
సాక్షి, నెల్లూరు జిల్లా: జిల్లాలో వైఎస్సార్‌సీపీ చాలా బలంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మీడియాను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, టీడీపీకి సరైన నేతలు లేకపోవడంతో మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు.
‘‘ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో నియోజకవర్గంలో పర్యటిస్తే తెలుస్తుంది. నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు. అందుకే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు’’ అంటూ ప్రభాకర్‌రెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ నేతల దౌర్జన్యం
Comments
Please login to add a commentAdd a comment