తణుకు: భీమవరంలో దాడులకు ఉసిగొల్పిన నారా లోకేష్‌పై కేసు పెట్టాలంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. అసాంఘిక శక్తులను తన చుట్టూ పెట్టుకుని లోకేష్ దాడులకు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కారుమూరి. తణుకు పట్టణంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు, నారా లోకేశ్‌ల అరాచకాల్ని ఎండగట్టారు.
‘ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్లో.. ప్రజలపైనే తండ్రీకొడుకుల దాడులు. ప్రశాంతమైన భీమవరంలో ఇలాంటి విధ్వంసమా..?, తండ్రి పుంగనూరులో...తనయుడు భీమవరంలో..!, దౌర్జన్యాలు, దాడులకు దిగుతుంటే చూస్తూ ఊరుకోవాలా?, ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. యువగళం ముసుగులో ఉన్న ఎర్రదండు- రౌడీషీటర్లే.నీ పాదయాత్ర ద్వారా ఏం సందేశం ఇస్తున్నావ్ లోకేశ్..?, రెచ్చగొట్టి ప్రజలపై, పోలీసులపై దాడులు చేయిస్తావా..? ,లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే విధంగానే ఉంది. మా పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా?, సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి కుట్రలకు తెరలేపుతున్నారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంకా ఏం మాట్లాడారంటే:
- వ్యూహాత్మకంగా విధ్వంసానికి కుట్ర
- నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాడు.
- యువగళం వాలంటీర్ల ముసుగులో ఎర్రదండు పేరుతో.. రౌడీషీటర్లు భీమవరంలో విధ్వంసం సృష్టించారు.
- వ్యూహాత్మకంగా కర్రలు, రాడ్లతో గొడవలు సృష్టిస్తున్నారు.
- నూజివీడు, నిడపనీడులోనూ ఇలానే దాడులకు పాల్పడితే వారిని అరెస్ట్ చేశారు.
- భీమవరంలోకి ఆయన పాదయాత్ర రాగానే మరిన్ని గొడవలకు రూపకల్పన చేశారు.
- అక్కడ మా పార్టీ పెట్టిన ఫ్లెక్సీలను చించివేసి, కావాలని వివాదాలు సృష్టించాడు.
- స్థానిక ఎమ్మెల్యే..టీడీపీవారు చింపిన ప్లెక్సీ స్థానంలోనే మరొక ప్లెక్సీ కూడా పెట్టుకున్నాడు.
- లోకేశ్ తన ప్రసంగంలో దుర్భాషలాడుతూ, స్థానిక ఎమ్మెల్యేపై బూతులు తిడుతూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు.
- అతను అసలు చదువుకున్నాడో లేదో కూడా అర్ధం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు.
- అతనే ఆ ఫ్లెక్సీలను చూపించుకుంటూ తన పక్కన ఉన్న వాలంటీర్లను రెచ్చగొట్టాడు.
- రెడ్ బనియన్లు వేసుకున్న వారు యువగళం వాలంటీర్ల ముసుగులో ఉన్నవారంతా రౌడీలే.
- కర్రలు, రాళ్లతో ప్రజలన భ్రయబ్రాంతులకు గురిచేశారు. భీమవరంలో ఇళ్లలోకి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు.
మొదటి నుంచీ లోకేష్ ధోరణి అదే..:
- లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడుతున్నాడు.
- మీరెన్ని కేసులు పెట్టించుకుంటే అంతటి పెద్ద పదవులు ఇస్తానంటూ ఆ పార్టీ కార్యకర్తలకు లోకేశ్ బహిరంగంగానే ఆఫర్ ఇస్తూ వస్తున్నాడు.
- దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ రెచ్చి పోతూ, దాడులు చేస్తూ, దౌర్జన్యంగా స్వైరవిహారం చేశారు.
- పోలీసులను కూడా గాయపరిచారు. వారిలో ఐదారు మంది గాయపడితే ఒకరికి సీరియస్‌గా ఉంది.
- మొన్న తండ్రి పుంగనూరులో...నేడు తనయుడు భీమవరంలో విధ్వంస కాండ సృష్టించారు.
- అసలు మీ యాత్ర ఉద్దేశం ఏంటి..? రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..?
- తండ్రీ కొడుకులు ఇద్దరూ ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఐటీ నోటీసులతో మీరు దొరికిపోయారు.
- మీరు దోపిడీ చేసిన డబ్బు ఎలా తీసుకువచ్చారో స్పష్టంగా లెక్కలతో సహా బయటపడింది.
- టిడ్కో ఇళ్ల పేరుమీద వందలాది కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి డొల్ల కంపెనీల ద్వారా తెప్పించుకున్న తీరు కూడా బయట పడింది.
- నేరుగా ఐటీ శాఖ నోటీసులు పంపితే.. దానిలో రూ.118 కోట్లు చంద్రబాబుకు ముడుపులు అందాయని తేల్చింది.
- లోకేశ్‌కు కూడా ఆ స్కాంలో భాగస్వామ్యం ఉందని తెలిసే సరికి ప్రజలను భయబ్రాంతులను చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
- ఇతనేదో పెద్ద పోటుగాడిలా ఫ్లెక్సీలను చూపిస్తూ దాడికి ఉసిగొల్పాడు.
మీ నైజం, మీ పార్టీ నైజం ఇదేనని ప్రజలకు చెప్తున్నారా?:
- ఇలాంటి దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేసి ప్రజల మన్ననలు పొందాలనుకుంటున్నారా..?
- మీ నైజం, మీ పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా?
- ఈ రోజు 50 మందిని అరెస్టు చేశారు. ప్రతి ఒక్కరూ మీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నారు.
- సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి...ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు.
- చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసిన వాగ్ధానాలన్నీ చెత్తబుట్టలో పడేశాడు.
- మళ్లీ ఎన్నికలు రాగానే కల్లబోల్లి మాటలు చెప్తూ లబ్ధిపొందాలని చూస్తూనే ఉంటాడు.
- గత ఎన్నికల్లో 650 వాగ్ధానాలు చేసి తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు.
- జగన్ గారి నాయకత్వంలో.. మన రాష్ట్ర జీఎస్‌డీపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
- రాష్ట్ర ప్రగతిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్.
- పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన నాయకుడు జగన్ గారు.
- మీరెన్ని యాత్రలు చేసినా జగన్ గారిలా ఒక్క మంచి పథకం పేరు చెప్పగలిగే సత్తా మీకు లేదు.
- జగన్ పెట్టిన పథకాలు నేను చేయలేకపోయాను అని ప్రజలకు చెప్పలేక ఇవన్నీ చేస్తున్నాడు.
- విద్య, ఆరోగ్య రంగాలను మరింతగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్.
- సంక్షేమ పథకాలతో నిన్నటి వరకూ పప్పు బెల్లాల్లా పంచేస్తున్నాడు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న ఇదే పెద్ద మనిషి... ఇప్పుడు అవే స్కీంలు పెంచి ఇస్తానంటూ ముందుకు వస్తున్నాడు.
- చిన్నవాడైన ఇన్ని కార్యక్రమాలు క్యాలెండర్ పెట్టి మరీ పంపిణీ చేస్తున్నాడని బాబుకు అక్కసుగా ఉంది.
ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు
- ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్ ను తండ్రీ కొడుకులు ప్రజల మీద చూపిస్తున్నారు. ఈ దుర్మార్గాలు ఇక సాగవు.
- మీ నాన్న, మీ తాతను వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు మీరిద్దరూ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారు.
- ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు.
- అసలు మీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు ఎందుకొచ్చాయి..?
- ఫ్లెక్సీలను చింపి తగలబెట్టిస్తారా..?
- ఇక సహించే ప్రసక్తే ఉండదు...పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తారు. అలాంటి జిల్లాలో మీరు అలజడులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు.
- మీరు వేరే ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి దాడులు చేయిస్తే సహించేది లేదు.
- ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.. టీడీపీ దాడులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.
- దాడికి పాల్పడ్డ వారిమీద, ప్రోత్సహించిన వారిపైన కూడా కేసులు పెట్టాలి.
- వాళ్లంతా యువగళం పేరుతో రెడ్ టీషర్టులు వేసుకున్న రౌడీషీటర్లు.
- తనతో పాటు అసాంఘిక శక్తులను తిప్పుకుంటూ ఇలాంటి చర్యలకు లోకేష్ పాల్పడుతున్నాడు
Comments
Please login to add a commentAdd a comment