‘కడిగిన ముత్యానివే అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకో చంద్రబాబూ!’ | Minister Kakani Govardhan Reddy Sensational Comments On Chandrababu Naidu, Know Details Inside - Sakshi
Sakshi News home page

‘కడిగిన ముత్యానివే అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకో చంద్రబాబూ!’

Published Sun, Mar 3 2024 5:45 PM | Last Updated on Sun, Mar 3 2024 6:47 PM

Minister Kakani Govardhan Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, నెల్లూరు: ఇద్దరు బలహీనులు కలిస్తే.. బలహీనులే అవుతారు.. జీరోలైన మిమ్మల్ని కూడినా.. గుణించినా వచ్చేది జీరోనే.. నెల్లూరు చేరికలతో ప్రజలంతా ఇక తన వెంటే అన్నట్లు చంద్రబాబు ఢాంబికాలు పలుకుతున్నారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోటీ చేయటానికి అభ్యర్థులు దొరికితే...ప్రజలు మద్దతు పలికినట్లేనా?. ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలో చూపించడానికి సంసిద్ధం అంటున్నావా చంద్రబాబూ? అంటూ ధ్వజమెత్తారు.

మంత్రి కాకాణి ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి, పరనింద
టీడీపీలో చేరికల కార్యక్రమం అని శనివారం నెల్లూరుకు వచ్చిన చంద్రబాబు ఆ వేదికగా అనేక విమర్శలు చేశారు. ఎంతో అనుభవం, పరిణితితో చంద్రబాబు మాట్లాడతారని ఆశిస్తారు. కానీ చంద్రబాబు చాలా దిగజారిపోయాడు. చంద్రబాబు ప్రసంగంలో ఫ్రస్టేషన్‌ కనిపిస్తోంది. నాయకుల చేరికలతో టీడీపీ బలపడిందని చంద్రబాబు అంటాడు. ప్రజలు, ఓటర్లు లేరు. నాయకుల చేరికలు చాలు బలపడటానికి అని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబుకు పోటీ చేయటానికి కొంత మంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చు. అభ్యర్థులు దొరికినంత మాత్రాన ఓటర్లు ఆకర్షితులై.. ప్రజలు మద్దతు పలుకుతారని అనుకోవటం పెద్ద పొరపాటు. నాయకులు చేరినంత మాత్రాన ప్రజలు టీడీపీ వెంట నడిచే పరిస్థితి ఉందా అన్నది చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 

సీఎం జగన్ ప్రశ్నలకు చంద్రబాబు ఇంతవరకు సమాధానమే చెప్పట్లేదు
చంద్రబాబుకు సిద్ధం సభలో సీఎం జగన్‌ కొన్ని ప్రశ్నలను సంధించారు. ప్రజలకు చంద్రబాబు ఏ మేలు చేశారో స్పష్టంగా చెప్పమన్నారు. ప్రతి కుటుంబానికి చంద్రబాబు వల్ల మేలు జరిగిందా? వైఎస్ఆర్‌ సీపీలాగా  ఇది ముఖ్యమంత్రిగా నా వల్ల ఈ మేలు జరిగిందని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఈ గ్రామంలో ఇది అభివృద్ధి చేశానని చెప్పే పరిస్థితీ లేదు. గ్రామాల్లో ప్రజలకు ఏమి ఇచ్చావో.. చెప్పలేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు, రైతులు, మహిళలకు ఏ మేలు చేశారో చంద్రబాబు చెప్పుకోలేరు. బహిరంగ సభల్లో వాటికి సమాధానం చెప్పకుండా దాట వేస్తూ ఆత్మస్తుతి వల్లె వేస్తున్నారు. మరి, చంద్రబాబు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఎదురయ్యాయి. టీడీపీ ఎందుకు బంగాళా ఖాతంలో కలసి పోయిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 

మరోసారి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధం అంటున్న సీఎం జగన్
అధికారం ఇచ్చిన ప్రజలకు ఐదేళ్లు సేవ చేశాం. మరోసారి ప్రజల సేవ చేసేందుకు మేం సిద్ధం అని సీఎం జగన్ సిద్ధమన్నారు. దానికి చంద్రబాబు సంసిద్ధం అంటున్నారు. అంటే.. గతంలో హామీలు ఇచ్చి జనాలను ఎలా మోసం చేశానో అదే పంథాలో కొనసాగటానికి సిద్ధమని చెప్పదల్చుకున్నారా? మరలా రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అని మోసం చేయటానికి సంసిద్ధమని చంద్రబాబు చెబుతారా?. తద్వారా ప్రజలను తీరని ద్రోహం చేయటానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారా? జగన్‌మోహన్‌రెడ్డి నేను చెప్పాను.. ప్రజలకు ఇచ్చాను.. మరలా అవకాశం ఇస్తే.. మీ కుటుంబానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటానికి సిద్ధమని జగన్ అంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను, పొరుగు రాష్ట్రాల మేనిఫెస్టోలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు తప్ప.. సొంతంగా ఇది చేస్తానని చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబు మోసగాడు అని బ్రాండ్ పడిపోయింది.  ఇచ్చిన మాట మీద బాబు నిలబడడు. జనాలను మోసం చేస్తాడని ఓటేస్తే మనం నష్టపోతామనే భావం ప్రజల్లో ఉంది. 

సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు వలస వెళ్లింది చంద్రబాబే
చంద్రబాబు తనకున్న మోసగాడు అనే బ్రాండ్‌ నుంచి ఎలా బయటపడాలో తెలియక సీఎం జగన్ మోహన్‌ రెడ్డిని దూషించటం మొదలు పెట్టారు. నిన్న నెల్లూరు టీడీపీ సభలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమైనా చెప్పగలిగారా? ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పావా? చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? తన్నుకుంటే పోతే అభ్యర్థులు బయటపడతారా? అసలు చంద్రబాబు నీ నియోజకవర్గం, సొంత గ్రామం ఏదో చెప్పు. చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది ఎక్కడ? సొంతూరు నారావారిపల్లె ఉండేది ఎక్కడ. చంద్రగిరి నియోజకవర్గంలో. నీ గ్రామంలో గెలవలేక.. కుప్పంలో నిలబడిన వాడివి.. మిగతా వారిని ఇక్కడ తన్నితే.. అక్కడ పడ్డారని సిగ్గులేకుండా మాట్లాడటం ఏమిటి? ఒక్కసారి చంద్రబాబు నీ గతాన్ని తరిచి చూడు. వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిది, వైఎస్ రాజశేఖరరెడ్డిది పులివెందుల నుంచి. తన సొంత ప్రాంతం అయిన పులివెందుల నుంచి జగన్ మోహన్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. నీ సొంత ప్రాంతం నుంచి పోటీ చేయలేని నువ్వు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా? నీ నోటికి అడ్డూఅదుపూ లేవా? నీ కొడుకుది ఏ ఊరు. తంతే మంగళగిరి ఎందుకు బోర్లా పడ్డాడు. మరొకరిని నువ్వు ఎగిసి తంతే ఆత్మకూరులో ఎందుకు పడ్డాడు. పవన్ కల్యాణ్‌ది ఏ ప్రాంతం. ఆయన ఏవిధంగా గాజువాక, భీమవరంలో పోటీ చేశాడు. ఒక దగ్గర పోటీ చేసి గెలవలేక.. వేరే దగ్గరకు వెళ్లిన మీరు సిగ్గులేకుండా విమర్శలు చేయటం దౌర్భాగ్యం. 

చంద్రబాబును నెగటివ్ షేడ్‌తో ప్రజలు చూస్తున్నారు.
చంద్రబాబు స్థాయికి తగని మాటలు మాట్లాడి.. ఆక్రోశం, ఆవేశాన్ని వెల్లగక్కటం తప్ప.. ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. ఇప్పటికే చంద్రబాబుపై ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ ప్రారంభం అయింది. నెగిటివ్ షేడ్‌తో చూస్తున్నారు. చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ప్రజలు భావిస్తున్నారు.  మీ నాయకులు కూడా అదే చెబుతున్నారు. 

పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం చేసింది చంద్రబాబే
చంద్రబాబు నాయకులను పేర్చుకుని కూర్చుకుని టీడీపీ బ్రహ్మాండం అంటున్నారు. మరి, ఇంతవరకు చంద్రబాబు.. సీట్లు ప్రకటించలేకపోతున్నాడు. ఒక సీటు ప్రకటిస్తే.. వాడు డబ్బులు పెట్టుకుంటాడా? లేకపోతే ఇంకో కార్యకర్తను తొక్కైనా డబ్బున్నోడికి ఇవ్వండి. జనసేనతో అవసరం ఉంది మనవాడిని ముంచైనా వాడికి టిక్కెట్ ఇవ్వండన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 175 సీట్లు ప్రకటించకుండా బీజేపీకి కొన్ని ఎత్తిపెట్టి.. టీడీపీ జెండా మోసిన వాడిని మొన్నటి దాకా టిక్కెట్ ఇస్తానన్న చంద్రబాబు ఇవాళ అన్యాయం చేయటానికి సిద్ధపడ్డాడు. 

టీడీపీతో ప్రజలు.. ఓటర్లు లేరని చెప్పకనే చెప్పిన చంద్రబాబు
నిజంగా చంద్రబాబుకు బలమే ఉంటే.. ఎందుకు ఇతర పార్టీల అండదండల కోసం అర్రులు చాస్తూ తిరుగుతున్నాడు. ఎందుకు ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఆరాట పడుతున్నాడు. నాయకులు వచ్చినంత మాత్రాన ప్రజలు వస్తారా? పార్టీలతో పొత్తులు చేసుకున్నంత మాత్రాన ప్రజలు వస్తారా? అన్ని పార్టీలు, నాయకులు కలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినవన్నీ చేశాడని ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు చెప్పినవన్నీ ఏవీ చేయలేదని ప్రజలే చెబుతారు. ప్రస్తుతం పొత్తులు ఎలా పెట్టుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. కొన్ని చోట్ల అభ్యర్థులు దొరికితే జిల్లా మొత్తం వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ అని ఎన్నిసార్లు చంద్రబాబు అనలేదు. 2014లో నెల్లూరు ప్రజలు చంద్రబాబుకు కేవలం మూడు సీట్లే ఇచ్చారు. ఈసారి నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదం. చంద్రబాబు ముఖం చూసి జనాలు ఎవరైనా ఓటేస్తారా? కొంతమంది నాయకులను రకరకాలుగా మభ్యపెట్టి తీసుకెళ్లావు. అంతమాత్రాన టీడీపీ బ్రహ్మాండంగా ఉందని ఎలా చెప్పగలుగుతారు. 

కడిగిన ముత్యానివే అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకో బాబూ!
నెల్లూరు జిల్లాకు చంద్రబాబు వచ్చినప్పుడు కాకాణి కోర్టు దొంగ అన్నారు. సీబీఐ విచారణపై చంద్రబాబు ప్రకటిస్తాడని అనుకున్నా. మరి, చంద్రబాబు అవినీతికి పాల్పడకపోతే.. సీబీఐ విచారణ వేయించుకుని ఎక్కడా అవినీతికి పాల్పడలేదని సందేశం ఏమైనా ఇస్తాడని అనుకున్నా. కానీ, తోక ముడిచి చంద్రబాబు పారిపోయాడు. అంటే.. చంద్రబాబుకు ధైర్యం లేదా. అవినీతిపరుడు అని ఒప్పుకున్నట్లేనా. దోచుకున్న మాట వాస్తవమని ప్రజలు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నీతిమంతుడు అయితే.. అవినీతితో కోట్లు సంపాదించకపోతే సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా? పైగా కోర్టులకు వెళ్లి విచారణను అడ్డుకున్నది చంద్రబాబే. పైగా కడిగిన ముత్యానివి అనటం ఏమిటి? చంద్రబాబుది ముత్యం మొహమేనా? పైగా నన్ను ఇంతమాట అంటారా అని చంద్రబాబు అనటం సరికాదు. జనాలు తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బావుంటుంది. ఏమి నైతికత ఉంటే.. వైఎస్ఆర్‌సీపీ నాయకులు, జగన్‌ మోహన్‌ రెడ్డి పేరు ఎత్తే కనీస అర్హత ఉందా? నీ గబ్బు నోట వెంట జగన్ పేరు ఉచ్ఛరించటమే అపశృతిగా భావిస్తున్నాం. చంద్రబాబు నీచుడు, అబద్ధాల కోరు, నీతిమాలినవాడు. 

బలహీనులైన పవన్‌, బాబులను కూడిన.. గుణించినా మీకు వచ్చేది శూన్యమే
పవన్ కల్యాణ్‌, చంద్రబాబు పొత్తులు పెట్టుకుని నడుస్తున్నామని అంటాడు. 2019 ఎన్నికలకు ముందు పవన్ ఊగిపోయాడు. నా కుటుంబ సభ్యులు, మా అమ్మను దూషిస్తే వదిలిపెడతానా అన్నాడు. ఆ రోజున లోకేశ్‌ చేత దూషించిన సంగతి చంద్రబాబు మర్చిపోయాడా? గతాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఇద్దరు బలహీనపడిపోయారు. సీఎం జగన్‌ బలంగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు బలహీనులు కలిస్తే.. బలహీనులు అవుతారు కానీ.. బలవంతులు కాలేరు. శూన్యమైన మీరు కూడిన.. గుణించినా మీకు వచ్చేది శూన్యమే. చంద్రబాబు, పవన్ ఎక్కువగా ఊహించుకుని మాట్లాడటం సరైన పద్ధతి కాదు.  నెల్లూరు జిల్లాలో చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. 

మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
వైఎస్‌ఆర్‌సీపీ 175 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని చోట్ల మాత్రమే అభ్యర్థుల మార్పు ఉంటుందన్నారు. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. చంద్రబాబు కూడా నిన్నగాక మొన్న ప్రకటించి ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నట్లు వారి చేత ప్రకటన ఇప్పిస్తున్నాడు. ఎన్నికల కోడ్ వచ్చే లోపు మళ్లీ అభ్యర్థులను చంద్రబాబు మారుస్తారు. పవన్‌ 5 సీట్లు తప్ప 19 సీట్లలో అభ్యర్థులు ఎవరో కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు. ఏ పార్టీ అయినా అభ్యర్థులను మార్చటం సహజంగా జరిగే ప్రక్రియ. 

ఒక్కో పార్టీ విధానం ఒక్కోలా ఉంటుంది. ఎవరైతే బలంగా ఉంటాడో వారికి సీటు ఇవ్వాలనేది పార్టీ అధినాయకుడు ఇష్టం. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఎక్కడైనా పొరపాటు జరిగితే.. స్థానిక నాయకుడిపై ఆదరణ చూపించకపోతే అది ఎన్నికల ప్రక్రియపై పడుతుంది. అందుకే సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాడు. మీరు ఎందుకు అభ్యర్థులను ఎంపిక చేసుకోలేకపోతున్నారో అన్న దానికి సమాధానం చెప్పలేదు.

టీడీపీ, జనసేన కన్నా బీజేపీ మెరుగ్గా ఉన్నట్లు ఉంది. అభ్యర్థులను ఖరారు చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ నుంచి వెళ్లిన నాయకులకు కండువా కప్పే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. 

సర్వేపల్లిలో అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని చంద్రబాబును మీడియా వారే అడగాల్సింది. నాపైన సోమిరెడ్డి తిరుగుతున్నారు. ఆయనకు ఇవ్వకపోవటం ధర్మం కాదు. మనసు బాధేసింది. ఇంత సీనియర్‌కు అన్యాయం జరిగిందని ఆ బాధను నేను మీడియా ముందు వ్యక్తపరిచాను. 

ఎన్ని సందర్భాల్లో సొంత అన్నదమ్ములు ఎన్నికల్లో పోటీ చేయలేదు. వీరంతా ఒక్కటై.. జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ మీద ఆమె కోడలు పోటీ చేయలేదా? సంజీవ్ గాంధీ ఒకవైపు.. రాజీవ్‌ గాంధీ మరోవైపు రాజకీయంగా ఉన్నారు. ఒకే కుటుంబంలో సభ్యులు ఒకరిపై మరొకరు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. షర్మిల చెప్పే మాటలకు ఎంత క్రెడిబులిటీ ఉన్నది అనేది జనాలు చూస్తారు. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఇప్పుడు ఏపీకి వచ్చారు. రాజకీయాల్లో కొంతమంది అనుకూలం, మరికొంతమంది ప్రతికూలంగా ఉంటారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే. 

వైఎస్ఆర్‌సీపీ బలమైన పార్టీ. ఉమ్మడి నెల్లూరులో 10కి 10 స్థానాలు వైఎస్ఆర్‌సీపీనే గెలుస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో కొంత మందిని నేను చేర్చుకుంటున్నాను. సోమిరెడ్డి మరికొంత మందిని చేర్చుకుంటున్నారు. చేరికల ఆధారంగా గెలుపు ఓటములు ఆధారపడవు. రాజధాని కబ్జా చేసిన చంద్రబాబు నోటి వెంట (తప్పు చేయలేదు) అలాంటి మాటలు రాకూడదు. దానిపైన కూడా క్వాష్ పిటిషన్‌ వేసి కోర్టుకు వెళ్లాడు. నెల్లూరులో వేమిరెడ్డికి పోటీగా విజయసాయిరెడ్డి వచ్చారని ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు ఊగిపోయాడు. ఎన్నికల్లో సర్వేపల్లిలో నేను పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రత్యర్థిగా చంద్రబాబు ఎవరిని దింపినా భయపడే పరిస్థితి లేదు. సమన్వయకర్త అంటేనే.. అభ్యర్థి. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement