లోకేశ్‌ డైరెక్షన్‌.. పల్లె ఓవరాక్షన్‌ | Palle Raghunatha Reddy Overaction With Lokesh Support | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ డైరెక్షన్‌.. పల్లె ఓవరాక్షన్‌

Published Sun, Apr 2 2023 8:16 AM | Last Updated on Sun, Apr 2 2023 8:22 AM

Palle Raghunatha Reddy Overaction With Lokesh Support - Sakshi

సాక్షి, పుట్టపర్తి: ‘ప్రశాంతి నిలయం’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘు­నాథరెడ్డి అనుచరులతో కలిసి అలజడి సృష్టించారు. శాంతి భద్రతలకు విఘాతం కలి­గిస్తూ..  దౌర్జన్య­కాం­డకు ఒడిగట్టారు. ఫలి­తంగా శనివారం ఉద­యం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్ట­ణంలో ఉద్రిక్త వాతా­వరణం నెలకొంది.

ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయ­భ్రాంతులకు గుర­య్యారు. యువగళం పాదయా­త్రలో భాగంగా నారా లోకేశ్‌ గత నెల 25న పుట్టపర్తి నియోజ­క­వర్గం ఓబుళ­దేవరచెరువులో ఎమ్మెల్యే శ్రీధర్‌­రెడ్డిౖ­పె అవి­నీతి ఆరోప­ణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను అవినీతి చేసినట్లు నిరూపించాలని.. అభివృద్ధిపై ఏప్రిల్‌ ఒకటో తేదీన పుట్టపర్తి సత్యమ్మ గుడి వద్దకు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ సూచన మేరకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందిస్తూ.. తాను చర్చకు వస్తు­న్నానని చెప్పడంతో ఆయన్ను పోలీసులు టీడీపీ కార్యాల­యంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. శని­వారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి సత్యమ్మ గుడి సర్కిల్‌కు చేరుకు­న్నారు. కాసేపటికే పల్లె పోలీసుల నుంచి తప్పించుకుని.. భారీగా అనుచ­రులను వెంటేసుకుని అక్కడికి చేరుకున్నారు.

రండి చూసుకుందాం..
పల్లె అక్క­డికి వచ్చీ రాగానే కారు పైకెక్కి ‘ఎమ్మెల్యే ఎ­క్కడ? నేను చర్చకు సి­ద్ధం’ అంటూ హంగామా చే­శా­రు. వెను­క ఉన్న అను­చ­రు­లు తొడలు కొడుతూ.. మీ­సం మెలేస్తూ ‘రండి రే­య్‌­.. చూసుకుందాం’ అంటూ రెచ్చ­­గొట్టారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వాహనం  అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌­సీపీ కార్య­కర్తలపై చెప్పులు, రాళ్లు రు­వ్వారు. దీంతో ఆత్మ రక్షణ కో­సం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రతి­ఘటించడానికి పూనుకు­న్నారు. పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్‌ నేతృత్వంలో పోలీ­సులు లాఠీలు ఝుళి­పిస్తూ ఇరు వర్గాల వారిని చెదర­గొట్టారు. ఈ దశలో ఎమ్మెల్యే దుద్దుకుంట తన అను­చరులతో కలిసి ఇంటి కెళ్లిపోయారు. బస్టాండ్‌ వరకు వెళ్లిన పల్లె మళ్లీ సత్యమ్మ గుడి సర్కిల్‌కు చేరుకుని హల్‌చల్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement