karumuri Nageswara rao
-
ఎస్సై ఆత్మహత్యకు ఆ ఫ్యాక్టరీయే కారణం: కారుమూరి
సాక్షి,పశ్చిమగోదావరిజిల్లా:తణుకు రూరల్ ఎస్సై మూర్తి తుపాకీతో కాల్చుకొని చనిపోవడం చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఈ విషయమై కారుమూరి ఆదివారం(ఫిబ్రవరి2) మీడియాతో మాట్లాడారు. ‘ఆ ఎస్సై చాలా మంచివాడు ధైర్యవంతుడు..కానీ అలా చేసుకోవడం బాధాకరం. దీనంతటికీ మూలకారణం తేతలిలో ఉన్న పశువధ ఫ్యాక్టరీనే అన్నది నూరు శాతం నిజం. కొన్ని నెలల క్రితం గేదెలు దొంగతనం జరిగిన ఘటనలో దొంగను పట్టుకొన్నారు ఎస్సై మూర్తి. గతంలో గేదెలు దొంగిలించినా గానీ దొరికేవి. ఇప్పుడు గేదెలు దొంగిలించిన ఐదు నిముషాల్లోనే తేతలి ఫ్యాక్టరీలో అమ్మేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపలికెళ్లిన రెండునిముషాల్లో మాంసానికి మాంసం ఎముకలకు ఎముకలు చర్మానికి చర్మం వేరు చేసేస్తున్నారు.అలా గేదెలు దొంగను పట్టుకొన్నా కానీ అప్పటికే వాటిని ఫ్యాక్టరీలో అమ్మేశాడు. ఆ దొంగ నుంచి ఎమౌంట్ రికవరీ చేసి గేదెలు యజమానికి న్యాయం చేశారు ఎస్సై మూర్తి. గతంలో ఆ ఆరోపణలతో సస్పెండ్ అయినా ఎస్సై మూర్తి మనస్తాపంతో ఇలా బలవన్మరణం చెంది ఉండచ్చు. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన పశువధ ఫ్యాక్టరీని ఇప్పటికైనా ఇక్కడి కూటమి ఎమ్మెల్యే మూయించాలి.ఇంకా ఎన్ని ప్రాణాలు బలికొంటారు. అక్కడ ప్రజలు అన్నం కూడా తినలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. కానీ ఇక్కడి కూటమి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన కసాయి వ్యాపారికి కొమ్ముకాస్తున్నాడు. పర్మిషన్లు లేని పశువధ శాలకు పోలీసులతో కాపలాకాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాడు.ఆ ఫ్యాక్టరీకి ఎటువంటి పర్మిషన్లు లేవని మేం ఎన్నిసార్లు నిరూపించాలి. ఇక్కడి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు డబ్బే ప్రధానమా ప్రజలు అక్కర్లేదా’అని కారుమూరి ప్రశ్నించారు. -
ఆరోజు పుష్కరాలు ఈ రోజు తిరుపతి
-
పశువధ కర్మాగారం వెంటనే ఆపాలి.. కారుమూరి నాగేశ్వరరావు వార్నింగ్
-
రైతు సంక్షేమం కోసం YSRCP ప్రభుత్వం పనిచేసింది
-
కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లే: కారుమూరి
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలును గాలికి వదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధానకార్యాలయంలో శుక్రవారం(నవంబర్29) కారుమూరి మీడియాతో మాట్లాడారు.‘రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధాన్యం రైతుల అవస్థలపై ఎల్లోమీడియాలో కూడా వార్తలు వచ్చాయి. రైతులకు ప్రభుత్వం గోతాలు కూడా ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో 35 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం.నేరుగా రైతుల ఖాతాలోనే నగదు వేశాం. మధ్యలో దళారుల ప్రమేయమే లేదు. ఇప్పుడు మళ్ళీ దళారులు,మిల్లర్లు సిండికేట్ అయి దోచుకుంటున్నారు.అసలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు.ఈక్రాప్,ఇన్సూరెన్స్ అనేవి లేనే లేవు.ఎక్కడ చూసినా రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా ధాన్యం కనపడుతోంది.మా హయాంలో జియోట్యాగ్ చేసి ధాన్యం లారీ ఎటు వెళ్తుందో గమనించేవాళ్లం.ఇప్పుడు ఆ జియోట్యాగ్ తీసేయటం వెనుక ఉద్దేశం ఏంటి?టీవీల్లో షోలు చేయటం తప్ప రైతులకు ఎలాంటి మేలు చేయడం లేదు.ప్రభుత్వం కనీసం ఒక్క మీటింగ్ కూడా రైతుల కోసం పెట్టలేదు.ఇదేనా రైతుల మీద ఉన్న ప్రేమ? జగన్ హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 అందేవి.ఇన్పుట్ సబ్సిడీ అందేది.ఇప్పుడు ఏ ఒక్క పథకమూ అందడం లేదు.రేషన్ బియ్యం ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.రేషన్ మాఫియా మళ్ళీ రెచ్చిపోతోంది.షిప్పులలో పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?చౌకడిపోల ద్వారా మా హయాంలో చాలా రకాల సరుకులు అందించాం.ఇప్పుడు బియ్యం,పంచదార తప్ప మరేమీ ఇవ్వడం లేదు.ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి’అని కారుమూరి డిమాండ్ చేశారు. -
సూపర్ సిక్స్ కాదు.. సూపర్ బాదుడు మొదలైంది: కారుమూరి
సాక్షి, తణుకు: ఏపీ సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసి సూపర్ బాదుడు అమలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఒకపక్క పెరిగిన పేదలు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు మాత్రం నిర్మల సీతారామన్‌ను ఒక పర్సెంట్ జీఎస్టీ పెంచుకోవటానికి అనుమతి అడుగుతున్నారుని అన్నారు.మాజీ మంత్రి కారుమూరి ఆదివారం తణుకు వైఎస్సార్సీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాం పేదవారిని లక్షాధికారిని చేస్తామని చంద్రబాబు అబద్దాలు చెప్పాడు. ఆనాడు బాదుడే బాదుడు అని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేంటి?. సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు.. ప్రజలకు సూపర్ బాదుడు అమలు చేస్తున్నారు.నాణ్యమైన కరెంట్ ఇస్తామని కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పి సూపర్ బాదుడు బాదుతున్నారు. ఆనాడు లోకేష్ రైతులను ఉద్దేశించి స్మార్ట్ మీటర్లు ఎవరూ పెట్టుకోవద్దని, అవి బిగిస్తే బద్దలు కొట్టాలని చెప్పాడు. ఇప్పుడు కేంద్రంతో కుమ్మక్కై స్మార్టుగా స్మార్టు మీటర్లు బిగించేస్తున్నారు. ఇది రైతులను మోసం చేసినట్లు కాదా?. వందల కోట్లు చందాలు వసూలు చేసి అగ్గిపెట్టె, కొవ్వొత్తులకి అయిపోయాయని మోసం చేశారు. అన్ని నిత్యవసర ధరలను ఇష్టానుసారం పెంచేశారు.ఒక్కసారి గమనిస్తే నూనె దగ్గర నుండి పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్నీ కూడా దారుణంగా పెంచేశారు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలను ప్రజలకు ఒక్కసారి గమనించుకోండి. ఒక పక్క పేద ప్రజలు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు మాత్రం ఒక పర్సెంట్ జీఎస్టీ పెంచుకోవడానికి ఆర్థిక మంత్రిని అనుమతి అడుగుతున్నారు. అన్నీ అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసి వచ్చారు కూటమి నేతలు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే మీరు ఎక్కడ సంపద సృష్టించారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై నిందలు మోపారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడేం సమాధానం చెబుతారు’ అని ప్రశ్నించారు. -
టీడీపీ అరాచకాలపై కారుమూరి ఫైర్
-
పోరాటాలు వైఎస్సార్సీపీకి కొత్తేమి కాదు: కారుమూరి
సాక్షి, బాపట్ల జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పోరాటాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని చెప్పారు.బాపట్ల జిల్లా ఎమ్‌ఎస్సార్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, నియోజకవర్గ ఇంచార్జీలు వరికుట్టి అశోక్ బాబు, ఈవూరి గణేష్, కరణం వెంకటేష్, హనుమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారు!అనంతరం మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంతో పెద్ద బాధ్యత అప్పగించారని తెలిపారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన ముందు తాముంటామని పేర్కొన్నారు. కూటమి నాయకులు జిల్లాలో కొన్నిచోట్ల తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు హత్యలు పెరిగిపోయాయని అన్నారు. పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: శ్యామల‘కోవిడ్ లాంటి భయంకరమైన విపత్తు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరిని యాచించలేదు. కానీ ఎప్పటి ప్రభుత్వం విపత్తు వస్తే ప్రజల నుంచి విరాళాలు యాచించే పరిస్థితి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం మహిళల భద్రతపైన దృష్టి పెట్టలేదు కానీ మద్యంపైన దృష్టి పెట్టింది’. అని విమర్శలు గుప్పించారు.కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: లేళ్ల అప్పిరెడ్డి‘పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు కోసం వైఎస్ జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలని టార్గెట్ చేసి దాడులు చేసి వేదిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు. -
చంద్రబాబుపై కారుమూరి ఫైర్
-
టీడీఆర్ బాండ్ల స్కామ్‌లో కారుమూరిని ‘ఫిక్స్’ చేద్దాం
సాక్షి, అమరావతి: ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల జారీ వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఇరికించాలన్న లక్ష్యంతో గురువారం శాసన సభలో పెద్ద చర్చే జరిగింది. టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అవకతవకలు జరిగాయని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పడం, ఇందులో కారుమూరిని ‘ఫిక్స్’ చేయాలని కొందరు సభ్యులు కోరడం, నివేదిక రాగానే అలాగే చేద్దామని మంత్రి చెప్పడం చూస్తే అంతా ఓ ప్రణాళిక ప్రకారం చర్చ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. గురువారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ గడిచిన ఐదేళ్లలో 3,301 టీడీఆర్ బాండ్లు జారీ చేశారని చెప్పారు. తణుకు, విశాఖ, గుంటూరు, తిరుపతిలో బాండ్ల జారీలో ఆరోపణలు రావడంతో శాఖాపరంగా, ఏసీబీతో కూడా విచారణ చేయిస్తున్నామన్నారు. తణుకులో 27.96 ఎకరాలకు రూ.63.24 కోట్లకు బాండ్లు జారీ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.754.67 కోట్లకు జారీ చేశారన్నారు. అంటే రూ.691.43 కోట్ల స్కామ్ జరిగిందని, ఇందుకు బాధ్యులైన ముగ్గురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసామని మంత్రి వివరించారు. రాబోయే 15 రోజులు బాండ్ల జారీని పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యేలు అరిమిల్లి రాధాకృష్ణ, గోరంట్ల బుచ్చెయ్యచౌదరి మాట్లాడుతూ.. సూత్రధారులపై చర్యలు తీసుకోవాలే తప్ప చిన్న చిన్న ఉద్యోగులపై కాదని అన్నారు. తణుకు స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హస్తముందని, ఆయన్ని ఖచి్చతంగా ఈ కేసులో ఇరికించాల్సిందే (ఫిక్స్)నని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి బదులిస్తూ విచారణ నివేదిక రాగానే తప్పకుండా కారుమూరిని ఫిక్స్ చేద్దామని చెప్పారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో కూడా అప్పటి ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేద్దామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 3.13 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
పశ్చిమ గోదావరి: ప్రజలు బాధపడితే చంద్రబాబు ఆనందపడతారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు మండిపడ్డారు. చంద్రబాబును ఒక శాడిస్ట్‌గా వర్ణించించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ప్రజలు బాధపడితే చంద్రబాబు ఆనందపడతారు. చంద్రబాబు పాదం కూడా అంతే ఆయన ఉన్నంతకాలం వర్షాలు పాడేవి కాదు.. పంటలు పండేవి కాదు. కొనసాగుతున్న పథకాలకు డబ్బులు వేయద్దని ఈసీ చెప్పిందంటే.. చంద్రబాబు ఎంత కసరత్తు చేశాడో?. ఈసీ కూడా పక్షపాతి ధోరణిలో వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు ఎలక్షన్ ముందు పసుపు కుంకుమలు అంటూ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే అప్పుడు ఎందుకు ఆమోదించింది.తెలంగాణాలో అడ్డురాని సంక్షేమం ఇక్కడే ఎందుకు అడ్డు వచ్చింది. రైతులకు ఇప్పుడు అందించే సాయిం ఖరీఫ్ పంటల పెట్టుబడులకు మేలు చేస్తుంది. బడి విద్యార్థులు నూతన విద్యా సంవత్సరానికి ఇబ్బందులు పడతారు. ఈసీ మరొక్కసారి పునః పరిశీలన చేయాలి’అని కారుమూరి అన్నారు. -
అవ్వాతాతలపై చంద్రబాబు కక్ష
సాక్షి నెట్వర్క్ : పేదవారంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన భావమేనని.. ప్రతీనెల ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడని, అందుకే వారిపై ఆయన కక్ష కట్టాడని పలువురు మంత్రులు మండిపడ్డారు. దీంతో చంద్రబాబు తన జేబు సంస్థ అయిన ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ముసుగులో తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి.. దాన్ని వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీచ రాజకీయాలు చేస్తూ వలంటీర్లపై ఫిర్యాదు చేయడమంటే.. ప్రజలకు జరుగుతున్న మేలు అడ్డుకోవడమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో అవ్వాతాతలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు. ఎవరెవరు ఏమేన్నారంటే.. ఈసీ ఆదేశాలను పునఃసమీక్షించాలి.. ప్రతీనెలా ఒకటో తేదీన ప్రభుత్వమిచ్చే పెన్షన్లపై ఎన్నో ఆశలు పెట్టుకుని అవ్వాతాతలు జీవిస్తున్నారు. అలాంటి వారికి వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలి. పేదోడు బాగా ఉంటే చంద్రబాబుకు తిన్నది అరగదు. పెన్షన్లు ఇవ్వనీయకుండా.. నిరుద్యోగుల డీఎస్సీని అడ్డుకున్న దుషు్టడు చంద్రబాబు. పెన్షన్ పంపిణీకి ఎటువంటి ప్రత్యామ్నాయం చేసినా ఇబ్బందులు తప్పవు. అది ఒక నెలతో పోయేది కాదు.. మూడునెలల పాటు అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటే ఆ పాపం శాపమై చంద్రబాబుకు చుట్టుకుంటుంది. – బొత్స సత్యనారాయణ, మంత్రి వలంటీర్లపై విషం కక్కుతున్నారు పది మంది జీవితాల బాగు కోసం పాటుపడుతూ.. పారదర్శకంగా ప్రజాసేవకు అంకితమైన వలంటీర్లపై చంద్రబాబు, పచ్చబ్యాచ్ విషం కక్కుతున్నారు. ప్రజల కోసం అహరి్నశలు పాటుపడుతున్న వలంటీర్లంటే ఎందుకంత భయం? చంద్రబాబు ఓటమి భయంతోనే వలంటీర్లపై తప్పుడు ఫిర్యాదులు చేయించి కక్ష సాధిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. మొత్తం వలంటీరు వ్యవస్థనే తీసేసే హెచ్చరికగానే దీన్ని భావించాలి. అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిసినా అమానవీయంగా ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబుకు వారి ఉసురు తగులుతుంది. – విడదల రజిని, మంత్రి బాబుకు అవ్వాతాతల శాపనార్థాలు అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, కిడ్నీ బాధితులు 1వ తేదీ ఉ.5 గంటల నుంచి ఇంటిగుమ్మంలో పింఛను కోసం ఎదురుచూస్తారు. పెత్తందార్లకు వెన్నుదన్నుగా నిలబడి ప్యాకేజీలు గుంజుకునే చంద్రబాబు పేదలను ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. ముందునుంచీ వలంటీరు వ్యవస్థపై పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్‌తో ఎన్నికల అధికారికి పిటిషన్ ఇచ్చి వలంటీర్లను విధుల నుంచి తప్పించి పాపం మూటగట్టుకున్నాడు. అవ్వాతాతల శాపనార్థాలు ఆయనకు తగులుతాయి. వారు పడే బాధ నువ్వు కూడా అనుభవించే రోజు వస్తుంది. – కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి చంద్రబాబుది రాక్షసానందం అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల ఇంటికి వలంటీర్లు రాకుండా అడ్డుకున్న పాపం చంద్రబాబుదే. గ్రామ వలంటీర్ వ్యవస్థను అడ్డుకుని ఆయన రాక్షసానందం పొందుతున్నారు. ఆయన కుట్రతో అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇకపై మండుటెండల్లో ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో? వలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు పింఛన్లు పంపిణీ చేయాలంటూ చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ బతుకులు ఏవిధంగా ఉంటాయోనని పేదలు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ కూటమికి వారు బుద్ధిచెప్పడం ఖాయం. – ఆదిమూలపు సురేష్, మంత్రి చంద్రబాబు నరరూప రాక్షసుడు అవ్వాతాతలపై ఎటువంటి కనికరం లేకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నరరూప రాక్షసుడిలా వ్యవహరించాడు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచీ కడుపు మంటతోనే ఉన్నాడు. ప్రతినెలా ఒకటో తేదీన అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాల రోగుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి, ఆప్యాయంగా పలకరిస్తూ రూ.3 వేల పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు చూడలేకపోయారు. దీంతో వలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించేలా చేశారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది, ఇబ్బందులు పడేది పెన్షన్దారులే. – మార్గాని భరత్‌రామ్, ఎంపీ పెన్షనర్లే టీడీపీ కూటమికి బుద్ధిచెబుతారు పింఛన్‌దారులను ఇబ్బంది పెట్టడం దారుణం. చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ద్వారా వలంటీర్లతో పింఛన్లను పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో పెన్షనర్లే తెలుగుదేశం కూటమికి బుద్ధిచెబుతారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం. – ఏకుల రాజేశ్వరిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి -
కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్ధేశం: మంత్రి కారుమూరి
-
చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవుట్ డేటెట్ రాజకీయ నాయకుడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ఆచంటలో చంద్రబాబు సమావేశానికి తన పుట్టినరోజుకి వచ్చిన జనాలు కూడా రాలేదని దుయ్యబట్టారు, గతంలో తణుకులో చంద్రబాబు నిర్వహించిన రైతు పోరుబాటలోకు 400 మంది జనం కూడా రాలేదని, బహిరంగ సభకి 1500 మంది జనం కూడా రాలేదని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలంలో మంత్రి కారుమూరి సోమవారం మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు ధాన్యం గురించి, సంచుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులకు ధాన్యం సంచులు ఒక కోటి 14 లక్షల గన్ని బ్యాగ్‌లను అందజేశామని తెలిపారు. టార్గెట్ కంటే మించి 10 లక్షల సంచులు అదనంగా ఇచ్చామని పేర్కొన్నారు. బాబు హయాంలో 17 లక్షల 94 వేల మంది రైతుల నుంచి 2 కోట్ల 65 లక్షలు టన్నులు ధాన్యం మాత్రమే సేకరించారని.. తమ ప్రభుత్వంలో 36 లక్షల 60 వేల మంది రైతుల నుంచి 3 కోట్ల 33 లక్షల 86 మెట్రిక్‌లు ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. బాబు హయాంలో దళారుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతులు నడ్డి విరిచారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మేలు చేశామని తెలిపారు. మొన్న మిచాంగ్ తుఫాన్లో తడిసిన, మొక్క వచ్చిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డివి స్కీములు అయితే.. చంద్రబాబువి అన్ని స్కాములేనని ధ్వజమెత్తారు. తాను చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ప్రతి అవ్వా, తాత మొహంలో చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తున్నామన్నారు. -
పవన్, చంద్రబాబుపై మంత్రి ఫైర్
-
అమ్మ మహానటి..భువనేశ్వరిని ఇమిటేట్ చేసిన మంత్రి
-
చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే... టీడీపీ నేతలు సిగ్గు లేకుండా..!
-
ఏపీలో పిల్లల ఇంగ్లీష్ చూసి విదేశీయులు షాక్ తిన్నారు..
-
అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలి: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: సీఎం జగన్ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని, అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో గురువారం ఆయన ‘వై ఏపీ నీడ్ జగన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో 17వ స్థానంలో ఉన్న విద్యా వ్యవస్థ.. సీఎం జగన్ పాలనలో 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అవినీతి లేని పాలన సీఎం జగన్ అందిస్తున్నారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పాలన అందిస్తున్నందుకు మళ్లీ సీఎంగా జగన్ కావాలి. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా అందరికి మేలు చేశారు. జీడీపీ వృద్ధి రేటులో ఏపీని భారతదేశంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టారు. గతంలోలా మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చి ప్రజలను దోచుకు తినకుండా ఉండాలంటే మళ్లీ సీఎంగా జగనే కావాలి’’ అని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో టీడీపీని ఎందుకు మూసేశారు?: మంత్రి జోగి రమేష్ -
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కారుమూరి కౌంటర్
-
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి కౌంటర్
సాక్షి, విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ గురించి కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తెలంగాణ చెయ్యని మేలు ఏపీలో తాము చేశామని తెలిపారు. కోవిడ్ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజలను గాలికి వదిలేశారని, ఏపీలో తాము ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వర్షం పడితే పిల్లలు నాలాల్లో కొట్టుకుపోయారనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఏపీలో వర్కౌట్ కాదని విమర్శించారు. ‘ఆంధ్రప్రదేశ్ ధాన్యం తెలంగాణలో అమ్ముతున్నారని కేసీఆర్ చెప్తున్నారు. మేము ఏపీలో ధాన్యం కొన్న తర్వాత మూడు రోజుల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించాం. ఇంటింటికి వెళ్లి బియ్యం ఇస్తున్నాం. మీరు మాములు బియ్యం ఇస్తుంటే మేము సర్టెక్స్ బియ్యం ఇస్తున్నాం. మేము ప్రజలకు ఇస్తున్న సరుకులు మీరు తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ఇళ్ల మీద నుంచి నీళ్ళు వెళ్తుంటే కేసీఆర్ ఏం చేశారు? ఏపీలో అమలు చేసినన్నీ సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చెయ్యగలిగారా? కేసీఆర్ ఎన్నికల కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం మాట్లాడుకోండి. కానీ మా రాష్ట్రాన్ని విమర్శించడం హాస్యాస్పదం. ఆంధ్రాలో ఉన్న సన్న బియ్యం తెలంగాణకు తీసుకెళ్లడం లేదా..?’ అంటూ కేసీఆర్‌ను మంత్రి కారుమూరి ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబు కోసమే పురంధేశ్వరి పనిచేస్తోంది’ -
ఓటు వేసిన వారికి, వేయని వారికి సంక్షేమ పథకాలు అందించాం: కారుమూరి
-
చంద్రబాబు జీవితం మొత్తం స్కాములే.. కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్
-
‘మీకు 2 ఎకరాల నుంచి లక్షల కోట్లు ఎలా వచ్చాయ్’
సాక్షి, ఏలూరు: తమ సొమ్ము దోచుకున్నాడు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు నీతిమంతుడు, ఎవరి సొమ్ము తినలేదని దుర్గమ్మదగ్గర భువనేశ్వరి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు మంత్రి కారుమూరి అసలు 2 ఎకరాల నుంచి లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చాయ్ అని ప్రశ్నించారు. సైకిల్ ఎక్కి సవారికి అద్దె కొడుకును తెచ్చుకున్నారు మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని లాగేసుకున్న చంద్రబాబు సైకిల్ ఎక్కాడని, ఇప్పుడు దానిపై సవారీకి అద్దె కొడుకును తెచ్చుకున్నాడని ఎంపీ కోటగరి శ్రీధర్ మండిపడ్డారు. ఏపీలో పేదల ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ వైఎస్సార్సీపీనని, రాష్ట్రంలో పేదవారు, బలహీన వర్గాల వారు ఉండకూడదంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలన్నారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా లోకేష్ పైకి లేవడు చంద్రబాబుకు సొంత కొడుకు పని చేయడం లేదని ఎద్దేవా చేశారు ఎంపీ భరత్. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్న ఎంపీ భరత్.. లోకేష్‌ను ఎన్ని జాకీలు పెట్టి లేపినా పైకి లేవడన్నారు. పవన్.. నేడు, రేపు మాట్లాడే మాటలకు పొంతన ఉండదన్నారు ఎంపీ భరత్. బాబు పింఛన్ రూ. 5 వేలు ఇస్తానంటాడు.. అది ఇచ్చేది వారి కార్యకర్తలకేనని విమర్శించారు. ఏపీలో మరో 30 ఏళ్లు వైఎస్‌జగనే సీఎం అని స్పష్టం చేశారు భరత్. వై నాట్ 175 నినాదం సీఎం జగన్ ఆత్మవిశ్వాసానికి నిదర్శమన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి దేశంలో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయన్నారు మంత్రి విశ్వరూప్. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఏపీలాగే పింఛన్ పెంచుకుంటూ పోతామనే విషయమే ఇందుకు నిదర్శనమన్నారు. 6 నెల్లలోనే లక్షా 40 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌దన్నారు మంత్రి విశ్వరూప్. పేదలకు పింఛన్ పెంచలేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. -
‘మీరు మాత్రం సినిమాలు ఆపరు.. హెరిటేజ్ మూయరు’
సాక్షి, విశాఖ: చంద్రబాబు కోసం ప్రజలు ఎందుకు రోడ్లు మీదకు వచ్చి నిరసన తెలపాలని ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈరోజు(గురువారం) విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కారుమూరి.. ‘చంద్రబాబు కోసం బాలయ్య సినిమాను ఎందుకు ఆపలేరు. చంద్రబాబు బాధలో ఉంటే ఎందకు సినిమా రిలీజ్ చేశారు. హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు. హెరిటేజ్‌కు లాభాలు వచ్చాయని ఇప్పటికే సంస్థ ప్రకటించింది.బాబు కోసం హెరిటేజ్ ముయారు, బాలయ్య సినిమాలు ఆపరు. చంద్రబాబు కోసం బాలయ్య సినిమాను ఎందుకు ఆపలేదు?, చంద్రబాబు బాధలో ఉంటే ఎందుకు సినిమా రిలీజ్ చేశారు. హెరిటేజ్‌ను ఎందుకు మూయ్యలేదు. ప్రజలు మాత్రం బాబు కోసం నిరసనలు చేయాలా?, బీసీలు బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్. బీసీల గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్. లక్ష 11 వేల కోట్ల రూపాయలు బీసీలకు ఖాతాల్లో వేశారు. రాష్ట్రంలో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గింది. ఈ లెక్కలు చెప్తున్నది నీతి అయోగ్. బాబు హయాంలో బీసీలను మోసం చేశారు. జగన్ హయాంలో స్కీం లు, బాబు హయాంలో స్కామ్‌లు. బాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో గొడవలు ఏమిటి?, బాబు కేజీ పెరిగితే 5 కేజీలు బరువు తగ్గరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే. సీఎం జగన్ కు వ్యతరేక ఓటు ఎక్కడుంది. చీలనివ్వను అని పవన్ అనడానికి. సీఎం జగన్ పాలనలో జరిగిన మంచిని బస్సు యాత్ర ద్వారా వివరిస్తాం. చంద్రబాబు బాధలో ఉంటే ఎందుకు సినిమా రిలీజ్ చేశారు?, హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు’ అని నిలదీశారు. -
బాబు హయాంలో బీసీలకు అన్యాయం చేశారు: కారుమూరి నాగేశ్వరరావు
-
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేను మంత్రిని అయ్యాను..
-
అసెంబ్లీలో చర్చకు రాకుండా టీడీపీ పారిపోతోంది
-
చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకుల కామెంట్స్
-
‘టీడీపీ బంద్ అన్నారు.. హెరిటేజ్ కూడా మూసివేయలేదు’
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. కానీ, బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీంతో, టీడీపీ బంద్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందిస్తూ సెటైరికల్ పంచ్ వేశారు. కనీసం, చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూయలేదని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ కూడా మూయలేదు.. కాగా, మంత్రి కారుమూరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ బంద్ గురించి కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలు ఎవరి పనులు వారు చేసుకున్నారు. అచ్చెన్నాయుడు ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూయలేదు. ఎవరూ కనీస సానుభూతి కూడా చూపించలేదు. చంద్రబాబు అవినీతిపరుడు కాదు అని నారా లోకేశ్ కూడా చెప్పలేడు. ఎన్టీఆర్ కుటుంబం కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎందకు చెప్పలేరు. అలాంటి అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు. స్టేలు తెచ్చుకోవడమే బాబు, లోకేశ్‌కు తెలుసు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చాకే అనేక సంక్షేమ పథకాలతో పేదలకు మేలు చేస్తున్నారు. సీఎం జగన్ హయాంలో ఏపీలో పేదరికం బాగా తగ్గింది. చంద్రబాబు అవినీతిపరుడని ప్రధాని మోదీ సైతం చెప్పారు. దాచుకో, దోచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన సాగింది. చంద్రబాబు, నారా లోకేశ్‌ల అవినీతి మీద కేసులు వేస్తే వారు స్టేలు తెచ్చుకున్నారు. వీటిని విచారణకు సహకరించి.. వారు ప్రజల వద్దకు రావాలని సూచించారు. స్కిల్ స్కాం జరిగినట్టు ఎల్లో బ్యాచ్ ఒప్పుకుంటోంది! మరోవైపు.. చంద్రబాబు స్కిల్ స్కాంపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కూడా స్పందించారు. రాజమండ్రితో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో అవినీతి జరగలేదని టీడీపీ నాయకులు ఎందుకు చెప్పడం లేదు. స్కిల్ కుంభకోణంలో లేమనే చెబుతున్నారు కానీ.. స్కాం జరిగిందని టీడీపీ నేతలు చెప్పుకోవడం లేదు. పోలవరం, అమరావతి స్కామ్‌లు.. ఏపీలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అత్యంత సెక్యూరిటీ ఉంది. చంద్రబాబుకు వీవీఐపీ కంటే అత్యంత సెక్యూరిటీ కల్పించామని జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే నివేదిక ఇచ్చారు. చంద్రబాబుకు హౌస్ కస్టడీ దేనికి. ఇవన్నీ జైలు నుంచి బయటకు వచ్చేందుకే చేసే ప్రయత్నాలు మాత్రమే. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించడం సరికాదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జీఎస్టీ ఇచ్చిన నోటీసు వల్ల బయటపడింది. స్కిల్ స్కామ్ మాత్రమే కాదు.. పోలవరం, అమరావతి భూముల స్కాములు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చంద్రబాబుకు కావాల్సిన ప్రతీ సౌకర్యాన్ని కల్పించింది. పవన్ చీకటి ఒప్పందం.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌కు చీకటి ఒప్పందం ఉంది. అది ప్యాకేజీ ఒప్పందం. టీడీపీ నేతలు ఏపీలో బంద్ పేరు చెప్పి షాపులను మూసివేయాలని బ్రతిమాలుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ కరెక్ట్ కావడం వల్లనే ప్రజలు అంగీకరించారు. బంద్‌ను తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
నిన్నటి టీడీపీ బంద్‌కు ప్రజలెవరూ సహకరించ లేదు: మంత్రి కారుమూరి
-
చంద్రబాబు అవినీతిపై ఎల్లో మీడియా మాట్లాడడం లేదు: కారుమూరి
-
‘యువగళం ముసుగులో ఉన్నది రౌడీ షీటర్లే’
తణుకు: భీమవరంలో దాడులకు ఉసిగొల్పిన నారా లోకేష్‌పై కేసు పెట్టాలంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. అసాంఘిక శక్తులను తన చుట్టూ పెట్టుకుని లోకేష్ దాడులకు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కారుమూరి. తణుకు పట్టణంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన ప్రెస్మీట్లో చంద్రబాబు, నారా లోకేశ్‌ల అరాచకాల్ని ఎండగట్టారు. ‘ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్లో.. ప్రజలపైనే తండ్రీకొడుకుల దాడులు. ప్రశాంతమైన భీమవరంలో ఇలాంటి విధ్వంసమా..?, తండ్రి పుంగనూరులో...తనయుడు భీమవరంలో..!, దౌర్జన్యాలు, దాడులకు దిగుతుంటే చూస్తూ ఊరుకోవాలా?, ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. యువగళం ముసుగులో ఉన్న ఎర్రదండు- రౌడీషీటర్లే.నీ పాదయాత్ర ద్వారా ఏం సందేశం ఇస్తున్నావ్ లోకేశ్..?, రెచ్చగొట్టి ప్రజలపై, పోలీసులపై దాడులు చేయిస్తావా..? ,లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే విధంగానే ఉంది. మా పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా?, సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి కుట్రలకు తెరలేపుతున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంకా ఏం మాట్లాడారంటే: వ్యూహాత్మకంగా విధ్వంసానికి కుట్ర నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాడు. యువగళం వాలంటీర్ల ముసుగులో ఎర్రదండు పేరుతో.. రౌడీషీటర్లు భీమవరంలో విధ్వంసం సృష్టించారు. వ్యూహాత్మకంగా కర్రలు, రాడ్లతో గొడవలు సృష్టిస్తున్నారు. నూజివీడు, నిడపనీడులోనూ ఇలానే దాడులకు పాల్పడితే వారిని అరెస్ట్ చేశారు. భీమవరంలోకి ఆయన పాదయాత్ర రాగానే మరిన్ని గొడవలకు రూపకల్పన చేశారు. అక్కడ మా పార్టీ పెట్టిన ఫ్లెక్సీలను చించివేసి, కావాలని వివాదాలు సృష్టించాడు. స్థానిక ఎమ్మెల్యే..టీడీపీవారు చింపిన ప్లెక్సీ స్థానంలోనే మరొక ప్లెక్సీ కూడా పెట్టుకున్నాడు. లోకేశ్ తన ప్రసంగంలో దుర్భాషలాడుతూ, స్థానిక ఎమ్మెల్యేపై బూతులు తిడుతూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు. అతను అసలు చదువుకున్నాడో లేదో కూడా అర్ధం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు. అతనే ఆ ఫ్లెక్సీలను చూపించుకుంటూ తన పక్కన ఉన్న వాలంటీర్లను రెచ్చగొట్టాడు. రెడ్ బనియన్లు వేసుకున్న వారు యువగళం వాలంటీర్ల ముసుగులో ఉన్నవారంతా రౌడీలే. కర్రలు, రాళ్లతో ప్రజలన భ్రయబ్రాంతులకు గురిచేశారు. భీమవరంలో ఇళ్లలోకి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మొదటి నుంచీ లోకేష్ ధోరణి అదే..: లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. మీరెన్ని కేసులు పెట్టించుకుంటే అంతటి పెద్ద పదవులు ఇస్తానంటూ ఆ పార్టీ కార్యకర్తలకు లోకేశ్ బహిరంగంగానే ఆఫర్ ఇస్తూ వస్తున్నాడు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ రెచ్చి పోతూ, దాడులు చేస్తూ, దౌర్జన్యంగా స్వైరవిహారం చేశారు. పోలీసులను కూడా గాయపరిచారు. వారిలో ఐదారు మంది గాయపడితే ఒకరికి సీరియస్‌గా ఉంది. మొన్న తండ్రి పుంగనూరులో...నేడు తనయుడు భీమవరంలో విధ్వంస కాండ సృష్టించారు. అసలు మీ యాత్ర ఉద్దేశం ఏంటి..? రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? తండ్రీ కొడుకులు ఇద్దరూ ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఐటీ నోటీసులతో మీరు దొరికిపోయారు. మీరు దోపిడీ చేసిన డబ్బు ఎలా తీసుకువచ్చారో స్పష్టంగా లెక్కలతో సహా బయటపడింది. టిడ్కో ఇళ్ల పేరుమీద వందలాది కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి డొల్ల కంపెనీల ద్వారా తెప్పించుకున్న తీరు కూడా బయట పడింది. నేరుగా ఐటీ శాఖ నోటీసులు పంపితే.. దానిలో రూ.118 కోట్లు చంద్రబాబుకు ముడుపులు అందాయని తేల్చింది. లోకేశ్‌కు కూడా ఆ స్కాంలో భాగస్వామ్యం ఉందని తెలిసే సరికి ప్రజలను భయబ్రాంతులను చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇతనేదో పెద్ద పోటుగాడిలా ఫ్లెక్సీలను చూపిస్తూ దాడికి ఉసిగొల్పాడు. మీ నైజం, మీ పార్టీ నైజం ఇదేనని ప్రజలకు చెప్తున్నారా?: ఇలాంటి దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేసి ప్రజల మన్ననలు పొందాలనుకుంటున్నారా..? మీ నైజం, మీ పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా? ఈ రోజు 50 మందిని అరెస్టు చేశారు. ప్రతి ఒక్కరూ మీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నారు. సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి...ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసిన వాగ్ధానాలన్నీ చెత్తబుట్టలో పడేశాడు. మళ్లీ ఎన్నికలు రాగానే కల్లబోల్లి మాటలు చెప్తూ లబ్ధిపొందాలని చూస్తూనే ఉంటాడు. గత ఎన్నికల్లో 650 వాగ్ధానాలు చేసి తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు. జగన్ గారి నాయకత్వంలో.. మన రాష్ట్ర జీఎస్డీపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర ప్రగతిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన నాయకుడు జగన్ గారు. మీరెన్ని యాత్రలు చేసినా జగన్ గారిలా ఒక్క మంచి పథకం పేరు చెప్పగలిగే సత్తా మీకు లేదు. జగన్ పెట్టిన పథకాలు నేను చేయలేకపోయాను అని ప్రజలకు చెప్పలేక ఇవన్నీ చేస్తున్నాడు. విద్య, ఆరోగ్య రంగాలను మరింతగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. సంక్షేమ పథకాలతో నిన్నటి వరకూ పప్పు బెల్లాల్లా పంచేస్తున్నాడు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న ఇదే పెద్ద మనిషి... ఇప్పుడు అవే స్కీంలు పెంచి ఇస్తానంటూ ముందుకు వస్తున్నాడు. చిన్నవాడైన ఇన్ని కార్యక్రమాలు క్యాలెండర్ పెట్టి మరీ పంపిణీ చేస్తున్నాడని బాబుకు అక్కసుగా ఉంది. ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్ ను తండ్రీ కొడుకులు ప్రజల మీద చూపిస్తున్నారు. ఈ దుర్మార్గాలు ఇక సాగవు. మీ నాన్న, మీ తాతను వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు మీరిద్దరూ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారు. ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. అసలు మీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు ఎందుకొచ్చాయి..? ఫ్లెక్సీలను చింపి తగలబెట్టిస్తారా..? ఇక సహించే ప్రసక్తే ఉండదు...పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తారు. అలాంటి జిల్లాలో మీరు అలజడులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. మీరు వేరే ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి దాడులు చేయిస్తే సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.. టీడీపీ దాడులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడ్డ వారిమీద, ప్రోత్సహించిన వారిపైన కూడా కేసులు పెట్టాలి. వాళ్లంతా యువగళం పేరుతో రెడ్ టీషర్టులు వేసుకున్న రౌడీషీటర్లు. తనతో పాటు అసాంఘిక శక్తులను తిప్పుకుంటూ ఇలాంటి చర్యలకు లోకేష్ పాల్పడుతున్నాడు -
‘చంద్రబాబు గురించి ఢిల్లీ పెద్దలకు అంతా తెలుసు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడినా రామోజీరావుకు చాలా బాగుంటుంది. కానీ, మేము చేసి ఏ మంచి పనిచేసినా రామోజీకి వినపడదు, కనపడదు. గత ప్రభుత్వం ఏం చేసింది.. మేము ఏం చేస్తున్నది ఒక లిస్టు పెట్టుకుని రామోజీ చూడాలని చురకలు అంటించారు. కేంద్రం ఓకే చెప్పింది.. కాగా, మంత్రి కారుమూరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ప్రజలకు కందిపప్పు కూడా ఇవ్వలేదు. ఆ సంగతి రామోజీకి కనపడుదు, వినపడదు. మా ప్రభుత్వంలో కంది పప్పు ధర రూ.150 మార్కెట్లో ఉంటే మేము రూ.80కే సబ్సిడీ ఇచ్చాం. నాలుగేళ్లలో మూడు లక్షల టన్నుల కందిపప్పు అందించాం. కేంద్రం పుచ్చిపోయిన కందులు ఇస్తామంటే మేము వద్దన్నాం. దానికి బదులుగా శనగలు ఇస్తామని చెప్పింది. అవి కూడా వద్దని, కంది పప్పు మాత్రమే కావాలని అడిగాం. దానికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. త్వరలో అవి రాగానే ప్రజలకు పంపిణీ చేస్తాం. ఐటీ నోటీసులు రామోజీకి కనిపించవా? ఇలా అసలు సంగతి రాయకుండా రామోజీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఏం మాట్లాడినా రామోజీకి చాలా బాగుంటుంది. కానీ, మేము ఏం చేసినా రామోజీకి కనిపించదు. చంద్రబాబు పాలనలో ఇసుక దోచుకున్నారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచేసినప్పుడు రామోజీకి ఎందుకు కనపడలేదు. వనజాక్షి ఇసుక రావాణ అడ్డుకుంటే ఆమెకు దారుణంగా కొట్టారు. పైగా చింతమనేనితో రాజీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు. మా ప్రభుత్వం పారదర్శకంగా అందరికీ ఒకే రేటుతో ఇసుక అందిస్తోంది. రామోజీ చేసిన అక్రమాల గురించి ఆయన తోడల్లుడే వివరించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వస్తే ఎందుకు నోరు విప్పలేదు?. నీతి, నిజాయితీ అని చెప్పే చంద్రబాబు రూ.118కోట్లు దోచేసినట్టు ఐటీ శాఖ తేల్చింది. దీనిపై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడటం లేదు?. ప్రతీ కేసులో స్టే తెచ్చుకుని బ్రతకడం చంద్రబాబు పని. ఆయన వ్యవహారం ఢిల్లీ పెద్దలకు తెలుసు కాబట్టే వారు దరిచేరనీయడం లేదు. చంద్రబాబు అంతటి నయవంచకుడు, దుర్మార్గుడు మరెవరూ లేరు. ఈ మాట ఎన్టీఆర్ అనేకసార్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేదలు కూడా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. చంద్రబాబు ఎవరో ఒకరి సపోర్టుతో ఎన్నికలకు వెళ్లడం తప్ప సొంతంగా వెళ్లలేరు అని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: జమీలి ఎన్నికలపై సీఎం జగన్‌దే తుది నిర్ణయం: మంత్రి అమర్నాథ్ -
నారా లోకేశ్‌పై మంత్రి కారుమూరి సెటైర్లు
సాక్షి, రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పొలిటికల్ సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా సాధించిందేమీ లేదన్నారు. చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. కాగా, మంత్రి కారుమూరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లను సృష్టించింది చంద్రబాబు. గత ప్రభుత్వంలో పందికొక్కుల్లా ఇసుకను తిన్నది టీడీపీ నేతలే. చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. దేశంలోనే జీడీపీలో మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది. టీడీపీ కార్యకర్తలను కేసులు పెట్టించుకోమనడం లోకేశ్ తెలివికి నిదర్శనం అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. పౌరసరఫరాల శాఖలో అవినీతి లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. పెట్రోల్ బంకుల్లో కల్తీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. పెట్రోల్ కల్తీ చేస్తున్న బంకులను సీజ్ చేశాం. కొన్ని బంగారు షాపులో కూడా తనిఖీలు నిర్వహించాం. ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు నిర్వహించి 131 కేసులు నమోదు చేశాం. ప్రజలకు నష్టం జరగకూడదనే ప్రధాన ఉద్దేశంతో ఈ దాడులు కొనసాగిస్తున్నాం. వంట నూనెల్లో కూడా కల్తీ, లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తంగా 1,126 కేసులు నమోదు చేశాం. రేషన్ బియ్యంలో విటమిన్లతో కూడిన పోషకాలను కలుపుతున్నాం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘చంద్రబాబును.. పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదు’ -
మమ్మల్ని విమర్శించే ఏ పార్టీ నేతలకైనా ప్రజల వద్దకు వెళ్లే దమ్ముందా: కారుమూరి
-
విధ్వంసకాండకు బాబే బాధ్యుడు
సాక్షి, అమరావతి : ప్రాజెక్టుల యాత్ర పేరుతో బయల్దేరిన చంద్రబాబు దురుద్దేశంతోనే రూటు మార్చుకుని శుక్రవారం పుంగనూరు బైపాస్ రోడ్డు వద్ద జరిగిన విధ్వంసానికి కారకుడయ్యారని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పక్కాప్లాన్ ప్రకారమే వివిధ జిల్లాల నుంచి టీడీపీ గూండాలను రప్పించి బాబు ఆ విధ్వంసం సృష్టించారన్నారు. పోలీసులను తరమండి అని చంద్రబాబు ప్రోత్సహించడం, వారిపై రాళ్లు రువ్వడం, వ్యాన్లను తగులబెట్టడం ఇలా దగ్గరుండి మరీ పుంగనూరులో విధ్వంసకాండను సృష్టించాడని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పార్టీ శ్రేణులను పోలీసులపైకి ఉసిగొల్పడం ఎంతవరకు సబబు? ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు? రాష్ట్రంలో ఎవరైనా నిరసన చెయ్యొచ్చు కానీ విధ్వంసంచేసే హక్కు ఎవరికీ లేదన్న విషయం ఆయనకు తెలీదా? అందుకే ఆ ఘటనకు బాబే బాధ్యత వహించాలి. కుప్పం కోట కూలిపోతోందనే పెద్దిరెడ్డిపై బాబుకు అక్కసు. అందుకే, దాడులకు ఉసిగొల్పారు.. పోలీసుల్ని కర్రలతో కొట్టారు.. రాళ్లురువ్వి, వాహనాల్ని తగులబెట్టారు. జనశ్రేణుల్ని పవన్ రెచ్చగొడుతున్నారు.. మరోవైపు.. వారాహి వాహనం ఎక్కి పవన్‌కళ్యాణ్ బూతు పురాణంతో జనసేన కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఆయన తన దత్తతండ్రి బాబు కోసమే పనిచేస్తున్నారు. మా నాన్న పోలీసు కానిస్టేబుల్ అంటూ పవన్ గొప్పగా చెప్పుకుంటారు. మరి, పుంగనూరులో పోలీసులకు దెబ్బలు తగిలితే ఆయనెందుకు స్పందించలేదు? ఇక కేసులు ఉంటేనే పదవులిస్తామని లోకేశ్ పిలుపునిస్తున్నారు.. అందుకే టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ప్రాణత్యాగానికి సిద్ధం కావాలని పవన్ పిలుపునివ్వటం చూస్తున్నాం. వీరి కుళ్లు రాజకీయాల్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. చంద్రబాబు కుటిల బుద్ధిని ప్రజలు గమనించారు. 2024లో టీడీపీ ఆఫీస్‌కు తాళమే. విధ్వంసంపై విచారణ జరగాల్సిందే.. పుంగనూరు ఘటనపై కచ్చితంగా విచారణ జరగాల్సిందే. కార్యకర్తలు, యువతను రెచ్చగొడుతున్న చంద్రబాబు, పవన్, లోకేశ్ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? రాజకీయాల్లో బాబు అంత నీతిమాలినోడు ఎవడూ ఉండరు. మేనిఫెస్టో పేరుతో 650 హామీలిచ్చి, ఏవీ అమలుచేయకుండా, చివరకు పార్టీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే తొలగించిన చరిత్ర చంద్రబాబుది. అదే సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నారు. అదే బాబు, జగన్‌కి ఉన్న తేడా. ఇక సౌమ్యుడిగా పేరున్న, ఎప్పుడూ దీక్షలో ఉండే మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత హేయం. ఆయన రోజురోజుకీ గతి తప్పి వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఆయన పుత్రుడు, దత్తపుత్రుడు నడుస్తున్నారు. అందుకే ప్రజలే ఆ ముగ్గుర్నీ 2024 ఎన్నికల్లో తరిమికొడతారు. -
‘కానిస్టేబుల్ కొడుకువే కదా.. పోలీసులు గాయపడితే ఎందుకు మాట్లాడలేదు పవన్’
సాక్షి, తాడేపల్లి: పుంగనూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. బందిపోటు ముఠా మాదిరిగా చంద్రబాబు వ్యవహరించారని ఫైరయ్యారు. ఎన్నికల్లో ఏం చెప్పాల్లో తెలియక ఇలా అలజడులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కారుమూరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించారు. ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని రప్పించి వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం చంద్రబాబు ఎందుకు వెళ్లలేదు?. బ్లాక్ క్యాట్ కమాండోలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఏం చెప్పాలో తెలియకే ఇలా అలజడులు సృష్టిస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం గూండాలను అక్కడికి రప్పించారు. పెద్దిరెడ్డి హీరో.. వైఎస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్క హీరో. కుప్పంలో చంద్రబాబునే కుప్పకూల్చి కింద కూర్చోబెట్టారు. స్థానిక సంస్థల్లో అన్ని స్థానాల్లో ఓడించారనే ఈర్ష్యతోనే పెద్దిరెడ్డిపై చంద్రబాబు కుట్ర పన్నారు. చంద్రబాబు వ్యవహారంపై విచారణ జరపాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని ఓర్వలేకనే చంద్రబాబు గొడవలు సృష్టించి లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నారు. పవన్ ఎందుకు స్పందించలేదు? తాను కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకునే పవన్ కల్యాణ్.. నిన్న అంతమంది పోలీసులు గాయపడితే ఎందుకు మాట్లాడలేదు?. దత్త తండ్రి గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నావ్?. పిల్లల్ని రెచ్చగొట్టి గొడవలు చేయినే వారి భవిష్యత్ ఏంటి?. వారి కుటుంబాల గురించి ఆలోచించరా?. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవులు ఇస్తామని లోకేశ్ అంటున్నారు. యువత భవిష్యత్‌ను నాశనం చేయాలనుకుంటున్నారా?. జడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉండి జనాన్ని రెచ్చగొట్టడమేంటి?. నిన్నటి రోజు బ్లాక్ డే. ఏం సాధించారని గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇస్తారు?. గవర్నర్‌కు అన్ని వాస్తవాలు తెలుసు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లపై విచారణ జరపాలి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధశ్వేరి వాస్తవాలను మభ్యపెట్టి మాట్లాడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబువి పాతతరం పాలిటిక్స్: ఎంపీ భరత్ పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడులు చేయించడం అమానుషమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు తగిన గుణాపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎంపీ భరత్ శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ శ్రేణులు ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడులు చేసినట్టు కనిపిస్తోంది. అనుమతి ఉంటే వారిని పోలీసులు ఎక్కడా ఆపరు. యువతను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు భావించారు. చంద్రబాబువి పాతతరం రాజకీయాలు. ఆయన చిప్ అప్డేట్ కావాలి. తనను తాను రాజ్యాంగేతర శక్తిగా చంద్రబాబు భావిస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు భాష బాగాలేదు సాక్షి, ఢిల్లీ: పుంగనూరు ఘటనలో బాధ్యులను శిక్షించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. కాగా, శ్రీనివాస రావు శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భాష బాగాలేదు. పుంగనూరు దాడి ఘటనలో బాధ్యులను శిక్షించాలి. బీజేపీ తరఫున జనసేన ఏజెంట్‌గా పనిచేస్తోంది. బీజేపీ, టీడీపీ కలిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. పోలవరంపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: ‘పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటే..’ -
దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాం
-
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటాం: మంత్రి కారుమూరి
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికలు ముందు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ.. అన్ని ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధించాం. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన’’ అని మంత్రి స్పష్టం చేశారు. ‘‘గత చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను దివాలా తీయించింది. 20 వేల కోట్ల అప్పులు చేసింది. వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారు. ఆ అప్పులన్నీ మేము తీర్చి శాఖను మళ్లీ గాడిలో పెట్టాం. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చాం. కోటి 46 లక్షల మందికి మేము రేషన్ ఇస్తున్నాం. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చాం.. వాటికి కేంద్రం సాయం చేయాలని కోరాం. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసింది’’ అని మంత్రి కారుమూరి అన్నారు. చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు భారీ షాక్... -
అందరికీ ఆమోదయోగ్యంగా ‘పీఆర్సీ’పై నిర్ణయం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వీరు విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం భేటీ అయ్యారు. సంఘాల ప్రతినిధులు పే రివిజన్‌పై ఉద్యోగుల డిమాండ్లను మంత్రులకు వివరించారు. ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తూ సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేయాలని కోరారు. జెన్కో ఉద్యోగులకు అలవెన్స్‌లు, ఇతర అలవెన్స్‌లను యథాతథంగా కొనసాగించాలని, వెయిటేజీతో పాటు ఫిట్మెంట్లను అలానే ఉంచాలని, అలాకాని పక్షంలో అధిక ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలిస్తోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని, వారం రోజుల్లో మరోసారి ఉద్యోగసంఘాల ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే వన్ మెన్ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో దానిని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్, ట్రాన్స్ కో విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
చెప్పుడు మాటలతో తప్పుడు ఆరోపణలా?
సాక్షి, అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు. చెప్పుడు మాటలు విని తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు సాహసించడం మంచిది కాదని హితవు పలికారు. ఈ ప్రయత్నాలు బెడిసికొడతాయని బీజేపీని హెచ్చరించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలనపై ఒకవైపు మీరే కితాబులిస్తూ అవినీతి అని ఎలా మాట్లాడతారని అభ్యంతరం తెలిపారు. గతంలో అమిత్‌షా తిరుపతి వచ్చినప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లు విసిరి తరిమేశారని గుర్తు చేశారు. ప్రధాని మోదీని నోటికొచ్చినట్లు దూషించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ‘మోదీకి భార్యా పిల్లల్లేరు. మోదీ రూ.2 లక్షల కోట్ల ఆస్తిపరుడు‘ అని విమర్శించిన చంద్రబాబు యూటర్న్ తీసుకుని బీజేపీ జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి పెద్ద స్కామ్ అని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది బీజేపీ కాదా? అని సూటిగా ప్రశ్నించారు. అమిత్‌షా నోట విభజన హామీల ప్రస్తావనేది? ‘ఐదేళ్ల టీడీపీ హయాంలో ఇసుక దందాలు అంతా ఇంతా కాదు. ఇందులో నాటి మిత్రపక్షమైన బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉంటుంది కదా? రాష్ట్ర ఖజానాకు ఎలాంటి ఆదాయం రాలేదు. ఇప్పుడు ఇసుకపై రూ.వేల కోట్ల ఆదాయాన్ని ఖజానాకు జమ చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచాం. రూ.2.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పారదర్శకంగా అందచేస్తే ఇక అవినీతి జరిగిందెక్కడ?’ అని మంత్రి కారుమూరి ప్రశ్నించారు. అందరి కళ్ల ముందే జరిగిన అమరావతి భూముల కుంభకోణాన్ని వదిలేసి విశాఖలో భూ దోపిడీకి పాల్పడ్డారనే నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. ‘అమిత్‌షా నోట విభజన హామీల ప్రస్తావనేది?’ అని ప్రశ్నించారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కనీసం ప్రస్తావించలేదు. విశాఖ రైల్వేజోన్ గురించి మాట్లాడలేదు. విశాఖ మైట్రోలైన్ ఊసే లేదు. తగుదునమ్మా అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు మాత్రం సిద్ధపడ్డారు. ఆ వేదికపై ఉన్న వారంతా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారే. అలాంటి వారు చెప్పే చాడీలు విని సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? వాస్తవాల్ని తెలుసుకుని మాట్లాడాలి’ అని కారుమూరి సూచించారు. సీఎం జగన్ నేతృత్వంలో సింగిల్‌గా పోటీకి దిగి 175 స్థానాలనూ గెలిచి తీరతామని ధీమా వ్యక్తంచేశారు. చదవండి: బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
అమిత్ షా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి: మంత్రి కారుమూరి
సాక్షి, తాడేపల్లి: విశాఖలో కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. టీడీపీ నేతలు చెప్పిన మాటలనే అమిత్ షా మాట్లాడారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కారుమూరి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘విశాఖ రైల్వే జోన్, స్టీల్‌ప్లాంట్‌పై అమిత్ షా ఎందుకు మాట్లాడలేదు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా టీడీపీ నేతలు విమర్శించలేదా?. అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేయించలేదా?. బీజేపీ సభా వేదికపై ఉన్నవారంతా ఎవరు?.. టీడీపీ నేతలు కాదా?. అమిత్ షా మాటలు విడ్డూరంగా ఉన్నాయి. అమిత్ షా వ్యాఖ్యలన్నీ అవాస్తవాలే. టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఎప్పుడైనా మాట్లాడారా?. టీడీపీ చెప్పుడు మాటలనే అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో చెబితే మాట్లాడేసి వెళ్లిపోవడం సరికాదు. పచ్చి అబద్దాలతో రాజకీయపబ్బం గడుపుకునేది టీడీపీనే. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా సీఎం జగన్ పరిపాలన సాగుతోంది’ అని స్పష్టం చేశారు. అమిత్‌షా నోట రాష్ట్ర అవసరాల ప్రస్తావనేది..? బీజేపీ అగ్రనేతల మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అమిత్‌షా సభకు స్పందన లేదంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేస్తుందనేది మనమందరం అర్థం చేసుకోవాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను అన్నివర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నిన్న బీజేపీ నేతల మాటల్లో ఆ విషయం గురించి కనీస ప్రస్తావన తేలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెబితే మేం చాలా సంతోషించే వాళ్లం. అదేవిధంగా వారి మాటల్లో విశాఖ రైల్వేజోన్ గురించి పల్లెత్తు ప్రస్తావన తేలేదు. విశాఖ మైట్రోలైన్ ఊసే వినిపించలేదు. తగుదునమ్మా అంటూ.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు మాత్రం వారు సిద్ధపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పచ్చమీడియా వారికి చప్పట్లు కొట్టారు. బీజేపీ నేతలకు వత్తాసు పలికే వారిని, ఎల్లో మీడియాను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా వద్దా..? విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను రద్దు చేయనవసరంలేదా..? విశాఖ రైల్వేజోన్‌తో పాటు విశాఖ మెట్రో లైన్ అవసరం లేదనుకుంటున్నారా..? ఈ ప్రశ్నలకు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలతో పాటు పచ్చమీడియా కూడా సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిపై కేంద్రమే కితాబిచ్చింది వాస్తవంకాదా..? ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలపై దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు, ఇక్కడి పథకాలను శెభాష్ అని మెచ్చుకుంటున్నారు. ఆంధ్రరాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను ఆయా రాష్ట్రాలవారు ఆదర్శంగా తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతెందుకు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి కేంద్రప్రభుత్వం నుంచి కూడా కితాబులిస్తున్నారు కదా..? ఆంధ్రరాష్ట్రం జీడీపీలో నెంబర్ వన్‌స్థానం అని మీరే చెప్పారు. విద్యా రంగంలో కూడా మూడోస్థానానికి వచ్చిందని కేంద్రంమే చెబుతుంది. ఇలా అనేకరంగాల్లో ముందంజలో ఉన్నామని చెబుతూనే.. మరోపక్కన అవినీతి అని ఏ ఆధారాలతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. రూ. 2.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇస్తే.. అవినీతి జరిగిందెక్కడ...? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తోన్న నాయకుడు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని సమర్ధంగా అమలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి. జగన్ గారు అధికార బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి ఇప్పటివరకు అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి డీబీటీ ద్వారా రూ.2.16 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమచేయడం జరిగింది. ఇందులో ఏం అవినీతి జరిగిందని బీజేపీ నేతలు మాట్లాడతారు..? బాబు రాళ్ళు వేయించింది మరిచారా షా..? ఈ సందర్భంగా నేనొక విషయాన్ని గుర్తుచేస్తున్నాను. అమిత్‌షా తిరుపతికి వచ్చినప్పుడు ఇదే టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిసి ఆయనపై రాళ్లు విసిరి తరిమేస్తే.. మీకు కోపం రాలేదు. మీకు సిగ్గులేకపోతే.. మాకేమీ అభ్యంతరంలేదు. అదేవిధంగా ప్రధాని మోదీని ఉద్దేశించి గతంలో చంద్రబాబు ఏమన్నారో తెలుసుకదా..? "మోదీకి భార్యా పిల్లల్లేరు..నాకు మాత్రం భార్య, కొడుకు, కోడలు, మనువడు ఉన్నాడు.. మోదీ బ్రహ్మచారి. ఏమీ లేనోడు. నాకుమాత్రం అన్నీ ఉన్నాయని చంద్రబాబు పలికాడు. పైగా, మోదీ అనే వ్యక్తి రూ.2లక్షల కోట్లు ఆస్తిపరుడని" ఇదే చంద్రబాబు అన్నాడు. ఇప్పుడేమో యూటర్న్ తీసుకుని బీజేపీ జపం చేస్తున్నాడు. అసలు, నిన్న అమిత్‌షా మాట్లాడిన వేదికపై ఎవరున్నారో అందరూ చూశారు కదా.. అందరూ టీడీపీ కండువా స్థానంలో బీజేపీ కండువా కప్పుకున్నవారే కదా.. సృజనా చౌదరి, గరికపాటి రామ్మోహనరావు, పురంధేశ్వరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్ ఉన్నారు. వీరందరు ఎవరు..? ఒకప్పటి టీడీపీ నేతలే కదా..? మనసు ఒకచోట మనిషి ఒఒకచోట ఉన్నట్లు.. టీడీపీ మనుషులుగా మాత్రమే వీరంతా బీజేపీ సభావేదికపై కూర్చొంటే.. మనసంతా చంద్రబాబుపై ఉందనడం వాస్తవం. ఇలాంటోళ్లు చెప్పే చాడీలు విని మీరు మాట్లాడతారా..? వాస్తవాల్ని తెలుసుకుని మాట్లాడాలని బీజేపీ నేతలకు నేను హితవు పలుకుతున్నాను. 40 గుళ్లు కూల్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అమిత్‌షాను నేనొక ప్రశ్న అడగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు బీజేపీ, టీడీపీ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అప్పట్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా సైతం పనిచేసినప్పుడు, ఈ రాష్ట్రంలో 40 హిందూ దేవాలయాల్ని కూల్చినప్పుడు ఏమైనా మీరు నోరుమెదిపారా..? అప్పుడు మీ బీజేపీ ఎమ్మెల్యేనే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు కదా..? మరి, అప్పుడు ఎందుకు నోరుమూసుకుని కూర్చొన్నారు. ఇవాళ ఇక్కడేదో జరిగిపోతుందని లేనిపోని కబుర్లు చెబుతూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పెద్ద స్కాం అని మాట్లాడింది మీరు కాదా? ఇసుక గురించి మాట్లాడుకుంటే.. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఇసుక మీద రాష్ట్ర ఖజానాకు ఏమైనా ఆదాయం వచ్చిందా..? అంటే, రాలేదనే సమాధానం వస్తుంది. అదే, మా ప్రభుత్వం వచ్చాక రూ.వేలకోట్ల ఆదాయాన్ని ఇసుక మీద ఖజానాకు జమచేశాం. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇసుక దోపిడీ, దందాలు ఇంతాఅంతా కాదు. ఇందులో అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉంటుందికదా..? మరి, అమరావతి గురించి అప్పట్లో బీజేపీ నేతలు ఏమని మాట్లాడారు. అమరావతి పెద్ద అవినీతి కుంభకోణానికి వేదికగా నిలిచింది. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీనే మాట్లాడింది కదా..? నాడు చంద్రబాబుపై టీడీపీ గురించి ఇన్ని మాటలు మాట్లాడి.. ఇప్పుడేదో ఆ నాయకుడు, ఆ పార్టీ సచ్ఛీలత తెలిసినట్లు.. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నానికి బీజేపీ సాహసించడం మంచిదికాదని.. మీ ప్రయత్నాలు బెడిసికొడతాయని హెచ్చరిస్తున్నాను. అమిత్‌షా చెప్పుడు మాటలు వినడం సరికాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక చేపట్టిన ప్రతీ మంచి పనికీ ఏదోరకంగా అడ్డుపడటమే రాజకీయ లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు లాంటి దుర్మార్గమైన నేతల మాటలు విని అమిత్‌షా లాంటి బీజేపీ అగ్రనేత మాపై బురదజల్లడం మంచి పద్ధతి కాదు. వారి ఆరోపణల్లో నిజనిజాల్ని తెలుసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. అందరూ చూస్తుండగానే కళ్లముందు జరిగిన అమరావతి భూముల కుంభకోణాన్ని వదిలేసి మేమేదో వైజాగ్‌లో భూదోపిడీకి పాల్పడ్డామనే నిరాధారమైన ఆరోపణలు చేయడం వారికి సరికాదని తెలియజేస్తున్నాను. నిజంగా, మేం గానీ మా నాయకులు గానీ భూముల కబ్జా చేసినట్లు ఆధారాలుంటే వాటిపై చర్చించేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం. బీజేపీ ముందుకొస్తుందా..? అని ప్రశ్నిస్తున్నాను. ప్రజలకు మేలు చేస్తుంటే మోకాలడ్డుతున్న బాబు ఈరోజు జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే ప్రతీ విద్యార్థికి పుస్తకాలు, బ్యాగ్, వారికి యూనిఫాంతో పాటు మధ్యాహ్న భోజనం, వారికి అమ్మ ఒడి కానుక ఇలా అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్న మనసున్న ప్రభుత్వం మాది. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం బోధన అమలు చేస్తామంటే, ఇదే టీడీపీ అన్నిరకాలుగా కోర్టులకెక్కి మరీ అడ్డుపడింది. నాడు- నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మారుస్తుంటే.. రకరకాల వంకలు, కారణాలు చూపుతూ కోర్టులకెక్కి మోకాలడ్డే ప్రయత్నం చేశారు. పేదలకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఉచితంగా ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేయడంతో పాటు అమరావతి ప్రాంతంలో మరో 50వేల ఇళ్ల స్థలాలిస్తుంటే.. డెమోగ్రఫికల్ ఇం బ్యాలెన్స్ అంటూ ఈ పెత్తందారీ వర్గ నేత చంద్రబాబు సుప్రీంకోర్టు దాకా వెళతాడా..? అడుగడుగునా మా ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తూ బాబు రాజకీయం చేయడం వృధాప్రయాసేనని .. ప్రజలు ఆయన పాతచింతకాయ పచ్చడి మాటల్ని విని నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నాను. మచ్చలేని నాయకుడు జగన్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు ఆరాధ్యదైవంగా నిలిచారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తూ.. ఇప్పటికే 99 శాతం హామీల్ని అమలు చేసిన మచ్చలేని నేత మా జగన్‌గారు అని .. వారి నాయకత్వంలో మేమంతా మంత్రులుగా పనిచేయడం మా అదృష్టంగా మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. విభజన హామీలపై నోరు విప్పరెందుకు..? ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదు..? విభజన చట్టంలో కేంద్రం చేస్తానన్న హామీలలో చాలావరకు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి కదా.. వాటిపై బీజేపీ ఎందుకు నోరు మెదపదు..?. మీ పక్కనున్న స్థానిక నేతలు ఏదిచెబితే అది మాట్లాడటం కాకుండా, అమిత్‌షా వంటి అగ్రనేతలు తమ మాటల్ని సరిచేసుకోవడం ఉత్తమమని చెబుతున్నాను. సింగిల్‌గా వస్తాం..175 చోట్ల గెలుస్తాం కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పరిపాలన ఎలా నడిచిందనేది అందరూ చూశారు. కనుకనే, వారికి మొన్నటి ఎన్నికల్లో జరిగిన పరాభవం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిపాలన అనేది సంతృప్తికరంగా ఇవ్వక పోవడంతోనే బీజేపీని కర్ణాటక ప్రజలు సాగనంపారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పొత్తులతో వచ్చినా, కూటమి కట్టినా.. మా నాయకుడు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ సింగిల్‌గా పోటీకి దిగి, రాష్ట్రంలోని 175కి 175 స్థానాల్ని గెలిచి తీరతామని సవాల్ చేసి చెబుతున్నాను. ఇది కూడా చదవండి: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్‌షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన -
సీఎం వైఎస్ జగన్ పాలనలో రైతులకు అత్యంత మేలు జరుగుతోంది: మంత్రి కారుమూరి
-
ఈనాడు టిష్యూ పేపర్‌గానే పనికొస్తుంది: మంత్రి కారుమూరి
సాక్షి, ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించాడు. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాల శాఖలో రూ.20వేల కోట్లు అప్పు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కారుమూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక పౌర సరఫరా శాఖలో అనేక మార్పులు తెచ్చారు. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా చేశారు. 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈనాడు టిష్యూ పేపర్‌గానే పనికొస్తుంది. చంద్రబాబులాగే ఈనాడు రామోజీ కూడా రూ.వేలాది కోట్లు డైవర్ట్ చేశారు. టీడీపీ హయాంలో వేలాది కోట్లు డైవర్ట్ చేస్తే నోరు మెదపలేదు. ప్రభుత్వంపై బురద చల్లడానికి ఈనాడు అసత్య కథనాలు రాస్తోంది. చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించాడు. ఒక ఎకరం ఉన్న రైతు వద్ద కూడా మేము ధాన్యం కొనుగోలు చేశాం. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాలకి డబ్బు జమ చేశారు. బాబు హయాంలో దళారులు దోచుకున్నారు. ఈనాడు వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలి. మీరు ఎన్ని చేసినా 175కు 175 స్థానాల్లో మా ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు.. జెండా ఊపి ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్ -
మనోళ్లు 553 మంది క్షేమం
సాక్షి, విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 553 మంది క్షేమంగా ప్రమాదం నుంచి బయట పడ్డారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 485 మంది, యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది వెరసి 696 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో 92 మంది ప్రయాణించలేదని చెప్పారు. మిగతా వారిలో 553 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, 21 మంది స్వల్పంగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి మృత్యువాత పడ్డారన్నారు. మిగతా 28 మంది ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. వారి మొబైల్ నంబర్ల ఆధారంగా చిరునామా తెలుసుకోవడానికి పోలీస్ శాఖ ప్రయత్నిస్తోందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ విశాఖలో 309, రాజమండ్రిలో 31, ఏలూరులో 9, విజయవాడలో 135 మంది దిగాల్సిన వారు ఉన్నారన్నారు. యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి 33, రాజమండ్రి నుంచి ముగ్గురు, ఏలూరు నుంచి ఒకరు, విజయవాడ నుంచి 41, బాపట్ల, తెనాలి నుంచి ఎనిమిది, గుంటూరు నుంచి ఇద్దరు, ఒంగోలు నుంచి 11 మంది, నెల్లూరు నుంచి ముగ్గురు, తిరుపతి నుంచి 107 మంది ఎక్కారని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరిని విశాఖ కేజీహెచ్, ఇద్దరిని సెవెన్‌హిల్స్, ఒకరిని ఐఎన్ఎస్ కల్యాణి ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని, నలుగురిని ఒడిశా నుంచి ఏపీకి తీసుకొస్తున్నారని చెప్పారు. మిగతా వారు వైద్యం చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారన్నారు. రాష్ట్రం నుంచి 50 అంబులెన్సులను కటక్, భువనేశ్వర్‌లకు పంపించామన్నారు. ఇంకా తమ వారి ఆచూకీ తెలియ లేదని కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ కాల్స్ రాలేదని తెలిపారు. రైళ్ల ప్రమాదం నుంచి బయటపడి వాహనాల్లో విశాఖ చేరుకున్న ఏడుగురికి రవాణా ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం తరఫున రూ.30 వేల చెక్కును బాధితుడు ఎం.సత్యంకు మంత్రి అందజేశారు. రాష్ట్రానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశంతో ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన బృందం ఘటన స్థలం నుంచి.. విశాఖ నుంచి తాను, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ పాల్గొన్నారు. పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఒడిశాలోని బహనాగబజార్ స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులను స్వస్థలాలకు పంపించేందుకు భాద్రాక్ స్టేషన్ నుంచి చెన్నైకు ఆదివారం ప్రత్యేక రైలు(13863) నడిపారు. చెన్నై–హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైనందున.. ఈ నెల 5న దానికి ప్రత్యామ్నాయంగా చెన్నై సెంట్రల్ నుంచి బహనాగబజార్‌కు ప్రత్యేక రైలు(02842)ను అదే షెడ్యుల్‌లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో చెన్నై సెంట్రల్–హౌరా(12840) రైలును ఆదివారం కూడా రద్దు చేశారు. సికింద్రాబాద్–గౌహతి ఎక్స్‌ప్రెస్(12513)ను ఖరగ్‌పూర్, టాటానగర్, రూర్కేలా, జార్సుగూడ స్టేషన్ల మీదుగా మళ్లించి నడుపుతున్నారు. -
బాబూ.. మేనిఫెస్టో అమలుపై చర్చకు రా.. మంత్రి కారుమూరి సవాల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు అలవి కాని హామీలతో ప్రజలను మళ్లీ బురిడీ కొట్టించే యత్నాలు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనమని, అది ఎందుకూ పనికిరాదు. ఒక్కటీ అమలు కాదంటూ మండిపడ్డారు. ‘బాబూ.. నీకు చిత్తశుద్ధి ఉంటే.. మేనిఫెస్టో అమలుపై చర్చకు రా.. ఎవరు ఎన్ని అమలు చేశారో చూద్దాం’ అంటూ మంత్రి కారుమూరి సవాల్ విసిరారు. మంత్రి ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. టిష్యూ పేపర్కన్నా హీనం: చంద్రబాబూ.. నీ మొఖంలో రాజకీయంగా చావుకళ వచ్చింది. నీలో ప్రేతకళ కనిపిస్తోంది. అయినా సరే పదవీకాంక్ష. ఇంకా దోచుకోవాలన్న తపన వదలట్లేదు. ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించావు. ఆడబిడ్డలకు 18 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.18 వేల చొప్పున 5 ఏళ్లలో రూ.90 వేలు ఇస్తామంటున్నారు. ప్రజలు నిన్ను నమ్ముతారా? ఇంకా తల్లికి వందనం. దీపం పథకం. అన్నీ అబద్ధాలు. మహిళలకు ఉచిత ప్రయాణం. ఇది గతంలో కూడా చెప్పావు. అమలు చేయలేదు. పిల్లలకు ఉచిత ప్రయాణం అని, దాన్ని కూడా అమలు చేయలేదు. పారదర్శకంగా మా పథకాలు: సీఎం వైఎస్ జగన్, పదవీ బాధ్యతలు స్వీకరించి, నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రమంతా వేడుక చేసుకుంటున్నారు. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రధాన అర్హతగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేదు. వైఎస్ జగన్ పాలనలో నిరుపేదలతో పాటు, అన్ని వర్గాల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజానికి గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు.. కలెక్టర్లకు ఒక మాట చెప్పారు. తన పార్టీ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అదే సీఎం జగన్, కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందాలని నిర్దేశించారు. అందుకే ఎక్కడా అవినీతికి తావు లేకుండా, ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. చదవండి: చంద్రబాబు భయాన్నే ఈనాడు హైలైట్ చేసింది అంతులేని ప్రజాదరణ: అందుకే ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. మా జిల్లాలో చంద్రబాబు రైతు పోరు బాట పేరుతో పాదయాత్ర చేస్తే, కనీసం 500 మంది కూడా లేరు. అదే నా నియోజకవర్గంలో నేను నిన్న బైక్ ర్యాలీ నిర్వహిస్తే.. దాదాపు 6,500 మోటర్‌సైకిళ్లపై.. దాదాపు 13 వేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చంద్రబాబు పాదయాత్రలో 450 మంది పాల్గొంటే, సభకు కేవలం 1100 మంది మాత్రమే హాజరయ్యారు. అదే మా సభకు ఏకంగా 13 వేల మంది హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలకు ఆ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అన్ని వర్గాలకు న్యాయం: సీఎం జగన్.. తన పాలనలో రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపిస్తే, చంద్రబాబు ఒక్కరిని కూడా పంపలేదు. ఇంకా జగన్ 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. వారిలో కొందరు అట్టడుగు వర్గంలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇంకా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆ పదవులు కూడా ఇచ్చారు. అదే చంద్రబాబు బీసీలను ఏమన్నాడు? వారి తోక కట్ చేస్తానన్నాడు. తాట తీస్తానన్నాడు. ప్రతి కులాన్ని అవమానించి మాట్లాడడం చంద్రబాబుకు అలవాటు. వారిని కేవలం ఓటింగ్ యంత్రాలుగా చూడడమే తప్ప, ఒక్క బీసీకి కూడా ఆయన న్యాయం చేయలేదు. అదే జగన్ పాలనలో ఇంటింటికీ వెళ్తున్న వలంటీర్లు.. ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటి గడప వద్దే అందిస్తున్నారు. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడంతో పాటు, దాదాపు 22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. బాబు సిద్ధాంతం. దోచుకో–దాచుకో: 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసిన చంద్రబాబు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. రైతుల రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి, ఆ మాట కూడా తప్పాడు. చివర్లో ఎన్నికల ముందు పౌర సరఫరాల సంస్థ పేరుతో రుణం తీసుకుని పసుపు కుంకుమ కింద పంపిణీ చేశాడు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం అందించిన సీఎం జగన్, ప్రతి ఇంట్లో.. ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్నారు. అదే చంద్రబాబు తన పాలసలో చేసిందని చెప్పుకోవడానికి ఏ ఒక్కటి కూడా లేదు. స్కిల్ డెవలప్మెంట్లో రూ.371 కోట్ల అవినీతి. విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేయించావు. దుర్మార్గంగా దోపిడి. దోచుకో. దాచుకో.. అదే బాబు సిద్ధాంతం. రాష్ట్ర రుణం తక్కువే: సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని దుయ్యబట్టిన నీవు కూడా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నావు. మేము రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నామని విమర్శిస్తున్నావు. నిజానికి ఆ స్థాయిలో మేము అప్పులు చేయడం లేదు. నీ హయాంలో రూ.2,71,450 లక్షల కోట్లు అప్పు చేశావు. అదే మా ప్రభుత్వం కేవలం రూ.1.30 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది. అలాగే తీసుకున్న రుణంలో ప్రతి రూపాయికి లెక్క ఉంది. అదే యూపీ అప్పు చూస్తే.. ఏకంగా రూ.8 లక్షల కోట్లు. తమిళనాడు అప్పు రూ.5.50 లక్షల కోట్లు, కర్నాటక అప్పు రూ.5 లక్షల కోట్లు. గుజరాత్ అప్పు రూ.7 లక్షల కోట్లు. వాటితో పోల్చుకుంటే మన అప్పులు చాలా తక్కువ. అయినా అదే పనిగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నావు. మాది జనరంజక పాలన: చంద్రబాబూ నీవు నిజం చెబితే.. నీ తల వెయ్యి ముక్కలవుతుంది.. నీ జీవితమంతా అబద్ధాలమయం. అదే సీఎం జగన్.. చేసేదే చెబుతాడు. చెప్పిందే చేస్తాడు. ఆయనది జనరంజక పాలన. విద్యా రంగంలో 14వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాం. రాష్ట్ర జీడీపీలో మనమే ముందున్నాం. కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకొస్తే.. దానిపైనా ఏడుపే. రాష్ట్ర ప్రజలు బాగుపడొద్దు. వారు ఇబ్బందుల్లో ఉండాలి. అప్పుడే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలి. తద్వారా మళ్లీ అధికారంలోకి రావాలన్నదే నీ ఆలోచన. అందుకే రాష్ట్రానికి మేలు జరుగుతుంటే కూడా ఓర్చుకోలేకపోతున్నావు. రాష్ట్రం చాలా రంగాల్లో ముందుంది. దీన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. బాబుకు ఓటమి తప్పదు: దీంతో చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఈర్శ్యతో తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వంపై అదేపనిగా బురద చల్లుతున్నారు. అయితే మీరు ఎన్ని చేసినా, మీకు మళ్లీ ఓటమి తప్పదు. నాడు ఎన్టీఆర్‌ను అన్ని రకాలుగా వేధించి, ఆయన నుంచి పదవిని, పార్టీని లాక్కున్నారు. ఆయనను అంతులేని క్షోభకు గురి చేశారు. అంత దుర్మార్గుడు చంద్రబాబు అని.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. -
చంద్రబాబు ఓ గుంట నక్క, నీచుడు, నయవంచకుడు: మంత్రి కారుమూరి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబును ఎప్పుడూ నమ్మమని రైతులు అంటున్నారని పేర్కొన్నారు. తోకలు కత్తిరిస్తానంటూ బీసీలను చంద్రబాబు అవమానిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, బీసీల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. మూడుసార్లు సీఎంగా చేసిన బాబు ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించారా అని ప్రశ్నించారు. దుర్మార్గుడు చంద్రబాబు చంద్రబాబు బతుకంతా మోసమేనని మంత్రి కారుమూరి ధ్వజమెత్తారు. ఆయన ఏనాడైనా పేదవాడికి ఒక సెంటు భూమి ఇచ్చారా అని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటేసే యంత్రాలుగా బీసీలను వాడుకుంటున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. యువగళంలో యువత లేరు. రైతుల యాత్రలో రైతులు లేరని సెటైర్లు వేశారు. వర్ల రామయ్యకు ఎంపీ పదవి అని చెప్పి ఎలా మోసం చేశాడో అందరికీ తెలుసని అన్నారు. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సమాధులు కట్టుకోమని అంటున్నారంటే ఇక చంద్రబాబుని ఏమనాలి?.. చంద్రబాబు అంతటి నీచుడు, నయవంచకుడు మరెవరూ లేరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు కూడా రావు. ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరును బాబు ఎలా తలుచకుంటారు. చంద్రబాబు ఓ గుంట నక్క.’ అని మండిపడ్డారు. చదవండి: ఇదేం తీరు.. ఇదేం హింస? అవినాష్‌రెడ్డిపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా చంద్రబాబుకు ప్రజలకు రాజకీయ సమాధి కడతారు సాక్షి, కోనసీమ జిల్లా: రిజర్వేషన్లు తగ్గడానికి టీడీపీనే కారణమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం అమలవుతోందన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజలకు రాజకీయ సమాధి కడతారని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు. -
చంద్రబాబువన్నీ డ్రామాలే..
సాక్షి, అమరావతి/ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు సీరియస్ కామెంట్స్ చేశారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కారుమూరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగానే మేము ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా ధాన్యం సేకరిస్తున్నాం. చంద్రబాబు తణుకులో అడుగుపెట్టడంతో భారీ వర్షం పడింది. చంద్రబాబు పర్యటనలో కార్యకర్తలే తప్ప రైతులు లేరు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అని సీరియస్ అయ్యారు. మరోవైపు ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఆయనకు వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదు. చంద్రబాబు ఐదేళల్లో సేకరించిన ధాన్యం జగనన్న ప్రభుత్వం మూడేళ్లలోనే సేకరించింది. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ధాన్యం సేకరించాం. 29,074 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి డబ్బు కూడా చెల్లించాం. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో సాయం చేసిన ఘనత మాది. మాది రైతుకు అండగా ఉండే ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోపే డబ్బులు చెల్లిస్తున్నాం. ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. ‘ఈ-క్రాప్ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. చంద్రబాబువన్నీ డ్రామాలే. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉంది. డ్రామా ఆర్టిస్టులతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారు’ అంటూ సీరియస్ అయ్యారు. చదవండి: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం -
చంద్రబాబుపై మంత్రి కారుమూరి షాకింగ్ కామెంట్స్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ పేదలను మోసం చేసే కార్యక్రమం చేపట్టారు. మరో కపట నాటకానికి నయవంచకుడు రెడీ అయ్యాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, మంత్రి కారుమూరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసుకున్నది 420 బర్త్ డే. తానే ఇంద్రుడు, చంద్రుడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. 600 వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. ప్రభుత్వ పాఠాశాలల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు. మరో కపట నాటకానికి నయవంచకుడు రెడీ అయ్యాడు. తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు. తోడబుట్టినవాడిని గదిలో బంధించిన వ్యక్తి చంద్రబాబు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. వంగావీటి రంగా, మల్లెల బాబ్జీ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు. త్వరలోనే చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’ అని అన్నారు. మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. బాబు పేదల పేరెత్తడం ఒక వింత చంద్రబాబు, తన పుట్టినరోజు సందర్భంగా కూడా నిజాలు మాట్లాడటం లేదు. 420 మాటలే మాట్లాడాడు. ఎప్పుడూ లేనిది ఆయనకు హఠాత్తుగా పేదలు గుర్తొచ్చారు. పేదల పెన్నిధిని తానే అని అంటున్నాడు. పేదలకు ఏనాడూ మంచి చేయనివాడు, పేదలు అనే మాటే పలకటానికి ఇష్టపడనివాడు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తే పేదలు సోమరులవుతారు.. అని తన మనసులో మాటలో చెప్పుకున్నవాడు.. పేదల గురించి మాట్లాడటం ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఉంది. మార్కాపురం సభలో చంద్రబాబు పేదల గురించి మాట్లాడుతుంటే.. మాయల బాబుకు మాయదారి రోగమేమైనా వచ్చిందా.. ఏంటి..? అని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. నయవంచనకు కేరాఫ్ చంద్రబాబు చంద్రబాబు రాజకీయ అనుభవమంతా కుట్రలు, కుతంత్రాలే. ఆయన ప్రజల్లో నుంచి ఎదిగిన నాయకుడు కాదు. అధికారాన్ని ఉన్నపళంగా లాక్కోవడానికి గుంటనక్కలా మాటేసి, వేటేసే నయవంచకుడు చంద్రబాబు. ఆనాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన్ను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసి మరీ టీడీపీని, సైకిల్ గుర్తును, ఎన్టీఆర్ ట్రస్టు ఆస్తులను లాగేసుకున్న దుర్మార్గుడు. అందుకే, ఆయన్ను రాజకీయాల్లో నయవంచనకు కేరాఫ్ అడ్రస్ అని అందరూ పిలుస్తారు. బాబు వస్తే.. నాడు జాబులు ఏమయ్యాయి..? ఎన్నికలొచ్చిన ప్రతీసారి మాయమాటలు చెప్పడం.. ప్రజల్ని ఏమార్చడం, నమ్మించడం.. అధికారంలోకి రాగానే వారందర్నీ వంచించడం.. ఇదే చంద్రబాబు నేర్చిన రాజకీయమనేది జగమెరిగిన సత్యం. కిందటిసారి అధికారంలోకి వచ్చేటప్పుడు..‘బాబు వస్తేనే జాబు వస్తుంది’ అంటూ రాతలు రాయించి గోడలన్నింటినీ ఖరాబు చేశాడు. అధికారంలోకి రాగానే ‘బాబు వచ్చాడు గానీ జాబులు మాత్రం రాలేదు’ అని ప్రజలు వాపోయారు. ఇప్పుడు పేదలు, అభివృద్ధి అనే మాటలతో ప్రజల్ని మరోసారి మభ్యపెట్టాలని చూస్తున్నాడు. బాబు కపటనాటకాలను జనం ఏనాడో గుర్తించారు కనుకనే 2019 ఎన్నికల్లో ఆయన్ను ఘోరంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. రుణ మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలు, రైతుల్ని దగా చేసిన బాబు డ్వాక్రా సంఘాలను తానే పెట్టానని, తనకు మహిళలంటే చాలా గౌరవమంటూ.. వారిని తన హయాంలో సంతోషంగా చూసుకున్నానంటూ చంద్రబాబు.. కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారం మీరు తెచ్చుకోవద్దు.. నేను మీ రుణాలన్నింటినీ మాఫీ చేసి మీ బంగారాన్ని మీ ఇంటికే తెచ్చి ఇస్తానని మాయమాటలు చెప్పి డ్వాక్రామహిళల్ని మోసం చేశాడు. రుణమాఫీ పేరిట రైతుల నెత్తినటోపీ పెట్టిన ఘనుడు ఈ చంద్రబాబు. రైతుల రుణాల్ని రూ.87వేల కోట్లను కాస్తా కేవలం రూ.24వేల కోట్లకు కుదించి, 15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి, మిగతాది ఎగొట్టిన నీచుడు ఈ చంద్రబాబు. పైగా, ఈ విషయంపై విలేకరులు ఆనాడు నిలదీస్తే ‘ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తారా..? రైతుల అప్పులన్నీ ప్రభుత్వమే తీర్చాలా..? వాళ్లేం కట్టుకోరా..? ’ అంటూ అడ్డగోలు సమాధానమిచ్చి బెదిరించాడు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 600కు పైగా హామీల్నిచ్చి, ఏరుదాటాక తెప్పతగిలేసిన నీచుడు ఈ చంద్రబాబు అని మరోమారు గుర్తుచేస్తున్నాను. తల్లికి కొరివి పెట్టలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ చనిపోయినప్పుడు ఆమెకు కొడుకుగా తలకొరివి పెట్టలేని దౌర్భాగ్యుడు అతడు. తలకొరివి పెట్టి కర్మ చేస్తే తన రాజకీయాలు నడపడానికి సమయం ఉండదనే నీచమైన ఆలోచనకు దిగజారిన వ్యక్తి ఈ చంద్రబాబు అని అటు నారా కుటుంబంలోనూ, ఇటు నందమూరి కుటుంబంలోనూ ఆనాడు అందరూ అనుకున్నదే. మరి, ఆరోజు తమ్ముడుతో తలకొరివి పెట్టించిన బాబు.. అదే తమ్ముడికి ఆరోగ్యం బాగోలేకపోతే, గదిలో నిర్భంధించి, ఏనాడూ ఆయన మొఖం చూసిన పాపానపోలేదు. కుటుంబ విలువల్లేని వ్యక్తి చంద్రబాబు. ఏదోరోజుకు అతని భార్య, కొడుకు కూడా ‘వీడు పెద్ద శాడిస్టు’ అని ఈసడించుకునే సమయమొస్తుంది. జగన్ పేరేత్తే అర్హతే లేదు సమాజంలోనూ, రాజకీయాల్లోనూ విలువల్లేని వ్యక్తిగా ముద్రపడ్డ చంద్రబాబుకు, మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరేత్తే అర్హతే లేదు. ఎందుకంటే, మా జగన్‌గారు తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని ఎంత ప్రేమగానైతే చూసుకుంటారో.. అంతే ప్రేమగా రాష్ట్రప్రజల్ని కాపాడుకుంటూ రాజకీయాల్లో ఎదుగుతున్న వ్యక్తి. అలాంటి మా నాయకుడిపై నిందలు మోపడం, కారుకూతలు కూయడం సరికాదు. ఎల్లో మీడియా తప్పుడు రాతలను, చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదు. హత్యా రాజకీయాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య ఈమధ్యన పర్యటనల్లో చంద్రబాబు ఎక్కడికెళ్లినా కులాలు, మతాల్ని రెచ్చగొడుతూ.. బూతులు మాట్లాడుతూ దిగజారి ప్రవర్తిస్తున్నాడు. 2019 ఎన్నికల్లో ఏరోజైతే బాబు అధికారం నుంచి దిగిపోయాడో.. ఆనాడే ఏపీకి పట్టిన దరిద్రం వదిలిపోయిందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు మళ్లీ మాయమాటలు, కుట్రరాజకీయాలకు ఆయన బరితెగిస్తున్నాడు. నాడు వంగవీటి మోహనరంగాను బాబే హత్యచేయించారని హరిరామజోగయ్య చెప్పిన సంగతిని గుర్తుచేస్తున్నాను. అదేవిధంగా ప్రజాదరణలో ముందుకెళ్తున్న మా నాయకుడు వైఎస్ జగన్ గారిని ఏయిర్‌పోర్టులో కోడికి కట్టే కత్తితో హత్యాయత్నానికి ప్లాన్ చేశారు. అప్పట్లో ఆ కత్తి భుజానికి తగిలింది కాబట్టి సరిపోయింది. అదే మెడపై తగిలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో అందరూ ఆలోచించాలి. అదేమాదిరిగానే బాబు అధికారంలో ఉండగానే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్యకు గురయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ చంద్రబాబును ఎందుకు విచారణకు పిలవలేదు. ఈకేసులో టీడీపీ నాయకుల ప్రమేయం కూడా ఉందనేది మా అనుమానం. ఎందుకంటే, హత్యారాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తలపండిన రాజకీయ నేతలే చెబుతున్నారు. పేదోళ్ల పెద్దబిడ్డ జగన్ రాష్ట్రమంతా గడప గడపకు మన ప్రభుత్వంతో పాటు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాలతో మేం ఇంటింటికీ తిరిగినప్పుడు అన్నిచోట్లా వినిపిస్తున్న నినాదం ఒకటే.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అని కోరుకుంటున్నారు. బాబు అధికారంలో ఉండగా, చేయలేని అభివృద్ధి, సంక్షేమాన్ని పేదలకు అందిస్తుంటే.. మా జగన్ గారు పేదకుటుంబాలకు ఇంటికి పెద్దబిడ్డగా కనిపిస్తుంటే.. చంద్రబాబు, లోకేశ్‌లకు మాత్రం ఆయన సైకోగా కనిపిస్తున్నాడట. మీలాంటి దుర్మార్గులకు, దుష్టులకు, దోపిడీదారులకు, దుష్ట చతుష్టయానికి.. దేవుడు కూడా దయ్యంలానే కనిపిస్తాడు. మీరెన్ని కుట్రలు చేసినా, పేదల సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూసినా, మా నాయకుడు మంచి చేయడం కోసం పోరాడే విషయంలో వెనుకాముందు చూసుకోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే వ్యక్తి అని ఈరోజు అందరూ అంగీకరిస్తున్నారు. ఆనాడు పాదయాత్రలో జనం గురించి ఆలోచించి ఏదైతే చెప్పారో.. దాన్ని తూచ తప్పకుండా అమలుచేసిన నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్ గారు. ఈరోజు పేదకుటుంబాలకు అవినీతికి తావులేకుండా ఒక కొడుకు, అన్నలా, మేన మామలా అన్నీరకాలుగా ఆదుకుంటున్న గొప్ప పరిపాలకుడుగా పేరుతెచ్చుకున్నారు. కరోనా వంటి సంక్షోభంలో కూడా నవరత్నాలు అమలు చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రిగారికే దక్కుతుంది. బాబు హయాంలో 14వ స్థానంలో ఉన్న విద్యారంగాన్ని నేడు మేం మూడోస్థానంలోకి తెచ్చాం. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దన్న చంద్రబాబు ఈరోజు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఏ పిల్లాడ్ని కదిలించినా ఇంగ్లీషులో మాట్లాడటాన్ని చూస్తే నివ్వేరపోతాడు. అదే బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం 45వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అదే మా జగన్ సీఎంగా రాగానే 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాల పాటు ఇతర ప్రభుత్వశాఖల్లో ఖాళీలను భర్తీ చేయడంలో ముందున్నాం. సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు వస్తున్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక బాబు ఈర్ష్య పడుతున్నాడు కనుకనే, ఆయన ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాడు. స్కిల్‌డెవలప్‌మెంట్ ట్రైనింగ్ పేరుతో చేసిన కుంభకోణం బాబుకు మెడకు చుట్టుకుని త్వరలో జైలుకెళ్లే సమయం కూడా దగ్గరలో పడింది. మైకు పట్టుకోలేని ముసలి నక్క చంద్రబాబు ఈరోజు పర్యటనల్లో తండ్రీకొడుకులు(బాబు, లోకేశ్) నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు. మా నాన్న అధికారంలోకి వచ్చే వరకు అరటికాయలు కూడా దొరికేవి కాదని, ప్రజలంతా ఆకులు, అలమలు తిని బతికినట్టు పాదయాత్రలో లోకేశ్ చెబుతుంటే.. చంద్రబాబేమో, తానే సెల్‌ఫోన్‌ను కనిపెట్టానని, నా వల్లే విదేశాలకు వెళుతున్నారంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. బైపాస్‌రోడ్లు కూడా తానే వేశానని బాబు చెప్పుకోవడం దుర్మార్గం. బాబు గతంలో చేసిన దుర్మార్గాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. ప్రజలందరికీ ఆయన కపటనాటకాలు తెలిసిపోయాయి. అందుకే, ఈరోజు రాష్ట్రమంతా మళ్లీ జగనన్నే రావాలని కోరుకుంటున్నారు. బాబును మాత్రం ప్రజలు చీదరించుకుంటున్నారు. కరడుగట్టిన టీడీపీ కుటుంబాలే మాకు నవరత్నాలు అందాయని చెబుతున్నారు. ‘బాబూ.. నువ్వు ముసలినక్కవై పోయావు. కనీసం మైకు పట్టుకుని శక్తి కూడా నీకు లేదు. ఈ వయసులో కూడా ఇంకా దోచుకుని దాచుకోవాలన్న నీ కుట్రల్ని ప్రజలు భగ్నం చేస్తారు. నీ పక్కనున్న పార్టీ నేత అచ్చెన్నాయుడు పార్టీలేదు. బొక్కా లేదు అన్నప్పుడే నీ పార్టీ కేడర్రంతా టీడీపీని వదిలేశారు.’. మీరెన్ని కుట్రలు చేసినా అధికారంలోకి రావడం కల్ల అన్నది బాబు గుర్తెరగాలి -
తెలంగాణను నాశనం చేశారు..వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి.?
-
హరీష్‌పై మంత్రి కారుమూరి కౌంటర్.. మీరు ఏం చేశారో తెలియదా?
సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్ అయ్యారు. హరీష్ రావు.. దౌర్భగ్యమైన మాటలు మాట్లాడకు అంటూ చురకలు అంటించారు. ధనిక రాష్ట్రాన్ని(తెలంగాణ) మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు.. ఏపీకి రా ఏం జరుగుతుందో చూపిస్తాను. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. హరీష్.. మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగాణలో సంక్షేమ పథకాలు.. మా సంక్షేమ పథకాలకు తేడా చూడు. జీడీపీలో మేం దేశంలోనే నంబర్ వన్‌లో ఉన్నాం. హరీష్ రావు.. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ విమర్శలు చేశారు. అలాగే, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడాలి అని హితవు పలికారు. ఇక, అంతకుముందు హరీష్ రావు.. ఏపీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. దీంతో, హరీష్ వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి కౌంటర్ ఇచ్చారు. -
తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రి కారుమూరి ఫైర్
-
‘చంద్రబాబు హయాంలో దోచుకో దాచుకో అన్నట్లు పాలన సాగింది’
సాక్షి, పశ్చిమ గోదావరి: చంద్రబాబు హయాంలో దోచుకో దాచుకో అన్న తీరుగా పాలన సాగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ జన్మభూమి కమిటీలను చూసి ప్రజలు భయపడేవారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజలను ఎలా ఏమార్చాలి, ఎలా గద్దె నెక్కి డబ్బులను దోచుకోవాలో చూస్తుంటాడని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని, అందుకోసం ఇప్పటికే మూడు విడతల్లో రూ.19 వేల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. సీఎం జగన్ వచ్చాక వాలంటీర్ వ్యవస్థతో గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం విద్యలో 14 స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 2వ స్థానంలో ఉందన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి కారుమూరి అన్నారు. చదవండి: అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం.. వినూత్న నిరసన -
'ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు'
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్రం ప్రశంసించిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జియో ట్యాగ్ సిస్టం ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ పీడీఎస్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 'రైస్ మిల్లులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బియ్యం రీసైకిల్ కాకుండా చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు డబ్బులు మూడు రోజులలో రైతుల ఖాతాలలో వేస్తున్నాం. రూ.1,702 కోట్ల పాత బకాయిలు చెల్లింపునకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేరళ కోసం జయ బొండం బాయిల్డ్ రైస్‌కు కేంద్రం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చింది. ఒక లక్ష అంత్యోదయ కార్డుల మంజూరుకు కేంద్రం ఒప్పుకుంది. రైతులకు ధాన్యం డబ్బులు ఎప్పటికప్పడు ఇస్తున్నాం. కేంద్రం సకాలంలో చెల్లింపులు చేస్తోంది. రేషన్ కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్ కింద సరఫరా చేస్తాం. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా దాడులు చేస్తున్నాం. రేషన్ కార్డులు తొలగించం. పార్టీలు, కులాలు చూడకుండా పథకాలు ఇస్తున్నాం.' అని కారుమూరి పేర్కొన్నారు. చదవండి: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై కేటీఆర్ ట్వీట్ -
ఎండీయూ ఆపరేటర్లకూ వాహనమిత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లకు బీమా ప్రీమియాన్ని ఈ ఏడాది నుంచి వాహన మిత్ర పథకంలో భాగంగా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తమకు వచ్చే వేతనం నుంచి ఎండీయూ వాహనాల ప్రీమియాన్ని ఏటా బ్యాంకులు జమ చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విన్నవించారు. ఇదే విషయాన్ని మంత్రి కారుమూరి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే సీఎం సానుకూలంగా స్పందించారు. బీమా ప్రీమియం చెల్లింపును వాహనమిత్ర పథకం కిందకు చేర్చి 2021 నుంచి అమలు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూలైలో సొంతంగా ఆటో, ట్యాక్సీలు నిర్వహించుకునే వారికి చెల్లించే వాహనమిత్ర పథకంతో.. ఎండీయూ ఆపరేటర్లకూ ప్రీమియం మొత్తం రూ.9 కోట్లు ప్రభుత్వం నేరుగా చెల్లించనుందని మంత్రి కారుమూరి శనివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. -
ఏపీ సర్కార్ మరో ముందడుగు..
సాక్షి, విశాఖపట్నం: పేదల కడుపు నింపే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసర ఫరాల శాఖ బుధవారం నుంచి గోధుమ పిండి కూడా అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖ పట్టణంలో ప్రారంభించారు. నగరంలోని లబ్దిదారులకు గోధుమ పిండి ప్యాకెట్ లను పంపిణీ చేశారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధర 16 రూపాయలుగా నిర్ణయించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.40గా ఉంది. విశాఖపట్నం అర్బన్ ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధారలో రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! -
సీఎం జగన్ పాలనలో రైతులకు మేలు జరుగుతోంది
-
సీఎం జగన్ పాలనలో రైతులకు మేలు: మంత్రి కారుమూరి
సాక్షి, విజయవాడ: రైతులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు హయాంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. మూడున్నరేళ్లలోనే 2 కోట్ల 88 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పుడు దళారులు, మిల్లర్లతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దళారి వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాం. ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశాం. టీడీపీ రైతుల్ని రెచ్చగొట్టినా వారు మా నిర్ణయానికే మద్దతు తెలిపారు. ప్రతి రైతుకు ఎకారానికి అదనంగా రూ.8వేలు లబ్ధి కలిగింది. ప్రతిపక్షాలకు చెందిన రైతులు కూడా సీఎం జగన్‌కి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. కొందరు మిల్లర్లు తోక జాడిస్తే వారిపై చర్యలు తీసుకున్నాం. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చెయ్యాలని సీఎం ఆదేశించారు. రైతులను మిల్లర్లు ఎవరైనా ఇబ్బంది పెడితే ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాము. కొద్ది మంది మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వారిపై చర్యలు తప్పవు. 21 రోజులు కాకుండానే రైతులకు డబ్బులు జమ చేస్తున్నాం. టీడీపీకి చెందిన పచ్చ పత్రికలకు కళ్ళు మండుతున్నాయి. చంద్రబాబు రైతుకి గిట్టుబాటు ధర కల్పించనప్పుడు పచ్చ పత్రికలు ఏం చేశాయి. ఈనాడు రామోజీరావుకి వయస్సు వచ్చినా స్వార్థంతో ఆలోచిస్తున్నారు. చంద్రబాబుని సీఎం చేసి దోచుకోవాలన్న ఆలోచనలో రామోజీరావు ఉన్నారు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. చదవండి: (మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం) -
ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తో " స్ట్రెయిట్ టాక్ "
-
ధాన్యం కొనుగోలుతో రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలోని రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తాము ఇంతే కొంటామంటూ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంటే.. ధాన్యం కొనుగోలులో ఆంక్షలు అంటూ ‘ఈనాడు’ తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం అని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలను రాజధాని పేరిట సేకరించినప్పుడు రామోజీ ఎందుకు బాధ పడలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లుగా రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం దేశమంతా గుర్తిస్తుండటం కనిపించడం లేదా అని నిలదీశారు. రైతులకు మద్దతు ధర దక్కుతోందనే అక్కసుతో బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. రామోజీ.. ఆరోజు ఎందుకు నోరు విప్పలేదు? ► టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.40 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ మూడున్నరేళ్లలో మా ప్రభుత్వం రూ.50,699 కోట్ల విలువైన 2.71 కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది. టీడీపీ ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేస్తే, ఈ మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం రూ.7,500 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇవి రామోజీకి కన్పించక పోవటం దురదృష్టకరం. ► వ్యవసాయం దండగ అని చంద్రబాబు విమర్శించినప్పుడు రామోజీ ఎందుకు నోరు విప్పలేదు? ఈరోజు రాష్ట్రం పాడి పంటలతో కళకళలాడుతోంది. సాగునీరు పుష్కలంగా అందుతోంది. దిగుబడులు బాగా పెరిగాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకే రైతులు పంట విక్రయించుకుంటున్నారు. ► రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల మీద.. టీడీపీ, దాని కుల మీడియా రాసిన కథనాలు వారి పెత్తందారీ పోకడలను, అహంకారాన్ని మరోసారి బయట పెట్టాయి. ఈ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది బీసీలకు రాజకీయంగా గుర్తింపు రావడం నిజం కాదా? ఊరికొకరికి మాత్రమే మేలు చేసే గత ప్రభుత్వ దుర్మార్గం బట్టబయలు కాలేదా? -
సీఎం జగన్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు : మంత్రి కారుమూరి
-
బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు - మంత్రి కారుమూరి
-
చంద్రబాబుకు బీసీల గురుంచి మాట్లాడే హక్కు లేదు : మంత్రి కారుమూరి
-
చంద్రబాబు ఈ వయసులో అలాంటివి అవసరమా?: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: కర్నూలులో న్యాయరాజధాని వస్తే తమప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆనందంలో అక్కడి ప్రజలు ఉన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అందుకే వాళ్లు బాబుని అడ్డుకొని గోబ్యాక్ నినాదాలు చేశారన్నారు. జగన్ ప్రజల హృదయాలకు దగ్గరయ్యేసరికి చంద్రబాబుకి పిచ్చి ముదిరిందని మండిపడ్డారు. ఎవరైనా అతనిని మెంటల్ ఆస్పత్రిలో చూపించాలన్నారు. ఈ మధ్య చంద్రబాబు కొత్తగా తొడగొట్టడం కూడా మొదలు పెట్టాడు. ఈ వయసులో అలాంటివి అవసరమా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ పార్టీలకతీతంగా పథకాలు అందిస్తూ ప్రజలకు దగ్గరయ్యేసరికి బాబుకి ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయాయి అన్నారు. అమరావతి రాజధాని కాకపోతే లక్షల కోట్లు పోతాయనే బెంగ పట్టుకుందన్నారు. బాబు ఎక్కడికెళ్లినా తన భార్యను అవమానించారంటూ సింపతీ కోసం చూస్తున్నాడు. దమ్ముంటే అసెంబ్లీ రికార్డులు వెరిఫై చేసి నిరూపించు చంద్రబాబు అని సవాల్ విసిరారు. మేము చంద్రబాబు భార్యను ఒక్కమాట అన్నట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతగా విరమించుకొంటాను అని సవాల్ చేశారు. మహానుభావుడు ఎన్టీఆర్‌ని క్షోభ పెట్టి, ఆయన బ్యాంక్ అకౌంట్లు కూడా బ్లాక్ చేసిన నీచుడు చంద్రబాబు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (నానిపై చంద్రబాబు సీరియస్.. ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పోండి) -
కేరళకు ఆంధ్రా ధాన్యం
సాక్షి, అమరావతి/ తణుకు అర్బన్: రాష్ట్రంలో పండించే జయ రకం ధాన్యం (ఎంటీయూ 3626 బొండాలు), బియ్యాన్ని తమకు సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో కేరళ ఒప్పందం చేసుకుంది. కేరళ పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ బాబు.ఏ సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. ఏపీలో పండించే జయ బొండాలకు కేరళలో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ తమకు జయ బొండాలతోపాటు పలురకాల నిత్యావసరాలు తమకు సరఫరా చేయాలని కోరారు. ఏపీ మంత్రితో పాటు అధికారుల బృందాన్ని కేరళ పర్యటనకు ఆహ్వానించారు. కేరళ మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... జయ రకం ధాన్యంతోపాటు ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు వంటి నిత్యావసరాలను కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి, అధికారుల బృందం కేరళ పర్యటనకు వెళ్లగా... ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రత్యేక భేటీలో సుదీర్ఘంగా చర్చించి పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో జయ బొండాలు పండించే రైతులకు మద్దతు ధర లభించడంతోపాటు పెద్ద ఎత్తున మేలు జరుగనుంది. ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా చేసే నిత్యావసరాలను కేరళ పౌరసరఫరాల సంస్థ మావెల్లి స్టోర్స్ ద్వారా మార్క్‌ఫెడ్ బ్రాండ్‌తోనే వినియోగదారులకు అందించనుంది. ఈ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కేరళ మంత్రి అనిల్‌తో కలిసి మావెల్లి స్టోర్స్‌ను సందర్శించి, అక్కడి వినియోగదారులకు నిత్యావసరాల సరఫరాను పరిశీలించారు. -
‘చంద్రబాబుకు మసాజ్, మాలిష్ చేయడానికే పవన్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైరయ్యారు. కాగా, మంత్రి కారుమూరి బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘విశాఖ గర్జన విజయవంతమైంది. గర్జన సక్సెస్‌ను ఓర్చుకోలేక జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లు, ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ పనిచేస్తున్నారు. దత్తపుత్రుడు అనే పదానికి పవన్ పూర్తి అర్హుడు. యువతకు పవన్ కల్యాణ్ ఏం చేప్తున్నారు?. యువతతో పవన్ రౌడీయిజం చేస్తారా?. ఎంత మంది తోలు తీస్తారు పవన్?. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని ఎన్నుకున్నారు. మమ్మల్ని కొడితే ప్రజల్ని కొట్టినట్టే కదా!. పవన్ కల్యాణ్ ముసుగు తొలగిపోయింది. పవన్ దత్తపుత్రుడు అన్నది నిన్నటితో తేలిపోయింది. ముద్రగడను చంద్రబాబు హింసించినా పవన్ నోరు విప్పలేదు. ప్యాకేజీ కోసం పవన్ యువతను పెడదారి పట్టించొద్దు. చంద్రబాబుకు పవన్ కొమ్ముకాస్తున్నారు. కాపుజాతిని అవమానించిన చంద్రబాబును ఎందుకు మోస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు మసాజ్, మాలిష్ చేయడానికి వచ్చావా?.. సాక్షి, విజయవాడ: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు సేవ చేసేందుకే పవన్ పార్టీ పెట్టాడు. పవన్, చంద్రబాబు ముసుగు తొలగింది. చంద్రబాబుకు మసాజ్, మాలిష్ చేయడానికి, కాళ్లు నొక్కడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్ పనికిమాలిన దద్దమ్మ, వెదవ. రాజకీయ నాయకుడిగా ఉండటానికి పవన్‌కు అర్హత లేదు. రౌడీ రాజ్యం తేవాలని పవన్ చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వీధి రౌడీలా ఉన్నాయి. పవన్‌కు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా?. పవన్ ఎవరితో కలిసినా అసెంబ్లీ గేటు కూడా తాకలేవు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. నిజజీవితంలోనూ పవన్ చక్కగా నటిస్తున్నారు.. సాక్షి, రాజమండ్రి: బీజేపీ, టీడీపీని ఏకం చేయడమే పవన్ రోడ్మ్యాపా అంటూ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఎంపీ భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబును కలవడంతో పవన్ ముసుగు తొలగిపోయింది. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ మాట్లాడుతున్నారు. నిజజీవితంలోనూ పవన్ చక్కగా నటిస్తున్నారు. పవన్ పార్టీ ఎందుకోసం పెట్టినట్టు?. చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడు. బాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం.. దీన్నే కదా ప్యాకేజీ అంటారు. పవన్, కేఏ పాల్ ఇద్దరూ చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలే.. వీరిద్దరూ బాబు సూచనలతో నడిచిన వారే. అమరావతి యాత్రతో రాజమండ్రిలో అల్లకల్లోలం సృష్టించారు. రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘చంద్రబాబు నాటకం బట్టబయలు.. వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే’
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీ ముసుగులో జరుగుతున్నదే మహా పాదయాత్ర అని, అందులో ఉన్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్రాస్, హైదరాబాద్‌లో తంతే అమరావతిలో పడ్డాం. మరోసారి భవిష్యత్ తరాలకు ఆ పరిస్థితి రాకూడదన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ‘అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు’ ‘‘టీడీపీ పరిస్థితి భూ స్థాపితం అయిపోయింది. చంద్రబాబు ఆడుతున్న నాటకం పూర్తిగా బట్టబయలైంది. అన్ని వర్గాల వారు శాంతియుతంగా నిరసన చేస్తుంటే టీడీపీ నేతలు రెచ్చ గొడుతున్నారు. మూడు రాజధానులు కావాలని ప్రజలు కోరుతున్నారు. పాదయాత్రకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వరకు నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. చంద్రబాబు 14 ఏళ్లలో అవినీతి పాలన చేశారు’’ అని కారుమూరి దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి గెలవాలని మంత్రి సవాల్ విసిరారు. ‘‘స్థానిక ఎన్నికల్లో గెలవలేని టీడీపీకి తమ రాజీనామాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మహా పాద యాత్ర కాదు.. ఫేక్ యాత్ర అది’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. -
‘తేడా వస్తే దబిడిదిబిడే’.. బాలకృష్ణపై మంత్రుల ఫైర్
సాక్షి, అమరావతి: హెల్త్ వర్సిటీకి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలపై పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ‘చూడు బాలయ్య.... నీ కన్న తండ్రి ఎన్టీఆర్ గారి మీద వైశ్రాయ్ హోటల్ ముందు నీ బావ చంద్రుబాబు చెప్పుల వర్షం కురిపిస్తుంటే నువ్వు మందు తాగుతూ ఎంజాయ్ చేశావు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది.. అదే ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టిన చరిత్ర మా ప్రభుత్వానిది’ అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చూడయ్య బాలకృష్ణ.... నీ కన్న తండ్రి ఎన్టీఆర్ గారి మీద వైశ్రాయ్ హోటల్ ముందు నీ బావ చంద్రబాబు చెప్పుల వర్షం కురిపిస్తుంటే నువ్వు మందు తాగుతూ ఎంజాయ్ చేశావు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. అదే ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టిన చరిత్ర మా ప్రభుత్వానిది. — Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 24, 2022 రీల్ సింహం కాదు రియల్ సింహం.. బాలకృష్ణ ట్వీట్‌కి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు కౌంటర్ ట్వీట్ చేశారు. ‘ బాలయ్యా.. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అసెంబ్లీలో అంత క్లియర్‌గా చెప్పాకా కూడా వైలెన్స్ చేయాలి అనుకుంటే.. అక్కడ ఉన్నది రీల్ సింహం కాదు రియల్ సింహం జగన్... తేడా వస్తే మీ బావ, బామ్మర్దులకు దబిడిదిబిడే..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి. బాలయ్యా.. ప్లూటు బాబు ముందు ఊదు... జగన్ గారి ముందు కాదు... అసెంబ్లీ లో అంత క్లియర్ గా చెప్పాకా కూడా వైలెన్స్ చేయాలి అనుకుంటే... అక్కడ ఉన్నది రీల్ సింహం కాదు రియల్ సింహం జగన్... తేడా వస్తే మీ బావ, బామ్మర్దులకు దబిడిదిబిడే... — Karumuri Venkata Nageswara Rao (@karumurionline) September 24, 2022 ఇదీ చదవండి: బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జగనన్న ముందు కాదు: మంత్రి రోజా కౌంటర్ -
కుప్పంలో చంద్రబాబు కూలిపోయాడు
ఇరగవరం: కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూలిపోయాడని, అందుకే బీసీ మహిళా ఎంపీపీపై రాళ్లు వేయించి అరాచకం సృష్టించాడని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. ఆయన ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కత్తవపాడులో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మునిసిపల్ చైర్మన్ ఇలా మొత్తం అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించిందన్నారు. 33 సంవత్సరాల్లో కుప్పానికి ఏమీ చేయకపోవడంతో అక్కడి ప్రజలు చంద్రబాబును పక్కన పెట్టేశారన్నారు. మూడు సంవత్సరాల్లో వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని చూసి ఇంత అభివృద్ధి జరుగుతుందా అని అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. అది తట్టుకోలేని చంద్రబాబు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీని దూషిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్ని అరాచకాలు చేసినా ప్రశ్నించని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే అరాచకమంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లోకేశ్ శృంగారంపై చంద్రబాబు నోరు విప్పాలి
తిరుమల: నారా లోకేశ్ శృంగారంపై చంద్రబాబునోరు విప్పాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం తిరుమల శ్రీకృష్ణ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ మాధవ్ గురించి చంద్రబాబు, లోకేశ్ రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఒక బీసీ ఎంపీపై అలా దారుణంగా మాట్లాడటం మంచిది కాదని చెప్పారు. లోకేశ్ అన్ని రకాల భంగిమలతో విన్యాసాలు చేసినప్పుడు చంద్రబాబు స్పందించారా అని ప్రశ్నించారు. లోకేశ్ శృంగార చర్యలపై చంద్రబాబు మాట్లాడాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆఫీసులో పని చేసే మహిళలను అసభ్యకరంగా మాట్లాడితే వారు ఏడుచుకుంటూ వెళ్ళిన ఘటనల సంగతేమిటని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు ఏపీకి రాజధాని లేకుండా చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లు ఏపీకి హైదరాబాద్‌ను రాజధానిగా ప్రకటిస్తే, చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి వచ్చి బస్సులో కాపురం పెట్టారని అన్నారు. పుష్కరాల్లో చంద్రబాబు ఆర్భాటాల కోసం 29 మంది అమాయక భక్తులను చంపేసిన కేసు గురించి ఏనాడైనా ప్రస్తావించారా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను చంద్రబాబు ఎలా దుర్భాషలాడారో, టీడీపీ నేతలు ఆ పార్టీ మహిళా నేత దివ్యవాణిని ఎలా ఇబ్బంది పెట్టారో ఆమే స్వయంగా చెప్పారన్నారు. నందిగం సురేష్‌ను కొట్టించి అక్రమ కేసులు పెట్టి, ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులతో టీడీపీ నేతలు బెదిరిస్తే వైఎస్ జగన్ అండగా నిలిచారని, ఇప్పుడు సురేష్ ఎంపీ అయ్యారని మంత్రి గుర్తు చేశారు. గోరంట్ల మాధవ్ మార్ఫింగ్ వీడియో యూకే నుంచి సోషల్ మీడియాలోకి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. అసలు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిందే టీడీపీ నాయకులన్నారు. వీడియోపై దర్యాప్తు చేయాలని స్వయంగా ఎంపీయే ఎస్పీని కోరారన్నారు. -
1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేవై) కింద ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతినెల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 4.23 కోట్ల మందికి రేషన్ ఇస్తుంటే.. ఇందులో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే సరుకులు అందిస్తోందన్నారు. మిగిలిన లబ్ధిదారులకు సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ పంపిణీ చేస్తోందన్నారు. కరోనా సమయంలో పీఎంజీకేవై కింద కేంద్రం ఉచిత రేషన్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2022 వరకు రాష్ట్రంలో ఉచిత రేషన్ పంపిణీ చేపట్టామన్నారు. ఇక్కడ కేంద్రం ఇచ్చే వాటాపోనూ నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులకు మానవతా దృక్పథంతో తమ ప్రభుత్వం సొంతంగా ఉచిత బియ్యాన్ని అందించిందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కొనసాగిస్తున్న ఉచిత రేషన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారని బొత్స తెలిపారు. రేషన్ దుకాణాల వద్దే.. తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మందితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డుదారులకు ఉచిత రేషన్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. వీరితో పాటు కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడ కూడా ఈ విధానాన్ని అమలుచేస్తామన్నారు. తద్వారా రాష్ట్రంలోని 2.68 కోట్ల మందికి పైగా ఉచిత బియ్యం అందుతుందని బొత్స చెప్పారు. వీటిని రేషన్ దుకాణాల వద్ద మ.3.30 గంటల నుంచి సాయంత్రం వరకూ పంపిణీ చేస్తామని.. ఈ నెలాఖరు నాటికి వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు కూపన్లు అందజేస్తామన్నారు. ఇక ప్రతినెలా ఇచ్చే బియ్యాన్ని యథావిధిగా వాహనాల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందన్నారు. పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక అనంతరం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులు అందరికీ పీఎంజీకేవైను వర్తింపజేయాలని సీఎం జగన్ లేఖల ద్వారా ప్రధానమంత్రిని కోరారన్నారు. నీతి ఆయోగ్, మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులు, ఉన్నతాధికారలు అధ్యయనాల తర్వాత పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కంటే పీడీఎస్ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని.. ఇటీవల కొత్తగా 7,051 కార్డులను కూడా జారీచేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో పేదలకిచ్చే బియ్యం కోసం రూ.12వేల కోట్లు ఖర్చుచేస్తే తమ ప్రభుత్వం మూడేళ్లలోనూ రూ.14వేల కోట్ల వరకు ఖర్చుచేసిందన్నారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు.. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది నిరుపేదలు రేషన్ తీసుకుంటుండగా కేంద్రం ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందిని మాత్రమే గుర్తించింది. వారికే ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. మిగిలిన 1.55 కోట్ల మంది ప్రజలను నిరుపేదలుగా పరిగణించట్లేదు. ఈ క్రమంలో కొంతమందికే కాకుండా నిరుపేదలందరికీ పీఎంజీకేవై కింద ఉచిత రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నీతి ఆయోగ్ సైతం చేసిన సిఫారసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కేంద్రం స్పందించలేదు. కరోనా సమయంలో కేంద్రం ఇస్తున్న 2.68 కోట్ల మందితో పాటు మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ ఇచ్చింది. ఆర్థికభారం మోయలేనిస్థాయికి చేరడంతో.. అందరకీ ఉచిత రేషన్ ఇవ్వమని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి, కేంద్రం స్పందన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో.. ఉచిత రేషన్ పంపిణీ చేయకపోతే ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తామని, బిల్లులను కూడా ఆపేస్తామని బెదిరించింది. రైతులు ఇబ్బందులు పడకుండా వారి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి వారి సిఫారసుల అనుగుణంగా వెనుకబడిన ప్రాంతాలు, సామాజికవర్గాల వారీగా ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లుచేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో మోయలేని ఆర్థిక భారం పడినా.. నిరుపేదల కడుపు నింపేందుకు కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారం భరించి రెండేళ్లూ ఉచిత రేషన్ అందించింది. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోవడంతో కేంద్రాన్ని సాయం కోరినా ఫలితం దక్కకపోగా బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. -
ఆ పిచ్చి మాటలు విని జనం నవ్వుతున్నారు: మంత్రి కారుమూరి
సాక్షి, తాడేపల్లి: అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంత్రి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఆయన బాటలోనే పార్టీ నేతలు నడుస్తున్నారు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటి?. బీసీ నేతలు తప్పు చేస్తే వదిలేయాలా?. అయ్యన్నపాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా?. టీడీపీ నేతలు మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మహిళల గురించి ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో చూశాం. బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడు. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిది. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారు. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోంది. కానీ చంద్రబాబు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశారని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. చదవండి: (అయ్యన్న బాగోతం.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏమన్నారంటే?) ఆ పిచ్చి మాటలకు జనం నవ్వుతున్నారు 'చంద్రబాబు ఉత్తరాంధ్రలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదంట. ప్రపంచమంతా కూడా రాకుండా ఆపేవారేమో?. తుపానులు ఆపుతానంటాడు. ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గిస్తానంటాడు. ఇలాంటి పిచ్చిమాటలు విని జనం నవ్వుతున్నారు. విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో జనం చూశారు. మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారు. అయ్యన్నపాత్రుడు ఓ తాగుబోతు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాటం చేయాలి. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభకు వచ్చిన జనం జై జగన్ అంటున్నారు. జగన్‌పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదు. ఇక ఇంటికొకరు ఏం వస్తారు?. కేంద్రంపై పోరాటం చేయలేక జగన్‌ని విమర్శిస్తున్నారంటూ' మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చంద్రబాబుపై మండిపడ్డారు. చదవండి: (Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు) -
బియ్యం పంపిణీపై జీవీఎల్ వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: రాజ్యసభ సభ్యులు జీవీఎల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హితవు పలికారు. బియ్యం పంపిణీపై జీవీఎల్ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు.. ఏపీలో పూర్తిగా నూకల్లేని సన్న బియ్యం (సార్టేక్స్) బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నాన్ సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేస్తే సరిపోదని అన్నారు. అంతేగాక కేంద్రం సార్టెక్స్ బియ్యం ఇవ్వకపోగా నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తీరు వల్లే ఉచిత బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. ఈ విషయంపై నీతి ఆయోగ్‌కు లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. తాము 1.46 కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం ఇస్తుంటే ఏపీలో సగం జనాభాకే ( 86 లక్షల మందికి) ఇస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర మాత్రం అధికంగా ఇస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై ప్రధానికి కూడా సీఎం జగన్మోహన్రెడ్డి మే 16న లేఖ రాశారని గుర్తు చేశారు. ‘రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే ఆ బియ్యాన్ని తెచ్చే ఏర్పాటు చేయండి. కేంద్రంలో మీరే ఉన్నారు కాబట్టి మాకు రావాల్సింది ఇప్పించండి. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మీరు ఇప్పుడైనా రావాల్సిన బియ్యం కోసం లేఖ రాయండి. ప్రజలకు మీరిచ్చే అర్థ బంతి బోజనాలు మేము పెట్టలేము. నీతి ఆయోగ్ సిఫార్సులను వెంటనే అమలయ్యేలా మీరు కృషి చేయండి. మేము సిద్దంగా ఉన్నాం...మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. సీఎం దావోస్ పర్యటనలో ఉన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు.’ అని తెలిపారు. చదవండి: తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు: మంత్రి అంబటి -
నూనెలు అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాలు, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. వంటనూనెల ధరల నియంత్రణపై మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెలను అధిక రేట్లకు విక్రయించినా, పరిమితికి మించి నిల్వలు ఉంచినా బైండోవర్ కేసులు నమో దు చేయాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ దందా పై నిరంతరం నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు వ్యాపా ర దుకాణాలు, నూనె తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రణాళిక ప్రకారం రైతుబజా రులు, మున్సిపల్ మార్కెట్లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి, బయటి ధరల కంటే తక్కువకు వంటనూనెలను అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా మండలాల వారీగా నూనె ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల న్నారు. సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకాన్ని ప్రోత్సహించాలి పామ్ ఆయిల్ దిగుమతులపై ఆంక్షలున్న నేపథ్యంలో సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకం వైపు ప్రజలను ప్రోత్సహించాలని మంత్రి కారుమూరి సూచించారు. ఆ నూనెలను ఆయిల్ ఫెడ్ ద్వారా విక్రయించడంతో పాటు కనోల ఆయిల్ (ఆవనూనె) అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించి, సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. బ్లాక్ మార్కెట్, కల్తీ నూనెల విషయంలో ఇప్పటి వరకు 76 కేసులు నమోదు చేశామని, 22,598 క్వింటాళ్ల నూనెలను జప్తు చేశామని మంత్రి వివరించారు. వీటిల్లో కేసులు పరిష్కరించిన బ్రాండ్లను తిరిగి మార్కెట్లోకి విడుదల చేసినట్టు చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శంకబ్రత బాగ్చి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కిశోర్‌కుమార్, రైతుబజార్ సీఈవో శ్రీనివాస రావు, ఏపీ ఆయిల్ ఫెడ్ ఎండీ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం ఆదేశాలను బీజేపీ విస్మరించడం విడ్డూరంగా ఉంది: కారుమూరి
సాక్షి, తాడేపల్లి: నగదు బదిలీపై అపోహలు సృష్టిస్తున్నారని, నగదు బదిలీ ప్రారంభించాలని 2017లోనే కేంద్రం సూచించిందని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఆదేశాలపై అదే పార్టీ విస్మరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజల ఇష్టంతోనే పైలట్ ప్రాజెక్టుగా రెండు, మూడు మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తామని అన్నారు. ఇష్టం ఉన్న వాళ్లకి నగదు బదిలీ చేస్తామని, ఇష్టం లేని వాళ్లకి బియ్యం ఇస్తామని అన్నారు. కార్డులు తొలగిస్తామని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవ్వరి కార్డులు తొలగించం.. జూన్‌లో కూడా కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇంకా రేటు నిర్ణయించలేదని, రూ. 16 రూపాయలంటూ కొన్ని టీవీ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజలని భయభ్రాంతులకి గురి చేసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. -
‘వలంటీర్లు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారు’
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకు చేర్చేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థ తెచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో వలంటీర్లకు సేవారత్న, మిత్ర, వజ్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హాజరైన కారుమూరి.. మీడియాతో మాట్లాడారు. పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకే చేర్చేలా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వలంటీర్లు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మావాళ్ళకే చేయండి.. మావాళ్లనే చూడండి అని కలెక్టర్ల మీటింగ్ లో చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు భేదం లేకుండా సంక్షేమం అందరికీ అందాలని చెప్పారు. మండపాక గ్రామంలో టీడీపీ హయాంలో కోటి 8 లక్షల రూపాయిలు మాత్రమే ఖర్చు చేశారు.మండపాక గ్రామంలో వై యస్ ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక 11 కోట్ల 81 లక్షల రూపాయిలు ఖర్చు చేశాము. రెండున్నర ఏళ్లలో మేము రూ. 7,109 కోట్ల తణుకు మండలానికి ఖర్చు చేశాము. 346 ఎకరాలు సేకరించి 18 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. దేశంలోని ముఖ్యమంత్రులు మన పాలనవైపు చూస్తున్నారు. 70 శాతం బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు క్యాబినెట్ లో స్థానం కల్పించారు’ అని కారుమూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విష్ణు చరణ్, జేసీ మురళీ, శెట్టి బలిజ కార్పోరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమాత్య యోగం.. అద్వితీయం.. కీలక నేతలకు కేబినెట్లో స్థానం
సాక్షి, ఏలూరు: సీనియార్టీకి సముచిత స్థానం, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా జిల్లాలో కీలక నేతలకు మంత్రి పదవులు దక్కాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలకు తొలిసారి కేబినెట్లో చోటు దక్కగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తానేటి వనితకు మరలా అమాత్య యోగం దక్కింది. నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముదునూరు ప్రసాదరాజుకు చీఫ్ విప్‌గా అవకాశం రాగా మొత్తంగా కేబినెట్లో జిల్లాకు కీలక ప్రాధాన్యం దక్కింది. అంకితభావానికి పెద్దపీట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు యధావిధిగా మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాదిరిగానే ఇప్పుడూ ప్రాధాన్యమిచ్చారు. ఈసారి అదనంగా ప్రభుత్వ విప్ పదవిని కూడా అప్పగించారు. పార్టీపై విధేయత, పాల నపై అంకితభావం చూపిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ యాదవ), తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనా రాయణ (కాపు), కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత (ఎస్సీ), న రసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు (క్షత్రి య)కు పదవియోగం దక్కింది. సామాజిక కూర్పు లు, పార్టీల విధేయత ఇలా పలు అంశాలను ప్రామా ణికంగా తీసుకుని మంత్రి పదవులకు ఎంపిక చేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి. తొలిసారిగా కేబినెట్లోకి.. తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు తొలిసారి కేబినెట్లో చోటుదక్కించుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా ప్రాంతాల్లో బాణసంచా కాల్పులు, మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగాయి. తణుకులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి చరిత్రలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజకు మా త్రమే కేబినెట్లో అవకాశం దక్కగా.. ఈసారి ఇందుకు భిన్నంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు వనిత, కొట్టు, కారుమూరి, ముదునూరి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, పార్టీకి విధేయులుగా ఉంటూ పాలనలో తమ మార్కును చూపిస్తున్నారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు, ఒకరికి చీఫ్ విప్ పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా నూతన పశ్చిమగోదావరిలో ఇద్దరికి అవకాశం రాగా ఏలూరు జిల్లాలో ఎవరికీ చాన్స్ దక్కలేదు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యానికి జై‘కొట్టు’ తాడేపల్లిగూడెం: సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ని రంతరం ప్రజలను వె న్నంటి ఉండే గుణంతో బలమైన నాయకుడిగా ఎదిగారు ప్రభుత్వ హా మీల అమలు కమిటీ చై ర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. 1994 నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పలు సమస్యలపై పోరాడారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సందర్భంలో పట్టణంలో అ భివృద్ధి ఎలా ఉంటుందో ల్యాండ్ మార్కులతో చేసి చూపించారు. 2004లో దివంగత వైఎస్సార్ సారథ్యంలో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఐదేళ్ల పదవీ కాలంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. పీసీసీ సభ్యునిగా, మెంబర్ ఆఫ్ ఎస్యూరెన్స్ కమిటీ ఏపీ లెజిస్లేటివ్, మెంబర్ ఆఫ్ హౌస్ కమిటీ ఇరిగ్యు లారిటీస్ ఆఫ్ మిల్క్‌డైరీస్ సభ్యునిగా పనిచేశారు. గత సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన 2019లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజ యం సాధించారు. ప్రభుత్వ హామీల అమలు కమి టీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1955 అక్టోబర్ 19న కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి దంపతులకు ఆ యన జన్మించారు. భార్య సౌదామిని, ఇద్దరు కుమారులు బాలరాజేష్, విశాల్, కుమార్తె కంచన్ ఉన్నా రు. పుస్తకాలు చదవడం, బ్యాడ్మింటన్ ఆడటం ఆయన అలవాట్లు. నిత్యం యోగా చేస్తుంటారు. అందరివాడు.. కారుమూరి తణుకు అర్బన్ : తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. వి ద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లపాటు సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్ సారథ్యంలో 2009లో తణుకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత కాలంలో వైఎస్సార్ పార్టీలో చేరి 2014లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరలా 2019 ఎన్నికల్లో తణుకు నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ న్యూ అలుమ్నీ అసోసియేషన్ వెస్ట్ బ్రుక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లా యీస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. మీ ఇంట్లో మంత్రిగా ఉంటా.. ‘నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే మంత్రి పదవి ఇచ్చి నన్ను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది సీఎం జగన్. బీసీ నేతగా నన్ను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎప్పటిలాగే నియోజకవర్గంలో ప్రజానీకానికి అందుబాటులోనే ఉంటూ మీ ఇంట్లో మంత్రిగానే ఉంటాను’ అని ఆయన స్పష్టం చేశారు. విధేయతలో రా‘రాజు’ నరసాపురం: పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసి విధేయతలో రారాజుగా నిలిచారు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. దివంగత సీఎం వైఎస్సార్ స్ఫూర్తితో 2002లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అంచెలంచెలుగా ముందుకు సాగారు. యలమంచిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప తేడాతో పరాజయం పొందారు. ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం ఎమ్మెల్యే అప్పటినుంచి 2009 వరకూ నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా గెలుపొందారు. వైఎస్సార్ అకాల మరణం అనంతరం జరిగిన పరిణామాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచి 2012లో ఎమ్మె ల్యే పదవిని త్యాగం చేశారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అతిస్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. మరలా 2014లో ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా వ్యవహరించి నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజర్టీతో గెలుపొందారు. 1974 మే 29న సత్యనారాయణరాజు, వెంకట సరోజినీదేవి దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు భార్య శారదావాణి, కుమారుడు శ్రీకృష్ణంరాజు, కుమార్తె సింధూజ ఉన్నారు. -
ఎమ్మెల్యే కారుమూరికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విజయపురి సౌత్(మాచర్ల): తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని ఏడో మైలు చెక్‌పోస్ట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు దెబ్బతింది. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్తుండగా ఎత్తిపోతల అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే మాచర్ల వైపు నుంచి సాగర్ వైపు వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొట్టింది. రెండు కార్లలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు