ఈసీ ఆదేశాలను పునఃసమీక్షించాలి: మంత్రి బొత్స
చంద్రబాబు నరరూప రాక్షసుడు: ఎంపీ భరత్
బాబుకు అవ్వాతాతల శాపనార్థాలు: మంత్రి కారుమూరి
చంద్రబాబుది రాక్షసానందం: మంత్రి ఆదిమూలపు
సాక్షి నెట్‌వర్క్ : పేదవారంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన భావమేనని.. ప్రతీనెల ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడని, అందుకే వారిపై ఆయన కక్ష కట్టాడని పలువురు మంత్రులు మండిపడ్డారు. దీంతో చంద్రబాబు తన జేబు సంస్థ అయిన ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ముసుగులో తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్కుమార్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి.. దాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీచ రాజకీయాలు చేస్తూ వలంటీర్లపై ఫిర్యాదు చేయడమంటే.. ప్రజలకు జరుగుతున్న మేలు అడ్డుకోవడమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో అవ్వాతాతలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు. ఎవరెవరు ఏమేన్నారంటే..
ఈసీ ఆదేశాలను పునఃసమీక్షించాలి..
ప్రతీనెలా ఒకటో తేదీన ప్రభుత్వమిచ్చే పెన్షన్లపై ఎన్నో ఆశలు పెట్టుకుని అవ్వాతాతలు జీవిస్తున్నారు. అలాంటి వారికి వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలి. పేదోడు బాగా ఉంటే చంద్రబాబుకు తిన్నది అరగదు. పెన్షన్లు ఇవ్వనీయకుండా.. నిరుద్యోగుల డీఎస్సీని అడ్డుకున్న దుషు్టడు చంద్రబాబు. పెన్షన్ పంపిణీకి ఎటువంటి ప్రత్యామ్నాయం చేసినా ఇబ్బందులు తప్పవు. అది ఒక నెలతో పోయేది కాదు.. మూడునెలల పాటు అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటే ఆ పాపం శాపమై చంద్రబాబుకు చుట్టుకుంటుంది. – బొత్స సత్యనారాయణ, మంత్రి
వలంటీర్లపై విషం కక్కుతున్నారు
పది మంది జీవితాల బాగు కోసం పాటుపడుతూ.. పారదర్శకంగా ప్రజాసేవకు అంకితమైన వలంటీర్లపై చంద్రబాబు, పచ్చబ్యాచ్ విషం కక్కుతున్నారు. ప్రజల కోసం అహరి్నశలు పాటుపడుతున్న వలంటీర్లంటే ఎందుకంత భయం? చంద్రబాబు ఓటమి భయంతోనే వలంటీర్లపై తప్పుడు ఫిర్యాదులు చేయించి కక్ష సాధిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. మొత్తం వలంటీరు వ్యవస్థనే తీసేసే హెచ్చరికగానే దీన్ని భావించాలి. అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిసినా అమానవీయంగా ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబుకు వారి ఉసురు తగులుతుంది. – విడదల రజిని, మంత్రి
బాబుకు అవ్వాతాతల శాపనార్థాలు
అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, కిడ్నీ బాధితులు 1వ తేదీ ఉ.5 గంటల నుంచి ఇంటిగుమ్మంలో పింఛను కోసం ఎదురుచూస్తారు. పెత్తందార్లకు వెన్నుదన్నుగా నిలబడి ప్యాకేజీలు గుంజుకునే చంద్రబాబు పేదలను ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. ముందునుంచీ వలంటీరు వ్యవస్థపై పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్తో ఎన్నికల అధికారికి పిటిషన్ ఇచ్చి వలంటీర్లను విధుల నుంచి తప్పించి పాపం మూటగట్టుకున్నాడు. అవ్వాతాతల శాపనార్థాలు ఆయనకు తగులుతాయి. వారు పడే బాధ నువ్వు కూడా అనుభవించే రోజు వస్తుంది. – కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి
చంద్రబాబుది రాక్షసానందం
అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల ఇంటికి వలంటీర్లు రాకుండా అడ్డుకున్న పాపం చంద్రబాబుదే. గ్రామ వలంటీర్ వ్యవస్థను అడ్డుకుని ఆయన రాక్షసానందం పొందుతున్నారు. ఆయన కుట్రతో అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇకపై మండుటెండల్లో ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో? వలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు పింఛన్లు పంపిణీ చేయాలంటూ చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ బతుకులు ఏవిధంగా ఉంటాయోనని పేదలు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ కూటమికి వారు బుద్ధిచెప్పడం ఖాయం. – ఆదిమూలపు సురేష్, మంత్రి
చంద్రబాబు నరరూప రాక్షసుడు
అవ్వాతాతలపై ఎటువంటి కనికరం లేకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నరరూప రాక్షసుడిలా వ్యవహరించాడు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచీ కడుపు మంటతోనే ఉన్నాడు. ప్రతినెలా ఒకటో తేదీన అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాల రోగుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి, ఆప్యాయంగా పలకరిస్తూ రూ.3 వేల పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు చూడలేకపోయారు. దీంతో వలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించేలా చేశారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది, ఇబ్బందులు పడేది పెన్షన్‌దారులే. – మార్గాని భరత్‌రామ్, ఎంపీ
పెన్షనర్లే టీడీపీ కూటమికి బుద్ధిచెబుతారు
పింఛన్‌దారులను ఇబ్బంది పెట్టడం దారుణం. చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ద్వారా వలంటీర్లతో పింఛన్లను పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో పెన్షనర్లే తెలుగుదేశం కూటమికి బుద్ధిచెబుతారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం. – ఏకుల రాజేశ్వరిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment