
ఫోర్త్ ఎస్టేట్‌లో నారా లోకేష్ ఫొటోలు చూపుతున్న పోసాని కృష్ణ మురళి
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం పార్టీ నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పోరాటానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు తెలపడంలేదని, బస్సుల్లో పడుకుని మరీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తుంటే.. టాలీవుడ్ వాళ్లు మాత్రం డబ్బు మత్తులో జోగుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.
మత్తులో జోగుతున్నది సినిమావాళ్లన్న అంటున్నారని.. అసలు మత్తులో జోగుతోంది ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అని అన్నారు. లోకేష్‌కు సంబంధించిన పలు చిత్రాలను చూపుతూ.. ఆయన కేవలం అమ్మాయిలతోనే మందు తాగుతారని, విదేశాల్లో టేపుతో అమ్మాయిల నడుమును కొలుస్తారని అన్నారు.
స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో గడుపుతూ మందు తాగి, సినిమా వాళ్ల కన్నా నీచంగా ప్రవర్తించింది మీ నేతే అనే విషయాన్ని రాజేంద్రప్రసాద్ తెలుసుకోవాలని అన్నారు. ఎదుటివారిని విమర్శించే ముందు కొంచెం తెలివితో మాట్లాడాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment