న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తాం | BC Leaders protest Infront Of AICC Office | Sakshi
Sakshi News home page

న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తాం

Published Thu, Nov 8 2018 1:49 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఏఐసీసీ కార్యాలయం ముందు పలువురు బీసీ నేతలు ఆందోళనకు దిగారు. జనాభా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలంటూ నిరసనకు దిగారు. టిక్కెట్‌ ఇవ్వకపోతే రెబల్‌గా పోటీకి దిగుతామంటూ బీసీ నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఓబీసీ కమిటీ కన్వీనర్‌ అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. 4.2 శాతం ఉన్న ఓ సామాజికవర్గం కాంగ్రెస్‌ పార్టీని హైజాక్‌ చేసిందని ఆరోపించారు. బీసీలకు సరైన విధంగా సీట్లు కేటాయించకపోతే ఓట్లు అడగవద్దని అన్నారు. బీసీలు ఇంతకుముందులా లేరని వ్యాఖ్యానించారు. 4.2 శాతం ఉన్న ఓ సామాజికవర్గం వారికి 42 సీట్లు కేటాయిస్తే 50 శాతం పైగా ఉన్న బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించాలని సూటిగా ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement