palle raghunatha reddy
-
‘పల్లె’పై పగ.. బీసీల పొగ!
సాక్షి, పుట్టపర్తి: టీడీపీ అధిష్టానం అవలంబిస్తున్న విధానాలు...స్థానిక నేత పల్లె రఘునాథరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ పార్టీలోని బీసీ వర్గాల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టికెట్ కేటాయింపు విషయంలో నియోజకవర్గంలోనే ఎక్కువ ఓటు బ్యాంకు కలిగిన తమను కాదని మరోసారి ‘పల్లె’ కుటుంబానికే పట్టం కట్టడాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరారు. మరికొందరు అదే బాటలో నడుస్తున్నారు. ‘క్యాష్’ పాలిటిక్స్ పల్లె రఘునాథరెడ్డిపై అసమ్మతి ఎక్కువ కావడంతో అభ్యర్థిని మార్చాలని స్థానిక టీడీపీ నాయకులు అధిష్టానానికి విన్నవించారు. అయితే ‘క్యాష్’ పాలిటిక్స్ అవలంబిస్తున్న టీడీపీ అధిష్టానం వద్ద పల్లె రఘునాథరెడ్డి తనదైన శైలిలో లాబీయింగ్ చేసుకుని కోడలు పల్లె సింధూరాకు టికెట్ ఇప్పించుకున్నారు. ఫలితంగా చంద్రబాబు, నారా లోకేశ్ తీరుపై పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. బీసీలకు టీడీపీ అన్యాయం పుట్టపర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానివే అత్యధిక ఓట్లు ఉన్నాయి. అందులో చాలామంది నాటి నుంచి టీడీపీ వెంట నడుస్తున్నారు. అయితే రాజకీయంగా ఎదగనీయకుండా.. పల్లె రఘునాథరెడ్డి అణగదొక్కారు. అయినప్పటికీ అదే పార్టీలో కొనసాగిన బీసీ నేతలు ఈ సారి పుట్టపర్తి టికెట్ బీసీలకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. దీంతో చంద్రబాబు కూడా తొలుత ఓకే అన్నారు. ఆ తర్వాత పల్లెకే పట్టం కడుతూ ఆయన కోడలికి టికెట్ కేటాయించారు. దీన్ని బీసీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అడ్డం తిరిగితే బెదిరింపులు పల్లె రఘునాథరెడ్డి తీరు బాగోలేదని.. ఆయనకు టికెట్ ఇస్తే పని చేసేది లేదని అధిష్టానం వద్ద తమ అసమ్మతి తెలిపిన వడ్డెర్లపై దాడి జరిగింది. పల్లె రఘునాథరెడ్డి తన అనుచరుల ద్వారా తమపై దాడి చేయించారని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పల్లపు జయచంద్రమోహన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రబాబు వద్ద పంచాయితీ జరిగినట్లు సమాచారం. జగన్ న్యాయం చేస్తారని నమ్మి... వైఎస్సార్ సీపీలో బీసీ నాయకులకు పెద్దపీట వేస్తున్నారు. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ టికెట్ల వరకూ బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నామినేటెడ్ పోస్టులనూ ఎక్కువగా బీసీలకే కట్టబెట్టారు. ఈక్రమంలోనే టీడీపీలోని బీసీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. పుట్టపర్తి టికెట్ ఆశించి భంగపడ్డ రిటైర్డ్ డీఎస్పీ వేణుగోపాల్, తిరుపతేంద్ర ఇప్పటికే వైఎస్సార్సీపీలో చేరారు. త్వరలోనే మరికొందరు టీడీపీ సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారు కూడా ఏ క్షణంలోనైనా కండువా మార్చడం ఖాయమని అనుచరులు చెబుతున్నారు. కొనసాగుతున్న వైఎస్సార్సీపీ హవా పుట్టపర్తి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ‘ఫ్యాన్’ ప్రభంజనం సృష్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 15 చోట్ల వైఎస్సార్ సీపీ జెండా ఎగిరింది. ఆరు మండలాల జెడ్పీటీసీ స్థానాలతో పాటు అన్ని మండల ఎంపీపీ పదవులు వైఎస్సార్సీపీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంక్షేమ లబ్ధితో జనమంతా జగన్‌కు మద్దతు పలుకుతుండగా... వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. -
బరితెగించిన టీడీపీ మాజీమంత్రి.. డబ్బు తీసుకుని పనిచేయాలని ఒత్తిడి
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు హయాంలో ‘తెలుగు తమ్ముళ్లు’ లంచాలు, దౌర్జన్యాలతో పనులు కానిచ్చుకున్నట్లుగానే ఇప్పుడూ బరితెగిస్తున్నారు. తమ పనులు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు డబ్బులు ఎరగా వేసేందుకూ వెనుకాడడంలేదు. ఇందుకు తాజాగా సోమవారం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండల రెవెన్యూ అధికారికి లంచం ఇచ్చేందుకు ఏకంగా టీడీపీ మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డే ప్రయత్నించిన ఫొటోలు బయటకొచ్చాయి. ఆ వివరాలు.. కదిరిలో పల్లె రఘునాథరెడ్డికి సంబంధించి శ్రీవివేకానంద పేరుతో డిగ్రీ కాలేజీ ఉంది. కాలేజీకి సెక్యూరిటీ కార్పస్ ఫండ్ కోసం సైదాపురం రెవెన్యూ పొలంలో 38/1, 38/2, 38/5, 38/6 సర్వే నంబర్లలోని 4.5 ఎకరాల స్థలాన్ని పూచీగా చూపించారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని సుమారు 88 ప్లాట్లుగా విభజించి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎలాంటి హద్దులు చూపకుండానే అమ్మకాలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి.. అనుమతుల్లేవని తేల్చారు. ఈ తతంగం చాలారోజుల క్రితమే జరిగింది. ప్రస్తుతం ఈ స్థలానికి అధికారిక అనుమతులివ్వాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, వారు ససేమిరా అన్నారు. చదవండి: బండారూ.. తప్పుడు ప్రచారం మానుకో.. డబ్బు ఎరగా చూపి.. రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి పల్లె రఘునాథరెడ్డిపై ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలో పలుమార్లు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అనుమతులివ్వాలని కోరారు. లంచాలు ఇచ్చేందుకూ ప్రయత్నించారు. డబ్బు వద్దని.. నిబంధనల ప్రకారమే పనిచేస్తామని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. తాజాగా.. సోమవారం ఉదయం కూడా కదిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన పల్లె రఘునాథరెడ్డి తన చేతిలో ఇలా‘నోట్లు’ పట్టుకుని ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మోసపూరిత బుద్ధి మానుకుంటే మంచిది : ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అవినీతికి పాల్పడటం, అక్రమాలు చేయడం టీడీపీ నేతలు మానుకుంటే మంచిది. సెక్యూరిటీ కార్పస్ ఫండ్‌కు అనుమతులు తీసుకున్న స్థలంలో ప్లాట్లు వేసి విక్రయాలు చేయడం సరికాదు. మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. ఎలాంటి అనుమతులివ్వడం సాధ్యంకాదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పారు. అయితే.. డబ్బులతో అధికారులకు గాలం వేయాలని పల్లె రఘునాథరెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటు. -
తప్పించుకు తిరుగుతున్న పల్లె రఘునాథరెడ్డి
సాక్షి, పుట్టపర్తి: మాజీ మంత్రి, పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పల్లె రఘునాథరెడ్డి సొంత పార్టీ నేతల చెవిలో పూలు పెట్టాడు. 2019 ఎన్నికల సమయంలో చేబదులుగా సొంత పార్టీ నేతల నుంచి రూ.లక్షల్లో నగదు తీసుకుని వాటిని ఇవ్వకుండా తప్పించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. చేసేది లేక సదరు తెలుగు తమ్ముళ్లు పల్లె రఘునాథరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు. బాధితుల కథనం మేరకు... గత ఎన్నికల సమయంలో ఖర్చుల కోసమంటూ పల్లె రఘునాథరెడ్డి టీడీపీలోని బీసీ వర్గానికి చెందిన పీసీ గంగన్న, ఒ.లక్ష్మినారాయణ వద్ద రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని వారం రోజుల్లో తిరిగి చెల్లిస్తానని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన పల్లె రఘునాథరెడ్డి వారి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో నెలరోజుల తర్వాత వారే పల్లె రఘునాథరెడ్డి వద్దకు వెళ్లి అడగ్గా.. రూ.25 లక్షల చొప్పున రెండు చెక్కులు రాసి ఇచ్చారు. అయితే బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా.. రెండు చెక్కులు చెల్లలేదు. తనకిచ్చిన చెక్కుకు సంబంధించి సదరు బ్యాంకు ఖాతాలో నగదు లేదని అధికారులు చెప్పారని పీసీ గంగన్న, ఇచ్చిన చెక్కులో సంతకం మ్యాచ్ కాలేదని బ్యాంకర్లు చెక్కు తిరస్కరించారని లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ తర్వాత వెళ్లి పల్లె రఘునాథరెడ్డిని డబ్బుల విషయమై నిలదీసినట్లు బాధితులు వివరించారు. ‘డబ్బులు కావాలంటే వేచి ఉండాలి. పార్టీ లో కొనసాగాలి. లేదంటే మీ ఇష్టం’ అని పల్లె రఘునాథరెడ్డి సమాధానం ఇచ్చినట్లు బాధితులు వాపోతున్నారు. తప్పించుకు తిరుగుతున్న ‘పల్లె’ చెక్కులు బౌన్స్ అయ్యాయని భావించిన పీసీ గంగన్న, లక్ష్మినారాయణ లాయర్లను ఆశ్రయించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి నోటీసులు ఇచ్చారు. సరైన చెక్కులు ఇవ్వాలని, లేనిపక్షంలో నగదు రూపేణా బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు పంపించారు. కానీ ఆ నోటీసులను తీసుకోకుండా పల్లె రఘునాథరెడ్డి తప్పించుకు తిరిగారని బాధితులు చెబుతున్నారు. లాయర్లు, పోలీసులను అడ్డు పెట్టుకుని తమ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీలో బీసీలమైన తమకు అన్యాయం జరిగినా పార్టీ పెద్దలు ఏ ఒక్కరూ నోరుమెదపకపోవడమ దుర్మార్గమంటున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. నా చెక్కులు మిస్ అయ్యాయి 2019 ఎన్నికల సమయంలో నా చెక్కులు రెండు మిస్ అయ్యాయి. వాటినే పీసీ గంగన్న, లక్ష్మీనారాయణ తీసుకున్నట్లు అనుమానం వచ్చింది. ఆరా తీయగా వారు ఒక్కో చెక్కులో రూ.25 లక్షలు రాసుకుని బ్యాంకుకు వెళ్లి నా డబ్బు కాజేయాలని చూసినట్లు సమాచారం వచ్చింది. అంతేగానీ చెల్లని చెక్కులు నేను ఎవరికీ ఇవ్వలేదు. నేను ఎవరితో అప్పు కూడా చేయలేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. అనవసరంగా కేసులకు వెళ్తే భయపడేది లేదు. – పల్లె రఘునాథరెడ్డి -
2024 ఎన్నికల్లో పుట్టపర్తిపై ఎగిరేది వైఎస్సార్ సీపీ జెండానే
అనంతపురం: ‘‘పుట్టపర్తి ప్రాంత ప్రజలు మూడు పర్యాయాలు అధికారం ఇస్తే పల్లె రఘునాథరెడ్డి మొద్దు నిద్రలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. నాలుగేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారు. మందళగిరి మాలోకం లోకేష్‌తో కలసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికై నా పల్లె రఘునాఽఽథరెడ్డి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. లేకపోతే ప్రజలే రాజకీయ సమాధి కడతారు’’ అని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను పుట్టపర్తి నుంచి రోజూ 200 టిప్పర్లతో ఇసుకను బెంగళూరుకు తరలిస్తున్నానని, బెంగళూరు నుంచి లిక్కర్ ఇక్కడికి తీసుకువస్తున్నానని, బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నానంటూ ‘యువగళం’లో లోకేష్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, ఇది అతని దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. నిజంగా లోకేష్‌కు, పల్లె రఘునాథరెడ్డికి దమ్ముంటే నిరూపించాలన్నారు. 12 కేసులుంటేనే టీడీపీ టికెట్ అడగాలని లోకేష్ బహిరంగ సభలో చెప్పడం అతని రౌడీ సంస్కృతికి నిదర్శనమన్నారు. లోకేష్ లాంటివారు యూపీ, బిహార్లలో పార్టీలు పెట్టుకుంటే మంచిదని, ఏపీలో ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పుట్టపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేయించి ఈ ప్రాంత శాశ్వత అభివృద్ధికి బాటలు వేశామన్నారు. నిజంగా పల్లె రఘునాథ రెడ్డికి ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే.. బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేసినప్పుడు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. నిత్యం అభివృద్ధి మంత్రం జపిస్తున్న ‘పల్లె’ తన వ్యవసాయ కళాశాలను ఇక్కడ కాకుండా బుక్కరాయసముద్రంలో ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. మా పాలన అభివృద్ధికి నిర్వచనం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా తాము కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. అలాగే అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. అందుకే తమ పాలనను అభివృద్ధికి నిర్వచనంగా జనమే చెప్పుకుంటున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ‘ప్రజాసంకల్ప’యాత్రలో నల్లమాడ బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంతంలో కరువును శాశ్వతంగా పారదోలేందుకు రూ.864 కోట్లతో 193 చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీటిని నింపే కార్యక్రమానికి పరిపాలనా అనుమతులు తెచ్చామన్నారు. 3 టీఎంసీల నీటిని కూడా అధికారికంగా కేటాయింపులు చేయించామన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల మీదుగా ఎన్‌హెచ్–342, గ్రీన్ ఫీల్డ్ హైవేలను నిర్మిస్తున్నామని, నియోజకవర్గంలోని నిరుపేదల కోసం 25 వేల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. అభివృద్ధిలో తనతో పోటీ పడలేకే ‘పల్లె’ కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారన్నారు. ఆయనకు చేతనైతే అభివృద్ధిలో తమతో పోటీ పడాలని హితవు పలికారు. ఇప్పటికై నా అసత్య ఆరోపణలు మానుకోకపోతే రాబోవు రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. న్యాయ పోరాటం చేస్తాం.. లోకేష్ తనపై చేసిన ఆరోపణలకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వెళ్లేలోపు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. పుట్టపర్తి ప్రాంత అభివృద్ధికి, ప్రశాంతతకు తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామన్నారు. ‘పల్లె’ తన రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టే చర్యలకు దిగడం వల్లే వైఎస్సార్ సీపీ, టీడీపీ శ్రేణులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. -
లోకేశ్ డైరెక్షన్.. పల్లె ఓవరాక్షన్
సాక్షి, పుట్టపర్తి: ‘ప్రశాంతి నిలయం’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరులతో కలిసి అలజడి సృష్టించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. దౌర్జన్యకాండకు ఒడిగట్టారు. ఫలితంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ గత నెల 25న పుట్టపర్తి నియోజకవర్గం ఓబుళదేవరచెరువులో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిౖపె అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను అవినీతి చేసినట్లు నిరూపించాలని.. అభివృద్ధిపై ఏప్రిల్ ఒకటో తేదీన పుట్టపర్తి సత్యమ్మ గుడి వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో లోకేశ్ సూచన మేరకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందిస్తూ.. తాను చర్చకు వస్తున్నానని చెప్పడంతో ఆయన్ను పోలీసులు టీడీపీ కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సత్యమ్మ గుడి సర్కిల్‌కు చేరుకున్నారు. కాసేపటికే పల్లె పోలీసుల నుంచి తప్పించుకుని.. భారీగా అనుచరులను వెంటేసుకుని అక్కడికి చేరుకున్నారు. రండి చూసుకుందాం.. పల్లె అక్కడికి వచ్చీ రాగానే కారు పైకెక్కి ‘ఎమ్మెల్యే ఎక్కడ? నేను చర్చకు సిద్ధం’ అంటూ హంగామా చేశారు. వెనుక ఉన్న అనుచరులు తొడలు కొడుతూ.. మీసం మెలేస్తూ ‘రండి రేయ్.. చూసుకుందాం’ అంటూ రెచ్చగొట్టారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై చెప్పులు, రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మ రక్షణ కోసం వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడానికి పూనుకున్నారు. పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో పోలీసులు లాఠీలు ఝుళిపిస్తూ ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఈ దశలో ఎమ్మెల్యే దుద్దుకుంట తన అనుచరులతో కలిసి ఇంటి కెళ్లిపోయారు. బస్టాండ్ వరకు వెళ్లిన పల్లె మళ్లీ సత్యమ్మ గుడి సర్కిల్‌కు చేరుకుని హల్చల్ చేశారు. -
ఒరేయ్ దద్దమ్మ...నీకు దమ్ముంటే రా...నువ్వో నేనో తేల్చుకుందాం
-
Palle Raghunatha Reddy: పుట్టపర్తిలో ఓటమి భయం.. కదిరిలో టికెట్ కష్టం
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రానున్న ఎన్నికల్లో బరిలే నిలిచేందుకు ఆయన సిద్ధమవుతుండగా, అసలు టికెట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. పైగా ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై స్పష్టత లేదు. పుట్టపర్తిలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. అందువల్లే కదిరి నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందన్న దానిపై వ్యక్తిగత సర్వే చేపట్టినట్లు సమాచారం. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. సాక్షి, పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ మనుగడ కష్టంగా మారింది. రెండున్నర దశాబ్దాల పాటు టీడీపీలో పని చేసినా.. ప్రస్తుతం తగిన గుర్తింపు లేకపోవడంతో పార్టీలో కొనసాగాలా? వీడాలా? అనే సందిగ్దంలో పడ్డారు. 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందో? లేదో? తెలియని పరిస్థితి. దీనికి తోడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ టికెట్ ఇచ్చినా.. గెలుస్తామన్న నమ్మకం లేదు. దీంతో ఆయన అనుచర వర్గం కూడా అయోమయంలో పడిపోయారు. పల్లె వెంట నడవాలా? వద్దా? అనే అనుమానంతో స్తబ్ధతగా ఉండిపోయారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేసేందుకు పల్లె రఘునాథరెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే టీడీపీకి రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరుతారనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఆయన వెంట నడిచేందుకు టీడీపీ కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. అసమ్మతి నేతల బెడద.. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి భారీ వ్యతిరేకత ఉంది. మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న టీడీపీ హయాంలో కూడా పల్లెపై తిరుగుబాటు చేశారు. దీనికి తోడు రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకత ఉంది. నల్లమాడ మండలానికి చెందిన సైకం శ్రీనివాసరెడ్డికి పల్లె రఘునాథరెడ్డికి పడదు. అంతేకాకుండా సైకం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పుట్టపర్తికి చెందిన పెదరాసు సుబ్రమణ్యం టీడీపీకి అనుకూలంగా ఉన్నా... పల్లెకు వ్యతిరేకం. ఇప్పటికే రెండుసార్లు ప్రెస్మీట్లో తన అసమ్మతి బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ‘పల్లె’ పుట్టపర్తిని వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది. సర్వం వైఎస్సార్సీపీ కైవసం.. పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ, అమడగూరు మండలాలు గతంలో టీడీపీకి అనుకూలంగా ఉండేవి. అయితే 2019 నుంచి ఈ రెండు మండలాల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. అమడగూరు మండలంలోని పది పంచాయతీ సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిసార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్.. పల్లె రఘునాథరెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన అల్లాబకాష్, ఇస్మాయిల్ కూడా పల్లెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ‘పల్లె’కు సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ‘పల్లె’ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కదిరి నుంచి పోటీ?.. పుట్టపర్తిని దాదాపుగా వద్దనుకుంటున్న పల్లె రఘునాథరెడ్డి వచ్చే ఎన్నికల్లో కదిరి నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తన సొంత మండలం తనకల్లు కావడంతో కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే టీడీపీ అధిష్టానం కందికుంట వెంకటప్రసాద్‌ను కాదని.. పల్లెకు కదిరి టికెట్ ఇచ్చే సాహసం చేయదు. అందువల్లే ‘పల్లె’నే దీనికి ప్రత్యామ్నాయ మార్గం సూచించినట్లు సమాచారం. కందికుంట వెంకట ప్రసాద్‌ను ధర్మవరం నుంచి బరిలో దింపి.. తనకు కదిరి టికెట్ ఇస్తే బాగుంటుందని అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలిసింది. వెంటాడుతున్న ఓటమి భయం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడంతో ఈప్రాంత వాసులంతా వైఎస్సార్ సీసీ వెంట నడుస్తున్నారు. ఇక జాతీయ రహదారి 342కు శ్రీకారం, బెంగళూరు నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి శ్రీకారంతో జనం ఆలోచనా విధానం కూడా మారింది. అభివృద్ధికే పట్టం కట్టాలని వారంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులనే జెడ్పీటీసీ సభ్యులుగా గెలిపించారు. ప్రజాభిమానంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎంపీపీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లోని 15 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో ఓటమి భయం వెంటాడుతుండగా.. పల్లె ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. (క్లిక్ చేయండి: పవన్ గందరగోళం.. మళ్లీ ఆ ఇద్దరే రేసులో?!) -
‘పల్లెకు టికెట్ ఇస్తే పనిచేయం’
అనంతపురం (పుట్టపర్తి టౌన్): వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇస్తే పనిచేసేది లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ కార్యవర్గ సభ్యుడు పెద్దరాసు సుబ్రహణ్యం స్పష్టం చేశారు. పట్టణంలోని సాయి ఆరామంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె రఘునాథరెడ్డి వ్యవహార శైలితో నియోజవర్గంలో టీడీపీ భూస్థాపితం అవుతోందని చెప్పారు. కార్యకర్తలను, నాయకులను పట్టించుకోకుండా, సీనియర్ నాయకులకు వెన్నుపోటు పొడిచారన్నారు. కియా వద్ద, అనంతపురం పట్టణాల్లో 1,300 ఎకరాలు, రూ. 4 వేల కోట్ల ఆస్తి కూడబెట్టుకున్నారని ఆరోపించారు. జేసీ బ్రదర్స్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి కానీ పల్లె ఆస్తులపై ఈడీ ఎందుకు దాడులు జరపడం లేదని ప్రశ్నించారు. తమకు ఒక్క కళాశాల ఉంటే సీ గ్రేడ్‌లో ఉందని, పల్లెకు 40 కాలేజీలు ఉంటే అన్నీ ఏ గ్రేడ్‌లో ఉన్నాయని, ఫీజు రీయింబర్స్మెంట్ ఏ లోటు లేకుండా అందుతోందన్నారు. అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రమశిక్షణతో పనిచేస్తున్న తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అవకాశం కల్పిస్తే అధిష్టానంతో నియోజకవర్గ పరిస్థితులపై చర్చిస్తామని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమో, ప్రత్యామ్నాయం ఎంచుకోవడమో చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వారాదప్ప, లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో వర్గవిభేదాలు: ఆయనకు టిక్కెట్టు ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడు అంటూ..
అనంతపురం (ఓడీ చెరువు): టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఓడీచెరువు మండలం కొండకమర్లలోని మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేత సాకెం శ్రీనివాసరెడ్డితో కలసి వచ్చారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌తో జేసీ మాట్లాడుతూ జిల్లాలో టీడీపీకి చెందిన 11 మంది మాజీ ఎమ్మెల్యేలు మరకలున్న నాయకులేనని, వారందరినీ చంద్రబాబు మార్చాలని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్టు ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ మరకాలేని సాకెం శ్రీనివాసరెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉంటాడని, అతన్ని బలపర్చుతున్నట్లు చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘాటుగా స్పందించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తిలో టీడీపీని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘టిక్కెట్టు ఇచ్చేది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. తాడిపత్రిలో నీకు టిక్కెట్టు వస్తుందో, లేదో చూసుకో. ఇతర నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకుంటే పార్టీకి ప్రమాదం. నేను ఇప్పటికి ఆరు సార్లు బీ ఫారం తీసుకున్నా. ఏడోసారి కూడా తీసుకుంటా’నని అన్నారు. -
వివాదాస్పదంగా మారిన టీడీపీ మాజీ మంత్రి వ్యాఖ్యలు
-
క్రికెట్ కిట్ల పై రఘునాధరెడ్డి ఫోటోలు
-
పరిటాల శ్రీరామ్‌కు చేరవేస్తున్న నగదు సీజ్
సాక్షి, హైదరాబాద్ : మంత్రి పరిటాల సునీత కుమారుడు, అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు చేర వేసేందుకు సిద్ధం చేసిన రూ.24 లక్షలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడి ప్రధాన అనుచరుడు తన డ్రైవర్ ద్వారా నగదు పంపేందుకు ప్రయత్నించారు. నగదు చిక్కిన విషయం తెలియడంతో టీడీపీ కీలక నేతలు, ఏపీ ప్రభుత్వ అధికారులు సైబరాబాద్ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. రాప్తాడు మండల పరిషత్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా (ఎంపీపీ) ఉన్న దగ్గుపాటి వెంకట ప్రసాద్ పటాన్చెరులో డీవీ పాలిమర్స్ పేరుతో ఓ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌కు రూ.24 లక్షలు సమకూర్చడానికి సిద్ధమైన ప్రసాద్ ఈ మొత్తాన్ని పోలీసుల కంటపడకుండా తరలించడానికి పథకం వేశారు. వ్యక్తిగత వాహనాల్లో తీసుకువెళ్తే చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరిగితే పట్టుబడే ప్రమాదం ఉందని భావించి తన డ్రైవర్ సంతోష్‌రెడ్డికి డబ్బు అందించాడు. ఓ టావెల్స్ బస్సులో డబ్బు తరలిస్తున్న సంతోష్‌రెడ్డిని పోలీసులు సోమవారం ఆరామ్‌ఘర్ చౌరస్తా ప్రాంతంలో తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఈ డబ్బుకి సంబంధించి ఆయన వద్ద ఎలాంటి రసీదులు, లెక్కలు లేకపోవడంతో పోలీసు స్టేషన్‌కు తరలించారు. తన యజమాని ప్రసాద్ సూచన మేరకే డబ్బులు తరలిస్తున్నట్లు సంతోష్‌రెడ్డి అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మొత్తాన్ని ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. గెలుపు కోసం మాజీ మంత్రి పల్లె అడ్డదారులు అనంతపురం : మరోవైపు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా తన గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పుట్టపర్తిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. నియోజకవర్గంలోని యువతను ఆకర్షించే ఎత్తుగడలో భాగంగా భారీగా క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రీడా పరికరాల పంపిణీకి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. -
పుట్టపర్తి ఎమ్మెల్యే.. ఓటు కదిరిలో!
పుట్టపర్తి అర్బన్: తన ఓటును కూడా వేసుకోలేని అభ్యర్థి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి. ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పని చేసినా ఈయన ఏనాడు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరనే వదంతి ఉంది. పుట్టపర్తిలో అద్దె గదుల్లో ఉంటూ రాజకీయాలు చేయడమే తప్ప.. ఇక్కడి ప్రజలను, అభివృధ్దిని ఏ మాత్రం పట్టించుకోలేదని స్థానికులు వాపోతుంటారు. కనీసం నియోజకవర్గంలో ఓటు కూడా లేకపోవడం చూస్తే నియోజకవర్గ ప్రజలపై ఆయనకున్న అభిమానం ఏపాటిదో అర్థమవుతోంది. కదిరి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెం.230లో ఓటరు జాబితా సీరియల్ నెం.282లో పల్లె రఘునాథరెడ్డికి ఓటు ఉంది. ఈ విషయం తెలిసి స్థానికులు ఆయనపై జోకులు వేసుకుంటున్నారు. ఆయన ఇటీవల టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించినా..అదీ కూడా అద్దె గదిలోనే కావడం గమనార్హం. -
పల్లె రఘునాథ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దు
-
అధిష్టానంపై గంటా, శిద్దా గుర్రు
-
వాళ్లకు టికెట్ ఇస్తే టీడీపీని ఓడిస్తాం
సాక్షి, అమరావతి : వేసవికి ముందే రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. మరో వారంలో నామినేషన్ల పర్వం మొదలు కానున్న నేపథ్యంలో అధికార టీడీపీకి అసమ్మతి చెమటలు పట్టిస్తోంది. ఎన్నికల పోటీలో నిలిచే అభ్యర్థుల విషయంలో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరించే తీరుపై ఆ పార్టీ కేడర్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా, తమ అనుచరులు, కార్యకర్తలతో కలిసి అసమ్మతి నేతలు నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పుట్టపర్తి నియోజకర్గ వడ్డెర సామాజిక వర్గ నాయకులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం సీఎం నివాసం వద్ద ఆందోళనలు చేపట్టారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మల్లెల జయరాంకు టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుమల వెంకన్న సాక్షిగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఆ తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. జయరాంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయించి రఘునాథరెడ్డిని ఓడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి మరోసారి టికెట్ ఇవ్వకూడదని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు సీఎం నివాసం ముందు ఆందోళనలు చేపట్టారు. రాజేశ్వరకి తప్ప ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా వారిని గెలిపిస్తామని ఆసమ్మతి వర్గం నాయకులు పేర్కొంటున్నారు. ఆమెకు మరోసారి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. అధిష్టానంపై గంటా, శిద్దా గుర్రు మంత్రులు గంటా శ్రీనివాస రావు, శిద్దా రాఘవరావులను రానున్న ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేయించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. విశాఖ నుంచి గంటా, ఒంగోలు నుంచి శిద్దాను పోటీచేయించే అవకాశం ఉంది. అయితే ఎంపీలుగా పోటీ చేసేందుకు అనాసక్తితో ఉన్న వారు అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగానే పోటీ చేస్తామని అధిష్టానాన్ని బతిమిలాడుతున్నారని సమాచారం. ఇక భీమిలి నుంచి సీబీఐ మాజీ డైరక్టర్ జేడీ లక్ష్మీనారాయణను పోటీలో దించాలని టీడీపీ ఆలోచనలు చేస్తోంది. -
మా గ్రామానికి రావద్దు
సాక్షి, అమడగూరు : పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చుక్కెదురైంది. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో రోడ్లను ప్రారంభించడానికి శుక్రవారం విచ్చేసిన ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఏ పుట్లవాండ్లపల్లిలో రోడ్లను ప్రారంభించడానికి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వెళ్లగా ఊరిబయటే వేచి చూస్తున్న గ్రామస్తులు ఎమ్మెల్యే వాహనాలు రాగానే అడ్డగించారు. గ్రామంలో చాలా మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని, మా గ్రామానికి మీరు ఏం చేశారని నిలదీశారు. అలాగే లోకోజుపల్లిలో రోడ్లను ప్రారంభించడానికి వెళ్లగా డ్వాక్రా సంఘాల మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పసుపు–కుంకుమ కింద చెక్కులు ఇచ్చారు కానీ వాటికి డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పది రోజులు క్రితం అమడగూరులో పంపిణీ చేసిన చీరల కోసం తామంతా వచ్చినా ఒక చీర కూడా ఇవ్వలేదని, ఆ రోజు తిండి కూడా లేక కడుపు మాడ్చుకుని ఇళ్లకు వచ్చామన్నారు. అలాగే గుండువారిపల్లికి వెళ్లగా అక్కడ కూడా గోబ్యాక్ పల్లె అంటూ నినాదాలు చేశారు. అర్హులైన వారి ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదని, ఇళ్లు కట్టని వారికి బిల్లులు ఇచ్చారని, సబ్సిడీ రుణాల్లో, ఆవులషెడ్ల మంజూరులో అర్హులకు అన్యాయం చేశారని గ్రామానికి రావద్దని అడ్డుకున్నారు. దీంతో విసిగిపోయిన పల్లె వెనుతిరిగారు. -
‘పల్లె’కు పుట్టపర్తి టికెట్ ఇవ్వద్దు..
సాక్షి, అమరావతి : టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పుట్టపర్తిలో ఈసారి టిక్కెట్ ఇవ్వకూడదని టీడీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ముందు ఆందోళన చేపట్టారు. రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పల్లె రఘునాథరెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వాలని మరికొంతమంది నినాదాలు చేశారు. అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా మరో వర్గం పోటాపోటీగా నినాదాలు చేశారు. కొద్ది సేపు ఇరు వర్గాల మధ్య తోపులాట సైతం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడినుంచి పంపించేశారు. నవ్యాంధ్రలో పుట్టపర్తి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఈ నాలున్నరేళ్ల కాలం పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి ఏనాడూ నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరుకు సొంత పార్టీలోని వారిని సైతం నిర్లక్ష్యం చేస్తూ తానొక్కడే ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. అక్రమాలతో ప్రజాధనాన్ని మూట గట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో అతనిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఇప్పటికే పల్లెకు టికెట్ ఇవ్వరాదంటూ పలువురు నేరుగా టీడీపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. తనకే టికెట్ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు, ఇతర నాయకులను కలిసి బుక్కపట్నంకు చెందిన పెదరాసు సుబ్రహ్మణ్యం పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నకేశవులు, తదితరులు జిల్లా మంత్రి దేవినేని ఉమాను గత బుధవారం కలిసి పల్లెకు ఈసారి టికెట్ ఇవ్వరాదంటూ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పల్లె సరికొత్త ఎత్తుగడలతో ప్రజల ముందుకు వచ్చారు. -
‘పల్లె’ మాయాజాలం
అనంతపురం, బుక్కపట్నం: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి రాజకీయంగా స్వీయ రక్షణలో పడ్డారు. తనపై సొంతపార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో కొత్త గిమ్మిక్కులకు తెరలేపారు. ఇందులో భాగంగానే చీరల పంపిణీతో మహిళా ఓటర్లును ప్రలోభపెట్టే చర్యలకు ఇప్పటి నుంచే తెరలేపారు. ఇది కూడా సరైన వేళకు ప్రారంభం కాకపోవడంతో మహిళలకు ఇబ్బందులు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. నవ్యాంధ్రలో పుట్టపర్తి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఈ నాలున్నరేళ్ల కాలం పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి ఏనాడూ నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరుకు సొంత పార్టీలోని వారిని సైతం నిర్లక్ష్యం చేస్తూ తానొక్కడే ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. అక్రమాలతో ప్రజాధనాన్ని మూట గట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో అతనిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఇప్పటికే పల్లెకు టికెట్ ఇవ్వరాదంటూ పలువురు నేరుగా టీడీపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. తనకే టికెట్ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు, ఇతర నాయకులను కలిసి బుక్కపట్నంకు చెందిన పెదరాసు సుబ్రహ్మణ్యం పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నకేశవులు, తదితరులు జిల్లా మంత్రి దేవినేని ఉమాను బుధవారం కలిసి పల్లెకు ఈసారి టికెట్ ఇవ్వరాదంటూ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పల్లె సరికొత్త ఎత్తుగడలతో ప్రజల ముందుకు వచ్చారు. తన సతీమణి పేరిట.. ఇటీవల ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సతీమణి ఉమ దివంగతురాలైన విషయం విదితమే. ఆమె స్మారకార్థం తన కుమారుడు, కోడలుతో కలిసి బుక్కపట్నంలో గురువారం చీరల పంపిణీ మొదలు పెట్టారు. దీనిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయించారు. దీంతో గురువారం ఉదయం పది గంటలకు స్థానిక బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్దకు పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలు కావస్తున్నా.. చీరల పంపిణీ ఊసు లేకపోయింది. ఎండలోనే వృద్ధులు, మహిళలు పడిగాపులు కాశారు. చివరకు 4.30 గంటలకు ఐకేపీ అధికారులను వెంటబెట్టుకువచ్చిన పల్లె,.. వారి సమక్షంలోనే డ్వాక్రా సంఘాల లీడర్లకు వారివారి గ్రూపులోని సభ్యుల సంఖ్యను బట్టి చీరలు అందజేసి వెళ్లిపోయారు. కేవలం డ్వాక్రా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు అందజేసి, మిగిలిన వారిని పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డికి సతీ వియోగం
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి సతీమణి, బాలాజీ విద్యాసంస్థల కరస్పాండెంట్ పల్లె ఉమాదేవి(56) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో సాయంత్రం 3.46 గంటలకు తుదిశ్వాస విడిచారు. సామాన్య కుటుంబంలో జన్మించిన పల్లె ఉమాదేవి స్వగ్రామం శింగనమల మండలం సోదనపల్లి. పల్లె రఘునాథరెడ్డితో ఆమెకు 1979 అక్టోబర్‌లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు వెంకటకృష్ణకిశోర్, కోడలు సింధూర, మనుమడు, మనుమరాలు ఉన్నారు. పల్లె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ఉమాదేవి కీలక పాత్ర పోషించారు. బాలాజీ విద్యాసంస్థల ద్వారా ఆమె పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. గతంలో ఆమె పుట్టపర్తిలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో పల్లె రఘునాథరెడ్డిని బలవంతంగా దీక్ష విరమింపజేయడంతో ఆమె దీక్ష కొనసాగించింది. ఇటీవల ఆమె ఆరోగ్యం కుదుట పడాలని యువజనోత్సవాల్లో క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఆసుపత్రికి చేరుకుని ఉమాదేవి మృతదేహానికి నివాళులర్పించారు. మంత్రులు నారాలోకేష్, కాలవ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఆమె మృతదేహాన్ని సందర్శించారు. మరణవార్త తెలియడంతో పుట్టపర్తి, అనంతపురంలోని పల్లె ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. పుట్టపర్తి నుంచి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలివెళ్లారు. -
భూ వివాదంలో పల్లె రఘునాథ్‌రెడ్డి
-
భూవివాదంలో పల్లె రఘునాథరెడ్డి
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి భూవివాదంలో చిక్కుకున్నారు. వైఎస్సార్ సీపీ నేత, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్‌కు చెందిన భూముల్లో పల్లె వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. పల్లె రఘునాథరెడ్డి గతంలో ఆలమూరు గ్రామం వద్ద వ్యవసాయ కళాశాల కోసం 206 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ భూమిపై హైకోర్టులో కేసు ఉండగానే ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. పోలీసుల అండతో భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నదీం అహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన తల్లికి చెందిన భూమిని అక్రమంగా పల్లె రఘునాథరెడ్డి కోసుగోలు చేశారని ఆరోపించారు. హైకోర్టులో కేసు ఉండగా రిజిస్టర్ చేయించుకోవటం తప్పని అన్నారు. పోలీసుల అండతో పల్లె దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఏపీ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
పల్లె రఘునాథరెడ్డికు స్వల్ప గాయాలు
-
టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి
సాక్షి, అనంతపురం: టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో ఏపీ మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నడుపుతున్న బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్లె రఘునాథరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. జిల్లాలోని నల్లమడ మండలం దొన్నికోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ ర్యాలీలోనూ అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ కోడెల కిందపడిపోగా.. ఆయన తలకు స్పల్పగాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన సైకిల్ యాత్రను పూర్తిచేశారు. -
ఆ డబ్బు ఏంచేశారు పవన్..?
సాక్షి, విజయవాడ: దక్షిణాదిలో బిజెపి ఎదుగుదలను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని, దీనిలో మిత్రపక్షంగా వున్న టీడీపీ భాగస్వామ్యం కావడం బాధాకరమని బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు ఎన్. రమేష్ నాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కియా మోటార్స్ ఏర్పాటైన ప్రాంతంలో రైతుల భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాయలసీమ ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. ‘కర్ణాటక, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారు అధికంగా వున్న చోట్ల తమ పార్టీ నష్టపరిచేందుకు కుట్ర జరుగుతోంది. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీలో జేఎఫ్‌సీలో అవుట్‌డేటెడ్ నేతలు, స్వయం ప్రకటిత మేథావులు వున్నారు. జేఎఫ్సీ నివేదిక కోసం నిర్వహించిన సమావేశం ఫార్స్. గతంలో పవన్ కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే వేదిక ఏర్పాటు చేసి, కోటి రూపాయలు కేటాయించినట్టు ప్రకటించారు. ఈ ఫోర్స్ ఏమయ్యింది? ఆ డబ్బు ఏం చేశారు? రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై పవన్ వైఖరి ఏమిటి? సీమ గోడు పవన్‌కు పట్టదా? పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లో రైతుల నుంచి టీడీపీ నేతలు భారీ కొనుగోళ్లు చేస్తున్నారు. కియా మోటార్స్ ప్రాంతంలో పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్ భూములు కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలోని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. సుమారు రెండు వందల కోట్ల విలువైన భూములు ఈ రకంగా తీసుకున్నారు. దీనిపై అన్ని ఆధారాలు మా వద్ద వున్నాయి. రైతులను భయపెట్టి 275 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి, భూములను రైతులకు ఇప్పించాల’ని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. -
చీఫ్ విప్‌లుగా పల్లె, పయ్యావుల..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నియమితులయ్యారు. శాసన సభలో ఇప్పటికే నలుగురు ఉన్న విప్‌లకు అదనంగా మరో ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే అసెంబ్లీ విప్‌లుగా గణబాబు, సర్వేశ్వరరావు, ఇక శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, విప్‌లుగా బుద్దా వెంకన్న,డొక్కా మాణిక్య వరప్రసాద్, రామసుబ్బారెడ్డి, షరీఫ్‌ల నియామకం జరిగింది. నియామకానికి సంబంధించిన బుధవారం జీవో విడుదల అయింది. కాగా పల్లె రఘునాథరెడ్డి తొలిసారి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీ, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు. ఇప్పుడు తిరిగి చీఫ్ విప్‌గా ఎంపికయ్యారు. మరోవైపు పయ్యావుల కేశవ్ తొలిసారి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో ఓటమిపాలయ్యారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో ఓటమి చవిచూశారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. దీంతో కేశవ్ తీవ్ర నిరాశ చెందినా.. చివరకు మండలి చీఫ్‌విప్ పదవిని కట్టబెట్టారు. -
ఎవరికి దక్కేనో..?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేసే అవకాశముందని సమాచారం. ఈ పదవులపై సీనియర్లతో పాటు పలువురు నాయకులు ఆశలు పెట్టుకోవడంతో పోటీ ఎక్కువగానే ఉందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ చీఫ్ విప్ రేసులో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముందంజలో ఉన్నారు. బొండా ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావు కూడా ఈ పదవికి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. శాసనమండలి ఛైర్మన్ పదవికి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మండలి చైర్మన్ పదవికి ఎన్ఎండీ ఫరూఖ్ పేరును చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడంతో చీఫ్, మూడు విప్ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మండలి చీఫ్ విప్ పదవిని దక్కించుకునేందుకు టీడీ జనార్దన్, వైవీబీ రాజేంద్రప్రసాద్, రామసుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విప్ పదవి రేసులో బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర, అన్నం సతీశ్, అంగర రామ్మోహన్రావు, సంధ్యారాణి ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పదవులు ఎవరి దక్కుతాయన్న దానిపై అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. -
నోరు జారి చీఫ్ విప్ పదవీ పొగొట్టుకున్న‘పల్లె’
అమరావతి: మంత్రి పదవి పోయినందుకే తీవ్ర మనోవేదనతో ఉన్న పల్లె రఘునాథరెడ్డికి ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టు కూడా లేకుండా పోయింది. మంత్రి పదవి కుల సమీకరణల నేపథ్యంలో పోగా... నోరుజారి చీఫ్ విప్ పదవి పోగొట్టుకున్నట్టు మంగళవారం శాసనసభ లాబీల్లో తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణకు ముందు కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్‌గా ఉన్నారు. ఆయన బోయ సామాజిక వర్గానికి చెందినవారు. ఆ వర్గాన్ని ఎస్టీలలో చేరుస్తామని చంద్రబాబు నాయుడు 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అది సాధ్యపడే అవకాశం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన కాల్వకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విషయాన్నే చంద్రబాబు పల్లెకు వివరిస్తూ... ‘మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తప్పించాలని లేదు. కానీ బోయల్ని ఎస్టీలలో చేర్చే పరిస్థితి లేదు. ఆ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కాల్వకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా. మీకు చీఫ్ విప్ పదవి ఇస్తా’నని చెప్పారు. దాంతో సంతృప్తి పడిన పల్లె రఘునాథరెడ్డి ఆగమేఘాల మీద సమాచార ప్రజా సంబంధాల శాఖ నుంచి మీడియాకు ప్రకటన ఇప్పించుకున్నారు. చీఫ్ విప్ పేరిట ఓ వాట్సాప్ గ్రూపును తయారు చేయించుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా... ఆ తర్వాతే కథ చెడింది. మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించాల్సి వస్తుందో తనకు రహస్యంగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని తన అనుచరుల వద్ద బహిర్గతం చేశారు. అది కాల్వ శ్రీనివాసులుకు తెలిసి చంద్రబాబు చెవిన పడేశారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పల్లెకు ప్రకటించిన చీఫ్ విప్ పదవిని కూడా పీకేశారు. అందువల్లనేనేమో మంగళవారం శాసనసభలో కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్ పాత్ర కూడా పోషించారు. -
నా శాఖలను దానం చేశా: పల్లె
పుట్టపర్తి టౌన్: తాను మైనారిటీ శాఖను సీఎం చంద్రబాబుకు, ఐటీ శాఖను లోకేశ్‌కు, టూరిజం శాఖను అఖిల ప్రియకు, సమాచార శాఖను కాలవ శ్రీనివాసులుకు, ఎన్ఆర్ఐ శాఖను కొల్లు రవీంద్రకు దానం చేశానని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని పర్తిసాయి ధర్మశాలలో టీడీపీ సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినాయకుడు చంద్రబాబు కోరిన వెంటనే తాను పదవికి రాజీనామా చేశానన్నారు. అనంతరం పుట్టపర్తి నగర పంచాయతీ టీడీపీ కన్వీనర్ పదవికి ఆశావహుల పేర్లను సేకరించారు. పార్టీ నిర్ణయం మేరకు కన్వీనర్ పేరును త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు రమణారెడ్డి, చైర్మన్ పి.సి.గంగన్న, పుడా మాజీ చైర్మన్ కడియాల సుధాకర్, వైస్ చైర్మన్ కడియాల రాము, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్య్వస్థీకరణలో రఘునాథరెడ్డి మంత్రి పదవిని కోల్పోయారు. తనను కేబినెట్ నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
మంత్రి పల్లె కళాశాలలో అగ్నిప్రమాదం
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక రుద్రంపేట సమీపంలోని మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన బాలాజీ ఎంబీఏ కళాశాలలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు వంద కంప్యూటర్లు కాలిపోయాయి. వివరాలిలా ఉన్నాయి. కళాశాలలోని కంప్యూటర్ సెంటర్‌కు ల్యాబ్ అసిస్టెంట్ రామ్మోహన్‌రెడ్డి వెళ్లి ఏసీ స్విచ్ ఆన్ చేశాడు. షార్ట్ సర్క్యూట్ జరిగి, నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. కళాశాల సిబ్బంది తేరుకునేలోపే మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే కంప్యూటర్లు, ఏసీలు, వీల్చైర్లు, రెండు సర్వర్లు, ఫ్యాన్లు, ఎల్సీడీ ప్రొజెక్టర్ తదితర వస్తువులు కాలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
నిన్న మహిళా ఎమ్మెల్యేలు ఇవాళ మంత్రి పల్లె
-
నిన్న మహిళా ఎమ్మెల్యేలు,ఇవాళ మంత్రి పల్లె..
అమరావతి: ప్రజా సమస్యలపై శాసనసభలో మాట్లాడకుండా ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్న టీడీపీ సభ్యులు బుధవారం కూడా మీడియా పాయింట్ వద్ద అదే తీరును అవలంభిస్తున్నారు. నిన్న మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైఎస్ఆర్ సీపీ మహిళ సభ్యులను అడ్డుకుని టీడీపీ మహిళ సభ్యులు నానా రభస సృష్టిస్తే....ఇవాళ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు ఇతర టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. అధికార పార్టీ సభ్యుల తీరుపై చెవిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె, చెవిరెడ్డి మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా తమ గొంతు నొక్కుతారా అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. సభలో తమను ఎలాగూ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, కనీసం మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనీయకపోవడం దారుణమన్నారు. అన్నిచోట్లా అధికారపక్షమే మాట్లాడాలనుకోవడం సరికాదన్నారు. రుణమాఫీ అమలు కాకపోవడం, ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ అంశాన్ని సభలో లేవనెత్తితే ...మాట్లాడనీవ్వకుండా మైక్ కట్ చేస్తారని చెవిరెడ్డి అన్నారు. -
మంత్రి ‘పల్లె’ కళాశాల సీజ్
⇒ ఆస్తి పన్ను చెల్లించని ఫలితం ⇒ ‘వాళ్లకెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే’ అంటూ సమాధానం కదిరి: ఆస్తి పన్ను చెల్లించని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి సంబంధించిన ఓ కాలేజీని మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. కదిరిలో మంత్రి పల్లెకు చెందిన శ్రీనివాస జూనియర్ కాలేజీకి రూ. 1.61 లక్షల మేర ఆస్తి పన్ను బకాయి ఉంది. మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో కాలేజీ వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలంటూ గంటకు పైగా డప్పు వాయిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆస్తిపన్ను గురించి బిల్డింగ్ యజ మానితో మాట్లాడుకోవాలని ఆ కాలేజీ ప్రిన్సి పల్ సూర్యప్రకాశ్ చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ అక్కడి నుంచే బిల్డింగ్ యజమాని రామ సుబ్బారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. బిల్డింగ్ పన్నులన్నీ కడతానని మంత్రి పల్లె తనకు అగ్రిమెంట్ రాసిచ్చాడని ఆయన సమాధానం చెప్పారు. నా కాలేజీలోనే డప్పు వాయిస్తారా! ఇదంతా జరుగుతుండగానే సదరు కాలేజీ ప్రిన్సిపాల్ అసెంబ్లీలో ఉన్న మంత్రి పల్లెకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. స్పందిం చిన మంత్రి ‘మన కళాశాల ఆవరణలోకి వచ్చి డప్పు వాయిస్తారా? వారికెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే.. ఆ విషయం నేను మున్సి పల్ మంత్రి నారాయణతో మాట్లాడతాను’ అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బకాయి కోసం వారం కిందటే రెడ్ నోటీస్ ఇచ్చామని చెప్పిన కమిషనర్.. కాలేజీ ఆఫీస్ రూం, స్టాఫ్ రూంలకు తాళం వేసి, సీల్ వేశారు. కాగా, కదిరిలోనే మంత్రి పల్లె నిర్వహిస్తున్న వివేకానంద డిగ్రీ కాలేజీ కూడా రూ. 84 వేల ఆస్తి పన్ను బకాయి ఉంది. ఆ పన్ను బిల్డింగ్ ఓనర్‌కే సంబంధం కదిరిలో మా శ్రీనివాస కాలేజీ బిల్డింగ్‌కు సంబంధించి ఆస్తి పన్నుకు మాకు ఎలాంటి సబంధం లేదు. ఆ బకాయి బిల్డింగ్ యజమానే చెల్లించాలి. అయినప్పటికీ మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన బకాయి చెక్కు రూపంలో పంపాను. – మంత్రి పల్లె రఘునాథరెడ్డి -
కదిరిలో మంత్రి పల్లె కళాశాల సీజ్
కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉన్న మంత్రి పల్లె రఘనాథరెడ్డికి చెందిన కాలేజ్ ను అధికారులు సీజ్ చేశారు. స్థానికంగా పల్లె రఘునాధ్ రెడ్డికి చెందిన శ్రీనివాస కళాశాల గత ఐదేళ్లుగా పన్ను చెల్లించడం లేదు. దాదాపు రూ. 1.65 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు ఎన్ని సార్లు నోటీసులు పంపినా కాలేజ్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ మంగళవారం ఉదయం సీజ్ చేశారు. ఉదయం కళాశాలకు వెళ్లిన కమిషనర్ విద్యార్థులను బయటకు పంపి కాలేజ్ గేటుకు తాళం వేసి సీజ్ చేశారు. ఎన్ని నోటీసులు పం0పినా కళాశాల యాజమాన్యం స్పందించకపోవడంతో చట్టరీత్యా చర్యలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. -
‘రాజధానిలో ఇల్లు ఉండాలనే స్థలం కొన్నాం'
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి ప్లాట్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ రాజధానిలో ఇల్లు ఉండాలనే ఉద్ధేశంతోనే తాము స్థలం కొన్నామన్నారు. లాటరీలో ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని మంత్రి పల్లె పేర్కొన్నారు. కాగా మంత్రి కుమారుడు పల్లె వెంకటకృష్ణారెడ్డి పేరున నేలపాడు గ్రామంలో 2,520 చదరపు గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటు పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రభుత్వ షాపింగ్ క్లాంప్లెక్స్‌ల జోన్ ఉంది. అలాగే లాటరీ విధానంపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ లే అవుట్ ప్రకారం పెద్ద ప్లాట్లన్నీ రోడ్డు పక్కనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధానం అంతా పారదర్శకంగానే జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో అధికార టీడీపీ పెద్దలు అడుగడుగునా మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో భూములను కారు చౌకగా కొట్టేసి రైతులను నిలువునా ముంచిన టీడీపీ నేతలు.. ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చి పరిహారం రూపంలో అతి విలువైన ప్లాట్లను కొట్టేసిన విషయం విదితమే. -
మంత్రి పల్లె కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
అధ్యాపకురాలి వేధింపులే కారణమని సూసైడ్ నోట్! అనంతపురం సెంట్రల్: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కళాశాలలో వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాసినా పోలీసులు విషయం బయటపడకుండా తొక్కిపట్టారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వీరన్నపల్లికి చెందిన గోపాల్, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె మాధవీలత మంత్రికి చెందిన పీవీకేకే కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం సాయంత్రం కళాశాల ముగించుకుని అనంతపురం అరవింద్‌నగర్‌లోని బీసీ హాస్టల్‌కు వెళ్లగానే విషపు ద్రావకం తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. సోమవారం సాయంత్రమే ఈ ఘటన జరిగినా కళాశాల యాజమాన్యం, పోలీసులు తొక్కిపెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారట!
శ్రుతి మించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వామి భక్తి హిందూపురం రూరల్: రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పదవీ గండం భయం పట్టుకున్నట్లుంది. తన అమాత్య పదవి పోకుండా ఉండేందుకు అయిన దానికి, కాని దానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతుండటం చూసి విస్తుపోతున్నారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రోజుకు 36 గంటలు పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి నాయకులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న ఘనత నారా వారిది’ అంటూ ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలో విలేకరులతో అన్నారు. అదేంటి సార్.. అలా అంటున్నారంటే, ''అంతేనయ్యా.. మా ముఖ్యమంత్రి నిద్రపోకుండా పని చేస్తున్నారని చెబుతున్నాను'' అని కూడా అంటున్నారు. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో ‘పల్లె’కు బెర్త్ దొరకదనే ప్రచారం ఊపందుకోవడంతో ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చిందని ‘అనంత’వాసులు చర్చించుకుంటున్నారు. పంచ్ పడింది... దీంతో ఒక్కసారిగా మళ్లీ సోషల్ మీడియాలో పంచ్‌లు వెల్లువెత్తుతున్నాయి. పల్లె చెప్పిన మాటను ప్రస్తావిస్తూ.. 'నువ్వు కూడా బీకాంలో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివావా రాజా' అన్న పంచ్ ఒకటి సోషల్ మీడియా సైట్లలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఇంతకుముందు జలీల్ ఖాన్ ఇలాగే బీకాం ఫిజిక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వాట్సప్, ఫేస్‌బుక్‌లలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. రోజుకు ఉండేవే 24 గంటలైతే, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు 36 గంటలు ఎలా పనిచేస్తున్నారో అర్థం కాక సామాన్యులు జుట్టు పీక్కుంటున్నారు. -
తోటపల్లి ప్రాజెక్టును మేమే పూర్తి చేశాం
జరజాపుపేట (నెల్లిమర్ల) : తోటపల్లి ప్రాజెక్టును తామే పూర్తిచేసి, 1.2 లక్షల ఎకరాలకు సాగునీరందించామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. జిల్లాలోని నాలుగు నదులను అనుసంధానం చేస్తామన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేటలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి త్వరలో నిర్వహించబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆద్యంతం తన ప్రసంగాన్ని కొనసాగించారు. నగర పంచాయతీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలు మంజూరు చేశామన్నారు. 325 ఇళ్ళు మంజూరు చేశామని, రూ. 20 కోట్లతో తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. ఇక్కడ అభివృద్ధి పనులు వేగవంతానికి జెడ్పీ సీఈఓ రాజకుమారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రసంగించిన మంత్రి ఆద్యంతం సభికులను అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. గ్రామ పంచాయతీతోనే మాకు అభివృద్ధి.. మంత్రి రఘునథరెడ్డి ప్రసంగిస్తుండగా కొంతమంది మహిళలు లేచి జరజాపుపేటను గ్రామ పంచాయతీగా మార్పు చేస్తేనే తమకు అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పేందుకు ప్రయస్తుండగా మంత్రి వారిని వారించి కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జేసీ శ్రీకేశ్ బాలాజీ లఠ్కర్, నోడల్ అధికారి ఉదయ్‌భాస్కర్, కమిషనర్ అచ్చిన్నాయుడు, ఎంపీపీ వనజాక్షి, నేతలు అవనాపు సత్యనారాయణ, నల్లి చంద్రశేఖర్, కింతాడ కళావతి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీలపై మంత్రి ‘పల్లె’ వివక్ష
పుట్టపర్తి టౌన్ : ‘‘రెండు దశాబ్దాలుగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోసం, టీడీపీ బలోపేతానికి కృషి చేశాను. అయినా ఎస్సీనైన నాకు పార్టీలో ఏ మాత్రం గుర్తింపు ఇవ్వకుండా మంత్రి పల్లె తీవ్రంగా అవమానిస్తున్నారు. దీంతో మనస్థాపానికి గురై మార్కెట్‌యార్డ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నా’’ అంటూ నగరపంచాయతీ పరిధిలోని బడేనాయక్ తండాకు చెందిన దేవేంద్రనాయక్ ప్రకటించారు. స్థానిక సాయిఆరామంలో గురువారం లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్లె రఘునాథరెడ్డి కోసం 1998లో అనంతపురంలో ఆందోళనలు చేశానని, తన సొంత వార్డు బడేనాయక్ తండాలో పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నానన్నారు. అయితే తనను, తన వార్డును మంత్రి పల్లె తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. నగర పంచాయతీలో తన వార్డులోని టీడీపీ కార్యకర్తలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఎస్టీ రుణాలు మంజూరులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కష్టపడి పనిచేసిన తనలాంటి కార్యకర్తలను విస్మరిస్తూ ఇటీవల పార్టీలో చేరిన ధనవంతులు, వ్యాపారులకు ప్రాధాన్యతనిస్తున్నాడని ఆరోపించారు. తనకు 2016 ఫిబ్రవరిలో పెనుకొండ మార్కెట్‌యార్డు డైరెక్టర్ పదవి ఇచ్చారని,ఇది నామమాత్రమేనని ఎలాంటి ప్రాధాన్యతా లేదన్నారు. మంత్రి పల్లె దృష్టికి తాను బడేనాయక్ తడా సమస్యలు తీసుకెళ్తే ఒక్కటీ పరిష్కరించలేదన్నారు. పార్టీ సభ్యత్వం పొందిన 140 మందితోపాటు మరో 300 మంది గిరిజనులతో కలసి టీడీపీని వీడాలనుకుంటున్నామని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవినాయక్ మాట్లాడుతూ టీడీపీలో ఎస్టీలను ఓట్ల కోసమే వాడుకుంటారే తప్ప రాజకీయంగా ఎదగనివ్వడం లేదన్నారు. సమావేశంలో ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయకుమార్ నాయక్, నాయకులు లోకేష్‌నాయక్, బాలాజీనాయక్, సాయికుమార్‌నాయక్, గణేనాయక్, శ్యాంకుమార్నాయక్, నాగేంద్రనాయక్, కిరణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. దేవేంద్రనాయక్ సస్పెండ్ : పెనుకొండ మార్కెట్ యార్డు డైరెక్టర్ దేవేంద్రనాయక్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని పార్టీ పట్టణ కన్వీనర్ రామాంజనేయులు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ పార్టీని మంత్రి పల్లెను కించపరుస్తూ బహిరంగంగా ప్రకటనలు చేయడంతో దేవేంద్రపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. -
విశాఖలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్
మంత్రి పల్లె రఘునాథరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు విశాఖలో ఫిలిం డెవలెప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన 28 రాష్ట్రాల సమాచార శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌కు పరిమితమైన చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించడానికి విశాఖలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ విషయంపై చిత్ర పరిశ్రమ వర్గాలతో చర్చలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. విశాఖలో ఫిలిం, టెలివిజన్ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాచార శాఖ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. పథకాల ప్రచారానికి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌తోపాటు ఇతర అన్ని సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నామని పల్లె తెలిపారు. -
ప్రైవేట్ రంగానికి పెద్దపీట
-
ప్రైవేట్ రంగానికి పెద్దపీట
మంత్రివర్గ సమావేశం నిర్ణయం సెజ్‌లు, ప్రైవేట్ పరిశ్రమలకు భూ కేటాయింపులు సాక్షి, అమరావతి: ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తూ గురువారం తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఏపీఐఐసీ నుంచి భూములు తీసుకోవడం, ఇవ్వడం వంటి నిర్ణయాలు మంత్రివర్గం తీసుకున్నది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలు కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పలువురిలో చర్చకు దారి తీశాయి. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార ప్రసార శాఖల మంత్రి పల్లె రఘునాధరెడ్డి గురువారం వెల్లడించారు. ♦ అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమర్?ర గ్రామం సర్వే నెంబరు: 447/2లో 23.11 ఎకరాలు, పరిగి మండల కేంద్రంలో సర్వే నంబరు 451-1ఎలో 44.05 ఎకరాలు, చిత్తూరు జిల్లా వి కోట మండలం బైరుపల్లి గ్రామంలో సర్వే నంబరు 96-10, 99-1లో 7.94 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి బదలాయింపు. ♦ చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలం చినపందూరులో ఏపీఐఐసీకి చెందిన 200 ఎకరాల భూమిని అపోలో టైర్స్ లిమిటెడ్ కంపెనీకి కేటాయింపు. ఇక్కడ టైర్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. ♦ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదన మేరకు ఎప్పటికప్పుడు భూ సేకరణ కోసం తీసుకొనే రూ.ఐదువేల కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయం. ♦ షెడ్యూల్డ్ ప్రాపర్టీలో విలువ కట్టని ఆస్తులలో హీరోమోటార్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టిన పెట్టుబడికి సేల్ డీడ్‌లో నష్టపరిహారం ష్యూరిటీ క్లాజ్‌ను చేర్చే ప్రతిపాదనకు ఏపీఐఐసీ లిమిటెడ్‌కు అనుమతి. ♦ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ల గౌరవ వేతనం ఇతర భత్యాల పెంపు రెట్టింపు. ♦ అమరావతిలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో దుబాయ్‌కి చెందిన బీఆర్ షెట్టి గ్రూప్ మెడికల్ యూనివర్శిటీ, వెయి పడకల ఆస్పత్రి, వైద్య పరికరాల తయారీ యూనిట్, నేచురోపతి సెంటర్, స్టాఫ్ క్వార్టర్స్ ఏర్పాటుకు ఎకరా రూ.50 లక్షల చొప్పున 100 ఎకరాల కేటాయింపు. ♦ అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ హడ్కో లేదా ఇతర సంస్థల నుంచి మూడేళ్ళలో తిరిగి చెల్లించేలా రూ.1859 కోట్ల రుణాన్ని తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడానికి ఆమోదం. ♦ చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న పోలీస్ స్టేషన్ కోసం హోమ్ శాఖలో కొత్తగా 172 పోస్టులు మంజూరయ్యాయి. రెవెన్యూ శాఖలో డెరైక్టర్ ఆఫ్ ట్రాన్సలేషన్ పోస్ట్ మంజూరు చేశారు. ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ శాఖకు సంబంధించి 22 పోస్టులు మంజూరు చేశారు. అందులో 11 టీచింగ్, 6 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు విజయనగరం జిల్లా గరివిడిలోని పశువైద్య కళాశాలకు మంజూరు చేశారు. -
మంత్రి ఎక్కిన విమానంలో సాంకేతిక లోపం!
చెన్నై: మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఆకస్మిక అవాంతరంతో మంత్రి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. స్పైస్‌జెట్ విమానం ఆలస్యం ఇక గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యమైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 5 గంటలకు వెళ్లాల్సిన విమానం రాత్రి 8 గంటలు అయినా బయలుదేరలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు-గన్నవరం-చెన్నై కనెక్టివిటీ స్పైస్‌జెట్ విమానం గన్నవరం సాయంత్రం 4 గంటలకు చేరుకొని.. సాయంత్రం 5 గంటలకు చెన్నై బయలుదేరుతోంది. అయినా.. అనుకోనిరీతిలో ఆలస్యం కావడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. -
మంత్రి పల్లె సోదరుని మృతి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోదరుడు పల్లె వెంకటసుబ్బారెడ్డి మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పల్లెవాండ్లపల్లిలో తుదిశ్వాస విడిచారు. సోదరుని మరణవార్త తెలిసిన వెంటనే మైసూరులో అధికార పర్యటనలో ఉన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి హుటాహుటిన పల్లెవాండ్లపల్లె చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పల్లె సోదరుని అంత్యక్రియలు జరిగాయి. -
రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మంత్రి పల్లె రఘునాథరెడ్డి సాక్షి, అమరావతి: తనపై వస్తున్న ఆరోపణలు రుజువుచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, త్వరలోనే తాను ఆస్తులు ప్రకటిస్తానని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ఆస్తుల విషయంలో సాక్షి మీడియా కథనాల్లో వాస్తవాలు లేవని, తనపై ప్రచురించిన వార్తల విషయంలో సాక్షి మీడియాకు నోటీసులిస్తానని చెప్పారు. ఆరోపణలు రుజువు చేయకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను భూదందాలు, రౌడీయిజం చేయలేదన్నారు. విద్యా సంస్థలను నిర్వహించి సంపాదించుకున్నానని చెప్పారు. -
గ్యాంగ్‌స్టర్ మధుతో ‘పల్లె’ దోస్తీ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎర్లంపల్లి మధు వ్యవహారాలకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండగా నిలిచారా? మంత్రి మద్దతుతోనే మధు సెటిల్మెంట్లు, భూదందాలు నిర్వహించారా? పల్లెతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు అతని అండతో సెటిల్మెంట్లు చేశారా? రెండ్రోజులుగా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్న మధు వీడియో, దాని వెనుక ఉన్న పరిణామాలు బేరీజు వేస్తే అవుననే సమాధానం వస్తోంది. మధు 2014 ఎన్నికలకు ముందు పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో టీడీపీ కండువా వేసుకున్నాడు. ఎన్నికల్లో పల్లె విజయానికి కృషి చేశాడు. పల్లె బెంగళూరుకు వెళితే మధునే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసేవాడని తెలుస్తోంది. పలు సెటిల్మెంట్లను కూడా మధుతో పల్లె చేయించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మధు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో అతనితో పల్లె రఘునాథరెడ్డి సంబంధాలు, భూదందాలపై జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. అనంతపురం జిల్లాలో పల్లెకు వందల ఎకరాల భూము లు ఉన్నాయని, వీటిని గ్యాంగ్‌స్టర్ మధు అండతోనే పంచాయితీలు చేసి కారుచౌక గా కొట్టేశారని పలువురు ఆరోపిస్తున్నారు. మధును కిడ్నాప్ చేసిన బెంగళూరు రియల్టర్ మంజునాథ్ బెంగళూరుకు చెందిన రియల్టర్ మంజునాథ్‌కు సంబంధించిన రూ.50 కోట్ల భూమి వ్యవహారంలో మధు జోక్యం చేసుకున్నాడు. పక్కకు తప్పుకోవాలని మంజునాథ్ గ్యాంగ్ హెచ్చరించినా వినలేదు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట మధు వాకింగ్ చేస్తుండగా.. మంజునాథ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, అజ్ఞాతంలోకి తీసుకెళ్లింది. దుస్తులు ఊడదీసి చితకబాదింది. సెటిల్మెంట్లు చేస్తావా? మా విషయంలో జోక్యం చేసుకుంటావా? అని తిడుతూ చావబాదారు. దెబ్బలు తట్టుకోలేక మధు తప్పయిపోయిందని, వదిలిపెట్టాలని, మళ్లీ సెటిల్మెంట్ల జోలికి వెళ్లనని విలపించాడు. ఈ దృశ్యాలన్నీ మంజునాథ్ గ్యాంగ్ సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడవి హల్చల్ చేస్తున్నాయి. (చదవండీ: బెంగళూరులో గ్యాంగ్ వార్) -
గ్యాంగ్‌స్టర్ మధుతో ‘పల్లె’ దోస్తీ!
– బెంగళూరు కేంద్రంగా మధు సెటిల్మెంట్లు, భూదందాలు – భూదందాలో రియల్టర్ మంజునాథ్‌తో విభేదాలు – మధును కిడ్నాప్ చేసి చితకబాదిన మంజు గ్యాంగ్ – సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న మధు వీడియోలు – మధుతో మంత్రి పల్లెతో పాటు మరికొందరు టీడీపీ నేతలకు సంబంధాలు – గ్యాంగ్‌స్టర్ భానుకిరణŠ కూ మధు సన్నిహితుడు.. మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన సాక్షి – సూరి హత్యకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించినట్లు సమాచారం! – పూర్తి వీడియోను బయటపెడితే వెలుగులోకి వాస్తవాలు.. (సాక్షిప్రతినిధి, అనంతపురం) అనంతపురం జిల్లాకు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎర్లంపల్లి మధు వ్యవహారాలకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండగా నిలిచారా? మంత్రి మద్దతుతోనే మధు సెటిల్మెంట్లు, భూదందాలు నిర్వహించారా? పల్లెతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు అతని అండతో సెటిల్మెంట్లు చేశారా? సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్న మధు వీడియో, దాని వెనుక ఉన్న పరిణామాలు బేరీజు వేస్తే అవుననే సమాధానం వస్తోంది. ఈ వీడియో ఫేస్బుక్, వాట్సాప్‌లలో రెండురోజులుగా హల్చల్ చేస్తోంది. ఎవరీ మధు? ఎర్లంపల్లి మధు పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం ఎర్లంపల్లి వాసి. మద్దెలచెరువు సూరి కారు డ్రైవర్‌గా ఉండేవాడు. భానుకిరణ్.. సూరిని కారులో తుపాకీతో కాల్చి చంపిన సమయంలోనూ మధునే కారుడ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా పలుసార్లు కోర్టుకు హాజరయ్యాడు. సూరి హత్య తర్వాత భానుకిరణ్ అనుచరునిగా ఉంటూ బెంగళూరుకు మకాం మార్చాడు. భాను పేరుతో సెటిల్మెంట్లు, భూదందాలు చేస్తుండేవాడు. తర్వాత మంత్రి పల్లె రఘునాథరెడ్డి తనకు సన్నిహితుడని చెబుతూ దందాలు చేసేవాడు. మంత్రి పల్లె కూడా సహకరించేవారనే ఆరోపణలున్నాయి. మంత్రితో పాటు ‘అనంత’కు చెందిన మరికొంతమంది టీడీపీ నేతలు సెటిల్మెంట్లు, భూదందాలకు సంబంధించిన వ్యవహారాలను మధుతో పరిష్కరిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మధును కిడ్నాప్ చేసిన బెంగళూరు రియల్టర్ మంజునాథ్ బెంగళూరుకు చెందిన రియల్టర్ మంజునాథ్‌కు సంబంధించిన రూ.50 కోట్ల భూమి వ్యవహారంలో మధు జోక్యం చేసుకున్నాడు. పక్కకు తప్పుకోవాలని మంజునాథ్ గ్యాంగ్ హెచ్చరించినా వినలేదు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట మధు వాకింగ్ చేస్తుండగా.. మంజునాథ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, అజ్ఞాతంలోకి తీసుకెళ్లింది. దుస్తులు ఊడదీసి చితకబాదింది. సెటిల్మెంట్లు చేస్తావా? మా విషయంలో జోక్యం చేసుకుంటావా? అని తిడుతూ చావబాదారు. దెబ్బలు తట్టుకోలేక మధు తప్పయిపోయిందని, వదిలిపెట్టాలని, మళ్లీ సెటిల్మెంట్ల జోలికి వెళ్లనని విలపించాడు. ఈ దశ్యాలన్నీ మంజునాథ్ గ్యాంగ్ సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడవి హల్చల్ చేస్తున్నాయి. పల్లె సమక్షంలో టీడీపీలో చేరిక 2014 ఎన్నికలకు ముందు పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో మధు టీడీపీ కండువా వేసుకున్నాడు. ఎన్నికల్లో పల్లె విజయానికి కషి చేశాడు. పల్లె బెంగళూరుకు వెళితే అక్కడ మధునే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసేవాడని తెలుస్తోంది. పలు సెటిల్మెంట్లను కూడా మధుతో పల్లె చేయించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మధు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో అతనితో పల్లె రఘునాథరెడ్డి సంబంధాలు, భూదందాలపై జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. అనంతపురం జిల్లాలో పల్లెకు వందల ఎకరాల భూములు ఉన్నాయని, వీటిని గ్యాంగ్‌స్టర్ మధు అండతోనే పంచాయితీలు చేసి కారుచౌకగా కొట్టేశారని పలువురు ఆరోపిస్తున్నారు. పల్లె ఏమన్నారంటే.. మధుతో సంబంధాలపై మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. అతనితో తనకు పరిచయం ఉందని, ఎన్నికల్లో తన విజయానికి సాయం చేశారని అంగీకరించారు. అయితే.. నేరాలు, గూండాయిజాన్ని తాను ప్రోత్సహించలేదన్నారు. బెంగళూరుకు వెళ్లినపుడు మీకు ఏర్పాట్లన్నీ మధునే చేస్తారంటకదా అనే ప్రశ్నకు బదులిస్తూ...తాను బెంగళూరుకు వెళితే హలో అంటే హలో అంటానన్నారు. సూరి హత్య విషయాలనూ వెల్లడించిన మధు? బెంగళూరుకు చెందిన మంజునాథ్ గ్యాంగ్ మధును చితకబాదుతూ సూరిని ఎలా, ఎందుకు హత్య చేశారో చెప్పాలని కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను కూడా వెల్లడించినట్లు సమాచారం. ఈ వీడియో వెలుగులోకి వస్తే సూరి హత్య సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మధు వెల్లడించిన అంశాలు కీలకంగా మారే అవకాశముంది. ఈ విషయం ప్రస్తుతం అనంతపురంలో కలకలం రేపుతోంది. -
గ్యాంగ్‌స్టర్ మధుతో సంబంధాలున్నాయి
-
గ్యాంగ్‌స్టర్ మధుతో సంబంధాలున్నాయి : ఏపీ మంత్రి
అనంతపురం : గ్యాంగ్‌స్టర్ ఎర్నంపల్లి మధుతో తనకు సంబంధాలున్నాయని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతలో గురువారం ఆయన మాట్లాడుతూ...గత ఎన్నికల్లో తన గెలుపు కోసం అతను పనిచేశాడని చెప్పారు. బెంగళూరులో మధు ల్యాండ్ సెటిల్మెంట్లతో మాత్రం ఎలాంటి సంబంధం లేదని పల్లె పేర్కొన్నారు. (చదవండి : బెంగళూరులో గ్యాంగ్ వార్) 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్యాంగ్‌స్టర్ మధు టీడీపీలో చేరాడు. మంత్రి పల్లె బెంగళూరు వెళ్లినప్పుడల్లా మధును కలుస్తాడని తెలుస్తోంది. సెటిల్మెంట్ల వ్యవహారంలో మధు దొరికిపోవడంతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మధు భారీగా సెటిల్మెంట్లు నిర్వహించి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. -
'తెలుగు భాష విశ్వవ్యాప్తం కావాలి'
- తెలుగు భాషాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పల్లె రఘునాథ్‌రెడ్డి విజయవాడ : తెలుగు భాష విశ్వవ్యాప్తం కావాలని భాషా సాంస్కృతిక శాఖ మంత్రి, తెలుగు భాషాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు భాషాభిమానులను ఉద్దేశించి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధికార కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు, కళలు, గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసం మేధావుల ఆలోచనలు, సూచనలకు కమిటీ తీసుకొని నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుందని వివరించారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలుగు సంస్కృతి వికాసం, కళా ప్రదర్శనలకు అమరావతి కేంద్రంగా కళాకేంద్రం నిర్మిస్తామని వెల్లడించారు. తెలుగు నేల మీద భాషా సాహిత్య వికాసానికి కృషి చేసిన గొప్పవారి జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తున్నామని వివరించారు. అకాడమీలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన భాషగా తెలుగు అమలుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగువారు తమ మూలాలను మర్చిపోలేదని, వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తయారు చేసిందని చెప్పారు. ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వపడేలా కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రాచీన హోదా ద్వారా వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ డి.విజయభాస్కర్, పురావస్తు శాఖ డెరైక్టర్ రామకృష్ణ తదితరులు తెలుగు భాషా వికాసంపై ప్రసంగించారు. 300 మందికిపైగా భాషాభిమానులు చేసిన సూచనలను స్వీకరిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని వివరించారు. -
ప్రజలు హోదా కోరుకుంటున్నారు: పల్లె
తెనాలి: రాష్ర్టంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు అనేదానితో తాను ఏకీభవిస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. హోదా కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు దానికంటే బాగుంటాయని నమ్ముతున్నానని అన్నారు. గురువారం రాత్రి చెన్నై వెళుతూ మార్గమధ్యంలో తెనాలి రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి మంత్రి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. -
ఆత్మగౌరవం తమిళులకు తాకట్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఆనాడు ఎన్టీ.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఈ నాటి తెలుగుదేశం పార్టీ అధ్య క్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తమిళనాడుకు తాకట్టు పెట్టేశారు. తమిళనాడులోని తెలుగు వారిని నిర్బంధ తమిళ చట్టంతో అణచివేతకు గురిచేస్తున్న వారి వద్దకు వెళ్లి ‘ఏపీలో తెలుగు భాషాభివృద్ధికి ‘ఎన్నా పణ్ణణుం అన్నే’ (ఏమీ చేయాలన్నా..) అంటూ ఏపీ మంత్రులు అర్థించారు. తెలుగు జాతిని, భాషను ఉద్దరించాలన్న ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషాభివృద్ధి అధ్యయన కమిటీని ఇటీవల ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షులుగా ఏపీ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని అధ్యక్షులుగా నియమించారు. ఇతర సభ్యులుగా ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ నియమితులయ్యారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వీరంతా సోమవారం చెన్నైకి చేరుకున్నారు. మంగళవారం వీరికి ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తోడయ్యారు. వీరంతా తమిళనాడు ప్రభుత్వ సచివాలయం వెళ్లి అక్కడి విద్యాశాఖ మంత్రి, పలువురు అధికారులను కలుసుకున్నారు. కొందరి ఇళ్లకు కూడా వెళ్లినట్లు తెలిసింది. ‘తమిళనాడులో తమిళ భాష ప్రజల్లోకి ఎంతగానో చొచ్చుకుని ఎలా వె ళ్లగలి గింది, భాష అమల్లో ప్రభుత్వం పరంగా కూడా మెచ్చదగిన రీతిలో ఎలా అమల్లో ఉంది’ అని తెలుసుకోవాలన్న ఏకైక అజెండాతోనే వారందరి వద్దకు ఏపీ ప్రభుత్వ భాషా ప్రతినిధులు వెళ్లడం విశేషం. తెలుగు పెద్దలను విస్మరించి తమిళ ప్రముఖులకు పెద్దపీట: ఏపీలో తెలుగుకు పెద్దపీట వేయాలంటే ఎన్నో మార్గాలు ఉండగా, వాటన్నింటినీ విస్మరించి తమిళ నేతలను అడిగి తెలుసుకోవాల్సిన దుర్గతిని పట్టించారు. దేశం లో అన్ని రాష్ట్రాల్లో కంటే తమిళనాడులో మాతృభాషపై మమకారం ఎక్కువ. తమిళులకు తమ మాతృభాషపై అభిమానంతో పాటూ పరభాషలపై దురభిమానం కూడా ఎక్కువేనని సోమవా రం నాటి సభలో ఉపసభాపతి వ్యాఖ్యానించా రు. మాతృభాషను బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చేలా తిరుక్కురల్ రాసిన తిరువళ్లువర్, మహాకవి భారతియార్ తదితర మహానుభావులు ఎందరో ఉన్నారు. మరి ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే కీర్తిని తెచ్చిన గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, వీరేశలింగం వం టి మహానుభావులు మనకూ ఎందరో ఉన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీ.రామారావు తెలు గు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడ మీ స్థాపిం చారు. మాతృభాషా పరమైన ప్రయోజనాలు కాపాడడంలో అవన్నీ నిర్వీర్యమై పోయాయి. ప్రభుత్వ లావాదేవీలన్నీ తెలుగులోనే సాగాలనే ప్రయత్నం లేదు. తెలుగు సినిమాలకు తెలుగు పేర్లే పెట్టిన నిర్మాతలకు రాయితీలు ఇవ్వడం ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించాలని కొం దరు నిర్మాతలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకున్న పాపా న పోలేదు. న్యాయస్థానాల్లో అందరికీ అర్థం అయ్యేలా తెలుగు భాషలోనే వాదోపవాదాలు జరగాలి, తీర్పులు చెప్పాలని భాషాభిమానులు ఏన్నో ఏళ్ల క్రితం చేసిన ప్రతిపాదన ఏమైందో ఎవ్వరికీ తెలియదు. తెలుగు భాష ఉనికి కాపాడుకునేలా ఏపీ ప్రభుత్వం నుంచి క చ్చితమైన ఉత్తర్వులు ఏవీ లేవు. తెలుగు భాషను ఉద్దరించాలని ఇన్నాళ్లకైనా నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగినదే. అయితే కార్యాచరణలో తెలుగు పండితులను విస్మరించి తమిళ పెద్దల సలహాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి భంగకరమే. ఏపీలో తెలుగుకు పూర్వవైభవం తేవడం ఎలా అనే అంశాన్ని ప్రభుత్వం ప్రజల ముందు ఉంచితే సమున్నతమైన సలహాలు ఇచ్చే వారు ఎందరో ఉన్నారు. తెలుగునాట మాతృభాషకు ఏమిటీ గతి అని ఆవేదన చెందుతున్న పండితులు పరుగు పరుగున వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేగాక దశాబ్దాల తరబడి తమిళనాడులో స్థిరపడి ఉన్న తెలుగు సంఘాల పెద్దలను అడిగినా తమిళభాష అమలును పూసగుచ్చినట్లు చెప్పేవారు. ఇలా ప్రత్యక్షంగా చెన్నైకి వచ్చి అధికారికంగా ‘అమ్మా’ అంటూ ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. పరభాషలపై తమిళులకు అయిష్టత ఉ న్నందునే హిందీ వ్యతిరేకోద్యమాన్ని నిర్వహిం చారు. 2006లో నిర్బంధ తమిళ చట్టాన్ని తీసుకువచ్చారు. నిర్బంధ తమిళ చట్టంలో ప్రధాన బా ధితులు తెలుగువారే. నిర్బంధం ఉచ్చు నుంచి తమకు విముక్తి కల్పించాలని చంద్రబాబుకు ఎందరో మొర పెట్టుకున్నా స్పందన శూన్యం. ఒకప్పుడు తమిళనాడులో తెలుగువారిని ‘గొల్టీ’ అని హేళనగా పిలిచేవారు. ప్రస్తుతం గొల్టీ అనే పేరు తెరమరుగైనా తమిళుల మనస్సుల తెరవెనుక ఇంకా కదలాడుతోనే ఉంది. తమిళులకు పరభాషలపై దురభిమానం ఉందని వ్యాఖ్యానిస్తూనే వారి నుంచి సలహాలు తీసుకునేందుకు ఏపీ పెద్దలు సిద్ధపడ్డారు. పరభాషలపై దురభిమానం కలిగి ఉన్న తమిళ పెద్దలు పొరుగు రాష్ట్రమైన ఏపీలో తెలుగు భాష ఉద్దరణకు తగిన సలహాలు ఎలా ఇస్తారో ఏపీ పెద్దలే చెప్పాలి. ‘తెలుగు’దేశం అని పేరు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ తన మాతృభాష ఉద్దరణకు తమిళ దేశాన్ని ఆశ్రయించడం శోచనీయం. మంత్రు లు గంటా శ్రీనివాసరావు, పల్లెరఘునాథరెడ్డి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మంగళవారం సచివాలయంలో పాఠశాల విద్యా శాఖ మంత్రి కె పాండియరాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావులను కలుసుకుని నిర్బంధ తమిళం, తమిళనాడులో తమిళ భాష అమలు తీరు తెన్నులపై మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటీఎఫ్ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి, ద్రవి డ దేశం అధ్యక్షుడు కృష్ణారావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి పల్లెకు ఎన్జీవో నాయకుల అభినందన
విజయవాడ (భవానీపురం) : సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఎన్జీవో నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో శనివారం ఆయన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నాయకులు ఆయనను కలిసి సాయిబాబా చిత్రపటాన్ని బహూకరించారు. మంత్రిని కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, జిల్లా నాయకుడు ఎ. విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. -
న్యాయం చేయండి
= కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ = ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు = ఓ తల్లి ఆవేదన ఓడీ చెరువు : తన కూతుర్ని వేధింపులకు గురి చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త, అత్తమామలను అరెస్టు చేసి న్యాయం చేయాలని ఓ తల్లి వాపోయింది. ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయం ఎదుట శుక్రవారం ఓడీచెరువుకు చెందిన తుమ్మల శివమ్మ తన కుమార్తెలు స్వాతి, గాయత్రితో కలసి విలేకరుల ఎదుట వాపోయారు. ఆమె తెలిపిన వివరాలు.. ‘2013లో చిన్నకుమార్తె ఐశ్వర్యను ఓడీసీ మండలం ఆకుతోటపల్లికి చెందిన సద్దల రంగారెడ్డి కుమారుడు నారాయణరెడ్డికి ఇచ్చి వివాహం చేశాం. రెండేళ్లు వారి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత కుమార్తెను భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చే సేవారు. పలుమార్లు పుట్టింటికి రావడంతో కుమార్తెకు సర్దిచెబుతూ కాపురానికి పంపించాం. ఈనేపథ్యంలో ఈ నెల 12న ఇంట్లో విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని వారు తెలిపారు. అయితే వారి వేధింపులకు తాళలేకే కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఆరోజే ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయలేదు. పోలీసులు కేసును నీరు కారుస్తున్నారు. మాకు న్యాయం జరగటం లేదు’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమయింది. తమ కూతురి చావుకు కారకులైన భర్త, అత్తమామలను వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని ఉన్నతాధికారుల వద్దకు వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. అమడగూరుకు వెళ్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డికి తమ గోడును వినిపించానని ఆమె తెలిపింది. -
పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్
మంత్రి పల్లెరఘునాథరెడ్డి మచిలీపట్నం(కోనేరుసెంటర్) : మంగినపూడి బీచ్‌ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం రాష్ట్ర చేనేత, ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి బందరు మండలంలోని మంగినపూడి బీచ్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బందరుకు విశిష్టస్థానం ఉందన్నారు. బందరుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పోర్టును అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. పోర్టు అభివృద్ధితో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, భూముల విలువ పెరిగిపోతుందని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలు వస్తాయని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మంగినపూడి బీచ్‌ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తొలుత మంత్రి రఘునాథరెడ్డి చిలకలపూడిలోని శ్రీపాండురంగ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, వైస్ ఎంపీపీ ఊసా వెంకట సుబ్బారావు, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పల్లె
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన పల్లె రఘునాథరెడ్డికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. -
ప్రత్యేక హోదా బాధ్యత కేంద్రానిదే
– ఉద్యమాలతో హోదా రాదు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మార్కాపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఉద్యమాల ద్వారా సాధించలేమని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురం పీఆర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరగడంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పొందు పరచలేదని, రాజ్యసభలో వెంకయ్య నాయుడు, నాటి బీజేపీ ఎంపీలు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌కు 5 నుంచి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరాయని, నేడు 14వ ఆర్థిక సంఘం సాకుతో ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని చెప్పటం వారికే చెల్లుతుందన్నారు. కేంద్రంతో ఘర్షణతో కాకుండా సామరస్యంగా ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నార ని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు, వెనుకబడిన ప్రాంతాలు, రాజధాని, పోలవరం ప్రాజెక్టు, విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ తదితరాలకు కేంద్రం తగిన నిధులు సమకూరుస్తుందన్నారు. మంత్రి వెంట ఆర్డీవో చంద్రశేఖరరావు, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. -
రైల్వేకోర్టుకు హాజరైన మంత్రి పల్లె, ఎమ్మెల్యేలు
గుంతకల్లు టౌన్: సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో కేసుల్లో ఉన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ ఛీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బీకే.పార్థసారధి, హనుమంతరాయచౌదరి, వరదాపురం సూ రి గురువారం స్థానిక రైల్వే కోర్టుకు హాజరయ్యారు. వీరితోపాటు మహాలక్ష్మీశ్రీనివాస్, చంద్రదుండు ప్రకాష్, బుగ్గయ్యచౌదరి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు పీజీఎస్.బాబు, హేమాద్రి వాదించారు. -
'పేదలను చంద్రన్న బీమాలో చేర్పించండి'
► రంజాన్ తోఫా కోసం రూ.35 కోట్లు ► జిల్లా ఇన్చార్జి మంత్రి పల్లె విజయనగరం: జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం జెడ్పీ అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్నవారిని చంద్రన్న బీమా పథకంలో చేర్పించాలని సూచించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.3 లక్షలు అందించేందుకు ఈ బీమా ఉపకరిస్తుందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రంజాన్‌ను ముస్లింల గౌరవార్థం రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నామని మంత్రి పల్లె అన్నారు. ముస్లిం మైనార్టీలకు కేవలం రంజాన్ తోఫా మాత్రమే కాకుండా సంక్రాంతి కానుకను కూడా అందిస్తామన్నారు. ఈ డబుల్ ధమాకా రాష్ట్రం లోని 11 లక్షల కుటుంబాలకు వర్తింపజేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తులపై అధ్యయనం చేశామని, వీటిని సంరక్షిస్తామని చెప్పారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా, పోలీస్ సూపరింటెండెంట్ సభ్యులుగా కమిటీలను ఏర్పా టు చేశామని తెలిపారు. ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తాయన్నారు. రాష్ట్రంలోని మసీదుల్లో విధులు నిర్వహిస్తున్న 5వేల మంది ఇమామ్‌లు, మౌజాన్లకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంస్థకు రూ. 7 వేల కోట్లు రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పంట తోటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. రుణమాఫీ పెండింగ్ బకాయిలను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చిరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో రూ. 24 వేల కోట్ల రుణాలును మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆయన స్పష్టం చేశారు. -
కాకినాడలో ఇంక్యుబేషన్ సెంటర్ : పల్లె
సాక్షి, హైదరాబాద్: చైనా ప్రభుత్వ భాగస్వామ్యంతో కాకినాడలో రూ.16 కోట్ల వ్యయంతో ఇంక్యుబేషన్ సెంటర్‌ని ఏర్పా టు చేయనున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు చైనాకు చెందిన జెడ్‌టీఈ సాఫ్ట్ టెక్నాలజీ, క్వినై అథారిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. సంవత్సర కాలంలో ఈ సంస్థ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని, దీంతో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఈ-ప్రగతి అమల్లోకి వస్తే సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఏపీ తొలి రాష్ట్రమవుతుందన్నారు. సమావేశంలోజెడ్‌టీఈ అంతర్జాతీయ సీఈఓ బెన్ జౌ తదితరులు పాల్గొన్నారు. -
'రఘువీరా నోరు అదుపులో పెట్టుకో'
విజయనగరం: పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఐటీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సంక్షేమం కోసం సాయం చేయండని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరితే అభినందించాల్సింది పోయి... అడుక్కునే ముఖ్యమంత్రి మనకు వద్దని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని ఆయన ఆరోపించారు. ఆంధ్ర ప్రజల శాపనార్థాలు ఆ పార్టీకి తగులుతాయని మండిపడ్డారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు మద్యం సిండికేట్ నడిపిస్తున్నారనే ఆరోపణల గురించి ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డిని విలేకర్లు ప్రశ్నించగా... బెల్టుషాపులపై చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని.. అలాగే సిండికేట్ బాస్‌లు ఎవరైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో మంత్రి కె. మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యే నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పదవి నిలుపుకోవడానికే జగన్‌పై విమర్శలు
మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం అనంతపురం : ‘వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శిస్తే మంత్రి పదవి ఉంటుందనుకుంటున్నారు.. పల్లె సారూ...మీరు ఎన్ని విమర్శలు చేసినా మీ పదవి ఊడడం ఖాయం’ వైఎస్సార్సీపీ నాయకులు మంత్రి రఘునాథరెడ్డిపై ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలే జయరాంనాయక్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, క్రిష్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు కొంకిర జయపాల్ విలేకరులతో మాట్లాడారు. తన విద్యా సంస్థల్లోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పులను బినామీ పేర్లతో కాజేసిన చరిత్ర పల్లె రఘునాథరెడ్డిదని వారు విమర్శించారు. గౌరీ థియేటర్ సమీప ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆయన తన కళాశాలను విస్తరించుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. మంత్రి స్థాయిలో ఉన్నా పుట్టపర్తి మండలం పెడబల్లితండాలో తాగునీరు ఇవ్వలేకపోవడంతో తండావాసులే సొంత ఖర్చుతో బోర్లు వేయించుకున్నారన్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేశారన్నారు. దమ్ముంటే వారితో రాజీనామాలు చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలన్నారు. అప్పుడు వైఎస్సార్సీపీని ఖాళీ చేస్తారో...మీ పార్టీని ఖాళీ అవుతుందో ప్రజలే తేలుస్తారన్నారు. మీ అసత్య ప్రచారాలకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి తగిన చెబుతారన్నారు. -
‘రాజధాని’కి 33,000 ఎకరాలు..అటవీ భూమి కావాలి
కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో అవసరాల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33,057.5 ఎకరాల (13,223 హెక్టార్లు) అటవీ భూమిని సీఆర్డీఏకి బదలాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రెండు జిల్లాల్లోని 27 అటవీ బ్లాకుల్లో ఉన్న ఈ భూములు ఇచ్చినందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు రూ.1,357 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, అభయగోల్డ్ వంటి సంస్థల బాధితులకు సత్వర న్యాయం కోసం విజయవాడలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పా టు చేసేందుకు ఆమోదం. ఈ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టుకు లేఖ రాయా లి. అగ్రిగోల్డ్‌పై ఇప్పటికే 176 కేసులు నమోదైన నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసి దాన్నుంచే ఫిర్యాదులు స్వీకరించాలి. హైకోర్టు నియమించిన జస్టిస్ సీతాపతి కమిటీ ఆధ్వరంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తుల వేలం ప్రక్రియను ప్రారంభించాలి. మొదటి దశలో ఈ నెల 20, 21 తేదీల్లో వేలం వేయాలి. కేసు విచారణను వేగవంతం చేయాలని సీఐడీకి ఆదేశాలు. ► భూముల డబుల్ రిజిస్ట్రేషన్లను నివారించేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22బీకి సవరణ. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి. ►ఈ నెల 8న ఉగాది పండుగను 13 జిల్లాల్లో వైభవంగా నిర్వహించాలి. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు. ► ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం. ► ఉచిత ఇసుక పథకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక మొబైల్ యాప్‌ను తీసుకురావాలి. ఇసుక అవసరమైన వారు ఈ యాప్ ద్వారా కోరినా లేదా టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసినా ఇసుక సరఫరా చేసేలా ఏర్పాటు. ఉపాధి హామీ కూలీల దినసరి వేతనాన్ని రూ.194కు పెంచాలి. ► కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానికి లేఖ రాయాలి. ► పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన వాటి కోసం తెలంగాణ సీఎస్‌కు, ఏపీ సీఎస్‌తో లేఖ రాయించాలి. ప్రైవేటుకు భారీగా భూ కేటాయింపులు నాలుగు జాతీయ విద్యా సంస్థలతోపాటు పలు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం భారీగా భూములు కేటాయించింది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్యా సంస్థలకు 914 ఎకరాలు, నాలుగు పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు 180 ఎకరాలు, హీరో మోటార్ కార్పొరేషన్‌కు 600 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యాసంస్థలకు.. ► వైఎస్సార్ జిల్లా కడప మండలం పుట్లంపల్లెలో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ కేంద్రం ఏర్పాటు నిమిత్తం ఉన్నత విద్యా శాఖకు 10.15 ఎకరాలు ఉచితంగా కేటాయించారు. ► అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరులో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం సాంకేతిక విద్యాశాఖకు 491.23 ఎకరాలను ఉచితంగా ఇచ్చారు. ► విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో ఐఐఎం నిర్మాణానికి 241.50 ఎకరాలను సాంకేతిక విద్యా శాఖకు ఉచితంగా ఇచ్చారు. ► పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడకట్ల, తాడేపల్లిగూడెం, కొండ్రుప్రోలులో 172.08 ఎకరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నిర్మాణానికి గాను నిట్ డెరైక్టర్‌కు ఉచితంగా కేటాయించారు. -
నీటి ఎద్దడి నివారణకు రూ.13.06 కోట్లు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి టౌన్: వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి నివారణ చర్యలకు ప్రభుత్వం రూ.13.06 కోట్లు మంజూరయ్యాయని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిలర్లతో తాగునీటి సమస్యపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ అవసరమైన పైపులైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను అదేశించారు. జిల్లాలో 13 మండలాలకు చెందిన 41 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. ఆ గ్రామాల్లో ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామన్నారు. నగర పంచాయతీలో స్వచ్ఛభారత్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని అరోపణలు వినిపిస్తున్నాయని,ఎవరినీ వదిలే ప్రసక్తేలేదన్నారు.త్వరలో పుట్టపర్తిలో సత్యసాయి విమానాశ్రయం కేంద్రంగా ఏవియేషన్ అకాడమీని ప్రారంభిస్తామని,అనుబంధంగా పలు విమానయాన సంస్థలు పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నారు. -
మైనారిటీలపై ప్రభుత్వం చిన్నచూపు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, ముస్తాఫా, అంజాద్ ధ్వజం సాక్షి,హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, మహ్మద్ ముస్తాఫా షేక్, కొరముట్ల శ్రీనివాసులు, ఎస్వీ మోహన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లిం మైనారిటీలకు ముష్టి వేసినట్లు రూ.250 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి మైనారిటీ సమస్యలపై చర్చించే దమ్ము కూడా లేదన్నారు. కనీసం చట్టసభలో మైనారిటీ సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ‘‘రెండేళ్ల కిందట బడ్జెట్లో రూ.246 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2015-16 బడ్జెట్లో రూ.376 కోట్లు మైనారిటీల సంక్షేమానికి కేటాయించి, బడ్జెట్ నివేదికలో మాత్రం రూ. 216 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి రూ.165 కోట్లు మాత్రమే వ్యయం చేశారు’’ అని పేర్కొన్నారు. మైనారిటీల హాస్టళ్లకు రూ. 3.35 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. చాలా మంచి మైనార్టీ బడ్జెట్: మంత్రి పల్లె దక్షిణ భారతదేశంలోనే చాలా మంచి మైనార్టీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని మైనారిటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. లోటు బడ్జెట్ రాష్ట్రమైనప్పటికీ మైనారిటీల మీద అభిమానంతో ఎక్కువ బడ్జెట్ కేటాయించామన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి పల్లె మాట్లాడారు. -
ఇంక్యుబేషన్స్, ఇన్నోవేషన్స్ కేంద్రంగా ఏపీ
నాస్కామ్ ఆధ్వర్యంలో విశాఖలో ఐటీ స్టార్టప్స్ వేర్‌హౌస్ సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు త్వరలో ఏపీ వేదిక అవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో నాస్కామ్తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై నాస్కామ్ తరపున ఆర్. చంద్రశేఖర్, ప్రభుత్వం తరపున మంత్రి పల్లె రఘునాధరెడ్డి సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా 10 వేల అంకుర సంస్థలను ఏర్పాటు చేయాలని నాస్కామ్ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని విశాఖలో తొలుత ప్రారంభించనుంది. విశాఖలో ఆగస్టులో ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమెజాన్ క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా ఏపీని మోడల్ రాష్ట్రంగా తయారు చేయాల్సిందిగా తనతో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు పీటర్ మూరే, సోమర్ విల్లేలను సీఎం కోరారు. -
ఒకరిద్దరు మంత్రులు భూమి కొన్నారు
అంతకుమించి ఏ తప్పూ చేయలేదు: మంత్రి పల్లె అనంతపురం సెంట్రల్: రాజధానిలో ఒకరిద్దరు మంత్రులు వారి స్తోమత మేరకు భూమి కొనుగోలు చేశారని, అంతకుమించి ఏ తప్పూ చేయలేదని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘మా అధినేత కానీ, మంత్రులు గానీ ఏ తప్పూ చేయరు. బినామీలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా ఉంటుంది’ అని వివరణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాజధానిలో తనకంటూ నివాసముండాలనే ఉద్దేశంతో భూమి కొనుగోలు చేసి, పెద్ద కుమారుడు పయ్యావుల విక్రమ్‌సింహా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించానన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్‌కు సిద్ధమని, ఉరవకొండలోనైనా, అమరావతిలోనైనా చర్చకు రావాలని సూచించారు. -
మంత్రి పదవి పోతుందన్న భయంతోనే విమర్శలు
మంత్రి పల్లెపై పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమస్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజం నల్లమాడ: మంత్రి పల్లె రఘునాథరెడ్డి పదవి పోతుందన్న భయంతోనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని పుట్టపర్తి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని నల్లసింగయ్యగారిపల్లిలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మంత్రి పల్లె పుట్టపర్తి నియోజకవర్గ అభివృ ద్ధికి పాటు పడాలే తప్ప జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. చంద్రబాబు వద్ద మెప్పు పొంది మంత్రి పదవిని కాపాడు కోవడానికే పల్లె నాటకం ఆడుతున్నారన్నారు. పల్లె తక్షణమే పదవికి రాజీనామా చేసి ధైర్యం ఉంటే పుట్టపర్తి నియోజకవర్గంలో తన మీద పోటీ చేసి గెలుపొందాలని ఆయన సవాల్ విసిరారు. జగన్ కాలిగోటికి కూడా పల్లె దీటు రాడన్నారు. టీడీపీలోకి చేరిన భూమానాగిరెడ్డి కుటుంబానికి మంత్రి పదవి దక్కుతుందన్న భయం పల్లెకు పట్టుకుందన్నారు. నియోజకవర్గంలో పగటి పూట తిరగడానికి కూడా మంత్రి భయపడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉంట్ల బ్రహ్మానందరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, సింగల్‌విండో డెరైక్టర్ కుళ్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు... అభినవ శ్రీకృష్ణదేవరాయులు'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ... అభినవ శ్రీకృష్ణదేవరాయులలాంటి వాడని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభివర్ణించారు. శుక్రవారం న్యూఢిల్లీలో పల్లె రఘునాథరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ముస్లిం రిజర్వేషన్లకు కొన్ని విధానపరమైన లోపాలున్నాయని తెలిపారు. ఈ అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నామని చెప్పారు. ఆర్థిక వెనకబాటు ఆధారంగా ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. త్వరలోనే ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు రానుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ చెబితే ఉప ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. -
తెలుగువారి కోసం లె జిస్లేచర్ కమిటీ
మంత్రి పల్లె రఘునాథరెడ్డి - సీఎం చంద్రబాబుకు సూచిస్తానని వెల్లడి చెన్నై దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక లెజిస్లేచర్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా చెన్నైలో పలు తెలుగు సంఘాల ప్రతినిధులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలలా తెలుగువారు స్థిరపడి ఉన్నారని తెలిపారు. తమిళనాడులో తెలుగువారు నిర్బంధ తమిళం చట్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగానే స్థానికేతరులుగా ఇతర రాష్ట్రాల్లో సైతం పలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. తెలుగువారందరి సమస్యలను ఆకళింపు చేసుకునేందుకు ఒక లెజిస్లేచర్ కమిటీ డెలిగేషన్గాఏర్పడి దేశవ్యాప్తంగా పర్యటించడం, కమిటీ సేకరించిన తెలుగువారి అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కార మార్గాలు కనుగొనవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ఐటీ రంగంలో విప్లవాన్ని సాధిస్తున్నామని, జూన్, జూలై నాటికి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించనున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో ఐదు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. చెన్నైలో ఈనెల 20వ తేదీన నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో 27 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొనగా 15 మంది రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. -
పల్లె సారూ.. ఆదుకోండి!
మంత్రి పల్లె కళాశాలలో పని చేస్తూ గాయపడిన కార్మికుడు కేసు నమోదు చేయకుండా మాయమాటలు చెప్పిన అనుచరులు ఆర్థికసాయం చేస్తామని పట్టించుకోని వైనం న్యాయం చేయాలంటున్న బాధిత కుటుంబ సభ్యులు అనంతపురం మెడికల్ :రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలలో పని చేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి మంచానికే పరిమయ్యాడో యువకుడు. ప్రమాదం జరిగిన సమయంలో అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చి ఆపై పట్టించుకోక పోవడంతో ఆ యువకుడి బాధ వర్ణణాతీతం. బాధితుడు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లిలో నివాసం ఉంటున్న ఓబుళపతి (31) గత ఏడాది ఫిబ్రవరిలో కక్కలపల్లిలోని పీవీకేకే కళాశాలలో రెండో అంతస్తు ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో వెన్నెముక విరిగింది. వెంటనే కళాశాలలోని వారు అతడిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ క్రమంలో కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం ఎంత ఖర్చయినా భరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అనంతలో వెన్నెముకకు సంబంధించి శస్త్ర చికిత్స లేదని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యం అందకపోవడంతో చివరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎలాంటి ఆర్థికసాయం చేయకపోగా బాధితుడికి రూ.1.50 లక్షల వరకు ఖర్చయింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశాక ఓబుళపతిని అనంతపురం తీసుకొచ్చారు. ఫిజియోథెరపీ చేయించినా ఫలితం లేకపోగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తల్లి సరోజమ్మ, భార్య స్నేహలత సపర్యలు చేస్తున్నారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న బిల్లులను మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇదివరకే అందజేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వెళ్లి ఆర్థికసాయం చేయాలని అడిగితే ఆ బిల్లులు తన వద్ద లేవని, మరోసారి ఇవ్వాలని మంత్రి చెబుతున్నట్లు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం బిల్లు డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్‌తో పాటు జిరాక్స్ బిల్లులు మూడు సార్లు ఇచ్చామని, మంత్రి మాత్రం స్పందించడం లేదన్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తమకు నష్టపరిహారం అందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడమని ఓబుళపతి, ఆయన భార్య స్నేహలత, తల్లి సరోజమ్మ అంటున్నారు. మంత్రి సతీమణి చెప్పడంతోనే తాను పై అంతస్తుకు ఎక్కి పనులు చేశానని, ఈ క్రమంలోనే జారిపడినట్లు ఓబుళపతి తెలిపారు. -
రాజకీయాలకు అతీతంగా పోరాటం
హంద్రీ నీవా పూర్తికి రూ.7వేల కోట్లు కేటాయించాలి రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్ రాజకీయాలకు అతీతంగా పోరాటం హంద్రీ నీవా పూర్తికి రూ.7వేల కోట్లు కేటాయించాలి రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్ అనంతపురం సెంట్రల్ : జిల్లా అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు సమాయత్తం కావాలని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. వేదిక డిమాండ్లను ప్రభుత్వ దృ ష్టికి తీసుకెళ్లేందుకు జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ చమన్‌లతో సమావేశమయ్యారు. గేయానంద్‌తోపాటు, వేదిక సలహాదారుడు సింగమనేని నారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి హార్టీకల్చర్ హబ్, పారిశ్రామిక వాడలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, హంద్రీ నీవా పూర్తి, తదితర అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఇందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి రూ.7వేల కోట్లు కేటాయిస్తే తప్పా పూర్తయ్యే దాఖలాలు లేవని వివరించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు మన వాణిని గటి ్టగా వినిపించాలని సూచించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వివరించారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మానవహక్కుల వేదిక నాయకులు ఎస్ఎం బాషౠ, సైన్స్ ఉద్యమ కార్యకర్త డాక్టర్ ప్రసూన, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి'
గుంటూరు మెడికల్: సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకు వీలుగా ప్రజా ప్రతినిధులు అందరూ సర్కారు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటే బాగుంటుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శనివారం గుంటూరు జిల్లా ఆస్పత్రిలో మంత్రి కామినేని శ్రీనివాస్‌ను మంత్రి పల్లె, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పరామర్శించారు. అనంతరం మంత్రి ఓపీలో బీపీ, ఇతర పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకే మంత్రి కామినేని ఇక్కడ మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారని, తాను పరీక్షలు చేయించుకున్నానని వివరించారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. కాగా మంత్రి కామినేని మోకాలి ఆపరేషన్ వివాదంగా మారుతోంది. జీజీహెచ్‌పై నమ్మకం కలిగించేందుకే ఇక్కడ ఆపరేషన్ అన్న ఆయనకు జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదు. అందుకే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వైద్యులను పిలిపించుకుని మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య పరికరాలు సైతం కార్పొరేట్ వైద్యశాలల నుంచి తెప్పించుకుని ఆపరేషన్ అయిపోగానే తిరిగి పంపించేశారు. మంత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారో అది తీవ్ర విమర్శల పాలవుతోంది. -
ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు
-
ఎమ్మెల్యే పీఏ ‘శివా’లు
పేరుకు ‘జన్మభూమి మా ఊరు’ ప్రభుత్వ కార్యక్రమం అయినా.. టీడీపీ నాయకుల ఓవర్ యాక్షన్ అంతాఇంత కాదు. వారి చేస్తున్న హడావుడితో లబ్ధిదారులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్నీకావు. గాజువాకలో సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ సభ్యులను చేయి పట్టుకొని గెంటేసే ప్రయత్నం చేశారు. ఆరిలోవలో ఎమ్మెల్యే పీఏ ‘శివా’లెత్తారు. జెడ్సీ, వైద్యురాలిపై నోరుపారేసుకున్నారు. భీమిలి నియోజకవర్గం లోడగలవానిపాలెం, చోడవరం నియోజకవర్గం జన్నవరంలో అధికారులను దర ఖాస్తుదారులు ప్రశ్నించారు. డుంబ్రిగుడలో జన్మభూమి రసభాసగా ముగిసింది. గాజువాకలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉత్తర నియోజకవర్గంలో ఐటీ మంత్రి పల్లెరఘనాథ్రెడ్డి పాల్గొని ప్రభుత్వ పథకాలను వివరించారు. మొత్తం మీద రెండో రోజూ కూడా నిరసనలతో జన్మభూమి సాగింది. ఆరిలోవ: ఆరిలోవ ప్రాంతం ఒకటో వార్డులో ఆదివారం జరిగిన జన్మభూమి సభలో తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యక్తిగత కార్యదర్శి శివ హడావిడి చేశాడు. అధికారులపై జులం ప్రదర్శించి అతని కనుసన్నలో సభ నిర్వహించే ప్రయత్నం చేశాడు. అతని జులుం ముందు అధికారులు తలొగ్గి చెతులెత్తేశారు. సభ నిర్వహించే సమయానికి వేదిక చుట్టూ టీడీపీ జెండాలు కట్టి ఉండడాన్ని గమనించిన జోనల్ కమిషనర్ సత్యవేణి, వాటిని తొలగించారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. ఏ అధికారమూ లేకపోయినా, సభా వేదికపై అధికారుల మధ్య ఆశీనుడైన శివ, అప్పటికే జెండాలు తొలగించడంపై ఆవేశంతో ఉన్నాడు. ప్లెక్సీలు కూడా తొలగించమని ఆదేశించడంతో జెడ్సీపై శివాలెత్తిపోయాడు. ‘జెండాలు పీకేశారు, పోనిలే అని ఊరుకొంటే.. ప్లెక్సీలు కూడా తొలిగించేస్తారా? తొలగిస్తే ఊరుకోను. అలా చేస్తే బాగుండదు. ఖబడ్డార్’ అంటూ జెడ్సీపై నోరు పారేసుకున్నాడు. ఆ మాటలు విని వేదికపై ఉన్న అధికారులంతా నోళ్లు వెళ్లబెట్టుకున్నారు. ఆయన జులుం ముందు అధికారులు తలొగ్గారు. అతని చెప్పినట్లే, అతని సలహాలు మేరకు సభ నడిపారు. ఇలా సభ జరుగుతుండగా, సభా ప్రాంగణంలో నిర్వహించిన సీమంతాల కార్యక్రమం వద్దకు వెళ్లారు. ‘నేను ఈ రోజు వద్దన్నాను కదా.. చెప్పినా వినకుండా ఎందుకు నిర్వహించారు’ అంటూ ఐసీడీఎస్, ఆరిలోవ జీవీఎంసీ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ అనితపై ఫైర్ అయ్యారు. ఆయన తీరుతో అధికారులతో పాటు స్థానిక నాయకులు, వార్డు ప్రజలకు ముక్కున వేలేసుకున్నారు. -
రేపు ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం ప్రారంభం
హైదరాబాద్: సమాచారశాఖను ప్రక్షాళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో పల్లె రఘునాథరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ...అధికారులు తమ విధుల పట్ల బాధ్యతారహితంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో ప్రారంభిస్తారని పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. -
నేనూ రాయలసీమ వాడినే!
-
నేనూ రాయలసీమ వాడినే!
♦ సీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: సీఎం సవాల్ ♦ ఉర్దూ టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ ♦ కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పర్యటనలో చంద్రబాబు వెల్లడి సాక్షి ప్రతినిధి, కర్నూలు/కడప: ‘‘నేనూ రాయలసీమలోనే పుట్టాను. రాయలసీమ వాడినే. రాయలసీమను అభివృద్ధి చేసింది ఎన్టీఆర్. ఆ తర్వాత నేనే. కొంతమంది పెత్తందారీతనంతో ఇక్కడికి పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారు. అభివృద్ధికి అడ్డుపడితే బుల్డోజర్లా ముందుకెళతా. బుల్లెట్లా దూసుకుపోతా. 52 ఏళ్లలో ఎవరి హయాంలో సీమ అభివృద్ధి జరిగిందనే అంశంపై చర్చకు సిద్ధమా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాలు విసిరారు. ఆయన సోమవారం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం గోరుకల్లు రిజర్వాయర్‌ను పరిశీలించారు. గోరుకల్లులో ఏర్పాటు చేసిన ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వైఎస్సార్ జిల్లాకు బయల్దేరి వెళ్లారు. జిల్లాలోని ముద్దనూరులో దళిత, గిరిజన రుణమేళా సదస్సులో ప్రసంగించారు. కడపలో హజ్ హౌస్ : ఇమామ్లతో పాటు మౌజార్లకు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇమామ్‌లకు నెలకు రూ.5 వేలు, మౌజార్లకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనాన్ని ఈ నెల నుంచే ఇస్తామన్నారు. కడపలో హజ్ హౌస్‌ను నిర్మిస్తామని తెలిపారు. ఉర్దూ టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీని ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరు వరకు పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని చంద్రబాబు తెలిపారు. సుమారు 125 ఎకరాల్లో రూ.150 కోట్లతో ఉర్దూ వర్సిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి పల్లె చెప్పారు. సీమను సస్యశ్యామలం చేస్తాం... ‘‘రానున్న కాలంలో నదుల అనుసంధానం చేస్తున్నాం. 80 టీఎంసీల గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా రాయలసీమకు మళ్లిస్తాం. హంద్రీ-నీవా, గాలేరు నగరి ద్వారా సీమను సస్యశ్యామలం చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు ముద్దనూరులో ప్రకటించారు. -
ప్రతిష్టాత్మకంగా అమరావతి శంకుస్థాపన
-
ప్రతిష్టాత్మకంగా అమరావతి శంకుస్థాపన
వివరాలు వెల్లడించిన మంత్రి పల్లె సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యం త ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఏపీ సమాచార ప్రసార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. నగరంలోని ఓ హోటల్లో నటుడు సాయికుమార్, గాయని సునీతతో కలసి బుధవారం నిర్వహిం చిన మీడియా సమావేశంలో అమరావతి శంకుస్థాపన, సాంస్కృతిక కార్యక్రమాలను వెల్లడించారు. గురువారం ఉదయం 9:45గంటల నుంచి మధ్యాహ్నం 1.46గంటల వరకు జరిగే షెడ్యూల్‌ను ఆయన వివరించారు. ఉదయం 9:45-9:50 గంటల వరకు గుమ్మడి గోపాలకృష్ణతో అమరావతి గీతం, 9:50-10.00 కామేశ్‌తో మచ్చలేని చంద్రుడు నృత్యరూపకం, 10.00-10:20 వరకు అంబిక మిమిక్రీ, 10:20-10:30 వరకు రైతు వందనం నృత్యరూపకం, 10:30-10:40 వరకు సురేశ్ గీతాలాపన, 10:40-10:50 వరకు కూచి భట్ల ఆనంద్ జయ జయహే అమరావతి గీతం, 10:50-11.00 వరకు తమిళనాడుకు చెందిన సురేశ్‌తో గరగాట, 11.00-11:10 వరకు కుమారి అంబి కా రింగ్డ్యాన్స్, 11:10-11:20వరకు వందేమాతరం శ్రీనివాస్ రైతు వందనం గీతం, 11:20-12:15 వరకు శివమణి డ్రమ్షో, 12:30 గంటలకు ప్రధాని మోదీ రాక, 12:30-12:35 వరకు అమరావతి విశేషాల గ్యాలరీ పరిశీలన, 12:35-12:43 వరకు శంకుస్థాపన, 12:43 గంటలకు వేదికపైకి ప్రధాని రాక, 12:48 గంటలకు మా తెలుగుతల్లి గీతం, 12:50 గంటలకు బెలూన్ల ఎగురవేత, 12:50-1:11 వరకు సింగపూర్, జపాన్ మంత్రులు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ఉపన్యాసాలు, 1:11-1:43 వరకు ప్రధాని మోదీ ప్రసంగం, 1:46 గంటలకు ప్రధాని సభా ప్రాంగణం నుంచి వీడ్కోలు. ఈ కార్యక్రమాల్లో సాయికుమార్, సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారని మంత్రి పల్లె చెప్పా రు. మీడియా సమావేశం అనంతరం క్రీడల్లో ర్రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన కరణం మల్లేశ్వరి(వెయిట్‌లిఫ్టింగ్), సత్తిగీత(రన్నింగ్)లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, కల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్, శాప్ చైర్మన్ మోహన్ పాల్గొన్నారు. -
ఏపి మంత్రికి ఒళ్లు మండింది!!
-
చంద్రబాబును కావాలనే ఇరికించింది
అనంతపురం : తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని ఓటుకు నోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఇరికించిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. మంగళవారం అనంతపురంలో పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... ఏసీబీ ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును కావాలనే ప్రస్తావించారని విమర్శించారు. చంద్రబాబుపై ఇప్పటిదాకా 25 కేసులు నమోదయ్యాయన్నారు. అయితే విచారణలో ఎక్కడ చంద్రబాబు తప్పు చేసినట్లు నిరూపితం కాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం ఎక్కడ చెప్పలేదని పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే క్రమంలో ఇబ్బందులుంటాయని మాత్రమే కేంద్రం అంటోందని ఆయన గుర్తు చేశారు. -
మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం
అనంతపురం న్యూటౌన్: రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. సోమవారం కర్నూలుకు వెళ్లిన ఆయన రాత్రి అనంతపురం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని డోన్ దగ్గరకు వచ్చేసరికి తాను ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా కారును ఆపాడు. దీంతో ప్రమాదం తప్పింది. -
'మక్కా మృతుల్లో మా రాష్ట్రం వారు లేరు'
హైదరాబాద్: మక్కా ప్రమాద మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు లేరనా ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ, వైఎస్సార్ జిల్లా కడపలో హజ్ హౌస్‌లను నిర్మిస్తామని తెలిపారు. అదే విధంగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై దీక్ష చేసే నైతిక హక్కు జగన్‌కు లేదని పల్లె అన్నారు. మరో ప్రాంతంలో దీక్ష చేస్తే అనుమతి ఇస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. -
బాధితులను ప్రభుత్వం అదుకుంటుంది
-
సాయంత్రానికే మూత
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సర్వజనాస్పత్రి రాత్రి 10 గంటలు... ఏడుగురు సభ్యుల ‘సాక్షి’ బృందం ఆస్పత్రిలోకి వెళ్లగానే ఆరుబయట రోగుల బంధువులు నిద్రపోతున్న దృశ్యం కన్పించింది. వారి మధ్యలో కుక్కలు తిరుగుతున్నాయి. ఏడుగురు మూడు బృందాలుగా విడిపోయి ఆస్పత్రి వార్డులను పరిశీలించారు. మొదట అడ్మిషన్ వార్డులోకి వెళ్లగానే ఓ వ్యక్తి రికార్డులు రాస్తున్నారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తారని ప్రశ్నించగా.. 40-60మంది వస్తారని బదులిచ్చారు. ‘మీ పేరేంటని’ ఆరా తీయగా.. ఆ కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయాడు. వాస్తవమేంటంటే అతను సెక్యూరిటీ గార్డు. అడ్మిషన్ రికార్డులు రాసే వ్యక్తి రాలేదు. రోజూ ఇదే తంతు! తర్వాత ఎమర్జెన్సీలోకి వెళ్లగా.. క్యాజువాలిటీలో డాక్టర్ శారద, ఫిజీషియన్ మురళీ, సర్జన్ విజయలక్ష్మి రాత్రి విధుల్లో ఉన్నారు. స్టాఫ్ నర్సులూ ఉన్నారు. అంతలోనే 108 వాహనం వచ్చి ఆగింది. లోపల ఓ యువకుడు తీవ్ర గాయాలతో ఉన్నాడు. ఇతన్ని కిందకు దించేందుకు సిబ్బంది ఎవ్వరూ రాలేదు. నడవలేని స్థితిలో ఉన్నా స్ట్రెచర్ తీసుకురాలేదు. అనంతపురం మూడోరోడ్డుకు చెందిన శేఖర్ అనే ఆ యువకుణ్ని స్నేహితులే చేతులపై తీసుకుని ఎమర్జెన్సీలో చేర్పించారు. అక్కడి నుంచి ఆర్థోపెడిక్ వార్డుకు వెళ్లాం. అక్కడ కుక్కలు గుంపుగా కన్పించాయి. వార్డులో డాక్టర్లెవరూ లేరు. డ్యూటీ నర్సులు ఉన్నారు. తర్వాత గైనిక్ వార్డుకు వెళ్లగా గైనకాలజిస్ట్ లక్ష్మీకాంత ఉన్నారు. ఇక్కడ భద్రత విధులు మహిళ నిర్వహించాలి. కానీ పురుషుడు ఉన్నారు. పీడియాట్రిక్, బ్లడ్‌బ్యాంకు వద్ద గార్డులు లేరు. తక్కిన వార్డుల్లో డ్యూటీ డాక్టర్లంతా విధుల్లో ఉన్నారు. 24గంటల ఆస్పత్రులు మరీ దారుణం జిల్లాలో రౌండ్‌ది క్లాక్ పనిచేయాల్సిన ఆస్పత్రులను ‘సాక్షి’ క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించింది. మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడిచెరువు, పాముదుర్తి ఆస్పత్రులకు సాక్షి విలేకరులు రాత్రి తొమ్మిది గంటలకు వెళ్లారు. అప్పటికే ఆ ఆస్పత్రులు మూత వేసి ఉన్నాయి. కొత్తచెరువు, బుక్కపట్నం ఆస్పత్రులు తెరిచి ఉన్నా డాక్టర్లు లేరు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం(రాప్తాడు)లోనూ ఇదే తీరు. కనగానపల్లి, నాగసముద్రం, రామగిరి, ఆత్మకూరు పీహెచ్‌సీలను తనిఖీ చేయగా.. ఆత్మకూరు మినహా ఎక్కడా డాక్టర్లు లేరు. ఆత్మకూరులో కూడా హౌస్‌సర్జన్ విధులు నిర్వర్తించారు. హిందూపురం ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణం. విలేకరులు రాత్రి 10 గంటలకు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ 181 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కానీ 100 పడకలే ఉన్నాయి. ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు ఉన్న దృశ్యాలు కనిపించాయి. రాత్రి విధుల్లో డాక్టరు లేరు. ఫోరెన్సిక్ నిపుణుడు రోహిల్ మాత్రమే ఉన్నారు. చిలమత్తూరు, లేపాక్షి ఆస్పత్రులలోనూ రాత్రి విధుల్లో డాక్టర్లు లేరు. ఇక్కడ రోజూ ఇదే పరిస్థితి. హిందూపురం, కదిరి ఆస్పత్రిలో మంచినీటి సౌకర్యం లేక రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పెనుకొండ ఆస్పత్రిలో రాత్రి 9.45 గంటలకు విలేకరులు వెళ్లగా.. ఒక్క డాక్టరూ కన్పించలేదు. ఏఎన్ఎం మాత్రమే ఉన్నారు. ఆరా తీస్తే..‘ఆన్ ఫోన్‌కాల్స్ డ్యూటీ చేస్తామన్నారు. జిల్లాలోని మొత్తం 42 రౌండ్‌ది క్లాక్ ఆస్పత్రులలో 29 ఆస్పత్రులను సాయంత్రానికే మూసేశారు. -
మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం
బత్తలపల్లి : మంత్రి పల్లె రఘనాథరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి పల్లె రఘనాథరెడ్డి కదిరి నుంచి అనంతపురానికి వెళుతుండగా బత్తలపల్లి మండలం జ్వాలాపురం క్రాస్ వద్ద బత్తలపల్లి వైపు నుంచి కదిరికి వెళుతున్న కారు ఢీ కొంది. మంత్రి కారు అద్దం పగిలిపోయింది. ఇంతలో ఎస్కార్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంత్రి కారు డ్రైవర్‌ను మందలించినట్లు సమాచారం. ఈ సంఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని బత్తలపల్లి పోలీసులు తెలిపారు. -
'అందుకు పవన్ వ్యతిరేకం కాదు'
విజయవాడ సిటీ: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకం కాదని సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణంతో పాటు ప్రతి ఒక్కరూ బాగుండాలనేది పవన్ అభిమతమన్నారు. తాము చేస్తున్న కార్యక్రమాలను పవన్ అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సమావేశంలో నిర్ణయించారన్నారు. అక్రిడేషన్ కమిటీల్లో పోలీసులు ఉండరు మీడియా అక్రిడేషన్ కమిటీల్లో పోలీసులను తొలగిస్తూ మరో జీవో ఇవ్వనున్నట్టు మంత్రి పల్లె చెప్పారు. మీడియాపై దాడులను నిలువరించేందుకు ఏర్పాటు చేసే కమిటీల్లో మాత్రం పోలీసు అధికారులు సభ్యులుగా ఉంటారని స్పష్టం చేశారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. హెల్త్‌కార్డుల వినియోగంలో నెలకొన్న చిన్నపాటి సమస్యలను వెంటనే తొలగిస్తామన్నారు. జర్నలిస్టులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నట్టు వివరించారు. వీలైనంత త్వరలోనే ఈ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుపై ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. జర్నలిస్టు హెల్త్‌కార్డు పని చేయక ఏలూరుకు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామేన్ సుధాకర్ (నాని) మృతి చెందిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన రూ.20 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. -
వారంలో పంట నష్టపరిహారం పంపిణీ
పుట్టపర్తి టౌన్ : వారం రోజుల్లో జిల్లా రైతులకు 2013-14 సంవత్సరానికి సంబంధించి పంట నష్టపరిహారం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన మంత్రి పర్తిసాయి ధర్మశాలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 692 కోట్ల పంట నష్టపరిహారం మంజూరైతే ఇందులో రూ.569 కోట్లు అనంతపురం జిల్లాకు మంజూరైందన్నారు. త్వరలోనే జిల్లా పర్యటనకు రానున్న ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా పరిహారం పంపిణీ ప్రారంభిస్తామన్నారు. పశుగ్రాసం పెంపకానికి సబ్సిడీతో గడ్డివిత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. దాణాను ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బుక్కపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరలో చేపడతామని, కొత్తచెరువులో ఇంటి పట్టాలు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. -
పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి టౌన్/అర్బన్ : కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొదిస్తామని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. జేసీ లక్ష్మికాంతం, ఆర్డీఓ రాజశేఖర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రంజిత్,శ్రే యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రతినిధులు అభిషేక్, రామరాజు, ఆర్ఆర్ సౌరశక్తి డెరైక్టర్ వేద్ ఆలపాటి, వ్యాల్యూథాట్ ఐటీ కంపెనీ సీఈఓ మహేష్ నంద్యాల,పండిట్ వ్యూ సాప్ట్వేర్ కంపెనీ ప్రెసిడెంట్ తాళంకి శ్రీధర్‌లతో కలిసి కప్పలబండ గ్రామంలో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో కంపెనీత ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 400 ఎకరాల్లో విమానాల విడిభాగాల త యారీ, విమానాలకు ఇంధన రీఫిల్లింగ్, విమానాల మరమ్మతులు తదితర సంస్థలను స్థాపించేందుకు ఆసక్తి చూపుతోందన్నారు. ఆర్ఆర్ సౌరశక్తి సంస్థ 10 ఎకరాల్లో రూ. 600 కోట్ల పెట్టుబడితో సౌరశక్తి పలకల తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోందన్నారు. వాల్యూథాట్ ఐటీ కంపెనీ ఇప్పటికే అనంతపురం జిల్లాలో తన కార్యకలాపాలను ప్రారంభించిందని, ఈ సంస్ధ ద్వారా 200 మందికి ఉపాధి అ వకాశాలు లభించనున్నాయన్నారు. తహసీల్దార్ సత్యనారాయణ, చైర్మన్ సీసీ గంగన్న, వైస్ చైర్మన్ కడియాలరాము, దేశం నాయకులు ఆదినారాయణరెడ్డి, కడియాల సుధాకర్, రామాంజినేయులు పాల్గొన్నారు. -
డిజిటల్ ఆంధ్రాగా తీర్చిదిద్దుతాం
తిరుపతిలో ఐఐటీ ప్రారంభించిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తిరుపతిమంగళం: రాష్ట్రంలో ఐటీరంగాన్ని అభివృద్ధి చేసి, డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని ఐటీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఆర్సీఆర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సెంటర్ ప్రాంగణంలో బుధవారం ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకుబేషన్ సెంటర్‌ను, రేణిగుంట రోడ్డులోని కృష్ణతేజ విద్యాసంస్థల ప్రాంగణంలో ఐఐటీని ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ఏపీని ఎడ్యుకేషనల్ హబ్‌గా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే తిరుపతికి ఐఐటీని తీసుకొచ్చారన్నారు. ప్రతి పల్లెకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించి 4జీ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్య సమాచారం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.460కోట్లు ఇప్పటికే కేటాయించిందన్నారు. వచ్చే సంవత్సరం మార్చి కల్లా అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, కాకినాడ నగరాల్లో ఐటీని అభివృద్ధి చేస్తున్నామని, 19 కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో తమ సంస్థలు స్థాపించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. పుట్టపర్తిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో ఐటీ రంగంలో ఐదు లక్షలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో నాలుగు లక్షల ఉద్యోగాలు టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 20 శాతం నిధులు ఐటీ ద్వారా పొదుపు అవుతోందని, రాబోయేది ఐటీ కాలమేనన్నారు. ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణనాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ పాల్గొన్నారు. శ్రీరామ విద్యార్థులతో... ఐఐటీ ప్రారంభం అనంతరం తిరుపతి-కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డితోపాటు రాష్ట్ర ఐటీ సలహాదారులు సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడారు. 37ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. తద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తిరుపతి కేంద్రంగా ప్రారంభించిన ఇంక్యుబేషిన్ సెంటర్లో భాగస్వామ్యానికి స్టార్టప్ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. 5వేలు స్టార్టప్స్‌ను రాష్ట్రంలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఐటీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు ఇదే తరుణమన్నారు. చదలవాడ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత, శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల అధినేత మన్నెం రామిరెడ్డి, డెరైక్టర్లు మన్నెం అరవిందకుమార్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, బిసి వెంకటరెడ్డి, ప్రిన్సిపాల్ కె. జయచంద్రారెడ్డి, నాయకులు శ్రీధర్ వర్మ, గాలి సురేంద్రనాయుడు, నరిసింహయాదవ్, సూరా సుధాకర్‌రెడ్డి, ఊట్ల సురేంద్రరె డ్డి, మునిశేఖర్, పుష్పావతి పాల్గొన్నారు. -
'హెగ్డేకు పట్టిన దుర్గతే కేసీఆర్ పడుతుంది'
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము చెప్పిందే నిజమైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... తమ ప్రభుత్వం పట్ల తెలంగాణ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫోన్లు ట్యాప్ చేయలేదని తెలంగాణ మంత్రులు, అధికారులు చెప్తువచ్చారని... ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఈరోజు హైకోర్టులో ఒప్పుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఫోన్లు ట్యాప్ చేయకూడదని తెలిపారు. స్వప్రయోజనాలు, రాజకీయ లబ్ధికోసం పక్కరాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇదంతా చేశారని ఆరోపించారు. రామకృష్ణ హెగ్డేకు పట్టిన దుర్గతే కేసీఆర్ పడుతుందని రఘునాథరెడ్డి అన్నారు. -
బాబుకు నోటీసులు ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు ఉందా?
అనంతపురం : దమ్ముంటే తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. శనివారం అనంతపురంలో పల్లె రఘునాథరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ... రేవంత్‌రెడ్డి కేసు నుంచి బయటపడేందుకు కేంద్రప్రభుత్వంతో లాలూచీ పడ్డామని ప్రచారం చేయడం సరికాదన్నారు. రేవంత్‌రెడ్డి కేసు ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిది అని అన్నారు. అయితే ఆ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేస్తే ఎలా అంటూ విలేకర్ల ఎదుట తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కేసును ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రేవంత్ వ్యవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిన ఛానెళ్లు, కథనాలు అందించిన పత్రికలకు మాత్రమే నోటీసులు జారీ చేశామన్నారు. చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేసినందుకే టీ న్యూస్ ఛానెల్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. అయితే ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చే దమ్ము లేదా అంటూ పల్లె రఘునాథరెడ్డి ఈ సందర్భంగా టీ న్యూస్ చానెల్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ టీవీ ఛానెల్ ప్రసారాలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని... ఓ విలేకరి అడిగి ప్రశ్నకు సమాధానంగా పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. -
'మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవద్దు'
-
'మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవద్దు'
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. 'కేటీఆర్ సంస్కారం నేర్చుకో. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదు. మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవద్దు' అంటూ కేటీఆర్ ను పల్లె ఎద్దేవా చేశారు. సెక్షన్-8ను అమలు చేయాలని గవర్నర్, కేంద్రాన్ని కోరతామని ఈ సందర్భంగా పల్లె పేర్కొన్నారు. చంద్రబాబు ఆంధ్రా పోలీసులను భద్రతగా పెట్టుకుంటే తప్పేముందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
గవర్నర్ ధృతరాష్ర్టుడి పాత్ర పోషిస్తున్నారు: పల్లె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తుంటే గవర్నర్ నరసింహన్ ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన రామ్‌లాల్, ఎన్డీ తివారీలకు పట్టిన గతే నరసింహన్‌కు పడుతుందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను చూస్తే తనకు మాయల ఫకీరు గుర్తుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన ఆంతర్యమేమిటో: మంత్రి రావెల గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ సాష్టాంగ ప్రణామం చేయడంలో ఆంతర్యం ఏమిటో బయట పెట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని కోరారు. -
అట్టహాసంగా పయ్యావుల కేశవ్ నామినేషన్
అనంతపురం క్రైం : స్థానిక శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి పయ్యావుల కేశవ్ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా కొనసాగింది. శనివారం కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ బి. లక్ష్మీకాంతం చాంబర్లో పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, జెడ్పీ చైర్మన్ చమన్. ప్రభుత్వ ఛీప్ విప్ కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ యామినీ బాల, ఎమ్మెల్సీలు శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, గోనుగుంట్ల సూర్యనారాయణ, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయ చౌదరి, జితేంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పయ్యావుల కేశవ్ 3 సెట్లు నామినేషన్ దాఖలు చేయగా, కేశవ్‌కు మద్దతుగా వై. వెంకటసుబ్బన్న మరో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. పల్లె వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు నామినేషన్ సందర్భంగా విచ్చేసిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనాన్ని కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పరిటాల సునీత వాహనాన్ని మాత్రం అనుమతించారు. నామినేషన్ సందర్భంగా మూడు వాహనాలను మాత్రమే అనుమతించాల్సిన నిబంధనలను ఎన్నికలు అధికారులు తుంగలో తొక్కారు. -
రేవంత్ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు: పల్లె
ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన శిక్ష అనుభవిస్తారని మంత్రి పల్లె రఘునాధరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ కేసులో సీబీఐతోనే కాదు ఏ సంస్థతోనైనా విచారణకు సిద్ధమని, చంద్రబాబు మాత్రం కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసే దమ్ము, ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేవని చెప్పారు. కేసీఆర్ సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు సహా 120 మంది ముఖ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరపాలని పల్లె అన్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలను ముక్కలుగా చేసి అతికించి టేపు విడుదల చేశారని ఆయన ఆరోపించారు. బాలకృష్ణ సీఎం అవుతారంటూ చేసిన ప్రచారం మీడియా సృష్టేనని మండిపడ్డారు. -
కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు ... జాగ్రత్త!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబపై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు... జాగ్రత్తగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో పల్లె రఘునాథరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తమ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశారని ఈ సందర్భంగా ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ విషయంపై తాము స్పందించబోమని పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. -
తాగునీటిపైనే దృష్టి
అనంతపురం సెంట్రల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తాగునీటిని అందించడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తోందని రాష్ట్ర పౌరసంబందాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్‌హాలులో చెర్మైన్ చమన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 22.7 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. బోర్లు మరమ్మతులు, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, డీపెనింగ్ పనులు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే శ్రీరామిరెడ్డి తాగునీటి, జేసీ నాగిరెడ్డి, హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాకు సాగు,తాగునీటిని అందించి సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉందని, వడదెబ్బ బారిన పడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడదెబ్బకు గురై చనిపోయిన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందజేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. తహశీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ నేతృత్వంలో కమిటీ నిర్దారణ చేసిన తర్వాత ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. జిల్లా పరిషత్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను తీసుకురావడానికి చెర్మైన్‌తో కలిసి కృషి చేస్తానన్నారు. రైతు రుణాలను కొన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేయడం లేదని సభ్యులు ఫిర్యాదు చేయగా వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేయాలని ఎల్డీఎంను మంత్రి ఆదేశించారు. రానున్న ఖరీఫ్‌లో 3.25 లక్షల విత్తన వేరుశనగ అవసరమని, ప్రస్తుతానికి రూ. 18 వేల క్వింటాళ్లు సేకరించామని వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి వివరించారు. మంత్రి మాట్లాడుతూ... రానున్న జూన్2, 3 తేదీల్లో విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని, ఆలోగా లక్ష క్వింటాళ్ల విత్తన వేరుశనగ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. నాణ ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, నాశిరకం విత్తనాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీరు- చెట్టు కార్యక్రమంలో పూడికమట్టిని ప్రభుత్వ ఖర్చులతో రైతులు తమ పొలంలోకి తరలించుకోవచ్చునని, చిన్న, సన్న కారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే సభ్యులు 3 కిలోమీటర్లకే పరిమితం చేశారని ఫిర్యాదు చేయడంతో ఇందులో మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాకు వివిద పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద సెంట్రల్యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు వచ్చాయని, త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ... జిల్లాలో లక్ష మరుగుదొడ్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వేగవంతంగా మరుగుదొడ్లు పూర్తి చేసేందుకు ఆర్డీటీ సంస్థకు 34వేలు నిర్మించాలని కోరామన్నారు. మిగిలిన ఎన్జీఓల ద్వారా లక్ష సాధనకు మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉన్న వనరులను ఉపయోగించుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. తాగునీటి సమస్యలోనూ రాజకీయం: విశ్వ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ‘ఉరవకొండ నియోజకవర్గం జె.రాంపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి నుంచి ప్రజలను కాపాడేందుకు బోరు వే యగా రాజకీయం చేసి అడ్డుకున్నారన్నారు. కలెక్టర్ ఆదేశాలను సైతం తహశీల్దార్ బేఖాతర్ చేస్తున్నాడని ఆరోపించారు. అలాగే బ్యాంకుల నుంచి రైతులకందే సాయంపై దృష్టి సారించాలని కోరారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ రుణాలు తీసుకునేందుకు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని అంటున్నా ఆ దిశగా పనులు జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ కేవలం రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇలాగైతే ఎప్పటిలోగా ప్రాజెక్టును పూర్తి చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఏడాదికైనా జిల్లాలో 1.18 లక్షల ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను అవమానిస్తున్నారు కదిరి నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీరు-చెట్టు ప్రొగాం నియోజకవర్గంలో జరుగుతున్నా స్థానిక శాసనసభ్యునిగా తనకు కనీస ఆహ్వానం లేదని, ఇంతకన్నా దౌర్బాగ్యముంటుందా అని ప్రశ్నించారు. వెంటనే అధికారులతో ప్రొటోకాల్ విషయంపై సమీక్ష సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దడి నివారణకు తన కృషితో మంజూరైన రూ.42 లక్షలు ఎక్కడికిపోయాయో తెలియడం లేదన్నారు. నియోజకవర్గంలోని తాగునీటి ఇబ్బందులపై చర్చించాలని అధికారులు ఆహ్వానిస్తే సార్.. మీ దగ్గరుకు వస్తే మా ఉద్యోగాలు పోతాయి అని అంటున్నారు. నేనేమైనా ఉగ్రవాదినా? అసాంఘిక కార్యకలపాలు ఏమైనా చేస్తున్నానా? ప్రశ్నించారు. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతానాథ్ మాట్లాడుతూ.. గతంలోనే పనులు మంజూరు చేయడం వలన ఎమ్మెల్యే సిఫారుస చేసిన పనులు చేపట్టలేకపోయామని సంజాయిషీ ఇచ్చారు. తాగునీటి ఎద్దడి నివారణకు నిధులున్నాయని, వెంటనే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్‌ను తూచతప్పకుండా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ యామనిబాల, జెడ్పీ వైఎస్ చైర్మన్ సుబాషిణమ్మ, ఎమ్మెల్సీ గేయానంద్, జెడ్పీ సీఈఓ రామచంద్ర, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రితో విద్యార్థుల వాగ్వాదం
అనంతపురం: అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. జడ్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, డీసీసీబీ చైర్మన్ శివశంకరరెడ్డి మద్దతు తెలిపారు. -
మహిళల ఆర్థిక పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యం
ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అనంతపురం అర్బన్ : మహిళల ఆర్థిక పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డ్వామా సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాల ఆర్థిక పరిపుష్టి, పెట్టుబడి నిధి నిర్వహణ, వడ్డిలేని రుణాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు మంగళవారం ఏర్పాటు చేశారు. మంత్రి పల్లె మాట్లాడుతూ డ్వాకా రుణమాఫీలో భాగంగా ప్రతి మహిళా సభ్యురాలి ఖాతాలో మూడు విడతలుగా రూ.10 వేలు జమ చేస్తామని తెలిపారు. జిల్లాలోని 51,532 డ్వాక్రా గ్రూపుల పరిధిలో 5,53,715 మంది సభ్యులు ఉన్నారని, వీరికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 544.32 కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి 2014 నుంచి 2015 మే నెల వరకు తీసుకున్న డ్వాక్రా రుణాలపై ఉన్న రూ. 155.02 కోట్ల వడ్డీ మాఫీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో నవ నిర్మాణ మౌనదీక్ష, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, పేదరిక నిర్మూలన తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీటిని విజయవంతం చేయాలని కోరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, డీఆర్డీఏ పీడీ వెంకటేశం, డీఎఫ్ఓ రాఘవయ్య, డ్వామా పీడీ నాగభూషణం పాల్గొన్నారు. -
ఐటీలో ఏపీని అగ్రగామిగా చేస్తాం
-
ఆర్టీసీ సమ్మె ఉద్ధృతం
కార్మికులు, పార్టీల నేతల అరెస్టు, విడుదల మంత్రి పల్లెను నిలదీసిన కార్మికులు పలు చోట్ల బస్సు అద్దాలు ధ్వంసం కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతం అవుతోంది. గురువారం రీజియన్ వ్యాప్తంగా కార్మికులు కదంతొక్కారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.అనేకచోట్ల అరెస్టులు జరిగాయి. జిల్లాలోని అనంతపురం, కదిరి తదితర ప్రాంతాల్లో బస్సు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్మికులు డిపో ఆవరణలో ఉండకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. నగరంలో ఈయూ, ఎన్ఎంయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మిక నేతలు కొండయ్య, వీఎన్ రెడ్డి, భాస్కర్ నాయుడు, గోపాల్, రామాంజినేయులు, కార్మికులు మంత్రి పల్లె రఘునాథ రెడ్డిను నిలదీశారు. ఫిట్మెంట్, ప్రభుత్వంలో విలీనంపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ అడ్డుకున్నారు. మంత్రి కారు ఎదుట బైఠాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్మికులను పక్కకు నెట్టారు. దీంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఎం నేతలు సాయంత్రం సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయబోతుండగా పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు. హిందూపురంలో హైర్ బస్సులను తిప్పేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ కార్మికులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఉరవకొండలో కార్మికులకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. కార్మికులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామనడం సరికాదన్నారు. ఇందుకు సీఎం మూల్యం చెల్లించకతప్పదన్నారు. కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా కార్మికుల మద్దతు తెలిపారు. ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందని విమర్శించారు. ఫిట్మెంట్ 43 శాతం ప్రకటించాల్సిందేనన్నారు. తాడిపత్రిలో పోలీసులకు కార్మికుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రైవేట్ బస్సులను ఏవిధంగా పంపుతారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు 42 మందిని అదుపులోకి తీసుకుని, వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. మడకశిర బస్టాండ్ ముందు కార్మికులు ధర్నా చేశారు. పుట్టపర్తిలో సమ్మె ప్రభావం కన్పించింది. 249 బస్సులు నడిపిన ఆర్టీసీ రీజియన్ వ్యాప్తంగా పోలీసులు బందోబస్తు మధ్య ఆర్టీసీ 249 బస్ సర్వీసులను తిప్పింది. ఇందులో హైర్ బస్సులు 130,, 119 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. పోలీసులు బందోబస్తు మధ్య బస్సులు తిప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది వరకు డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. ప్రభుత్వ ఒత్తిడి వల్ల ప్రమాదమని తెలిసినా ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాల్సి వస్తోందని ఓ అధికారి చెప్పారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు.. అరకొరగా బస్సులు తిప్పుడంతో ప్రయాణికులు బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉన్నారు. కొందరు ప్రయాణికులు ప్రైవేట్ వ్యాన్లు, డీజిల్ ఆటోలను ఆశ్రయించారు. పరిమితికి మించి ప్రయాణికులతో ప్రైవేటు వాహనాలు, డీజిల్ ఆటోలు తిరిగాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు రైల్వే స్టేషన్లో బారులు తీరారు. సీఐటీయూ నేతల అరెస్టు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ నేతలు ఇంతియాజ్, నాగరాజు, గోపాల్ ఆర్టీసీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని నేతలను అరెస్టు చేశారు. పోలీసుల చర్యలను నాయకులు ఖండించారు. ఎంసెట్ అభ్యర్థులు ఇబ్బంది రాకూడదు ఐవైఆర్ కృష్ణారావు అభ్యర్థులు ఎంసెట్‌కు హాజరయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో కలిసి గురువారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంసెట్ అభ్యర్థుల రవాణా సౌకర్యం వివరాలను వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం చేపట్టిన బస్సు సర్వీసుల వివరాలను వివరించారు. విధులకు హాజరుకాకపోతే తొలగిస్తాం : ఆర్టీసీ ఆర్ఎం రీజియన్‌లో సమ్మె కారణంగా కాంట్రాక్టు 71 డ్రైవర్లు, 14 కండక్టర్లు విధులకు హాజరుకాలేదు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాల మేరకు వారు విధులకు హాజరుకాకపోతే తొలగిస్తామనిచ రెగ్యులర్ చేయబోమని ఆర్ఎం జీ వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. వెంటనే కాంట్రాక్ట్ ఉదోయగులు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. -
‘అకాల’ నష్టం
గాలి, వడగళ్ల వాన నేలకూలిన విద్యుత్ టాన్స్‌ఫార్మర్, స్తంభాలు అంధకారంలో గ్రామాలు పత్తి, టమోట, మిరప పంటలకు నష్టం బాధితులను పరామర్శిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధర్మవరం రూరల్/సోమందేపల్లి/ముదిగుబ్బ : మండలంలోని కుణుతూరు గ్రామంలో శనివారం రాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గాలులు వీయడంతో గ్రామస్తులు భయంతో భీతిల్లారు. గాలులకు ఏళ్లనాటి వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ టవర్లు విరిగిపడ్డాయి. గ్రామంలో పూరిగుడిసెలు, రేకుల షెడ్లు ఎగిరిపడ్డాయి. ద్రాక్ష తోటలు నేలమట్టమయ్యాయి. శ్రీనివాసరెడ్డి అనే రైతుకు చెందిన క్యాప్సికమ్ కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ టెంట్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో సుమారు రూ.25 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో గ్రామంలో అంధకారం నెలకొంది. రాత్రంతాగ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జరిగిన నష్టంపై రెవెన్యూ, ఉద్యానశాఖ అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. గ్రామంలో టీడీపీకి చెందిన వారి పేర్లు మా త్రమే పరిహార జాబితాలో నమోదు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పార్టీలకతీతంగా నష్టపోయిన వారందరికీ న్యాయం చే యాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నా రు. గ్రామాన్ని సందర్శించిన మంత్రి పల్లె : ఐటి శాఖా మంత్రి పల్లె రఘనాథరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తదితరులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. బాధితులను ఆదుకుంటామ ని హామీ ఇచ్చారు. విద్యుత్ స్తంభాలను సరిచేసి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్రంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. కుణుతూరు గ్రామాన్ని సందర్శించిన కేతిరెడ్డి కుణుతూరు గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదివారం సందర్శించారు. నష్టపోయిన రైతు శ్రీనివాసరెడ్డి తోటను పరిశీలించి జరిగిన నష్టాన్ని రైతుతో అడిగి తెలుసుకున్నారు. నష్టం విలువ దాదాపు రూ. 25 లక్షల దాకా ఉంటుందన్నారు. కేతిరెడ్డి వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, చిన్న క్రిష్ణారెడ్డి, గంగిరెడ్డి, తదితరులు ఉన్నారు. వడగళ్ల వానతో అతలాకుతలం - నేలకూలిన 12 విద్యుత్ స్తంభాలు పందిపర్తి (సోమందేపల్లి): మండల పరిధిలోని పందిపర్తిలో శనివారం సాయంత్రం కురిసిన వడగళ్లవానకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పాటు, పలు ఎకరాల్లో పత్తి, టమోట, మిరప పంట నష్టం జరిగింది. శనివారం సాయంత్రం అరగంట సేపు వడగళ్ల వాన కురియడంతో గ్రామస్తులు, పోలాల వద్ద ఉన్న రైతులు ఆందోళన చెందారు. వానకు తోడుగా పెద్ద ఎత్తున గాలి తోడవ్వడంతో 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ నేలకొరిగింది. 11 కేవి లైను, ఎల్టీ లైనుపై పడడంతో విద్యుత్ వైర్లు తెగి కిందకు పడ్డాయి. వ్యవసాయ బోర్లకు ఏర్పాటు చేసిన 13 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 11 కేవి లైను ఎల్టీ లైన్‌పై పడడంతో ఎన్ని మోటార్లు కాలిపోయి ఉంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆస్తి నష్టం విలువ రూ. 40 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నాగభూషణ్‌రెడ్డి తనకున్న రెండు ఎకరాలలో వేసిన మిరప పంటకూడా పూర్తిగా నాశనమైంది. ఆస్తి నష్టం విలువ రూ.20 వేలు ఉంటుందని వాపోయాడు. మంచేపల్లికి చెందిన రైతు కిష్టప్ప కూడా తనకున్న రెండు ఎక రాలలో టమోటా పంట సాగు చేశాడు. గాలి, వానకు మొత్తం పంట నాశనం అయింది. దాదాపుగా రూ లక్ష నష్ట జరిగిందని రైతు ఆవేదన చెందుతున్నాడు. అదే విధంగా వేప, నేరేడు చెట్లు కూడా నేలకొరిగాయి. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేవరకు గ్రామానికి నీటి సౌకర్యం కూడా లేదని గ్రామస్తులు తెలిపారు. వెంటనే విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బా దిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ధ్వంసమైన మునగ చెట్లు ముదిగుబ్బ : ఎన్ఎస్వి కొట్టాల గ్రా మంలో శనివారం రాత్రి అకాల వర్షం, గాలులకు ము నగ పంట ధ్వంసమైంది. రైతు ఇందుకూరు ఆదినారాయణ నాలుగున్నర ఎకరాల్లో వర్షం దాటికి రెండు ఎ కరాల్లోని మునగ చెట్లు ధ్వంసమయ్యాయి. వీఆర్వో నారాయణస్వామి ఆదివారం పొలాన్ని పరిశీలించి పం టనష్టాన్ని అంచనా వేశారు. -
'వీధి రౌడీలా వ్యవహరిస్తున్న కేసీఆర్'
కర్నూలు: కేసీఆర్ తన పదవికి తగినట్టు ప్రవర్తించకుండా వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఏపీ సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని అన్నారు. కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అని గుర్తుచేశారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మైనారిటీల ఆస్తులు కబ్జాకు గురైయ్యాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి జీవో 18 అమలు చేశామని తెలిపారు. చంద్రబాబు చేతుల మీదుగా మే7న హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు ప్రకటించారు. -
ఏపీ ప్రజల కష్టాలకు కాంగ్రెస్సే కారణం: పల్లె
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదాకు ఎందుకు చట్టభద్రత కల్పించలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాయశక్తులా కృషి చేస్తారన్నారు. -
సహకారం అందిస్తాం
కొరుక్కుపేట:ప్రవాస తెలుగువారి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రాఘనాథరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని అర్జెంటీనాలోని ఆండీస్ పర్వతాల్లో మృ+తి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున వెళ్లిన ఆయన చెన్నైకు రావటంతో చెన్నై పురి ట్రస్ట్ ఆహ్వానం మేరకు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. చెన్నపురి ట్రస్ట్ నిర్వాహకులు తంగుటూరి రామకృష్ణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పల్లె రఘనాథరెడ్డి పాల్గొన్నారు. తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ మధ్యలో తెలుగు భవన్‌ను నిర్మించనున్నామని తెలిపారు. స్వచ్ఛమైన సంప్రదాయ భావాలు కలిగిన తెలుగు భవన్ నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నగరంలోని తెలుగు ప్రముఖులు, చెన్నపురి ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు పొన్నూరు రంగనాయకులు, ఎం.వి.నారాయణగుప్త, తంగుటూరి రామకృష్ణలు తమిళనాడులో తెలుగువారి సమస్యలు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం గ్రాంట్ల సమస్యలు చెన్నైలోని తెలుగు జర్నలిస్టు సమస్యలను పల్లెరఘనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అతి సాధారణమైన కుటుంబంలో జన్మించిన మస్తాన్‌బాబు ఉన్నత విద్యలను చదివి సత్యం కంప్యూటర్లో మంచి హోదాలో పని చేశారని అన్నారు. జాతి గౌరవాన్ని నిలబెట్టేందుకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడు మస్తాన్‌బాబు కావటం విశేషం. దురదృష్టవశాత్తు ఆండీస్ పర్వతాల్లో ఎక్కుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. ఇతనికి జాతీయ నాయకులు ఏ విధంగా ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు చేశామన్నారు. తెలుగు మాట్లాడేవారు 18 కోట్లమంది ఉన్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం బయట గాని, విదేశాలలో గాని ఉన్న తెలుగు వారు తెలుగు భాషా సంస్కృతులపై చూపుతున్న అభిమానం అనన్యసామాన్యమైనదని అన్నారు. రాష్ట్రేతర ప్రాంతంలో ఉంటున్న తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. తెలుగు ప్రాచీన వైభవాన్ని, నైతిక విలువలను, సమాజం పట్ల అవగాహన దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. ఆ దిశగా తెలుగు పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని వివరించారు. తెలుగు భాషకు ఇతోధికంగా సేవలందించే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తుందన్నారు. ఆ దిశగా జాతి నాయకులు ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, గురజాడ, గిడుగు, అల్లూరి సీతారామరాజు, బాపు లాంటి మహోన్నత వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోని తెలుగువారి భాషా సమస్యలను పరిష్కరించే విధంగా తమ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లనున్నామన్నారు. పొట్టి శ్రీరాములు స్మారక మందిరానికి పెంచిన గ్రాంటును అందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు నేర్పించే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. చెన్నైలోని తెలుగు జర్నలిస్టులకు హెల్త్ కార్డులను ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీనియర్ నిర్మాత కందేటి సత్యనారాయణ, మిర్చి వ్యాపారవేత్త జి ఆర్ రమేష్, ఇజ్రాయేల్, కె ఎల్ శ్రీనివాస్, గుర్రం చంద్రశేఖర్, పొన్నూరు రంగనాయకులు, రవిబాబు, టీడీపీ స్థానిక నాయకుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు -
టీడీపీని విమర్శించే హక్కు రఘువీరాకు లేదు
అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. గురువారం ఆయన అనంతపురంలోని మునిసిపాలిటీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం నియంతృత్వ ధోరణితో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని విమర్శించారు. అప్పట్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్సే ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా విషయం విభజన బిల్లులో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ప్రజలకు ద్రోహం చేసిన కారణంగానే కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు. పత్రికల్లో కనిపించేందుకు చౌకబారు ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన ఈ సందర్భంగా రఘువీరాకు హితవు పలికారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు 18 జీఓ రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు జీవో నంబరు 18ని విడుదల చేశామని మంత్రి పల్లె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల ఎకరాలకు గానూ 39 వేల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 3,165.71 ఎకరాలకు గానూ 290.45 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని చెప్పారు. వీటిని అధికారులు పరిశీలించి తిరిగి వెనక్కు తీసుకుంటారన్నారు. రూ.856.55 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల కరువు జిల్లా అయిన అనంతకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.856.55 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసినట్లు మంత్రి పల్లె తెలిపారు. ఇందులో రూ.848.55 కోట్లు సంప్రదాయ పంటలకు, రూ.8 కోట్లు ఉద్యాన పంటలకు వర్తిస్తుందని వివరించారు. మొత్తం 5.81 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న సంప్రదాయ పంటలకు పరిహారం విడుదల చేయగా .. అందులో 4.95 లక్షల హెక్టార్లకు సంబంధించి వేరుశనగ ఉన్నట్లు తెలిపారు. -
'అనంతకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి'
అనంతపురం: అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు సర్కార్‌ను సీపీఐ నేత కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురం నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి నివాసాన్ని కె.రామకృష్ణ ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. జిల్లాలో కరువు రైతులు తీసుకున్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
రూ.5 కోట్లతో ఉగాది ఉత్సవాలు
మంత్రి పల్లె ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు పుట్టపర్తి టౌన్ : మన్మథనామ సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని అనంతరంవరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుకలను ప్రారంభిస్తారన్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన తెలుగు జాతి కీర్తిని ఇనుమడింపజేసిన 32 మంది కళాకారులకు కళారత్న పురష్కారాలు, 67 మందికి ఉగాది పురస్కారాలను సీఎం చేతులు మీదుగా అందజేస్తారన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు-వెలుగు విశిష్ట పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదును బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు. 32 మంది కళారత్న పురస్కాకర గ్రహితలకు రూ.10 వేల నగదు బహుమతి అందిస్తామన్నారు. అనంతపురం జిల్లా నుంచి 8 మంది రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేక ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు. -
'ఆ ముగ్గురు కలసి రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేశారు'
హైదరాబాద్: ఆ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేశారని అప్పటి కేంద్ర మంత్రులు చిదంబరం, షిండే, మొయిలీలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డిలు మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో యనమల, పల్లె మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీది రెండు నాల్కల ధోరణి అని వారు విమర్శించారు. ప్రత్యేక హోదా... విభజన చట్టంలో పెట్టలేదు, ప్రకటన మాత్రమే చేశారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ కొత్త నాటకం మొదలు పెట్టిందని వారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస వైఖరి ఏమిటో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రాయితీలు అనవసరం అన్న మొయిలీ వ్యాఖ్యలు సరైనవి కావని యనమల, పల్లె అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలకు ఇప్పట్లో జీతాలు పెంచే ఆలోచనలు లేవని యనమల, పల్లె స్పష్టం చేశారు. -
మీరు మంత్రివర్యులు కాదా?
ప్రజావాణిలో మంత్రిని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులు అనంతపుంర అర్బన్: తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలను మంత్రి రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లాగా దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారానికి ఆ మంత్రిని కలవండి అని ఉచిత సలహా ఇవ్వడంపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హాజరయ్యా రు. జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని వైఎస్సార్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాం నాయక్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కురుకుంటలోని వైఎస్సార్ కాలనీలో మరుగుదొడ్లు నిర్మించాలని ఆ కాలనీ వార్డు మెం బర్ జయలక్ష్మీబాయి, నాయకుడు శ్రీనివాస్ నాయక్ మంత్రికి విన్నవిం చారు. దీనిపై ఆయన ఆ మంత్రిని కలి స్తే.. మీ సమస్యలు పరిష్కరమవుతాయని వారికి సమాధానమిచ్చారు. దీంతో నాయకులు ‘మీరు మంత్రి కాదా..? మీకు మంత్రి హోదా లేదా..? సమస్యలపై మీరు ఇలాంటి సమాధానం ఇవ్వడం తగునా..?’ అని మంత్రిని ప్రశ్నించారు. ధర్మవరం, బుక్కపట్నం, ముది గుబ్బ, కదిరి మండలాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి కోసం అల్లాడుతున్నార న్నారు. ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని కోరారు. మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని సమస్యను కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేదని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పిలిచి ఈ రెండు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. షరతులులేని పింఛన్లు ఇవ్వండి : వికలాంగులకు షరతులులేని పింఛన్లు, ఇళ్ల పట్టాలు, అంత్యోదయ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు షఫి, మల్లికార్జున, అలివేలు,తదితరులు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని కోరారు. సమస్యలు పరిష్కరించండి.. క్రైస్తవ మతం (మార్గం) స్వీకరించిన షెడ్యూల్ కులాలవారు ప్రభుత్వం సం క్షేమ, అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోతున్నారని ఆల్ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకులు ప్రజావాణిలో ఏజేసీ సయ్యద్ కాజామొహిద్దీన్కు విన్నవించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హో దాకై అసెంబ్లీ తీర్మానం చేసి తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎన్. కమలాకర్‌రావు, ప్రధాన కా ర్యదర్శి డానియల్, తదితర నాయ కులు కోరారు. క్లస్టర్స్ స్కూళ్ల ఏర్పాటును ఉపసంహ రించాలి : క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. ఓబులు, జిల్లా అధ్యక్షుడు ఎం. ఇంతియాజ్ డీఆర్ఓ హేమసాగర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రజావాణిలో ఏజేసీతోపాటు డీఆర్ఓ సీహెచ్ హేమసాగర్, అటవీశాఖ సెంటిల్మెంట్ అధికారి చక్రపాణి అర్జీలు స్వీకరించారు. ఇస్కాన్ ట్రస్టు ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా పెరుగు అన్నం, పులి హోరా ఐదు రూపాయల చొప్పున అర్జీదారులకు అందజేశారు. -
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట
రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నీటి వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి సంబంధించి సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని కృష్ణానదికి మళ్లించడానికి వీలుగా నిర్మించతలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వారం రోజుల్లోగా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వచ్చే నాలుగైదేళ్లలో పూర్తి చేసేందుకు, వాటి పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేయనున్నారు. రాష్ట్రంలోని నదులన్నింటిలో 5,742 టీఎంసీల నీరు ఉంది. దానిలో 4,148 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. అందులో వచ్చే ఐదేళ్లలో 975 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2,500 టీఎంసీల నీరు లభ్యతలోకి వస్తే 2.50 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనా వేసింది. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించింది. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు, హంద్రీనీవా నుంచి 40 టీఎంసీల నీటిని చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు తీసుకెళ్లడానికి అవసరమైన పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. సమావేశం అనంతరం ఈ నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. మున్సిపాలిటీల కేటగిరీల కుదింపు రాష్ట్రంలో ఆరు కేటగిరీలుగా ఉన్న మున్సిపాలిటీలను మూడు కేటగిరీలుగా కుదించామని, కమిషనర్లకు అధికారాలను పెంచామని మంత్రి తెలిపారు. ప్రతి కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారిని, మున్సిపాలిటీలకు గ్రూప్-1 అధికారిని కమిషనర్‌గా నియమించాలని తీర్మానించామని, మున్సిపాలిటీల్లో బ్యూటిఫికేషన్, గ్రీనరీ, ల్యాండ్ స్కే పింగ్ కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయించామని వెల్లడించారు. కేబినెట్ ఇతర ముఖ్యమైన నిర్ణయాలు.. ప్రస్తుతం రాష్ట్రంలో 256 ఇసుక రీచ్‌లు ఉండగా వాటిని ఈ నెలాఖరులోగా 300కు పెంచాలని తీర్మానించారు. మంగంపేట బెరైటీస్ గనుల్లో ఉన్న ఐదు కోట్ల మెట్రిక్ టన్నుల ఖనిజం అమ్మకాలకు ఈ-వేలం ద్వా రా గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కృష్ణపట్నంలో పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తికి చర్యలు. విద్యుత్తు కొరత నివారణకు, 24 గంటలూ ఇచ్చేందుకు నిర్ణయం. భూ కేటాయింపులివే.. నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో 423.46 ఎకరాల భూముల్ని పవన విద్యుత్తు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, రైల్వే బ్రాడ్ గేజ్ లైన్‌కు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. కడప జిల్లాలో ఓబులవారిపల్లె నుంచి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు వరకు న్యూ బ్రాడ్ గేజ్ లైన్‌కు మార్కెట్ విలువ ఎకరా రూ. 6 లక్షల వంతున 11.14 ఎకరాలను లీజు కు సౌత్ సెంట్రల్ రైల్వేకు కేటాయించారు. మరో 26.47 ఎకరాల్ని సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ప్రాజెక్టు మేనేజరు పేరిట ఎకరా రూ. 3 లక్షల వంతున ఇచ్చారు. బ్రాడ్ గేజ్ లైన్‌కు వెంకటాచలం మండలం కసుమూరులో ఎకరా రూ. 7.93 లక్షల చొప్పున 95.82 ఎకరాలు కేటాయించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఏర్పాటుకు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులో 5.28 ఎకరాలు కేటాయించారు. పొదలకూరు మండలం మారుపూర్లో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ఎకరా రూ. 6 లక్షల వంతున 72.13 ఎకరాలిచ్చారు. అనంతపురం జిల్లాలోని సీకే పల్లి, తాడిపత్రి మండలాల్లో 45.60 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తికి 25 సంవత్సరాల లీజు విధానంలో నెడ్‌క్యాప్, ప్రైవేటు కంపెనీకి 290 ఎకరాలు కేటాయించారు. -
రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి: పల్లె
హైదరాబాద్: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంటర్నేషనల్ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం..రాష్ట్రంలోని 15 వేల మంది టెన్త్, ఐటీ, పాలిటెక్నిక్ విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ మెంట్ కు శిక్షణనిస్తారని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ మెంట్లో ఉచిత శిక్షణనిస్తామని ఆయన అన్నారు. రాబోయే కాలంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని భావిస్తున్నామని పల్లె తెలిపారు. -
4 రోజుల్లో సిమెంట్ ధరలు తగ్గించాలి: పల్లె
సాక్షి, హైదరాబాద్: సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు వెంటనే ధరలను తగ్గించాలని ఏపీ సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. నాలుగు రోజుల్లో సిమెంట్ ధరలను తగ్గించాలని, లేకుంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హెచ్చరించారు. ధరలు తగ్గించకుంటే సిమెంటు కంపెనీలకు ప్రభుత్వం కల్పించే రాయితీలను కట్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. మంత్రి పల్లె శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో 11 సిమెంటు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాస్త్రీయత లేకుండా పెంచిన ధరల్ని తగ్గించకుంటే కఠిన చర్యలుంటాయని స్పష్టంచేశారు. -
సిమెంట్ కంపెనీలకు మంత్రి హెచ్చరిక
-
'సిమెంట్ ధరలు తగ్గించకుంటే రాయితీలు వెనక్కే'
హైదరాబాద్: పెంచిన సిమెంట్ ధరలు వెంటనే తగ్గించండి ... లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వెనక్కి తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సిమెంట్ కంపెనీ పారిశ్రామికవేత్తలను హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సిమెంట్ కంపెనీ పారిశ్రామికవేత్తలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్బంగా పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ... పాత రేట్ల ప్రకారమే సిమెంట్ బస్తాలను విక్రయించాలన్నారు. ముడి సరకులు ధరలు తగ్గుతున్నప్పటికీ సిమెంట్ బస్తాల రేట్లు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 4, 5 రోజుల్లో పెంచిన ధరలు తగ్గించాలి.. లేకుంటే చర్యలు తప్పవని పారిశ్రామికవేత్తలకు పల్లె రఘునాథ్‌రెడ్డి సూచించారు. -
మూడు పాస్‌పోర్టు కేంద్రాలు అవసరం: పల్లె
సాక్షి, హైదరాబాద్: విజయవాడ, తిరుపతిలో పాస్‌పోర్టు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.13 జిల్లాలకు కనీసం మూడు పాస్ పోర్టు కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోస్తాంధ్ర ప్రజలకు విజయవాడలో, రాయలసీమ ప్రజలకు తిరుపతి లేదా కర్నూలులో, ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖలో పూర్తిస్థాయి పాస్‌పోర్టు కార్యాలయాలు ఉండాలన్నారు. -
మంత్రి కోసం రైలు ఎదురుచూపు!
ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోసం బెంగళూరు నుంచి విశాఖపట్టణం వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును కర్నూలు జిల్లా నంద్యాలలో సుమారు అరగంట సేపు ఆపేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల ఎన్జీఓ కాలనీలోని సాయి గురురాఘవేంద్ర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి రావాల్సి ఉంది. ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి బయలుదేరారు. కాని తమను ఆహ్వానించకుండా నిర్వహిస్తున్న వేడుకలకు మంత్రి హాజరు కావడం సరికాదని స్థానిక టీడీపీ నేత అధిష్ఠానానికి ఫిర్యాదు చేశాడు. దీంతో తాను ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వెళ్తానని స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారు హుటాహుటిన రైల్వే స్టేషన్ చేరుకుని రైలును అరగంటపాటు ఆపారు. -
'కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుక'
తిరుమల: రాష్ట్రంలో కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుకలు అందజేశామని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. బుధవారం తిరుమలలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రన్న కానుకపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే... లబ్దిదారులను అవమాన పరిచనట్లే అని పల్లె వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆయన తిరుమలలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ దుకాణం ద్వారా ఆరు రకాల సరుకులను 'చంద్రన్న కానుక' పేరిట టీడీపీ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. -
వైఎస్ఆర్ సీపీపై విరుచుకుపడ్డ మంత్రి పల్లె
హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం లేదని మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ తాము రైతులను భయబ్రాంతులకు గురి చేయటం లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాధరెడ్డి ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. భూములు ఇచ్చేవారి వద్ద నుంచే తీసుకుంటామని, ఇవ్వనివారిని వదిలేస్తామని ఆయన అన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రైతులు లేరని, వైఎస్ఆర్ సీపీ కొంతమందిని రెచ్చగొడుతోందని పల్లె రఘునాధరెడ్డి ఆరోపించారు. కాగా ఏపీ రాజధాని ప్రాంత రైతులు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్ నరసింహన్‌ను కలిసిన విషయం తెలిసిందే. -
విజయవాడలో లలితకళా అకాడమీ ఏర్పాటు
విజయవాడ: విజయవాడలో లలితకళా అకాడమీ ఏర్పాటు చేస్తామని ఏపీ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామీ దేవాలయంలో శ్రీకనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట విలేకర్లతో పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు. అలాగే వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. -
వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఏపీదే అగ్రస్థానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్న సమయంలో ఐటీ ఎగుమతులు రూ. 65 వేల కోట్లు ఉందని... రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1700 కోట్లు ఉందని తెలిపారు. విశాఖలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమవుతుందని పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. -
వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఏపీదే అగ్రస్థానం
-
లిక్కర్ స్కాంలో బొత్స సహా చాలామంది
గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో సిండికేట్ల అక్రమార్జన లెక్కలు తేల్చాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ స్కాంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సహా చాలామంది ఉన్నారని, వారందరినీ బయట పెడతామని అన్నారు. దీనిపై అవసరమైతే పునర్విచారణ చేయించాలని కేబినెట్‌కు సిఫార్సు చేస్తామని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా గత పదేళ్లలో భారీ ఎత్తున జరిగిందని, ఇప్పటికి మొత్తం 12 వేల టన్నులను సీజ్ చేశారని పల్లె చెప్పారు. ఈ స్మగ్లింగ్ కేసులను వేగంగా విచారణ చేయిస్తామని, అందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాన్ పిక్, లేపాక్షి భూములను వెనక్కి తీసుకోవాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. న్యాయసలహాలు తీసుకున్నాక వాటిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. -
'రైతులకు నేరుగా పంటల బీమా చెల్లింపు'
అనంతపురం:రైతుల పంటల బీమాను బ్యాంకు ఖాతాల్లోకి కాకుండా నేరుగా రైతులకే చెల్లిస్తామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన రఘునాథ రెడ్డి.. అనంతరపురం జిల్లాలో 4.22 లక్షల మంది రైతులకు రూ.227 కోట్ల పంట బీమా అందజేయనున్నట్లు తెలిపారు. -
సచివాలయంలో మంత్రి ‘పల్లె’కు గాయం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని తన కార్యాలయంలోని టేబుల్ తగలడంతో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలికి గాయమైంది. కాలు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడున్న సిబ్బంది మంత్రిని హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. సచివాలయం నుంచిబయటకు వస్తుండగా మంత్రి కుడికాలుకు టేబుల్ తగిలింది. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు అత్యవసర చికిత్సలు అందించారు.ఆయనను సహచర మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు ఫోన్లో పరామర్శించారు. -
మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి గాయాలు
-
అధికారులపై మంత్రి అసహనం
సమన్వయంతో పనిచేయాలని ఆదేశం సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం సర్వజనాస్పత్రిలో సమీక్షా సమావేశం అనంతపురం మెడికల్: నగరంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారులపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ దివాకర్‌రెడ్డి, కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూపరింటెండెంట్, హెచ్ఓడీలు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వైద్యులు..మేధావులు, విద్యావంతులైన మీ మధ్య సమన్వయ లోపమెందుకని ప్రశ్నించారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ఎంపీ మాట్లాడుతూ పరిశుభ్రత లేనికారణంగానే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారన్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? అని ఆర్ఎంఓతో ఆరా తీశారు. సానిటేషన్ పనులు సక్రమంగా చేయాలని కాంట్రాక్టర్‌ను ఎంపీ ఆదేశించారు. చేతకాకపోతే మానుకోవాలన్నారు. వైద్యుల కొరత ఉందని, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఒక్కరూ లేరని మంత్రి అడిగిన ప్రశ్నకు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సమాధానంగా చెప్పారు. ఎంపీ జేసీ కలుగజేసుకుని సూపర్ స్పెషాలిటీ వైద్యులను ఏర్పాటు చేసే బాధ్యత మంత్రి తీసుకోవాలని కోరారు. అందుకు ఈ నెల 15న జరిగే కేబినెట్లో మాట్లాడుతామన్నారు. సమావేశంలో మేయర్ స్వరూప, హెచ్ఓడీలు సంపత్ కుమార్, మల్లేశ్వరి, యండ్లూరీ ప్రభాకర్, రామస్వా మి నాయక్, జేసీ రెడ్డి, నవీన్, పెంచలయ్య, సంధ్య, రాధారాణి తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం ‘హెచ్‌డీఎస్ సమావేశం జరిగినప్పటి నుంచి మూడుసార్లు నాతో సమావేశమయ్యారు.. కానీ ఎందుకు పనులు పూర్తి కాలేదు.. కనీసం ఈ సమస్య ఉందని ఎందుకు తెలుపలేదు..’ అని సూపరింటెండెంట్‌పై కలెక్టర్ మండిపడ్డారు. వాషింగ్ మిషన్, సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వాడాలని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. కొటేషన్ వేస్తున్నామని సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. ప్రతిరోజూ సిబ్బందితో మాట్లాడి పర్యవేక్షించాలని సూచిం చారు. సమావేశం అనంతరం కలెక్టర్ సీరియస్‌గా వెళ్లిపోయారు. -
డిజిటల్ ఏపీ దిశగా చర్యలు: మంత్రి పల్లె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఈ- గవర్నెన్స్ అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. తొలి విడతగా పది ప్రభుత్వ శాఖల్లో కాగిత రహిత పాలన కొనసాగుతుందని, మొత్తం ఆన్లైన్ ద్వారానే కార్యకలాపాలు సాగుతాయని చెప్పారు. రుణ మాఫీకి చంద్రబా బు కట్టుబడి ఉన్నారని, తొలి విడత రుణ మాఫీపై ప్రకటన చేసినా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో ధర్నాకు దిగడం సరికాదన్నారు. -
డ్వాక్రా మహిళలు, వీఆర్వోలకు ఐపాడ్లు
యూనివర్సిటీ : త్వరలో డ్వాక్రా మహిళలు, వీఆర్వోలకు ఐపాడ్లు అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మంగళవారం జేఎన్టీయూఏలో ఎస్కేయూ, జేఎన్టీయూ ప్రొఫెసర్లతో స్కిల్ డెవలప్మెంట్ అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల వల్ల రూ.65 వేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు రూ.1500 కోట్లకు పడిపోయిందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ నుంచి రూ.30 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం నుంచి రూ.12 వేల కోట్ల రాబడి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎస్కేయూ, జేఎన్టీయూల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేంద్రాల్లో ప్రతి విద్యార్థికి రూ.20 వేలు చొప్పున ఖర్చు చేసి వారికి పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తామన్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావివ్వొద్దని సూచించారు. నైతిక విలువలతో కూడిన కరికులంను రూపొందించాలన్నారు. అనంతరం వర్సిటీల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించాలని, అకడమిక్ స్టాఫ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, బోధన పోస్టులు భర్తీ చేయాలని ప్రొఫెసర్లు మంత్రిని కోరారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ ఆచార్య కే.లాల్‌కిశోర్, ఫిక్కీ కో-చెర్మైన్ జేఎచౌదరి, కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, రిజిస్ట్రార్లు ఆచార్య కే.దశరథరామయ్య, ఆచార్య కృష్ణయ్య, ఐటీ శాఖ డెరైక్టర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశంలో మంత్రిని విద్యార్థి సంఘాల నాయకులు సమస్యలపై నిలదీశారు. ఎస్కేయూలో 150 బోధన పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలు ఎలా పెంపొదిస్తారని ప్రశ్నించారు. న్యాయ పరమైన చిక్కులను ఎదుర్కోవడానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ మేరకు వారు ఆందోళన విరమించారు. -
అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ
అనంతపురం స్పోర్ట్స్ : అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ సాధ్యమవుతుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద మంత్రి ర్యాలీని ప్రారంభించారు. రఘువీరా కాంప్లెక్స్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగిన ర్యాలీలో ‘ఎయిడ్స్ నియంత్రణ సామాజిక బాధ్యత’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంతో మంది యువత ఎయిడ్స్ మహమ్మారికి బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యంతో దాన్ని నివారించవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎయిడ్స్‌ను పారదోలేందుకు పది నిమిషాలు చర్చించేలా చర్యలు తీసుకుంటామని, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామన్నారు. ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారిని సామాజిక స్పృహతో ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. వారి పట్ల వివక్ష చూపకుండా అందరిలాగే చూడాలన్నారు. తెలిసో తెలియకో ఎయిడ్స్ బారిన పడిన వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేయొద్దని సూచిం చారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ.. ఎయిడ్స్‌ను తరిమికొట్టే దిశగా ఆరోగ్యశాఖ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్ఓ ప్రభుదాస్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. హెచ్ఐవీ బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మదమంచి స్వరూప, అనంత నెట్ వర్క్ ఆఫ్ పాజిటివ్స్ అధ్యక్షుడు వీరాంజనేయులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. -
గతంలో పరిశ్రమలకు చేసిన భూ కేటాయింపులన్నీ రద్దు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 2008వ సంవత్సరం నుంచి పలు పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం చేసిన భూముల కేటాయింపులన్నీ రద్దు చేయాలంటూ.. అవినీతి నిరోధంపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఉపసంఘం బుధవా రం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను రఘునాథరెడ్డి వెల్లడించారు. వాన్‌పిక్ ప్రాజెక్టుకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కేటాయించిన 18,878 ఎకరాలు కేటాయించేందుకు ఒప్పందం జరిగిందని.. అందులో 6,608 ఎకరాలు అప్పగించారని ఆ ఎంఓయూ, కేటాయింపులన్నీ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. అప్పగించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,840 ఎకరాలు కేటాయించారని, ఇందులోపెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి తెలిపారు. సర్వీసు చార్జీ 15 శాతం వసూలు చేయాల్సి ఉండగా, 2 శాతం మాత్రమే వసూలు చేశారని, ప్రభుత్వానికి రావాల్సిన రూ. 15.19 కోట్ల సొమ్ము ఎగ్గొట్టారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలంలో కినెటా పవర్ ప్రైవేటు లిమిటెడ్‌కు వపర్ ప్రాజెక్టుకు కేటాయించిన 814.77 స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి రవీంద్రబాబు, విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఉమాపతి, నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, రైల్వే ట్రాఫిక్ బోర్డు సభ్యుడు దేవీ ప్రసాద్పాండీ, రైల్వే జీఎం ఎస్కే అగర్వాల్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
పెట్టుబడులకు లండన్ కంపెనీలు సిద్ధం: మంత్రి పల్లె
సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి లండన్‌కు చెందిన 16 కంపెనీలు ముందుకొచ్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వ ఆహ్వానంపై అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ఈ నెల 3వ తేదీ నుంచి సోమవారం వరకు యూకేలోని లండన్, వెస్ట్ మినిస్టర్, మాంచెస్టర్లలో తాను నిర్వహించిన పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు. -
బ్రిటన్ పర్యటనకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఉదయం బ్రిటన్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అక్కడి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళుతున్న ఆయన 10వ తేదీ వరకు అక్కడ పర్యటిస్తారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డిని బ్రిటన్ పార్లమెంట్లో ప్రధాని డేవిడ్ కామెరాన్ సన్మానించనున్నారు. పర్యటన నేపథ్యంలో అక్కడ స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా తెలుగు పారిశ్రామికవేత్తలు, నిపుణులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంతో పాటు అనంతపురం జిల్లాలో ఐటీ పరిశ్రమలను రప్పించేందుకు పల్లె రఘునాథరెడ్డి కృషి చేయనున్నారు. -
'80 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం'
హుదూద్ తుపాను సమయంలో అధికారులు, మంత్రులు అంతా కలిసి పని చేయడం ఓ రికార్డుగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ఇలా జరగలేదని అన్నారు. దీనంతటికి సీఎం చంద్రబాబు స్పూర్తితోనే సాధ్యమైందని తెలిపారు. అధికారులు, మంత్రులు అంతాకలసి చాలా తక్కువ సమయంలో తుపాను ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు ద్వారా మాములు స్థితికి తీసుకువచ్చామని పల్లె వివరించారు. ఉత్తరాంధ్రలో దాదాపు 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని.... మిగిలిన విద్యుత్ సరఫరా కూడా సాధ్యమైనంత త్వరగా చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే వ్యవసాయ కనెక్షన్లను కూడా సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరిస్తామని చెప్పారు. తుపాను నష్టం వల్ల ఐటీ కంపెనీలకు రాయితీలు ఇస్తామని పల్లె ప్రకటించారు. -
డ్వాక్రా మహిళలకు ఐపాడ్లు: మంత్రి పల్లె
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి డ్వాక్రా మహిళకూ త్వరలో ఓ ఐపాడ్‌ను అందించి ప్రతి ఇంటినీ ఒక పారిశ్రామిక గృహంగా మార్చనున్నామని రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ రంగంలో 5, ఎలక్ట్రానిక్స్ రంగంలో 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. విజయవాడలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పాత్రికేయులకు నగదు రహిత ఎన్టీఆర్ ఆరోగ్య కార్డులను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి విలేకరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
జిల్లాలో ఐటీ పార్కు
సాక్షి, ఏలూరు : ప్రతి జిల్లాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యో చిస్తోందని రాష్ర్ట సమాచార, పౌరసంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. కలెక్టరేట్లో జిల్లా ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు. ప్రతి శాఖకు వీడియో కాన్ఫెరెన్స్ సదుపాయం కల్పిస్తున్నామని, ఉద్యోగులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. మీ సేవ ద్వారా ప్రస్తుతం 273 సేవలు అందిస్తున్నామన్నారు. సమాచార శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని తెలిపారు. మైనార్జీ సంక్షేమ శాఖ పనితీరుపై అసంతృప్తి జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు ఆయా వర్గాలకు చేరవేయడంలో ఆ శాఖ అధికారులు అంకిత భావంతో పనిచేయకపోతే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. జిల్లాలో సుమారు 900 ఎకరాల వక్ఫ్ భూములుండగా 665 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు గుర్తించామన్నారు. ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసి, తహసీల్దార్లతో విచారణ చేరుుంచి నెలలో నివేదిక అందజేయాలని ఆదేశించారు. విదేశాల్లో పనిచేసే జిల్లా వాసుల వివరాల సేకరణ వివిధ దేశాల్లో పనిచేసేందుకు జిల్లా నుంచి వెళ్లిన కార్మికుల వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు. దళారుల చేతుల్లో మోసపోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. కొవ్వలిలో మసీదులకు సంబంధించిన భూములకు లభించే కౌలును ఇతరులు అనుభవిస్తున్నట్టు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కమిటీ వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ప్రజాప్రతినిధులతో మంత్రి స్థానిక జెడ్పీ అతిథి గృహంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవటం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించకూడదని, ప్రజాప్రతినిధుల సిఫార్సులు పరిగణనలోకి తీసుకోకపోతే ఎలా అని మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మంత్రి పీతల సుజాత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, శాసన మండలి విప్ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయడు, కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెన్షన్ల భారం రూ.3 వేల కోట్లు పింఛను మొత్తాన్ని వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500కు పెంచటం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.3వేల కోట్ల భారం పడనుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. కోటి మంది రైతులకు ఒక్కో రైతుకు రూ.1.50 లక్షల రుణమాఫీని మూడు దశల్లో అమలు చేస్తామన్నారు. డ్వాక్రా గ్రూఫు మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.7,800 కోట్లతో రుణమాఫీతో పాటు ఇసుక రీచ్‌ల నిర్వహణను అప్పగిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ సరఫరాను గాడిన పెట్టామని, వచ్చే ఏడాది నుంచి కోతలు ఉండవని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి మొత్తం పెంచుతాం ప్రస్తుతం రూ.1 కోటి ఉన్న జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.2.50 లక్షల వరకూ ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం ద్వారా వారు వైద్య సేవలు పొందేందుకు హెల్త్ కార్డులు మం జూరు చేస్తామన్నారు. అర్హులైన పా త్రికేయులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పీఆర్వో కార్యాల యం ఏర్పాటు చేయాలని, ఏలూరు డీపీఆర్వో కార్యాలయానికి మినీ బస్, జీప్ సమకూర్చాలని పాత్రికేయులు మంత్రిని కోరారు. -
'కేసీఆర్‌కు చట్టాలు, న్యాయస్థానాలపై నమ్మకం లేదు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్ర ప్రజానీకాన్ని పాకిస్థానీయులు మాదిరిగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆరోపించారు. తామంతా మాత్రం కేసీఆర్‌ను సోదరభావంతోనే చూస్తున్నామని తెలిపారు. ఆదివారం విజయవాడలో పల్లె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రజానీకంపై కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ సీఎంగా గద్దెనెక్కిన కేసీఆర్‌కు చట్టాలంటే గౌరవం లేదు... న్యాయస్థానాలపై నమ్మకం లేదని విమర్శించారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన విగ్రహాలపై చేయేస్తే జనం హర్షించరని పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని వందశాతం విజయవాడ - గుంటూరుల మధ్య ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాల మధ్య ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరిస్తామన్నారు. -
'రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని ప్రార్థించా'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. దసరా పండగను రాష్ట్ర పండగగా నిర్వహిస్తామని చెప్పారు. శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గమల్లేశ్వరస్వామివారిని పల్లె రఘునాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు పల్లె రఘునాథ్‌రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శరన్న నవరాత్రులు సందర్బంగా ఇంద్రకీలాద్రిపై భక్త జనం పోటెత్తింది. -
చెప్పేదొకటి..చేసేదొకటి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడమంటే ఇదే..! తిరుపతిని ఐటీ హబ్‌గా మార్చుతామని ఓసారి.. ఐటీఐఆర్ ఏర్పాటుచేస్తామంటూ మరోసారి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇదే మాటలను ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా వల్లె వేశారు. కానీ.. ప్రభుత్వం ప్రకటించిన ఐటీ విధానం(ఐటీ పాలసీ)లో మాత్రం ఆ ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికార పీఠమెక్కాక నీరుగార్చిన చంద్రబాబు.. వాటిని ఏమార్చేందుకు సరి కొత్త వరాలు ఇస్తున్నారు. ఆ వరాలను సైతం కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఈనెల 9న ప్రకటించిన ఐటీ విధానమే అందుకు తార్కాణం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జూలై 24న హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడగానే ఆశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తిరుపతికి చేరుకున్నారు. ఎస్టీపీఐ(సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా)లో ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఐటీఐఆర్‌ను వేగంగా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తిరుపతిని ఐటీ హబ్‌గా మార్చుతామని.. వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఆగస్టు 20న శాసనసభలో ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్లో తిరుపతిలో ఐటీఐఆర్ ఏర్పాటుకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటుపై ఈనెల 4న శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై ప్రజ ల్లో అసంతృప్తి వ్యక్తం కాకుండా ఉండేందుకు వరాల వర్షం కురిపించారు. ఆ క్రమంలోనే తిరుపతిని ఐటీ హబ్‌గా మార్చుతామని ప్రకటించారు. జూలై 24న చేసిన ప్రకటనకూ.. ఆగస్టు 20న బడ్జెట్ కేటాయింపులకూ.. ఈనెల 4న శాసనసభలో చంద్రబాబు చేసిన ప్రకటనకూ ఏమాత్రం పొంతన కుదరలేదన్నది స్పష్టమవుతోంది. ఈలోగా ఈనెల 9న ప్రభుత్వం ఐటీ విధానాన్ని ప్రకటించింది. ఆ మేరకు ఐటీశాఖ కార్యదర్శి సంజయ్‌జాజు ఐటీ విధానాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం:16) జారీచేశారు. విశాఖపట్నంలో ఐటీఐఆర్తోపాటూ మెగా ఎలక్ట్రానిక్ ఐటీ హబ్ ఏర్పాటుచేస్తామని ఐటీ విధానంలో ప్రకటించారు. కాకినాడలో మెగా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ హబ్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఐటీ విధానంలో తిరుపతి ప్రస్తావనే కన్పించని నేపథ్యంలో యువ పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు మండిపడుతున్నారు. -
ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు....
విశాఖపట్నం: ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు కాంపెయిన్స్తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్లు సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు మంత్రి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల హామీలను మూడు దశల్లో నెరవేరుస్తామని చెప్పారు. ప్రతి ఇంట్లో అక్షరాశ్యులు, ఇంటికో పారిశ్రామికవేత్త ఉండేలా ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. విప్రోతో 6,400 మందికి, టెక్ మహేంద్రతో 5వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. పవర్ సెక్టార్లో ఏపిని దేశంలోనే ఒక మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పల్లె చెప్పారు. ** -
విద్యుత్తు లోటుకు ‘ఆన్లైన్’ పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం అంతర్జాతీయ ప్రమాణాలతో కరెంటు సరఫరా రాష్ట్రంలో ఐటీ కంపెనీల స్థాపనకు 120 సంస్థల సంసిద్ధత మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2,500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు పార్కులకు భూముల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు లోటును పూడ్చేందుకు ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి సచివాలయంలో మీడియాకు వివరించారు. రాష్ట్రంలో రెండేళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని 9,624 ఫీడర్లను ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థలోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ విధానాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఏపీలోనే ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 132 మిలియన్ యూనిట్లు ఉండగా, సరఫరా 131.4 మిలియన్ యూనిట్లు ఉందన్నారు. ఆన్లైన్ మానిటరింగ్ ద్వారా విద్యుత్తు సరఫరా నష్టాలను తగ్గించి, ఈ స్వల్ప విద్యుత్తు లోటును పూడుస్తామని చెప్పారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎనర్జీ ఆడిట్ చేసినట్లు తెలిపారు. కరెంటు చౌర్యం, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ నష్టాల్ని లెక్కిస్తే రాష్ట్రంలో 14.5 శాతం నష్టాలు నమోదయ్యాయన్నారు. అనంతపురం పట్టణంలో అత్యధికంగా 10.1 శాతం, కర్నూలులో 7.8 శాతం, గుంటూరులో 5 శాతం విద్యుత్తు నష్టాలు ఉన్నాయని తెలిపారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో వైజాగ్, తిరుపతి, హైదరాబాద్, చెన్నైలలో చేపట్టిన నాలుగు రోడ్ షోలకు అనూహ్య స్పందన వచ్చిందని, రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల స్థాపనకు 120 కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ-కేబినెట్ నిర్వహించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. మంత్రివర్గానికి ఐ ప్యాడ్ల ద్వారా అజెండా ఇచ్చి, సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు.. రాష్ట్రంలోని రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్, భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థలైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు), రాడికల్ యూత్ వింగ్, రైతు కూలీ సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్‌పై నిషేధం మరో ఏడాది పొడిగింపు. - సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 2,500 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ పార్కుల ఏర్పాటు. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎం.పి.కుంటలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.7 వేల కోట్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు. దీనికోసం 5,500 ఎకరాల భూమి కేటాయింపు. కర్నూలు జిల్లా పాణ్యంలో 1,000 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ పార్క్ ఏర్పాటుకు ఎన్వీవీఎల్ సంస్థకు 5 వేల ఎకరాలు కేటాయింపు. కడప జిల్లా గాలివీడులో 500 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించే ప్లాంటుకు 3 వేల ఎకరాల కేటాయింపు. మంగళవారం హైదరాబాద్‌కు రానున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సమక్షంలో ఈ పార్కులతో పాటు విశాఖలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వంతో ఎంఒయూ కుదర్చుకునేందుకు నిర్ణయం. సోలార్ పార్కుల స్థాపనకు కేపిటల్ కంట్రిబ్యూషన్ కింద కేంద్రం 50 శాతం, ఏపీ జెన్కో 41 శాతం, నెడ్‌క్యాప్ 9 శాతం నిధులు సమకూరుస్తాయి. - ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం మొదటి దశ అక్టోబర్ 2 నుంచి 175 నియోజకవర్గాలు, 1,230 గ్రామాల్లో ప్రారంభం. అయితే, ఈ పథకానికి బడ్జెట్లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. - అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ఏడు మిషన్లను నెల రోజుల్లోగా ప్రారంభించాలని నిర్ణయం. - పింఛన్ల మంజూరుకు వంద శాతం ఆధార్, బయోమెట్రిక్, ఐరిష్‌తో అనుసంధానించాలని నిర్ణయం. పింఛన్లకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా స్థాయి కమిటీలు ఈ నెల 19 నుంచి 21 వరకు గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయం. రాష్ట్రంలో 20,72,338 మంది వృద్ధులు, 13,21,420 మందికి వితంతువులు, 5,36,998 మంది వికలాంగులు, 74,673 మంది చేనేత కార్మికులు, 10,024 మంది గీత కార్మికులు, ఇతరులు కలిపి మొత్తం 43,12,533 మంది పింఛన్లు పొందుతున్నట్లు గుర్తింపు. పింఛన్ల పెంపుతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గం అంచనా. కేంద్ర ప్రభుత్వం 9 లక్షల పింఛన్లకు మాత్రమే రూ.300 వంతున అందిస్తోందని వెల్లడి. - అక్టోబర్ 2 నుంచి పింఛన్లను పంపిణీ చేసే సభల్లో ఉదయం, సాయంత్రం వేళ ఎమ్మెల్యేలు పాల్గొనాలి. దీంతోపాటు వైద్య, పశువైద్య శిబిరాలు, నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పరిశుభ్రత-ఆరోగ్యం, పేదరికంపై గెలుపు కార్యక్రమాలు నిర్వహించాలి. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్లపై విసృ్తత ప్రచారం చేయాలి. - రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మార్పు. ఇందులో 250 వ్యాధులను చేర్చిన ప్రభుత్వం. ప్రభుత్వోద్యోగులు, జర్నలిస్టులకు రూ.2.50 లక్షల పరిమితితో హెల్త్ కార్డుల పంపిణీ. - అడ్వైజరీ కమ్యూనికేషన్స్‌కు అవసరమైన ఎనిమిది పోస్టుల మంజూరు. - లేజిస్లేచర్ కమిటీలు, స్థాయీ సంఘాలకు మొత్తం 83 మంది సిబ్బందిని తీసుకోవడానికి నిర్ణయం. - వంద రోజుల ప్రణాళికపై మంత్రులు అధికారులతో సమీక్షించి, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం ఆదేశం. -
'విద్యుత్ లోటు భర్తీకి ప్రయత్నిస్తున్నాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన విద్యుత్ లోటు భర్తీకి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఏపీ కేబినెట్ వివరాలను వెల్లడించిన ఆయన కర్నూల్ జిల్లా పాణ్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ మార్కెట్ ద్వారా విద్యుత్ లోటు భర్తీకి యత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీకి 5,500 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడగిస్తున్నట్లు రఘునాథ్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ పై నిషేధాన్ని ఏడాది పొడగిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
చెవిలో పువ్వు!
* ‘అనంత సూపర్ స్పెషాలిటీ’కి చంద్రబాబు రూ.150 కోట్లిచ్చారన్న మంత్రులు సునీత, పల్లె * కేంద్రం రూ.120 కోట్లు, రాష్ట్రం రూ.30 కోట్లు అంటూ అదే వేదికపై మరో మంత్రి కామినేని ప్రకటన * పరస్పర విరుద్ధ ప్రకటనలతో నవ్వులపాలైన అమాత్యులు సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘బొంకరా మల్లన్నా.. అంటే గోల్కొండ మిరపకాయలు తాటి పండంత’ అన్నట్లుగా ఉంది రాష్ట్ర మంత్రుల వ్యవహారం. గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాలోని పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. మంత్రి పర్యటనలో భాగంగా అనంతపురంలో బోధనాస్పత్రి సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి అనంతపురం జిల్లా అభివృద్ధికి తమ నాయకుడు చంద్రబాబు చేస్తున్న కృషిని పోటీ పడి మరీ శ్లాఘించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు మంత్రులూ అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి చంద్రబాబు రూ.150 కోట్లు కేటాయించారని చెప్పారు. వీరి తర్వాత ప్రసంగించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం అనంత సూపర్ స్పెషాలిటీకి మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు సమకూరుస్తుందని, మిగతా రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఒకే వేదికపై మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బీజేపీ నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ పొత్తు ధర్మంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. మిగిలిన ఇద్దరూ టీడీపీ మంత్రులు. కాబట్టే ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... అసలు అనంతపురానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎన్నికలకన్నా ముందే యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ.120 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని 2014 జనవరి 1న కేంద్రం.. రాష్ట్ర సర్కారుకు లేఖ పంపింది. జిల్లా మంత్రులేమో చంద్రబాబు రూ.150 కోట్లు కేటాయించారని.. కామినేని ఏమో తమ కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించిందంటూ వాస్తవాన్ని కప్పిపుచ్చి ప్రజల చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేశారు. -
9గంటల ఉచిత విద్యుత్ ఎప్పటినుంచి?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ కోతలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానం ఇస్తూ వ్యవసాయానికి దశలవారీగా తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, అక్టోబర్ 2వ తేదీ నుంచి గృహాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. -
9గంటల ఉచిత విద్యుత్ ఎప్పటినుంచి?