టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) 2022, డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పంత్.. రూర్కీలోని తన సొంతింటికి వెళ్తుండగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్న పంత్‌ను హైవేపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కాపాడారు. వీరిలో ఓ వ్యక్తి రజత్ (25) ప్రస్తుతం చావు బతుకులతో పోరాడుతున్నాడు.
రజత్.. తన ప్రియురాలు మనూ కశ్యప్‌తో (21) కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరి ప్రేమను మనూ తరపు వారు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందట ఈ జంట ఎవరూ లేని నిర్మానుష ప్రాంతంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న వీరిని అటుగా వెళ్తున్న వారు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మనూ తుదిశ్వాస విడిచింది.
రజత్ పరిస్థితి విషమంగా ఉంది. మనూ మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లి రజతే తన కూతురికి విషమిచ్చి చంపాడని ముజఫర్‌నగర్ పోలీసులకు (ఉత్తర్‌ప్రదేశ్) ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమ వైఫల్యం కారణంగా ఇద్దరూ ఇష్ఠపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పిడినట్లు పోలీసులు చెప్పారు.
మనూ, రజత్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. మనూ పెద్దలు వేరే వ్యక్తితో ఆమె వివాహానికి ప్లాన్ చేశారు. ఇది తెలిసి మనూ, రజత్ ఆత్యహత్యకు పాల్పడ్డారు.
కాగా, రజత్ అతని స్నేహితుడు నిషు.. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. తనను కాపాడినందుకు పంత్.. రజత్, నిషులకు స్కూటర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న పిమ్మట పంత్ మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. పునరాగమనంలో పంత్ మునుపటి తరహాలోనే అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన పంత్.. గతేడాది టీమిండియా టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment