సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబును ఎప్పుడూ నమ్మమని రైతులు అంటున్నారని పేర్కొన్నారు. తోకలు కత్తిరిస్తానంటూ బీసీలను చంద్రబాబు అవమానిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, బీసీల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. మూడుసార్లు సీఎంగా చేసిన బాబు ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించారా అని ప్రశ్నించారు.
దుర్మార్గుడు చంద్రబాబు
చంద్రబాబు బతుకంతా మోసమేనని మంత్రి కారుమూరి ధ్వజమెత్తారు. ఆయన ఏనాడైనా పేదవాడికి ఒక సెంటు భూమి ఇచ్చారా అని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటేసే యంత్రాలుగా బీసీలను వాడుకుంటున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. యువగళంలో యువత లేరు. రైతుల యాత్రలో రైతులు లేరని సెటైర్లు వేశారు. వర్ల రామయ్యకు ఎంపీ పదవి అని చెప్పి ఎలా మోసం చేశాడో అందరికీ తెలుసని అన్నారు.
‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సమాధులు కట్టుకోమని అంటున్నారంటే ఇక చంద్రబాబుని ఏమనాలి?.. చంద్రబాబు అంతటి నీచుడు, నయవంచకుడు మరెవరూ లేరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు కూడా రావు. ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరును బాబు ఎలా తలుచకుంటారు. చంద్రబాబు ఓ గుంట నక్క.’ అని మండిపడ్డారు.
చదవండి: ఇదేం తీరు.. ఇదేం హింస? అవినాష్‌రెడ్డిపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా
చంద్రబాబుకు ప్రజలకు రాజకీయ సమాధి కడతారు
సాక్షి, కోనసీమ జిల్లా: రిజర్వేషన్లు తగ్గడానికి టీడీపీనే కారణమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం అమలవుతోందన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజలకు రాజకీయ సమాధి కడతారని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment