర్వేషన్ చేయించుకున్నవాళ్లు మీ ఇంటికొస్తారు. పండగను మీరు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారు. మరి... మీ కోసం, వచ్చేవారి కోసం ఇప్పటి నుంచి వండి డబ్బాల్లోకి ఎత్తకపోతే ఎలా? సంక్రాంతి అంటే... పొయ్యి వెలిగించడం, తీపిని తగిలించడం. అరిసెలు, గోరు మీఠీలు, బెల్లం కొమ్ములు, ఫేణీలు ఇవన్నీ నిల్వ ఉండే పిండి వంటలు. ఎన్నాళ్లైనా పాడవకుండా తినడానికి వీలుగా ఉంటాయి. మరి రెడీ చేసుకోండి. సకినాలు కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నువ్వులు – అర కప్పు; వాము – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీటిని ఒంపేయాలి ►బియ్యాన్ని పొడి వస్త్రం మీద పావు గంట సేపు నీడలో ఆరబెట్టాలి (పూర్తిగా తడిపోకూడదు) ►ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి, జల్లెడ పట్టాలి ►ఒకటిన్నర కప్పుల పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఉప్పు, వాము, నువ్వులు జత చేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేస్తూ, జంతికల పిండిలా కలిపి, వస్త్రంతో మూసి ఉంచాలి ►కొద్ది కొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, సకినాలు మాదిరిగా చుట్టాలి (పిండి ఎండినట్టుగా అనిపిస్తే, కొద్దికొద్దిగా తడి చేసుకోవాలి) ►మొత్తం పిండిని సకినాలుగా ఒత్తి, సుమారు రెండు గంటల పాటు ఆరనివ్వాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ►ఒత్తి ఉంచుకున్న సకినాలను అట్లకాడ సహాయంతో జాగ్రత్తగా తీసి, కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అరిసెలు కావలసినవి: బియ్యం – 600 గ్రా.; బెల్లం – 300 గ్రా.; నీళ్లు – 50 మి.లీ.(సుమారుగా); ఏలకుల పొడి – అర టీ స్పూను; నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి ►ఉదయాన్నే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి, జల్లెడలో వేసి నీళ్లు మొత్తం పూర్తిగా కారిపోయేవరకు ఉంచాలి ►బియ్యాన్ని కొద్దికొద్దిగా చిన్న మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టి, జల్లెడ పట్టి, మెత్తటి పిండిని చేతితో గట్టిగా నొక్కి పక్కన ఉంచాలి (తడి ఆరిపోకూడదు) పాకం తయారీ: ►ఒక గిన్నెలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగే వరకు ఉంచాలి ►పాకం అడుగు అంటకుండా మధ్యమధ్యలో తిప్పుతూ ఉండాలి ►ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి, అందులో పాకం వేస్తే అది కరిగిపోకుండా, ఉండలా అయితే, పాకం సరిగ్గా తయారయినట్లు లెక్క ►మంట సిమ్‌లోకి ఉంచి, నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి స్టౌ కట్టేసి గిన్నె కిందకు దింపాలి ►బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ పిండి గట్టిగా అయ్యేవరకు కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మంటను మీడియంలో ఉంచాలి ►పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని, నూనె పూసిన ప్లాస్టిక్ పేపర్ మీద ఉంచి, చేతితో ఒత్తి, కాగిన నూనెలో వేసి పైకి తేలేవరకు కదపకుండా ఉంచాలి ►పైకి తేలాక ఒక నిమిషం పాటు ఆగి, రెండో వైపుకి తిప్పాలి ►బంగారు రంగులోకి మారేవరకు వేయించి, బయటకు తీసి, రెండు గరిటెల మధ్యన కాని, అరిసెల చట్రంతో కాని నూనె పోయేవరకు గట్టిగా ఒత్తాలి (నువ్వుల అరిసెలు కావాలంటే, పిండిని కలుపుతున్నప్పుడే నువ్వులు కూడా వేసి కలిపేయాలి) బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. గోరు మీఠీలు కావలసినవి: నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; మైదా పిండి – పావు కేజీ; బొంబాయి రవ్వ – 3 టేబుల్ స్పూన్లు; బటర్ – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; బెల్లం పొడి/పంచదార – పావు కేజీ. తయారీ: ►ఒక పాత్రలో మైదా పిండి, బటర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలపాలి ►నూనె జత చేసి బాగా కలిపి, పిండి మృదువుగా అయిన తరవాత, బొంబాయి రవ్వ జత చేసి పిండిని మరోమారు కలిపి, గిన్నె మీద పల్చటి వస్త్రం వేసి, సుమారు అర గంట సేపు నానబెట్టాలి ►నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకుని, చేతి గోటితో గోరు మీఠీలాగ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచిన గోరు మీఠీలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►వేరొక పాత్రలో బెల్లం పొడి/పంచదారకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చే వరకు కలపాలి ►ఏలకుల పొడి, కొద్దిగా నెయ్యి జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి ►తయారుచేసి ఉంచుకున్న గోరుమీఠీలను ఇందులో వేసి, పై నుంచి కిందకు కదపాలి ►చల్లారాక, గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. రిబ్బన్లు కావలసినవి: సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – రెండు టీ స్పూన్లు; పచ్చి మిర్చి – 6; ఉల్లి తరుగు – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►మిక్సీలో పచ్చి మిర్చి, ఉల్లి తరుగు, అల్లం తురుము వేసి మెత్తగా ముద్దలా చేయాలి ►ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి ►కరిగించిన నేతిని వేసి మరోమారు కలపాలి ►ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి, అందులో పచ్చి మిర్చి మిశ్రమం వేసి బాగా కలియబెట్టి, నీటిని వడకట్టి, సెనగ పిండి మిశ్రమంలో ఆ నీటిని పోస్తూ జంతికల పిండిలా కలుపుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ►జంతికల గొట్టంలో రిబ్బన్ల ప్లేటు ఉంచాలి ►సెనగ పిండి మిశ్రమం ఉంచి, కాగుతున్న నూనెలో రిబ్బన్లు పడేలా జంతికల గొట్టం తిప్పాలి ►బాగా వేగిన తరవాత పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. సర్వ పిండి కావలసినవి: బియ్యప్పిండి – అర కేజీ; ఉప్పు – తగినంత; కారం – ఒక టీ స్పూను; పల్లీలు – 4 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – మూడు టేబుల్ స్పూన్లు (మూడు గంటలసేపు నానబెట్టాలి); నూనె – తగినంత; సన్నగా తరిగిన కొత్తిమీర – అర కప్పు; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; సన్నగా తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు; నువ్వులు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ►ఒక పాత్రలో బియ్యప్పిండి, నానబెట్టిన సెనగ పప్పు, పల్లీలు, పచ్చి మిర్చి తరుగు, నువ్వులు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం వేసి కలపాలి ►తగినన్ని వేడి నీళ్లు జత చేస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ►ఒక బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి మొత్తం బాణలి అంతా పట్టేలా చేతితో సరిచేయాలి ►కలిపి ఉంచుకున్న పిండిని జామకాయ పరిమాణంలో తీసుకుని, బాణలిలో ఉంచి, మధ్యమధ్యలో చేతికి నూనె పూసుకుంటూ, పిండిని పల్చగా అయ్యేలా ఒత్తిన తరవాత నాలుగైదు చోట్ల రంధ్రాలు చేసి, అక్కడక్కడ నూనె పోసి, స్టౌ మీద ఆ బాణలి ఉంచి, పైన మూత పెట్టి, బాగా కాలేవరకు ఉంచాలి (మధ్యమధ్యలో మూకుడు కదుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోతుంది) ►మూకుడు నుంచి విడిపడిన తరవాత ప్లేటులోకి తీసుకోవాలి (తిరగవేయాల్సిన అవసరం లేదు). బెల్లం కొమ్ములు కావలసినవి: సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు; బెల్లం – అర కేజీ; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి వేసి తగినన్ని నీళ్లు జత చేసి జంతికల పిండి మాదిరిగా కలుపుకోవాలి ►కొద్దిగా నెయ్యి జత చేసి మరో మారు కలపాలి ►జంతికల గొట్టంలో లావుగా ఉండే జంతికల ప్లేటు ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని జంతికల గొట్టంలో ఉంచి, నూనెలో జంతికల మాదిరిగా చుట్టాలి ►బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి, ప్లేటులోకి తీసుకుని, పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి ►ఒక పెద్ద గిన్నెలో (మందంగా ఉండే గిన్నె) బెల్లం పొడి, తగినన్ని నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలియబెట్టాలి ►ఏలకుల పొడి, నెయ్యి జత చేసి బాగా కలిపి దింపేయాలి ’ జంతిక కొమ్ముల మీద ఈ పాకాన్ని పోసి బాగా కలపాలి ►బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి ►ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఫేణీలు కావలసినవి: మైదా పిండి – అర కేజీ; పంచదార – అర కేజీ; నెయ్యి – పావు కేజీ; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; డ్రైఫ్రూట్స్ తరుగు – పావు కప్పు తయారీ: ►ఒక పెద్ద పాత్రలో మైదా పిండి వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి ►నెయ్యి జత చేసి పిండిని ఎక్కువ సేపు మర్దన చేస్తూ మెత్తగా అయ్యేవరకు కలపాలి ►నీరు గట్టిగా పిండేసిన తడి వస్త్రాన్ని పిండి గిన్నె మీద మూతలా వేసి అర గంట సేపు పక్కన ఉంచాక, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ►ఒక్కో ఉండను తీసుకుని పూరీలా ఒత్తాక పైన కొద్దిగా నెయ్యి వేసి మరో పూరీ దాని మీద ఉంచాలి ►ఈ విధంగా నాలుగు పూరీలకు ఒక దాని మీద ఒకటి ఉంచి గట్టిగా ఒత్తాలి ►మందంగా ఒత్తాక, ఒక కొస నుంచి లోపలికి రోల్ చేసుకుంటూ రావాలి ►రోల్ చేసుకున్న తరవాత ముక్కలుగా కట్ చేయాలి ►ఒక్కో ముక్కను మళ్లీ పూరీలా ఒత్తుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న పూరీలను నూనెలో వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి ►ఒక గిన్నెలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలిపాక, ఏలకుల పొడి వేసి కలిపి దింపేయాలి ►వేయించిన పూరీలను పంచదార పాకంలో వేసి బాగా ముంచి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►పాకం గట్టిపడకుండానే, పూరీల మీద డ్రైఫ్రూట్స్ చల్లి, ప్లేటులో ఉంచాలి. -
నకిలీ మైదా, గోధుమ పిండి విక్రయం
మల్కాజిగిరి: బ్రాండెడ్ పేరుతో నకిలీ మైదా, గోధుమ పిండి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి సీఐ మన్మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మౌలాలి రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన వనపర్తి రమేష్ వెంకటేశ్వర ప్రొవిజన్ పేరిట కిరణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద భాష్యం రాజ్‌కుమార్ అనే వ్యక్తి సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వీరు పటాన్ చెరులోని శాలిమార్ రోలర్ ఫ్లోర్‌మిల్ చెందిన మైదా, గోధుమపిండిని విక్రయించేవారు. నెల రోజులుగా గౌలిగూడకు చెందిన తోట్ల బిజ్‌గోపాల్ వద్ద శాలిమార్ రోలర్ కంపెనీకి చెందిన బ్యాగులు తయారు చేయింన వీరు శాలిమార్ కంపెనీ పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఈ నెల 7న ఎస్ఓటీ పోలీసులు దాడిచేసి 13 మైదా బ్యాగులు, 37 ఖాలీ సంచులు, కుట్టు మెషిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. -
చంద్రన్న కానుకల్లో బూజుపట్టిన బెల్లం,పురుగు పట్టిన గోధుమ పిండి
-
జొన్నల వంటలు
జొన్న బూందీ లడ్డు కావలసినవి: గోధుమపిండి/సెనగ పిండి – ఒక కప్పు, జొన్న పిండి – ఒకటిన్నర కప్పులు ల్లం పొడి – 2 కప్పులు, ఏలకుల పొడి – ఒక టీ స్పూను, కిస్మిస్ – తగినన్ని జీడి పప్పులు – తగినన్ని, నెయ్యి /నువ్వుల నూనె – వేయించడానికి తగినంత తయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి/సెనగ పిండి, జొన్న పిండి వేసి బాగా కలపాలి. కొద్డిగా నీళ్లు జత చేసి, బూందీ పిండిలా కలపాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగనివ్వాలి. కలిపి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూసి, దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేరొక పెద్ద పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి. తయారుచేసి ఉంచుకున్న బూందీని బెల్లం పాకంలో వేసి కలియబెట్టాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు జత చేసి లడ్డులా ఉండకట్టాలి. కొద్దిగా చల్లారిన తరవాత గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? జొన్నలు (Great Millet) నియాసిన్ (Niacin)mg (B3) 1.8 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.13 థయామిన్(Thiamine) mg (B1) 0.37 కెరోటిన్ (Carotene)ug 47 ఐరన్ (Calcium)g 0.03 కాల్షియం (Phosphorous)g 0.28 ఫాస్పరస్(Protein)g 10.4 ప్రొటీన్ (Minerals) g 1.6 ఖనిజాలు (Carbo Hydrate) g 72.4 పిండిపదార్థం (Fiber) g 1.3 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 55.69 జొన్న చుడువా కావలసినవి: జొన్న అటుకులు – ఒక కప్పు, నూనె – 3 టీ స్పూన్లు, మినప్పప్పు – ఒక టీ స్పూనుపచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూనుపల్లీలు – ఒక టేబుల్ స్పూను, ఎండు మిర్చి – 3, పసుపు – పావు టీ స్పూనుఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను తయారీ: స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జొన్న అటుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి కాగాక పచ్చి పల్లీలు వేసి వేయించాలి. మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. పసుపు వేసి మరోమారు కలియబెట్టి, దింపేసి, జొన్న అటుకుల మీద వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. జొన్న బాక్రావాడి మసాలా కావలసినవి: జొన్న పిండి – 50 గ్రా., సెనగ పిండి – 50 గ్రా., గోధుమ పిండి – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – ఒక టీ స్పూను, వేయించిన నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్లుసోంపు పొడి – ఒక టీ స్పూను, జీలకర్ర పొడి – ఒక టీ స్పూనుబాదం పప్పుల పొడి – ఒక టేబుల్ స్పూను, ధనియాల పొడి – ఒక టీస్పూనుజీడిపప్పుల పొడి – ఒక టేబుల్ స్పూను, ఉప్పు – తగినంతమిరప కారం – ఒక టీ స్పూను, గసగసాల పొడి – ఒక టీ స్పూనుచాట్ మసాలా – ఒక టీ స్పూను, నూనె – ఒక టేబుల్ స్పూను, నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా జొన్న పిండి, గోధుమ పిండి, సెనగ పిండి ఒకటిగా కలిపి జల్లెడపట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రెండు టీ స్పూన్ల కాచిన నూనె వేసి పిండిని బాగా కలపాలి. తగినన్ని నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలిపి ఉండలు చేసుకోవాలి. ఒక పాత్రలో అన్ని పొడులను వేసి బాగా కలియబెట్టాలి. ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా ఒత్తాలి. తయారుచేసి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ మీద వేసి, చపాతీని రోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొడి అన్ని పొరలకు అంటుతుంది. రోల్ చేసిన వాటిని చాకు సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న వాటిని నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. జొన్నలు – జీడిపప్పు గోరుమీఠీలు కావలసినవి: జొన్న పిండి – 100 గ్రా., పెసర పిండి – 50 గ్రా. ఇడ్లీ రవ్వ – 50 గ్రా., మిరియాల పొడి – 10 గ్రా. ఉప్పు – తగినంత, జీడి పప్పులు – 20 గ్రా., నూనె – 250 గ్రా., నీళ్లు – తగినన్ని తయారీ: ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో జొన్న పిండి, పెసర పిండి, ఇడ్లీ రవ్వ వేసి అన్నీ కలిసేలా కలపాలి. మరుగుతున్న నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి. జీడిపప్పు పలుకులు జత చేసి మరోమారు కలపాలి. చేతితో చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ, బొటన వేలితో ఒత్తుతూ గోరు మీఠీలు తయారుచేయాలి. అలా అన్నీ తయారుచేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న గోరుమీఠీలను వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. జొన్న షర్బత్ కావలసినవి: జొన్నలు – పావు కప్పుచల్లటి నీళ్లు – 3 కప్పులుమిరియాలు – 10నిమ్మ కాయ ముక్కలు – 3బెల్లం పొడి – అర కప్పునిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లుతాజా బత్తాయి రసం – ఒక కప్పు ఐస్ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా జొన్నలను మంచి నీళ్లలో శుభ్రంగా కడిగి, నీళ్లను ఒంపేయాలి. ఒక పాత్రలో తగినన్ని మంచి నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. కడిగిన జొన్నలు జత చేసి బాగా కలియబెట్టి, మంట తగ్గించి పది నిమిషాలపాటు ఉడికించి దింపేయాలి. మిరియాలు, నిమ్మ కాయ ముక్కలు, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. బాగా చల్లారాక వడకట్టాలి. నిమ్మ రసం, బత్తాయి రసం, ఐస్ ముక్కలు జత చేసి బాగా కలిపి చల్లగా అందించాలి. జొన్నల కార బూందీ కావలసినవి: జొన్న పిండి – ఒక కప్పుగోధుమ పిండి లేదా సెనగ పిండి – ఒక కప్పుకి కొద్దిగా తక్కువనూనె – తగినంత, జీడిపప్పులు – 10 గ్రా.మిరప కారం – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంతకరివేపాకు – 2 రెమ్మలు, నీళ్లు – తగినన్ని తయారీ: ఒక గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి/సెనగ పిండి వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు, కారం, నీళ్లు జత చేసి జారు పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూయాలి. దోరగా వేగిన బూందీని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, నూనెలో వేయించిన జీడిపప్పు, కరివేపాకు జత చేసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారాక తినాలి. ఇదేవిధంగా సజ్జలు, రాగులతో కూడా చేసుకోవచ్చు. -
వరిగల వంటలు
వరిగ సమోసా కావలసినవి: వరిగ పిండి – ఒక కప్పు గోధుమ పిండి – ఒక కప్పు ఉప్పు – తగినంత బంగాళ దుంపలు – 2 నూనె – తగినంత ఆవాలు – ఒక టీ స్పూను ఉల్లి తరుగు – పావు కప్పు ఉడికించిన బఠాణీ – పావు కప్పు తరిగిన పచ్చి మిర్చి – 3 కరివేపాకు – ఒక రెమ్మ తయారీ: ఒక పాత్రలో వరిగ పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా ముద్ద చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా ఒత్తి, మధ్యలోకి కట్ చేసుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి, చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాచాలి. ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. ఉడికించిన బఠాణీ, ఉడికించిన బంగాళ దుంప, ఉప్పు జత చేసి అన్ని కలిసేలా బాగా కలియ»ñ ట్టి దింపేయాలి. ఒత్తుకున్న చపాతీలను సమోసా ఆకారంలో చుట్టి, అందులో బంగాళదుంప మిశ్రమం కొద్దిగా ఉంచి మూసేయాలి. ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. టొమాటో సాస్‌తో వేడి వేడి సమోసాలు అందించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? వరిగలు(Proso Millet) నియాసిన్ (Niacin)mg (B3) 2.3 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.18 థయామిన్ (Carotene)ug 0 కెరోటిన్ (Iron)mg 5.9 ఐరన్ (Calcium)g 0.01 కాల్షియం (Calcium)g 0.01 ఫాస్పరస్ (Phosphorous)g 0.33 ప్రొటీన్ (Protein)g 12.5 ఖనిజాలు (Minerals) g 1.9 పిండిపదార్థం (Carbo Hydrate) g 68.9 పీచు పదార్థం(Fiber) g 2.2 పిండిపదార్థము పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 31.31 వరిగ ఇడ్లీ కావలసినవి: వరిగ ఇడ్లీ రవ్వ – ఒక కప్పు మినప్పప్పు – ఒక కప్పు ఉప్పు – తగినంత తయారీ: మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటలపాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వరిగ ఇడ్లీ రవ్వ, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి, రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ పిండిని ఇడ్లీ రేకులలో ఇడ్లీలుగా వేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటుంది. వరిగ కాజా కావలసినవి: వరిగ పిండి – అర కప్పు, గోధుమ పిండి – అర కప్పు నూనె – డీప్ ఫ్రైకి తగినంత, పాకం కోసం బెల్లం పొడి – అర కప్పు ఏలకుల పొడి – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో వరిగ పిండి, గోధుమ పిండిలో కొంత భాగం వేసి కలపాలి. వేడి నూనె జత చేసి మెత్తటి ముద్దలా తయారుచేసుకోవాలి. రొట్టెలాగ అంగుళం మందంలో పొడవుగా ఒత్తి, రోల్ చేయాలి. ఆ రోల్‌ని ముక్కలుగా కట్ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, కట్ చేసి ఉంచుకున్న కాజాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. బెల్లం పొడిని ఒక పెద్ద గిన్నెలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచాలి. తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి. ఏలకుల పొడి వేసి దింపేయాలి. వేయించి ఉంచుకున్న కాజాలను పాకంలో వేసి సుమారు అర గంట సేపు మూత పెట్టి ఉంచాలి. బాగా పాకం పీల్చుకున్న కాజాలను ప్లేట్లో ఉంచి అందించాలి. వరిగ బర్ఫీ కావలసినవి: వరిగ పిండి – ఒక కప్పు, బెల్లం పొడి – అర కప్పు నెయ్యి – ఒక టేబుల్ స్పూను, నీళ్లు – పావు కప్పు ఏలకుల పొడి – అర కప్పు, బాదం పప్పులు – 10 తయారీ: ఒక ప్లేటుకి నెయ్యి పూసి పక్కన ఉంచాలి. మందపాటి గిన్నెలో బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి. వరిగ పిండి వేసి పచ్చి వాసన పోయి, సువాసన వచ్చేవరకు వేయించాలి. కరిగించిన బెల్లం పాకం, ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి. బాగా గట్టిపడుతుండగా, నెయ్యి జత చేస్తూ ఆపకుండా కలిపి, బాగా ఉడకగానే దింపేయాలి. నెయ్యి పూసుకున్న ప్లేట్లో వేసి సమానంగా పరిచి, పైన బాదం పప్పులు వేయాలి. కొద్దిగా చల్లారుతుండగా, చాకుతో ముక్కలుగా కట్ చేయాలి. చల్లారాక ప్లేట్లో ఉంచి అందించాలి. -
చర్మసౌందర్యం
బ్యూటిప్స్ సౌందర్యాన్ని పెంచడంలో పెదవుల నుంచి పాదాల వరకు అన్నీ తమ పాత్ర పోషిస్తాయి. దేనిని నిర్లక్ష్యం చేసినా ఆ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంటుంది. అరగంట సమయం వీటి కోసం కేటాయిస్తే ఆరోగ్యవంతమైన ఆకర్షణీయమైన చర్మం సొంతమవుతుంది. పెదవులు మృదువుగా, కాంతిమంతంగా ఉండాలంటే పచ్చికొబ్బరి తురిమి పాలు తీసి పెదవులకు పట్టించాలి. ఇలా రెండు- మూడు వారాలు చేస్తే ఫలితం ఉంటుంది. పొడి చర్మానికి పది టీ స్పూన్ల గోధుమ పిండిలో ఎనిమిదవ వంతు పసుపు, ఒక టీ స్పూను బాదం నూనె, పాలు వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి మాస్కులా వేసుకోవాలి. ఆరిన తర్వాత మెల్లగా చేత్తో రుద్దుతూ తొలగించి గోరువెచ్చటి నీటితో ముఖం కడగాలి. ఈ ప్యాక్‌ను మూడు నాలుగురోజులకొకసారి వేయవచ్చు. ఈ ప్యాక్ వేసిన తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి సబ్బు వాడకూడదు. కావాలనుకుంటే సున్నిపిండి వాడవచ్చు. ఏ ప్యాక్‌లోనయినా, ఏ చర్మతత్త్వానికైనా తేనె కలుపుకుంటే చర్మలావణ్యం పెరుగుతుంది. క్రమం తప్పకుండా తేనె వాడితే స్కిన్ఎలర్జీలు రావు. పొడి చర్మానికి మూడు టేబుల్ స్పూన్ల అవొకాడో ఆయిల్, మూడు టేబుల్ స్పూన్ల కెమిలియా ఆయిల్, మూడు టేబుల్ స్పూన్ల ‘ఇ’ విటమిన్ ఆయిల్, రెండు మూడు చుక్కల రోజ్‌హిప్ సీడ్ ఆయిల్, రెండు చుక్కల క్యారట్ సీడ్ ఆయిల్, ఒక చుక్క లావెండర్ ఆయిల్, ఒక చుక్క ఫ్రాకింసెన్స్ ఎసెన్షియల్ ఆయిల్‌లను బాగా కలిపి గాలి చొరని సీసాలో నింపి వెలుతురు లేని చోట నిలవ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి పట్టిస్తే ముడతలు రావు. ఉన్నప్పటికీ త్వరగా తగ్గుతాయి. పైన చెప్పిన నూనెలన్నీ మార్కెట్లో దొరుకుతాయి. -
గోధుమ పిండి.. పెసరపిండి...
బ్యూటిప్స్ రెండు టీ స్పూన్ల గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం లేని ముఖ చర్మం కళకళలాడుతుంది.టీ స్పూన్ పెసరపిండి, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా అవుతుంది. ఉప్పు లేని బటర్ టేబుల్ స్పూన్, స్ట్రాబెర్రీ ఒకటి, చిన్నముక్క కీరా, టీ స్పూన్ నిమ్మరసం, గుడ్డులోని పచ్చసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. -
వ్యాపార సంస్థలకు ‘కానుక’!
గోధుమ పిండి, బెల్లం, కందిపప్పు టెండర్లలో గోల్మాల్ బహిరంగ మార్కెట్ కన్నా ఎక్కువగా ధర నిర్ణయం ఒకే సంస్థ ఒక్కో జిల్లాకు ఒక్కో ధర చొప్పున సరఫరా సంక్రాంతి సమీపించినా సగం మందికే సరుకులు హైద రాబాద్: ప్రభుత్వ పెద్దల ఆశీస్సులుంటే చాలు పథకాల టెండర్లు దక్కించుకొని అక్రమంగా కోట్లు గడించవచ్చని ‘చంద్రన్న కానుక’ పథకం స్పష్టం చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న కానుక పేరిట తెల్ల రేషన్ కార్డుదారులకు అర కిలో కందిపప్పు, అర లీటర్ పామాయిల్, కిలో శనగలు, అర కిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. సరుకుల పంపిణీని జిల్లాల వారీగా పలు సంస్థలు, కంపెనీలకు అప్పగించిన ప్రభుత్వం ఒకే సంస్థ ఒక్కో జిల్లాలో ఒక్కో ధరకు సరుకులు సరఫరా చేసేందుకు వీలుగా అనుమతులిచ్చింది. తద్వారా అవినీతికి గేట్లు ఎత్తింది. పైగా ఇంత పెద్దమొత్తంలో సరుకులు పంపిణీ చేస్తున్నప్పుడు తక్కువ ధర పలకాల్సి ఉండగా బహిరంగ మార్కెట్‌తో పోల్చుకుంటే ఎక్కువ ధర కోట్ చేసిన సంస్థలు టెండర్లు దక్కించుకోవడం గమనార్హం. మరోవైపు ఒకే సంస్థ వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు రేట్లకు సరుకులు సరఫరా చేయడం విశేషం. వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు గోధుమ పిండిని సరఫరా చేసేందుకు ఓంకార్ జగన్నాథ ట్రేడర్స్ టెండర్ దక్కించుకుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో క్వింటాల్‌కు రూ.2,664 ప్రకారం సరఫరా చేస్తున్న ఈ కంపెనీ, కృష్ణా జిల్లాలో మాత్రం రూ.2,745 ధర నిర్ణయించడం గమనార్హం. ఇక ఓ మంత్రి బంధువుకు సంబంధం ఉన్న లెసైన్సు లేని కేంద్రీయ భండార్ సంస్థ.. విజయనగరం జిల్లా వరకు రూ.2,816, తూర్పు గోదావరి జిల్లాకు రూ.2,866 ధరకు గోధుమ పిండిని సరఫరా చేస్తోంది. అదేవిధంగా కోరమాండల్ రోలర్ ఫ్లోర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్.. విశాఖపట్నం జిల్లా వరకు రూ.2,800 ధరకు, ప్రకాశం జిల్లాలో రూ.2,735కు సరఫరా చేస్తుండగా.. సూదులగుంట ఆగ్రో మిల్స్‌కు నెల్లూరు జిల్లా వరకు రూ.2,800, అనంతపురం జిల్లాకు రూ.2,799, కడప జిల్లాకు రూ.2,772 ధర నిర్ణయించారు. ఏయన్జీ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పశ్చిమగోదావరి జిల్లాలో రూ.2,850కు, శ్రీ వెంకట రాకేష్ ట్రేడింగ్ కంపెనీ గుంటూరు జిల్లాలో రూ.2,675కు, అసతి రాజ్‌కుమార్ రోలర్ ఫ్లోర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరు జిల్లాలో రూ. 2,800కు, గోదావరి రోలర్ ఫ్లోర్‌మిల్స్ కర్నూలు జిల్లాలో రూ.2,735కు క్వింటాల్ గోధుమ పిండి సరఫరా చే సేందుకు టెండర్లు దక్కించుకున్నాయి. ఇక బెల్లం సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెల కొంది. వాసవి మోడరన్ దాల్ మిల్.. విజయనగరం జిల్లాలో క్వింటాల్ బెల్లం రూ. 3,863కు, గుంటూరు జిల్లాలో రూ. 3,996కు, కడప జిల్లాలో రూ.3,998కు సరఫరా చేసేందుకు వీలుగా టెండర్ దక్కించుకోవడం విశేషం. కేంద్రీయ భండార్‌కు కృష్ణా జిల్లాలో రూ.3,998, నెల్లూరు జిల్లాలో రూ.3,985, కర్నూలు జిల్లాలో రూ.3,986 ప్రకారం సరుకులు సరఫరా చేస్తోంది. శబరి సూర్యనందన ట్రేడర్స్ తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలకు రూ.3,900 చొప్పున సరఫరా చేస్తుండగా, రోహిత్ ట్రేడింగ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లాకు రూ.3,700, సి.వి.రామయ్య అండ్ కంపెనీ ప్రకాశం జిల్లాలో రూ.3,900, అదినాథ్ ట్రేడర్స్ రూ.3,996, బుడ్డా సత్యనారాయణ అండ్ సన్స్ విశాఖపట్నం జిల్లాలో రూ.3,900, షర్మిస్టా ట్రేడర్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.3,500 చొప్పున బెల్లం సరఫరా చేసేం దుకు టెండర్ కేటాయించారు. కందిపప్పు సరఫరా బాధ్యతను శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి శ్రీ బాలాజీ గ్రౌండ్నట్ ఆయిల్ మిల్లుకు అప్పగించారు. విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సరఫరా బాధ్యతను కేంద్రీయ భండార్ దక్కించుకోవడం గమనార్హం. కేంద్రీ య భండార్ సంస్థ పై మూడు రకాల సరుకుల సరఫరా టెండర్లను దక్కించుకోవడం గమనార్హం. మరోవైపు శనగల ప్యాకింగ్ బాధ్యత ప్రభుత్వ పెద్దల బంధుగుణానికే అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఇలావుండగా.. ఈనెల 12వ తేదీ లోపు మొత్తం సరుకులు లబ్దిదారులకు చేరాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. ఏ జిల్లాలో కూడా ఇప్పటివరకు 30 శాతం మించి సరఫరా కాలేదని తెలుస్తోంది. 1.3 కోట్ల కుటుంబాలకు చంద్రన్న కానుక: మంత్రి పల్లె మదనపల్లె: రాష్ట్రంలోని 1.30 కోట్ల కుటుంబాలకు రూ.314 కోట్లు వెచ్చించి ‘చంద్రన్న కానుక’ ఇచ్చినట్లు ఐటీ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రతి కుటుంబమూ ఖర్చు లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా సరుకులు ఇచ్చినట్లు చెప్పారు. సంప్రదాయబద్ధమైన కళలు, ఆచారాలు ప్రోత్సహించేందుకు రూ.14.2 కోట్లు వెచ్చించి, రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని వెల్లడించారు. -
చంద్రన్న సంక్రాంతి కానుక అరకొరే!
అందిన సరుకులు సగమే చేతులెత్తేసిన గోధుమపిండి కాంట్రాక్టర్ ఇంకా అందని క్యారీ బ్యాగులు అధికారుల్లో తీవ్ర ఆందోళన కడప సెవెన్‌రోడ్స్: చంద్రన్న సంక్రాంతి కానుకకు గ్రహణం పట్టింది. సంక్రాంతి పండుగకు పేదలకు అందిస్తామని చెప్పిన ఆరు రకాల సరుకుల్లో ఇప్పటివరకు జిల్లాకు అందింది సగం మాత్రమే. ఇందులో గోధుమపిండి అందే ప్రశ్నే లేదు. చంద్రన్న కానుక అంటూ ఫోటోలు ముద్రించి అటు ప్రచారానికి వాడుకోవాలని తలపెట్టిన క్యారీ బ్యాగులు ఇంతవరకు జిల్లాకు చేరలేదు. ఇప్పటికిప్పుడు అన్నీ సేకరించేందుకు అధికారులు సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి సూచించిన సమయానికి ఆరు రకాల సరుకులను డీలర్లకు అందజేయడం గురించి అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆర్బాటంగా ప్రకటించిన ఈ కార్యక్రమం కూడా మరో రుణమాఫీ అవుతుందేమోనని అటు డీలర్లు, అధికారుల్లో భయం పట్టుకుంది. పేదల ఇంట ఈ సంవత్సరం నిజమైన సంక్రాంతి జరుగుతుందని ఆర్బాటంగా చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటకు గ్రహణం పట్టినట్లయింది. ఈ పండుగకు ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఆరు రకాల వస్తువులతో ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాక్‌లో ఒక్కో కార్డుదారుడికి అరకిలో కందిబేడలు, కిలో శనగలు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, అరకిలో పామోలిన్, వంద గ్రాముల నెయ్యి ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో తెల్లకార్డులు 6,42,726, ఏఏవై కార్డులు 59,573, అన్నపూర్ణ కార్డులు 815 వెరసి 7,03,114 ఉన్నాయి. ఈ కార్డులన్నింటికీ కందిబేడలు 351.557 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు 225.854 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరాయి. శనగలు 703.114 టన్నులకుగాను 211.360 వచ్చాయి. ఇక బెల్లం 351.557 టన్నులకుగాను 70 టన్నులు అందాయి. పామోలిన్ 351.557 మెట్రిక్ టన్నులు అందాల్సి ఉండగా, 152 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. నెయ్యి 70.3114 మెట్రిక్ టన్నులకుగాను 30 టన్నులు మాత్రమే చేరింది. ఇక గోధుమపిండి 703.114 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, ఇంతవరకు ఒక్క టన్ను కూడా జిల్లాకు చేరలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన చక్కెర కర్మాగార యజమాని తాను ఐదు జిల్లాలకు గోధుమ పిండిని సరఫరా చేస్తానంటూ కాంట్రాక్టు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు సరఫరా చేయలేనంటూ ఆయన చేతులెత్తేశారనే వార్త గురువారం జిల్లా అధికారులకు చేరింది. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ జిల్లాలోనే గోధుమపిండి ప్యాకెట్లను సేకరించి సరఫరా చేస్తే ఎంత ఖర్చు వస్తుందో అంచనాలు వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో జిల్లాకు అవసరమైన గోధుమపిండి ఇప్పటికప్పుడు లభించే ప్రసక్తే లేదని తెలుస్తోంది. దీంతో గోధుమపిండి సరఫరాపై అధికారులు ఆశలు వదలుకున్నారు. కడప నగరం సమీపంలోని ఓ ప్రైవేటు గోడౌన్లో వచ్చిన సరుకులను వచ్చినట్లుగా ప్యాకింగ్ చేస్తున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో సరుకులను నేరుగా డీలర్లకే చేరవేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. డీలర్లకు క్యారీ బ్యాగులు సరఫరా చేసి ఆరు వస్తువులు అందులో ఉంచి కార్డుదారులకు అందించే బాధ్యతను అప్పగించాలని ఆలోచిస్తున్నారు. కానీ, ఇంతవరకు క్యారీ బ్యాగులు జిల్లాకు రాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రకటనలు మాత్రం ఆర్బాటంగా చేసినప్పటికీ అమలులో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు వారాలుగా ప్రకటనలతో ఊరించి తీరా సమయానికి అరకొర సరుకులతో సరిపెట్టేందుకు ప్రయత్నించడం పట్ల ప్రజల్లో కూడా తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. -
గోధూమ్‌ధామ్
గోధుమపిండి... ఏముందిలే... చపాతీ, పూరీలేగా చేసేది అని చప్పరించేయకండి. అదే పిండికి కొన్ని ఆధరువులు తగిలిస్తే... చపాతీ, పూరీలు సైతం చవులూరించే కొత్త రుచులకు కేంద్రమవుతాయి. గోధుమపిండితోనే స్వీటు, దోసెల లాంటి వెరైటీలూ ఉన్నాయండోయ్! అందుకే, గోధుమలతో ధూమ్‌ధామ్... ఈ ఆదివారం మీ ఫ్యామిలీలో... బంగాళదుంప - కొత్తిమీర చపాతీ కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి. బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి. గోధుమ హల్వా కావలసినవి: గోధుమ పిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; మిఠాయి రంగు - చిటికెడు (కొద్దిపాటి నీళ్లలో వేసి కలిపి ఉంచాలి); ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి - తగినంత తయారీ:ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, గోధుమ పిండి వేసి కలపాలి వేరొక పాత్రలో పావు కప్పు నీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. స్టౌ మీద ఈ పాత్ర ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి నీళ్లలో కలిపి ఉంచుకున్న గోధుమపిండి, మిఠాయి రంగు, ఏలకుల పొడి, నెయ్యి వేసి అడుగంటకుండా కలపాలి మిశ్రమం బాగా ఉడికిందనిపించాక, స్టౌ కట్టేయాలి పెద్ద పళ్లానికి నెయ్యి రాసి, ఉడికించుకున్న హల్వా పోసి, సమానంగా పరిచి కట్ చేసుకోవాలి. టొమాటో చీజ్ పూరీ కావలసినవి గోధుమపిండి - కప్పు మైదా పిండి - కప్పు టొమాటో రసం - కప్పుకారం - టీ స్పూను చీజ్ తురుము - కప్పు ఉప్పు - తగినంత నూనె - తగినంత తయారీ ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి.బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి. కశ్మీరీ చపాతీ కావలసినవి: గోధుమపిండి - కప్పు, సోంపు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, వాము - పావు టీ స్పూను; మిరియాలు - 10, ఇంగువ - పావు టీ స్పూను; పాలు - తగినన్ని, ఉప్పు - తగినంత; నెయ్యి - కొద్దిగా తయారీ: ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి. -
ఆరోగ్యం మనకిక కొట్టిన పిండి
పిండి కొద్దీ రొట్టే అనే సామెతలో ఓ పరిమితి ఉంది గానీ... పిండికొద్దీ ఆరోగ్యం అంటూ పరిమితి ఏదీ లేదు. పిండితో రకరకాల వంటలు చేసినా ప్రధానంగా గుర్తొచ్చేది రొట్టె. అందునా గోధుమతో చేసిందే. కానీ... ఎన్నో రకాల పోషకాలతో అనేక విధాల ఆరోగ్యాన్ని సమకూర్చే రకరకాల పిండ్లు ఇప్పుడు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ రకరకాల పిండ్లూ, వాటి వల్ల మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవడం కోసమే ఈ విస్తృత కథనం. గోధుమ... గోధుమలలో పిండిపదార్థాలతో పాటు ప్రోటీన్లు, పీచుపదార్థాలు, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇక ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. (ఇక్కడ ఒక్క తేడా ఉంది. కొన్నిసార్లు గోధుమ మీద పైపొరను తొలగించి వాడుతుంటారు. దాన్నే వైట్ వీట్గా పేర్కొంటారు. పొట్టు తొలగించని గోధుమను హోల్‌వీట్ అంటారు. హోల్వీట్లోనే పీచు పదార్థాలు ఎక్కువ). ఆరోగ్యపరమైన ప్రయోజనాలివి: పొట్టు తీయని గోధుమల్లో పీచు (డయటరీ ఫైబర్) ఎక్కువ కాబట్టి జీర్ణప్రక్రియ సాఫీగా జరుగుతుంది. పొట్టు తీయని గోధుమలతో రొట్టెలు తినేవారిలో విరేచనం సాఫీగా జరిగి మలబద్ధకం నివారితమవుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండెజబ్బులు నివారితమవుతాయి. స్థూలకాయం కూడా తగ్గుతుంది. ఈ విషయం కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనాల్లో నిరూపితమైంది. డయాబెటిస్ వర్సెస్ గోధుమ: చాలామంది డయాబెటిస్ ఉన్నవారు వరికి బదులు గోధుమ ఉపయోగిస్తుంటారు. ఈ రోజుల్లో డయాబెటిస్ ఉన్నవాళ్లలో చాలామంది రాత్రిపూట అన్నం మానేసి కేవలం గోధుమ రొట్టెలు తింటుండటం మనకు తెలిసిన విషయమే. ఒక పిండి పదార్ధాన్ని (కార్బోహైడ్రేట్స్‌ను) తీసుకున్నప్పుడు అందులోంచి వెలువడే చక్కెర, శరీరానికి సమకూరే శక్తినిష్పత్తులను గ్లైసీమిక్ ఇండెక్స్ అనే కొలతలో చెబుతారు. నిజానికి వరి అన్నం, గోధుమ రొట్టె... ఈ రెండింటి గ్లైసీమిక్ ఇండెక్స్ ఒక్కటే. అంటే ఏది తిన్నా పర్లేదు. కానీ అన్నం తినే సమయంలో కూర చాలా రుచిగా ఉంటే మనకు తెలియకుండానే నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం. కానీ రొట్టెలు తింటున్నామనుకోండి. ఎన్ని తింటున్నామో తెలుస్తుంది. అందుకే పరిమితి మించదు. దాంతో రక్తంలో గ్లూకోజ్ పెరగదు. అంతేగానీ... రాత్రివేళ పరిమితిగా అన్నం తిన్నా, లేక రొట్టె తిన్నా ఒక్కటే. అంతమాత్రాన గోధుమ తినడం వల్ల డయాబెటిస్ వారికి ఏలాంటి అదనపు ప్రయోజనమూ చేకూరదని చెప్పడం కూడా పూర్తిగా సరికాదు. ఎందుకంటే... అరకప్పు తెల్లగోధుమలో 1.3 గ్రాముల పీచు ఉంటుంది. అదే అరకప్పు పొట్టుతీయని గోధుమలో 6.4 గ్రాముల పీచు ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పొట్టుతీయని గోధుమ తింటే... రక్తంలోకి గ్లూకోజ్ ఇంకిపోవడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే దీంతో రెండు ప్రయోజనాలు. మొదటిది రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల కావడం, రెండోది జీర్ణక్రియ సక్రమంగా జరగడంతో పాటు మలబద్ధకం నివారితం కావడం. గోధుమలో వివిధ అంశాల తీరుతెన్నులివి...: *ఒక కప్పు గోధుమల్లో * క్యాలరీలు... 407 * కొవ్వులు 2.24 గ్రా. * కార్బోహైడ్రేట్లు 87.08 గ్రా. ప్రోటీన్లు 16.44 గ్రా. శనగపిండి (బేసన్ ఆటా/చిక్ పీ ఫ్లోర్)... శనగపిండి లేకుండా మనం ప్రీతిగా తినే ఎన్నో వంటలు ఉండవు. ఉదాహరణకు మిరపకాయబజ్జీలు, పకోడీలు... ఇలా ఎన్నో. శనగలను వేయించకుండా పిండి చేస్తే దాన్ని బేసన్ ఆటా అంటారు. ఇది గ్లూటెన్ ఫ్రీ ఆటా. శనగ పిండిలో ఏమేమి ఉంటాయి...?: ఒక కప్పు శనగపిండిలో... ఠి క్యాలరీలు 356 ఠి ప్రోటీన్లు 22 గ్రా. ఠి కొవ్వులు 6 గ్రా. ఠి కార్బోహైడ్రేట్లు 53 గ్రా. గోధుమలతో పోలిస్తే ఇందులోని క్యాలరీలు తక్కువే. అయితే గోధుమలతో పోల్చినప్పుడు ప్రోటీన్లు మాత్రం ఎక్కువే. ఈ ప్రోటీన్లు గోధుమపిండితో పోలిస్తే దాదాపు 33 శాతం కంటే ఎక్కువే. గోధుమపిండితో పోలిస్తే శనగపిండిలో ఉన్న ఫోలేట్ పోషకం విలువ దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియమ్ పాళ్లూ ఎక్కువే. వంద గ్రా. శనగపిండిలో పది గ్రా. ఫైబర్ ఉంటుంది. శనగపిండితో ఆరోగ్యప్రయోజనాలు...: దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు... శనగపిండిలో తక్కువ గ్లైసీమిక్ విలువ ఉండటం వల్ల డయాబెటిస్ రోగులకు ఇదెంతో మంచిది. డయాబెటిస్ ఉన్నవారు గోధుమల కంటే దీనితో చేసి పరోఠాలూ, రోటీలు తీసుకోవడం మేలు. ఠి శనగల్లో నీటిలో కరిగే పీచు ఉండటం వల్ల గుండెకు ఎంతో మేలు. శనగపిండి వాడేవారి గుండె ఆరోగ్యం దీర్ఘకాలం పాటు బాగుంటుంది. గుండెజబ్బుల రాకను ఆలస్యం చేస్తుంది ఠి శనగల్లో గ్లైసిమిక్ విలువ తక్కువ. కాబట్టి బరువు పెరగదు. స్థూలకాయం రాదు ఠి ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి చాలా రకాల అలర్జీలను కలిగించదు. పైగా అలర్జీలు ఉన్నవారు ఈ పిండితో చేసిన పదార్థాలు తీసుకుంటే అవి అదుపులో ఉంటాయి . ఇది రక్తహీనతను నివారిస్తుంది. డెర్మటైటిస్ హెర్పిటోఫార్మిస్, కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులు, స్క్లిరోసిస్, ఆటిజమ్, ఏడీహెచ్‌డీ వంటివాటిని నివారిస్తుంది ఠి రక్తపోటును నివారిస్తుంది ఠి శనగపిండిలో గ్రోత్ హార్మోన్స్ ఉండటం వల్ల ఎదిగే పిల్లలకు దీనితో తయారు చేసిన పదార్థాలు పెట్టడం మంచిది. ఇక ఇందులోని ఫాస్ఫరస్ వల్ల ఎదిగే పిల్లల ఎముకలు గట్టి పడతాయి ఠి ఫోలేట్ ఎక్కువగా ఉండటం వల్ల కాబోయే తల్లులు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మహిళలూ దీన్ని వాడటం మేలు. ఎర్రరక్తకణాలనూ పెంపొందిస్తుంది. అందాలను ఇనుమడింపజేసే శనగపిండి...: శనగపిండితో, చిటికెడు పసుపునూ, పాలను కలిపి... పేస్ట్‌లా చేసి ముఖానికి, మెడకూ రాసుకుని, 10 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత తొలగిస్తే ముఖం నిగనిగలాడుతుంటుంది. చర్మం మిసమిసలాడుతుంటుంది. శనగపిండితో గుడ్డులోని తెల్లసొన, ఇతర ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి తలకు పట్టించి, జుట్టు మిలమిల మెరిసేలా ప్యాక్స్ వేస్తుంటారు. ఇన్ని మంచి గుణాలున్నా... శనగపిండి కాస్త బరువైనది కాబట్టి కడుపు ఉబ్బరం, పొట్ట ఉబ్బిపోయినట్లుగా కావడం వంటి కొన్ని గుణాల వల్ల దీనికి కొన్ని నిందలున్నాయి. అయితే ఇతర మల్టీగ్రెయిన్స్ ఆటాతో కలిపి తీసుకుంటే ఈ ఉబ్బరం వంటివి తగ్గుతాయి. కాబట్టి శనగపిండిలోని ఈ గుణం కారణంగా దానితో కలిగే అపరిమితమైన ప్రయోజనాలను వదులుకోవడం సరికాదు. కాబట్టి పరిమితంగానైనా నిత్యం శనగపిండి వాడుకోవడం ఆరోగ్యానికి మేలు. కొర్రల పిండి (కాముట్ ఫ్లోర్) మనం వాడే గోధుమల కంటే కొర్రలలో ప్రోటీన్లు, పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే కొర్రల పిండి చాలా ఆరోగ్యదాయకం. ఇందులో ఉండే గ్లూటెన్ చాలా తేలిగ్గా జీర్ణమయ్యేదిగా ఉంటుంది. అందుకే కొర్రలతో రొట్టెలే కాక... చాలా రకాల వంటకాలు చేస్తుంటారు. కొర్రలలోని పోషకాలివి: ప్రోటీన్లు , పొటాషియమ్ , నియాసిన్ , థయామిన్ ,జింక్ ,మెగ్నీషియమ్ ,ఐరన్, రైబోఫ్లేవిన్. కొర్రపిండి ఆరోగ్యానికి మేలు చేస్తుందిలా... కొర్రపిండిలో పీచుపదార్థాలు చాలా ఎక్కువ కాబట్టి తేలిగ్గా జీర్ణం కావడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇక ఇందులోని ప్రోటీన్లు బలవర్ధకమైన కణజాలాన్ని ఏర్పరుస్తాయి. కణజాలం బలంగా ఉండటంతో పాటు ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇవన్నీ కలగలవడం వల్ల కొర్రల పిండితో చేసిన వంటలు తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు వాడదగ్గదిది. ఇందులో జింక్ పాళ్లు అధికంగా ఉంటాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు ఊడటం తగ్గుతుంది. థైరాయిడ్ కార్యకలాపాలు క్రమబద్ధమవుతాయి. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవకణాల్లోని ఎంజైములు మరింత సమర్థంగా పనిచేస్తాయి. కొర్రలలో ఏమేముంటాయి... ఒక కప్పు కొర్రపిండిలో , ప్రోటీన్ 10 గ్రా. , డయటరీ ఫైబర్ 7.4 గ్రా , మెగ్నీషియమ్ 83 మి.గ్రా. కొర్రపిండితో రొట్టెలు తయారు చేయవచ్చు. కొందరు కొర్రలను జావలా తయారు చేసి తీసుకుంటుంటారు. మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్) మొక్కజొన్నను పిండిగా కంటే... వాటితో రకరకాల ఆహారపదార్థాలు తయారు చేసుకోవడం మనకు అలవాటే. ఇక పిండిగా కూడా మనం విరివిగానే ఉపయోగిస్తుంటాం. ఇందులో పసుపచ్చగా ఉండేవీ, తెల్లగా ఉండేవి రెండు రకాల మొక్కజొన్నలుంటాయి. రంగు విషయంలో మినహా పోషకాల విషయంలో ఈ రెండూ ఒకటే. మొక్కజొన్న పిండిలో ఏమేముంటాయి?: ఒక కప్పు మొక్కజొన్న పిండిలో... క్యాలరీలు 416 , కొవ్వులు 4.4. గ్రా. , ప్రోటీన్లు 11 గ్రా. , పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) 75 గ్రా. , పీచు (డయటరీ ఫైబర్) 7.3 గ్రా. , ఐరన్ 9 మిల్లీగ్రాములు , థయామిన్ 1.8 మిల్లీగ్రాములు , రైబోఫ్లైవిన్ 0.9 మి.గ్రా. , నియాసిన్ 11 మి.గ్రా. ఫోలేట్ 238 మైక్రోగ్రాములు ఉంటాయి. ఆరోగ్యానికి చేకూరే మేలు...: ఇందులో పీచు (డయటరీ ఫైబర్) ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ సులభంగా జరగడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పాళ్లను గణనీయంగా తగ్గిస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్స్ ఏమాత్రం లేకపోవడంతో ‘ల్యూటిన్’, టీయాగ్జాంథిన్ అనే పోషకాలు (ఫైటోన్యూట్రియెంట్స్) ఉంటాయి. ఇవి మంచి యాంటీఆక్సిడెంట్. ఫలితంగా వయసు పెరిగే ప్రక్రియ మందగించడంతో పాటు దీర్ఘకాలం యౌవనంతో ఉండటానికి పై పోషకాలు ఉపకరిస్తాయి. ఇందులో సోడియమ్ పాళ్లు 6 మి.గ్రా. మాత్రమే. అందువల్ల హైబీపీతో బాధపడేవారు ఈ మొక్కజొన్నపిండిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇందులో మెగ్నీషియమ్, పోటాషియమ్ పాళ్లు రక్తపోటు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులోని సెలీనియమ్ అనే యాంటీఆక్సిడెంట్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సీ, ఈ లు పుష్కలంగా ఉంటాయి. ఇది ‘గ్లూటేన్ ఫ్రీ’ పిండి కాబట్టి ఎలాంటి దుష్ర్పభావాలూ లేకుండా వాడుకోవచ్చు. విటమిన్లూ, ఖనిజాలూ పుష్కలం. జింక్, ఐరన్ పాళ్లు ఎక్కువ కాబట్టి శరీరంలోని అన్ని ఎంజైములూ సమర్థంగా పనిచేయడం, రోగనిరోధకశక్తి పెరగడం, జుట్టురాలడం తగ్గడం, జీవకణాలు ఆరోగ్యంగా వుండటం వంటి ప్రయోజనాలు చేకూరతాయి. ఇక పసుపురంగులోని మొక్కజొన్న పిండిలో 2.8 మిల్లీగ్రాముల ఐరన్ ఉండటం వల్ల ఇది... మనకు మన ఆహారంలో సమకూరే ఐరన్‌లో 35 శాతం కావడం వల్ల రక్తకణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మొక్కజొన్న పిండి గుండె ఆరోగ్యాన్ని కాపాడి కార్డియోవాస్క్యులార్ డిసీజెస్ రాకుండా నివారిస్తుంది. ఓట్స్ ఫ్లోర్... ఇటీవల ‘ఓట్స్’ వాడకం గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయనే అంశం విస్తృతంగా ప్రచారంలో ఉండటం వల్ల దీని వాడకం, మార్కెట్లో లభ్యత విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి నిజానికి మన దేశపు పంట కాదు. వీటిని ‘యవల పిండి’గా కొందరు పేర్కొంటుంటారు. ఓట్స్‌లో ఉన్న పోషకాలేమిటి?: * విటమిన్ ‘బి’ * విటమిన్ ‘ఈ’ * కాపర్ * ఐరన్ * జింక్ * మెగ్నీషియమ్ * ఫాస్ఫరస్ * క్యాల్షియమ్ *థయామిన్ ఆరోగ్యానికి ‘ఓట్స్’ చేసే మేలు ఓట్స్ పిండిలో నీటిలో కరిగే పీచు పుష్కలంగా ఉంటుంది. ఈ పీచుపదార్థాన్ని ‘బీటా గ్లూకన్’ అంటారు. ఇది ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇక దీనిలో ఉన్న మరో అనుకూల అంశం ఏమిటంటే... ఓట్ పిండిలో గ్లూటేన్ ఉండదు. కాబట్టి గ్లూటేన్ పడనివారికీ (గ్లూటేన్ ఇన్టాలరెన్స్ ఉన్నవారికీ) దీనివల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ ఉండవు. ఇది తేమను చాలా సేపు నిలుపుకోగలదు. కాబట్టి వాణిజ్యపరంగా ‘ఆటా’ విక్రయాలు సాగించేవారిలో చాలామంది గోధుమపిండితో పాటు... ఓట్ఫ్లోర్నూ కలిపి వాడుకుంటుంటారు. ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు వాడితే... మనం తినే పిండిపదార్థాలలోని చక్కెర నెమ్మదిగా రక్తంలో కలిసేలా ఈ ఫైబర్ నియంత్రిస్తూ ఉంటుంది. ఇక మరో అంశం ఏమిటంటే... ఓట్స్‌లోని పిండిపదార్థాల్లో ఉండే పాలీ శాకరైడ్ (చక్కెర పదార్థాల) నాన్సెల్యులోజ్ పాలీశాఖరైడ్ అనే బంధాలను కలిగి ఉంటాయి. అవి నీళ్లతో కలిసినప్పుడు చాలా ఎక్కువగా ఉబికిపోయినట్లుగా అవుతాయి. దాంతో కొద్దిగా తిని నీళ్లు తాగగానే... కడుపు వెంటనే నిండిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అలా ఆహారం తినడం మొదలు పెట్టిన కాసేపటికే కడుపునిండి సంతృప్త అనుభూతి (ఫుల్నెస్ అండ్ సెటైటీ) కలుగుతుంది. దానివల్ల మనం తీసుకునే ఇతర ఆహారాలూ తక్కువే తింటాం. ఫలితంగా డయబెటిస్ రోగులు వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో కలిసే చక్కెర పాళ్లు గణనీయంగా తగ్గుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఈ ధాన్యాలు మనవి కాకపోయినా... వీటిని సిఫార్సు చేస్తుంటారు. అయితే స్వతహాగా వీటిని తీసుకునే అలవాటు లేకపోవడం వల్ల అంత త్వరగా మనల్ని సంతృప్తిపరచలేవు. కాబట్టి అలవాటు చేసుకోగలిగితే మంచిది. లేకపోతే ఆరోగ్యం కోసం ఓ పూట వాడుకోవచ్చు. ఒక కప్పు ఓట్స్‌లో ఉండే అంశాలివే... *క్యాలరీలు 112 (ఇందులో కార్బోహైడ్రేట్ల నుంచి 75 క్యాలరీలు, కొవ్వుల నుంచి 21 క్యాలరీలు, ప్రోటీన్ల నుంచి 16 క్యాలరీలు లభ్యమవుతాయి) * కొవ్వులు 2.5 గ్రా ఠి ప్రోటీన్లు 4 గ్రాములు, * థయామిన్ * క్యాల్షియమ్ * పోటాషియమ్ స్వల్పపాళ్లలో ఉంటాయి. ఇక సోడియమ్ పాళ్లు చాలా చాలా తక్కువ ( ఒక కప్పులో 1 మి.గ్రా. కంటే తక్కువ) కాబట్టి రక్తపోటు ఉన్నవారూ ఓట్స్‌ను నిరభ్యంతరంగా వాడవచ్చు. బియ్యప్పిండి పిల్లలకు ఆహారంగా పెట్టడానికి బియ్యప్పిండి బాగా ఉపయోగపడుతుంది. ఇది ‘గ్లూటెన్’ లేనిది కాబట్టి గ్లూటెన్ ఉండే ఇతర పిండిపదార్థాల్లోని గ్లూటెన్ ప్రభావాన్ని తగ్గించడానికి కూడా దీన్ని వాడతారు. కొందరు బియ్యప్పిండి కంటే గోధుమలో సారం ఎక్కువని అపోహపడుతుంటారు. నిజానికి బియ్యం, గోధుమ ఈ రెండింటిలోనూ ఉండే క్యాలరీస్ దాదాపు ఒకటే. ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు బియ్యప్పిండితో చేసిన పదార్థాలు తిన్నవారి పేగులలో క్రమబద్ధమైన కదలికలు (బవెల్ మూవ్మెంట్స్) ఉంటాయి. మలబద్ధకం ఉండదు. బియ్యప్పిండిలో మ్యాంగనీస్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, ఎముకలపై ఉండే మృదులాస్థి ఆరోగ్యనిర్వహణకు అది తోడ్పడుతుంది. బియ్యప్పిండిని మొదటే పులిసేలా చేసే వంటకాల వల్ల మన జీర్ణవ్యవస్థకూ ఎంతో మేలు. ఎందుకంటే... మనం నిత్యం చేసుకునే పుల్లట్ల వంటి వాటివల్ల పేగులకు మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి కాస్త తినగానే కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. దాంతో స్థూలకాయం వంటి అనర్థాలూ తప్పుతాయి. పేగుల్లో మనకు మేలు చేసే బ్యాక్టీరియా పెంపుదలకు ఈ పిండి దోహదం చేయడం వల్ల జీర్ణవ్యవస్థలోని విషాలను అవి హరిస్తాయి. గోధుమ పిండిలో ఉండే గ్లూటెన్ వల్ల కలిగే అనర్థాలకు (గ్లూటేన్ ఇన్టాలరెన్స్ ఉన్నవారికి) బియ్యపిండితో తయారు చేసే పదార్థాలు (పుల్లట్లు) వంటివి తినడం ఒక మంచి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. బార్లీ పిండి మనం వాడే పిండిపదార్థాలన్నింటిలోనూ ‘బార్లీ’ని చాలా ఆరోగ్యకరమైనదిగా చెప్పవచ్చు. పొట్టుతీయని బార్లీ (హోల్ బార్లీ) పిండి ఆరోగ్య విలువలు ఇన్ని అని చెప్పడానికి వీల్లేనంత విశిష్టమైనవి. బార్లీతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు...: బార్లీలో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల దీన్ని ‘పవర్ హౌజ్ ఆఫ్ ఫైటోన్యూట్రియెంట్స్’ అని అభివర్ణిస్తారు. ఈ పోషకాలు పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్లనూ, మహిళల్లో రొమ్ము క్యాన్సర్లను నివారిస్తాయి. ఇక ఇందులోని సెలేనియమ్ అనే పోషకం జీవకణాల్లోని ఎంజైములను సమర్థంగా పనిచేయిస్తుంది. పురుషుల్లో శుక్రకణాలు (స్పెర్మ్ క్వాలిటీ) నాణ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక గుండెకు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనితో పాటు వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ప్యాంక్రియాస్ కణజాలం మెరుగుపడుతుంది. బార్లీ పిండినీ లేదా బార్లీ ఉత్పాదనలను వాడేవారిలో చర్మం, పెద్దపేగు, కాలేయం, రొమ్ము, జీర్ణాశయపు వివిధ భాగాలకు వచ్చే క్యాన్సర్లను సమర్థంగా నివారించవచ్చు. బార్లీలో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి పరిశీలించి చూసి, అది సరిపడితే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. నిద్రను మెరుగుపరిచే బార్లీ... బార్లీలో ట్రిప్టొఫాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. రాత్రిపూట నిద్రసరిగా పట్టని వారు బార్లీ నీళ్లు తాగితే వారికి సరిగా నిద్రపట్టడంతో పాటు... స్లీప్సైకిల్ మెరుగుపడుతుంది, నిద్రలో తగినంత రిలాక్సేషన్ దొరుకుతుంది. రక్తహీనతనూ తగ్గిస్తుంది... బార్లీలో ఐరన్ పాళ్లు ఎక్కువే. అందుకే ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. ఇక ఇందులోని మాంగనీస్, బీ-కాంప్లెక్స్ విటమిన్స్ శరీర పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తనాళాలు మూసుకుపోయే ఆర్టీరియో స్క్లిరోసిస్ వంటి రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించి గుండెకు మేలు చేస్తుంది. ఇది కాలేయానికి మేలు చేస్తుంది. తద్వారా శరీరంలోన పేరుకుపోయే అనేక విషపదార్థాలను వడపోసి బయటకు పంపించివేస్తుంది. పొట్టకూ, జీర్ణవ్యవస్థకూ మేలు చేసి, పొట్టలో వచ్చే అల్సర్లను నివారిస్తుంది. పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇక బార్లీ వల్ల అజీర్ణం, ఆహారం వల్ల కలిగే కొన్ని అలర్జీలు, క్రోన్స్ డిసీజ్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) వంటి వాటిని సమర్థంగా తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్‌నూ, స్థూలకాయాన్నీ నివారిస్తుంది. రాగి పిండి ఇప్పుడు రాగిపిండి మార్కెట్లో రెడీమేడ్‌గా లభిస్తోంది. రాగిపిండిలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) ఎక్కువగానూ, ఆ తర్వాత ప్రోటీన్లు, ఆ తదుపరి స్థానాన్ని పీచు పదార్థాలు ఆక్రమిస్తాయి. రాగిపిండిలో కొవ్వు శాతం చాలా తక్కువ. దీన్ని రాగిరొట్టెగా, రాగిముద్దగా, రాగి అంబలి రూపంలో ఇలా రకరకాలుగా తయారు చేసుకుని తింటూ ఉంటాం. కొందరు రాగి దోసెలూ, ఇడ్లీలు, లడ్డూల రూపంలోనూ దీన్ని తీసుకుంటుంటారు. రాగిపిండిలో ఏమేముంటాయి...: వంద గ్రాముల రాగి పిండిలో 336 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 80 శాతం కార్బోహైడ్రేట్లే. 12 శాతం తేమ ఉంటుంది. రాగిపిండిలో క్యాల్షియం పాళ్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల రాగిపిండిలో 350 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అందుకే ఎముకల ఆరోగ్యానికీ, పటిష్టతకూ రాగిపిండి మంచి మేలు చేస్తుంది. కొంత ఐరన్ కూడా ఉంటుంది. రాగిపిండిలో అత్యావశ్యకమైన అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటినే ఇంగ్లిష్‌లో ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ (ఈఏఏ) అంటారు. వ్యాలైన్, మిథియోనైన్, ఐసోల్యూసిన్, థ్రియోనైన్, ట్రిప్టోఫ్యాన్ వంటి అత్యావశ్యక అమైనో ఆసిడ్స్ అన్నవి మన శరీర సమర్థ ఆరోగ్య నిర్వహణ కోసం అత్యంత అవసరం. ఇక కొవ్వులు దాదాపు లేనట్టే. పైగా అవసరమైన మోతాదులో పీచు పదార్థాలుంటాయి. దీంతోపాటు గ్లూటెన్ ఫ్రీ కావడం వల్ల రాగిపిండి తేలిగ్గా జీర్ణమవుతుంది. తేలిగ్గా ఒంటికి పడుతుంది. అందుకే నవజాత శిశువులకు రాగిజావను మొదటి ఆహారంగా ఇస్తుంటారు. దీన్ని బట్టి ఇదెంత ఆరోగ్యకరమో, దీని ప్రాధాన్యత ఏమిటో తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలెన్నో...: రాగిపిండిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ వల్ల వెంటనే ఆకలి తీరినట్లు ఉంటుంది. ఇక తెల్ల అన్నంతో పోలిస్తే రాగిపిండిలో ఉండే పీచుపదార్థాలు చాలా ఎక్కువ. కొవ్వులు దాదాపు లేనట్టే. దాంతో బరువు పెరగకపోవడం, స్థూలకాయం రాకపోవడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి. ఇందులోని పీచు వల్ల తిన్న వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు రాగిపిండితో చేసిన వంటలు తినడం ఎంతో మేలు. ఇందులో ఉండే పీచుపదార్థాల వల్ల రాగిపిండితో చేసిన వంటకాలు మెల్లగా జీర్ణమవుతాయి. ఇందులో క్యాల్షియమ్తో పాటు విటమిన్ ‘డి’ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఇది విశేషంగా దోహదపడుతుంది. ఎదిగే పిల్లలకు రాగిపిండితో చేసిన వంటకాలు ఇవ్వడం వల్ల వాళ్లు బాగా, త్వరగా ఎత్తు పెరుగుతారు. ఇక యువకులు, పెద్దవాళ్ల ఎముకల ఆరోగ్య నిర్వహణకూ రాగులు సమర్థంగా పనిచేస్తాయి. రాగిపిండి తినేవాళ్లలో ఎముకలు బలంగా ఉండటం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. డయాబెటిస్ నియంత్రణకు...: రాగులలో పాలీఫినాల్‌తో పాటు పీచు పదార్థాలు (డయటరీ ఫైబర్) ఉండటం వల్ల డయాబెటిస్తో పాటు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులను నివారిస్తాయి. ఇందులోని పీచు వల్ల రాగులతో చేసిన వంటలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర పాళ్లు పెరగడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇక ఇందులో ఉండే లెసిథిన్, మిథియోనైన్ వంటి అమైనో ఆసిడ్లు కొలెస్ట్రాల్ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. అంతేకాదు... కాలేయంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులనూ అవి తొలగిస్తాయి. అందుకే కాలేయంలో కొవ్వు పేరుకుంటున్నవారు రాగులతో చేసిన ఆహారాన్ని తినడం ఎంతైనా మేలు. రక్తహీనతను తగ్గించే రాగులు: రాగులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటితో చేసిన ఆహారాలను తీసుకుంటూ ఐరన్ శరీరంలోకి ఇంకడానికి దోహదపడే విటమిన్ ‘సి’ ఉండే పండ్లు ఎక్కువగా తింటే రక్తహీనత వేగంగా తగ్గుతుంది. ఒత్తిడి నియంత్రణలో... : ఏ ఇతర తృణధాన్యాలకూ లేని ఒక విశేష గుణం రాగులకు ఉంది. రాగులు ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తాయి. అందుకే యాంగ్జైటీ, డిప్రెషన్, మైగ్రేన్, నిద్రలేమి (ఇన్సామ్నియా) వంటి వ్యాధులతో బాధపడేవారికి రాగులు మంచి ఆహారం. జొన్నపిండి (సోర్ఘమ్ ఫ్లోర్) రెండు మూడు తరాలకు ముందు చాలా సంస్కృతులలో ఇదే ప్రధానాహారం. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే ఐదు తృణధాన్యాల్లో జొన్న ఒకటి. (మిగతావి... గోధుమ, ఓట్స్, మొక్కజొన్న, బార్లీ). ఇప్పటికీ ఆఫ్రికా ఖండం, చాలా దక్షిణాసియా దేశాలు, దక్షిణ అమెరికాలోని చాలా దేశాల్లో ఇది ప్రధాన పంట. తక్కువ వర్షపాతంలో కూడా జొన్నలు తేలిగ్గా పండుతాయి. కాబట్టి తిండికొరత లేకుండా చూసుకునేందుకు, వర్షాలు సరిగా పడని ప్రాంతాల్లో జొన్నను విస్తృతంగా వేస్తుంటారు. అందుకే చాలా సంస్కృతుల్లో జొన్నన్నం, జొన్నరొట్టెలూ నిత్య ఆహారంగా ఉన్నాయి. జొన్నపిండితో చేసిన రొట్టెలు బలవర్థకమైనవిగా భావిస్తుంటారు. జొన్నతో ఆరోగ్యప్రయోజనాలివి...: జొన్నతో చేసిన ఆహారంలో ప్రోటీన్ల పాళ్లు ఎక్కువ. ఇందులో ఐరన్, క్యాల్షియమ్, పొటాషియమ్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎక్కువ. థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి బీకాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్లు ఎక్కువ. ఇందులోని ఫీనాలిక్ యాసిడ్స్, ట్యానిన్స్, యాంథోసయనిన్ వంటి పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. ఇక జొన్నలు తినేవారికి స్థూలకాయం వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. గుండె ఆరోగ్యానికీ జొన్న ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. ఐరన్ కూడా ఎక్కువే. యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాల యవ్వనానికి మంచి ఆహారం. గ్లూటెన్ కారణంగా గోధుమ వల్ల అలర్జీ ఉన్నవారికి ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ధాన్య మిశ్రమాల పిండి... మల్టీ గ్రెయిన్ ఆటా సాధారణంగా ఏదో ఒక కాయధాన్యమో, తృణ ధాన్యమో కాకుండా కొన్ని రకాల ధాన్యాలను కలిపి దంచిన పిండినే ‘మల్టీ గ్రెయిన్ ఆటా’గా అభివర్ణిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఓట్స్, గోధుమపిండి, కుసుమలు, పొట్టు తీయని ఇతరరకాల ఎన్నో తృణధాన్యాలు కలిపి ఈ పిండిని రూపొందిస్తుంటారు. ఇందులో మూడు నుంచి గరిష్ఠంగా 12 వరకు ధాన్యాలు కలిసి ఉండవచ్చు. మల్టీ గ్రెయిన్ ఆటా ప్రయోజనాలు... కొన్ని రకాల పిండ్లలో ఉన్న పోషకాలు మరికొన్నింటిలో లోపించవచ్చు. ఇలాంటి సమయాల్లో చాలా రకాల ధాన్యాలను కలిపి పిండిగా దంచుకోవడం వల్ల చాలా రకాల పోషకాలు కలిసి అవి ఒక సంపూర్ణ పోషక విలువలు కలిగిన పిండిగా రూపొందుతాయి. ఇలాంటి పిండి వాడటం ఆరోగ్యానికి మేలే. తస్మాత్ జాగ్రత్త... అయితే మార్కెట్లో లభ్యమయ్యే మల్టీ గ్రెయిన్ ఆటాలలో వాణిజ్య ప్రయోజనాల కోసం చాలా మంది తేలిగ్గా లభ్యమయ్యే గోధుమ పిండినే ప్రధానంగానూ, ఎక్కువగానూ వాడి, మిగతా తృణధాన్యాలను చాలా తక్కువ మోతాదులో వాడుతుంటారు. దీని వల్ల మనం దాదాపు సాధారణ గోధుమ పిండిని వాడిన ప్రయోజనానికి మించి పెద్దగా ఉపయోగం పొందలేం. మల్టీ గ్రెయిన్ అంటే ఏమిటి, హోల్ వీట్ అంటే ఏమిటి? మల్టీ గ్రెయిన్ అంటే... ఇందులో రకరకాల తృణధాన్యాలు, కాయధాన్యాలను కలిపి దంచుకుని రూపొందించుకున్న పిండి. ఇక హోల్ వీట్ అంటే పొట్టు తీయని గోధుమలతో చేసిన పిండి. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. మార్కెట్లో లభ్యమయ్యే బ్రాండ్ల విషయంలో... మల్టీ గ్రెయిన్ ఆటా కంటే పొట్టు తీయని గోధుమలతో దంచుకున్న పిండే శ్రేష్ఠం. మళ్లీ మల్టీ గ్రెయిన్లలోనూ పొట్టు తీయని వాటిని మల్టీ హోల్గ్రెయిన్స్గా చెప్పుకోవచ్చు. ఇందులో పొట్టు, జెర్మ్, ఎండోస్పెర్మ్ అన్నీ ఉంటాయి. మరి మల్టీ హోల్ గ్రెయిన్ ఆటా ప్రయోజనాలు పొందాలంటే... అన్ని రకాల పోషకాలు పొందేలా అన్ని ధాన్యాల సమష్టి ప్రయోజనాలు పొందాలంటే... కనీసం 10 రకాల ధాన్యాలను కలిపి మనమే స్వయంగా పిండిగా పట్టించుకోవడం మేలు. ఈ పది రకాల ధాన్యాలు ఏమిటంటే... పొట్టు తీయని గోధుమ పిండి... 2 కిలోలు పొట్టు తీయని సెనగ పప్పు ... 100 గ్రాములు పొట్టుతీయని మొక్కజొన్న/జొన్న 100 గ్రాములు పొట్టుతీయని సజ్జలు 50 గ్రాములు పొట్టుతీయని బార్లీ 50 గ్రాములు పొట్టుతీయని రాగులు 50 గ్రాములు పొట్టుతీయని సోయాబీన్ 50 గ్రాములు పొట్టుతీయని ఓట్స్ 100 గ్రాములు ఎలా చేసుకోవాలి? 1. పై ధాన్యాలను విడివిడిగా వేయించుకోవాలి. (ఒక్క గోధుమలను మాత్రం వేయించకూడదు); 2. వేయించిన ధాన్యాలు చల్లబడే వరకు ఆరబెట్టాలి. ఆ తర్వాత గోధుమలతో కలపాలి; 3. ఆ తర్వాత అన్నింటినీ కలిపి మర ఆడించి, పిండి పట్టించుకోవాలి; 4. ఇలా మర ఆడించిన పిండి వేడిగా ఉంటుంది. అది చల్లారేవరకు వేచి చూడాలి; 5. దాన్ని రెండు సార్లు జల్లెడ పట్టుకోవాలి; 6. అలా జల్లెడ పట్టినప్పుడు జల్లెడలో మిగిలిన పదార్థాలను పారేయాలి; 7. ఇప్పుడు జల్లెడ పట్టగా కింద మిగిలిన మెత్తటి పిండిని గాలి చొరబడని ఎయిర్‌టైట్ డబ్బాలో జాగ్రత్తగా నిల్వ చేసుకుని అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే కొండలను పిండి చేసే ఆరోగ్యం మన సొంతం. -
ముద్ద దిగేదెలా?
రూపాయికే బియ్యమన్నారు... రూపు చూసి అవాక్కయ్యారు... మక్కిపోయి.. మట్టి కలిసి.. నూకలుగా మారిన ఈ బియ్యాన్ని ఎలా తినాలి? ‘అమ్మ హస్తం’తో.. కందిపప్పు అన్నారు... అది నిజంగా కందిపప్పేనా? కాదు.. కాదు అలా అనడమే తప్పు... పుచ్చిపోయి, పురుగులు పట్టి, ముద్దగా మారిన ఈ ‘పప్పు’ను ఎలా తినాలి? అందమైన ప్యాకెట్లో గోధుమ పిండి ఇచ్చారు. మేడిపండు చందమని విప్పి చూస్తే కాని తెలియలేదు.. జల్లెడ పడితే సగం కూడా మిగల్లేదు... అది కూడా మక్కిన వాసనే.. దాంతో రొట్టెలెలా చేయాలి... చేసినా ఎలా తినాలి? కారంపొడికీ ‘సబ్సిడీ’ అన్నారు... పొట్టు కలిపి కంట్లో కారం కొట్టారు... అందుకే ఈ రోజులు మాకొద్దు... ప్రజా పంపిణీ పట్టని ఈ పాలకులూ మాకొద్దు అంటున్నారు ప్రజలు. - ఎలక్షన్ సెల్