![Minister Karumuri Nageswara Rao Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/12/karumuri-nageswara-rao.jpg.webp?itok=Yvkh61Mm)
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీ ముసుగులో జరుగుతున్నదే మహా పాదయాత్ర అని, అందులో ఉన్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్రాస్, హైదరాబాద్‌లో తంతే అమరావతిలో పడ్డాం. మరోసారి భవిష్యత్ తరాలకు ఆ పరిస్థితి రాకూడదన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: ‘అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు’
‘‘టీడీపీ పరిస్థితి భూ స్థాపితం అయిపోయింది. చంద్రబాబు ఆడుతున్న నాటకం పూర్తిగా బట్టబయలైంది. అన్ని వర్గాల వారు శాంతియుతంగా నిరసన చేస్తుంటే టీడీపీ నేతలు రెచ్చ గొడుతున్నారు. మూడు రాజధానులు కావాలని ప్రజలు కోరుతున్నారు. పాదయాత్రకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వరకు నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. చంద్రబాబు 14 ఏళ్లలో అవినీతి పాలన చేశారు’’ అని కారుమూరి దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి గెలవాలని మంత్రి సవాల్ విసిరారు. ‘‘స్థానిక ఎన్నికల్లో గెలవలేని టీడీపీకి తమ రాజీనామాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మహా పాద యాత్ర కాదు.. ఫేక్ యాత్ర అది’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment