సాక్షి, విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ గురించి కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తెలంగాణ చెయ్యని మేలు ఏపీలో తాము చేశామని తెలిపారు. కోవిడ్ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజలను గాలికి వదిలేశారని, ఏపీలో తాము ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వర్షం పడితే పిల్లలు నాలాల్లో కొట్టుకుపోయారనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఏపీలో వర్కౌట్ కాదని విమర్శించారు.
‘ఆంధ్రప్రదేశ్ ధాన్యం తెలంగాణలో అమ్ముతున్నారని కేసీఆర్ చెప్తున్నారు. మేము ఏపీలో ధాన్యం కొన్న తర్వాత మూడు రోజుల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించాం. ఇంటింటికి వెళ్లి బియ్యం ఇస్తున్నాం. మీరు మాములు బియ్యం ఇస్తుంటే మేము సర్టెక్స్ బియ్యం ఇస్తున్నాం. మేము ప్రజలకు ఇస్తున్న సరుకులు మీరు తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు.
హైదరాబాద్‌లో ఇళ్ల మీద నుంచి నీళ్ళు వెళ్తుంటే కేసీఆర్ ఏం చేశారు? ఏపీలో అమలు చేసినన్నీ సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చెయ్యగలిగారా? కేసీఆర్ ఎన్నికల కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం మాట్లాడుకోండి. కానీ మా రాష్ట్రాన్ని విమర్శించడం హాస్యాస్పదం. ఆంధ్రాలో ఉన్న సన్న బియ్యం తెలంగాణకు తీసుకెళ్లడం లేదా..?’ అంటూ కేసీఆర్‌ను మంత్రి కారుమూరి ప్రశ్నించారు.
చదవండి: చంద్రబాబు కోసమే పురంధేశ్వరి పనిచేస్తోంది’
Comments
Please login to add a commentAdd a comment