
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికలు ముందు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ.. అన్ని ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధించాం. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన’’ అని మంత్రి స్పష్టం చేశారు.
‘‘గత చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను దివాలా తీయించింది. 20 వేల కోట్ల అప్పులు చేసింది. వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారు. ఆ అప్పులన్నీ మేము తీర్చి శాఖను మళ్లీ గాడిలో పెట్టాం. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చాం. కోటి 46 లక్షల మందికి మేము రేషన్ ఇస్తున్నాం. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చాం.. వాటికి కేంద్రం సాయం చేయాలని కోరాం. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసింది’’ అని మంత్రి కారుమూరి అన్నారు.
చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు భారీ షాక్...
Comments
Please login to add a commentAdd a comment