Lokesh Nara
-
‘యువగళం ముసుగులో ఉన్నది రౌడీ షీటర్లే’
తణుకు: భీమవరంలో దాడులకు ఉసిగొల్పిన నారా లోకేష్‌పై కేసు పెట్టాలంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. అసాంఘిక శక్తులను తన చుట్టూ పెట్టుకుని లోకేష్ దాడులకు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కారుమూరి. తణుకు పట్టణంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన ప్రెస్మీట్లో చంద్రబాబు, నారా లోకేశ్‌ల అరాచకాల్ని ఎండగట్టారు. ‘ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్లో.. ప్రజలపైనే తండ్రీకొడుకుల దాడులు. ప్రశాంతమైన భీమవరంలో ఇలాంటి విధ్వంసమా..?, తండ్రి పుంగనూరులో...తనయుడు భీమవరంలో..!, దౌర్జన్యాలు, దాడులకు దిగుతుంటే చూస్తూ ఊరుకోవాలా?, ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. యువగళం ముసుగులో ఉన్న ఎర్రదండు- రౌడీషీటర్లే.నీ పాదయాత్ర ద్వారా ఏం సందేశం ఇస్తున్నావ్ లోకేశ్..?, రెచ్చగొట్టి ప్రజలపై, పోలీసులపై దాడులు చేయిస్తావా..? ,లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే విధంగానే ఉంది. మా పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా?, సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి కుట్రలకు తెరలేపుతున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంకా ఏం మాట్లాడారంటే: వ్యూహాత్మకంగా విధ్వంసానికి కుట్ర నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాడు. యువగళం వాలంటీర్ల ముసుగులో ఎర్రదండు పేరుతో.. రౌడీషీటర్లు భీమవరంలో విధ్వంసం సృష్టించారు. వ్యూహాత్మకంగా కర్రలు, రాడ్లతో గొడవలు సృష్టిస్తున్నారు. నూజివీడు, నిడపనీడులోనూ ఇలానే దాడులకు పాల్పడితే వారిని అరెస్ట్ చేశారు. భీమవరంలోకి ఆయన పాదయాత్ర రాగానే మరిన్ని గొడవలకు రూపకల్పన చేశారు. అక్కడ మా పార్టీ పెట్టిన ఫ్లెక్సీలను చించివేసి, కావాలని వివాదాలు సృష్టించాడు. స్థానిక ఎమ్మెల్యే..టీడీపీవారు చింపిన ప్లెక్సీ స్థానంలోనే మరొక ప్లెక్సీ కూడా పెట్టుకున్నాడు. లోకేశ్ తన ప్రసంగంలో దుర్భాషలాడుతూ, స్థానిక ఎమ్మెల్యేపై బూతులు తిడుతూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు. అతను అసలు చదువుకున్నాడో లేదో కూడా అర్ధం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు. అతనే ఆ ఫ్లెక్సీలను చూపించుకుంటూ తన పక్కన ఉన్న వాలంటీర్లను రెచ్చగొట్టాడు. రెడ్ బనియన్లు వేసుకున్న వారు యువగళం వాలంటీర్ల ముసుగులో ఉన్నవారంతా రౌడీలే. కర్రలు, రాళ్లతో ప్రజలన భ్రయబ్రాంతులకు గురిచేశారు. భీమవరంలో ఇళ్లలోకి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మొదటి నుంచీ లోకేష్ ధోరణి అదే..: లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. మీరెన్ని కేసులు పెట్టించుకుంటే అంతటి పెద్ద పదవులు ఇస్తానంటూ ఆ పార్టీ కార్యకర్తలకు లోకేశ్ బహిరంగంగానే ఆఫర్ ఇస్తూ వస్తున్నాడు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ రెచ్చి పోతూ, దాడులు చేస్తూ, దౌర్జన్యంగా స్వైరవిహారం చేశారు. పోలీసులను కూడా గాయపరిచారు. వారిలో ఐదారు మంది గాయపడితే ఒకరికి సీరియస్‌గా ఉంది. మొన్న తండ్రి పుంగనూరులో...నేడు తనయుడు భీమవరంలో విధ్వంస కాండ సృష్టించారు. అసలు మీ యాత్ర ఉద్దేశం ఏంటి..? రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? తండ్రీ కొడుకులు ఇద్దరూ ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఐటీ నోటీసులతో మీరు దొరికిపోయారు. మీరు దోపిడీ చేసిన డబ్బు ఎలా తీసుకువచ్చారో స్పష్టంగా లెక్కలతో సహా బయటపడింది. టిడ్కో ఇళ్ల పేరుమీద వందలాది కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి డొల్ల కంపెనీల ద్వారా తెప్పించుకున్న తీరు కూడా బయట పడింది. నేరుగా ఐటీ శాఖ నోటీసులు పంపితే.. దానిలో రూ.118 కోట్లు చంద్రబాబుకు ముడుపులు అందాయని తేల్చింది. లోకేశ్‌కు కూడా ఆ స్కాంలో భాగస్వామ్యం ఉందని తెలిసే సరికి ప్రజలను భయబ్రాంతులను చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇతనేదో పెద్ద పోటుగాడిలా ఫ్లెక్సీలను చూపిస్తూ దాడికి ఉసిగొల్పాడు. మీ నైజం, మీ పార్టీ నైజం ఇదేనని ప్రజలకు చెప్తున్నారా?: ఇలాంటి దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేసి ప్రజల మన్ననలు పొందాలనుకుంటున్నారా..? మీ నైజం, మీ పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా? ఈ రోజు 50 మందిని అరెస్టు చేశారు. ప్రతి ఒక్కరూ మీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నారు. సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి...ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసిన వాగ్ధానాలన్నీ చెత్తబుట్టలో పడేశాడు. మళ్లీ ఎన్నికలు రాగానే కల్లబోల్లి మాటలు చెప్తూ లబ్ధిపొందాలని చూస్తూనే ఉంటాడు. గత ఎన్నికల్లో 650 వాగ్ధానాలు చేసి తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు. జగన్ గారి నాయకత్వంలో.. మన రాష్ట్ర జీఎస్డీపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర ప్రగతిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన నాయకుడు జగన్ గారు. మీరెన్ని యాత్రలు చేసినా జగన్ గారిలా ఒక్క మంచి పథకం పేరు చెప్పగలిగే సత్తా మీకు లేదు. జగన్ పెట్టిన పథకాలు నేను చేయలేకపోయాను అని ప్రజలకు చెప్పలేక ఇవన్నీ చేస్తున్నాడు. విద్య, ఆరోగ్య రంగాలను మరింతగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. సంక్షేమ పథకాలతో నిన్నటి వరకూ పప్పు బెల్లాల్లా పంచేస్తున్నాడు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న ఇదే పెద్ద మనిషి... ఇప్పుడు అవే స్కీంలు పెంచి ఇస్తానంటూ ముందుకు వస్తున్నాడు. చిన్నవాడైన ఇన్ని కార్యక్రమాలు క్యాలెండర్ పెట్టి మరీ పంపిణీ చేస్తున్నాడని బాబుకు అక్కసుగా ఉంది. ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్ ను తండ్రీ కొడుకులు ప్రజల మీద చూపిస్తున్నారు. ఈ దుర్మార్గాలు ఇక సాగవు. మీ నాన్న, మీ తాతను వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు మీరిద్దరూ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారు. ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. అసలు మీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు ఎందుకొచ్చాయి..? ఫ్లెక్సీలను చింపి తగలబెట్టిస్తారా..? ఇక సహించే ప్రసక్తే ఉండదు...పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తారు. అలాంటి జిల్లాలో మీరు అలజడులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. మీరు వేరే ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి దాడులు చేయిస్తే సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.. టీడీపీ దాడులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడ్డ వారిమీద, ప్రోత్సహించిన వారిపైన కూడా కేసులు పెట్టాలి. వాళ్లంతా యువగళం పేరుతో రెడ్ టీషర్టులు వేసుకున్న రౌడీషీటర్లు. తనతో పాటు అసాంఘిక శక్తులను తిప్పుకుంటూ ఇలాంటి చర్యలకు లోకేష్ పాల్పడుతున్నాడు -
తండ్రీకొడుకుల పాద మహిమకు వర్షం పరార్
ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర పేరుతో ఏపీలో తిరుగుతుండటంతోనే రాష్ట్రంలో వర్షాలు కురువడం లేదని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి. ఒకవైపు లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు ఇటీవ సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కారణంగా వరుణుడు కరుణించడం లేదన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ పాలనలో మొదటి నాలుగేళ్లు బాగా వర్షాలు పడగా, ఇప్పుడు పడటం లేదని గ్రామాల్లో ప్రజలే అనుకుంటున్నారని, దానికి కారణం కూడా లోకేష్, చంద్రబాబులు ఏపీలో పర్యటించడమేనన్నారు. ఆ నాలుగేళ్లు చంద్రబాబు, నారా లోకేష్‌లు హైదరాబాద్‌కే పరిమితం కావడంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయన్నారు 1999-2004 మధ్య ఆంధ్రప్రదేశ్ కరువుకు కేరాఫ్ అడ్రస్‌లా ఉండేదని, ఆ తర్వాత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పుష్కలంగా వర్షాలు కురిసి, రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. మళ్ళీ 2014-19 మధ్య అవే పరిస్థితులు నెలకొంటే వైఎస్ సీఎం అయ్యాక మొదటి నాలుగేళ్లు సకాలంలో వర్షాలు కురిశాయన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ఏపీలో తమ పాదాలు మోపడంతో వారి పాదాల ప్రభావం వల్ల మళ్ళీ వర్షాలు పడడం లేదని, ప్రజలు అభిప్రాయపడుతున్నరనే సంగతిని అవినాష్‌రెడ్డి గుర్తు చేశారు. -
‘వృద్ధసైకో, పిల్లసైకో, ఇంకొక సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారు’
సాక్షి, తాడేపల్లి: అవాస్తవాలను ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. వృద్దసైకో, పిల్లసైకో, ఇంకొక సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారంటూ ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్. శనివారం తాడేపల్లి నుంచి ప్రెస్‌మీట్ నిర్వహించిన మంత్రి జోగి రమేష్, ‘లోకేష్ అప్పడంగాడు. ఈ అప్పడం గవర్నర్ ని కలిసి రాష్ట్రంలో గంజాయి ఉందని ఫిర్యాదు చేశాడు. అసలు ఇతనికి ఉన్న అర్హత ఏంటి?, వార్డు సభ్యునిగా కూడా గెలవని వ్యక్తి గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. గంజాయి సాగుని ధ్వంసం చేసి క్లీన్ ఏపీగా సీఎం జగన్ మార్చారు. అప్పట్లో మీ నాన్న సీఎం గా ఉన్నప్పుడు ఏపీలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగింది. అప్పటి మీ మంత్రులు గంజాయి వ్యాపారం చేశారు. మాటలేమో కోటలు దాటతాయి, చర్చకు రమ్మంటే పారిపోతారు. భూతాలు, పిశాచాలు, సైతానుల గురించి పురాణాల్లో చెప్పేవారు.ఆ ముగ్గురు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లే, ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతుంటే తట్టుకోలేక శాంతిభద్రతల విఘాతం కల్గించాలని చూస్తున్నారు. గంజాయి సరఫరాలో పెద్దపెద్దవారి ఇన్వాల్మెంట్ ఉందని మంత్రులే చెప్పారు.చంద్రబాబు, లోకేష్ పాత్ర ఉందని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు చెప్పారు. మరి అలాంటిది మా ప్రభుత్వంపై గవర్నర్ కి ఫిర్యాదు చేస్తావా లోకేష్? అంటూ నిలదీశారు. ‘అప్పుడు పవన్ ఐస్‌క్రీమ్ తింటున్నారా’ కాకినాడ: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఐస్ క్రీమ్ తింటున్నాడా? అని ప్రశ్నించారు మంత్రి సీదిరి అప్పలరాజు. పవన్ కళ్యాణ్‌ది ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అని, అతనొక రాజకీయ వ్యభిచారి అని సీదిరి మండిపడ్డారు. సచివాలయాల్లో ఎలాంటి సేవలందిస్తారో పవన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థల మీద పవన్‌కు నమ్మకం లేదన్నారు. పవన్‌ని కూడా పీకే గాడు.. వీపీ గాడు అని తాము కూడా ఏకవచనంతో అనలేమా? అని హెచ్చరించారు మంత్రి సీదిరి. చదవండి: హిందూ ధర్మం టార్గెటా? బాబూ పవనూ.. ఎక్కడా?.. ఇక్కడో లుక్కేస్కో -
‘వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు
సాక్షి, నెల్లూరు: తాను వైఎస్సార్సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఖండించారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని, అది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఎంపీ తెలిపారు. ‘పాదయాత్ర అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడం.. ప్రజాప్రతినిధులపై విమర్శలు చెయ్యడం కాదు.రాజకీయాల్లో లోకేష్ పిల్లోడు.. టీడీపీకి సరైన అభ్యర్ధి కూడా లేరు. అభ్యర్దులు లేక వైసీపీ లో ఉండే స్క్రాప్ ను టీడీపీలోకి తీసుకుంటున్నారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వడం కుదరని లోకేష్ చెప్పాడని సోమిరెడ్డి నా దగ్గర ఫీల్ అయ్యాడు. వరుస ఓటములతో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి రికార్డ్ సృష్టించాడు.నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. రూరల్ నుంచే బరిలో దిగుతాను. మాజీ మంత్రి సోమిరెడ్డికి టికెట్ ఇస్తే మరోసారి ఓడిపోతాడు. నేను పార్టీ మారతాను అని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి జీవిత కాలం పోరాటాలు చేసుకోవాల్సిందే. నాలుగేళ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అభివృద్ది చెయ్యడంలో ఫెయిల్ అయ్యాడు. సీఎం వైఎస్ జగన్‌ను నేను కలిసిన తర్వాతే రూరల్‌కి నిధులు మంజూరు అయ్యాయి’ అని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
‘లోకేష్‌కు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి’
సాక్షి, నెల్లూరు: లోకేష్‌కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఒకవేళ లోకేష్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అదే తాను గెలిస్తే లోకేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? అని ప్రశ్నించారు. ‘దొడ్డిదారిన మంత్రి అయ్యి..పోటీ చేసిన ఫస్ట్ ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర లోకేష్‌ది. తండ్రి, తాత సీఎం కాకపోయి ఉంటే లోకేష్ వార్డు మెంబర్‌గా కూడా గెలిచే వాడు కాదు. నేను చేసిన సవాల్‌ను ఆనం స్వీకరించలేకపోయాడు. లోకేష్‌కు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి. లోకేష్ ప్రసంగం అర్ధంకాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ హయాంలో చెయ్యలేని సాగునీటి ప్రాజెక్టులను మేం పూర్తి చేశాం. నాయుడుపేటలో నాకు ఎలాంటి లే అవుట్లు లేవు’ అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. చదవండి: ఆ రాతలతో.. పవన్ పరువు గంగలో కలిపేసిన టీడీపీ మీడియా -
లోకేశ్ డైరెక్షన్.. పల్లె ఓవరాక్షన్
సాక్షి, పుట్టపర్తి: ‘ప్రశాంతి నిలయం’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరులతో కలిసి అలజడి సృష్టించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. దౌర్జన్యకాండకు ఒడిగట్టారు. ఫలితంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ గత నెల 25న పుట్టపర్తి నియోజకవర్గం ఓబుళదేవరచెరువులో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిౖపె అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను అవినీతి చేసినట్లు నిరూపించాలని.. అభివృద్ధిపై ఏప్రిల్ ఒకటో తేదీన పుట్టపర్తి సత్యమ్మ గుడి వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో లోకేశ్ సూచన మేరకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందిస్తూ.. తాను చర్చకు వస్తున్నానని చెప్పడంతో ఆయన్ను పోలీసులు టీడీపీ కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సత్యమ్మ గుడి సర్కిల్‌కు చేరుకున్నారు. కాసేపటికే పల్లె పోలీసుల నుంచి తప్పించుకుని.. భారీగా అనుచరులను వెంటేసుకుని అక్కడికి చేరుకున్నారు. రండి చూసుకుందాం.. పల్లె అక్కడికి వచ్చీ రాగానే కారు పైకెక్కి ‘ఎమ్మెల్యే ఎక్కడ? నేను చర్చకు సిద్ధం’ అంటూ హంగామా చేశారు. వెనుక ఉన్న అనుచరులు తొడలు కొడుతూ.. మీసం మెలేస్తూ ‘రండి రేయ్.. చూసుకుందాం’ అంటూ రెచ్చగొట్టారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై చెప్పులు, రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మ రక్షణ కోసం వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడానికి పూనుకున్నారు. పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో పోలీసులు లాఠీలు ఝుళిపిస్తూ ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఈ దశలో ఎమ్మెల్యే దుద్దుకుంట తన అనుచరులతో కలిసి ఇంటి కెళ్లిపోయారు. బస్టాండ్ వరకు వెళ్లిన పల్లె మళ్లీ సత్యమ్మ గుడి సర్కిల్‌కు చేరుకుని హల్చల్ చేశారు. -
ఇసుకపై.. చంద్రబాబు, లోకేష్ కుట్ర !
సాక్షి, అమరావతి : అధికారంలో ఉండగా ఇసుక దోపిడీకి కొమ్ముకాస్తూ అనుచరగణాన్ని ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నూతన విధానాన్ని నీరుగార్చేందుకు పన్నిన కుట్రలను విజిలెన్స్ విభాగం బట్టబయలు చేసింది. దోపిడీకి ఆస్కారం లేని, పారదర్శక విధానంలో వీలైనంత తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీ నేతలు గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తేల్చింది. చంద్రబాబు, లోకేష్‌లు తమ సన్నిహితులకు చెందిన కంపెనీల ద్వారా ఇసుక రీచ్ టెండర్లలో అతి తక్కువ ధరలకు షెడ్యూలు దాఖలు చేయించడం ఇందులో భాగమేనని వెల్లడైంది. కొన్ని రీచ్‌లకు అత్యంత తక్కువ ధరకు షెడ్యూళ్లు దాఖలు కావడం వెనుక వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రీచ్ దక్కించుకున్నాక కొరత సృష్టించే కుట్ర ఇసుక రీచ్‌లకు నిర్వహించిన టెండర్లను సమగ్రంగా అధ్యయనం చేసిన విజిలెన్స్ విభాగం ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తమ అనుచర గణంతో అతితక్కువ ధరకు టెండర్లను దాఖలు చేయించినట్లు తేల్చింది. తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ షెడ్యూలు దాఖలు చేయడం వెనుక దురుద్దేశపూరిత కుట్ర దాగి ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అతి తక్కువ ధరకు టెండర్లను దక్కించుకున్న తరువాత పాత అనుభవంతో ఇసుక స్మగ్లింగ్‌కు పాల్పడి రూ. వేల కోట్లను కొల్లగొట్టడం, కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర ఇందులో దాగి ఉన్నట్లు విజిలెన్స్ విభాగం పేర్కొంది. విజిలెన్స్ నివేదికతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌లు దక్కించుకున్న కాంట్రాక్టర్లపై డేగ కన్ను వేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా తక్కువ ధరకే ప్రజలకు ఇసుక సరఫరా చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీచ్‌ల నుంచి తవ్వి ఇసుకను డంపింగ్ యార్డ్‌కు తరలించే పనులకు ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ) ఇటీవల టెండర్లు నిర్వహించింది. సగం ధరకే షెడ్యూలు దాఖలు.. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాణ్యమైన ఇసుక విస్తారంగా లభిస్తుంది. ఇసుక లభ్యత అధికంగా ఉండే ఈ మూడు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లపై కన్నేసిన చంద్రబాబు, లోకేష్‌లు తమ సన్నిహితులకు చెందిన ఆరు కంపెనీలతో 26 రీచ్‌ల్లో టన్ను ఇసుకను డంపింగ్ యార్డుకు తరలించేందుకు రూ.50 కంటే తక్కువకే షెడ్యూలు దాఖలు చేయించారు. టన్ను ఇసుక తవ్వి డంపింగ్ యార్డుకు చేర్చడానికి కనీసం రూ.వంద వ్యయం అవుతుందన్నది అధికారవర్గాల అంచనా. అలాంటిది టీడీపీ పెద్దల అనుచర గణం రూ.50 కన్నా తక్కువకే షెడ్యూలు దాఖలు చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నది స్పష్టం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇసుక టెండర్లను పూర్తిగా అధ్యయనం చేసి కుట్ర కోణాన్ని బహిర్గతం చేసింది. ఇసుక రీచ్‌లను దక్కించుకున్న తరువాత గిట్టుబాటు కావడం లేదని డంపింగ్ యార్డ్‌లకు తరలించకుండా మొండికేయడం ద్వారా కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే పన్నాగం ఇందులో దాగి ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కుట్రకు సాక్ష్యాలు ఇవిగో.. కృష్ణా జిల్లాలో గొట్టిపాటి శ్రీధర్ గోపాలకృష్ణ పేరుతో కేవలం రూ.36కే ఒకటో ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి టన్ను ఇసుకను తవ్వి డంపింగ్ యార్డు తరలిస్తామంటూ షెడ్యూలు దాఖలైంది. ఈయన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరుడు, టీడీపీ ఎమ్మెల్సీ బి.అర్జునుడికి సన్నిహితుడు. కృష్ణా జిల్లా 15వ ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి కేవలం రూ.29కే టన్ను ఇసుకను తవ్వి డంపింగ్ యార్డుకు తరలిస్తామంటూ టీడీపీ నేత యలమంచిలి వెంకట కృష్ణమోహన్‌కు చెందిన శ్రీనివాస ఎడిపైస్ ప్రైవేట్ లిమిటెడ్ షెడ్యూలు దాఖలు చేసింది. ఈయన లోకేష్ సన్నిహితుడు కావడం గమనార్హం. గుంటూరు జిల్లా ఏడో ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి మొగిలి శ్రీనివాసరెడ్డికి చెందిన ఎమ్మెస్సార్ కన్స్ట్రక్షన్స్ సంస్థతో కేవలం రూ.15కే టన్ను ఇసుకను రీచ్ నుంచి తవ్వి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తామంటూ షెడ్యూలు దాఖలు చేయించారు. మొగిలి శ్రీనివాసరెడ్డి తెలంగాణకు చెందిన టీడీపీ నేత. 2014 తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అయినప్పటికీ ఆయన చంద్రబాబు, లోకేష్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సన్నిహితుడు. మొగిలి శ్రీనివాసరెడ్డి సంస్థకే గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులు అప్పగించేలా పావులు కదిపారు. ఈ టెండర్‌ను ఇటీవల సర్కార్ రద్దు చేసింది. తూర్పు గోదావరి జిల్లా మూడో ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి టన్ను ఇసుకను తవ్వి డంపింగ్ యార్డుకు చేర్చేందుకు సుధాకర్ ఇన్ఫ్రా పేరుతో మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ అనుచరులు రూ.68కే షెడ్యూల్ దాఖలు చేశారు. -
అగ్రి ఆనందం
సాక్షి,కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊరటనిచ్చారు. ఇన్నాళ్లు ఎందుకూ పనికి రాని మెచ్యూరిటీ బాండ్లకు ముఖ్యమంత్రి జీవం పోశారు. రూ.20 వేలలోపు బాండ్లకు రూ.1150 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని సంబర పడుతున్నారు. పది రోజుల్లో పండుగ వచ్చింది... అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. దాచుకున్న సొమ్ముకు భద్రత ఉంటుందని, నాలుగు పైసలు వడ్డీ రూపంలో కలసి వస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేశారు. చివరకు బాండ్లకు మెచ్యూరిటీ వస్తున్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కై పేదలను ముంచారు. కంపెనీ అడ్రస్‌ను గల్లంతు చేశారు. బాధితులు రోడ్లెక్కి ఆందోళనలు చేసినా చంద్రబాబునాయుడు స్పందించలేదు. పైగా అగ్రిగోల్డ్ కొన్ని ఆస్తులను కొట్టేయడంలో నారా లోకేష్ హస్తం ఉందనే ప్రచారం జరిగింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ, అసెంబ్లీ బయట అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ జగన్ అసెంబ్లీలో పోరాడిన తీరుకు ప్రభుత్వం దిగి వచ్చి రూ.250 కోట్లతో రూ.10 వేలలోపు మెచ్యూరిటీ బాండ్లకు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని యథావిథిగా అమలు చేయలేకపోయారు. ఇదే క్రమంలోఅధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించారు. దీంతో వారందరూ ఆయనకు అండగా నిలిచారు. తనకు అండగా నిలిచిన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సోమవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో రూ.20 వేలలోపు మెచ్యూరిటీ బాండ్లకు రూ.1150 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో న్యాయం చేస్తానని పది రోజుల్లో తమకు న్యాయం చేయడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 45 వేల మందికి లబ్ధి... జిల్లాలో అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు, చిట్టీలు వేసిన వారి సంఖ్య 75 వేలు. ఇందులో వినియోగదారులు, ఏజెంట్లు ఉన్నారు. కొందరు ఏజెంట్లు బాధితులకు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో దాదాపు 45 వేల మందికి న్యాయం జరుగుతుంది. -
క్యాష్ ఫర్ ట్వీట్!
-
చంద్రబాబు, లోకేశ్ డైరెక్షన్లో క్యాష్ ఫర్ ట్వీట్!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్ సంస్థ డాటా కుంభకోణం వ్యవహారంపై తెలంగాణ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. మరోవైపు ఐటీగ్రిడ్ తస్కరించిన సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎక్కువయ్యాయి. రెండ్రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చేస్తున్న ప్రకటనలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఇదే క్రమం లో తమ తప్పును కప్పి పుచ్చుకోవడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు, లోకేశ్ చేసిన మరో ప్రయత్నంపై కూడా తెలు గు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. (ఇక్కడ మేము క్షేమమే బాబూ..) డాటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు, భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రెండ్రోజులుగా చంద్రబాబు, లోకేశ్ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టీఆర్ఎస్ అనుమానిస్తోంది. ఇదే అంశాన్ని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం తెలంగా ణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. #CashForTweet అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమం ట్వీట్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేశ్ ఆదేశాల మేరకు ఎదురుదాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ ట్వీట్ల వెనుక చంద్రబాబు, లోకేశ్ హస్తమున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. (‘ఐటీ గ్రిడ్స్’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం) వివిధ రాష్ట్రాల నుంచి ట్వీట్లు ఆంధ్ర, తెలంగాణలతో సంబంధంలేని ట్విట్టర్ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డేటా చౌర్యం కేసుకు సంబంధించి ట్వీట్లు వచ్చాయి. అయితే ఈ ట్వీట్ల సారాంశం అంతా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపేలా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి కూడా తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తాయి. ముంబాయికి చెందిన సంజయ్ బఫ్నా అనే వ్యక్తి ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ట్యాగ్ చేస్తూ ‘వాళ్లు విలువైన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేయడంతోపాటు ఐటీ సంస్థ ఉద్యోగులను కిడ్నాప్ చేసే చర్యలకు పాల్పడినందుకు సిగ్గుపడాలి’అని ట్వీట్ చేశాడు. ఇదే రీతిలో పలువురు తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ట్వీట్ చేశారు. ‘మా నాయకుడితో పోరాడ లేకే.. మా అభివృద్దిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’అని ముంబాయి చెందిన సంతోష్ శుక్లా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. (అదో ‘బ్లాక్మెయిల్’ యాప్) బాలీవుడ్ చౌక్ పేరిట ‘మా ఆస్తులను దొంగిలించారు. మా నీళ్లను దొంగిలించారు. ఇప్పుడు మా డాటాను దొంగిలిస్తున్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు పడాలి’అనే అర్థం వచ్చేలా ట్వీట్ రాగా, మరికొంత మంది కూడా ఇదే అర్థం వచ్చేలా ట్వీట్లు, రీట్వీట్లు చేశారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్న చంద్రబాబు, లోకేశ్ తాజాగా ‘క్యాష్ ఫర్ ట్వీట్’కు తెరలేపినట్లు టీఆర్ఎస్ అనుమానిస్తోంది. డబ్బులు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న తీరుపై సైబర్ క్రైం విభాగంతో పాటు, సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికే ‘ఓటుకు నోటు’, ‘డాటా కుంభకోణం’వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, లోకేశ్ ‘క్యాష్ ఫర్ ట్వీట్’వివాదానికీ కేంద్ర బిందువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
‘లోకేష్ అమ్మాయిలతోనే మందేస్తాడు’
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం పార్టీ నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పోరాటానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు తెలపడంలేదని, బస్సుల్లో పడుకుని మరీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తుంటే.. టాలీవుడ్ వాళ్లు మాత్రం డబ్బు మత్తులో జోగుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. మత్తులో జోగుతున్నది సినిమావాళ్లన్న అంటున్నారని.. అసలు మత్తులో జోగుతోంది ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అని అన్నారు. లోకేష్‌కు సంబంధించిన పలు చిత్రాలను చూపుతూ.. ఆయన కేవలం అమ్మాయిలతోనే మందు తాగుతారని, విదేశాల్లో టేపుతో అమ్మాయిల నడుమును కొలుస్తారని అన్నారు. స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో గడుపుతూ మందు తాగి, సినిమా వాళ్ల కన్నా నీచంగా ప్రవర్తించింది మీ నేతే అనే విషయాన్ని రాజేంద్రప్రసాద్ తెలుసుకోవాలని అన్నారు. ఎదుటివారిని విమర్శించే ముందు కొంచెం తెలివితో మాట్లాడాలని హితవు పలికారు. -
‘లోకేష్ అమ్మాయిలతోనే మందేస్తాడు’
-
ఆస్తి లెక్కల్లో గారడీ చేసిన చంద్రబాబు
-
చంద్రబాబు నాయుడు లెక్కలు భలే!
జూబ్లీహిల్స్‌లో 1,125 గజాల భవనం విలువ రూ.23 లక్షలేనట పక్కనే 1,285 గజాల లోకేశ్ భవనం విలువ రూ.2.36కోట్లే పంజాగుట్టలోని భవనం ధర కూడా కేవలం రూ.73 లక్షలు మాదాపూర్‌లో 924 గజాల స్థలానికైతే రూ.3.37 లక్షలే బాబు కుటుంబ భూముల విలువ గతేడాదే రూ.500 కోట్లంటూ వార్తలు ఈ ఏడాది వాటి విలువ మరింత భారీగా పెరిగిందంటున్న నిపుణులు నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని చంద్రబాబు నివాసమిది. 1,125 గజాల్లో ఉన్న ఈ ఇంటి విలువ కేవలం 23.2 లక్షలేనని బాబు చెబుతున్నారు. 2007లోనే ఆయన ఇంటికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని వేలం వేసినప్పుడు ఐసీఐసీఐ కన్సార్షియం గజం రూ. లక్ష చొప్పున కొనుగోలు చేసింది. ఈ లెక్కన చంద్రబాబు ఇంటి విలువ ఎంత ఉంటుందో తేలికగా అంచనా వేయొచ్చు. ఈ ఉదాహరణ చూస్తే చాలదా.. బాబు ఆస్తి లెక్కలన్నీ.. ఎంతటి కాకి లెక్కలో! సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎవరైనా తనకున్న స్థలాన్నో, ఇంటినో విక్రయించాలంటే ప్రస్తుత మార్కెట్ ధర ఎంతో అంతకే అమ్ముతారు. అంతేగాని దాన్ని కొనుగోలు చేసిన రోజు ధర ఎంతుందో ఇప్పుడు కూడా దాని విలువ అదేనని, ఆ లెక్కన తన ఆస్తి కూడా అంతే అనుకొమ్మని అంటే ఎవరైనా నవ్విపోతారు. ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన (రిజిస్ట్రేషన్) విలువ కంటే మార్కెట్ రేటు ఎంతో ఎక్కువగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. కానీ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మాత్రం తన ఆస్తుల ప్రకటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి విలువను దాన్ని కొనుగోలు చేసినప్పటి రూ.23.2 లక్షలుగానే చూపించుకున్నారు! జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 65లో 1,125 చదరపు గజాల ప్లాట్ నంబర్ 1310చంద్రబాబుది. కాగా, దాని పక్కనే 1,285 చదరపు అడుగులున్న 1309 నంబర్ ప్లాట్ ఆయన కుమారుడు లోకేశ్‌ది. తన ఇంటి విలువ ప్రస్తుతం ఎంతో చెప్పకుండా, రూ.23 లక్షలకు కొన్నానని మాత్రమే చెప్పి సరిపెట్టిన బాబు, లోకేశ్ ప్లాట్లోని భారీ భవనం విలువను కూడా అలాగే రూ.2.36 కోట్లుగా మాత్రమే చూపించారు. పైగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనగూడ సర్వే నంబర్ 51 (ఎ)లోని ఐదెకరాల భూమి విలువను పేర్కొననే లేదు! దాన్ని లోకేశ్‌కు నాయనమ్మ బహుమతిగా ఇచ్చారని మాత్రమే పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో 650 చదరపు గజాల్లో తన భార్య భువనేశ్వరి పేరుతో ఉన్న భవనం విలువను కూడా రూ.73.33 లక్షలుగా చూపారు బాబు! మహారాష్ట్రలోని అలీబాగ్ తాలూకా సోగాం గ్రామంలో 8.426 ఎకరాల భూమి విలువను రూ.58.69 లక్షలుగా, తమిళనాడులో ఎంజీఆర్ జిల్లా శ్రీపెరుంబదూర్ తాలూకాలోని 2.33 ఎకరాల భూమి విలువ రూ.1.86 లక్షలుగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మదీనగూడ సర్వే నంబర్ 51లోని ఐదెకరాల భూమికి రూ.73.8 లక్షలుగా చూపించారు. భువనేశ్వరికున్న 2,780 గ్రాముల బంగారు ఆభరణాల ధర రూ.26.96 లక్షలుగా, 32.7 కిలోల వెండికి రూ.4.57 లక్షలని పేర్కొన్నారు. బాబు కోడలు బ్రహ్మణికి మాదాపూర్‌లో 924 చదరపు గజాల స్థలం విలువను రూ.3.37 లక్షలుగా, నందగిరి హిల్స్‌లోని 778 చదరపు గజాల స్థలం విలువ రూ.4.79 లక్షలుగా, రంగారెడ్డి జిల్లా మణికొండ (సర్వే నంబర్ 211(పి))లోని ప్లాట్ నంబర్ 19, ప్లాట్ నంబర్ 20 కలిపి 2440 చదరపు గజాల స్థలానికి రూ.1.15 కోట్లుగా, చెన్నై టెంపుల్ స్టెప్స్లోని 4,782 చదరపు అడుగుల వాణిజ్యపరమైన ఆస్తి విలువను రూ.48 లక్షలుగా చూపారు. ఆమెకున్న 2,325 గ్రాముల బంగారు ఆభరణాలకు రూ.9.9 లక్షలు, 97.441 కిలోల వెండికి రూ.12.37 లక్షలు చూపించారు. ఇవిగాక నిర్వాణ హోల్డింగ్స్, హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాల వివరాలిచ్చారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 2013 మార్చి 31కి ఆస్తుల వివరాలు... చంద్రబాబు భువనేశ్వరి లోకేశ్ బ్రహ్మణి 42.06 లక్షలు 48.85 కోట్లు 9.73 కోట్లు 3.3 కోట్లు ఈ లెక్కన తన మొత్తం కుటుంబ ఆస్తి రూ.62.30 కోట్లేనని వెల్లడించారు బాబు. కానీ గతేడాదే మార్కెట్ ధర మేరకు బాబు కుటుంబ భూముల విలువ కలిపి రూ.500 కోట్లకు పైనే ఉంటుందని మార్కెట్ నిపుణుల అంచనాగా వార్తలొచ్చాయి. ఈ ఏడాది వాటి విలువ మరింత భారీగా పెరిగిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.