
దెబ్బతిన్న ఎమ్మెల్యే కారుమూరి కారు
సాక్షి, విజయపురి సౌత్(మాచర్ల): తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని ఏడో మైలు చెక్‌పోస్ట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు దెబ్బతింది. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్తుండగా ఎత్తిపోతల అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే మాచర్ల వైపు నుంచి సాగర్ వైపు వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొట్టింది. రెండు కార్లలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment