Ashok Goud
-
న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తాం
-
మాకెందుకు టిక్కెట్లు ఇవ్వరు?
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ కార్యాలయం ముందు పలువురు బీసీ నేతలు ఆందోళనకు దిగారు. జనాభా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలంటూ నిరసనకు దిగారు. టిక్కెట్ ఇవ్వకపోతే రెబల్‌గా పోటీకి దిగుతామంటూ బీసీ నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఓబీసీ కమిటీ కన్వీనర్ అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. 4.2 శాతం ఉన్న ఓ సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసిందని ఆరోపించారు. బీసీలకు సరైన విధంగా సీట్లు కేటాయించకపోతే ఓట్లు అడగవద్దని అన్నారు. బీసీలు ఇంతకుముందులా లేరని వ్యాఖ్యానించారు. 4.2 శాతం ఉన్న ఓ సామాజికవర్గం వారికి 42 సీట్లు కేటాయిస్తే 50 శాతం పైగా ఉన్న బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించాలని సూటిగా ప్రశ్నించారు. ఆ సామాజిక వర్గం అభ్యర్థులపై ఎన్ని కేసులున్నా సీట్లు కేటాయిస్తారు కానీ.. క్లీన్ ఇమేజ్ ఉన్న మాకు(బీసీలకు) సీట్లు ఎందుకు కేటాయించరని అడిగారు. స్క్రీనింగ్ కమిటీలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని, స్క్రీనింగ్ కమిటీతో బీసీలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. బీసీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌లో ముందే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని రాహుల్ గాంధీని కోరుతున్నామని ప్రకటించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతోందని, మాకు సరైన విధంగా సీట్లు కేటాయించకపోతే తమ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. మమ్మల్ని రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకెళ్లాలని లేకపోతే న్యాయం జరిగే వరకు ఏఐసీసీ ఆఫీసు ఎదుటే కూర్చుని దీక్ష చేస్తామని, అవసరమైతే ఆత్మహత్యకు ప్రయత్నిస్తామని బీసీ నేతలు హెచ్చరించారు. -
టీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గ ప్రకటన
లండన్ : టీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గాన్ని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ప్రకటించారు. టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడిగా అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా పోచారం సురేందర్ రెడ్డి ఎంపికయ్యారు. అనిల్ కూర్మాచలం నేతృత్వంలో యూకేలో మొట్ట మొదటగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి గత 8 సంవత్సరాలుగా అటు తెలంగాణ ఉద్యమంలో ఇటూ బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తుందని మహేష్ బిగాల తెలిపారు. త్వరలో అనిల్ కూర్మాచలంకు యూరోప్ (ఖండం) బాధ్యతలు అప్పజెప్పుతామన్నారు. యూకే నూతన కార్యవర్గం : అధ్యక్షులు : అశోక్ గౌడ్ దుసారి ఉపాధ్యక్షులు : నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు ప్రధాన కార్యదర్శి : రత్నాకర్ కడుదుల అడ్వైజరీ బోర్డు చైర్మన్ : పోచారం సురేందర్ రెడ్డి అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ : సీకా చంద్రశేఖర్ గౌడ్ అడ్వైజరీ బోర్డు సభ్యులు : దొంతుల వెంకట్ రెడ్డి, విక్రమ్ రెడ్డి రేకుల, ప్రవీణ్ కుమార్ వీర, శ్రీనివాస్ కలకుంట్ల కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ : సత్యం రెడ్డి కంది వైస్ చైర్మన్ : శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, మధుసూధన్ రెడ్డి గుద్దంటి కార్యదర్శులు : సృజన్ రెడ్డి చాడ, హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల సంయుక్త కార్యదర్శులు : సేరు సంజయ్, మల్లా రెడ్డి బీరం, సతీష్ రెడ్డి బండ, రమేష్ యేసంపల్లి, సురేష్ గోపతి అధికార ప్రతినిధులు : రవి కుమార్ రేటినేని, రవి ప్రదీప్ పులుసు, చిత్తరంజన్ రెడ్డి తంగెళ్ల, నవీన్ మాదిరెడ్డి లండన్ ఇంచార్జ్ : నవీన్ భువనగిరి, గణేష్ పాస్తం, సురేష్ బుడగం, భాస్కర్ మొట్ట కోశాధికారి : సతీష్ గొట్టిముక్కుల మీడియా ఇంచార్జ్ : సత్యపాల్ పింగిళి ఐటీ కార్యదర్శి : వినయ్ ఆకుల వెల్ఫేర్ ఇంచార్జ్ : రాజేష్ వర్మ మెంబెర్ షిప్ ఇంచార్జ్ : అశోక్ కుమార్ అంతగిరి ఈవెంట్స్ ఇంచార్జ్ : వంశీ పొన్నం ఈస్ట్ లండన్ ఇంఛార్జ్ : భరత్ బాశెట్టి, ప్రశాంత్ కటికనేని వెస్ట్ లండన్ ఇంచార్జ్ : నగేష్ రెడ్డి మారపల్లి రీజినల్ కోఆర్డినేటర్ : జితేందర్ రెడ్డి బీరం(వేల్స్), శివ కుమార్ (లీడ్స్) ఎగ్జిక్యూటివ్ సభ్యులు : హరికృష్ణ వుప్పల, మహేందర్ రెడ్డి, అబ్దుల్ జాఫర్, రామ్ కలకుంట్ల, వేణు తాటికుంట, సంతోష్ కుమార్ ఆకుల -
మేము సైతం!
మండలి బరిలోకి దిగిన ఎంపీటీల ఫోరం అభ్యర్థులు కొత్త అశోక్‌గౌడ్, సునీత పేర్లు ఖరారు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి పోరులో సొంత అభ్యర్థులను బరిలో దించాలని మండల ప్రాదేశిక సభ్యుల(ఎంపీటీసీ) ఫోరం నిర్ణయించింది. పార్టీలకతీతంగా స్థానిక సంస్థల ప్రతినిధులను పోటీ చేయించాలని నిర్ణయించిన ఫోరం.. రంగారెడ్డి జిల్లా నుంచి రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కొంగరకలాన్ ఎంపీటీసీ, ఇబ్రహీంపట్నం వైస్ ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్, గాగిల్లాపూర్ ఎంపీటీసీ సునీతా సంజీవరెడ్డిని అభ్యర్థులుగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో జరిగే కౌన్సిల్ స్థానాలకు ‘స్థానిక’ ప్రతినిధులకు కేటాయించ కుండా.. ఇతరులకు టికె ట్లివ్వడంపై తీవ్ర అభ్యంతరం చేసిన ఫోరం.. సొంత అభ్యర్థులను బరిలో దించాలని నిర్ణయించింది. ఆత్మప్రభోదానుసారం ఓటు హక్కు వినియోగించుకోవాలనే నినాదంతో సభ్యులవద్దకు వెళ్తున్నట్టు అశోక్‌గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. అధికారాలు, విధులపై మండలిలో వాణిపించేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులుగా అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు చెప్పారు. ఇదిలావుండగా, మండలి స్థానాలకు జరిగే ఓటింగ్ విధానంపై ఎంపీటీసీ సంఘం సభ్యులు రిటర్నింగ్ అధికారి కాట ఆమ్రపాలితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పలు సందేహాలను నివృత్తిచేసుకున్న సభ్యులకు ఓటింగ్ విధానంపై స్పష్టత రాలేదు. రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ ఉంటుందా? ప్రాధాన్య క్రమంలో ఓటింగ్ నిర్వహిస్తారా అనే అంశంపై రిటర్నింగ్ అధికారి నుంచి తగిన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే దీనిపై స్పష్టమైన వివరణ ఇస్తామని చెప్పినట్లు ఎంపీటీసీ ఫోరం నాయకులు తెలిపారు. -
కరెంటు కాటుకు యువ రైతు బలి
చేగుంట : ట్రాన్స్ఫార్మర్ నుంచి బోరు మోటార్లకు వచ్చే విద్యుత్ సరఫరాను నిలివేసే క్రమంలో ఓ యువ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలనును వదిలాడు. ఈ సంఘటన మండలంలోని ఉప్పర్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అశోక్‌గౌడ్ (26) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం తన పొలంలో పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో బోరుకు సంబంధించిన మోటారులో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో దానిని మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపేందుకు నిర్ణయించాడు. అందులో భాగంగానే ట్రాన్స్ఫార్మర్ వద్దకు ఏవీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టు పక్కల రైతులు ప్రమాదాన్ని పసిగట్టి రక్షించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో రైతులు కుటుంబ సభ్యులు, చేగుంట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి చేరుకుని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య సంధ్య ఒక కూతురు రుచిక ఉన్నారు. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే అశోక్‌గౌడ్ కరెంటు షాక్‌కు గురై మృతి చెందాడని గ్రామస్తులు, రైతులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి : మరో ఘటనలో విద్యుదాఘాతానికి గురై ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పోసాని పల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రమౌళి తన వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎద్దును మేపుతున్నాడు. ఈ క్రమంలో ఎద్దు ట్రాన్స్ఫార్మర్ను ప్రమాదవశాత్తు తాకకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు మృతితో తనకు రూ. 35 వేలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యాడు. -
ఆఖరి శ్వాస వరకు జగన్ వెంటే: అశోక్‌గౌడ్
దెందులూరు: తన ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అశోక్‌గౌడ్ స్పష్టం చేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. దెందులూరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో బాధ పడిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాటను శిరసావహిస్తానని తెలిపారు. జగన్ సూచించిన అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. దెందులూరు అసెంబ్లీ టిక్కెట్ తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు ఇచ్చిన సంగతి తెలిసిందే.