
సాక్షి, విశాఖపట్నం: పేదల కడుపు నింపే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసర ఫరాల శాఖ బుధవారం నుంచి గోధుమ పిండి కూడా అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖ పట్టణంలో ప్రారంభించారు. నగరంలోని లబ్దిదారులకు గోధుమ పిండి ప్యాకెట్ లను పంపిణీ చేశారు.
గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధర 16 రూపాయలుగా నిర్ణయించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.40గా ఉంది. విశాఖపట్నం అర్బన్ ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధారలో రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు.
చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే!
Comments
Please login to add a commentAdd a comment