
పశ్చిమ గోదావరి: ప్రజలు బాధపడితే చంద్రబాబు ఆనందపడతారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు మండిపడ్డారు. చంద్రబాబును ఒక శాడిస్ట్‌గా వర్ణించించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ప్రజలు బాధపడితే చంద్రబాబు ఆనందపడతారు. చంద్రబాబు పాదం కూడా అంతే ఆయన ఉన్నంతకాలం వర్షాలు పాడేవి కాదు.. పంటలు పండేవి కాదు. కొనసాగుతున్న పథకాలకు డబ్బులు వేయద్దని ఈసీ చెప్పిందంటే.. చంద్రబాబు ఎంత కసరత్తు చేశాడో?. ఈసీ కూడా పక్షపాతి ధోరణిలో వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు ఎలక్షన్ ముందు పసుపు కుంకుమలు అంటూ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే అప్పుడు ఎందుకు ఆమోదించింది.
తెలంగాణాలో అడ్డురాని సంక్షేమం ఇక్కడే ఎందుకు అడ్డు వచ్చింది. రైతులకు ఇప్పుడు అందించే సాయిం ఖరీఫ్ పంటల పెట్టుబడులకు మేలు చేస్తుంది. బడి విద్యార్థులు నూతన విద్యా సంవత్సరానికి ఇబ్బందులు పడతారు. ఈసీ మరొక్కసారి పునః పరిశీలన చేయాలి’అని కారుమూరి అన్నారు.