సాక్షి, నెల్లూరు: తాను వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఖండించారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని, అది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఎంపీ తెలిపారు. ‘పాదయాత్ర అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడం.. ప్రజాప్రతినిధులపై విమర్శలు చెయ్యడం కాదు.రాజకీయాల్లో లోకేష్ పిల్లోడు.. టీడీపీకి సరైన అభ్యర్ధి కూడా లేరు.
అభ్యర్దులు లేక వైసీపీ లో ఉండే స్క్రాప్ ను టీడీపీలోకి తీసుకుంటున్నారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వడం కుదరని లోకేష్ చెప్పాడని సోమిరెడ్డి నా దగ్గర ఫీల్ అయ్యాడు. వరుస ఓటములతో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి రికార్డ్ సృష్టించాడు.నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. రూరల్ నుంచే బరిలో దిగుతాను. మాజీ మంత్రి సోమిరెడ్డికి టికెట్ ఇస్తే మరోసారి ఓడిపోతాడు.
నేను పార్టీ మారతాను అని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి జీవిత కాలం పోరాటాలు చేసుకోవాల్సిందే. నాలుగేళ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అభివృద్ది చెయ్యడంలో ఫెయిల్ అయ్యాడు. సీఎం వైఎస్ జగన్‌ను నేను కలిసిన తర్వాతే రూరల్‌కి నిధులు మంజూరు అయ్యాయి’ అని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment