పుట్టపర్తి ఎమ్మెల్యే.. ఓటు కదిరిలో! | Palle Raghunatha Reddy Vote in Kadiri | Sakshi
Sakshi News home page

పుట్టపర్తి ఎమ్మెల్యే.. ఓటు కదిరిలో!

Published Thu, Mar 21 2019 9:31 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Palle Raghunatha Reddy Vote in Kadiri - Sakshi

పుట్టపర్తి అర్బన్‌:   తన ఓటును కూడా వేసుకోలేని అభ్యర్థి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి. ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పని చేసినా ఈయన ఏనాడు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరనే వదంతి ఉంది. పుట్టపర్తిలో అద్దె గదుల్లో ఉంటూ రాజకీయాలు చేయడమే తప్ప.. ఇక్కడి ప్రజలను, అభివృధ్దిని ఏ మాత్రం పట్టించుకోలేదని స్థానికులు వాపోతుంటారు. కనీసం నియోజకవర్గంలో ఓటు కూడా లేకపోవడం చూస్తే నియోజకవర్గ ప్రజలపై ఆయనకున్న అభిమానం ఏపాటిదో అర్థమవుతోంది. కదిరి నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నెం.230లో ఓటరు జాబితా సీరియల్‌ నెం.282లో పల్లె రఘునాథరెడ్డికి ఓటు ఉంది. ఈ విషయం తెలిసి స్థానికులు ఆయనపై జోకులు వేసుకుంటున్నారు. ఆయన ఇటీవల టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించినా..అదీ కూడా అద్దె గదిలోనే కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement