తన ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే ఉంటానని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అశోక్‌గౌడ్ స్పష్టం చేశారు.
దెందులూరు: తన ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే ఉంటానని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అశోక్‌గౌడ్ స్పష్టం చేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పారు.
దెందులూరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో బాధ పడిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాటను శిరసావహిస్తానని తెలిపారు. జగన్ సూచించిన అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. దెందులూరు అసెంబ్లీ టిక్కెట్ తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు ఇచ్చిన సంగతి తెలిసిందే.